OP Rajbhar Joins NDA, Glimpse Into BJP OBC Push For 2024 Polls - Sakshi
Sakshi News home page

Rajbhar Joins In NDA: ఎస్పీకి దెబ్బ మీద దెబ్బ.. ఎన్డీయే కూటమిలో చేరిన ఎస్‌బీస్పీ..

Published Sun, Jul 16 2023 1:08 PM | Last Updated on Sun, Jul 16 2023 3:44 PM

Rajbhar Joins NDA Glimpse Into BJP OBC Push For 2024 Polls - Sakshi

లక్నో: 2024 ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. దేశంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇటు ప్రతిపక్ష పార్టీలన్నీ కూటమి దిశగా పావులు కదుపుతుండగా.. అటు.. ఎన్డీయే తన మిత్ర పక్షాలన్నిటినీ ఏకం చేయడానికి జులై 18న సమావేశం ఏర్పాటు చేయనుంది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌ వాదీ పార్టీకి రెండోసారి ఎదురుదెబ్బ తగిలింది. తన మద్దతుదారైన సుహేల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్‌బీస్పీ) బీజేపీతో చేతులు కలిపింది. మరో ఎమ్మెల్యే దారా సింగ్ చౌహాన్‌ కూడా బీజేపీలో చేరనున్నారు.

తూర్పు యూపీలో ఓబీసీ సామాజిక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న సుహేల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్‌బీస్పీ) ఎన్డీయే గూటికి చేరింది. ఈ మేరకు సామాజిక న్యాయం, దేశ భద్రత, వెనకబడిన, అణగారిన వర్గాల అభివృద్ధి కోసం బీజేపీతో కలిసి పోరాడేందుకు సిద్ధమైనట్లు ఆ పార్టీ అధినేత ఓం ప్రకాశ్ రాజ్‌భర్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రధాని మోదీకి, హోం మంత్రి అమిత్‌ షాకు, సీఎం యోగి ఆదిత్య నాథ్‌కు ధన్యవాదాలు తెలిపారు. 

 యూపీలో యోగీ ఆదిత్యనాథ్‌ మొదటిసారి సీఎంగా ఉన్న కాలంలో ఓం ప్రకాశ్ మంత్రి పదవి పొందారు. ఆ తర్వాత దానికి రాజీనామా చేసి సమాజ్‌వాదీ పార్టీ తరపున చేరి 2022 ఎన్నికలో పోరాడారు. ప్రస్తుతం మళ్లీ ఎన్డీయే గూటికి చేరారు. దీనిపై బీజేపీపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 2024 ఎన్నికల్లో తమ 'వెనకబడిన, దళిత, మైనారిటీ' ఫార్ములాకు బీజేపీ భయపడిందని ఆరోపించారు. తిట్టినవారిని కూడా బీజేపీ తమ వర్గంలో కలిపేసుకుంటున్నారని అన్నారు. ఎస్‌బీస్పీ ఎన్డీయేలో చేరినప్పటికీ ఆ పార్టీ ఓటర్ల మద్దతు తమకే ఉంటుందని ఎస్పీ నాయకులు చెప్పారు. 

సమాజ్‌వాదీ పార్టీకి చెందిన దారా సింగ్ చౌహాన్‌ నిన్ననే తన అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు. బీజేపీతో కలవడానికి అమిత్‌ షాను కలిశారు. ఈయన కూడా ఒకప్పుడు యోగీ వర్గం నుంచి రాజీనామా చేసి 2022లో బీజేపీకి వ్యతిరేకంగా ఎస్పీ తరపున పోరాడారు. తూర్పు యూపీ నుంచి బీసీ సామాజిక వర్గానికి ప్రాతినిథ్యం వహించిన చౌహాన్‌ మళ్లీ ఇప్పుడు సొంత గూటికే చేరారు. 

ఇదీ చదవండి: ఉత్తరాదిలో దంచికొడుతున్న వానలు.. మళ్లీ యమునకు పోటెత్తిన వరద.. రెడ్ అలర్ట్ జారీ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement