మోదీ నివాసంలో బాబ్రీ తీర్పుపై చర్చ
► ప్రధానితో అమిత్ షా, జైట్లీ, రాజ్‌నాథ్, గడ్కారీ, వెంకయ్య భేటీ
► న్యాయపరమైన అంశాలపై చర్చ
► ‘బాబ్రీ’ తీర్పుపై చర్చించిన బీజేపీ అగ్రనాయకత్వం
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బీజేపీ అగ్రనా యకులు బుధవారం చర్చలు జరిపారు. ప్రధాని మోదీ నివాసంలో 2 గంటల పాటు జరిగిన సమావేశానికి మోదీ, బీజేపీ అధ్య క్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్‌నాథ్ సింగ్, గడ్కరీ, వెంకయ్య నాయుడు హాజరయ్యారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో తలెత్తే రాజకీయ, న్యాయపర పరిణామాలు, వాటిని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన మార్గాలపై చర్చించినట్లు తెలిసింది.
ఈ సమావేశ ఎజెండాలో కశ్మీర్ సమస్యతో ఇతర అంశాలున్నాయని, దీన్ని నిర్వహించాలని ముందే నిర్ణయించారని సీనియర్ నాయకుడొకరు తెలిపారు. బుధవారం రాత్రి అయోధ్య వెళ్తానన్న కేంద్ర మంత్రి ఉమాభారతి బీజేపీ నాయకత్వం సలహా మేరకు నిర్ణయం మార్చుకున్నారు.