మంత్రివర్గంలో మార్పులపై మోదీ కసరత్తు | amith shah, arun jaitley meet pm narendra modi | Sakshi
Sakshi News home page

మంత్రివర్గంలో మార్పులపై మోదీ కసరత్తు

Published Fri, May 20 2016 9:36 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

మంత్రివర్గంలో మార్పులపై మోదీ కసరత్తు - Sakshi

మంత్రివర్గంలో మార్పులపై మోదీ కసరత్తు

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం నూతనోత్సాహంతో ఉన్న బీజేపీ.. కేంద్ర మంత్రివర్గం, పార్టీలో మార్పులు, చేర్పులు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం రాత్రి.. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీలతో సమావేశమయ్యారు. ప్రధాని మోదీ ఈ అంశంపై అమిత్, జైట్లీలతో చర్చిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్ నుంచి మరికొంతమందికి కేంద్ర కేబినెట్లో స్థానం కల్పించే అవకాశముందని భావిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని ఆశిస్తున్న బీజేపీ పెద్దలు యూపీపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. యూపీతో పాటు వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే ఇతర రాష్ట్రాలపైనా బీజేపీ దృష్టిసారిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గం, పార్టీలో మార్పులు, చేర్పులు జరగవచ్చని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement