లెటర్ ద్వారా షియోమికి గుడ్ బై చెబుతున్నట్టు సింబాలిక్ గా వెల్లడించిన బర్రా ఫేస్ బుక్ గూటికి చేరారు.
షియోమీ సంస్థకు రాజీనామా చేసిన హ్యోగో బర్రా కొత్త ప్రస్థానం ఎక్కడినుంచో తెలుసా? ఫేస్బుక్ ఎమోషనల్ లెటర్ ద్వారా షియోమికి గుడ్ బై చెబుతున్నట్టు సింబాలిక్ గా వెల్లడించిన బర్రా ఫేస్ బుక్ గూటికి చేరారు. ఈ టాప్ గ్లోబల్ టెక్ ఎగ్జిక్యూటివ్ ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్ బుక్ లో కొలువుదీరారు. వర్చువల్ రియాలిటీ విభాగం వ్యాపారాన్ని హ్యోగో బర్రా లీడ్ చేయనున్నారట. ఈ విషయాన్ని స్వయంగా ఫేస్ బుక్ అధిపతి మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించారు. వినూత్నమైన మొబైల్స్ తో లక్షలాదిమంది ఫోన్ వినియోగదారులకు చేరువైన హ్యోగో తన టీంలో చేరడం సంతోషంగా ఉందన్నారు. వర్చువల్ రియాలీటీ తో జుకర్, బర్రా ల ఆకర్షణీయ ఫోటోను కూడా పోస్ట్ చేశారు.
ఓక్లస్ వీఆర్ హెడ్ గా బర్రాను నియమించుకుందనీ, వర్చువల్ రియలిటీ, ప్రధాన కంప్యూటింగ్ వేదికను ఆయన లీడ్ చేయనున్నారని ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా సీఈవో వెల్లడించారు. వాస్తవిక మరియు అనుబంధ వాస్తవికత టెక్నాలజీలు భవిష్యత్తు ప్రధాన కంప్యూటింగ్ ప్లాట్ ఫాం లన్న తన నమ్మకాన్ని బర్రా విశ్వసించారని తెలిపారు. బర్రా తమ సంస్థకు కొత్త అనుభవాలను పంచునున్నారనే విశ్వసాన్ని జుకర్ బర్గ్ వ్యక్తంచేశారు. 2014 లో ఈ (ఓక్లస్ యూనిట్) ను ఫేస్ బుక్ సొంతం చేసుకుంది. బర్రా ను స్వాగతించిన ఓక్లస్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసింది.
కాగా చైనా మొబైల్ మేకర్ షియోమికి హ్యుగో బర్రా ఇటీవల గుడ్ బై చెప్పారు. త్వరలో బీజింగ్ నుంచి పుట్టిల్లు సిలికాన్ వ్యాలీకి చేరుతున్నట్టు ప్రకటించిన బర్రా కంప్యూటింగ్ ప్లాట్ ఫాంలో వర్చ్యువల్ అండ్ అగ్ మెంటెడ్ రియాల్టీ కీలక పాత్ర పోషించనున్నాయనే అభిప్రాయాన్ని ఫేస్ బుక్ పోస్ట్ లో వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
Please welcome Hugo Barra, our new VP of VR at Facebook! https://t.co/zuYdrXkIUY pic.twitter.com/GezeEu7QiV
— Oculus (@oculus) January 26, 2017