రాష్ట్రపతి అభ్యర్ధిరేసులో కురువృద్ధుడు! | Murli Manohar Joshi joins race to be next President of India | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి అభ్యర్ధిరేసులో కురువృద్ధుడు!

Published Tue, Jun 14 2016 4:48 PM | Last Updated on Mon, Sep 4 2017 2:28 AM

Murli Manohar Joshi joins race to be next President of India

కురువృద్ధుడు, భారతీయ జనతా పార్టీ(బీజేపీ) లీడర్ మురళీ మనోహర్ జోషి రాష్ట్రపతి భవన్ కు వెళ్లాలనే యోచనలో ఉన్నారా? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలు ఈ విషయాన్నే చెప్తున్నాయి. పార్టీ తరఫు నుంచి రాష్ట్రపతి అభ్యర్ధిత్వానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్), బీజేపీ నాయకుల మద్దతు కోసం ఇప్పటికే లాబీయింగ్ ను మొదలుపెట్టారు. వచ్చే ఏడాది ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ముగియనుండటంతో కొత్త రాష్ట్రపతికి ఎన్నికలు జరగనున్నాయి.

ఎలాగైనా బీజేపీ తరఫు నుంచి రాష్ట్రపతి అభ్యర్ధిగా తనను నిర్ణయించడంపై ఇప్పటికే ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, కొంతమంది సంఘ్ నాయకులను కలిసి చర్చించినట్లు సమాచారం. కాగా, ఆర్ఎస్ఎస్ కు చెందిన దేవేంద్ర స్వరూప్ ఇప్పటికే జోషికి అభ్యర్ధిత్వం పట్ల సుముఖతను వ్యక్తం చేశారు. ఇందిరా గాంధీ జాతీయ ఆర్ట్స్ కేంద్రం అధ్యక్షుడు రామ్ బహదూర్ రాయ్ కూడా జోషికి తన సపోర్టును ప్రకటించారు.
Murli Manohar Joshi, joins, next President of India race, మురళీ మనోహర్ జోషి, లాబీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎన్నికలు, అభ్యర్థిత్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement