కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతానికి చెందిన పలువురు నాయకులు శనివారం వైఎస్ఆర్ సీపీలో చేరారు.
హైదరాబాద్: కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతానికి చెందిన పలువురు నాయకులు శనివారం వైఎస్ఆర్ సీపీలో చేరారు. వైఎస్ఆర్ సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, మలిక్‌రాజ్‌గోపాల్ రెడ్డిల ఆధ్వర్యంలో.. మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ ద్వారం వీరారెడ్డి, ఎన్ఎండీ జహీర్ భాషా, రైతు నగర సర్పంచ్ కొండారెడ్డి తదితరులు హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో వైఎస్ఆర్ సీపీలో చేరారు. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి కండువాలు కప్పి నేతలను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వారు వైయస్ జగన్‌తో పలు సమస్యలపై చర్చించారు.