
సాక్షి, విశాఖపట్నం: బాబ్రీ మసీదు కేసును సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేయడంపై విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్పందించారు. బాబ్రీ కేసును కొట్టేయడం సంతోషదాయకమన్నారు. ఈ తీర్పుతో సనాతన ధర్మం రక్షించబడిందని హర్షం వ్యక్తం చేశారు. 28 ఏళ్ళ నిరీక్షణకు తెరపడటం ఆనందాన్నిచ్చిందన్నారు. ఈ తీర్పుతో బాబ్రీ మసీదు వివాదానికి పూర్తిగా తెరపడిందని అభిప్రాయపడ్డారు. కేసులో ఉన్నవారిని నిర్దోషులుగా ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వానికి విశాఖ శారదా పీఠం తరపున అభినందనలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment