Babri Masjid demolition case
-
బాబ్రీ విధ్వంసం వెనక పాక్ హస్తం!
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్యలోని బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో 28 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ప్రత్యేక సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పుకు అన్ని జాతీయ పత్రికలు, ప్రాంతీయ పత్రికలు తగిన ప్రాధాన్యతనిచ్చాయి. పాలకపక్ష బీజేపీ నేతలు ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, కళ్యాణ్ సింగ్, ఉమా భారతి సహా మొత్తం 32 మంది నిందితులు నిర్దోషులని, వారు బాబ్రీ విధ్వంసానికి ముందస్తు కుట్ర పన్నారనడానికి ఎలాంటి ఆధారాలు లేవంటూ ఇచ్చిన తీర్పుకు ఈ పత్రికలు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాయి. (బాబ్రీ తీర్పు.. బీజేపీకి నయా అస్త్రం) బాబ్రీ మసీదు విధ్వంసం వెనక పాకిస్థాన్ హస్తం ఉండవచ్చంటూ ప్రత్యేక సీబీఐ జడ్జీ ఎస్కే యాదవ్ చేసిన వ్యాఖ్యకు కొన్ని పత్రికలు తక్కువ ప్రాధాన్యతనివ్వగా మిగతా పత్రికలు అసలు పట్టించుకోలేదు. విధ్వంసం జరిగిన రోజున బాబ్రీ మసీదు వద్ద టెర్రరిస్టులు కూడా ఉండి ఉండవచ్చంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. బీజేపీ సీనియర్ నేతలు బాబ్రీ మసీదు విధ్వంసానికి కుట్ర పన్నారనడానికి ఫొటోలు, వీడియోల సాక్ష్యంగానీ, ఫోరెన్సిక్ నిపుణుల విశ్లేషణలుగానీ లేవంటూ కూడా జడ్జీ నొక్కి చెప్పడాన్ని కూడా పత్రికలు పట్టించుకోలేదు. (‘బాబ్రీ’ తీర్పు: అందరూ నిర్దోషులే) 1992, డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ మసీదు విధ్వంసానికి పాల్పడిన వారు మాత్రం ‘కచ్చితంగా సంఘ విద్రోహ శక్తులే’ అంటూ కూడా జడ్జీ యాదవ్ వ్యాఖ్యానించారు. మసీదును కూల్చడం అక్రమమని, అది చట్టాన్ని ఉల్లంఘించటమేనంటూ అయోధ్య స్థల వివాదం కేసులో సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు. పాలకపక్ష బీజేపీ తన పార్టీ వైఖరికి సానుకూలంగా తీర్పులిస్తోన్న వారిని రాజకీయ పదవులతో సముచితంగా సత్కరిస్తున్నాయంటూ ఒకటి, రెండు జాతీయ ఆంగ్ల పత్రికలు వ్యంగ్యోక్తులు విసిరాయి. (మసీదు దానికదే కూలిపోయిందా?) ‘బాబ్రీ విధ్వంసం కేసులో ఎవరూ దోషులు కాదు’ అనే శీర్షికతో వార్తను ప్రచురించిన ఆనందబజార్ పత్రిక, ఇంకా నయం ‘బాబ్రీని ఎవరు కూల్చలేదు’ అంటూ కోర్టు తీర్పు ఇవ్వలేదంటూ కొంతమంది సంబర పడుతున్నారని వ్యాఖ్యానించింది. ‘ఏక్ దక్కా ఔర్ దో, బాబ్రీ మసీద్ తోడ్ దో’ అంటూ బీజేపీ లేదా విశ్వహిందూ పరిషద్ నాయకులు ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, అశోక్ సింఘాల్’ నినాదాలు ఇవ్వడం ఎవరూ వినలేదంటూ ఆ పత్రిక వ్యంగోక్తి విసిరింది. ‘బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు బాబ్రీ మసీదును విధ్వంసం చేయకుండా ప్రజలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు’ అంటూ సీబీఐ జడ్జీ యాదవ్ చేసిన వ్యాఖ్యకు తమిళ పత్రిక ‘దినమలార్’ ప్రాధాన్యతనిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీం కోర్టుకు వెళుతుందా? అంటూ కూడా ఆ పత్రిక సందేహం వ్యక్తం చేసింది. ‘1992, డిసెంబర్ 6వ తేదీన ఏం జరిగిందో, 2020, సెప్టెంబర్ 30వ తేదీన ఏం తీర్పు వెలువడిందో మనందరికి తెలుసు. బాబ్రీ విధ్వంసం తర్వాత చెలరేగిన అల్లర్లలో చిమ్మిన రక్తం ఎంతో మనలో కళ్లతో చూసిన వారు ఉన్నారు. ఇదంగా ఎవరు చేశారో మనకు తెలుసు. ఎందుకు చేశారో మనకు తెలుసు. దాని వల్ల జాతికెంత నష్టమో మనకు తెలుసా? వారికి న్యాయబద్ధత కల్పిస్తున్నాం. ఎన్నికల అనంతరం ఎన్నికల్లో గెలిపిస్తూ వస్తున్నాం. ఇప్పుడు నిరాశతో ఓండ్ర పెడితే లాభం ఏమిటీ?! ది టెలీగ్రాఫ్ పత్రిక వ్యాఖ్యానించింది. -
జడ్జి యాదవ్ చివరి తీర్పు
అయోధ్య: మూడు దశాబ్దాలుగా తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్న బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తీర్పు వెల్లడించిన సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి సురేంద్ర కుమార్ యాదవ్‌కి ఇదే ఆఖరి తీర్పు. ఆయన తన కెరీర్లో మొట్టమొదటి సారిగా ఫైజాబాద్ జిల్లా (ఇప్పుడు అయోధ్య జిల్లాగా పేరు మార్చారు) అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అదే అయోధ్యకు సంబంధించిన అత్యంత కీలకమైన తీర్పునిచ్చి ఇప్పుడు పదవీ విరమణ చేస్తున్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఏర్పాటైన లక్నోలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ప్రిసైడింగ్ అధికారిగా ఎస్కే యాదవ్ అయిదేళ్ల క్రితం 2015, ఆగస్టు 5న నియమితులయ్యారు. అప్పట్నుంచి ఆయన ఆధ్వర్యంలోనే కేసు విచారణ నడుస్తోంది. ఏళ్లకి ఏళ్లు విచారణ గడుస్తూ ఉండడంతో ప్రతీ రోజూ విచారణ జరిపి, రెండేళ్లలో తీర్పు చెప్పాలంటూ 2017 ఏప్రిల్ 19న సుప్రీం కోర్టు ప్రత్యేక కోర్టుని ఆదేశించింది. అప్పట్నుంచి ఎస్కే యాదవ్ ప్రతీ రోజూ కేసుని విచారించారు. ఏడాది కిందటే పదవీ విరమణ కానీ.. ఉత్తరప్రదేశ్‌లోని జాన్పూర్ జిల్లా పఖాన్పూర్ గ్రామానికి చెందిన సురేంద్ర కుమార్ 31 ఏళ్ల వయసులో జ్యుడీషియల్ సర్వీసెస్‌లోకి వచ్చారు. ఫైజాబాద్ మున్సిఫ్ కోర్టులోకి అడుగు పెట్టి జిల్లా జడ్జి వరకు ఎదిగి సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జిగా నియమితులయ్యారు. గత ఏడాదే న్యాయమూర్తిగా ఆయన పదవీ విరమణ చేశారు. లక్నో బార్ కౌన్సిల్ ఆయనకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం కూడా చేసింది. అయితే అయిదేళ్లుగా కేసు విచారిస్తూ ఉండడంతో సుప్రీం కోర్టు ప్రత్యేక న్యాయమూర్తిగా ఆయన పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగించింది. రాజ్యాంగంలో ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. సంపూర్ణ న్యాయం జరుగుతుందని భావిస్తే సుప్రీం కోర్టుకి న్యాయమూర్తుల పదవీ కాలాన్ని పొడిగించే హక్కు ఉంది. అలా కూల్చివేత ఘటనలో తీర్పు చెప్పిన న్యాయమూర్తిగా యాదవ్ రికార్డు సృష్టించారు. -
తొలగిన మచ్చ.. దక్కిన ఊరట
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పుతో బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలకు భారీ ఊరట లభించిందనే చెప్పాలి. ఎల్కే అడ్వాణీ: బాబ్రీ మసీదు స్థలంలోనే రామాలయాన్ని నిర్మించాలనే డిమాండ్‌తో అడ్వాణీ దేశవ్యాప్తంగా 1990లో రథయాత్ర నిర్వహించారు. ఈ యాత్రతో దేశంలో బీజేపీ బలం ఎన్నో రెట్లు పెరిగిందని, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. అడ్వాణీ పై బాబ్రీ మసీదు కూల్చివేత అంశం ఇన్నాళ్లూ ఒక మచ్చగా ఉండేది. సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పుతో ఆ మచ్చ తొలగిపోయినట్లే. మురళీ మనోహర్ జోషీ: బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జోషీ వ్యవహరించారు. రామజన్మభూమి ఉద్యమంలో ఆయనది కీలక పాత్ర. వాజ్‌పేయి, అడ్వాణీ సమకాలీనుడైన జోషీ ప్రస్తుతం క్రియాశీల రాజకీయాల్లో లేరు. 86 ఏళ్ల జోషీ ఉత్తరప్రదేశ్ నుంచి పలుమార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రిగా సేవలందించారు. ఆర్ఎస్ఎస్కు అత్యంత సన్నిహితుడు. కల్యాణ్ సింగ్: ఉత్తరప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా కల్యాణ్‌సింగ్ ఉన్నప్పుడే అయోధ్యలో బాబ్రీ మసీదు నేలమట్టమైంది. వెంటనే ఆయన ప్రభుత్వాన్ని కేంద్రం రద్దు చేసింది. మసీదు కూల్చివేతకు కల్యాణ్ సింగ్ సంపూర్ణంగా సహకరించారని అభియోగాలు ఉన్నప్పటికీ కేసు నుంచి బయటపడ్డారు. 88 ఏళ్ల కల్యాణ్‌సింగ్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఉమా భారతి: బాబ్రీ మసీదు వ్యవహారంలో ప్రముఖంగా వినిపించే మహిళ పేరు ఉమాభారతి. జనాన్ని ఉత్తేజపరిచేలా ప్రసంగించడంలో ఆమె దిట్ట. మసీదు కూల్చివేత అనేది అప్పటికప్పుడు జరిగిన ఘటన అని, దీని వెనుక ఎలాంటి కుట్ర లేదని ఉమా భారతి పలు సందర్భాల్లో చెప్పారు. మసీదు కూల్చివేతపై క్షమాపణ చెప్పడానికి ఏనాడూ ఇష్టపడలేదు. వినయ్ కతియార్: హిందూత్వ ఫైర్‌బ్రాండ్ నాయకుడు వినయ్ కతియార్(66). ఆయన బజరంగ్ దళ్ అధ్యక్షుడిగా, విశ్వ హిందూ పరిషత్ యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేశారు. కల్యాణ్ సింగ్, ఉమా భారతి లాగా బీజేపీలో ఓబీసీ నాయకుడిగా ఎదిగారు. పలుమార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఉత్తర ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగానూ సేవలందించారు. ప్రస్తుతం పార్టీకి దూరంగా ఉంటున్నాను. 1526 నుంచి 2020 దాకా.. 1526: 1526లో బాబర్ సైనికాధికారి మీర్ బాకీ అయోధ్యలో∙మసీదును నిర్మింపజేశాడు. గుడిని కూల్చి కట్టారా? నేలమట్టమైన గుడిపైన మసీదు కట్టారా? అన్నది స్పష్టంగా తెలియదు. అయితే విశాలమైన ప్రాంగణంలో మసీదుతోపాటు ఓ గుడి ఉండటం. ముస్లింలు మసీదు లోపల ప్రార్థనలు చేసుకుంటే.. బయట అదే ఆవరణలోని గుడిలో హిందువుల పూజలు జరిగేవన్నమాట. 1949: డిసెంబరు నెలలో బాబ్రీ మసీదు లోపల రాముడి విగ్రహాలు ప్రత్యక్షమయ్యాయి. ఇది కాస్తా నిరసన ప్రదర్శనలకు దారితీసింది. హషీమ్ అన్సారీ ముస్లింల తరఫున కేసు వేస్తే తరువాతి కాలంలో నిర్మోహీ అఖాడా హిందువుల వైపు నుంచి కేసు వేసింది. 1984: రామ జన్మ భూమి ఉద్యమాన్ని కొనసాగించేందుకు విశ్వహిందూ పరిషత్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ నేత ఎల్కే అడ్వాణీ ఈ బృందానికి నేతృత్వం వహించారు. 1986: ఫైజాబాద్ జిల్లా జడ్జి వివాదాస్పద ప్రాంతపు గేట్లకు వేసిన తాళలను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. హిందువులూ ఆ ప్రాంతంలోకి ప్రవేశించవచ్చునని, పూజలు జరుపుకోవచ్చునని తన తీర్పులో పేర్కొన్నారు. 1990: బాబ్రీ మసీదు కూల్చివేతకు మొదటి సారి విఫలయత్నం జరిగింది ఈ ఏడాది. 1992: డిసెంబర్ ఆరవ తేదీ కర సేవకులు బాబ్రీ మసీదును కూల్చి తాత్కాలిక దేవాలయం ఏర్పాటు చేశారు. 1993: కేసుల సత్వర విచారణకు లలిత్‌పూర్‌లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు. అయితే యూపీ ప్రభుత్వం అలహాబాద్ హైకోర్టుతో సంప్రదించి కేసులన్నింటినీ లక్నోలోని ప్రత్యేక కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్ఐఆర్ 197 విచారణ సీబీఐ చేపట్టగా మరో కేసు విచారణ రాయ్‌బరేలీలోని ప్రత్యేక కోర్టులో సీఐడీ ఆధ్వర్యంలో జరిగింది. 1993 అక్టోబర్‌లో సీబీఐ శివసేన అధ్యక్షుడు బాలా సాహెబ్ ఠాక్రే, బీజేపీ నేత కళ్యాణ్ సింగ్, చంపత్ రాయ్ బన్సల్, ధరమ్ దాస్, నృత్య గోపాల్‌దాస్ తదితరులపై అభియోగాలు నమోదు చేసింది. మసీదు కూల్చివేతకు ఒక్క రోజు ముందు బజరంగ్ దళ్ నేత వినయ్ కతియార్ ఇంట్లో ఒక రహస్య సమావేశం జరిగిందని, అందులోనే మసీదును పడగొట్టేందుకు కుట్ర పన్నారన్నది ఈ అభియోగపత్రంలోని ప్రధాన అంశం. బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన అన్ని కేసులూ లక్నోలోని ప్రత్యేక కోర్టు విచారించేలా ఏర్పాటు జరిగాయి. 1996: సీబీఐ దాఖలు చేసిన అనుబంధ చార్జ్‌షీట్ ఆధారంగా ఎల్కే అడ్వాణీ తదితరులపై నేరపూరిత కుట్ర ఆరోపణలు నమోదు చేసేందుకు ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయని కోర్టు గుర్తించింది. అందుబాటులో ఉన్న సాక్ష్యాలను బట్టి బాబ్రీ మసీదు కూల్చివేతకు ఎల్కే అడ్వాణీ తదితరులు 1990 నుంచి కుట్ర పన్నారని కోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. 2001: ప్రభుత్వ పరంగా జరిగిన లోటుపాట్ల ప్రస్తావిస్తూ ఎల్కే అడ్వాణీ, ఉమాభారతిలు కోర్టు తీర్పును సవాలు చేశారు. లోటుపాట్లను సరిచేస్తామన్న సీబీఐ అభ్యర్థనకు యూపీ ప్రభుత్వం నిరాకరించడంతో నేరపూరిత కుట్ర అరోపణ వీగిపోయింది. రాయ్‌బరేలీ ప్రత్యే కోర్టులో కేసు విచారణ పునఃప్రారంభమైంది. అడ్వాణీ తదితరులు కేసు గెలిచారు. 2003: రాయ్ బరేలీ ప్రత్యేక కోర్టులో సీబీఐ అభియోగపత్రం నమోదు చేయగా.. తగినన్ని ఆధారాలు లేనందున ఎల్కే అడ్వాణీని అభియోగాల నుంచి విముక్తుడిని చేయాలని జడ్జి ఆదేశం. 2005: అలహాబాద్ హైకోర్టు నేరపూరిత కుట్ర ఆరోపణలు లేకుండా మళ్లీ కేసు విచారణ మొదలుపెట్టింది. 2010: అలహాబాద్ హైకోర్టు కింది కోర్టు 2001లో ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ అడ్వాణీ తదితరులపై నేరపూరిత కుట్ర ఆరోపణలు కొట్టివేసింది. రాయ్ బరేలీ ప్రత్యేక కోర్టులో మరోసారి కేసు విచారణ చేపట్టాలని ఆదేశించింది. 2012: అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు సీబీఐ. 2015: బీజేపీ సీనియర్ నేతలకు సుప్రీం నోటీసులు 2017: అలహాబాద్ హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఆదేశాలు. నేరపూరిత కుట్ర ఆరోపణలను పునరుద్దరించాలని స్పష్టీకరణ. అన్ని కేసులను కలిపి లక్నోలో విచారణ చేపట్టాలని ఆదేశాలు. 2019: వివాదాస్పద బాబ్రీ మసీదు ప్రాంతం మొత్తాన్ని రామ మందిర నిర్మాణానికి కేటాయిస్తూ సుప్రీంకోర్టు తీర్పు. మసీదు నిర్మాణానికి అయోధ్యలోనే ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని ఆదేశాలు. 2020: కేసు విచారణకు విధించిన గడువు ఆగస్టు 31తో పూర్తి. తుది గడువును ఒక నెల పొడిగించిన సుప్రీంకోర్టు. సెప్టెంబరు 30వ తేదీన అధారాలు లేని కారణంగా నిందితులందరిపైని ఆరోపణలను కొట్టివేస్తూ లక్నో కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.కే.యాదవ్ తీర్పు. -
కమలనాథుల్లో కొత్త ఉత్సాహం
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేతలు, హిందూత్వవాదులు నిర్దోషులుగా బయటపడడం కాషాయం కూటమిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. వివాదాస్పద కట్టడాన్ని కుట్ర ప్రకారం కూల్చలేదని, అప్పటికప్పుడు జరిగిపోయిన సంఘటన అంటూ పదే పదే చెబుతూ వస్తున్న బీజేపీ నాయకులు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నారు. బిహార్ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల్లో 56 అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బాబ్రీ తీర్పుతో మరో భావోద్వేగ అంశాన్ని ఎన్నికల్లో ప్రచారం చేసుకునే అవకాశం బీజేపీకి వచ్చింది. కమలనాథులు రామ మందిర నిర్మాణాన్ని తమ ఖాతాలో వేసుకుంటూనే మసీదు కూల్చివేతతో అంటిన మట్టిని వదిలించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. గత ఏడాది మందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పు రావడం, ఇప్పుడు మసీదు కూల్చివేతలో బీజేపీ ప్రమేయం లేదని కోర్టు తేల్చి చెప్పడంతో రాజకీయంగా తమకు బాగా లబ్ధి చేకూరుతుందని బీజేపీ వర్గాలు యోచిస్తున్నాయి. కోర్టు తీర్పుని జై శ్రీరామ్ నినాదాలతో స్వాగతించామని అగ్రనేత ఎల్కే అడ్వాణీ వ్యాఖ్యానించారు. అటు రాముడికి గుడి కడుతున్నారన్న పేరు ప్రతిష్టలు రావడంతో పాటు, మసీదు కూల్చివేత అప్రతిష్ట కూడా పార్టీకి అంటకుండా తీర్పు వెలువడడం బీజేపీలో మంచి ఉత్సాహాన్ని నింపింది. మొత్తమ్మీద రామజన్మభూమి ఉద్యమం పార్టీకి అన్ని రకాలుగా కలిసొచ్చిందనే విశ్లేషణలు వినబడుతున్నాయి. తీర్పుపై ఎవరేమన్నారు.. ► సీబీఐ కోర్టు తీర్పు చరిత్రాత్మకం. ‘జై శ్రీరామ్.. అందరికీ మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుడిని వేడుకుంటున్నాను. –మురళీ మనోహర్ జోషి, బీజేపీ ► కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాను. ఆలస్యమైనా చివరికి న్యాయమే గెలిచింది. –రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రి ► 472 ఏళ్లుగా సాగిస్తున్న పోరాటానికి ఎట్టకేలకు తెరపడింది. ఆలయాల రక్షణకు, వాటి ఆస్తుల పరిరక్షణకు పోరాటం కొనసాగిస్తాం. –వినోద్ బన్సల్, విశ్వహిందూ పరిషత్ ప్రతినిధి ► రాజ్యాంగ స్ఫూర్తికి 2019నాటి సుప్రీంకోర్టు తీర్పుకు ఈ తీర్పు విరుద్ధం. –రణ్‌దీప్ సూర్జేవాలా, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ► ప్రభుత్వాలు పక్షపాత ధోరణితో వ్యవహరించరాదు. న్యాయం పూర్తిగా వక్రీకరించబడింది. –సీతారాం ఏచూరి, సీపీఎం ప్రధాన కార్యదర్శి ► సీబీఐ కోర్టు తీర్పు దురదృష్టకరం. దీనిపై ప్రభుత్వం కోర్టులో సవాల్ చేయాలి. –ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ ► ఈ కుట్రలో భాగస్వాములెవరన్నదీ బహిరంగ సత్యం. దీనిపై సీబీఐ అప్పీలుకు వెళ్లాలి. –వలీ రహ్మానీ, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ప్రధాన కార్యదర్శి ► పట్టపగలే జరిగిన మసీదు విధ్వంసాన్ని ప్రపంచమంతా చూసింది. ఎవరి ప్రోద్బలంతో ఈ ఘటన జరిగిందో అందరికీ తెలుసు. –మౌలానా అర్షద్ మదానీ, జమైత్ ఉల్ ఉలేమా ఇ హింద్ అధ్యక్షుడు ► ఆ నిర్మాణాన్ని కూల్చివేశారనడానికి సంబంధించి ఎన్నో సాక్ష్యాలున్నా కోర్టు పట్టించుకోలేదు. దీనిపై ముస్లింలు హైకోర్టుకు వెళ్లవచ్చు. దీనిపై అంగీకారం కుదిరితే బోర్డు కూడా పార్టీగా చేరవచ్చు. బాధితులు, తనవంటి ఎందరో సాకు‡్ష్యలు కూడా అవసరమైతే అప్పీలుకు వెళ్లే హక్కుంది. –జఫర్యాబ్ జిలానీ, ఏఐఎంపీఎల్బీ సభ్యుడు, సీనియర్ లాయర్ ► చారిత్రక మసీదు ధ్వంసానికి బాధ్యులైన వారిని నిర్దోషులుగా పేర్కొనడం సిగ్గు చేటు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. భారత ప్రభుత్వం మైనారిటీలకు, వారి ప్రార్థనా స్థలాలకు రక్షణ కల్పించాలని కోరుతున్నాం. –పాకిస్తాన్ విదేశాంగ శాఖ ► కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేతిలో సీబీఐ పంజరంలో చిలక మాదిరిగా మారిపోయింది. బాబ్రీ కేసులో నిజాయతీగా వ్యవహరించడంలో సీబీఐ విఫలమైంది. –ఎంకే స్టాలిన్, డీఎంకే అధ్యక్షుడు -
న్యాయ చరిత్రలో బ్లాక్ డే: ఒవైసీ
సాక్షి, హైదరాబాద్: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు భారతీయ న్యాయ చరిత్రలో బ్లాక్ డే అని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. బుధవారం హైదరాబాద్ దారుస్సలాంలో ఒవైసీ విలేకరులతో మాట్లాడారు. అందరూ నిర్దోషులైతే మరి మసీదును ఎవరు కూల్చేశారు? దానంతట అదే కూలిపోయిందా? అని ప్రశ్నించారు. భారతీయ న్యాయ చరిత్రలో ఈ రోజు విషాద దినంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ‘కోర్టు తీర్పు తనకెంతో బాధ కలిగించింది. మసీదును ధ్వంసం చేశారనేందుకు ఆధారాలు లేవంటున్నారు. కానీ దాన్ని ఎవరు కూల్చారో ప్రపంచమంతా చూసింది. మసీదును కూల్చండి అని ఉమాభారతి రెచ్చగొట్టడం నిజం కాదా..? బాబ్రీ కూల్చివేతలో కుట్ర లేదని కోర్టు చెబుతోంది.. ఈ ఘటన అప్పటికప్పుడు జరిగిందని తేల్చేందుకు ఎన్ని నెలల సమయం పడుతుంది’అని ఆయన ప్రశ్నించారు. సరైన ఆధారాలు లేవని అందరిపై అభియోగాలు కొట్టివేయడం సరైంది కాదని ఆయన పేర్కొన్నారు. చట్టాలను అతిక్రమించారని, ప్రణాళిక ప్రకారమే ప్రార్థనా మందిరాన్ని ధ్వంసం చేశారని ఇప్పటి ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్లు ఆయన గుర్తుచేశారు. బాబ్రీ మసీదు కూల్చివేత అంశం న్యాయానికి సంబంధించినదని, మసీదు కూల్చివేతకు కారణమైన వాళ్లను దోషులుగా తేల్చాల్సి ఉందని, కానీ వారికి రాజకీయంగా లబ్ధి జరిగినట్లు ఒవైసీ ఆరోపించారు. -
1992 డిసెంబర్ 6న ఏం జరిగింది ?
బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనపై సమగ్ర విచారణ కోసం ఏర్పాటు చేసిన లిబర్హాన్ కమిషన్ తన నివేదికలో ఆ రోజు అయోధ్యలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో వివరించింది. కరసేవకులు మసీదుని కూలగొట్టడానికి వస్తున్నారన్న సమాచారం ముందే అందడంతో వేలల్లో పోలీసుల్ని పట్టణంలో మోహరించారు. అయితే లక్షన్నర మంది వరకు కరసేవకులు ఒకేసారి రోడ్ల మీదకి రావడంతో వారిని అడ్డుకోవడం సాధ్యం కాలేదని నివేదిక వెల్లడించింది. మన్మోహన్ సింగ్ లిబర్హాన్ ఆధ్వర్యంలోని కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఉదయం 12:15కి మొదలైన కూల్చివేత కార్యక్రమం సాయంత్రం 5:30కి ముగిసింది. 1992 డిసెంబర్ 5 నుంచే అయోధ్యలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో యూపీలో నాటి కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం భారీగా పోలీసుల్ని మోహరించింది. 35 కంపెనీల ప్రావిన్షియల్ ఆర్మీడ్ కాన్‌స్టబ్యులరీ (పీఏసీ), 195 కంపెనీల పారామిలటరీ బలగాలు, నాలుగు కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలు, 15 బాష్ప వాయు స్క్వాడ్స్, 15 మంది ఇన్స్పెక్టర్లు, 30 మంది ఎస్ఐలు, 2,300 మంది పోలీసు కానిస్టేబుళ్లు మోహరించారు. ఉదయం 10:30 గంటలకి అడ్వాణీ, జోషి వంటి బీజేపీ అగ్రనాయకులు కరసేవ ప్రారంభం చూడడం కోసం వచ్చారు. ఒక 20 నిమిషాల సేపు అక్కడే గడిపిన వారు రామ్‌కథ కుంజ్‌లో మతాధికారులు ఇచ్చే ప్రసంగాలు వినడానికి వెళ్లారు. పలుగు పారలతో మసీదుపై దాడి మసీదు చుట్టూ ఉన్న భద్రతా వలయాన్ని ఛేదించుకొని ఒక టీనేజీ యువకుడు 12 గంటల సమయంలో మసీదు గుమ్మటంపైకి నెమ్మదిగా ఎక్కాడు. అతని వెంట మరో 150 మంది వరకు పైకి ఎక్కి గునపాలు, ఇనుప రాడ్లు, పలుగులు, పారలతో మసీదుని కూల్చడం మొదలుపెట్టారు. మరో పావు గంట గడిచేసరికి 5 వేల మంది వరకు కరసేవకులు మసీదుపైకి ఎక్కేశారు. చేతికి దొరికిన ఆయుధాలతో కూల్చే పని కొనసాగించారు. అడ్వాణీ, జోషి, అశోక్ సింఘాల్, విజయ్‌రాజె సింథియా వంటి నేతలు వారిని వెనక్కి వచ్చేయమని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కరసేవకులు వినిపించుకోలేదు. భద్రతా బలగాలు, మీడియా ప్రతినిధులపైకి ఇటుకలు విసురుతూ ఉద్రిక్తతలకు తెర తీశారు. పోలీసు బలగాలు అడ్డుకోలేకపోయాయి జిల్లా మెజిస్ట్రేట్ పారామిలటరీ బలగాల్ని మోహరించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. వాళ్లెవరూ కాల్పులకు దిగకూడదన్న షరతు మీద ఆ నాటి యూపీ సీఎం కళ్యాణ్ సింగ్ బలగాలకు అనుమతించారు. కానీ వారు వివాదాస్పద కట్టడం దగ్గరకి వెళ్లడంలో విఫలమయ్యారు. మార్గం మధ్యలోనే వారిని కరసేవకులు అడ్డుకున్నారు. ఇక రాష్ట పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్ట కుండా మిన్నకుండిపోయారు. మసీదులో ఒక భాగం కూలిపోగానే డీజీపీ కాల్పులకు అనుమతి అడిగితే కళ్యాణ్‌సింగ్ నిరాకరిం చారు. మసీదు కూలడం మొదలు కావడంతో ఒక్కసారిగా అయోధ్యలో మత ఘర్షణలు పెచ్చరిల్లాయి. సాయంత్రమ య్యేసరికి మసీదు అంతా నేలమట్టమైంది. కేంద్ర కేబినెట్ యూపీలో రాష్ట్రపతి పాలన విధిస్తున్నట్టుగా ప్రకటించింది. -
‘బాబ్రీ’ తీర్పు: అందరూ నిర్దోషులే
లక్నో: దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ విచారణకు తెరపడింది. దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టించిన అయోధ్యలోని బాబ్రీమసీదు కూల్చివేత కేసులో తీర్పు వెలువడింది. మసీదు కూల్చివేతకు కుట్ర పన్నారని ఆరోపణలు ఎదుర్కొన్న నిందితులంతా నిర్దోషులేనని సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం స్పష్టం చేసింది. వారిలో బీజేపీ అగ్రనేత, నాటి రామ మందిర నిర్మాణ ఉద్యమ రథ సారథి ఎల్కే అడ్వాణీ(92), బీజేపీ సీనియర్ నేతలు మురళీ మనోహర్ జోషి(86), ఉమా భారతి, మసీదు కూల్చివేత సమయంలో యూపీ ముఖ్యమంత్రిగా ఉన్న కళ్యాణ్ సింగ్, వీహెచ్‌పీ నేత వినయ్ కటియార్, సాధ్వి రితంబర, ప్రస్తుతం అయోధ్యలో రామాలయ నిర్మాణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్.. తదితరులు ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 49 మందిపై సీబీఐ అభియోగాలు నమోదు చేయగా.. 28 ఏళ్ల సుదీర్ఘ విచారణ సమయంలో 17 మంది చనిపోయారు. మిగిలిన 32 మందిని నిర్దోషులని సీబీఐ ప్రత్యేక కోర్టు తాజాగా తీర్పు ప్రకటించింది. మసీదు కూల్చివేతకు నిందితులు కుట్ర పన్నినట్లుగా ఎలాంటి స్పష్టమైన, విశ్వసనీయ సాక్ష్యాధారాలు లేవని పేర్కొంది. పైగా, అందులో రామ్‌లల్లా విగ్రహం ఉన్నందున, ఆ నిర్మాణాన్ని కాపాడేందుకు విశ్వహిందూ పరిషత్ నేత దివంగత అశోక్‌సింఘాల్ ప్రయత్నించారని దాదాపు 2,300 పేజీల తీర్పులో సీబీఐ న్యాయమూర్తి ఎస్కే యాదవ్ వెల్లడించారు. నిందితులంతా రూ. 50 వేల వ్యక్తిగత బాండ్‌ను కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. విచారణ సమయంలో కూల్చివేత ఘటన నాటి వార్తాకథనాలను కానీ, వీడియో క్యాసెట్లను న్యాయమూర్తి సాక్ష్యాలుగా పరిగణించలేదు. ఒరిజినల్ కాపీలు కానందున వాటిని సాక్ష్యాలుగా పరిగణించలేదన్నారు. కోర్టుకు సమర్పించిన వీడియోలు కూడా స్పష్టంగా లేవన్నారు. అలాగే, నెగెటివ్స్ సమర్పించనందున, ఘటనకు సంబంధించిన ఫొటోలను కూడా సాక్ష్యాలుగా పరిగణించలేమన్నారు. లాస్ట్ వర్కింగ్ డే దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొనడంతో సీబీఐ కోర్టు ఉన్న ప్రాంగణంలో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. మధ్యాహ్నం 12:10 గంటలకు న్యాయమూర్తి ఎస్కే యాదవ్ న్యాయస్థానంలోకి వచ్చారు. ఆ తరువాత, 10 నిమిషాల్లోనే నిందితులంతా నిర్దోషులేనని పేర్కొంటూ తీర్పు ఆపరేటివ్ భాగాన్ని వెలువరించారు. న్యాయమూర్తి ఎస్కే యాదవ్‌కు బుధవారం చివరి పని దినం కావడం గమనార్హం. 26 మంది హాజరు తీర్పురోజు నిందితులంతా కోర్టుకు హాజరు కావాలని జడ్జి గతంలో ఆదేశించారు. కానీ, కరోనా, తదితర కారణాలతో పలువురు హాజరు కాలేదు. జీవించి ఉన్న 32 మంది నిందితుల్లో 26 మంది హాజరయ్యారు. తీర్పు ప్రకటిస్తున్న సమయంలో కోర్టుహాళ్లో ఉన్న కొందరు నిందితులు జడ్జి ముందే గట్టిగా ‘జై శ్రీరాం’ అంటూ నినాదాలు చేశారు. నిందితుల్లో వృద్ధాప్య కారణాలు చూపుతూ అద్వానీ, ఎంఎం జోషి, మహంత్ నృత్యగోపాల్‌దాస్ కోర్టుకు హాజరు కాలేదు. కళ్యాణ్ సింగ్, ఉమాభారతిలకు కరోనా సోకడంతో రాలేదు. విచారణ ఇలా.. విచారణ సమయంలో 351 మంది సాక్ష్యులను, 600 పత్రాలను సీబీఐ కోర్టుకు సమర్పించింది. 49 మందిని నిందితులుగా చేర్చింది. వారిలో విచారణ సాగుతుండగా వీహెచ్‌పీ అగ్రనేత అశోక్ సింఘాల్, శివసేన చీఫ్ బాలాసాహెబ్ ఠాక్రే, విజయరాజె సింధియా తదితర 17 మంది చనిపోయారు. రోజువారీ విచారణ జరపాలని, రెండు సంవత్సరాల్లోగా విచారణ ముగించాలని సీబీఐ ప్రత్యేక కోర్టును ఆదేశించింది. నిందితులు మసీదు కూల్చివేతకు కుట్ర పన్నడంతోపాటు కరసేవకులను రెచ్చగొట్టారని సీబీఐ వాదించింది. విగ్రహాలను పూజారి కాపాడారు: మసీదును దుండగులు కూల్చివేస్తున్న సమయంలో గర్భాలయంలో ఉన్న రామ్‌లల్లా విగ్రహం, ఇతర విగ్రహాలను అక్కడి పూజారి సత్యేంద్ర దాస్ బయటకు తీసుకువెళ్లారని, దీనిబట్టి, మసీదు కూల్చివేత ముందస్తు ప్రణాళికతో జరిగింది కాదని అర్థమవుతుందని నిందితుల తరఫు న్యాయవాది విమల్ శ్రీవాస్తవ వాదించారు. వివాదాస్పద ప్రాంతానికి 200 మీటర్ల దూరంలోని రామకథ కుంజ్ వద్ద వేదికపై నుంచి కూల్చివేత వద్దంటూ వీహెచ్‌పీ నేతలు, ఇతర నాయకులు ఇస్తున్న సూచనలను దుండగులు పట్టించుకోలేదన్నారు. కూల్చివేతను అడ్డుకునేందుకు అశోక్ సింఘాల్ ప్రయత్నించారన్నారు. మతపరమైన విశ్వాసంతో లాంఛనప్రాయంగా కరసేవ చేయాలనేదే నాయకుల ఉద్దేశమని, కాని కొందరు దురుద్దేశపూరితంగా దీన్ని భగ్నం చేసి, కూల్చివేతకు పాల్పడ్డారని వివరించారు. సీబీఐ కోర్టుకు సమర్పించిన వీడియోలు సీల్ అయి లేవని, అవి నిజమైనవా? కాదా? అని లాబ్‌లో పరీక్షించలేదని పేర్కొన్నారు. ముందు నుంచీ చెబుతున్నాం.. మసీదును కూల్చేందుకు కుట్ర పన్నారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని, ఎల్కే అద్వానీ, ఎంఎం జోషి, కళ్యాణ్ సింగ్, ఉమాభారతి తదితర నిందితులపై తప్పుడు కేసు పెట్టారని ముందు నుంచీ చెబుతున్నామని డిఫెన్స్ లాయర్ విమల్ కుమార్ శ్రీవాస్తవ తీర్పు అనంతరం మీడియాతో వ్యాఖ్యానించారు. అప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడితో ఆ కేసు పెట్టారని, ఈ తాజా తీర్పు న్యాయానికి లభించిన విజయమని ఆయన పేర్కొన్నారు. అప్పీల్‌కు వెళ్లడంపై.. ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై సీబీఐ పై కోర్టులో అప్పీల్ చేస్తుందా? అన్న ప్రశ్నకు సీబీఐ న్యాయవాది లలిత్ సింగ్ జవాబిస్తూ.. ఈ తీర్పు కాపీని ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి పంపిస్తామని, తీర్పును సీబీఐ న్యాయ విభాగం అధ్యయనం చేసిన తరువాత అప్పీల్‌కు వెళ్లడంపై తుది నిర్ణయం ఉంటుందని తెలిపారు. మంచిదే: అన్సారీ సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పుపై రామజన్మభూమి– బాబ్రీ మసీదు భూ యాజమన్య హక్కు కేసులో ప్రధాన కక్షిదారు అయిన ఇక్బాల్ అన్సారీ పేర్కొన్నారు. ‘అందరినీ నిర్దోషులుగా ప్రకటించారు. మంచిదే. జరగాల్సిందంతా గత సంవత్సరం నవంబర్ 9ననే జరిగింది. అదే రోజు ఈ కేసు కూడా ముగిస్తే ఇంకా బావుండేది’ అని వ్యాఖ్యానించారు. రామజన్మభూమి– బాబ్రీ మసీదు కేసులో రామజన్మభూమికి అనుకూలంగా 2019లో సుప్రీంకోర్టు తీర్పునివ్వడం తెల్సిందే. మా విశ్వాసం నిలబెట్టింది తీర్పువినగానే జై శ్రీరాం అని అడ్వాణీ నినదించారు. ‘రామ జన్మభూమి ఉద్యమంపై నా నమ్మకాన్ని, బీజేపీ విశ్వాసాన్ని, మా నిబద్ధతను ఈ తీర్పు సమర్థించింది’ అని అన్నారు. ‘అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం నా చిరకాల స్వప్నం. అందుకు వీలు కల్పించే గత నవంబర్ 29 నాటి సుప్రీంకోర్టు తీర్పు తరువాత.. అదే స్ఫూర్తితో ఈ తీర్పు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇక, అయోధ్యలో అద్భుతమైన రామ మందిర నిర్మాణం పూర్తి కావడం కోసం లక్షలాది భక్తులతో పాటు నేను ఎదురు చూస్తున్నా’ అన్నారు. అయోధ్య ఉద్యమ సమయంలో తనకు సహకరించిన పార్టీ కార్యకర్తలు, నాయకులు, స్వామీజీలు, అందరికీ అద్వానీ కృతజ్ఞతలు తెలిపారు. తీర్పు తరువాత తన ఇంటి నుంచి బయటకు వచ్చి, అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులను, అభిమానులను ఆయన జైశ్రీరాం అంటూ పలకరించారు. ఆ 32 మంది వీరే.. 1, ఎల్కే అడ్వాణీ, 2. మురళీ మనోహర్ జోషి, 3. కళ్యాణ్ సింగ్, 4. ఉమాభారతి, 5. వినయ్ కతియార్, 6. సాక్షి మహరాజ్, 7. సాధ్వి రితంబర, 8. మహంత్ నృత్య గోపాల్ దాస్, 9. రామ్‌విలాస్ వేదాంతి, 10. చంపత్ రాయ్, 11. సతీష్ ప్రధాన్, 12. ధరమ్ దాస్, 13. బ్రిజ్ భూషణ్ సింగ్, 14. పవన్ కుమార్ పాండే, 15. జై భగవాన్ గోయల్, 16. లల్లూ సింగ్, 17. జైభాన్ సింగ్ పావాయా, 18. ఆచార్య ధర్మేంద్ర దేవ్, 19. రాంజీ గుప్తా, 20. ప్రకాశ్ శర్మ, 21. ధర్మేంద్ర సింగ్ గుర్జార్, 22. ఆర్ఎం శ్రీవాస్తవ, 23. సతీష్ ప్రధాన్ కరసేవకులు: 24. రామ్ చంద్ర ఖత్రి, 25. సుధీర్ కక్కర్, 26. అమన్ నాథ్ గోయల్, 27. సంతోష్ దుబే, 28. వినయ్ కుమార్ రాయ్, 29. కమలేష్ త్రిపాఠి, 30. గంధి యాదవ్, 31, విజయ్ బహదూర్ సింగ్, 32. నవీన్ భాయ్ శుక్లా. తీర్పు వెలువడ్డాక వారణాసిలో మిఠాయిలు తినిపించుకుంటున్న ముస్లిం మహిళా ఫౌండేషన్ సభ్యులు -
మసీదు దానికదే కూలిపోయిందా?
సాక్షి, న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కేసులో అందరూ నిర్దోషులైతే.. మరి మసీదును ఎవరు కూల్చారు.. దానికదే కూలిపోయిందా అంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నల వర్షం కురిపించారు. చరిత్రలో ఈ రోజు నిజంగా బ్లాక్ డే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 1992 నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిందితులంతా నిర్దోషులేనని లక్నోలోని ప్రత్యేక న్యాయస్థానం తుది తీర్పును వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందిస్తూ అసదుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కోర్టు తీర్పు బాధ కలిగించింది. సరైన న్యాయం జరగలేదు. ఆధారాలు లేవని అందరిపై అభియోగాలు కొట్టేయడం సరైన నిర్ణయమా? మసీదును ఎవరు కూల్చారో యావత్ ప్రపంచం చూసింది. అందరూ నిర్దోషులైతే.. మరి మసీదును ఎవరు కూల్చారు.. దానికదే కూలిపోయిందా. ఉమాభారతి మసీదును కూల్చండి అంటూ నినాదాలు చేయడం నిజం కాదా’ అంటూ ఒవైసీ ప్రశ్నించారు. అంతేకాక ఈ తీర్పుపై యావత్ ముస్లిం లోకం, పర్సనల్ లా బోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తుందన్నారు ఒవైసీ. (చదవండి: ‘ఆ వివాదం మళ్లీ తెరపైకి తెచ్చారు’) ‘ఈ వివాదానికి సంబంధించి సుప్రీం కోర్టు గతంలోనే ‘చట్ట నియమాలను అతిగా ఉల్లంఘించడం.. బహిరంగ స్థలంలోని ప్రార్థనా స్థలాన్ని నాశనం చేసిన చర్య’గా వర్ణించింది. కానీ సీబీఐ కోర్టు మాత్రం అందరిని నిర్దోషులుగా ప్రకటించింది. సీబీఐ ఛార్జిషీట్లో అనేక విషయాలు దాచిపెట్టింది. ఇందులో ఎలాంటి కుట్ర లేదని తీర్పు వెల్లడించింది. దయచేసి నాకు జ్ఞానోదయం చేయండి.. చరిత్రలోని ఒక చర్యను అనర్హమైనదానిగా ప్రకటించడానికి ఇన్ని రోజుల సన్నహాలు అవసరమా. నాకు సమాధానం చెప్పండి’ అంటూ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘ఈ తీర్పుతో సనాతన ధర్మం రక్షించబడింది’
సాక్షి, విశాఖపట్నం: బాబ్రీ మసీదు కేసును సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేయడంపై విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్పందించారు. బాబ్రీ కేసును కొట్టేయడం సంతోషదాయకమన్నారు. ఈ తీర్పుతో సనాతన ధర్మం రక్షించబడిందని హర్షం వ్యక్తం చేశారు. 28 ఏళ్ళ నిరీక్షణకు తెరపడటం ఆనందాన్నిచ్చిందన్నారు. ఈ తీర్పుతో బాబ్రీ మసీదు వివాదానికి పూర్తిగా తెరపడిందని అభిప్రాయపడ్డారు. కేసులో ఉన్నవారిని నిర్దోషులుగా ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వానికి విశాఖ శారదా పీఠం తరపున అభినందనలు తెలియజేశారు. చదవండి: బాబ్రీ విధ్వంసం: నిందితులంతా నిర్దోషులే -
నిందితులంతా నిర్ధోషులే
-
న్యాయం గెలిచింది.. క్షమాపణ కోరండి: యోగి
న్యూఢిల్లీ/లక్నో: బాబ్రీ మసీదు కేసు కూల్చివేత కేసులో ప్రత్యేక న్యాయస్థానం వెలువరించి తీర్పు పట్ల ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హర్షం వ్యక్తం చేశారు. చివరకు న్యాయమే గెలించిందంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ దురుద్దేశంతోనే సాధువులు, బీజేపీ నాయకుల పరువు మసకబార్చేలా కేసులు బనాయించారని ఆరోపించారు. విశ్వహిందూ పరిషత్ సభ్యులతో పాటు వివిధ సామాజిక సంస్థలను ఈ కేసులో ఇరికించారన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ చేసిన పని కారణంగా వీళ్లంతా సుదీర్ఘకాలంగా నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొన్నారని, ఈ కుట్ర వెనుక ఉన్న అసలు కారకులు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా యోగి డిమాండ్ చేశారు. కాగా 1992 నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిందితులంతా నిర్దోషులేనని లక్నోలోని ప్రత్యేక న్యాయస్థానం తుది తీర్పును వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అడ్వాణీ, మురళి మనోహర్ జోషి, ఉమా భారతి తదితరులు ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇదిలా ఉండగా.. చారిత్రక కేసులో తీర్పు వెల్లడి, హత్రాస్ సామూహిక అత్యాచార బాధితురాలి మృతి నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో భద్రత కట్టుదిట్టం చేశారు. భారీ స్థాయిలో పోలీసులను మోహరించారు. ఆధిపత్య వర్గానికి చెందిన నలుగురు యువకులు దళిత యువతిపై అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడటంతో రెండు వారాల పాటు ప్రాణాలతో పోరాడిన ఆమె చివరకు ఢిల్లీ ఆస్పత్రిలో కన్నుమూసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. -
బాబ్రీ విధ్వంసం: నిందితులంతా నిర్దోషులే
న్యూఢిల్లీ/లక్నో: దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూసిన బాబ్రీమసీదు కూల్చివేత కేసులో ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఈ ఘటన ముందుస్తు పథకం ప్రకారం జరిగింది కాదని, పథకం ప్రకారం కూల్చివేసినట్టుగా ఆధారాలు లేవని పేర్కొంది. లక్నోలోని ప్రత్యేక న్యాయస్థానంలోని కోర్టు రూమ్ నంబరు 18లో సీబీఐ జడ్జి సురేంద్ర కుమార్ యాదవ్ తుది తీర్పును చదివి వినిపించారు. ఈ కేసులో 2 వేల పేజీల జడ్జిమెంట్ కాపీని రూపొందించారు. కాగా సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసులో తుది తీర్పు తమకు అనుకూలంగా వెలువడటంతో బీజేపీ నాయకులు, విశ్వహిందూ పరిషత్ సభ్యులకు భారీ ఊరట లభించింది. కాగా ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్న వినయ్ కతియార్, సాక్షిమహారాజ్, ధరమ్‌దాస్, రామ్ విలాస్ వేదాంతి, లల్లూ సింగ్, పవన్ పాండ్యా తదితరులు కోర్టుకు చేరుకున్నారు. ఇక మాజీ ఉపప్రధాని ఎల్కే అడ్వాణీ, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషి, కళ్యాణ్ సింగ్, సతీశ్ ప్రధాన్, గోపాల్ దాస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ఎదుట హాజరయ్యారు. మిగతా ముద్దాయిలంతా లక్నోలోని ప్రత్యేక న్యాయస్థానానికి చేరుకున్నారు. ఉమా భారతి కరోనా సోకగా, వయో భారం, అనారోగ్యం కారణంగా ఎల్కే అడ్వాణీ, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషి సైతం న్యాయస్థానం ఎదుట స్వయంగా హాజరుకాలేకపోయారు. అప్రమత్తమైన కేంద్రం.. దేశ వ్యాప్తంగా ప్రకంననలు రేపిన 1992 నాటి బాబ్రీ ఘటన తీర్పు నేపథ్యంలో కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేసింది. ఇక 1992 డిసెంబర్ 6న కరసేవకులు అయోధ్యలో బాబ్రీ మసీదుని కూల్చివేసిన విషయం విదితమే. ఈ కేసును విచారించిన సీబీఐ 351 మంది సాక్షుల్ని న్యాయస్థానం ఎదుట ప్రవేశపెట్టింది. 600 డాక్యుమెంట్లను రుజువులుగా చూపించింది. 48 మందిపై అభియోగాలు నమోదు చేయగా, విచారణ జరుగుతుండగానే 16 మంది ప్రాణాలు కోల్పోయారు. 16వ శతాబ్దం నాటి బాబ్రీ మసీదుని కూల్చివేతలో పాల్గొన్న కరసేవకుల్ని ఈ కేసులో నిందితులందరూ కుట్ర పన్ని వారిని రెచ్చగొట్టారని సీబీఐ న్యాయస్థానం ఎదుట వాదనలు వినిపించింది. కఠిన చర్యలు తప్పవు బాబ్రీ మసీదు కూల్చివేత కేసు తీర్పు వెలువడతున్న క్రమంలో హైదరాబాద్ పాతబస్తీ పరిసరాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రైల్వేస్టేషన్, ఎయిర్‌పోర్ట్‌లో అదనపు భద్రత ఏర్పాటు చేశారు. తీర్పు నేపథ్యంలో ఎలాంటి నిరసనలకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
లక్నో: దేశవ్యాప్తంగా ఉత్కంఠ
-
బాబ్రీ విధ్వంసం కేసు: నేడే తుదితీర్పు
లక్నో: సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 1992 బాబ్రీమసీదు కూల్చివేత కేసులో ప్రత్యేక న్యాయస్థానం నేడు తుదితీర్పు వెలువరించనుంది. తీర్పు వెలువరించే రోజు నాటికి జీవించి ఉన్న 32 మంది ముద్దాయిలు కూడా కోర్టు ఎదుట హాజరుకావాలని సీబీఐ జడ్జి ఎస్కే యాదవ్ 16వ తేదీన ఆదేశించారు. ముద్దాయిల్లో మాజీ ఉపప్రధాని ఎల్కే అడ్వాణీ, కేంద్ర మాజీ మంత్రులు మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్, వినయ్ కతియార్, సాధ్వి రితంబర ఉన్నారు. తీర్పునిచ్చే రోజు కరోనా ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న ఉమాభారతి, కళ్యాణ్ సింగ్ కోర్టులో హాజరవుతారో లేదో తెలియరాలేదు. కళ్యాణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండగా బాబ్రీ విధ్వంసం జరిగింది. రాజస్తాన్ గవర్నర్‌గా పదవీ కాలం ముగియగానే గత సెప్టెంబర్ నుంచి, ఆయనపై విచారణ కొనసాగింది.(చదవండి: నూతన శకానికి నాందీ క్షణం) విచారణ జరుగుతుండగానే 16 మంది మరణం కాగా 1992 డిసెంబర్ 6న కరసేవకులు అయోధ్యలో బాబ్రీ మసీదుని కూల్చివేశారు. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసును సీబీఐ విచారించింది. ఈ క్రమంలో సీబీఐ 351 మంది సాక్షుల్ని న్యాయస్థానం ఎదుట ప్రవేశపెట్టింది. 600 డాక్యుమెంట్లను రుజువులుగా చూపించింది. 48 మందిపై అభియోగాలు నమోదు చేయగా, విచారణ జరుగుతుండగానే 16 మంది ప్రాణాలు కోల్పోయారు. 16వ శతాబ్దం నాటి బాబ్రీ మసీదుని కూల్చివేతలో పాల్గొన్న కరసేవకుల్ని ఈ కేసులో నిందితులందరూ కుట్ర పన్ని వారిని రెచ్చగొట్టారని సీబీఐ న్యాయస్థానం ఎదుట వాదనలు వినిపించింది. -
30న బాబ్రీ కూల్చివేత తీర్పు
లక్నో: అయోధ్యలో వివాదాస్పద బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ప్రత్యేక కోర్టు ఈ నెల 30న తీర్పు వెల్లడించనుంది. కూల్చివేత ఘటన జరిగిన 28 ఏళ్ల తర్వాత చరిత్రాత్మక తీర్పు రాబోతోంది. ఈ కేసులో బీజేపీ అగ్రనేతలు అడ్వాణీ, మురళీమనోహర్ జోషి సహా 32 మంది అభియోగాలు ఎదుర్కొంటూ ఉండడంతో తీర్పుపై ఉత్కంఠ నెలకొని ఉంది. ఈ కేసుని విచారిస్తున్న లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్కే యాదవ్ తీర్పు వెలువడే 30వ తేదీన నిందితులు అందరూ న్యాయస్థానానికి హాజరు కావాలని బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఉమా భారతి, కళ్యాణ్ సింగ్, వినయ్ కటియార్, స్వాధి రితంబర వంటి బీజేపీ సీనియర్ నాయకులు ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నారు. 28 ఏళ్లుగా విచారణ కొనసాగుతున్న బాబ్రీ కేసులో ఈ నెల 1న వాదనలు పూర్తయ్యాయి. 351 సాక్షులు, 600 డాక్యుమెంట్లు బాబ్రీ కేసుని విచారించిన సీబీఐ 351 మంది సాక్షుల్ని న్యాయస్థానం ఎదుట ప్రవేశపెట్టింది. 600 డాక్యుమెంట్లను రుజువులుగా చూపించింది. 48 మందిపై అభియోగాలు నమోదు చేయగా, విచారణ జరుగు తుండగానే 16 మంది ప్రాణాలు కోల్పోయారు. 16వ శతాబ్దం నాటి బాబ్రీ మసీదుని కూల్చివేతలో పాల్గొన్న కరసేవకుల్ని ఈ కేసులో నిందితులందరూ కుట్ర పన్ని వారిని రెచ్చగొట్టారని సీబీఐ వాదనలు వినిపించింది. 1992 డిసెంబర్ 6న కరసేవకులు అయోధ్యలో బాబ్రీ మసీదుని కూల్చివేశారు. -
బాబ్రీ కేసులో సీబీఐ కోర్టు ముందుకు అడ్వాణీ
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రముఖ బీజేపీ నాయకుడు, మాజీ ఉప ప్రధాని, 92 ఏళ్ళ ఎల్కే అడ్వాణీ సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరవగా, ఆయన స్టేట్మెంట్ని రికార్డు చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు, నాలుగున్నర గంటలపాటు జరిగిన ఈ విచారణలో, ఎల్కే అడ్వాణీని సీబీఐ ప్రత్యేక కోర్టు 100కు పైగా ప్రశ్నలను అడిగింది. అడ్వాణీ తనపై వచ్చిన అన్ని ఆరోపణలను తిరస్కరించారని, ఆయన తరఫు న్యాయవాది వెల్లడించారు. బుధవారం హోం మంత్రి అమిత్‌షా, ఎల్కే అడ్వాణీతో అరగంట పాటు సమావేశమయ్యారు. రోజువారీ విచారణ చేస్తున్న కోర్టు, ఆగస్టు 31లోగా తీర్పును ప్రకటించాల్సి ఉంది. -
బాబ్రీ కూల్చివేతపై 9 నెలల్లో తీర్పు ఇవ్వాలి
న్యూఢిల్లీ: మీ తీర్పును 9 నెలల్లోగా వెల్లడించాలని బాబ్రీ మసీదు కూల్చివేత కేసును విచారిస్తున్న స్పెషల్ కోర్టును సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. స్పెషల్ కోర్టులోని ఆ జడ్జి పదవీ కాలాన్ని తీర్పు వెల్లడించే వరకు పొడిగించింది. సుప్రీంకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసులో బీజేపీ ప్రముఖులు అద్వానీ, ఎమ్ఎమ్ జోషీ, ఉమాభారతి సహా పలువురు నిందితులుగా ఉన్నారు. రాజకీయంగా సున్నితమైన ఈ కేసులో సాక్ష్యాల నమోదును కచ్చితంగా 6 నెలల్లోగా పూర్తి చేయాలని పేర్కొంది. సెప్టెంబర్ 30వ తేదీతో ముగియనున్న జడ్జి పదవీకాలాన్ని పొడిగించేందుకు 4 వారాల్లో చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. యూపీ ప్రభుత్వం తరఫున విచారణకు హాజరైన న్యాయవాది ఐశ్వర్య భాతీ వాదిస్తూ.. జ్యుడీషియల్ అధికారుల పదవీకాలాన్ని పొడిగించే నిబంధనలు ఏమీలేవన్నారు. కేసు పూర్తయ్యేంత వరకు పదవీకాలాన్ని పొడిగించమని ఆదేశిస్తున్నామని, ఒకవేళ కేసు తీర్పు వెలువరించేందుకు రెండేళ్లు పట్టినా అప్పటివరకు పదవీకాలాన్ని పొడిగించాల్సిందేనని వ్యాఖ్యానించింది. -
అయోధ్య కేసు విచారణ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్య కేసులో ఇప్పట్లో తేలేలా లేదు. దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ కేసులో తుది తీర్పు ఆలస్యం కానుంది. అయోధ్యలోని రామజన్మభూమి–బాబ్రీ మసీదు వివాదాస్పద ప్రాంతంపై అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విచారణను వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ కేఎం జోషిల ధర్మాసనం ఈ మేరకు సోమవారం ఆదేశాలు వెలువరించింది. జనవరిలో విచారణ తేదీలను సర్వోన్నత న్యాయస్థానం ఖరారు చేయనుందని న్యాయవాదులు తెలిపారు. రోజువారీ విచారణ తేదీలపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశముందన్నారు. వివాదాస్పద రామజన్మభూమి–బాబ్రీ మసీదు ప్రాంతంలోని 2.77 ఎకరాల భూమిని సమంగా విభజించి సున్నీ వక్ఫ్ బోర్డ్, నిర్మోహి అఖారా, రామ్ లల్లా సంస్థలకు కేటాయించాలంటూ 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. -
రామ్ మందిర్‌ను కూల్చింది వాళ్లు కాదు
- పాల్గర్ జిల్లాలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు ముంబాయి: అయోధ్యలోని రామ్ మందిర్‌ను ధ్వంసం చేసింది భారత దేశంలో ఉన్న ముస్లింలు కాదని రాష్ట్రీయ స్వయం సేవక్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. అయోధ్య వివాదం కేసు మళ్లీ కోర్టులో విచారణకు వచ్చిన సమయంలో భగవత్ ఈ విధంగా అయోమయ వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో ఉన్న ముస్లింలు ఈ విధంగా హిందూ దేవాలయాలపై దాడి చేయరని అన్నారు. భారతీయులను విడగొట్టేందుకే ఈ విధమైన దాడులకు విదేశీయులు పాల్పడ్డారని చెప్పారు. పాల్గర్ జిల్లాకు పక్కనే ఉన్న దహానులో జరిగిన విరాట్ హిందూ సమ్మేళన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రామమందిర్‌ను నిర్మించడం భారత జాతి కర్తవ్యమని పేర్కొన్నారు. అలాగే అయోధ్యలో ధ్వంసమైన రామమందిర్‌ను తిరిగి అదే స్థానంలో పునర్మించే బాధ్యత మనపై ఉందని అన్నారు. దాని కోసం ఎంత పోరాటానికైనా సిద్ధమన్నారు. రామ మందిరాన్ని పునర్మించకపోతే, మన సంస్కృతి సంప్రదాయాల మూలాలు తెగిపోయే ప్రమాదం ఉందన్నారు. రామ మందిర్‌ను యథాస్థానంలో పునర్మిస్తామని ఘంటాపథంగా చెప్పారు. ఈ రోజు మనం స్వతంత్రులమని, ధ్వంసమైన రామ మందిరాన్ని పునర్మించుకునే హక్కు మనకు ఉందని అన్నారు. ఇవి కేవలం దేవాలయాలు మాత్రమే కాదని, మన ఐడెంటిటీకి గుర్తులని చెప్పారు. దశాబ్దాలకు పైగా నడుస్తున్న రామ జన్మభూమి-బాబ్రి మసీదు వివాదం కేసు ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఉంది. 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా వేసిన 13 అప్పీళ్లు ప్రస్తుతం సుప్రీంలో విచారణకు వచ్చాయి. అలాగే భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న కుల ప్రాతిపదిక హింసకు ప్రతిపక్షాలను బాధ్యులను చేస్తూ విమర్శలు సంధించారు. గత ఎన్నికల్లో ఓడిపోయి ఖాళీగా కూర్చున్నవారే ఈవిధమైన కుల హింసకు, కుల ఘర్షణలకు ప్రేరేపిస్తున్నారని మోహన్ భగవత్ విమర్శించారు. -
అయోధ్య కేసు: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!
సాక్షి, న్యూఢిల్లీ : సున్నితమైన బాబ్రీ మసీదు-అయోధ్య రాజజన్మ భూమి భూవివాదం కేసులో సుప్రీంకోర్టు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసుతో ప్రమేయమున్న అసలైన కక్షిదారులు (పార్టీలు) మాత్రమే తమ వాదనలు కొనసాగించేందుకు అనుమతించాలని నిర్ణయించింది. ఈ కేసులో తమను కూడా కక్షిదారులుగా భావించి తమ వాదనలు కూడా వినాలంటూ దాఖలైన మధ్యంతర అభ్యర్థనలన్నింటినీ సుప్రీంకోర్టు తిరస్కరించింది. బాబ్రీ మసీదు కేసులో అసలైన కక్షిదారుల వాదనలు మాత్రమే కొనసాగించేందుకు అనుమతించాలని, ఈ కేసుకు సంబంధం లేని వ్యక్తులు జోక్యం కోరుతూ దాఖలు చేసిన అభ్యర్థనలను తిరస్కరించాలన్న విజ్ఞప్తిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీబ్‌తో కూడిన ధర్మాసనం అంగీకరించింది. ప్రస్తుతం కొనసాగుతున్న విచారణలో జోక్యం కోరుతూ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి వేసిన పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే, అయోధ్యలోని వివాదాస్పద ప్రాంతంలోని రామ మందిరంలో పూజలు చేసే ప్రాథమిక హక్కు తనకు ఉందని స్వామి వేసిన రిట్ పిటిషన్‌ను పునరుద్ధరించేందుకు ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టులో వాదనల సందర్భంగా ఆస్తిహక్కు కంటే ప్రాథమిక హక్కు ఉన్నతమైందని తాను పేర్కొన్నట్టు స్వామి పీటీఐతో తెలిపారు. -
మోదీ నివాసంలో బాబ్రీ తీర్పుపై చర్చ
-
మోదీ నివాసంలో బాబ్రీ తీర్పుపై చర్చ
► ప్రధానితో అమిత్ షా, జైట్లీ, రాజ్‌నాథ్, గడ్కారీ, వెంకయ్య భేటీ ► న్యాయపరమైన అంశాలపై చర్చ ► ‘బాబ్రీ’ తీర్పుపై చర్చించిన బీజేపీ అగ్రనాయకత్వం న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బీజేపీ అగ్రనా యకులు బుధవారం చర్చలు జరిపారు. ప్రధాని మోదీ నివాసంలో 2 గంటల పాటు జరిగిన సమావేశానికి మోదీ, బీజేపీ అధ్య క్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్‌నాథ్ సింగ్, గడ్కరీ, వెంకయ్య నాయుడు హాజరయ్యారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో తలెత్తే రాజకీయ, న్యాయపర పరిణామాలు, వాటిని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన మార్గాలపై చర్చించినట్లు తెలిసింది. ఈ సమావేశ ఎజెండాలో కశ్మీర్ సమస్యతో ఇతర అంశాలున్నాయని, దీన్ని నిర్వహించాలని ముందే నిర్ణయించారని సీనియర్ నాయకుడొకరు తెలిపారు. బుధవారం రాత్రి అయోధ్య వెళ్తానన్న కేంద్ర మంత్రి ఉమాభారతి బీజేపీ నాయకత్వం సలహా మేరకు నిర్ణయం మార్చుకున్నారు. -
1992 నుంచి 2017 వరకు ఇలా..
1992, డిసెంబర్: బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో కరసేవకులపై, అలాగే రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినందుకు బీజేపీ నేతలు ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషీ, మరికొందరిపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 1993, అక్టోబర్: అడ్వాణీతో పాటు మరి కొందరు నేతలు ఈ కుట్రలో భాగస్వాములని సీబీఐ కాంపోజిట్ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. 2001, మే 4: అడ్వాణీ, జోషీ, ఉమాభారతి, బాల్‌థాకరే తదితరులపై కేసు విచారణను అదనపు సీబీఐ కోర్టు కొట్టివేసింది. 2004, నవంబర్ 2: సాంకేతిక కారణాలను చూపి కేసును కొట్టివేయడంపై సీబీఐ హైకోర్టులోని లక్నో బెంచ్‌ను ఆశ్రయించింది. దీంతో న్యాయస్థానం నిందితులకు నోటీసులు జారీ చేసింది. 2010, మే 20: సీబీఐ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. దాఖలు చేసిన పునర్విచారణ పిటిషన్‌కు ఎటువంటి యోగ్యత లేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. 2011, ఫిబ్రవరి: హైకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా సీబీఐ సుప్రీంను ఆశ్రయించింది. 2017, మార్చి 6: బాబ్రీ కుట్ర కేసులో బీజేపీ నేతలపై పునర్విచారణకు అత్యున్నత న్యాయస్థానం సుముఖత వ్యక్తం చేసింది. మార్చి 21: అయోధ్య వివాద పరిష్కారానికి తాజాగా ప్రయత్నాలు ప్రారంభించాలని సుప్రీం కోర్టు సూచించింది. ఏప్రిల్ 6: నిర్ణీత సమయంలో విచారణ పూర్తిచేయడానికి సుముఖత వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం, సీబీఐ విజ్ఞప్తిపై ఆదేశాలను రిజర్వ్ చేసింది. ఏప్రిల్19: అడ్వాణీ, జోషీ, కేంద్ర మంత్రి ఉమాభారతీలపై నేరపూరిత కుట్రకు సంబంధించి విచారణను సుప్రీం పునరుద్ధరించింది. అంతేకాకుండా కరసేవకులతో పాటు వీఐపీలను వీరితో కలిపి విచారిస్తామని స్పష్టం చేసింది. -
అయోధ్య కోసం ఉరిశిక్షకైనా సిద్ధం: ఉమ
ఉమ రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్ న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు విధ్వంసం ఘటనలో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కేంద్ర మంత్రి ఉమాభారతి ఘాటుగా స్పందించారు. ‘రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నందుకు గర్వంగా ఉంది. ఇందుకోసం పశ్చాత్తాప పడను. ఎవరికీ క్షమాపణలు చెప్పాల్సిన పనిలేదు. అయోధ్య కోసం ఉరిశిక్షకైనా నేను సిద్ధం’ అని ఉమాభారతి స్పష్టం చేశారు. బాబ్రీ మసీదు విధ్వంసం విషయంలో కుట్రేమీ లేదని.. అంతా బహిరంగంగానే జరిగినందున రాజీనామా చేసే ప్రసక్తే లేదని వెల్లడించారు. ఈ దేశం గంగానది, త్రివర్ణ పతాకం, ఆవు, రాముడిదని వీటికోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని ఆమె తెలిపారు. రాముడి దర్శనం కోసం అయోధ్య వెళ్లాలనుకున్నా అర్ధంతరంగా తన పర్యటనను ఆమె రద్దుచేసుకున్నారు. బుధవారం కోర్టు తీర్పు వెలువడగానే.. ఉమాభారతి మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో దోషులకు శిక్ష పడాల్సిందేనని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా అన్నారు. అటు ఉమాభారతి రాజీనామా చేసే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. మరోవైపు, కోర్టు తీర్పు నేపథ్యంలో కేంద్ర సీనియర్ మంత్రులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. జైట్లీ, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కారీ, వెంకయ్య నాయుడుతోపాటు పలువురు సీనియర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. మరోవైపు, కోర్టు తీర్పును పూర్తిగా చదివాకే స్పందిస్తామని బీజేపీ స్పష్టం చేసింది. -
బాబ్రీ షాక్
⇔ అడ్వాణీ, జోషి, ఉమాభారతిలకు ఎదురుదెబ్బ ⇔ వారిపై నేరపూరిత కుట్ర అభియోగాల పునరుద్ధరణ ⇔ సీబీఐ పిటిషన్‌కు అనుమతిచ్చిన సర్వోన్నత న్యాయస్థానం ⇔ వారు బాబ్రీ కేసులో విచారణ ఎదుర్కోవాలని సుప్రీం తీర్పు ⇔ లక్నోలోని ట్రయల్ కోర్టులో రోజువారీ విచారణ ⇔ రెండేళ్ల కాలపరిమితితో కేసు విచారణ పూర్తి చేయాలి ⇔ అప్పటివరకూ ట్రయల్ కోర్టు న్యాయమూర్తిని బదిలీ చేయరాదు ⇔ రాజస్తాన్ గవర్నర్‌గా ఉన్నందున కల్యాణ్‌సింగ్‌కు మినహాయింపు ⇔ పదవీ కాలం పూర్తయిన తర్వాత ఆయనపై విచారణ న్యూఢిల్లీ బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. 1992 నాటి ఈ కేసులో బీజేపీ అగ్రనేతలు ఎల్కే అడ్వాణీ, మురళీమనోహర్ జోషి, ఉమాభారతిపై నేరపూరిత కుట్ర అభియోగాలను పునరుద్ధరించింది. బాబ్రీ కూల్చి వేతకు వీరు కుట్రపన్నారన్న ఆభియోగాలపై విచారణ కొనసాగాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిర్ణీత కాలపరిమితితో జరిగే విచారణను అడ్వాణీ, జోషి, ఉమ ఎదుర్కోవాలంది. రాష్ట్రపతి ఎన్నికల రేసులో ముందున్న అడ్వాణీతో పాటు 21 మందిపై కుట్ర అభియోగాలను కొట్టేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. వారిపై కుట్ర అభియోగాలను పునరుద్ధరించాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను.. జస్టిస్ పీసీ ఘోష్, జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం స్వీకరించింది. కేసుపై రోజువారీ విచారణ లక్నోలోని ట్రయల్ కోర్టులో ఈ కేసుపై రోజువారీగా విచారణ జరుగుతుందని, తమ తీర్పు అందిన తర్వాత రెండేళ్ల నిర్ణీత కాలపరిమితిలో కేసు విచారణ ముగించా లని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ‘‘అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు అనుమతించాం. దీనికి సంబంధించి కొన్ని ఆదేశాలు సైతం జారీ చేశాం’’అని ధర్మాసనం పేర్కొంది. రాయ్‌బరేలీ, లక్నో ట్రయల్ కోర్టుల్లో వేర్వేరుగా బాబ్రీ కేసుల విచారణ కొనసాగుతోందని, ఇకపై వీటన్నింటినీ కలిపి లక్నోలోని ట్రయ ల్ కోర్టులో ఉమ్మడి విచారణ జరుపుతుందని స్పష్టం చేసింది. ఈ వివాదాస్పద కేసులో కొత్తగా విచారణను ప్రారంభించడంలేదని స్పష్టం చేసింది. లక్నో ట్రయల్ కోర్టు న్యాయమూర్తిని విచారణ పూరై్త.. తీర్పు వెలువరించే వరకూ బదిలీ చేయరాదని ఆదేశించింది. సరైన కారణం చూపించకుండా ఏ పార్టీ ఈ కేసు వాయిదా కోరేందుకు అవకాశం లేదని, సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సంబంధిత కారణాలపై సంతృప్తి చెందితేనే కేసు విచారణ వాయిదా వేయాలని సూచించింది. కల్యాణ్‌సింగ్‌కు మినహాయింపు.. రాజస్తాన్ గవర్నర్‌గా ఉన్న కల్యాణ్‌సింగ్‌కు రాజ్యాంగ పరమైన రక్షణ ఉన్నందున ఆయనకు మినహాయింపు లభించింది. గవర్నర్ పదవీకాలం ముగిసిన తర్వాత కల్యాణ్‌సింగ్‌పై సెషన్స్ కోర్టు విచారణ జరుపుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 1992లో కల్యాణ్‌సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన విషయం తెలిసిందే. 25 ఏళ్లుగా కేసు విచారణ జాప్యం కావడానికి సంబంధించి సీబీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాసిక్యూషన్ సాకు‡్ష్యల నుంచి వాంగ్మూలాల నమోదు కోసం రోజువారీగా కోర్టులో హాజరు పరిచేందుకు చర్యలు తీసుకోవాలని సీబీఐని ఆదేశించింది. నాలుగు వారాల్లో ట్రయల్ కోర్టు కేసు విచారణను ప్రారంభించాలని స్పష్టం చేసింది. ఉమ్మడిగా కేసుల విచారణ.. ‘‘క్రైమ్ నంబర్ 198/92(అడ్వాణీ, మరో ఐదుగురికి వ్యతిరేకంగా)లో విచారణను రాయ్‌బరేలీలోని స్పెషల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు నుంచి లక్నోలోని అదనపు సెషన్స్ కోర్టు(అయోధ్య వ్యవహారాలు) న్యాయమూర్తికి బదిలీ చేస్తున్నాం’’అని ధర్మాసనం స్పష్టం చేసింది. అడ్వాణీ, జోషి, ఉమాభారతితో పాటు వినయ్ కతియార్, సాధ్వీ రీతంబర, విష్ణుహరి దాల్మియాలపై రాయ్‌బరేలీ కోర్టులో ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. అడ్వాణీ, జోషీ తరపున కోర్టుకు హాజరైన సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్.. కేసుల బదిలీ, ఉమ్మడి విచారణ ప్రతిపాదనను వ్యతిరేకించారు. అయితే అడ్వాణీ తరపు న్యాయవాది విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. సతీష్ప్రదాన్, సీఆర్ బన్సల్, ధర్మ్‌దాస్, మహంత్ నృత్యగోపాల్‌దాస్, మహామండలేశ్వర్ జగదీశ్ ముని, ఆర్వీ వేదాంతి, బీఎల్ శర్మ, సతీశ్చంద్రనగర్ తదితరులపై కూడా సెషన్స్ కోర్టు 120బీ కింద అభియోగాలు నమోదు చేస్తుందని స్పష్టం చేసింది. వీవీఐపీలపై కొత్తగా ఎటువంటి అభియోగాలు నమోదు చేయడం లేదని, గతంలో నమోదు చేసిన నేరపూరిత కుట్ర అభియోగాలనే పునరుద్ధరించాలని మాత్రమే తాము కోరుతున్నామని సీబీఐ స్పష్టం చేసింది. రెండు కోర్టుల్లో విచారణ 1992 డిసెంబర్ 6 నాటి బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి రెండు సెట్ల కేసుల విచారణ వేర్వేరు కోర్టుల్లో కొనసాగుతోంది. మొదటిదానిలో గుర్తించని కరసేవలకుపై నమోదైన కేసు విచారణ లక్నో కోర్టులో జరుగుతోంది. పలువురు భాజపా నేతల ప్రమేయం ఉన్న కేసు విచారణ రాయ్‌బరేలి కోర్టులో కొనసాగుతోంది. సీబీఐ చార్జిషీట్లో అడ్వాణీతో పాటు 20 మందిపై భారత శిక్షా స్మృతి(ఐపీసీ) సెక్షన్లు 153ఏ(వర్గాల మధ్య శత్రుత్వాన్ని సృష్టించడం), 153బీ(జాతీయ సమగ్రతను దెబ్బతీయడం), 505(తప్పడు ప్రకటనలతో పుకార్లను సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కల్గించడం) కింద అభియోగాలు నమోదు చేసింది. 120బీ(నేరపూరిత కుట్ర) కింద కూడా అభియోగాలు నమోదు చేసింది. అయితే దీనిని ప్రత్యేక న్యాయస్థానం కొట్టేసింది. 2010 మే 20న అలహాబాద్ హైకోర్టు ఈ తీర్పును సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ హజీ మహబూబ్ అహ్మద్(ప్రస్తుతం జీవించిలేరు), సీబీఐ సుప్రీంకోర్టులో వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు.