స్మృతి కోసం చాలా ట్రై చేశాం.. ఎట్టకేలకు మా జట్టులో!(ఫొటోలు) | Smriti Mandhana Joins Wbbl Champions 2024 Adelaide Strikers Ahead Of Season 10, Photos Gallery Inside | Sakshi
Sakshi News home page

Smriti Mandhana Photos: స్మృతి కోసం చాలా ట్రై చేశాం.. ఎట్టకేలకు మా జట్టులో!(ఫొటోలు)

Published Wed, Aug 28 2024 9:37 PM | Last Updated on

Smriti Mandhana joins WBBL champions Adelaide Strikers Photos1
1/10

అడిలైడ్‌ స్ట్రయికర్స్‌తో స్మృతి మంధాన

Smriti Mandhana joins WBBL champions Adelaide Strikers Photos2
2/10

భారత మహిళల క్రికెట్‌ జట్టు ఓపెనర్‌ స్మృతి మంధాన మహిళల బిగ్‌ బాష్‌ టి20 లీగ్‌ (డబ్ల్యూబీబీఎల్‌)లో అడిలైడ్‌ స్ట్రయికర్స్‌ తరఫున బరిలోకి దిగనుంది.

Smriti Mandhana joins WBBL champions Adelaide Strikers Photos3
3/10

చాన్నాళ్లుగా స్మృతి సేవల కోసం ప్రయత్నిస్తున్న అడిలైడ్‌ ఫ్రాంచైజీ ఎట్టకేలకు టీమిండియా స్టార్‌ను దక్కించుకుంది.

Smriti Mandhana joins WBBL champions Adelaide Strikers Photos4
4/10

లీగ్‌లో కొత్తగా తీసుకొచ్చిన విదేశీ ప్లేయర్ల నిబంధనల ప్రకారం సీజన్‌ ఆరంభానికి ముందు గత సీజన్‌ చాంపియన్‌ అడిలైడ్‌ జట్టు స్మృతిని సొంతం చేసుకుంది.

Smriti Mandhana joins WBBL champions Adelaide Strikers Photos5
5/10

స్మృతి డబ్ల్యూబీబీఎల్‌లో ఇప్పటివరకు బ్రిస్బేన్‌ హీట్, సిడ్నీ థండర్, హోబర్ట్‌ హరికేన్స్‌ జట్లకు ప్రాతినిధ్యం వహించింది.

Smriti Mandhana joins WBBL champions Adelaide Strikers Photos6
6/10

అక్టోబర్‌ 27 నుంచి డబ్ల్యూబీబీఎల్‌ సీజన్‌ ప్రారంభం కానుండగా... తొలి దశ పోటీలకు స్మృతి అందుబాటులో ఉండకపోవచ్చు. అదే సమయంలో భారత జట్టు న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ ఆడనుంది.

Smriti Mandhana joins WBBL champions Adelaide Strikers Photos7
7/10

ఈ సిరీస్‌ ముగిశాక అడిలైడ్‌ స్ట్రయికర్స్‌తో స్మృతి చేరనుంది.

Smriti Mandhana joins WBBL champions Adelaide Strikers Photos8
8/10

‘స్మృతి కోసం చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాం. ఎట్టకేలకు ఆమె మా బృందంలో చేరింది.

Smriti Mandhana joins WBBL champions Adelaide Strikers Photos9
9/10

క్షణాల్లో ప్రత్యర్థి నుంచి మ్యాచ్‌లను లాగేసుకోవడంలో స్మృతిది అందెవేసిన చేయి.

Smriti Mandhana joins WBBL champions Adelaide Strikers Photos10
10/10

మహిళల ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు తరఫున ఆమెతో కలిసి ఆడటాన్ని ఎంతో ఆస్వాదించా’ అని అడిలైడ్‌ జట్టు కెప్టెన్‌ తాలియా మెక్‌గ్రాత్‌ పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement