న్యూఢిల్లీ : వివాదాస్పద బాబ్రీ మసీదు విధ్వంసం కేసు విచారణను సుప్రీంకోర్టు రెండువారాలకు వాయిదా వేసింది. తదుపరి విచారణ వచ్చే నెల 6తేదీకి వాయిదా పడింది. ఈ కేసులో బీజేపీ అగ్రనేతలు అద్వానీ, మురళీమనోహర్ జోషీ, ఉమాభారతి సహా 13మందిపై నేరపూరిత కుట్ర అభియోగాలు తొలగించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. దీనిపై నిన్న విచారణ జరిపిన న్యాయస్థానం ఇవాళ్టికి కేసు వాయిదా వేసింది. మరోవైపు కుట్ర అభియోగాలకు సంబంధించి తమ వాదనలు లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని న్యాయస్థానం గురువారం ఆదేశించింది. వాస్తవానికి ఈ అంశంపై బుధవారమే తీర్పు రావాల్సి ఉన్నా జడ్జి గైర్హాజరుతో తీర్పు ఇవాళ్టికి వాయిదా పడింది. అయితే ఇవాళ కూడా తీర్పు ప్రకటించలేదు.
కాగా బాబ్రీ ఘటనకు సంబంధించి అద్వానీ, వినయ్ కటియార్, కళ్యాణ్ సింగ్ సహా 13 మంది బీజేపీ నేతలపై కేసు నమోదైంది. అయితే అద్వానీ సహా 12 మందిపై నమోదైన కుట్ర అభియోగాలను లక్నోలోని ట్రయల్ కోర్టు కొట్టేయగా... అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. ఈ నిర్ణయాన్ని సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై ఈ నెల 6వ తేదీన విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం కుట్ర అభియోగాల తొలగింపును తప్పుబట్టింది.
బాబ్రీ కూల్చివేత కేసు విచారణ వాయిదా
Published Thu, Mar 23 2017 11:09 AM | Last Updated on Sun, Sep 2 2018 5:28 PM
Advertisement
Advertisement