బాబ్రీ మసీదు కేసు విచారణను వేగవంతం చేసేలా సుబ్రమణ్యస్వామి తొందరపెడుతున్నారని..
న్యూఢిల్లీ: అయోధ్యలో రామజన్మభూమి–బాబ్రీ మసీదు భూ వివాదంలో కేసు విచారణను వేగవంతం చేసేలా బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి తొందరపెడుతున్నారని ఇక్బాల్ అన్సారీ అనే కక్షిదారు ఆరోపించారు. కేసు విచారణకు సంబంధించిన కక్షిదారులకు ఎలాంటి సమాచారం ఇవ్వటం లేదని మహ్మద్ హసీమ్ అన్సారీ కుమారుడు ఇక్బాల్ అన్సారీ.. సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌కు లేఖ రాశారు. తమ తరపు న్యాయవాదికి సమాచారం ఇవ్వకుండానే సీజేఐ ముందు స్వామి వివాదానికి సంబంధించిన విచారణను లేవనెత్తారన్నారు.
మొదటిసారిగా ఫైజాబాద్ కోర్టులో రామజన్మభూమిపై కేసు వేసిన అన్సారీ (95) గతేడాది ఆగస్టులో కన్నుమూశారు. కాగా, రామజన్మభూమి–బాబ్రీ మసీదు భూ వివాదం కేసును అత్యవసరంగా విచారించాలన్న స్వామి అభ్యర్థనను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది.