సెక్స్ రాకెట్ గుట్టు రట్టు | 12 women forced into prostitution rescued | Sakshi
Sakshi News home page

సెక్స్ రాకెట్ గుట్టు రట్టు

Published Wed, Feb 10 2016 2:24 PM | Last Updated on Sun, Sep 3 2017 5:22 PM

సెక్స్ రాకెట్ గుట్టు రట్టు

సెక్స్ రాకెట్ గుట్టు రట్టు

ముంబై: మహిళలను బలవంతంగా వ్యభిచార ఊబిలోకి దింపిన ముఠాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. కళ్యాణ్ రైల్వేస్టేషన్ సమీపంలో  వ్యభిచారం జరుగుతోందన్న స్థానికుల ఫిర్యాదుతో యాంటీ ట్రాఫికింగ్ పోలీసులు దాడిచేశారు. ఈ ఘటనలో నలుగురు మహిళలను అరెస్ట్ చేశారు. దీంతో ఈ ముఠా గుట్టు రట్టయింది.

మంగళవారం రాత్రి రైల్వే స్టేషన్ సమీపంలో దుండగులపై దాడిచేసి మహిళలను రక్షించామని థానే క్రైం బ్రాంచ్ అధికారి షకీల్ షేక్ తెలిపారు. 20-25 ఏళ్ల యువతులతో బలవంతంగా ఈ వృత్తి చేయిస్తున్నారనే ఆరోపణలతో కేసు నమోదు చేశమన్నారు. అదుపులోకి తీసుకున్న మహిళల నుంచి కొంత నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. క్రైం బ్రాంచ్ ఆధ్వర్యంలో 12 మంది మహిళలను కాపాడి,  రిమాండ్ హోంకు తరలించామన్నారు. దీనిపై తమ విచారణ కొనసాగుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement