Babri demolition case
-
అయోధ్య కేసు విచారణకు తొలగిన అడ్డంకులు
-
1994 తీర్పుపై పునఃసమీక్షకు నో
న్యూఢిల్లీ: అయోధ్య రామమందిరం కేసు విషయంలో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. 1994 నాటి ఇస్మాయిల్ ఫారుఖీ కేసును విస్తృత ధర్మాసనానికి ఇచ్చేందుకు నిరాకరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం 2:1 మెజారిటీతో గురువారం ఈ తీర్పు చెప్పింది. ఇస్లాం ప్రకారం ప్రార్థనలు చేసేందుకు మసీదు తప్పనిసరి కాదు అని 1994 నాటి తీర్పుపై పునఃవిచారణ జరగదని స్పష్టం చేసింది. ధర్మాసనంలోని సీజేఐ, జస్టిస్ అశోక్ భూషణ్‌లు ఇందుకు మద్దతుగా తీర్పునివ్వగా మరో న్యాయమూర్తి అబ్దుల్ నజీర్ విభేదించారు. పునఃసమీక్ష జరగాల్సిందేనన్నారు. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో.. అత్యంత సున్నితమైన అయోధ్య కేసు విచారణ వేగవంతం అవడానికి మార్గం సుగమమైంది. అక్టోబర్ 29 నుంచి ఈ కేసులో రోజువారీ విచారణ జరగనుంది. తీర్పుతో బీజేపీ, ఆరెస్సెస్ హర్షం వ్యక్తం చేశాయి. అయోధ్య కేసులోనూ త్వరలో తీర్పు వెలువడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాయి. అటు కాంగ్రెస్ పార్టీ ఆచితూచి స్పందించింది. కోర్టు తీర్పును ఆమోదించాల్సిందేనని పేర్కొంది. ఇది భూసేకరణ వివాదమే 1994లో ఇస్మాయిల్ ఫారూఖీ కేసులో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ ఎం సిద్దిఖీ సుప్రీంను ఆశ్రయించారు. భూ వివాదంలో హైకోర్టు తీర్పును సుప్రీం నిర్ణయం ప్రభావితం చేసిందన్నారు. ఇస్లాం సంప్రదాయం ప్రకారం ప్రార్థనల కోసం మసీదు ముఖ్యమైన ప్రదేశమేమీ కాదనడంపై పునఃసమీక్ష చేయాలని కోరారు. అయోధ్య కేసులోని ప్రధాన కక్షిదారుల్లో ఒకరైన సిద్దిఖీ చనిపోయినా ఆయన వారసులు ఈ కేసును సుప్రీంకోర్టుకు నివేదించారు. దీన్ని 2:1తో ధర్మాసనం తిరస్కరించింది. ‘ఇస్మాయిల్ ఫారుఖీ కేసులో లెవనెత్తిన అంశాలన్నీ భూ సేకరణకు సంబంధించినవేనని పునరుద్ఘాటిస్తున్నాం. అయోధ్య కేసులో విచారణకు సంబంధించి ఇస్మాయిల్ ఫారుఖీ కేసులో పరిగణనలోకి తీసుకున్న అంశాల ప్రభావమేమీ ఉండదు’ అని జస్టిస్ అశోక్ భూషణ్ తమ (సీజేఐతో కలుపుకుని) నిర్ణయాన్ని వెలువరించారు. అయోధ్యలో నెలకొన్న సివిల్ భూ వివాదాన్ని కొత్తగా ఏర్పాటుచేయబోయే ముగ్గురు సభ్యుల బెంచ్ అక్టోబర్ 29 నుంచి విచారిస్తుందన్నారు. అక్టోబర్ 2న ప్రస్తుత సీజేఐ మిశ్రా రిటైర్‌కానున్నారు. 2010లో అలహాబాద్ హైకోర్టు వివాదాస్పద రామజన్మభూమి–బాబ్రీ మసీదు స్థలాన్ని మూడు భాగాలుగా విడగొడుతూ తీర్పు నివ్వడాన్ని సవాల్ చేయడంపైనా కోర్టు వ్యాఖ్యానించింది. మొత్తం 2.77 ఎకరాల స్థలాన్ని మూడు సమాన భాగాలుగా విభజించి.. సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మొహి అఖాడా, రామ్ లల్లాలకు పంచాలని ఆదేశించింది. ప్రభుత్వం అన్ని మతాలను సమదృష్టితో చూడాలని సూచించింది. కాగా దేశానికి మేలు చేసేందుకు అయోధ్య విషయాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అభిప్రాయపడ్డారు. స్వాగతించిన ఆరెస్సెస్ విస్తృత ధర్మాసనానికి అయోధ్య కేసును బదిలీ చేయబోమంటూ సుప్రీం ఇచ్చిన తీర్పును రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) స్వాగతించింది. ఈ వివాదంతో వీలైనంత త్వరగా తీర్పు వచ్చే అవకాశాలున్నాయని విశ్వాసం వ్యక్తం చేసింది. ‘అక్టోబర్ 29 నుంచి ముగ్గురు సభ్యుల ధర్మాసనం శ్రీరామజన్మభూమి కేసును విచారిస్తామని గురువారం సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం. వీలైనంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే విశ్వాసం వచ్చింది’ అని ఓ ప్రకటనలో ఆరెస్సెస్ పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ ఈ వివాదాన్ని మరింతకాలం కొనసాగించాలని చూస్తోందని.. అందుకే త్వరగా నిర్ణయం వెలువడకుండా (2019 ఎన్నికల తర్వాత ఈ వివాదంపై తీర్పు వెలువరించాలన్న కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ పిటిషన్‌ను ప్రస్తావిస్తూ) కుట్ర పన్నిందని ఆరెస్సెస్ నేత ఇంద్రేష్ కుమార్ ఆరోపించారు. పాకిస్తాన్ ఏజెంట్‌గా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందన్నారు. ఇకపై వీరి ప్రయత్నాలేవీ సఫలం కాబోవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తీర్పుకు కట్టుబడే: కాంగ్రెస్ గురువారం నాటి కోర్టు తీర్పుకు అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. ఈ తీర్పుతో అయోధ్య అసలు వివాదంపై విచారణను వేగవంతం చేసేందుకు మార్గం సుగమమైందని పేర్కొంది. ఇన్నాళ్లూ రామమందిరం పేరుతో బీజేపీ దేశ ప్రజలను మోసం చేస్తూ వస్తోందని.. కాంగ్రెస్ నేత ప్రియాంక చతుర్వేది విమర్శించారు. రామమందిర వివాదాన్ని పరిష్కరించడంలో బీజేపీ పాత్ర లేశమాత్రమైనా లేదన్నారు. రామమందిరంపై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుకు కట్టుబడి ఉంటామని కాంగ్రెస్ పార్టీ మొదట్నుంచీ చెబుతోందని.. ఆచరణలోనూ కట్టుబడి ఉంటామని ఆమె పేర్కొన్నారు. అసలు విచారణ ఇకపైనే.. రామజన్మభూమి – బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని.. అది తమకు అనుకూలంగానే ఉందని ఈ కేసులో కక్షిదారులుగా ఉన్న ముస్లింలు పేర్కొన్నారు. ‘ఇస్లాంలో మసీదు అంతర్గత భాగం కాదనే విషయాన్ని 1994లోనే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో మాకు సంబంధం లేదు. ఇప్పుడు కేసు పూర్తిగా రామజన్మభూమి–బాబ్రీ మసీదు మధ్య స్థల వివాదంపైనే ఉందని సుప్రీం స్పష్టం చేసింది. ఇది సంతోషదాయకం’ అని మౌలానా మహ్ఫుజూర్ రహమాన్ తరపున నామినీగా ఉన్న ఖాలిక్ అహ్మద్ ఖాన్ పేర్కొన్నారు. ‘ఇకపై అయోధ్య–బాబ్రీ కేసు విచారణ మత విశ్వాసాలపై కాకుండా భూ యాజమాన్య హక్కుదారు, యోగ్యత ఆధారంగానే కొనసాగుతుందని సుప్రీంకోర్టు పేర్కొనడం హర్షదాయకం. రెవెన్యూ రికార్డుల ఆధారంగా బాబ్రీ స్థల వివాదంలో మా వాదనలు వినిపిస్తాం. ఏ మందిరాన్నీ ధ్వంసం చేయకుండానే బాబ్రీ మసీదును నిర్మించారనేది మా విశ్వాసం’ అని సున్నీ వక్ఫ్ బోర్డు తరపున కక్షిదారుగా ఉన్న ఇక్బాల్ అన్సారీ తెలిపారు. మిగిలిన కక్షిదారులు కూడా కోర్టు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. అయోధ్య–బాబ్రీ వివాదమేంటి? భారత్‌లో ఐదు దశాబ్దాలుగా హిందు–ముస్లింల మధ్య ఘర్షణకు అయోధ్య–బాబ్రీ మసీదు వివాదం కారణమవుతోంది. తమ ఆరాధ్య దైవమైన శ్రీరాముడు జన్మించిన పవిత్రస్థలంలో మందిర నిర్మాణం జరగాలని హిందువులు డిమాండ్ చేస్తున్నారు. 2.77 ఎకరాల స్థలంలో భవ్యంగా మందిర నిర్మాణం జరగాలని కోరుతున్నారు. అయితే బాబర్ మసీదు నిర్మించిన ఈ స్థలం తమకే చెల్లుతుందని రామమందిర నిర్మాణం జరపడానికి వీల్లేదని ముస్లింలు వాదిస్తున్నారు. రామజన్మభూమిలో ఆయన విగ్రహాలు పెట్టి.. అక్కడ పూజలకు అనుమతించాలంటూ 1950లో గోపాల్ సిమ్లా, పరమహంస రామచంద్రదాస్‌లు ఫైజాబాద్ కోర్టును ఆశ్రయించారు. దీనికితోడు 1992, డిసెంబర్ 6న కరసేవకులు బాబ్రీ మసీదులోని కొంత భాగాన్ని ధ్వంసం చేయడంతో దేశవ్యాప్తంగా ఇరువర్గాల మధ్య వివాదం మరింత ముదిరింది. ఆ తర్వాత పురాతత్వ శాస్త్రవేత్తలు చేపట్టిన తవ్వకాల్లోనూ మసీదు కింద రామమందిరానికి సంబంధించిన ఆనవాళ్లు బయటపడ్డాయి. దీంతో రామమందిర నిర్మాణానికి హిందూ సంఘాలు, వద్దే వద్దంటూ ముస్లింలు పోటాపోటీగా కోర్టులో పిటిషన్లు వేశారు. దీనిపై అక్టోబర్ 29 నుంచి సుప్రీంకోర్టు రోజూవారి విచారణ చేపట్టనుంది. ‘మసీదు’పై పునఃసమీక్ష: జస్టిస్ నజీర్ ‘అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిలు ఆయా వర్గాలకు చాలా ముఖ్యమైనవి’ అని జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ తన తీర్పులో పేర్కొన్నారు. ఇస్లాం సంప్రదాయం ప్రకారం మసీదు అంత ముఖ్యమైన ప్రదేశం కాదని, ముస్లింలు ఎక్కడైనా నమాజ్ చేసుకోవచ్చన్న 1994నాటి ఇస్మాయిల్ ఫారుఖీ కేసుపై పునఃసమీక్ష జరగాలని తన 42 పేజీల తీర్పులో ఆయన చెప్పారు. సమగ్రమైన విచారణ జరపకుండా నాడు తీర్పుచెప్పారన్నారు. రాజ్యాంగ ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని ‘మసీదు’ వ్యాఖ్యలపై విస్తృత ధర్మాసనంతో పునఃసమీక్ష జరపాలన్నారు. తన తీర్పులో 4 ప్రశ్నలు సంధించారు. ‘1954 షిరూర్ మఠ్ కేసులో మత విశ్వాసాలను పరీక్షించకుండానే తీర్పు వెలువరించారా? ఆవశ్యకమైన మత విశ్వాసాన్ని నిర్ధారించేందుకు పరీక్షలు జరగాలా? ఆర్టికల్ 25కింద ఒక మతానికి సంబంధించిన విశ్వాసాలనే కాపాడాలా? అన్ని మతాలకూ వర్తిస్తుందా? ఆర్టికల్ 15, 25, 26 ప్రకారం అన్ని విశ్వాసాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందా?’ అని ప్రశ్నించారు. బహుభార్యత్వం, నిఖాహలాలా, మహిళా జననాంగాల విచ్ఛిత్తి కేసుల్లో తీర్పులను గుర్తుచేశారు. అయోధ్య స్థల వివాద క్రమమిదీ.. ► 1528: బాబర్ సైన్యాధ్యక్షుడు మిర్ బాకీ బాబ్రీ మసీదును నిర్మించాడు. ► 1885: ఈ స్థలంలో రాముడికి చిన్న పైకప్పు కట్టుకునేందుకు అనుమతివ్వాలని మహంత్ రఘువీర్ దాస్ ఫైజాబాద్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు దీన్ని తిరస్కరించింది. ► 1949: వివాదాస్పద స్థలంలో రామ్ లల్లా విగ్రహాల స్థాపన ► 1959: విగ్రహాలకు పూజ చేసేందుకు అనుమతించాలంటూ నిర్మోహి అఖాడా పిటిషన్ ► 1981: ఈ స్థలాన్ని తమకు అప్పగించాలంటూ యూపీ సున్నీ వక్ఫ్ బోర్డు కేసు ► 1986, ఫిబ్రవరి 1: హిందూ భక్తులకు ప్రవేశాన్ని అనుమతిస్తూ స్థానిక కోర్టు తీర్పు ► 1992, డిసెంబర్ 6: బాబ్రీ మసీదు నిర్మాణం పాక్షికంగా ధ్వంసం ► 1994, అక్టోబర్ 24: ఇస్మాయిల్ ఫారుఖీ కేసు విచారణ సందర్భంగా ఇస్లాంలో మసీదు అంతర్భాగం కాదన్న సుప్రీంకోర్టు ► 2003, మార్చి 13: వివాదాస్పద స్థలంలో ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు జరపొద్దని సుప్రీం ఆదేశం, అలహాబాద్ హైకోర్టుకు కేసు బదిలీ. ► 2010, సెప్టెంబర్ 30: నిర్మోహీ అఖాడా, రామ్ లల్లా, సున్నీ వక్ఫ్ బోర్డులకు వివాదాస్పద భూమిని పంచుతూ హైకోర్టు ఆదేశం. ► 2016, ఫిబ్రవరి 26: రామమందిర నిర్మాణానికి అనుమతించాలంటూ సుబ్రమణ్య స్వామి పిటిషన్ ► 2017, మార్చి 21: కక్షిదారులంతా కోర్టు బయట చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని నాటి సీజేఐ జస్టిస్ జేఎస్ ఖేహార్ సూచన ► నవంబర్ 20: అయోధ్యలో మందిరం, లక్నోలో భారీ మసీదు నిర్మాణానికి అంగీకరిస్తున్నట్లు సుప్రీంకోర్టుకు వెల్లడించిన షియా వక్ఫ్ బోర్డు. ► 2018, సెప్టెంబర్ 27: ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి కేసును బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు విముఖత. అక్టోబర్ 29 నుంచి రోజువారీ విచారణ చేపట్టనున్నట్లు వెల్లడి. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం అయోధ్యలో ప్రధాన కక్షిదారులు ఇక్బాల్ అన్సారీ, నిర్మోహి అఖాడా మహంత్ ధరమ్ దాస్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్ -
అయోధ్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
-
అయోధ్యపై సుప్రీం కీలక తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. మసీదులు ఇస్లాంలో అంతర్భాగం కాదని 1994లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించబోమని పేర్కొంది. అయోధ్య భూ యాజమాన్య హక్కులపై ఉన్న కేసును అక్టోబర్ 29 నుంచి త్రిసభ్య ధర్మాసనం విచారిస్తుందని వెల్లడించింది. అయోధ్యలో వివాదాస్పద స్థలాన్ని మూడు భాగాలుగా విభజిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హిందూ, ముస్లిం సంస్థల పిటిషన్లపై గురువారం విచారణ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంది. 2010లో అలహాబాద్ హైకోర్టు వివాదాస్పద స్థలం రామ్‌లల్లా, నిర్మోహి అఖాడా, సున్నీ వక్ఫ్‌బోర్డుకు చెందుతుందని తీర్పు నిచ్చింది. సుప్రీంకోర్టు తాజాగా తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఈ కేసులో గతంలో చోటుచేసుకున్న ముఖ్యమైన పరిణామాలు... = బాబ్రీమసీదు, దాని చుట్టుపక్కల ఉన్న భూమి సేకరణకు సంబంధించి 1994లో సుప్రీంకోర్టు ఓ రూలింగ్ ఇచ్చింది. ఇస్లాం మతాచారాన్ని పాటించడంలో మసీదుకు ముఖ్య భూమికేమి లేదు. నమాజ్‌ను బహిరంగప్రదేశాలతో సహా ఎక్కడైనా నమాజ్‌ను ఆచరించొచ్చునన్నదే ఆ రూలింగ్. = రామజన్మభూమి–బాబ్రీ మసీదు భూయాజమాన్యంకేసులో అయోధ్య భూమిని మూడుభాగాలుగా విభజిస్తూ అలహాబాద్ హైకోర్టు 2010లో రూలింగ్ ఇచ్చింది. ఈ తీర్పునకు వ్యతిరేకంగా అన్ని పక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. = 2010 అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా వచ్చిన పిటిషన్లపై గురువారం ప్రధానన్యాయమూర్తి దీపక్ మిశ్రా బెంచ్ విచారణ సందర్భంగా 1994లో సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ ప్రస్తావనకు వచ్చింది. ఈ రూలింగ్‌పై అభ్యంతరం వ్యక్తంచేస్తూ దీనిని ఐదుగురు జడ్జీల ధర్మాసనం విచారించాల్సిందిగా ముస్లింవర్గాల తరఫువారు వాదించారు. ఈ రూలింగ్ విస్తృత ధర్మాసనానికి నివేదించేందుకు చీఫ్ జస్టిస్ బెంచ్ తిరస్కరించింది. అయోధ్య–బాబ్రీ భూ యాజమాన్య కేసును ఈ రూలింగ్ ప్రభావితం చేయదని స్పష్టంచేసింది. = వివాదస్పదంగా మారిన భూయాజమాన్య కేసు విచారణలో జాప్యానికి 1994లో ఇచ్చిన రూలింగే కారణమనే అభిప్రాయం కొందరిలో ఉంది. ఇప్పుడీ కేసు విచారణ వచ్చేనెల 29న మొదలుకానున్న విషయం తెలిసిందే. 1994 రూలింగ్‌పై ప్రస్తుత సు్రంకోర్టు ఆదేశాలతో అయోధ్య భూవివాద కేసు త్వరితగతిన సాగేందుకు దోహదపడుతుందని భావిస్తున్నారు. వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయంగా ఎవరికి ఉపయోగపడని విధంగా ఈ కేసును సార్వత్రిక ఎన్నికల అనంతరం చేపట్టాల్సిందిగా గత డిసెంబర్లోనే కాంగ్రెస్ నేత, న్యాయవాది కపిల్‌సిబాల్ కోర్టుకు విజ్ఞప్తిచేశారు. -
‘ఆ రోజు కుట్ర ఏమీ జరగలేదు’
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు విధ్వంసానికి సంబంధించి ఎలాంటి కుట్ర జరగలేదని, అదొక బహిరంగ ఉద్యమంలాగా ప్రారంభమై ధ్వంసం వైపు మళ్లిందని కేంద్ర మంత్రి ఉమా భారతీ అన్నారు. ప్రస్తుతం బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో కుట్రపూరిత నేరం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమెకు మంగళవారం బెయిల్ లభించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘ డిసెంబర్ 6, 1992న నేను అయోధ్యలోనే ఉన్నాను. ఇది రహస్యం కాదు. కోట్లమంది బీజేపీ కార్యకర్తలు, లక్షలమంది అధికారులు, వేల మంది రాజకీయ నాయకులు ఆ రోజు పాల్గొన్నారు. దేశంలో అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఎలాంటి ఉద్యమం వచ్చిందో అదే తరహాలో అప్పుడది ఒక బహిరంగ ఉద్యమం. నాకు అందులో ఏ కుట్ర కనిపించలేదు’ అని ఆమె చెప్పారు. -
‘అద్వానీ కాదు నేను.. ఉరికి కూడా రెడీ’
ఫైజాబాద్: ‘అద్వానీకి సంబంధం లేదు.. ఆ రోజు కరసేవకులను రెచ్చగొట్టింది నేను. శిక్ష అనుభవించేందుకు నేను సిద్ధం. ఉరి తీయించుకునేందుకు కూడా రెడీ’ అంటూ బీజేపీ మాజీ ఎంపీ రామ్ విలాస్ వేదాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసుకు సంబంధించి కుట్ర పూరిత నేరం కేసు దర్యాప్తు జరగాల్సిందేనని, అందులో బీజేపీ కురువృద్ధ నేత ఎల్కే అద్వానీ సహా మురళీ మనోహర్ జోషి తదితర సీనియర్ నేతలను చేర్చాల్సిందేనని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రామ్ విలాస్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘బాబ్రీ ఘటనలో అద్వానీ పాత్ర లేదు. ఆ రోజు కూల్చివేత జరుగుతున్నప్పుడు నేను వీహెచ్‌పీ నేత అశోక్ సింఘాల్, మహంత్ అవైద్యనాథ్‌తో ఉన్నాను. కర సేవలకులను రెచ్చగొట్టింది నేను. నేను మరికొందరితో కలిసి ఆ రోజు కరసేవకులను రెచ్చగొడుతుంటే జోషీ, అద్వానీ, విజయ్ రాజే సింధియా మాత్రం పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు, శాంతియుత పరిస్ధితులు నెలకొల్పేందుకు ప్రయత్నించారు’ అని ఆయన చెప్పారు. బాబ్రీ కేసులో ఈయన పేరు కూడా ఉంది. -
విఫల మనో‘రథుడు’
-
కిం కర్తవ్యం?
బాబ్రీ మసీదు కూల్చివేత విషయంలో బుధవారం నాటి సుప్రీంకోర్టు తీర్పు బీజేపీకి ఇబ్బందికరంగా మారింది. కొందరు సీనియర్ల భవిష్యత్తుపైనా నీలినీడలు కమ్ముకొన్నాయి. ప్రధాని కాలేకపోయినా.. కనీసం రాష్ట్రపతి భవన్లోనైనా అడుగుపెట్టాలని ఆశించిన 89 ఏళ్ల బీజేపీ భీష్మపితామహుడు అడ్వాణీని 25 ఏళ్ల కిందటి కేసు వెంటాడుతూనే ఉంది. అగ్రనేత అడ్వాణీ నిందితుడిగా కోర్టులో నిలబడాల్సిన పరిస్థితిని హిందూత్వ శక్తులు ఎలా జీర్ణించుకుంటాయి? హిందూత్వ–అభివృద్ధి సమ్మిళిత నినాదంతో రాజకీయాల్లో కొత్త ప్రయోగం చేస్తున్న మోదీ బృందం ఈ శక్తులకు ఏం సమాధానం చెబుతుంది. విచారణ ముగిసి కేసు వీగిపోతే.. తమ పార్టీ అగ్రనేతలకు సంబంధించినదైనా చట్ట ప్రక్రియలో తాము జోక్యం చేసుకోలేదని, ఇదీ తమ నిబద్ధతని మోదీ ప్రభుత్వం చెప్పుకోగలదు. అలా కాకుండా మరో రకంగా జరిగితే పరిస్థితేంటనేది పార్టీకి అంతుబట్టడం లేదు. ఆశలు ఆవిరి రాష్ట్రపతి రేసులో ఎల్కే అడ్వాణీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే తాజా పరిణామాలతో.. అడ్వాణీ అభ్యర్థిత్వంపై బీజేపీ, ఆరెస్సెస్‌లు పునరాలోచనలో పడ్డాయి. అత్యున్నత రాజ్యాంగ పదవికి క్రిమినల్ అభియోగాలను ఎదుర్కొంటున్న వ్యక్తిని పోటీకి నిలిపే సాహసం బీజేపీ, ఆరెస్సెస్ చేయగలవా? ఎన్డీయేలో లేనప్పటికీ అడ్వాణీ పట్ల కొన్ని ప్రాంతీయ పార్టీలు సానుకూలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ‘సెక్యులర్ ముద్ర’కు భయపడి ఇలాంటి పార్టీలు ఆయన అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వకపోవచ్చు. తప్పుకోక... తప్పదా? కేంద్ర మంత్రి ఉమాభారతి మంత్రి పదవిని వదులుకోవాల్సి రావొచ్చు. వ్యాపం కేసులో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్, లలిత్ మోడీ వ్యవహారంలో కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ సీఎం వసుంధర రాజేల రాజీనామాకు విపక్షాలు పట్టుబట్టినా కేంద్ర ప్రభుత్వం వెనకేసుకొచ్చింది. ఎందుకంటే వారిపై ఆరోపణలే గాని అభియోగాలు లేవు. మరి ఉమాభారతిని అలా వెనకేసుకు రాగలదా? క్రిమినల్ అభియోగాలు ఉన్నంత మాత్రాన రాజీనామా చేయాలని నిబంధనల్లో ఎక్కడా లేదు. కానీ.. ఉమాభారతి రాజీనామా నైతిక విలువలతో ముడిపడి ఉన్న అంశం. జోషి ఆశలు గల్లంతేనా? బీజేపీ మార్గదర్శక్ మండల్ సభ్యుడు, 83 ఏళ్ల కాన్పూర్ ఎంపీ మురళీ మనోహర్ జోషి. మోదీ ప్రధాని అభ్యర్థిగా తెరమీదకు వచ్చినపుడు అడ్వాణీతో సమానంగా నొచ్చుకున్నారు. గతనెల్లో ప్రభుత్వం జోషిని పద్మ విభూషణ్‌తో సత్కరించింది. ఆరెస్సెస్ అండతో ఈయన పేరు కూడా రాష్ట్రపతి అభ్యర్థి రేసులో వినపడింది. తాజా పరిణామాలతో అడ్వాణీ లాగే జోషి కూడా ఆశలు వదులుకోవాల్సిందే. ఇప్పటికి పదవే ‘రక్ష’ బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన 1992 డిసెంబరులో కల్యాణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ సీఎంగా ఉన్నారు. 2014లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక ఈయన్ను రాజస్తాన్ గవర్నర్‌గా నియమించింది. అడ్వాణీ, జోషి, ఉమాభారతితో పాటు ఈయన కూడా బాబ్రీ కేసులో నిందితుడే. అయితే గవర్నర్‌గా ఉన్నందువల్ల 85 ఏళ్ల కల్యాణ్‌సింగ్‌పై ప్రస్తుతానికి క్రిమినల్ అభియోగాలు మోపడం వీలుకాదు. అందుకే పదవీకాలం ముగిశాక (సెప్టెంబరు 3, 2019 తర్వాతే) అభియోగాలు నమోదు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆర్టికల్ 361 (2) ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్ పదవుల్లో ఉన్న వారిపై ఎలాంటి క్రిమినల్ అభియోగాలను మోపడానికి వీల్లేదు. ఇతరులు రాయ్‌బరేలీ కోర్టులో నమోదైన ఈ కేసులో మొత్తం 13 మందిని సీబీఐ నిందితులుగా చేర్చింది. వీరిలో బాల్ థాకరే, అశోక్ సింఘాల్, గిరిరాజ్ కిశోర్‌లు కన్నుమూశారు. వినయ్ కతియార్, సాధ్వి రీతాంబర, విష్ణు హరి దాల్మియాలు అభియోగాలు ఎదుర్కొననున్న ఇతర ప్రముఖులు. -
విఫల మనో‘రథుడు’
జనసంఘ్ నుంచి వేరుపడ్డాక సొంతకుంపటి పెట్టుకుని, 1984 ఎన్నికల్లో రెండంటే రెండే సీట్లు గెలిచింది బీజేపీ. అలాంటి పార్టీని దేశ రాజకీయాల్లో ఒక ప్రబలశక్తిగా మలిచింది నిస్సందేహంగా లాల్ కృష్ణ అడ్వాణీయే. హిందూత్వ ఎజెండాతో ఐదేళ్లలో (1989కి) బీజేపీ బలాన్ని 86కు చేర్చారు. తర్వాత రథయాత్ర చేపట్టి పార్టీని బలోపేతం చేశారు. 1996లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా..13 రోజులు మాత్రమే మనగలిగింది. తర్వాత బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడ్డా అడ్వాణీ ప్రధాని కాలేకపోయారు. ఆయన ప్రధాని అభ్యర్థిగా ఉన్నపుడు పార్టీ ఎన్నికల్లో బోల్తాపడింది. తప్పక గెలుస్తామనుకున్నపుడు ప్రధాని అభ్యర్థి కాకుండా పోయారు. చివరకు రాష్ట్రపతి అయినా అవుతారనుకుంటే... బుధవారం సుప్రీంతీర్పు ఆ ఆశలపైనా నీళ్లు చల్లినట్లైంది. దేశంలోని రాజ్యాంగబద్ధ పదవుల్లో కీలకమైన రెండు పదవులూ (ప్రధాని, రాష్ట్రపతి) అడ్వాణీకి అందినట్టే అంది దూరమయ్యాయి. ఆ వైనమేమిటో చూద్దాం... 1998-99: 1998లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 182 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించి ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 13 నెలలకే అన్నాడీఎంకే మద్దతు ఉపసంహరించడంతో ప్రభుత్వం పడిపోయింది. 1999 ఎన్నికల్లోనూ బీజేపీ 182 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచి, ఈసారి ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తిచేసింది. అప్పట్లో ఎన్డీయేలోని మిత్రపక్షాలకు అడ్వాణీ హిందూ అతివాదిగా కనపడ్డారు. అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిగా వాజ్‌పేయి 1998, 1999ల్లో ప్రధాని అయ్యారు. అడ్వాణీ, హోం మంత్రిగా, ఉపప్రధానిగా ఉన్నారు. 2004 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. 2009: ఎన్నికల్లో ప్రచార సారథి, బీజేపీ ప్రధాని అభ్యర్థి అన్నీ అడ్వాణీయే. కానీ బీజేపీ 116 సీట్లు మాత్రమే సాధించి ఓడిపోయింది.2013: అడ్వాణీ 2005లో పాక్ పర్యటనకు వెళ్లినపుడు మహ్మద్ అలీ జిన్నాను లౌకికవాదిగా అభివర్ణించారు. అప్పటినుంచే ఆర్ఎస్ఎస్తో ఆయనకు పొరపొచ్చాలు వచ్చాయి. ఇక 2014 ఎన్నికలకు మోదీ ప్రధాని అభ్యర్థి అయ్యారు. దీంతో అడ్వాణీ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. 2014లో గాంధీనగర్ నుంచి ఎంపీగా గెలుపొందారు. 2017: జూలైలో రాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయి. క్రియాశీల రాజకీయాల్లో అడ్వాణీకి ఏమీ మిగల్లేదు. మరోవైపు వయసు మీద పడింది కాబట్టి 89 ఏళ్ల అడ్వాణీని బీజేపీ తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తుందనే సంకేతాలొచ్చాయి. కానీ అనూహ్యంగా 25 ఏళ్లుగా సాగుతూ వస్తున్న బాబ్రీ కూల్చివేత కేసు మరోసారి ఆయన మెడకు చుట్టుకుని రాష్ట్రపతి అయ్యే అవకాశాలను దెబ్బతీసింది. -
అద్వానీ చిక్కుల్లో పడతారా..!
-
అద్వానీ చిక్కుల్లో పడతారా..!
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనకు సంబంధించిన నేరే పూరిత కుట్రకు సంబంధించిన ఆరోపణల కేసు విచారణలో బీజేపీ నేత ఎల్కే అద్వానీని చేర్చేందుకు అనుమతి ఇవ్వాలంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో నేడు వాదనలు జరిగే అవకాశం ఉంది. 1992లో బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన విచారణలో అద్వానీ, మురళీ మనోహర్ జోషి, కేంద్ర మంత్రి ఉమాభారతీ, రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్ తదితరులను చేర్చగా వారు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించడంతో వారిని ఈ కేసునుంచి తప్పిస్తూ 2010 మే నెలలో హైకోర్టు వారిని తప్పించింది. దీంతో సీబీఐ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, గత నెల 23న ఈ పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు సీబీఐ, బీజేపీ సీనియర్ నాయకులు, హాజీ మహబూబ్ అహ్మద్, ఇతర పిటిషనర్లను ఈ విషయంపై లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ నేటికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో గురువారం విచారణ జరిగే అవకాశం ఉంది. -
బాబ్రీ విధ్వంసంపై నేడు సుప్రీం విచారణ
-
బాబ్రీ విధ్వంసంపై నేడు సుప్రీం విచారణ
న్యూఢిల్లీ: బీజేపీ నేతలు అడ్వాణీ, ఉమాభారతి, మురళీ మనోహర్ జోషి నిందితులుగా ఉన్న బాబ్రీ మసీదు విధ్వంసం కేసుపై గురువారం సుప్రీం కోర్టు విచారణ జరపనుంది. తన నేతృత్వంలోని బెంచ్ దీన్ని విచారిస్తుందని జస్టిస్ పీసీ ఘోష్ బుధవారం తెలిపారు. అంతకుముందు.. ఈ కేసుకు సంబంధించి నివేదిక ఇవ్వడానికి వారం రోజుల గడవు కావాలని దివంగత పిటిషనర్ హాజీ మహబూబ్ అహ్మద్ తరపు న్యాయవాది కోరారు. వారే అడ్డుపడుతున్నారు.. స్వామి: అయోధ్యలో రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదాస్పద అంశంపై పరిష్కారానికి ముస్లిం సంస్థలు అడ్డంకులు సృష్టిస్తున్నాయని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి ఆరోపణలు చేశారు. మంగళవారం ఓ టీవీ చానల్ చర్చావేదికలో పాల్గొన్న ముస్లిం పార్టీలు.. అయోధ్య అంశాన్ని కోర్టు బయటే తేల్చుకోవాలన్న సుప్రీం సూచనలనుద్దేశించి ఇదో టైం వేస్ట్ కార్యక్రమంగా పేర్కొన్నాయని..సుప్రీం కోర్టు దీన్ని తప్పనిసరిగా వినాలని ఆయన అన్నారు.