Murli Manohar Joshi
-
30న బాబ్రీ కూల్చివేత తీర్పు
లక్నో: అయోధ్యలో వివాదాస్పద బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ప్రత్యేక కోర్టు ఈ నెల 30న తీర్పు వెల్లడించనుంది. కూల్చివేత ఘటన జరిగిన 28 ఏళ్ల తర్వాత చరిత్రాత్మక తీర్పు రాబోతోంది. ఈ కేసులో బీజేపీ అగ్రనేతలు అడ్వాణీ, మురళీమనోహర్ జోషి సహా 32 మంది అభియోగాలు ఎదుర్కొంటూ ఉండడంతో తీర్పుపై ఉత్కంఠ నెలకొని ఉంది. ఈ కేసుని విచారిస్తున్న లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్కే యాదవ్ తీర్పు వెలువడే 30వ తేదీన నిందితులు అందరూ న్యాయస్థానానికి హాజరు కావాలని బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఉమా భారతి, కళ్యాణ్ సింగ్, వినయ్ కటియార్, స్వాధి రితంబర వంటి బీజేపీ సీనియర్ నాయకులు ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నారు. 28 ఏళ్లుగా విచారణ కొనసాగుతున్న బాబ్రీ కేసులో ఈ నెల 1న వాదనలు పూర్తయ్యాయి. 351 సాక్షులు, 600 డాక్యుమెంట్లు బాబ్రీ కేసుని విచారించిన సీబీఐ 351 మంది సాక్షుల్ని న్యాయస్థానం ఎదుట ప్రవేశపెట్టింది. 600 డాక్యుమెంట్లను రుజువులుగా చూపించింది. 48 మందిపై అభియోగాలు నమోదు చేయగా, విచారణ జరుగు తుండగానే 16 మంది ప్రాణాలు కోల్పోయారు. 16వ శతాబ్దం నాటి బాబ్రీ మసీదుని కూల్చివేతలో పాల్గొన్న కరసేవకుల్ని ఈ కేసులో నిందితులందరూ కుట్ర పన్ని వారిని రెచ్చగొట్టారని సీబీఐ వాదనలు వినిపించింది. 1992 డిసెంబర్ 6న కరసేవకులు అయోధ్యలో బాబ్రీ మసీదుని కూల్చివేశారు. -
30న బాబ్రీ కేసుపై తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజకీయ, సామాజిక ముఖచిత్రాన్ని మార్చివేసిన 28 ఏళ్ల నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసుపై ఈనెల 30న తీర్పు వెలువడనుంది. బీజేపీ దిగ్గజ నేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి సహా నిందితులందరూ కోర్టుకు హాజరు కావాలని తీర్పును వెల్లడించనున్న సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం జడ్జి ఎస్కే యాదవ్ కోరారు. 1992లో బాబ్రీ మసీదు ధ్వంసానికి దారితీసేలా కుట్రపూరితంగా వ్యవహరించారని బీజేపీ దిగ్గజ నేతలపై ఆరోపణలున్నాయి. రాముడి జన్మస్థలంలో మసీదు ఉందని నమ్మడంతో కరసేవకులు ఈ కట్టడాన్ని నేలమట్టం చేశారు. బాబ్రీ కూల్చివేతపై అద్వానీ (92) జులై 24న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీబీఐ ప్రత్యేక న్యాయస్దానం ఎదుట స్టేట్మెంట్ రికార్డు చేశారు. అంతకుముందు రోజు మురళీ మనోహర్ జోషీ (86) తన స్టేట్మెంట్ రికార్డు చేశారు. తమపై నమోదైన అన్ని అభియోగాలను వారు తోసిపుచ్చారు. ఇక బాబ్రీ కేసులో న్యాయస్ధానం ఎలాంటి తీర్పు వెలువరించినా ఇబ్బంది లేదని బీజేపీ సీనియర్ నేత ఉమా భారతి స్పష్టం చేశారు. చదవండి : బాబ్రీ మసీదు పరిమాణంలోనే కొత్త మసీదు! -
జోషి వాంగ్మూలం నమోదు చేసిన సీబీఐ కోర్టు
-
జోషి వాంగ్మూలం నమోదు చేసిన సీబీఐ కోర్టు
లక్నో : బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనకు సంబంధించి సీబీఐ ప్రత్యేక న్యాయ స్థానం బీజేపీ కురవృద్ధుడు మురళీ మనోహర్ జోషి వాంగ్మూలం నమోదు చేసింది. ప్రత్యేక న్యాయమూర్తి ఎస్కే యాదవ్.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జోషి వాంగ్మూలాన్ని తీసుకున్నారు. ఇదే కేసుకు సంబంధించి శుక్రవారం మాజీ ఉప ప్రధానమంత్రి ఎల్కే అద్వానీ వాంగ్మూలం కూడా రికార్డు చేయనున్నారు. కాగా, సీఆర్పీసీ సెక్షన్ 313 కింద ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం 32 మంది తమ వాదనలను వినిపించవచ్చని న్యాయమూర్తి పేర్కొన్న సంగతి తెలిసిందే.(మధ్యప్రదేశ్ మంత్రికి సోకిన కరోనా) బాబ్రీ మసీదు కూల్చివేత కేసును ఆగస్టు 31 లోగా పూర్తి చేయాలని లక్నో సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. నిర్ణీత గడువు లోగా విచారణ పూర్తి చేసి తుది తీర్పు వెలువరించాలని సూచించింది. ఈ నేపథ్యంలో గడువులోగా విచారణ పూర్తిచేసేందుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రోజువారి విచారణ చేపడుతోంది. ఈ కేసులో బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, అశోక్ సింఘాల్, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతి.. వంటివారి పేర్లు ఉన్నాయి. కరసేవకులను రెచ్చగొట్టి మసీదును కూల్చివేశారని వీరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.(పిల్లల కోసం ఆ కాస్త ఆసరా వదిలేశాడు!) -
అద్వానీ వాంగ్మూలం తీసుకోనున్న సీబీఐ కోర్టు
లక్నో : బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ కీలక నేతల వాంగ్మూలం నమోదు చేసేందుకు రంగం సిద్ధమైంది. బీజేపీ సీనియర్ నాయకులు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిల స్టేట్మెంట్లను రికార్డు చేసేందుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తేదీలు ఖరారు చేసింది. జూలై 23న మురళీ మనోహర్ జోషి, జూలై 24న అద్వానీల వాదనలు రికార్డు చేయనున్నట్టు తెలిపింది. ఈ మేరకు స్పెషల్ జడ్జ్ జస్టిస్ ఎస్కే యాదవ్ సోమవారం ఉత్తర్వులు వెలువరించారు. సీఆర్పీసీ సెక్షన్ 313 కింద అద్వానీ, జోషిల వాంగ్మూలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రికార్డు చేయనున్నట్టు పేర్కొన్నారు. (బాబ్రీ మసీదు కేసులో కొత్త మలుపు) మరోవైపు బాబ్రీ మసీదు కూల్చివేత కేసును ఆగస్టు 31 లోగా పూర్తి చేయాలని లక్నో సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. నిర్ణీత గడువు లోగా విచారణ పూర్తి చేసి తుది తీర్పు వెలువరించాలని సూచించింది. ఈ నేపథ్యంలో గడువులోగా విచారణ పూర్తిచేసేందుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రోజువారి విచారణ చేపడుతోంది. కాగా, బాబ్రీ మసీదు కేసులో బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, అశోక్ సింఘాల్, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతి.. వంటివారి పేర్లు ఉన్నాయి. కరసేవకులను రెచ్చగొట్టి మసీదును కూల్చివేశారని వీరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. -
రాజ్యసభకు సుష్మా, అద్వానీ..!
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న బీజేపీ సీనియర్లను రాజ్యసభకు పంపాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ సీనియర్ నేతలపై ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, సుష్మా స్వరాజ్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. వయసు కారణంగా అద్వానీ, జోషీలను పార్టీ పోటీకి నిరాకరించగా.. అనారోగ్యం కారణంగా మాజీ కేంద్రమంత్రి సుష్మా పోటీకి దూరంగా ఉన్నారు. వీరిని పెద్దల సభకు పంపాలని యోచిస్తున్నట్లు సమాచారం. రానున్న రెండు నెలల్లో రాజ్యసభలో పది స్థానాలు ఖాళీ కానున్నాయి. గుజరాత్లో 2, బిహార్ 1, అస్సాం 2, తమిళనాడులో 5 స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో వాటికి ఎన్నిక అనివార్యం కానుంది. వీటిలో మెజార్టీ స్థానాలను అధికార బీజేపీ సొంతం చేసుకునే అవకాశం ఉంది. సీనియర్ల సేవలను ఉపయోగించుకోవాలనే ఉద్దేశ్యంతో వీరిని రాజ్యసభకు పంపాలని భావిస్తున్నట్లు బీజేపీ వర్గాల సమాచారం. కాగా 75 ఏళ్లుపైబడిన వాళ్లను లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంచాలని పార్టీ నిబంధనలు విధించిన విషయం తెలిసిందే. దీంతో సీనియర్లను పోటీ నుంచి తప్పించారు. మోదీ ప్రభుత్వంలో కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అమిత్ షా గుజరాత్‌లోని గాంధీ నగర్ నుంచి లోక్‌సభకు ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే పోటీకి ముందే ఇదే విషయంపై అద్వానీతో షా, మోదీ చర్చించినట్లు తెలిసింది. మధ్య ప్రదేశ్‌లోని విదిశ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన సుష్మా ఈసారి పోటీకి దూరంగా ఉన్నారు. దీంతో ఆమెను కూడా పెద్దల సభకు పంపాలని బీజేపీ భావిస్తోంది. దీనికి ఆమె కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. కాగా విదేశాంగ మంత్రిగా నియమితులైన ఎస్ జైశంకర్, రాంవిలాస్ పాశ్వన్‌లను కూడా రాజ్యసభకు పంపనున్నారు. అస్సాం నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదవీ కాలం కూడా మరో రెండు నెలల్లో ముగియనుంది. -
కురువృద్ధుల తిరుగు బావుటా
భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎల్.కె.అడ్వాణీ ఏళ్ల నిశ్శబ్దాన్ని వదిలేశారు. పార్టీని వ్యతిరేకించిన వాళ్లెవరూ దేశద్రోహులు కాబోరని ఓ బ్లాగ్‌లో తేల్చి చెప్పారు!. దీనికి మోదీ సహా అందరూ ప్రశంసల వర్షమూ కురిపించారు!. ఇంకేం.. అంతా బాగుంది అనుకుంటున్నారా?. అక్కడే వస్తోంది తేడా! అడ్వాణీ బ్లాగ్ ఓ గుప్త సందేశమని అంటున్నారు విశ్లేషకులు. ఆచితూచి.. తనలాంటి వారితో సంప్రదించి మరీ...అడ్వాణీ వేసిన ఈ పాచిక పారుతుందా?. ఇంతకీ ఈ బ్లాగు వెనుక ఉన్న సందేశం ఏమిటి? నిండు సభా వేదికపై కనీసం ప్రతి నమస్కారం కూడా చేయకుండా మోదీ చేసిన అవమానాన్ని బీజేపీ కురువృద్ధుడు మరచిపోయారా? సుమారు అరవై ఏళ్ల ప్రజా జీవితానికి ఫుల్స్టాప్ పెట్టేసి.. మార్గదర్శక్ మండల్‌కే పరిమితం చేసిన వారిని ఆయన క్షమించేశారా? మాట మాత్రం కూడా చెప్పకుండా తను ప్రాతినిధ్యం వహిస్తున్న గాంధీనగర్ స్థానం నుంచి అమిత్ షా నామినేషన్ వేసినా.. పోనీలే అని ఊరుకున్నారా? ఇటీవలి పరిణామాలను గమనిస్తే.. 91 ఏళ్ల అడ్వాణీ తనదైన శైలిలో పార్టీపై ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారని అనిపించకమానదు. రాజకీయ విశ్లేషకుల అంచనాలూ ఇదే విషయాన్ని చెబుతున్నాయి. పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన మురళీ మనోహర్ జోíషీకి కూడా కాన్పూర్ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించకపోవడం అడ్వాణీని తీవ్ర అసంతృప్తికి గురిచేసిందని వీరు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాసిన బ్లాగ్.. అందులోని ప్రతి వాక్యానికీ ప్రాధాన్యం ఏర్పడిందని.. మరోవైపు మురళీ మనోహర్ జోషీ కూడా తనదైన శైలిలో తన అసంతృప్తిని వ్యక్తం చేసేందుకు, తిరుగుబాటు చేసేందుకూ సిద్ధమయ్యారని వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేతలు కొందరితో చర్చలు జరిపిన ఆయన.. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌తోనూ మాట్లాడారు. ఒకదశలో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఆయన వారణాసి నుంచి మోదీపై పోటీకి పెట్టేందుకూ సిద్ధమైనట్లు సమాచారం. అయితే మోదీ కోసమని తాను 2014లో వదిలేసుకున్న ఆ స్థానం నుంచి పోటీ చేసేందుకు జోషీ నిరాసక్తత వ్యక్తం చేశారని విశ్వసనీయ సమాచారం. వారణాసి కాకుండా ఇంకోచోటు నుంచి బరిలోకి దిగేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని, కాంగ్రెస్ నేతలతో చర్చలు కొనసాగుతున్నాయని అంటున్నారు. ఈ లోపుగా ఆయన కూడా మోదీ తరహా రాజకీయాలను ప్రశ్నిస్తూ అడ్వాణీ మాదిరిగా ఓ ఘాటు లేఖ/బ్లాగ్ పోస్టు లేదా ప్రత్యేక కథనాన్ని రాసే అవకాశముందని అంచనా. అడ్వాణీ తన బ్లాగ్‌లో దేశద్రోహులన్న అంశాన్ని ఎంచుకోగా.. జోషీ ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాన్ని లేవనెత్తనున్నారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ సిద్ధం చేసిన బ్యాంక్ లోన్ ఎగవేతదారుల జాబితాను జోషీ ప్రస్తావించవచ్చు. అది అభిశంసనే.. అడ్వాణీ తన బ్లాగ్ ద్వారా చెప్పిన కొన్ని అంశాలు నేరుగా మోదీ– అమిత్ షా తీరుకు అభిశంసనేనని విశ్లేషకులు అంటున్నారు. ‘తనకు తెలిసిన జాతీయవాదంలో విమర్శించే వారెవరినీ దేశద్రోహులుగా గుర్తించడం ఉండద’న్న వ్యాఖ్య ఈ విషయాన్ని రుజువు చేస్తుంది. మోదీ అధికారం చేపట్టిన తరువాత దేశవ్యాప్తంగా జాతీయవాదంపై చర్చ జరుగుతోన్న విషయాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. పార్టీ సీనియర్ నేతలందరూ కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష పార్టీలన్నింటిపై దేశద్రోహులనే ముద్ర వేసేలా మాట్లాడటాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అడ్వాణీ చేసిన తాజా వ్యాఖ్యతో ఈ వాదనను ప్రశ్నించినట్లు అయిందని వీరు అంటున్నారు. ఈమధ్యే అడ్వాణీ కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నేతలతో తన అసంతృప్తిని, ఆవేదనను పంచుకున్నారని మోదీ– షా ద్వయం తనను, జోషీని అవమానాలకు గురి చేసిందని అడ్వాణీ వాపోయారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కాన్పూర్ టికెట్ ఇవ్వడం లేదన్న విషయం జోషీకి పార్టీ జనరల్ సెక్రటరీ రామ్‌లాల్ ద్వారా తెలియజేశారని, పోటీ చేయాలన్న ఆసక్తి లేదని బహిరంగ ప్రకటన చేయాలన్నది అమిత్ షా ఉద్దేశమని రామ్‌లాల్ స్వయంగా జోషీకి చెప్పగా.. ‘నువ్వు పోస్ట్‌మ్యాన్‌వి మాత్రమే. మోదీ, అమిత్ షా నా ముఖం చూడలేకపోతున్నారు ఎందుకు?’ అని ప్రశ్నించినట్లు సమాచారం. ఆ మరుసటి రోజే జోషీ.. కాన్పూర్ ఓటర్ల పేరుతో ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. ‘బీజేపీ.. నేను కాన్పూర్ నుంచి మరోసారి పోటీ చేయవద్దని చెబుతోంది’ అని మాత్రమే ఉన్న ఆ లేఖ బీజేపీ అధిష్టానంపై చేసిన తిరుగుబాటుగానే చూడాల్సి ఉంటుంది. ఆ తరువాత జోషీ పలువురు కాంగ్రెస్ నేతలతో సమావేశమైనప్పుడు వారణాసి నుంచి మోదీ ప్రత్యర్థిగా పోటీచేసే అంశం ప్రస్తావనకు వచ్చింది. మరోవైపు తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా అడ్వాణీ బ్లాగ్‌ను స్వాగతించడం గమనార్హం. సీనియర్ నేతలిద్దరికీ టికెట్లు నిరాకరించడంపై ఆర్ఎస్ఎస్ ముందస్తు హెచ్చరికలు జారీ చేసినా.. వారిని గౌరవప్రదంగా సాగనంపడంలో మోదీ – షా విఫలమయ్యారని విశ్లేషకులు అంటున్నారు. -
ఎన్డీయేలో ముసలం : అద్వాణీని కలిసిన మోదీ
న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వాణీ(90)ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు కలిసినట్లు రిపోర్టులు వస్తున్నాయి. జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) నుంచి ప్రాంతీయ రాజకీయ పార్టీలు వైదొలగడంపై చర్చించినట్లు పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆనంద్‌బజార్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఢిల్లీలోని పృథ్వీరాజ్ రోడ్డులోని ఆయన నివాసానికి వెళ్లిన మోదీ, షాలు తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఎన్డీయేను విడటం, మహారాష్ట్రలో శివసేన, బీహార్ జనతా దళ్ యునైటెడ్(జేడీయూ)లు ఎన్డీయేపై అసంతృప్తితో ఉండటాన్ని చర్చించినట్లు ఆనంద్ బజార్ పేర్కొంది. అంతేకాకుండా ప్రతిపక్షాలన్నీ ఏకమై ఉప ఎన్నికల్లో ఎన్డీయేను ఓడించటంపై కూడా అద్వాణీతో చర్చించిన మోదీ, షాలు అద్వాణీ, మురళీ మనోహర్ జోషీలను 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయమని కోరినట్లు వెల్లడించింది. -
బాబ్రీ విధ్వంసంపై నేడు సుప్రీం విచారణ
-
బాబ్రీ విధ్వంసంపై నేడు సుప్రీం విచారణ
న్యూఢిల్లీ: బీజేపీ నేతలు అడ్వాణీ, ఉమాభారతి, మురళీ మనోహర్ జోషి నిందితులుగా ఉన్న బాబ్రీ మసీదు విధ్వంసం కేసుపై గురువారం సుప్రీం కోర్టు విచారణ జరపనుంది. తన నేతృత్వంలోని బెంచ్ దీన్ని విచారిస్తుందని జస్టిస్ పీసీ ఘోష్ బుధవారం తెలిపారు. అంతకుముందు.. ఈ కేసుకు సంబంధించి నివేదిక ఇవ్వడానికి వారం రోజుల గడవు కావాలని దివంగత పిటిషనర్ హాజీ మహబూబ్ అహ్మద్ తరపు న్యాయవాది కోరారు. వారే అడ్డుపడుతున్నారు.. స్వామి: అయోధ్యలో రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదాస్పద అంశంపై పరిష్కారానికి ముస్లిం సంస్థలు అడ్డంకులు సృష్టిస్తున్నాయని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి ఆరోపణలు చేశారు. మంగళవారం ఓ టీవీ చానల్ చర్చావేదికలో పాల్గొన్న ముస్లిం పార్టీలు.. అయోధ్య అంశాన్ని కోర్టు బయటే తేల్చుకోవాలన్న సుప్రీం సూచనలనుద్దేశించి ఇదో టైం వేస్ట్ కార్యక్రమంగా పేర్కొన్నాయని..సుప్రీం కోర్టు దీన్ని తప్పనిసరిగా వినాలని ఆయన అన్నారు. -
అడ్వాణీ మెడకు మళ్లీ బాబ్రీ ఉచ్చు
-
అడ్వాణీ మెడకు మళ్లీ బాబ్రీ ఉచ్చు
► సాంకేతిక కారణాలతో కేసు తొలగింపును అంగీకరించం: సుప్రీంకోర్టు ► అదనపు చార్జిషీట్ సమర్పణకు అనుమతి న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఎల్కే అడ్వాణీ, ఇతరులపై కేవలం సాంకేతిక కారణాలతో కేసులు తొలగించేందుకు అంగీకరించబోమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. వారిపై నమోదైన కుట్ర ఆరోపణలపై అవసరమైతే విచారణ ఎదుర్కొవాల్సి ఉంటుందని తెలిపింది. అడ్వాణీతోపాటు మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతి, ఇతరులపై కేసు ఉపసంహరణకు సంబంధించి వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం నమోదైన రెండు ఎఫ్ఐఆర్లను సంయుక్తంగా విచారించాలని ట్రయల్ కోర్టును ఆదేశిస్తామని జస్టిస్ పీసీ ఘోష్, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ‘కేవలం సాంకేతిక కారణాలతో 13 మందిని కేసు నుంచి విముక్తి చేసేందుకు అంగీకరించబోం. అలాగే అదనపు చారి్జషీటు సమర్పించేందుకు అనుమతిస్తున్నాం’ అని వెల్లడించింది. అనంతరం విచారణను కోర్టు ఈనెల 22కు వాయిదా వేసింది. అడ్వాణీ తరఫు న్యాయవాది కోర్టు వ్యాఖ్యలతో విభేదిస్తూ... రెండు కేసుల్లో వివిధ రకాల వ్యక్తులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, వారిపై విచారణ చివరి దశలో ఉందని, మళ్లీ ఇప్పడు ఉమ్మడి విచారణ చేస్తే మళ్లీ మొదటికొస్తుందని వాదించారు. 1992లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి అ డ్వాణీ సహా 13 మందిపై అభియోగాల్ని ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. కింది కోర్టు తీర్పును అలహాబాదు హైకోర్టు సమర్థించగా... సీబీఐ సుప్రీంను ఆశ్రయించింది. కరసేవకులపై నమోదైన మరో కేసు లక్నో కోర్టు విచారణలో ఉంది. -
రాష్ట్రపతి అభ్యర్ధిరేసులో కురువృద్ధుడు!
కురువృద్ధుడు, భారతీయ జనతా పార్టీ(బీజేపీ) లీడర్ మురళీ మనోహర్ జోషి రాష్ట్రపతి భవన్ కు వెళ్లాలనే యోచనలో ఉన్నారా? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలు ఈ విషయాన్నే చెప్తున్నాయి. పార్టీ తరఫు నుంచి రాష్ట్రపతి అభ్యర్ధిత్వానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్), బీజేపీ నాయకుల మద్దతు కోసం ఇప్పటికే లాబీయింగ్ ను మొదలుపెట్టారు. వచ్చే ఏడాది ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ముగియనుండటంతో కొత్త రాష్ట్రపతికి ఎన్నికలు జరగనున్నాయి. ఎలాగైనా బీజేపీ తరఫు నుంచి రాష్ట్రపతి అభ్యర్ధిగా తనను నిర్ణయించడంపై ఇప్పటికే ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, కొంతమంది సంఘ్ నాయకులను కలిసి చర్చించినట్లు సమాచారం. కాగా, ఆర్ఎస్ఎస్ కు చెందిన దేవేంద్ర స్వరూప్ ఇప్పటికే జోషికి అభ్యర్ధిత్వం పట్ల సుముఖతను వ్యక్తం చేశారు. ఇందిరా గాంధీ జాతీయ ఆర్ట్స్ కేంద్రం అధ్యక్షుడు రామ్ బహదూర్ రాయ్ కూడా జోషికి తన సపోర్టును ప్రకటించారు. Murli Manohar Joshi, joins, next President of India race, మురళీ మనోహర్ జోషి, లాబీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎన్నికలు, అభ్యర్థిత్వం -
మురళీ మనోహర్ జోషికి సుప్రీంకోర్టు నోటీసులు
-
అద్వానీ, మురళీ మనోహర్ ఔట్
* బీజేపీ పార్లమెంటరీ బోర్డు పునర్వ్యవస్థీకరణ * శివ్‌రాజ్‌సింగ్ చౌహాన్, జేపీ నడ్డాలకు చోటు * బీజేపీలో అద్వానీ శకం ముగిసినట్లే! సాక్షి, న్యూఢిల్లీ: కాషాయ దళంలో కొత్త తరం బాధ్యతల స్వీకారం పరిపూర్ణమైంది. నాలుగు దశాబ్దాలుగా పార్టీపై చెరగని ముద్ర వేసిన ‘త్రిమూర్తులు’కు విశ్రాంతి కల్పించారు. బీజేపీలో అత్యున్నత నిర్ణాయక విభాగమైన పార్లమెంటరీ బోర్డులో అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్జోషిలను తప్పించారు. పార్టీని అన్నీ తానే అయి నడిపించిన లాల్ కృష్ణ అద్వానీ శకం బీజేపీలో దాదాపుగా ముగిసినట్లే అయింది. 1980 నుంచి పార్టీకి రెండు కళ్లుగా వ్యవహరించిన ఇద్దరిలో వాజ్‌పేయి కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో క్రియాశీల రాజకీయాలకు దూరమైతే.. రామ రథయాత్రతో బీజేపీకి వైభవాన్ని తెచ్చిపెట్టిన అద్వానీ క్రమంగా కనుమరుగు కాక తప్పని పరిస్థితి ఏర్పడింది. వీరిద్దరికీ తోడుగా పార్టీని ప్రభావితం చేసిన మురళీమనోహర్ జోషీకీ ‘విశ్రాంతి’ తప్పలేదు. నూతన కమల దళపతి అమిత్‌షా నేతృత్వంలో 12 మందితో పార్టీ విధాన నిర్ణాయక పార్లమెంటరీ బోర్డు ఏర్పడింది. దీంతో పాటు కేంద్ర ఎన్నికల కమిటీలను పునర్వ్యవస్థీకరించారు. మంగళవారం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ వివరాలను వెల్లడించారు. అయితే విశ్రాంతినిచ్చిన ఈ ముగ్గురు నేతల సేవలను వినియోగించుకోడానికి కొత్తగా ఓ మార్గదర్శక మండలిని ఏర్పాటు చేసి మమ అనిపించారు. ఐదుగురు సభ్యులుండే ‘మార్గదర్శక్ మండల్’లో వీరికి స్థానం కల్పించారు. పార్టీ కి సలహాలివ్వటం ఈ మండలి పని. ఈ ముగ్గురితో పాటు మోడీ, రాజ్నాథ్లూ ఈ మండలిలో సభ్యులుగా ఉంటారు. మూడుసార్లు రాష్ట్రంలో పార్టీని అధికారంవైపు నడిపించిన మధ్యప్రదేశ్ సీఎం శివ్‌రాజ్‌సింగ్ చౌహాన్, ప్రధాన కార్యదర్శి జేపీ నడ్డాలకు కొత్తగా పార్టీపార్లమెంటరీ బోర్డులో చోటు దక్కింది. పార్టీ అగ్రనేతలు, ప్రధాని నరేంద్రమోడీతో చర్చించిన అనంతరం కమళదళం నూతన సారథి అమిత్ షా ఈ మార్పులు చేపట్టారు. ప్రతి విభాగంలోనూ ప్రధాని మోడీ ముద్ర స్పష్టంగా కనిపించింది. - అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్ధులను ఖరారు చేసే పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీని 15 మందికి కుదించారు. - రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో కేంద్ర ఎన్నికల కమిటీలో సభ్యుల సంఖ్య 19 ఉండగా, కొత్త అధ్యక్షుడు అమిత్‌షా సభ్యుల సంఖ్యను 15కు పరిమితం చేశారు. - బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా విజయ రాహత్కర్ నియమితులయ్యారు. - కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓర్నంకు 15 మంది సభ్యులు ఉండే పార్టీ ఎన్నికల కమిటీలో చోటు కల్పించారు. ఈ కమిటీ నుంచి యూపీ నేత వినయ్ కతియార్‌ను తప్పించారు. పార్లమెంటరీ బోర్డు అమిత్ షా, నరేంద్రమోడీ, రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్‌జైట్లీ, సుష్మా స్వరాజ్, వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కారీ, అనంత్‌కుమార్, థావర్‌చంద్ గెహ్లాట్, శివరాజ్‌సింగ్ చౌహాన్, జగత్ ప్రకాష్ నడ్డా, రామ్‌లాల్ మార్గదర్శక మండలి ఏబీ వాజ్‌పేయి, ఎల్కే అద్వానీ, మురళీమనోహర్జోషి, నరేంద్రమోడీ, రాజ్‌నాథ్‌సింగ్ పార్టీ ఎన్నికల కమిటీ అమిత్ షా (అధ్యక్షుడు), నరేంద్ర మోడీ, రాజ్‌నాథ్ సింగ్, అరుణ్‌జైట్లీ, సుష్మా స్వరాజ్, వెంకయ్య, నితిన్ గడ్కారీ, అనంత్‌కుమార్, థావర్‌చంద్ గెహ్లాట్, శివరాజ్ సింగ్ చౌహాన్, జగత్ ప్రకాశ్ నడ్డా, రామ్‌లాల్, జూయల్ ఓరం, షానవాజ్ హుస్సేన్, విజయ రహాట్కర్ -
అద్వానీ, జోషిలకు మోడీ ఝలక్
-
అద్వానీ, జోషిలకు మోడీ ఝలక్
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నాయకులు ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలకు నరేంద్ర మోడీ ఝలక్ ఇచ్చారు. పార్టీలో అత్యున్నత నిర్ణాయక మండలి బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి అద్వానీ, జోషీలకు ఉద్వాసనకు పలికారు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నుంచి కూడా వృద్ధ నేతలను తప్పించారు. వీరి స్థానంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్, ప్రధాన కార్యదర్శి జేపీ నద్దాలను తీసుకున్నారు. అయితే కొత్తగా మార్గదర్శక మండలి ఏర్పాటు చేయనున్నట్టు బీజేపీ ప్రకటించింది. ఇందులో అద్వానీ, జోషీలకు స్థానం కల్పించారు. వీరితో పాటు వాజపేయి, రాజ్‌నాథ్ సింగ్, నరేంద్ర మోడీ కూడా ఉంటారని బీజేపీ వెల్లడించింది. పార్లమెంటరీ బోర్డు పునర్వ్యస్థీకరణతో పార్టీపై నరేంద్ర మోడీ పూర్తి పట్టు సాధించినట్టయింది. ఇంతకుముందే తన సన్నిహితుడు అమిత్ షాకు బీజేపీ అధ్యక్ష పీఠంపై కూర్చుబెట్టిన మోడీ ఇప్పుడు తనతో అంటిముట్టనట్టుగా వ్యవరిస్తున్న కురువృద్ధులను పార్లమెంటరీ బోర్డు నుంచి సాగనంపారు. -
మోడీ గాలి లేదు: జోషి
న్యూఢిల్లీ: సొంత పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిపైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి. దేశంలో నరేంద్ర మోడీ గాలి లేదని, ప్రస్తుతం వీస్తున్నదల్లా బీజేపీ గాలి మాత్రమే అని చెప్పారు. బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉన్న జోషి గుజరాత్ నమూనా అభివృద్ధి అన్ని రాష్ట్రాలకూ సరిపడదన్నారు. ఒక రాష్ట్రానికి చెందిన అభివృద్ధి నమూనాను తాను ప్రోత్సహించబోనని, వివిధ రాష్ట్రాల్లోని మంచి అంశాలను తీసుకుని అభివృద్ధి నమూనాను రూపొందించాలని ఆయన అభిప్రాయపడ్డారు. నరేంద్రమోడీ కోసం తన వారణాసి స్థానాన్ని మురళీ మనోహర్ జోషి వదులుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం ఆయన మనోరమా న్యూస్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జోషి తాజా వ్యాఖ్యలతో బీజేపీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. -
మురళీ మనోహర్ జోషీకి అవమానం
కాన్పూర్ ఎంపీ ఎన్నికల్లో పాల్గొంటున్న బిజెపి వృద్ధ నేత మురళీ మనోహర్ జోషీకి సోమవారం సొంత పార్టీ సమావేశంలోనే అవమానం జరిగింది. ఆయన్ను సొంత పార్టీ నేతలే అవమానించారు. బిజెపి భీష్ముల్లో ఒకరైన జోషీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. కాన్పూర్ లో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన కూర్చుని ప్రసంగిస్తూండగా, మాజీ కార్పొరేటర్ వికాస్ జైస్వాల్ 'ఎంత కాలం కూచుంటారు. కాస్త లేచి నిలబడండి. కార్యకర్తలకు మర్యాదనివ్వండి' అంటూ బిగ్గరగా అరిచారు. ఖంగుతిన్న జోషీ స్పందించేలోపు జైస్వాల్ నినాదాలివ్వడం మొదలుపెట్టాడు. ఆయన అనుచరులు కూడా గొంతు కలపడంతో కార్యక్రమం రసాభాస అయింది. చివరికి పార్టీ జిల్లా అధ్యక్షుడు జైస్వాల్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసేదాకా ఈ గొడవ సాగింది. ఆ తరువాత కూడా జైస్వాల్ శాంతించలేదు. ఆయన, ఆయన అనుచరులు కలిసి మురళీ మనోహర్ జోషీ దిష్టిబొమ్మను దహనం చేశారు. వారణాసిలో పోటీచేయాలని భావించిన జోషీని బిజెపి కాన్పూర్ లో పోటీ చేసేలా ఒప్పించింది. అయితే కాన్పూర్ లో ఇప్పుడు పరిస్థితులు ఆయనకు ఇబ్బందికరంగా మారాయి. -
సుష్మ వర్సెస్ జైట్లీ
సుష్మ అరుణ్ జైట్లీ బిజెపిలో అయిదున్నర దశాబ్దాల అనుభవం చురుకైన నేత, యువకుడు, సమస్యలను త్వరగా అర్థం చేసుకుంటారు అద్వానీకి అత్యంత సన్నిహితురాలు నరేంద్ర మోడీకి మొదట్నుంచీ గట్టి మద్దతుదారు, గుజరాత్ వ్యవహారాల ఇన్చార్జి గా అనుభవం మంత్రిగా పనిచేసిన అనుభవం మొదట్నుంచీ రాజ్యసభ రూటే అమెది మొదట్నుంచీ లోకసభ రూటు కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టడంలో వెనకాడరు కాంగ్రెస్ తో సాన్నిహిత్యం, మెతక వైఖరి అవలంబిస్తుందన్న ఆరోపణ రాజ్యసభలో సీమాంధ్ర హక్కులపై పోరు తెలంగాణ చర్చను రసాభాస చేసిన ఆరోపణ మద్దతుదార్లు - అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, షానవాజ్ హుసేన్ మద్దతుదార్లు - నరేంద్ర మోడీ, అమిత్ షా, వసుంధరా రాజే బిజెపిలో ప్రధాని ఎవరన్న చర్చ ముగిసింది. ఇప్పుడు ఉప ప్రధాని ఎవరన్న రచ్చ మొదలైంది. బిజెపిలో ఇప్పుడు దీనిపై అంతర్గతంగా భారీ చర్చే జరుగుతోంది. అసలు సమస్యంతా అకాలీ నేత, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ తో మొదలైంది. అమృత్ సర్ నుంచి లోకసభ ఎన్నికల బరిలోకి దిగుతున్న అరుణ్ జైట్లీకి మద్దతుగా ప్రచారం చేస్తూ ఒక సభలో బాదల్ 'మీరు అరుణ్ జైట్లీకి ఓటేస్తే ఉప ప్రధానమంత్రికి ఓటేసినట్టే' అని అన్నారు. అంతే! రచ్చ మొదలైంది. 'నేను ఉపప్రధాని అభ్యర్థిని కాను' అని జైట్లీ స్వయంగా ప్రకటించినా ఫలితం లేకపోయింది. మరో వైపు మధ్యప్రదేశ్ లో సీనియర్ బిజెపి నేత, మాజీ ముఖ్యమంత్రి సుందర్ లాల్ పట్వా కుమారుడు సురేంద్ర పట్వా తమ రాష్ట్రంలోని విదిశ నుంచి పోటీ చేస్తున్న సుష్మా స్వరాజ్ ఉప ప్రధాని అని ప్రకటించారు. బిజెపి సీనియర్ నేతల్లో నరేంద్ర మోడీని బహిరంగంగా వ్యతిరేకిస్తున్నది ఒక్క సుష్మా స్వరాజే. ఆమె నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పుడు అంత అనుకూలంగా మాట్లాడలేదు. బళ్లారి నుంచి వివాదాస్పద నేత బీ శ్రీరాములుకి టికెట్ ఇవ్వడాన్ని ఆమె వ్యతిరేకించారు. అలాగే జస్వంత్ సింగ్ కు బార్మేర్ టికెట్ ఇవ్వకపోవడాన్నీ నిరసించారు. ఆమె తన సభల్లో ఎక్కడా మోడీ పేరు ప్రస్తావించరు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పనితీరును మాత్రం బాగా ప్రశంసిస్తారు. బిజెపిలో ఒక వర్గం మోడీకి పగ్గాలు వేసేందుకు ఉప ప్రధానిగా సుష్మా ఉంటే బాగుంటుందని భావిస్తున్నారు. అలాంటి వారిలో అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, షానవాజ్ హుసేన్ లు ఉన్నారు. ఇటీవలే బిజెపికి మద్దతుదారు, మోడీ అభిమాని అయిన ఫెమినిస్టు జర్నలిస్టు మధు కిష్వర్ బిజెపిలో ఒక వర్గం బిజెపికి 160 సీట్లు మాత్రమే రావాలని కోరుకుంటున్నారని సంచలన ప్రకటన చేశారు. బిజెపికి తక్కువ సీట్లు వస్తే ఎన్డీయే మిత్ర పక్షాల బలం పెరుగుతుందని, వారు మోడీకి బదులు మరొకరు పీఎం కావాలని కోరవచ్చునని వారు ఆశిస్తున్నారు. ఇలాంటి వర్గానికి ఆమె క్లబ్ 160 అని పేరు పెట్టారు. బిజెపికి సొంతంగా 180 నుంచి 200 సీట్లు వస్తే మోడీకి పట్టపగ్గాలుండవని క్లబ్్ 160 భయపడుతోందని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఉప ప్రధాని ఎవరన్న విషయంలో చర్చను మొదలుపెట్టారని వార్తలు వినవస్తున్నాయి. -
రాజకీయాల్లోకి రావడమే నేను చేసిన పాపం!
బెంగళూర్:బీజేపీలో రాజుకున్న వారణాసి లోక్ సభ సీటు అంశం కొలిక్కి వచ్చినట్లు కనిపించినా ఇంకా పూర్తిగా మాత్రం సమసిపోలేదు. నరేంద్ర మోడీ వారణాసి నుంచి పోటీకి దిగుతారనే వార్తల నేపథ్యంలో ఆ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మురళీ మనోహర్ జోషీకి అసహనం కల్గిస్తోంది. ఆ స్థానం నుంచి మోడీ పోటీ చేస్తారా?లేదా? అనేది ఇంకా తేలాల్సి ఉండగానే..జోషీ మాత్రం తీవ్ర నిరాశకు లోనైయ్యారు. ఈ రోజు ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన జోషీ తాను అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. అక్కడితో ఆగకుండా రాజకీయాల్లోకి రావడమే తాను చేసిన పాపమని జోషీ పేర్కొన్నారు. వారణాశి నుంచి బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషీ ప్రాతినిధ్యం వహిస్తున్నక్రమంలో నరేంద్ర మోడీ ఇక్కడి నుంచి లోక్‌సభకు పోటీ చేస్తారనే వార్తలు రావడంతో జోషీ అలకబూనారు. దీనికి తోడు బీజేపీ విడుదల చేసిన లోక్‌సభ అభ్యర్థుల రెండు జాబితాల్లో జోషీ పేరు లేకపోవడంతో ఆయనకు మరింత ఆగ్రహం తెప్పించింది. వారణాశి అభ్యర్థి ఎవరన్న విషయం బీజేపీలో విభేదాలకు దారితీసింది. ఆర్ఎస్ఎస్ జోక్యం చేసుకుంటే ఇదేమంత పెద్ద సమస్య కాబోదు. పైగా మోడీ, జోషీలిద్దరూ ఆర్ఎస్ఎస్కు అత్యంత ప్రీతిపాత్రులు. వారణాశి సీటు కోసం మోడీ, జోషీ పోటీపడుతున్నట్టు వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆర్ఎస్ఎస్ గత రెండు రోజుల క్రితం తెలిపింది. ఈ సమస్యకు ఫుల్ స్టాప్ తప్పక పడుతుందని ఆర్ఎస్ఎస్ భావిస్తోంది.కాగా , గుజరాత్ రాష్ట్రంలోని లోక్ సభ సీటు నుంచి మాత్రమే పోటీ చేస్తారని బీజేపీ పార్లమెంటరీ బోర్డు శుక్రవారం తెలిపింది. దీంతో ఈ సమస్యకు ప్రస్తుతానికి తెరపడినా..జోషీ మాత్రం రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై అసంతృప్తిగా ఉన్నారు. -
షిండే తీరును తప్పుబట్టిన బీజేపీ
లక్నో/న్యూఢిల్లీ: పాట్నా వరుస బాంబు పేలుళ్లు జరిగిన వెంటనే కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే బాలీవుడ్ సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి హాజరవడాన్ని ప్రతిపక్ష బీజేపీ తప్పుబట్టింది. పరిపాలనను నిర్లక్ష్యం చేయడం కేంద్ర మంత్రులకు అలవాటుగా మారిందని బీజేపీ సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషి విమర్శించారు. పేలుళ్లు జరిగిన ప్రాంతాన్ని షిండే పరిశీలిస్తారని అనుకున్నామని, కానీ ఆయన సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి హాజరయ్యారని తెలిపారు. అంతేకాకుండా ఆలస్యంగా కార్యక్రమానికి వచ్చినందుకు క్షమాపణ చెప్పారని వెల్లడించారు. 26/11 దాడులు జరిగినప్పుడు అప్పటి కేంద్ర హోంమంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరించారని బీజేపీ అధికార ప్రతినిధి సిద్దార్థనాథ్ సింగ్ ఢిల్లీలో అన్నారు. షిండే కూడా ఇప్పుడు ఇదే దారిలో పయనిస్తున్నారని విమర్శించారు. బాధితులను పరామర్శించడం మాని పంక్షన్లకు వెళతారా అంటూ ధ్వజమెత్తారు. -
మురళీ మనోహర్ జోషి పనిమనిషి ఆత్మహత్య
భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషి ఇంట్లో పనిచేసే ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ నగరానికి చెందిన జీవన్ (25) జోషి ఇంట్లో పని చేస్తుంటాడు. అతడు శుక్రవారం నాడు జోషి ఇంట్లోని సర్వెంట్ క్వార్టర్స్‌లో గల కిటికీకి ఉరేసుకుని చనిపోయాడు. అతడు రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తానేం చేస్తున్నానో తనకే తెలియదని అందులో అతడు రాసినట్లు పోలీసులు తెలిపారు. గత రెండేళ్లుగా జోషి ఇంట్లో జీవన్ పనిచేస్తున్నాడు.