Joins
-
టీడీపీకి షాక్.. వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన మురళీకృష్ణంరాజు
-
స్మృతి కోసం చాలా ట్రై చేశాం.. ఎట్టకేలకు మా జట్టులో!(ఫొటోలు)
-
దొందూ.. దొందే.. జంపింగ్ జపాక్స్
-
కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరి, కావ్య
-
బీజేపీలోకి నవనీత్ రాణా.. అమరావతి నుంచి పోటీ!
మహారాష్ట్రలోని అమరావతి సిట్టింగ్ ఎంపీ నవనీత్ రాణా అధికారికంగా బీజేపీలో చేరారు. నాగ్‌పూర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్కులే నవనీత్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. దీనికిముందు అమరావతి (రిజర్వ్డ్ స్థానం) నుంచి పార్టీ అభ్యర్థిగా నవనీత్ రాణాను బీజేపీ ప్రకటించింది. బీజేపీలో చేరిన నవనీత్ రాణా మీడియాతో మాట్లాడుతూ గత ఐదేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్నానని అన్నారు. అట్టడుగు స్థాయిలో పనిచేసే వారిని ప్రధాని మోదీ ప్రోత్సహిస్తారని, ఈ విధంగానే తనకు టిక్కెట్ కేలాయించారన్నారు. తన శ్రమను బీజేపీ గుర్తించిందని, ఎన్నికల్లో విజయం సాధించి ఈసారి 400 సీట్లు దాటాలనే బీజేపీ సంకల్పాన్ని నెరవేరుస్తామన్నారు. ఇకపై తాను బీజేపీకి అంకిత భావంతో పనిచేస్తానని పేర్కొన్నారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నలుగురు స్వతంత్రులు గెలిచి పార్లమెంటుకు చేరుకున్నారు. వారిలో నవనీత్ రానా కూడా ఒకరు. మహారాష్ట్రలోని అమరావతి స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నవనీత్ రాణా 36,951 ఓట్ల తేడాతో గెలుపొందారు. పంజాబీ కుటుంబానికి చెందిన నవనీత్ కౌర్.. రవి రానాతో పెళ్లి తర్వాత రానాను తన పేరులో చేర్చుకున్నారు. నవనీత్ కౌర్, రవి రాణా యోగా గురు రామ్‌దేవ్ బాబా ఆశ్రమంలో కలుసుకున్నారు. 2011లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఎంపీ నవనీత్ ముంబైలోని పంజాబీ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి ఆర్మీలో పనిచేశారు. రాజకీయాల్లోకి రాకముందు నవనీత్ మోడలింగ్‌లో తన కెరియర్ ప్రారంభించారు. తెలుగు, మలయాళం, కన్నడ చిత్రాలలో నటించారు. నవనీత్ పెళ్లి తర్వాత రాజకీయాల్లో కాలుమోపారు. 2014లో ఎన్సీపీ టిక్కెట్‌పై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆమె విజయం సాధించలేదు. అయితే స్వతంత్ర అభ్యర్థిగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి అమరావతి ఎంపీగా ఎన్నికయ్యారు. #WATCH | Maharashtra | Navneet Rana joins BJP in the presence of BJP state president Chandrashekhar Bawankule, in Nagpur pic.twitter.com/W3pCVrhfuH — ANI (@ANI) March 27, 2024 -
కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ.. బీజేపీలో చేరిన ‘హస్తం’ ఎమ్మెల్యే!
కాంగ్రెస్ ‘హస్తం’ నుంచి మరో ఎమ్మెల్యే చేజారిపోయారు. గుజరాత్లో కాంగ్రెస్‌కు చెందిన ప్రముఖ నేత, ఎమ్మెల్యే అర్జున్ మోద్వాడియా తాజాగా బీజేపీలో చేరారు. ఆయనతో పాటు మరో ఇద్దరు కాంగ్రెస్ బడానేతలు కూడా బీజేపీలో చేరారు. వీరిలో మాజీ ఎమ్మెల్యేలు అంబరీష్ ధేర్, ములుభాయ్ కందేరియా ఉన్నారు. గుజరాత్లో బలమైన ప్రతిపక్ష నేతగా మోద్వాడియా పేరు సంపాదించారు. 2022 ఎన్నికల్లో పోర్బందర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ నేత బాబు బోఖిరియాను ఓడించారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలోని ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ మార్చి 7న గుజరాత్‌లోకి ప్రవేశించబోతున్న సమయంలో ఆయన బీజేపీలో చేరడం చర్చనీయాంశంగామారింది. దాదాపు 40 ఏళ్ల పాటు కాంగ్రెస్‌తో అనుబంధం కలిగిన మోద్వాడియా .. రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమ ఆహ్వానాన్ని పార్టీ అధిష్టానం తిరస్కరించడాన్ని తప్పుబట్టారు. మోద్వాడియా ప్రస్తుతం పోర్బందర్ ఎమ్మెల్యే. కాగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంబరీష్ దేర్ కూడా బీజేపీలో చేరారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా దేర్ను గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శక్తి సింగ్ గోహిల్ సస్పెండ్ చేశారు. #WATCH | Gandhinagar | Senior leaders from Gujarat Arjun Modhwadia, Ambrish Der, and others - who resigned from the Congress yesterday - join BJP in the presence of State BJP chief CR Paatil. pic.twitter.com/ioOe5K2cnD — ANI (@ANI) March 5, 2024 -
వైఎస్ఆర్ సీపీలో చేరిన సీనియర్ ఐఎఎస్ అధికారి ఎండి ఇంతియాజ్
-
టీడీపీని వీడి వైఎస్ఆర్ సీపీలో చేరిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు
-
అన్నాడీఎంకేలో చేరిన సీనియర్ నటి గౌతమి
-
కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన పాల్వాయి స్రవంతి
-
వైఎస్సార్సీపీలో చేరిన ఏయూ విద్యార్థులు
-
శాసన మండలి చైర్మన్ గుత్తా ఉక్కిరి బిక్కిరి.. అసలేం జరుగుతోంది?
తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఆయనకు దగ్గరి అనుచరులుగా ఉన్న వారంతా బీఆర్ఎస్ను వీడుతున్నారు. వారంతా కట్టకట్టుకు కాంగ్రెస్‌లో చేరిపోతున్నారు. దీంతో పరోక్షంగా ఈ ప్రభావం మండలి చైర్మన్‌కు ఎఫెక్ట్ అయ్యేలా ఉందన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది. సుదీర్ఘ కాలంగా ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలను శాసిస్తున్న గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇపుడు ఆత్మరక్షణలో పడిపోయిన పరిస్థితులు తలెత్తాయంటున్నారు. తెలుగుదేశం ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన మదర్ డెయిరీ చైర్మన్‌గా, ఎంపీగా టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2009, 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి నల్గొండ ఎంపీగా పనిచేసిన ఆయన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్ గూటికి చేరారు. అదే సమయంలో సుఖేందర్ రెడ్డితో సత్సంబంధాలు కలిగి ఉన్న నాటి సీపీఐ దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ సైతం సీపీఐ నుంచి బీఆర్ఎస్లోకి మారిపోవడంతో గుత్తా కీలకంగా వ్యవహరించారు. మరో వైపు టీడీపీలో ఉన్న సమయం నుంచీ ఇప్పటి నల్గొండ సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరులతో గుత్తాకు బయటకు కనిపంచేంత సఖ్యత లేదు. కాంగ్రెస్ ఎంపీగా ఉండి గులాబీ కండువా కప్పుకున్న ఆయనకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు, తెలంగాణ శాసన మండలి చైర్మన్‌గా కూడా అవకాశం కల్పించారు. పదవీ కాలం ముగిశాక కూడా రెండోసారి ఎమ్మెల్సీగా, మరో మారు మండలి చైర్మన్ గా పదవిలో కూర్చోబెట్టారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న, తన రాజకీయ వారసునిగా తన తనయుడు అమిత్‌ను అరంగేట్రం చేయించే పనిలో ఉన్నారు. కానీ, తెలంగాణ శాసన సభ ఎన్నికల సందర్బంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆయనకు ప్రతికూలంగా మారుతున్నాయి. వారితో చెడిందా? ఎవరితో తనకు విభేదాలు లేవని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పదే పదే చెప్పుకోవాల్సి వస్తోంది. కానీ, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ నాయక్ లతో ఈ మధ్య చెడిందన్న వార్తలు ఉన్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్టింగులందరికీ టికెట్లు ఖరారు చేసిన నాటినుంచే కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వారిలో దేవరకొండ ఒకటి. అక్కడి అభ్యర్థిని మార్చాల్సిందేనని పట్టుబడుతున్న వారంతా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దగ్గరి అనుచరులు కావడం గమనార్హం. టీడీపీ తరపున దేవరకొండ జెడ్పీటీసీ సభ్యునిగా పని చేసిన కాలం నుంచి గుత్తా ఏ పార్టీలోకి వెళితే ఆయన వెంట ఆయా పార్టీల్లోకి వెళ్లి వెంట నడుస్తున్న వారే కావడం గమనార్హం. ఇపుడు వీరంతా.. మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహులు, మాజీ చైర్మన్ వడ్త్య దేవేందర్, ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అంతా కట్టకట్టుకుని మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డిల మాటను బేఖాతరు చేసి, సుఖేందర్ రెడ్డి మాటలను చెవిన పెట్టకుండా కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ అభ్యర్థి బాలూ నాయక్ గెలుపు కోసం పనిచేస్తామని ప్రకటించారు. నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని పదుల సంఖ్యలో సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీ, తిప్పర్తి జెడ్పటీసీ సభ్యుడు వీరంతా బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. వీరంతా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అత్యంత దగ్గరి అనుచరులు కావడం విశేషం. జిల్లా పరిషత్‌లో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న తిప్పర్తి జెడ్పీటీసీ సభ్యుడు పాశం రాంరెడ్డి పార్టీ మారడం గుత్తా సుఖేందర్ రెడ్డికి తలనొప్పిగా మారింది. దీంతో ఆయన తాను పార్టీ మారడం లేదని, తన అనుచరులను బయటకు పంపడం లేదని, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పార్టీ ఆదేశిస్తే తాను కానీ, తన తనయుడు కానీ, నల్గొండ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తామని ప్రకటించాల్సి వచ్చింది. సుఖేందర్ రెడ్డి అనుచరగణం పార్టీ వీడుతుండడాన్ని ఆయా నియోజకవర్గాల సిట్టింగు అభ్యర్థులు హై కమాండ్‌కు ఫిర్యాదులు కూడా చేశారు. దీంతో మండలి చైర్మన్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు వ్యక్తిగతంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. చదవండి: కాంగ్రెస్‌ను వీడనున్న నాగం జనార్దన్‌రెడ్డి? -
తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ చేరికలు
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ఎన్నికలు సమీపించే కొద్ది రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు సంతోష్ కుమార్, నేతి విద్యాసాగర్, ఆకుల లలిత, కపిలవాయి దిలీప్ కుమార్, మోత్కుపల్లి నర్సింహులు, నీలం మధు ముదిరాజ్.. ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారికి మల్లిఖార్జున ఖర్గే.. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పటాన్చెరు నుంచి బీఆర్ఎస్ తరపున టికెట్ ఆశించిన నీలం మధు.. అది దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్కు షాకిస్తూ కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. అధికారికంగా కాంగ్రెస్‌లో చేరిన తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్‌ను గద్దె దింపేందుకే కాంగ్రెస్‌లో చేరానన్నారు. పదవులు తనకు ముఖ్యం కాదని.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోందన్నారు. ‘‘కుటుంబ పాలనను అంతం చేస్తా. కాంగ్రెస్ పార్టీ 70 సీట్లు గెలవబోతోంది’’ అని రాజగోపాల్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఏఐసిసి తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి శ్రీ మానిక్ రావ్ ఠాక్రే గారు, టిపిసిసి అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారు. ఈ కార్యక్రమంలో… pic.twitter.com/JsNDl3HUfB — Telangana Congress (@INCTelangana) October 27, 2023 కాగా, తెలంగాణ మలివిడత అభ్యర్థుల జాబితా ప్రకటన నేపథ్యంగా సాగిన కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం ముగిసింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన శుక్రవారం ఉదయం గంటన్నర పాటు సమావేశమైన సీఈసీ 53 స్థానాల అభ్యర్థుల జాబితాకు ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. ఏ క్షణమైనా తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. చదవండి: కాంగ్రెస్ మలి జాబితా ప్రకటనలో ట్విస్ట్ -
బీఆర్ఎస్ గూటికి చెరుకు సుధాకర్
సాక్షి, హైదరాబాద్: మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు సమక్షంలో తెలంగాణ ఉద్యమ కారుడు చెరుకు సుధాకర్ బీఆర్ఎస్లోకి చేరారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ, తెలంగాణ రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డి విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అవినీతిపై రేవంత్ వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. ‘‘రాహుల్ గాంధీ తన పేరును రాంగ్ గాంధీగా మార్చుకోవాలి. బీఆర్ఎస్ మేనిఫెస్టోనే కాంగ్రెస్ కాపీ కొట్టింది. రాష్ట్రాన్ని మళ్లీ కాంగ్రెస్ చేతిలో పెడితే ఇక ఆగమే. కాంగ్రెస్‌లో పైసలకే టికెట్లు అమ్ముకుంటున్నారు’’ అని హరీష్‌రావు ధ్వజమెత్తారు. చదవండి: కాంగ్రెస్ నాకు టికెట్ ఇవ్వాల్సిందే.. గద్దర్ కూతురు వెన్నెల -
బీఆర్ఎస్ నేత బాలసాని లక్ష్మీనారాయణ కాంగ్రెస్‌లో చేరిక
ఖమ్మం: మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ బీఆర్ఎస్కి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో చేరడానికి నిర్ణయం తీసుకున్నారు. తుమ్మల నాగేశ్వరరావు, పోంగులేటి శ్రీ నివాసరెడ్డితో చర్చలు సఫలం అయ్యాయి. బాలసానిని కాంగ్రెస్ లోకి స్వాగతం పలుకుతున్నామని పోంగులేటి శ్రీ నివాసరెడ్డి తెలిపారు. గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాలలో బీఆర్ఎస్ నాయకులు ప్రజలను మోసం చేశారని పోంగులేటి శ్రీ నివాసరెడ్డి మండిపడ్డారు. సోనియా గాంధీకి తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. బిఆర్ఎస్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా కాంగ్రెస్ గెలుపును ఎవరూ అపలేరని చెప్పారు. టిఎస్పిఎస్సీ నోటిఫికేషన్లు హడావుడిగా ఇచ్చి పేపర్ లు లీక్ చేసి నిరుద్యోగ యువతను మోసం చేశారని దుయ్యబట్టారు. బాలసాని తనతోనే ప్రయాణం చేశారని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కళ్ల ముందే ఒక చరిత్ర కనిపిస్తోందని చెప్పారు. 40సంవత్సరాలుగా జిల్లా ప్రజలు చూస్తున్నారు..తమ ఆలోచన ప్రజా దృక్పథమే అని అన్నారు. రాజకీయ యుద్ధంలో ఏది న్యాయం .. ఏది ధర్మమో ప్రజలే ఆలోచన చేయాలని అన్నారు. ప్రజల కష్టాలు తీర్చే పరిపాలన కోసం కాంగ్రెస్ లోకి వచ్చామని చెప్పారు. ఖమ్మం అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతల చేరికలపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. బీఆర్ఎస్ కార్పొరేటర్లకు కాంగ్రెస్ గాలం వేస్తోంది. కార్పొరేటర్లు కమర్తపుమురళి ,చావనారాయణలను పొంగులేటి ,తుమ్మల కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. మరో నలుగురు కార్పొరేటర్లు సైతం కాంగ్రెస్ లోకి ఆహ్వానించనున్నట్లు సమాచారం. టార్గెట్ అజయ్ కుమార్ గా పనిచేస్తున్నార విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదీ చదవండి: బీఆర్ఎస్ మేనిఫెస్టో.. కేసీఆర్ హామీలివే.. -
టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు
తిరుపతి సిటీ: టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి నాయకులు, కార్యకర్తల చేరికలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 350 మందికి పైగా టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీలో చేరారు. తిరుపతిలోని 33వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు ఎన్వీ రమణారెడ్డి సహా 300 మందికి పైగా టీడీపీ నాయకులకు ఆదివారం పద్మావతిపురంలో టీటీడీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పార్టీ కండువా కప్పి వైఎస్సార్సీపీలోకి ఆహా్వనించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమమే తాము వైఎస్సార్సీపీలో చేరడానికి కారణమన్నారు. ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ మేలు చేస్తున్న సీఎం జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే పుంగనూరు నియోజకవర్గంలోని రొంపిచెర్లలో గెర్లపల్లికి చెందిన టీడీపీ నాయకులు జి.రామచంద్రారెడ్డి, రమేశ్‌రెడ్డి, రాజారెడ్డి సహా 50 మంది ఆదివారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా వైఎస్సార్సీపీ విజయానికి కృషి చేయాలని సూచించారు. -
Chandrababu : చేతులు కలపడమే తరువాయి.?
చంద్రబాబు రాజకీయ భవిష్యత్తు ప్రయాణంలో స్పష్టత వస్తున్నట్టు సంకేతాలందుతున్నాయి. ఇక తన ప్రయాణం కాంగ్రెస్‌తోనే కొనసాగించాలని బాబు నిర్ణయించుకున్నట్టు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. బీజేపీతో ఇప్పటికే పూర్తిగా తెగతెంపులు చేసుకున్న చంద్రబాబు.. ప్రధాని మోదీని, హోంమంత్రి అమిత్‌షాను టార్గెట్ చేసుకుని 2019లో చేసిన యాంటీ బీజేపీ క్యాంపెయిన్ ఇంకా ప్రజల మదిలో చెదిరిపోలేదు. గత నాలుగున్నరేళ్లుగా పైకి బీజేపీతో దగ్గరవుదామని ప్రయత్నిస్తున్నా.. లోలోన మాత్రం కాంగ్రెస్‌తో నడుపుతున్న రాయబారాలు బహిర్గతమవుతున్నాయి. సీన్ 1 : 2019 ఎన్నికలు - జాతీయ రాజకీయాలు ఎన్నికల్లో యాంటీ బీజేపీ స్టాండ్ తీసుకున్న చంద్రబాబు.. దేశవ్యాప్తంగా విపక్షాలను ఏకం చేసే పనిలో పడ్డారు. ఉదయం తూర్పున బెంగాల్లో మమతో ఒక భేటీ జరిగితే, మధ్యాహ్నానికల్లా ముంబైలో శరద్ పవార్‌తో మరో భేటీ నిర్వహించారు. ఢిల్లీలో కేజ్రీవాల్‌ను కలిస్తే.. అంతే వేగంగా కేరళలో కమ్యూనిస్టులతో భేటీ అయ్యారు. చంద్రబాబు స్పీడ్ చూసి నేషనల్ మీడియా కూడా అవాక్కయిన సందర్భాలు 2019లో ఎన్నో ఉన్నాయి. కాంగ్రెస్ నాయకులయితే సరే సరి. రాహుల్‌తో 10 జన్‌పథ్‌లో నిర్వహించిన మీటింగ్‌కు ఎల్లో మీడియా ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అంతెందుకు కర్ణాటకలో కుమారస్వామి ప్రమాణస్వీకారంలో సభ మీద రాహుల్‌తో చట్టాపట్టాల్ వేసుకున్నవి కూడా ఇంకా ఇప్పుడే చూసినట్టు ఉంది. (కర్ణాటక రాజకీయాల సందర్భంగా చంద్రబాబు తిప్పిన యూపీఏ చక్రం) సీన్ 2 : 2019 ఫలితాలు - తదనంతర పరిణామాలు ఎన్నికలు ముగిసాయి. ప్రజా తీర్పు వెల్లడయింది. సైకిల్ కొట్టుకుపోయింది. చంద్రబాబులో నిర్వేదం ఏర్పడింది. ఇంతా చేసినా.. ప్రజలెందుకు తరిమికొట్టారన్న ఆత్మవిమర్శ మాత్రం చేసుకోలేకపోయారు. తనను ఓడించి ప్రజలు ద్రోహం చేశారంటూ నిందించడం మొదలెట్టారు. అదే సెల్ఫ్ డబ్బా.. ఈ రోడ్డు నేనేశా.. ఈ భవనం నేను కట్టా.. ఈ కాలువ నేను తవ్వించా.. ఎంత సేపు నేను అనే సోత్కర్ష నుంచి బయటకు రాలేకపోయారు. చివరికి భ్రమలనే నిజమనే స్థాయికి చేరిపోయారు. ఈ సమయంలో ఎల్లో మీడియా వల్ల ఆయనకు నిజంగానే అన్యాయం జరిగింది. ఉదాహారణకు హైటెక్ సిటీకి శంకుస్థాపన చేసింది కాంగ్రెస్ హయాంలో అని తెలిసినా.. చంద్రబాబే .. చంద్రబాబే అని ప్రచారం చేసి అదే నిజమని ప్రజల్ని నమ్మించే స్థాయికి చేరారు. అంతెందుకు హైదరాబాద్‌లో ఎయిర్‌పోర్టును దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మిస్తే.. ఆ క్రెడిట్ చంద్రబాబుకు ఇచ్చేశారు. ఔటర్ రింగ్ రోడ్డును నిర్మిస్తే.. పెద్దలా గద్దలా అంటూ ఈనాడులో విమర్శలు చేసి... ఇప్పుడు జన జీవన నాడిగా మారిన తర్వాత చంద్రబాబుకు క్రెడిట్ ఇస్తున్నారు. ఇలా మారని భ్రమలతో ఆయన వ్యక్తిత్వ పరంగా మరింత దిగజారారు. (జపాన్ సహకారంతో టెక్నాలజీ పార్కును శంకుస్థాపన చేస్తున్న నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి, ఆ సందర్భంగా మీడియాలో వచ్చిన వార్తలు) (శంషాబాద్ ఎయిర్‌పోర్టును, PV నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించి పూర్తి చేసిన డా.వైఎస్సార్) సీన్ 3 : పార్టీ నిర్మాణంలో ఎన్నో లోపాలు తానొక విజనరీ నాయకుడినని, విజన్ 2020 తర్వాత విజన్ 2047 తెచ్చానని చెప్పుకునే చంద్రబాబు.. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో తెలుగుదేశం పార్టీని ఒక నిష్క్రియాత్మకమైన వ్యవస్థగా మార్చారు. ఏ పార్టీలోనయినా పిరమిడ్ లెవల్ ఉంటుంది. అంటే ఒక నాయకుడి తర్వాత అంతటి బాధ్యతలు నిర్వహించగలిగే సత్తా ఉన్నా ఇద్దరో, ముగ్గురో ఉంటారు. మేనేజ్మెంట్ పాఠాలను వల్లె వేసే చంద్రబాబుకు ఈ విషయాలన్నీ తెలియవని కాదు. తెలుగుదేశం పార్టీలో తీసుకునే ఏ నిర్ణయమైనా చంద్రబాబుకు తప్ప మూడో కంటికి తెలియదు. తన వారసుడిగా లోకేష్‌ను ప్రొజెక్ట్ చేయాలని చూసినా.. ఎమ్మెల్యేగా గెలవలేని ప్రతిభాసామర్థ్యాలు లోకేష్‌వి. ఇక పవన్‌కళ్యాణ్‌కు ఎన్ని ప్యాకేజీలు ఇచ్చినా.. ఏ ఎజెండాలో సక్సెస్ అయిన దాఖలాలు లేవు. (తన పొలిటికల్ పార్ట్నర్ పవన్‌కళ్యాణ్‌తో చంద్రబాబు ) సీన్ 4 : కిం కర్తవ్యం.. కాంగ్రెసే శరణ్యం ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబుకు ఉన్న ఏకైక మార్గం కాంగ్రెస్. అందుకే తన శిష్యుడు రేవంత్ రెడ్డిని నమ్ముకున్నారు. చంద్రబాబును కాపాడేందుకు ఇప్పటికే రేవంత్‌రెడ్డి రాయబారం నడుపుతున్నారు. బాబును కాపాడేందుకు ఏం చేయాలన్న దానిపై రేవంత్‌రెడ్డి కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించి ‘ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సమగ్ర కథనాన్ని ప్రచురించింది. తాను అరెస్ట్ అవుతానంటూ చెప్పుకొచ్చిన చంద్రబాబుతో డీకే శివకుమార్‌తో రేవంత్ ఫోన్ చేయించినట్టు కథనంలో పేర్కొంది. బాబు తరఫున ఏసీబీ కోర్టులో వాదించిన న్యాయవాది సిద్దార్థ్ లూథ్రాకు డీకేతో మంచి సంబంధాలున్నాయి. డీకేకు ఆయన అన్ని విషయాల్లో తోడుగా ఉంటారు. డీకే సిఫారసుతోనే బాబు కేసులో లూథ్రా రంగంలోకి దిగారు. అయితే కేసు పక్కాగా ఉండడం, ఆధారాలు బలంగా ఉండడంతో లూథ్రా కాస్తా నిర్వేదంలో పడిపోయారు. (చంద్రబాబును రక్షించేందుకు బెంగళూరులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో రేవంత్ మంతనాలు) సీన్ 5 : ఇండియా కూటమి వైపు సైకిల్ తాజా పరిణామాలతో రేపో, మాపో ఇండియా కూటమి దిశగా సైకిల్ వెళ్తోందని తేలిపోయింది. ఇంతవరకు ఏ ఎన్నికల్లోనూ ఒంటరిగా అధికారంలోకి వచ్చిన చరిత్ర చంద్రబాబుకు లేదు. ఇప్పుడు కూడా పవన్‌తో పొత్తు ప్రకటించేశారు. బీజేపీ ఈ పరిణామాలపై గుర్రుగా ఉంది. ఇక మిగిలింది కాంగ్రెస్. రాహుల్‌తో తనకు చక్కటి సమన్వయం, అంతకు మించిన పరిచయం ఉన్నాయి. అంతా అనుకున్నట్టు జరిగితే.. కాంగ్రెస్ నుంచి ఓ స్టెప్పు ముందుకు పడవచ్చు. జైల్లో ఉన్న చంద్రబాబును ములాఖత్‌లో రాహుల్‌గాంధీ కలవొచ్చు. లేదా తన ప్రతినిధిగా డీకే శివకుమార్ గానీ, కపిల్‌సిబల్‌ను కానీ పంపించవచ్చు. ఇటు ఢిల్లీలో కూడా లోకేష్ ఓ చీకటి వేళ ఒకరిద్దరు కాంగ్రెస్ అగ్రనాయకులతో భేటీ కావొచ్చు. ఇప్పటికే రఘురామకృష్ణరాజుతో కలిసి ఈ ప్రయత్నాల్లో ఉన్నారు. (ఢిల్లీలో రఘురామకృష్ణరాజుతో కలిసి ఎడతెగని ప్రయత్నాలు చేస్తోన్న లోకేష్) సీన్ 6 : కథ సశేషం.. మిగిలింది ఉత్కంఠభరితం ఎన్నికలు వడివడిగా వస్తున్నాయి. పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. రంగులు మార్చడంలో ఊసరవెల్లిని మించిన చరిత్ర చంద్రబాబుది. ఇదీ వైఎస్సార్సిపి మొదటి నుంచి చెబుతున్న విషయం. ఇప్పుడు పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి కూడా ఇదే విషయాన్ని పంచుకున్నారు. ఈ రాజకీయ ముఖచిత్రం త్వరలోనే సుస్పష్టంగా ఆవిష్కృతం కానుంది. దానికి ప్రజలే సాక్షి. Only the I.N.D.I.A. Alliance members are supporting Sri. Chandrababu @ncbn through phone calls to his son. This proves that TDP is part of the I.N.D.I.A. Alliance and that they have the same strategy, come together for power and loot the State while you can. TDP is incapable of… — Vijayasai Reddy V (@VSReddy_MP) September 16, 2023 -
ఎస్పీకి ఎదురుదెబ్బ... ఎన్డీయే కూటమిలో చేరిన కీలక పార్టీ..
లక్నో: 2024 ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. దేశంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇటు ప్రతిపక్ష పార్టీలన్నీ కూటమి దిశగా పావులు కదుపుతుండగా.. అటు.. ఎన్డీయే తన మిత్ర పక్షాలన్నిటినీ ఏకం చేయడానికి జులై 18న సమావేశం ఏర్పాటు చేయనుంది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లో సమాజ్ వాదీ పార్టీకి రెండోసారి ఎదురుదెబ్బ తగిలింది. తన మద్దతుదారైన సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్బీస్పీ) బీజేపీతో చేతులు కలిపింది. మరో ఎమ్మెల్యే దారా సింగ్ చౌహాన్ కూడా బీజేపీలో చేరనున్నారు. తూర్పు యూపీలో ఓబీసీ సామాజిక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్బీస్పీ) ఎన్డీయే గూటికి చేరింది. ఈ మేరకు సామాజిక న్యాయం, దేశ భద్రత, వెనకబడిన, అణగారిన వర్గాల అభివృద్ధి కోసం బీజేపీతో కలిసి పోరాడేందుకు సిద్ధమైనట్లు ఆ పార్టీ అధినేత ఓం ప్రకాశ్ రాజ్‌భర్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రధాని మోదీకి, హోం మంత్రి అమిత్ షాకు, సీఎం యోగి ఆదిత్య నాథ్‌కు ధన్యవాదాలు తెలిపారు. भाजपा और सुभासपा आए साथ सामाजिक न्याय देश की रक्षा- सुरक्षा, सुशासन वंचितों, शोषितों, पिछड़ों, दलितों, महिलाओं, किसानों, नौजवानों, हर कमजोर वर्ग को सशक्त बनाने के लिए भारतीय जनता पार्टी और सुहेलदेव भारतीय समाज पार्टी मिलकर लड़ेगी। pic.twitter.com/CDMXCc9EAM — Om Prakash Rajbhar (@oprajbhar) July 16, 2023 యూపీలో యోగీ ఆదిత్యనాథ్ మొదటిసారి సీఎంగా ఉన్న కాలంలో ఓం ప్రకాశ్ మంత్రి పదవి పొందారు. ఆ తర్వాత దానికి రాజీనామా చేసి సమాజ్‌వాదీ పార్టీ తరపున చేరి 2022 ఎన్నికలో పోరాడారు. ప్రస్తుతం మళ్లీ ఎన్డీయే గూటికి చేరారు. దీనిపై బీజేపీపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 2024 ఎన్నికల్లో తమ 'వెనకబడిన, దళిత, మైనారిటీ' ఫార్ములాకు బీజేపీ భయపడిందని ఆరోపించారు. తిట్టినవారిని కూడా బీజేపీ తమ వర్గంలో కలిపేసుకుంటున్నారని అన్నారు. ఎస్బీస్పీ ఎన్డీయేలో చేరినప్పటికీ ఆ పార్టీ ఓటర్ల మద్దతు తమకే ఉంటుందని ఎస్పీ నాయకులు చెప్పారు. #WATCH | SBSP chief Om Prakash Rajbhar speaks on his decision of joining the NDA alliance "We met Union Home Minister Amit Shah on July 14 and discussed various issues and decided to fight the 2024 elections together. I want to thank PM Modi, HM Amit Shah, CM Yogi Adityanath… pic.twitter.com/gvI0whp1dl — ANI (@ANI) July 16, 2023 సమాజ్‌వాదీ పార్టీకి చెందిన దారా సింగ్ చౌహాన్ నిన్ననే తన అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు. బీజేపీతో కలవడానికి అమిత్ షాను కలిశారు. ఈయన కూడా ఒకప్పుడు యోగీ వర్గం నుంచి రాజీనామా చేసి 2022లో బీజేపీకి వ్యతిరేకంగా ఎస్పీ తరపున పోరాడారు. తూర్పు యూపీ నుంచి బీసీ సామాజిక వర్గానికి ప్రాతినిథ్యం వహించిన చౌహాన్ మళ్లీ ఇప్పుడు సొంత గూటికే చేరారు. ఇదీ చదవండి: ఉత్తరాదిలో దంచికొడుతున్న వానలు.. మళ్లీ యమునకు పోటెత్తిన వరద.. రెడ్ అలర్ట్ జారీ.. -
సుప్రీంకోర్టుకు చేరిన వరద నీరు.. సైన్యం సహకారాన్ని కోరిన కేజ్రీవాల్..
ఢిల్లీ: యమునా నది ఉప్పొంగడంతో దేశ రాజధాని తీవ్ర ముప్పును ఎదుర్కొంటోంది. ఢిల్లీలో ప్రధాన ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. డ్రెయిన్ రెగ్యులేటర్ పాడవడంతో ఐటీఓ క్రాసింగ్ ఏరియా, నిత్య రద్దీగా ఉండే ప్రాంతాల్లోకి యమునా నది వరద నీరు పారుతోంది. దీంతో అప్రమత్తమైన సీఎం కేజ్రీవాల్.. ఆర్మీ సహాయం కోరాలని అధికారులకు ఆదేశించారు. విపత్తు నిర్వహణ శాఖ సహాయం తీసుకుని రెగ్యులేటర్‌ను సరిచేయాలని కోరారు. ఇందుకోసం ఇంజినీరు బృందాలు రాత్రంతా ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయిందని చెప్పారు. ఇంద్రప్రస్తా బస్ డిపో నుంచి డబ్ల్యూహెచ్ఓ బిల్డింగ్ మధ్య ఉండే డ్రెయిన్ రెగ్యులేటర్ పాడయిపోయిన కారణంగా వరద ఉద్దృతి ఈ ప్రాంతానికి చేరినట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. కాగా.. ఐటీఓ క్రాసింగ్ ఏరియాలో ఎలక్ట్రిక్ పోల్స్‌కు షాక్ వచ్చిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆ ప్రాంతంలో కరెంట్ సరఫరాను నిలిపివేశారు. This breach is causing flooding of ITO and surroundings. Engineers have been working whole nite. I have directed the Chief Secretary to seek help of Army/NDRF but this shud be fixed urgently https://t.co/O8R1lLAWXX — Arvind Kejriwal (@ArvindKejriwal) July 14, 2023 సుప్రీంకోర్టుకు వరద నీరు.. ఢిల్లీలో రికార్డ్ స్థాయిలో ఉప్పొంగిన యమునా నది ఈ రోజు కాస్త తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. నిన్న యమునా నది 208.46 మీటర్ల మేర ప్రవహించింది. కానీ ఈ రోజు మధ్యాహ్నానానికి 208.30కు తగ్గుతుందని కేంద్ర వాటర్ కమిషన్ అంచనా వేసింది. అయితే.. ఇప్పటికే వరద నీరు ఏకంగా ఢిల్లీ నడిబొడ్డున ఉన్న తిలక్ మార్గ్‌లోని సుప్రీంకోర్టుకు చేరుకుంది. ఢిల్లీలో వరద నేపథ్యంలో ఫ్రాన్స్‌లో పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. హోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు. పరిస్థితి తీవ్రతను సమీక్షించారు. దేశ రాజధాని ఢిల్లీలో రహదారులు నదులయ్యాయి. ఇళ్లు నీట మునిగిపోయాయి. శ్మశాన వాటికలు సైతం జలమయంగా మారాయి. రోడ్లపైకి వచ్చే వీలు లేకుండాపోయింది. మొత్తంగా ఢిల్లీలో జనజీవనం స్తంభించిపోయింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో యమునా నదిలో నీటమట్టం గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఏకంగా 208.62 మీటర్లకు చేరుకుంది. దీంతో నగరంలో మరిన్ని ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో పాఠశాలలకు, ఆఫీసులకు సెలువులు ప్రకటించారు. ఇదీ చదవండి: Delhi Rainfall Floods: యమున విశ్వరూపం.. ముంపులో ఢిల్లీ.. జల దిగ్బంధంలో జనజీవనం -
రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి
సాక్షి, ఖమ్మం: రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేరారు. కాంగ్రెస్ కండువా కప్పిన రాహుల్.. పార్టీలోకి ఆహ్వానించారు. పొంగులేటితో పాటు పిడమర్తి రవి, అరికెల నర్సారెడ్డి, పాయం వెంకటేశ్వర్లు, కనకయ్య, డీవీ రావు, పాపిరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. పార్టీలోకి చేరిక అనంతరం జన గర్జన సభలో పొంగిలేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్నారు. మోసపూరిత హామీలతో రెండుసార్లు కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. రైతు రుణమాఫీ హామీని కేసీఆర్ నెరవేర్చలేదు. తెలంగాణ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే’’ అని పొంగులేటి అన్నారు. ‘‘రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం. రాష్ట్రంలో ఏ ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. సీఎం కేసీఆర్ కేవలం మాటలకే పరిమితమయ్యారు. తెలంగాణలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రజల ఆకాంక్షల మేరకే కాంగ్రెస్ పార్టీలోకి చేరాం. బీఆర్ఎస్ను బంగాళాఖాతంలో వేయాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యం’’ అని పొంగులేటి పేర్కొన్నారు. చదవండి: బండి సంజయ్‌పై హైకమాండ్‌కు ఫిర్యాదు చేసిందెవరు? -
కాంగ్రెస్ గూటికి పొంగులేటి.. ప్రకటన అప్పుడే..?
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ పార్టీలో చేరతారనే దానిపై నెలకొన్న ఉత్కంఠ తొలగనుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరుల్లో మెజార్టీ నేతలు కాంగ్రెస్‌లో చేరాలని చేసిన సూచనతో పొంగులేటి సైతం అదే నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సన్నాహాలు చేసుకుంటున్న ఆయన.. తనతో కలిసి వచ్చే ఇతర నాయకులతో కలిసి ఈనెల 12న ఆ పార్టీలో చేరికపై ప్రకటన చేయనున్నారు. పొంగులేటి శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల ముఖ్య నేతలతో ఖమ్మంలో సమావేశమవుతున్నారు. ఈ సందర్భంగా మరోసారి వారి అభిప్రాయాలు తెలుసుకోనున్నట్లు తెలిసింది. జనవరి నుంచే జోరుగా చర్చ ఈ ఏడాది జనవరి ఒకటిన బీఆర్ఎస్పై పొంగులేటి ధిక్కారస్వరం వినిపించినప్పటి నుంచి ఆయన పార్టీ మార్పుపై జోరుగా చర్చ సాగుతోంది. ఆయన మాత్రం ఆచితూచి నిర్ణయం తీసుకుంటానంటూ ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. తాను ఏ పార్టీలో చేరినా తాను ప్రకటించిన అభ్యర్థులే బరిలో ఉంటారని పొంగులేటి చెబుతూ వస్తున్నారు. మొత్తం మీద ఐదు నెలలుగా పొంగులేటి ప్రజల మధ్యే ఉండేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఆతీ్మయ సమ్మేళనాలతో పాటు ఇతర ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనడంపై దృష్టి సారించారు. మేలో రైతు భరోసా ర్యాలీ, పోడు రైతులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించడంతో పాటు యువత కోసం భారీ స్థాయిలో జాబ్‌మేళా ఏర్పాటు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ యత్నాలు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేసీఆర్ వ్యతిరేకులను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాల్లో భాగంగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులతో కలిసి పయనించేందుకు పొంగులేటి సిద్ధమయ్యారు. ఇతర జిల్లాల్లోని అసంతృప్త నేతలతోనూ చర్చలు జరిపారు. బీజేపీలో చేరాలా లేక కాంగ్రెస్‌లో చేరాలా.. ఏ పార్టీలో చేరకుండా సొంత కూటమి ఏర్పాటు చేయాలా? అనే అంశంపై చర్చలు జరిగాయి. అయితే ఖమ్మం జిల్లాలో బలోపేతం కావాలనే లక్ష్యంతో ఉన్న బీజేపీ.. పలు దఫాలు పొంగులేటితో చర్చలు జరపగా, మే 4న బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఖమ్మంలో పొంగులేటి, జూపల్లిని కలిశారు. అనంతరం హైదరాబాద్‌లోనూ వీరు సమావేశమైనట్లు ప్రచారం జరిగింది. మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోనూ చర్చలు జరిగినట్లు సమాచారం. కాగా స్థానిక పరిస్థితులు, ఇతర అన్ని అంశాలనూ బేరీజు వేసుకున్న ఆయన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అనుచరుల నిర్ణయం మేరకు.. ఖమ్మం ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం ఉదయం 7.30కి మొదలయ్యే సమావేశానికి పది నియోజకవర్గాల నుంచి 200 మంది చొప్పున హాజరు కావాల్సిందిగా ఆయన అనుచరులకు సమాచారం అందింది. ఈ భేటీలో అభిప్రాయాలు సేకరించాక వారి నిర్ణయం మేరకు అడుగులు వేస్తానని పొంగులేటి చెప్పినట్లు తెలిసింది. కాగా ఈనెల 12న తన చేరిక విషయమై ప్రకటన చేస్తారని, ఈనెల 28 తర్వాత ఖమ్మంలో జరిగే భారీ బహిరంగసభలో అనుచర గణంతో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సమాచారం. -
కాంగ్రెస్ గూటికి మాజీ సీఎం.. బీజేపీపై కీలక వ్యాఖ్యలు..
బెంగళూరు: బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కేటాయించలేదని బీజేపీకి ఆదివారం రాజీనామా చేసిన ఆయన.. ఆ మరునాడే హస్తం తీర్థం పుచ్చుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, సిద్ధరామయ్య, రణ్‌దీప్ సుర్జేవాలా సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు. బెంగళూరులో ఈ చేరిక కార్యక్రమం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కర్ణాటకలో క్షేత్రస్థాయిలో బీజేపీ బలోపేతం కోసం చాలా ఏళ్లపాటు కృషి చేసిన తనకు.. ఈసారి టికెట్ ఇవ్వకుండా దారుణంగా అవమానించడం షాక్‌కు గురి చేసిందని జగదీశ్ శెట్టర్ పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత, మాజీ సీఎం, పార్టీ అధ్యక్షుడిగా పని చేసిన తాను కాంగ్రెస్‌లో చేరడం చూసి చాలా మంది ఆశ్చర్య పోతున్నారని తెలిపారు. అలాగే తనను రాజీనామా చేయకుండా బీజేపీలో ఎవరూ బుజ్జగించే ప్రయత్నం కూడా చేయలేదని జగదీశ్ తెలిపారు. ఎలాంటి పదవి ఇస్తామని గానీ, పార్టీలో ఉండాలని గానీ ఏ స్థాయి నేత కూడా తనను సంప్రదించలేదని చెప్పారు. #WATCH | Former Karnataka CM Jagadish Shettar joins Congress, in the presence of party president Mallikarjun Kharge, KPCC president DK Shivakumar & Congress leaders Randeep Surjewala, Siddaramaiah at the party office in Bengaluru. Jagadish Shettar resigned from BJP yesterday. pic.twitter.com/vxqVuKKPs1 — ANI (@ANI) April 17, 2023 కాగా.. కర్ణాటకలో బీజేపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్, జేడీఎస్‌లో చేరారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మే 10న ఒకే విడతలో జరగనుంది. 13న కౌంటింగ్, ఫలితాలు ప్రకటిస్తారు. ఇటీవల నిర్వహించిన సీఓటర్ సర్వేలో ఈసారి కాంగ్రెస్‌దే విజయమని తేలింది. చదవండి: రాత్రి నా ఇంటికి ఆగంతుకుడు వచ్చాడు.. భద్రతా వైఫల్యంపై సిద్ధూ ఆందోళన -
కాంగ్రెస్‌లో చేరిన డి.శ్రీనివాస్
సాక్షి, హైదరాబాద్: సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ పాటు ఆయన తనయుడు, నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. డీఎస్‌ను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావ్ ఠాక్రే పార్టీలోకి ఆహ్వానించారు. అయితే, గత కొంతకాలంగా సంజయ్ చేరికపై సందిగ్ధత నెలకొంది. డీఎస్ తనయుడి చేరికను జిల్లా కాంగ్రెస్ నాయకత్వం వ్యతిరేకించింది. అయితే, తండ్రి చొరవతో సంజయ్ చేరికకు మార్గం సుగమమైంది. గతంలో డీఎస్‌తో పాటుగా సంజయ్ టిఆర్ఎస్ (బీఆర్ఎస్)లో చేరారు. గత కొద్దికాలంగా బీఆర్ఎస్కు సంజయ్ దూరంగా ఉంటున్నారు. డీఎస్ చేరికపై ట్విస్టు కాగా, డీఎస్ కాంగ్రెస్‌లో చేరికపై ట్విస్ట్ చోటుచేసుకుంది. కాంగ్రెస్‌లో చేరడం లేదంటూ ముందుగా డీఎస్ పేరుతో ఓ లేఖ విడులైంది. ఆ తర్వాత కాసేపటికే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు డీఎస్ స్వయంగా ప్రకటించారు. వీల్‌చైర్‌లో గాంధీ భవన్‌కు వచ్చిన డీఎస్.. ఇక్కడకు రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. డీఎస్ పేరుతో ప్రచారంలోకి వచ్చిన పత్రికా ప్రకటన ‘‘కాంగ్రెస్‌లో చేరుతున్నా కాబట్టే గాంధీభవన్‌కు వచ్చా. రాహుల్‌కు మద్దతిచ్చేందుకే కాంగ్రెస్ చేరుతున్నా. నేను కాంగ్రెస్ వ్యక్తిని.. నన్ను ఎవరూ పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం లేదు. రాహుల్‌పై అనర్హత వేటువేసే వారికి అసలు అర్హత ఉందా?. రాహుల్ ఊహించని దానికంటే గొప్పగా పనిచేస్తున్నారు’’ అని డీఎస్ అన్నారు. -
దేశ ఐక్యత కోసం భారత్ జోడో యాత్రకు మద్దతిచ్చా : కమల్ హాసన్
-
ఓఎన్‌డీసీలోకి మీషో, ఎందుకో తెలుసా?
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ సంస్థ మీషో తాజాగా ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ)లో చేరింది. కొనుగోలుదారులను హైపర్‌లోకల్ విక్రేతలకు అనుసంధానించేందుకు ఇది ఉపయోగపడ గలదని సంస్థ తెలిపింది. తమ పైలట్ ప్రాజెక్టు ముందుగా బెంగళూరులో ప్రారంభమై తర్వాత మిగతా నగరాలకు విస్తరించనున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విదిత్ ఆత్రే తెలిపారు. (ఆకట్టుకునేలా స్పోర్టీ లుక్‌లో పల్సర్ పీ 150: ధర ఎంతంటే?) మీషోలో 8 లక్షల మంది పైగా విక్రేతలు ఉన్నారు. విక్రేతలు, వినియోగదారుల వ్యయాల భారాన్ని తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఓఎన్డీసీని తెరపైకి తెచ్చింది. ఆన్లైన్లో తక్కువ రేట్లకు ఉత్పత్తులు, సర్వీసులను కొనుగోలుదారులు దక్కించుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఇది ప్రయోగదశలో ఉంది. (Satyam Scam:హెచ్డీఎఫ్సీ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు) -
వావ్..అదరహో! ఎలైట్ క్లబ్‌లోకి ఎస్బీఐ ఎంట్రీ
సాక్షి,ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) మార్కెట్ క్యాప్ ర్యాంకింగ్‌లో ఘనతను సొంతం చేసుకుంది. రూ. 5.03 ట్రిలియన్ల మార్కెట్ క్యాప్‌తో, కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ ర్యాంకింగ్లోఎస్బీఐ ఏడో స్థానాన్ని సాధించింది. దీంతో రూ.5 ట్రిలియన్ల మార్కెట్ క్యాప్‌ను దాటిన దేశంలో మూడో బ్యాంకుగా ఎస్బీఐ నిలిచింది. ఎస్బీఐ రూ. 5-ట్రిలియన్ మార్కును అధిగమించడం ఇదే తొలిసారి. షేర్ ధర సెప్టెంబర్ 14న రికార్డు స్థాయిలో రూ. 573ని తాకింది. బీఎస్ఈ డేటా ప్రకారం మార్కెట్ క్యాపిటలైజేషన్ (మార్కెట్ క్యాప్) తొలిసారిగా రూ. 5ట్రిలియన్ మార్కును తాకింది. బలహీనమైన మార్కెట్లో ఎస్బీఐ షేర్లు లాభాల్లో ఉంది. గత మూడు నెలల్లో ఎ స్బీఐ షేరు 26 శాతం ఎగిసింది. ఈ లిస్ట్‌లో ప్రయివేటు బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ టాప్ ప్లేస్‌లో ఉంది. సంస్థ మార్కెట్ క్యాప్ రూ. 8.42 ట్రిలియన్లు. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ. 6.34 ట్రిలియన్లు గా ఉంది. అలాగే గత మూడునెలల కాలంలో ఐసీఐసీఐ బ్యాంక్ 32 శాతం ర్యాలీ చేయగా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 15 శాతం లాభపడింది. ఈ జాబితాలోని ఇతర ఆరు కంపెనీలు రిలయన్స్ ఇండస్ట్రీస్ (రూ. 17.72 ట్రిలియన్), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (రూ. 11.82 ట్రిలియన్), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (రూ. 8.42 ట్రిలియన్), ఇన్ఫోసిస్ లిమిటెడ్ (రూ. 6.5 ట్రిలియన్), ఐసిఐసిఐ బ్యాంక్ (రూ. 6.34 ట్రిలియన్) యూనిలివర్ (రూ. 6.08 ట్రిలియన్లు) ఉన్నాయి -
కాంగ్రెస్‌లో చేరిన పీజేఆర్ కూతురు విజయారెడ్డి
-
కాంగ్రెస్‌లో చేరిన వివాదాస్పద గాయకుడు..
చంఢీఘడ్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పంజాబ్ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అమరీందర్ సింగ్, సిద్ధూల మధ్య పరస్పర ఆరోపణలు, రాజీనామాల తర్వాత.. కాంగ్రెస్‌లో అనేక పలు ఆసక్తికర మార్పులు సంభవించిన విషయం తెలసిందే. తాజాగా, పంజాబ్ వివాదాస్పద గాయకుడు సిద్ధూ మూసేవాలా కాంగ్రెస్‌లో చేరారు. ఆయన పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ, పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు. మూసేవాలా.. గతంలో ‘సంజు’ అనే పాటల వీడియోలో తుపాకీలను ఉపయోగించారు. ఆ పాట వివాదాస్పదంగామారి, పలు కేసులు కూడా నమోదయ్యాయి. మూసేవాలా చేరికపై సీఎం ఛన్నీ స్పందించారు. మూసేవాలా.. ప్రజల మనస్సులు గెలుచుకున్నారని తెలిపారు. ఆయన తండ్రి మాజీ సైనికాధికారి, తల్లి మాన్సా గ్రామానికి సర్పంచ్‌గా పనిచేశారని తెలిపారు. అదే విధంగా, మూసేవాలా రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మూసేవాలా మాట్లాడుతూ.. తాను మూడేళ్ల కిందట పాటలను పాడటం ఆరంభించానని తెలిపారు. ప్రస్తుతం ఒక కొత్త మార్పు రావాలనే సంకల్పంతో.. ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు. మాన్సా గ్రామం చాలా వెనుక బడి ఉందని, గ్రామాభివృద్ధి కోసమే.. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. మూసేవాలా.. కాంగ్రెస్ పార్టీని గర్వపడేలా చేస్తారనే నమ్మకం ఉందని ఛన్నీ అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా.. నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. మూసేవాలాను ‘చాంప్’ గా కూడా అభివర్ణించారు. కాగా, సిద్ధూ మూసేవాలా అసలు పేరు.. శుభ్ దీప్ సింగ్ సిద్ధూ. ఆయన ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు. సంగీతం నేర్చుకున్నారు. సిద్ధూ మూసేవాలా తన స్వగ్రామమైన మాన్సా నుంచి బరిలో దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. -
పశ్చిమబెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్..
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురు దెబ్బతగిలింది. కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు కీలకనేతలు కీర్తి ఆజాద్, అశోక్ తన్వార్లు .. మమతా బెనర్జీ ఆధ్వర్యంలో తృణముల్ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నారు. కాగా, అశోక్ తన్వార్ గతంలో కాంగ్రెస్ నుంచి ఎంపీగా సేవలందించారు. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు. అదేవిధంగా, కీర్తి ఆజాద్.. 1983లో జరిగిన ప్రపంచకప్ క్రికెట్లో ఆజాద్ ఒక సభ్యుడు. కీర్తి ఆజాద్ 2018లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో కీర్తి ఆజాద్.. అరుణ్‌జైట్లీపై చేసిన వ్యాఖ్యలకు గాను బీజేపీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కాగా, ఆజాద్ బిహార్‌లోని దర్భంగా నియోజక వర్గం నుంచి మూడుసార్లు లోక్‌సభకు ఎంపీగా ఎన్నికయ్యారు. అదే విధంగా.. మాజీ జెడీయూ నేత పవన్ వర్మా.. మమతా బెనర్జీ ఆధ్వర్యంలో టీఎంసీలో చేరారు. -
షూటింగ్లో పొల్గొన్న ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్
చెన్నై: నటుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ పుదుచ్చేరిలో జరుగుతున్న తన రాజా చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ చిత్ర షూటింగ్ తాజా షెడ్యూల్ శుక్రవారం పుదుచ్చేరిలో మొదలైంది. ఉదయనిధికి జంటగా నిధి అగర్వాల్ నటిస్తున్నారు. కలైయరసన్ ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో బిగ్‌బాస్ రియాల్టీ షో ప్రేమ్ ఆరవ్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. దీనికి మగిళ్ తిరుమేణి దర్శకత్వం వహిస్తున్నారు. -
కౌశిక్‌రెడ్డి చిన్న పదవితో ఆగిపోడు.. రాష్ట్ర స్థాయి పదవి వస్తది
సాక్షి, కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనే విషయంలో పార్టీ అధినేత ఇంకా కేసీఆర్ స్పష్టత ఇవ్వలేదు. పీసీసీ మాజీ కార్యదర్శి పాడి కౌశిక్‌రెడ్డిని బుధవారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్లోకి ఆహ్వానించిన కేసీఆర్ ఆయనకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని స్పష్టమైన మాత్రం హామీ ఇచ్చారు. ఆయనకు హుజూరా బాద్‌కు, కరీంనగర్ జిల్లాకు, రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహించే పదవి దక్కుతుందని నొక్కి చెప్పారు. ‘కౌశిక్‌రెడ్డి ఏదో ఒక చిన్న పదవితోనే ఆగిపోడు. ఉజ్వల భవిష్యత్తు ఉంటది. ఎదుగుతున్న యువకులే భవిష్యత్ నిర్మాతలు. ఎవరు ఏమన్నా ప్రయాణం కొనసాగుతుంది’ అని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కౌశిక్‌రెడ్డి మంచి క్రికెటర్ అని చెపుతూ రాష్ట్ర స్థాయి పదవి ఇస్తాననడంతో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్)కి చైర్మన్‌గా నియమిస్తారన్న ప్రచారం నిజం కానున్నట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ చుట్టూనే కేసీఆర్ ప్రసంగం సాగినా.. అసెంబ్లీ టికెట్టు ఎవరికి అనే విషయంలో మాట దొర్లలేదు. దీనిని బట్టి కౌశిక్‌రెడ్డిని హుజూరాబాద్ టికెట్టు రేసు నుంచి తప్పించినట్టేనని రాజకీయ పరిశీలకులు చెపుతున్నారు. హుజూరాబాద్‌లో దళితబంధు 100 శాతం పెట్టుడే ‘దళితబంధును హుజూరాబాద్ నుంచే పైలట్ ప్రాజెక్టుగా ఎందుకు పెడుతున్నారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకే అని అంటున్నారని నిన్న ఒకతను చెప్పాడు.. పెట్టమా మరి.. టీఆర్ఎస్ ఏమన్నా సన్నాసుల మఠమా..? రాజకీయ పార్టీనే కదా. ముఖ్యమంత్రిగా ఉన్న కాబట్టే ఈ పథకాన్ని పెడుతున్నప్పుడు.. రాజకీయంగా లాభం జరగాలని ఎందుకు కోరుకోం’ అని సీఎం కేసీఆర్ విమర్శుకుల మాటలను కొట్టివేశారు. హుజూరాబాద్ నుంచే దళితబంధు పథకాన్ని 100 శాతం పెడుతున్నట్లు స్పష్టం చేశారు. ‘నాకు కరీంనగర్ అంటె సెంటిమెంట్. టీఆర్ఎస్ పుట్టినంక సింహగర్జన అక్కడనే పెట్టినం. దాంతోనే తెలంగాణ ఉద్యమం స్టార్టయి రాష్ట్రం వచ్చింది. హుజూరాబాద్ నుంచే రైతుబంధు స్టార్ట్ చేసినం. కరీంనగర్ కేంద్రంగా రైతుబీమా ప్రకటించిన. ఇప్పుడు దళితబంధు కూడా అక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్న’ అని పేర్కొన్నారు. దళితబంధు అమలులో పాలు పంచుకోవాలి హుజూరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమయ్యే దళితబంధు పథకం అమలులో యువకులు, పార్టీ కార్యకర్తలు పాలుపంచుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. కౌశిక్‌రెడ్డి వెంట పార్టీలో చేరేందుకు వచ్చిన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ పథకం అమలుకు ప్రతి ఒక్కరూ సముచిత పాత్ర పోషించాలని సూచించారు. కౌశిక్‌రెడ్డి రాజకీయ కుటుంబం నుంచి వచ్చారని, ఆయన తండ్రి సాయినాథ్ రెడ్డి తనతోపాటు మలివిడత ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పారు. కౌశిక్‌రెడ్డి తాత సుధాకర్‌రెడ్డి ఇతర కుటుంబసభ్యులు కూడా తనకు చాలా తెలుసని చెపుతూ మంచి భవిష్యత్తు ఉంటుందని పలుమార్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లాకు చెందిన మంత్రులు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. -
ఎల్ రమణ టీఆర్ఎస్లో చేరికకు ముహూర్తం ఖరారు
సాక్షి, హైదరాబాద్: టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్. రమణ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యేందుకు ముహుర్తం ఖరారైంది. రేపు టీఆర్ఎస్ సభ్యత్వాన్ని ఎల్. రమణ తీసుకోనున్నారు. రమణకు టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవ్వనున్నారు. ఈ నెల 16న సీఎం కేసీఆర్ సమక్షంలో టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్. రమణ టీఆర్ఎస్లో చేరనున్నారు. టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ పార్టీకి గుడ్‌బై చెప్తూ టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు తన రాజీనామా లేఖను జూలై 9 న శుక్రవారం మీడియాకు విడుదల చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రజలకు మరింత చేరువగా రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే భావనతో టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నానని లేఖలో పేర్కొన్నారు. గత 30 ఏళ్లుగా నా ఎదుగుదలకు సహకరించిన హృదయపూర్వక ధన్యవాదాలు’అని చంద్రబాబుకు పంపిన ఆ లేఖలో ఎల్.రమణ తెలిపారు. -
ఠాక్రేకు షాకిచ్చిన సీనియర్ నేత..
సాక్షి, ముంబై : కల్యాణ్–డోంబివలి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ ఫిరాయింపుల బెడద అధికమైంది. పార్టీ ఉపాధ్యక్షుడు రాజేశ్ కదం మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎంఎన్ఎస్) నుంచి బయటపడి శివసేన తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఎంఎన్ఎస్ మాజీ ప్రతిపక్ష నాయకుడు మందార్ హలబే సైతం ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఆయన మంగళవారమే బీజేపీలో చేరడం కలకలం సృష్టించింది. దీంతో డోంబివలిలో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేనకు చెందిన పలువురు కీలక నాయ కులు, పదాధికారులు, కార్యకర్తలు పార్టీ నుంచి బయట పడే అవకాశం ఉంది. వీరంతా శివసేన, బీజేపీలో చేరడం వల్ల వచ్చే ఎన్నికల్లో డోంబివలిలో ఎంఎన్ఎస్కు గట్టి దెబ్బ తగలడం ఖాయమని స్పష్టమవుతోంది. అంతేగాకుండా స్థానికంగా ఎంఎన్ఎస్ ప్రాబల్యం తగ్గిపోయి, వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు తారుమారయ్యే ప్రమా దం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజు పాటిల్‌పై బాధ్యతలు.. ఎంఎన్ఎస్కు చెందిన డోంబివలి నగర అధ్యక్షుడు, ఎంఎన్ఎస్ ఉపాధ్యక్షుడు రాజేశ్ కదం, తన సహచరులతో కలిసి సోమవారం సాయంత్రం శివసేనలో చేరారు. రాజేశ్ కదం శివసేనలో చేరడానికి శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే ప్రధాన పాత్ర పోషించారు. మాతోశ్రీ బంగ్లాలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, థానే జిల్లా ఇన్చార్జీ మంత్రి ఏక్నాథ్ షిండే సమక్షంలో రాజేశ్ శివసేనలో చేరారు. గతంలో శివసేనలో కొనసాగిన రాజేశ్ కదం ఎంఎన్ఎస్ స్థాపించిన తరువాత రాజ్ ఠాక్రేతోపాటు ఆయన కూడా బయటకు వచ్చారు. అప్పటి నుంచి ఎంఎన్ఎస్లో కొనసాగిన రాజేశ్ కదం ఇలా అకస్మాత్తుగా పార్టీ మారడం జీర్ణించుకోలేకపోతున్నారు. రాజేశ్ శివసేనలో చేరి 24 గంటలు గడవక ముందే అంటే మంగళవారం ఎంఎన్ఎస్ కార్పొరేటర్, మాజీ ప్రతిపక్ష నాయకుడు మందార్ హలబే బీజేపీ ప్రదేశ్ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ సమక్షంలో బీజేపీలో చేరారు. మందార్ రాజ్ ఠాక్రేకు అతి సన్నిహితుడని, డోంబివలిలో తిరుగులేని నాయకుడిగా పేరుంది. ఇలా వరుసగా ఇరువురు కీలక నాయకులు పార్టీ నుంచి బయటపడటంవల్ల భవిష్యత్తులో ఎంఎన్ఎస్కు నష్టం వాటిళ్లే ప్రమాదం లేకపోలేదు. వీరి కారణంగా డోంబవలిలో ఎమ్మెన్నెస్ బలహీనపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఏకైక ఎంఎన్ఎస్ ఎమ్మెల్యే రాజు పాటిల్ త్వరలో జరగనున్న డోంబివలి కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీని ఎలా బలోపేతం చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. స్థానిక ఎన్నికల బాధ్యతలు ఆయనకే అప్పగించే సూచనలున్నాయి. ఇదిలా ఉండగా రాజేశ్ కదం శివసేనలో చేరడంవల్ల డోంబివలి నగర అధ్యక్ష పదవి మళ్లీ మనోజ్ ఘరత్కు కట్టబెట్టారు. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే సమక్షంలో ఆయన ఈ పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో మనోజ్ మూడేళ్లు నగర అధ్యక్ష పదవిలో కొనసాగారు. ఇప్పుడు మళ్లీ పదవీ బాధ్యతలు స్వీకరించడంతో పార్టీలో నూతనోత్తేజాన్ని నింపినట్లయింది. బీజేపీతో కలుస్తారా? ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొత్త రాజకీయ సమీకరణాలు కనిపించే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు కలిసికట్టుగా పోటీ చేసిన శివసేన, బీజేపీలు రాబోయే ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయనున్నారు. మరోవైపు శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు కూడా కలిసి పోటీ చేసే అవకాశాలున్నాయి. ఇదిఇలాఉండగా మరోవైపు ఈ మూడు పార్టీలు కలిస్తే వీరిని అడ్డుకునేందుకు మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్)తో బీజేపీ చేతులు కలిపే అవకాశాలున్నాయి. దీనిపై ఇప్పటికే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అనేక సంవత్సరాలుగా బీఎంసీలో తిరుగులేని పార్టీగా కొనసాగుతున్న శివసేనను అధికారానికి దూరం చేయాలని బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. దీంతో శివసేనను దెబ్బతీయడానికి వచ్చే బీఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఎంఎన్ఎస్తో జతకడుతుండవచ్చని వార్తలు వచ్చాయి. అనుకున్న విధంగానే ఇటీవలె బీజేపీ ఎమ్మెల్యే ప్రసాద్ లాడ్ ఎమ్ఎన్ఎస్ చీఫ్ రాజ్‌ఠాక్రేతో భేటీ కావడంతో వార్తలు నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఎంసీ ఎన్నికల్లో శివసేనను ఢీకొట్టడానికి బీజేపీ, ఎంఎన్ఎస్ ఒక్కటవుతాయా లేదా అన్ని పార్టీలు ఒంటరిగానే బరిలోకి దిగనున్నాయా అనేది వేచి చూడాల్సిందే. -
‘మా కుమారుడ్ని విడిచిపెట్టండి’
శ్రీనగర్: కశ్మీర్‌కు చెందిన మరో యువకుడు ఉగ్రవాదుల్లో చేరాడు. గ్రేటర్ నోయిడాలోని శారద విశ్వవిద్యాలయంలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుకుంటున్న అహ్‌తెసామ్ బిలాల్ సోఫీ(17) ఇస్లామిక్‌స్టేట్ ఆఫ్ జమ్మూకశ్మీర్(ఐఎస్‌జేకే) ఉగ్రసంస్థలో చేరాడు. ఐఎస్ జెండా ముందు బిలాల్ దిగిన ఫొటో ప్రస్తుతం ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. శ్రీనగర్‌కు చెందిన సోఫీ నోయిడాలో చదువుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లేందుకు వర్సిటీ అధికారుల నుంచి అనుమతి తీసుకుని అక్టోబర్ 28న వర్సిటీ నుంచి బయలుదేరిన సోఫీ అదృశ్యమయ్యాడు. దీంతో కుటుంబసభ్యులు నోయిడాతో పాటు శ్రీనగర్‌లోని ఖన్యార్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ కుమారుడిని దయచేసి ఇంటికి పంపాలని ఉగ్రవాదులను వేడుకుంటూ సోఫీ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సోఫీ తండ్రి బిలాల్ ఓ వీడియోలో ఉగ్రవాదులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘మా మీద దయ చూపండి. దయచేసి నా కుమారుడిని ఇంటికి పంపండి. మా మొత్తం కుటుంబంలో ఏకైక మగ సంతానం అతడే. సోఫీ.. మన కుటుంబంలోని 12 మందికి నువ్వే దిక్కు. గత రెండేళ్లలో మన కుటుంబంలో నలుగురిని పోగొట్టుకున్న సంగతి మర్చిపోయావా?’ అని అన్నారు. ఇంటికి రావాల్సిందిగా తల్లి సైతం కొడుకును వీడియోలో కోరింది. -
అనిల్‌కుమార్ సమక్షంలో పార్టీలో చేరిన నెల్లూరు యువత
-
విజయనగరం జిల్లాలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ
-
తూ.గో.జిల్లాలో వైఎస్సార్సీపీ
-
వైఎస్ఆర్ సీపీలోకి మరో నేత
-
వైఎస్ఆర్ సీపీలోకి మరో నేత
హైదరాబాద్: నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలం పుంజుకుంటోంది. ఆ పార్టీలోకి ఇతర పార్టీల నేతల చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. తాజాగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు హబీబుల్లా పార్టీలో చేరారు. వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ కండువా కప్పి హబిబుల్లాను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హబీబుల్లా మాట్లాడుతూ.. ఉప ఎన్నికల్లో శిల్పా మోహన్ రెడ్డి తరఫున ప్రచారం చేసి వైఎస్ఆర్ సీపీ గెలుపునకు అన్ని విధాలా కృషి చేస్తామన్నారు. పార్టీ నేతలు ఎంపీ మిథున్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, హఫీజ్ ఖాన్ ఆధ్వర్యంలో మరికొందరు ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలోకి చేరారు. 2014లో నంద్యాల అసెంబ్లీ నుంచి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున హబిబుల్లా పోటీ చేశారు. ఆగస్టు మూడో తేదీన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి శిల్పా చక్రపాణి రెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరారు. గతంలో కర్నూలు ఎంపీ బుట్టారేణుక ఆధ్వర్యంలో టీడీపీ, వామపక్షాలకు చెందిన దాదాపు 500 మంది వైఎస్ఆర్ సీపీ చేరిన సంగతి తెలిసిందే. -
వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు
కర్నూలు: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండలంలో పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీలో చేరారు. మండల కేంద్రంలో శనివారం మధ్యాహ్నం జరిగిన ఓ కార్యక్రమంలో ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్యే గుమ్మునూరు జయరాం, జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ, వామపక్షాలకు చెందిన దాదాపు 500 మంది వైసీపీలో చేరారు. అంతకుమునుపు రూ.40 లక్షలతో చేపట్టే అభివృద్ధి పనులకు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ శంకుస్థాపన చేశారు. దీంతో పాటు హెబ్బటం చెరువును వారు పరిశీలించారు. -
ఫేస్బుక్ గూటికి టాప్ గ్లోబల్ టెక్ ఎగ్జిక్యూటివ్
షియోమీ సంస్థకు రాజీనామా చేసిన హ్యోగో బర్రా కొత్త ప్రస్థానం ఎక్కడినుంచో తెలుసా? ఫేస్బుక్ ఎమోషనల్ లెటర్ ద్వారా షియోమికి గుడ్ బై చెబుతున్నట్టు సింబాలిక్ గా వెల్లడించిన బర్రా ఫేస్ బుక్ గూటికి చేరారు. ఈ టాప్ గ్లోబల్ టెక్ ఎగ్జిక్యూటివ్ ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్ బుక్ లో కొలువుదీరారు. వర్చువల్ రియాలిటీ విభాగం వ్యాపారాన్ని హ్యోగో బర్రా లీడ్ చేయనున్నారట. ఈ విషయాన్ని స్వయంగా ఫేస్ బుక్ అధిపతి మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించారు. వినూత్నమైన మొబైల్స్ తో లక్షలాదిమంది ఫోన్ వినియోగదారులకు చేరువైన హ్యోగో తన టీంలో చేరడం సంతోషంగా ఉందన్నారు. వర్చువల్ రియాలీటీ తో జుకర్, బర్రా ల ఆకర్షణీయ ఫోటోను కూడా పోస్ట్ చేశారు. ఓక్లస్ వీఆర్ హెడ్ గా బర్రాను నియమించుకుందనీ, వర్చువల్ రియలిటీ, ప్రధాన కంప్యూటింగ్ వేదికను ఆయన లీడ్ చేయనున్నారని ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా సీఈవో వెల్లడించారు. వాస్తవిక మరియు అనుబంధ వాస్తవికత టెక్నాలజీలు భవిష్యత్తు ప్రధాన కంప్యూటింగ్ ప్లాట్ ఫాం లన్న తన నమ్మకాన్ని బర్రా విశ్వసించారని తెలిపారు. బర్రా తమ సంస్థకు కొత్త అనుభవాలను పంచునున్నారనే విశ్వసాన్ని జుకర్ బర్గ్ వ్యక్తంచేశారు. 2014 లో ఈ (ఓక్లస్ యూనిట్) ను ఫేస్ బుక్ సొంతం చేసుకుంది. బర్రా ను స్వాగతించిన ఓక్లస్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసింది. కాగా చైనా మొబైల్ మేకర్ షియోమికి హ్యుగో బర్రా ఇటీవల గుడ్ బై చెప్పారు. త్వరలో బీజింగ్ నుంచి పుట్టిల్లు సిలికాన్ వ్యాలీకి చేరుతున్నట్టు ప్రకటించిన బర్రా కంప్యూటింగ్ ప్లాట్ ఫాంలో వర్చ్యువల్ అండ్ అగ్ మెంటెడ్ రియాల్టీ కీలక పాత్ర పోషించనున్నాయనే అభిప్రాయాన్ని ఫేస్ బుక్ పోస్ట్ లో వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. Please welcome Hugo Barra, our new VP of VR at Facebook! https://t.co/zuYdrXkIUY pic.twitter.com/GezeEu7QiV — Oculus (@oculus) January 26, 2017 -
బీజేపీ తీర్థం పుచ్చుకున్న మరో హీరో
-
ఆస్పత్రిలో సినీ నిర్మాత నట్టికుమార్
-
అనురాగ్ ఠాకూర్ కొత్త ఇన్నింగ్స్!
న్యూఢిల్లీః భారతీయ జనతాపార్టీ ఎంపీ, బీసిసిఐ ఛీఫ్ అనురాగ్ ఠాకూర్ ఇప్పుడు ఎల్టీ అనురాగ్ ఠాకూర్ గా మారిపోయారు. శుక్రవారం ఆయన టెరిటోరియల్ ఆర్మ రెగ్యులర్ ఆఫీసర్ గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఉదయం 11 గంటలకు సౌత్ బ్లాక్ లో ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ దల్బీర్ ఎస్ సుహాగ్ ద్వారా టెరిటోరియల్ ఆర్మీ రెగ్యులర్ ఆఫీసర్ గా కొత్త బాధ్యతలు చేపట్టారు. దీంతో మిలటరీలో చేరిన మొదటి బీజేపీ ఎంపీగా ఠాకూర్ రికార్డు సృష్టించారు. బీసీసీఐ చీఫ్, బిజేపీ ఎంపి, 41 ఏళ్ళ అనురాగ్ ఠాకూర్ ఆర్మీ ఆఫీసర్ గా శుక్రవారం ఉదయం నూతన బాధ్యతలు స్వీకరించారు. తాతగారు ఆర్మీలో పనిచేయడంతో తనకు ఆర్మీలోచేరి, దేశానికి సేవ చేయాలన్న కోరిక చిన్నతనంనుంచీ బలంగా ఉండేదని వేడుక సందర్భంగా మాట్లాడిన ఠాకూర్ తెలిపారు. తన కల ఇన్నాళ్ళకు సాకారమైందని, టెరిటోరియల్ ఆర్మీలో పనిచేస్తూ... దేశ ప్రజల సమస్యలను పార్లమెంట్ లో వినిపించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని, దేశ భద్రతకు తనవంతు సేవ అందిస్తానని ఠాకూర్ పేర్కొన్నారు. టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించిన పరీక్షను పూర్తి చేసిన అనంతరం ఠాకూర్ తన పర్సనల్ ఇంటర్వ్యూను ఛండీగఢ్ లోనూ, ట్రైనింగ్ ను భోపాల్ లోనూ పూర్తి చేశారు. హిమాచల్ ప్రదేశ్ లోని హమిత్ పూర్ నుంచి లోక్ సభ మెంబర్ గా ఎన్నికైన ఠాకూర్ టెరిటోరియల్ ఆర్మీ రెగ్యులర్ ఆఫీసర్ కు అవసరమైన ట్రైనింగ్ ను పూర్తి చేశారు. డిఫెన్స్ లో రెగ్యులర్ ఆర్మీ తర్వాతి స్థానంలో ఉన్న టెరిటోరియల్ ఆర్మీలో.. సుమారు నెలనుంచి, సంవత్సరంపాటు ప్రత్యేక మిలటరీ ట్రైనింగ్ తీసుకున్న వాలంటీర్లను, అత్యవసర పరిస్థితుల్లో దేశ భద్రతకోసం వినియోగించుకుంటారు. -
వైఎస్ఆర్ సీపీలో చేరిన పలువురు నేతలు
హైదరాబాద్: కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతానికి చెందిన పలువురు నాయకులు శనివారం వైఎస్ఆర్ సీపీలో చేరారు. వైఎస్ఆర్ సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, మలిక్‌రాజ్‌గోపాల్ రెడ్డిల ఆధ్వర్యంలో.. మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ ద్వారం వీరారెడ్డి, ఎన్ఎండీ జహీర్ భాషా, రైతు నగర సర్పంచ్ కొండారెడ్డి తదితరులు హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో వైఎస్ఆర్ సీపీలో చేరారు. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి కండువాలు కప్పి నేతలను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వారు వైయస్ జగన్‌తో పలు సమస్యలపై చర్చించారు. -
సీట్లు అధికం...చేరికలు స్వల్పం
డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల తీరిది * తొలి దశ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందినా చేరని 58,280 మంది విద్యార్థులు * రెండో దశలోనూ చేరింది తక్కువే * రేపట్నుంచి 12 వరకు చివరిదశ వెబ్ ఆప్షన్లు * 14న సీట్ల కేటాయింపు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలు గందరగోళంగా తయారయ్యాయి. లక్షల మందికి సీట్లు కేటాయించినా కాలేజీల్లో చేరిన విద్యార్థుల సంఖ్య వేలల్లోనే ఉంది. కోర్టును ఆశ్రయించి ఆన్లైన్ ప్రవేశాల నుంచి మినహాయింపు పొందిన 13 కాలేజీల యాజ మాన్యాలు తొలి దశ కౌన్సెలింగ్‌లో సీట్లు లభిం చిన విద్యార్థులను చేర్చుకునేందుకు నిరాకరించగా.. మరోవైపు సీటు లభించిన కాలేజీల్లో చేరేందుకు ఇష్టంలేక మరికొందరు విద్యార్థులు కాలేజీల్లో చేరడం లేదు. ఇంకొందరికి ఎక్కువ సంఖ్యలో వెబ్ ఆప్షన్లు ఇవ్వకపోవడంతో సీట్లు లభించలేదు. దీంతో విద్యార్థులు ఎక్కువగా ఉన్నా భర్తీ అయిన సీట్లు తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి 12వ తేదీ వరకు చివరి దశ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారం భం కానుంది. ఇందుకోసం కళాశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. విద్యార్థులకు ఈ నెల 14న సీట్లు కేటాయిస్తామని, 18వ తేదీలోగా వారంతా కాలేజీల్లో చేరాలని స్పష్టం చేసింది. తొలి దశలో సీట్లు పొందిన విద్యార్థులకు తరగతులను ఈ నెల 4 నుంచి ప్రారంభించింది. 1.47 లక్షలకు చేరింది 89,327 మందే.. డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల్లో భాగంగా 3,97,430 సీట్ల భర్తీకి కళాశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. తొలి దశ ప్రవేశాల్లో భాగంగా కాలేజీల్లో చేరేందుకు 1,74,744 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో 1,71,900 మందే గత నెలలో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వారిలోనూ 1,47,607 మందికి సీట్లు కేటాయించగా 1,28,453 మందే అలాట్మెంట్ లెటర్లను డౌన్లోడ్ చేసుకున్నారు. వారిలో 89,327 మందే కాలేజీల్లో చేరారు. అంటే సీట్లు పొందిన విద్యార్థుల్లో 58,280 మంది కాలేజీల్లోనే చేరలేదు. ఇక గత నెల 29 నుంచి ఈ నెల 1 వరకు చేపట్టిన రెండోదశ కౌన్సెలింగ్‌లో 68,337 మంది రిజిస్ట్రేషన్ చేయించుకోగా (ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు, గతంలో రిజిస్టర్ చేసుకోని విద్యార్థులు) 65,726 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. ఇందులోనూ సీట్లు లభించిన వారిలో అధికశాతం విద్యార్థులు చేరలేదు. -
భారత వైమానికదళంలోకి 'తేజస్'
బెంగళూరు: భారత వైమానిక దళం సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. తేలికపాటి యుద్ధ విమానం 'తేజస్'ను బెంగళూరులో శుక్రవారం భారత వైమానిక దళంలోకి ప్రవేశపెట్టారు. హిందుస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) ఆధ్వర్యంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన 'తేజస్' చేరికతో భారత వైమానిక దళం అగ్రశ్రేణి దేశాల సరసన చేరినట్లు చెప్పొచ్చు. భారత వైమానిక దళంలో దీనిని చేర్చడానికి 33 ఏళ్ల సుదీర్ఘకాలం పట్టడం పూడ్చలేని లోటు అయినప్పటికీ.. తేజస్ చేరిక వైమానిక దళానికి కొత్త ఉత్సాహాన్నిస్తుంది. ఇవాళ జరిగిన కార్యక్రమంలో రెండు తేజస్ ఎయిర్ క్రాఫ్ట్‌లను భారత వైమానిక దళంలోకి ప్రవేశపెట్టారు. మొట్టమొదటి తేజస్ స్క్వాడ్రన్‌ను 'ఫ్లయింగ్ డ్యాగర్స్' గా పిలుస్తున్నారు. ఈ స్క్వాడ్రన్‌లోకి మరో ఆరు తేజస్‌లు త్వరలోనే చేరనున్నాయి. -
రాష్ట్రపతి అభ్యర్ధిరేసులో కురువృద్ధుడు!
కురువృద్ధుడు, భారతీయ జనతా పార్టీ(బీజేపీ) లీడర్ మురళీ మనోహర్ జోషి రాష్ట్రపతి భవన్ కు వెళ్లాలనే యోచనలో ఉన్నారా? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలు ఈ విషయాన్నే చెప్తున్నాయి. పార్టీ తరఫు నుంచి రాష్ట్రపతి అభ్యర్ధిత్వానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్), బీజేపీ నాయకుల మద్దతు కోసం ఇప్పటికే లాబీయింగ్ ను మొదలుపెట్టారు. వచ్చే ఏడాది ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ముగియనుండటంతో కొత్త రాష్ట్రపతికి ఎన్నికలు జరగనున్నాయి. ఎలాగైనా బీజేపీ తరఫు నుంచి రాష్ట్రపతి అభ్యర్ధిగా తనను నిర్ణయించడంపై ఇప్పటికే ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, కొంతమంది సంఘ్ నాయకులను కలిసి చర్చించినట్లు సమాచారం. కాగా, ఆర్ఎస్ఎస్ కు చెందిన దేవేంద్ర స్వరూప్ ఇప్పటికే జోషికి అభ్యర్ధిత్వం పట్ల సుముఖతను వ్యక్తం చేశారు. ఇందిరా గాంధీ జాతీయ ఆర్ట్స్ కేంద్రం అధ్యక్షుడు రామ్ బహదూర్ రాయ్ కూడా జోషికి తన సపోర్టును ప్రకటించారు. Murli Manohar Joshi, joins, next President of India race, మురళీ మనోహర్ జోషి, లాబీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎన్నికలు, అభ్యర్థిత్వం -
టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధి
-
వైఎస్సార్సీపీలోకి వీరాశివారెడ్డి సోదరుడి కుమారులు
-
వైఎస్ఆర్సీపీలో చేరిన కోనేరు ప్రసాద్
-
ఇక ఫేస్‌బుక్‌లోనూ శ్రుతి
ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత జనాన్ని ట్విట్టర్, ఫేస్‌బుక్‌లు చాలా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా సినిమా వాళ్లకు ప్రచారానికి ఈ వెబ్సైట్లు చాలా దోహదపడుతున్నాయి. ప్రమోట్ చేసుకోవడానికి ఇప్పటి వరకు మీడియూను ఆశ్రయించిన తారలు ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా ట్విట్టర్, ఫేస్‌బుక్‌లను వాడుకుంటున్నారు. సినిమా వివరాలను, విశేషాలను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ వస్తున్న నటి శ్రుతిహాసన్ తాజాగా ఫేస్బుక్ ఖాతాను ఓపెన్ చేసిందట. ఈ విషయాన్ని ఈ క్రేజీ హీరోయిన్ తన ట్విట్టర్లో పేర్కొంటూ http://www.facebook. com/shrutihaasan పేరుతో ఫేస్బుక్ అకౌంట్‌ను ప్రారంభించానని తెలిపారు. తన చిత్రాలకు సంబంధించిన కొత్త కొత్త విషయాలు, ఫొటోలు తెలుసుకోవడానికి ఈ ఫేస్‌బుక్‌ను చూడడంటూ పేర్కొన్నారు. ఇప్పటి వరకు శ్రుతి ట్విట్టర్‌ను 9,29,000 మంది ఫాలో అవుతున్నారట. దీంతోనే అర్థమవుతుందిగా శ్రుతి స్టార్ పవర్ ఏమిటో. ఇక ఆమె ఫేస్ బుక్ లవర్స్ ఎంత మంది అవుతారో వేచిచూడాల్సిందే. -
మళ్లీ బీజేపీలో చేరిన కృష్ణంరాజు
-
బిజెపిలో చేరిన ఒలంపిక్ హీరో