
సాక్షి, ఖమ్మం జిల్లా: కేసీఆర్‌పై కక్షతో రైతులను బాధపెడుతున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. శనివారం ఆమె మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. బీసి రిజర్వేషన్ల సర్వే పూర్తి చేసి ఫిగర్స్ స్పష్టం చేయాలని.. బీసీ రిజర్వేషన్ల పేరుతో పెద్ద కుట్ర జరుగుతోందన్నారు. 46 శాతం ఉన్న బీసీలకు అదే స్థాయిలో విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు ఇవ్వాలన్న కవిత.. బీసీల విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్ల కోసం ప్రత్యేక బిల్లులు పెట్టాలని డిమాండ్ చేశారు.
మూడు బిల్లులు పెట్టకపోతే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేనట్టే. మీకు నిజాయితీ ఉంటే సిన్సియర్‌గా రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే మూడు బిల్లులు పెట్టండి. రేవంత్ రెడ్డి తనకు అవసరమైనప్పుడు బీజేపీ నేతలతో మాట్లాడిస్తుంటారు. ఖమ్మంకి ముగ్గురు మంత్రులు ఉన్నారు. నిజామాబాద్‌లో మంత్రే లేడు. కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టాం. కేసీఆర్‌పై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని కవిత వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment