రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి | Ponguleti Srinivasa Reddy Joins Congress In Presence Of Rahul | Sakshi
Sakshi News home page

రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి

Published Sun, Jul 2 2023 6:37 PM | Last Updated on Sun, Jul 2 2023 6:42 PM

Ponguleti Srinivasa Reddy Joins Congress In Presence Of Rahul - Sakshi

సాక్షి, ఖమ్మం​: రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేరారు. కాంగ్రెస్‌ కండువా కప్పిన రాహుల్‌.. పార్టీలోకి ఆహ్వానించారు. పొంగులేటితో పాటు పిడమర్తి రవి, అరికెల నర్సారెడ్డి, పాయం వెంకటేశ్వర్లు, కనకయ్య, డీవీ రావు, పాపిరెడ్డి కాంగ్రెస్‌ పార్టీలోకి చేరారు.

పార్టీలోకి చేరిక అనంతరం జన గర్జన సభలో పొంగిలేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఆకాంక్షల మేరకు కాంగ్రెస్‌ తెలంగాణ ఇచ్చిందన్నారు. మోసపూరిత హామీలతో రెండుసార్లు కేసీఆర్‌ అధికారంలోకి వచ్చారు. రైతు రుణమాఫీ హామీని కేసీఆర్‌ నెరవేర్చలేదు. తెలంగాణ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్‌ పార్టీనే’’ అని పొంగులేటి అన్నారు.

‘‘రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం. రాష్ట్రంలో ఏ ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. సీఎం కేసీఆర్‌ కేవలం మాటలకే పరిమితమయ్యారు. తెలంగాణలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రజల ఆకాంక్షల మేరకే కాంగ్రెస్‌ పార్టీలోకి చేరాం. బీఆర్‌ఎస్‌ను బంగాళాఖాతంలో వేయాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యం’’ అని పొంగులేటి పేర్కొన్నారు.
చదవండి: బండి సంజయ్‌పై హైకమాండ్‌కు ఫిర్యాదు చేసిందెవరు? 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement