pushed
-
ఎస్పీకి ఎదురుదెబ్బ... ఎన్డీయే కూటమిలో చేరిన కీలక పార్టీ..
లక్నో: 2024 ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. దేశంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇటు ప్రతిపక్ష పార్టీలన్నీ కూటమి దిశగా పావులు కదుపుతుండగా.. అటు.. ఎన్డీయే తన మిత్ర పక్షాలన్నిటినీ ఏకం చేయడానికి జులై 18న సమావేశం ఏర్పాటు చేయనుంది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లో సమాజ్ వాదీ పార్టీకి రెండోసారి ఎదురుదెబ్బ తగిలింది. తన మద్దతుదారైన సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్బీస్పీ) బీజేపీతో చేతులు కలిపింది. మరో ఎమ్మెల్యే దారా సింగ్ చౌహాన్ కూడా బీజేపీలో చేరనున్నారు. తూర్పు యూపీలో ఓబీసీ సామాజిక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్బీస్పీ) ఎన్డీయే గూటికి చేరింది. ఈ మేరకు సామాజిక న్యాయం, దేశ భద్రత, వెనకబడిన, అణగారిన వర్గాల అభివృద్ధి కోసం బీజేపీతో కలిసి పోరాడేందుకు సిద్ధమైనట్లు ఆ పార్టీ అధినేత ఓం ప్రకాశ్ రాజ్‌భర్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రధాని మోదీకి, హోం మంత్రి అమిత్ షాకు, సీఎం యోగి ఆదిత్య నాథ్‌కు ధన్యవాదాలు తెలిపారు. भाजपा और सुभासपा आए साथ सामाजिक न्याय देश की रक्षा- सुरक्षा, सुशासन वंचितों, शोषितों, पिछड़ों, दलितों, महिलाओं, किसानों, नौजवानों, हर कमजोर वर्ग को सशक्त बनाने के लिए भारतीय जनता पार्टी और सुहेलदेव भारतीय समाज पार्टी मिलकर लड़ेगी। pic.twitter.com/CDMXCc9EAM — Om Prakash Rajbhar (@oprajbhar) July 16, 2023 యూపీలో యోగీ ఆదిత్యనాథ్ మొదటిసారి సీఎంగా ఉన్న కాలంలో ఓం ప్రకాశ్ మంత్రి పదవి పొందారు. ఆ తర్వాత దానికి రాజీనామా చేసి సమాజ్‌వాదీ పార్టీ తరపున చేరి 2022 ఎన్నికలో పోరాడారు. ప్రస్తుతం మళ్లీ ఎన్డీయే గూటికి చేరారు. దీనిపై బీజేపీపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 2024 ఎన్నికల్లో తమ 'వెనకబడిన, దళిత, మైనారిటీ' ఫార్ములాకు బీజేపీ భయపడిందని ఆరోపించారు. తిట్టినవారిని కూడా బీజేపీ తమ వర్గంలో కలిపేసుకుంటున్నారని అన్నారు. ఎస్బీస్పీ ఎన్డీయేలో చేరినప్పటికీ ఆ పార్టీ ఓటర్ల మద్దతు తమకే ఉంటుందని ఎస్పీ నాయకులు చెప్పారు. #WATCH | SBSP chief Om Prakash Rajbhar speaks on his decision of joining the NDA alliance "We met Union Home Minister Amit Shah on July 14 and discussed various issues and decided to fight the 2024 elections together. I want to thank PM Modi, HM Amit Shah, CM Yogi Adityanath… pic.twitter.com/gvI0whp1dl — ANI (@ANI) July 16, 2023 సమాజ్‌వాదీ పార్టీకి చెందిన దారా సింగ్ చౌహాన్ నిన్ననే తన అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు. బీజేపీతో కలవడానికి అమిత్ షాను కలిశారు. ఈయన కూడా ఒకప్పుడు యోగీ వర్గం నుంచి రాజీనామా చేసి 2022లో బీజేపీకి వ్యతిరేకంగా ఎస్పీ తరపున పోరాడారు. తూర్పు యూపీ నుంచి బీసీ సామాజిక వర్గానికి ప్రాతినిథ్యం వహించిన చౌహాన్ మళ్లీ ఇప్పుడు సొంత గూటికే చేరారు. ఇదీ చదవండి: ఉత్తరాదిలో దంచికొడుతున్న వానలు.. మళ్లీ యమునకు పోటెత్తిన వరద.. రెడ్ అలర్ట్ జారీ.. -
ఎంత పెద్ద మనసు ఆ చిన్నారులది: వీడియో వైరల్
మనలో చాలామంది చక్కగా అవతలి వాళ్లకు ఉచిత సలహలు, సూచనలు ఇచ్చేస్తారే తప్ప చేతల వరకు వచ్చేట్టేప్పటికి శూన్యం. అయినా సాయం చేయాలంటే డబ్బులుండాలి అనుకుంటారు గానీ మనకు చేతనైనంతలో ఏ చిన్న పని సాయం చేసిన చాలు. దానికి డబ్బులతో పనిలేదు. కనీసం రోడ్డు మీద ఇబ్బంది పడుతున్న ఏ వ్యక్తి కైనా, ప్రమాదం బారిన గాయపడిన వ్యక్తి నైన కాస్త మంచినీళ్లు అందించో లేక చేయి అందించో సాయం చేసిన చాలు. కానీ చేయం పైగా మన కళ్ల ముందే ఇబ్బందిపడుతూ కనిపించిన మనకెందుకులే అని వెళ్లిపోతుంటారు. కానీ ఇద్దరు చిన్నారులు అందరిలా కాకుండా సాయం అందించి తమ పెద్ద మనసును చాటుకున్నారు. వివరాల్లోకెళ్తే...రోడ్డు పై అరటిపళ్లు అమ్ముకునే ఒక మహిళ ఉంటుంది. ఆమె అరటిపళ్ల తోపుడు బండి పై పెట్టుకుని తోసుకుంటూ వెళ్తుంటుంది. ఐతే ఇంతలో ఆ బండి ఒక చోట కదలదు ఆ రోడ్డు బాగా ఎత్తుగా ఉంటుంది. ఆమె ఉన్నవైపు రోడ్డు పల్లంగా ఉండటంతో పైకి తొయ్యడం కష్టంగా ఉంటుంది. బండిమీద ఉన్న అరటిపళ్లు బరువుకి ముందుకి వెళ్లకుండా వెనక్కి వచ్చేస్తుంటుంది. దీంతో ఆమె చాలా ఇబ్బంది పడుతుంటుంది. పైగా మరోవైపు మంచి ఎండగా ఉండటంతో చెమటులు పట్టేసి బండిని తొయ్యలేక నానా అవస్తలు పడుతోంది. కనీసం రోడ్డు పై వెళ్తున్న పాదాచారులు గానీ, వాహన దారులుగానీ ఎవ్వరు సాయం చేసేందుకు ముందుకు రారు. ఐతే ఇంతలో అటుగా వెళ్తున ఇద్దరు చిన్నారులు ఈ మహిళ వద్దకు వచ్చి ఆ బండిని తోసి సాయం అందించారు. దీంతో ఆమె ఒక్కసారిగా ఆనందపడి ఆ చిన్నారులిద్దరికి చెరోక అరటి పండు ఇస్తుంది. వారు కూడా ఆనందంగా తీసుకుని వెళ్లిపోతారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఓలుక్కేయండి. आपकी डिग्री सिर्फ़ एक काग़ज़ का टुकड़ा है, अगर वो आपके व्यवहार में ना दिखे तो। pic.twitter.com/eHsuTYOGrh — Mahant Adityanath 2.0🦁 (@MahantYogiG) August 8, 2022 (చదవండి: ఆనంద్ మహింద్ర మనసు దోచిన 'కప్పు':ఫోటో వైరల్) -
వైరల్ వీడియో.. స్మూత్‌గా తప్పించాడు
కాన్బెర్రా: సాధారణంగా మనం ఇంట్లో పెంచుకునే జంతువులకు ఆదేశాలు జారీ చేయగలం. ఎంతో ఆప్యాయంగా పెంచుకుంటాం కాబట్టి మనం కమ్, సిట్, గో అంటూ ఆదేశాలు జారీ చేస్తే.. చెప్పినట్లు వింటాయి. కానీ ఇదే ఆదేశాలను మొసలికి జారీ చేయగలరా.. అది కూడా మన మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు. ఆ ఊహే భయంకరంగా ఉంది కదా. కానీ ఆస్ట్రేలియాకు చెందిన రాంగ్లర్ మాట్ రైట్ మాత్రం ఇలాంటి పనులను చాలా అలవోకగా చేయగలడు. ఆ వీడియోలను మనకు చూపించగలడు. రాంగ్లర్ 13 అడుగుల భారీ మొసలిని బుజ్జగిస్తున్న వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. వివరాలు.. రైట్ ఆస్ట్రేలియా ఉత్తర భూభాగంలోని ఒక నది మార్గాన్ని క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఒక మొసలి అతడిని సమీపించింది. వేటడానికి రెడీగా దవడలను విశాలంగా తెరిచి రైట్ వైపు రాసాగింది. ఆ సమయంలో అతడు కాక అక్కడ వేరే ఎవరు ఉన్నా ప్రాణాలరచేతిలో పెట్టుకుని పరుగు తీసేవారు. (చదవండి: తాబేలుతో అంత వీజీ కాదు!) కానీ మాట్ రైట్ మాత్రం మొసలిని సరదాగా మార్చడానికి ప్రయత్నించాడు. బోన్క్రంచర్ అనే మొసలిని కూర్చొండి.. వెళ్లండి.. ఉండండి అంటూ బుజ్జగించాడు. అలా దాన్ని మాటల్లో పెట్టి నెమ్మదిగా మొసలి ముక్కు పట్టుకుని దాన్ని స్మూత్‌గా తన మార్గం నుంచి పక్కకు తప్పిస్తాడు. ఈ మొత్తం తతంగాన్ని వీడయో తీసిన రైట్ దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. మూడు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈవీడియోను ఇప్పటికే 1.8లక్షల మంది వీక్షించారు. ‘కుక్కపిల్లలాగే మొసలితో మాట్లాడుతున్నాడు.. సూపర్’ అని కొందరు కామెంట్ చేయగా.. మరి కొందరు మాత్రం ‘ప్రమాదకరమైన స్టంట్.. పర్యాటకులు దీనిని అనుకరించే ప్రమాదం ఉంది’ అంటూ విమర్శించారు. ఇక రైట్ ఒక న్యూస్ చానెల్‌తో మాట్లాడుతూ.. ‘నాకు చాలా సంవత్సరాలుగా బోన్ క్రంచెర్ తెలుసు. అది చాలా ప్రశాంతమైనది. ఏళ్లుగా నాకు దానితో ఎంతో సంబంధం ఉంది. కానీ జనాలు దీన్ని ఉదాహరణగా తీసుకుని అనుకరించే ప్రయత్నం చేయకూడదు’ అన్నారు. -
సెక్స్ రాకెట్ గుట్టు రట్టు
ముంబై: మహిళలను బలవంతంగా వ్యభిచార ఊబిలోకి దింపిన ముఠాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. కళ్యాణ్ రైల్వేస్టేషన్ సమీపంలో వ్యభిచారం జరుగుతోందన్న స్థానికుల ఫిర్యాదుతో యాంటీ ట్రాఫికింగ్ పోలీసులు దాడిచేశారు. ఈ ఘటనలో నలుగురు మహిళలను అరెస్ట్ చేశారు. దీంతో ఈ ముఠా గుట్టు రట్టయింది. మంగళవారం రాత్రి రైల్వే స్టేషన్ సమీపంలో దుండగులపై దాడిచేసి మహిళలను రక్షించామని థానే క్రైం బ్రాంచ్ అధికారి షకీల్ షేక్ తెలిపారు. 20-25 ఏళ్ల యువతులతో బలవంతంగా ఈ వృత్తి చేయిస్తున్నారనే ఆరోపణలతో కేసు నమోదు చేశమన్నారు. అదుపులోకి తీసుకున్న మహిళల నుంచి కొంత నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. క్రైం బ్రాంచ్ ఆధ్వర్యంలో 12 మంది మహిళలను కాపాడి, రిమాండ్ హోంకు తరలించామన్నారు. దీనిపై తమ విచారణ కొనసాగుతుందన్నారు.