
కాంగ్రెస్ ‘హస్తం’ నుంచి మరో ఎమ్మెల్యే చేజారిపోయారు. గుజరాత్‌లో కాంగ్రెస్‌కు చెందిన ప్రముఖ నేత, ఎమ్మెల్యే అర్జున్ మోద్వాడియా తాజాగా బీజేపీలో చేరారు. ఆయనతో పాటు మరో ఇద్దరు కాంగ్రెస్ బడానేతలు కూడా బీజేపీలో చేరారు. వీరిలో మాజీ ఎమ్మెల్యేలు అంబరీష్ ధేర్, ములుభాయ్ కందేరియా ఉన్నారు.
గుజరాత్‌లో బలమైన ప్రతిపక్ష నేతగా మోద్వాడియా పేరు సంపాదించారు. 2022 ఎన్నికల్లో పోర్‌బందర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ నేత బాబు బోఖిరియాను ఓడించారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలోని ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ మార్చి 7న గుజరాత్‌లోకి ప్రవేశించబోతున్న సమయంలో ఆయన బీజేపీలో చేరడం చర్చనీయాంశంగామారింది.
దాదాపు 40 ఏళ్ల పాటు కాంగ్రెస్‌తో అనుబంధం కలిగిన మోద్వాడియా .. రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమ ఆహ్వానాన్ని పార్టీ అధిష్టానం తిరస్కరించడాన్ని తప్పుబట్టారు. మోద్వాడియా ప్రస్తుతం పోర్‌బందర్ ఎమ్మెల్యే. కాగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంబరీష్ దేర్ కూడా బీజేపీలో చేరారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా దేర్‌ను గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శక్తి సింగ్ గోహిల్ సస్పెండ్ చేశారు.
#WATCH | Gandhinagar | Senior leaders from Gujarat Arjun Modhwadia, Ambrish Der, and others - who resigned from the Congress yesterday - join BJP in the presence of State BJP chief CR Paatil. pic.twitter.com/ioOe5K2cnD
— ANI (@ANI) March 5, 2024