సుష్మ వర్సెస్ జైట్లీ | It's Sushma vs Jaitley now | Sakshi
Sakshi News home page

సుష్మ వర్సెస్ జైట్లీ

Published Fri, Mar 28 2014 1:22 PM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

It's Sushma vs Jaitley now

 

 

 

 

 

 

 

సుష్మ అరుణ్ జైట్లీ
బిజెపిలో అయిదున్నర దశాబ్దాల అనుభవం చురుకైన నేత, యువకుడు, సమస్యలను త్వరగా అర్థం చేసుకుంటారు
అద్వానీకి అత్యంత సన్నిహితురాలు నరేంద్ర మోడీకి మొదట్నుంచీ గట్టి మద్దతుదారు, గుజరాత్ వ్యవహారాల ఇన్చార్జి గా అనుభవం
మంత్రిగా పనిచేసిన అనుభవం మొదట్నుంచీ రాజ్యసభ రూటే
అమెది మొదట్నుంచీ లోకసభ రూటు కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టడంలో వెనకాడరు
కాంగ్రెస్ తో సాన్నిహిత్యం, మెతక వైఖరి అవలంబిస్తుందన్న ఆరోపణ రాజ్యసభలో సీమాంధ్ర హక్కులపై పోరు
తెలంగాణ చర్చను రసాభాస చేసిన ఆరోపణ  
మద్దతుదార్లు - అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, షానవాజ్ హుసేన్ మద్దతుదార్లు - నరేంద్ర మోడీ, అమిత్ షా, వసుంధరా రాజే

 

బిజెపిలో ప్రధాని ఎవరన్న చర్చ ముగిసింది. ఇప్పుడు ఉప ప్రధాని ఎవరన్న రచ్చ మొదలైంది. బిజెపిలో ఇప్పుడు దీనిపై అంతర్గతంగా భారీ చర్చే జరుగుతోంది.

 

అసలు సమస్యంతా అకాలీ నేత, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ తో మొదలైంది. అమృత్ సర్ నుంచి లోకసభ ఎన్నికల బరిలోకి దిగుతున్న అరుణ్ జైట్లీకి మద్దతుగా ప్రచారం చేస్తూ ఒక సభలో బాదల్ 'మీరు అరుణ్ జైట్లీకి ఓటేస్తే ఉప ప్రధానమంత్రికి ఓటేసినట్టే' అని అన్నారు. అంతే! రచ్చ మొదలైంది. 'నేను ఉపప్రధాని అభ్యర్థిని కాను' అని జైట్లీ స్వయంగా ప్రకటించినా ఫలితం లేకపోయింది.
మరో వైపు మధ్యప్రదేశ్ లో సీనియర్ బిజెపి నేత, మాజీ ముఖ్యమంత్రి సుందర్ లాల్ పట్వా కుమారుడు సురేంద్ర పట్వా తమ రాష్ట్రంలోని విదిశ నుంచి పోటీ చేస్తున్న సుష్మా స్వరాజ్ ఉప ప్రధాని అని ప్రకటించారు. బిజెపి సీనియర్ నేతల్లో నరేంద్ర మోడీని బహిరంగంగా వ్యతిరేకిస్తున్నది ఒక్క సుష్మా స్వరాజే. ఆమె నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పుడు అంత అనుకూలంగా మాట్లాడలేదు. బళ్లారి నుంచి వివాదాస్పద నేత బీ శ్రీరాములుకి టికెట్ ఇవ్వడాన్ని ఆమె వ్యతిరేకించారు. అలాగే జస్వంత్ సింగ్ కు బార్మేర్ టికెట్ ఇవ్వకపోవడాన్నీ నిరసించారు.

 

ఆమె తన సభల్లో ఎక్కడా మోడీ పేరు ప్రస్తావించరు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పనితీరును మాత్రం బాగా ప్రశంసిస్తారు.

 

బిజెపిలో ఒక వర్గం మోడీకి పగ్గాలు వేసేందుకు ఉప ప్రధానిగా సుష్మా ఉంటే బాగుంటుందని భావిస్తున్నారు. అలాంటి వారిలో అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, షానవాజ్ హుసేన్ లు ఉన్నారు.

 

ఇటీవలే బిజెపికి మద్దతుదారు, మోడీ అభిమాని అయిన ఫెమినిస్టు జర్నలిస్టు మధు కిష్వర్ బిజెపిలో ఒక వర్గం బిజెపికి 160 సీట్లు మాత్రమే రావాలని కోరుకుంటున్నారని సంచలన ప్రకటన చేశారు. బిజెపికి తక్కువ సీట్లు వస్తే ఎన్డీయే మిత్ర పక్షాల బలం పెరుగుతుందని, వారు మోడీకి బదులు మరొకరు పీఎం కావాలని కోరవచ్చునని వారు ఆశిస్తున్నారు. ఇలాంటి వర్గానికి ఆమె క్లబ్ 160 అని పేరు పెట్టారు. బిజెపికి సొంతంగా 180 నుంచి 200 సీట్లు వస్తే మోడీకి పట్టపగ్గాలుండవని క్లబ్్ 160 భయపడుతోందని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఉప ప్రధాని ఎవరన్న విషయంలో చర్చను మొదలుపెట్టారని వార్తలు వినవస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement