
బాబ్రీ విధ్వంసంపై నేడు సుప్రీం విచారణ
న్యూఢిల్లీ: బీజేపీ నేతలు అడ్వాణీ, ఉమాభారతి, మురళీ మనోహర్ జోషి నిందితులుగా ఉన్న బాబ్రీ మసీదు విధ్వంసం కేసుపై గురువారం సుప్రీం కోర్టు విచారణ జరపనుంది. తన నేతృత్వంలోని బెంచ్ దీన్ని విచారిస్తుందని జస్టిస్ పీసీ ఘోష్ బుధవారం తెలిపారు. అంతకుముందు.. ఈ కేసుకు సంబంధించి నివేదిక ఇవ్వడానికి వారం రోజుల గడవు కావాలని దివంగత పిటిషనర్ హాజీ మహబూబ్ అహ్మద్ తరపు న్యాయవాది కోరారు.
వారే అడ్డుపడుతున్నారు.. స్వామి: అయోధ్యలో రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదాస్పద అంశంపై పరిష్కారానికి ముస్లిం సంస్థలు అడ్డంకులు సృష్టిస్తున్నాయని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి ఆరోపణలు చేశారు. మంగళవారం ఓ టీవీ చానల్ చర్చావేదికలో పాల్గొన్న ముస్లిం పార్టీలు.. అయోధ్య అంశాన్ని కోర్టు బయటే తేల్చుకోవాలన్న సుప్రీం సూచనలనుద్దేశించి ఇదో టైం వేస్ట్ కార్యక్రమంగా పేర్కొన్నాయని..సుప్రీం కోర్టు దీన్ని తప్పనిసరిగా వినాలని ఆయన అన్నారు.