flesh trade
-
‘తల్లిదండ్రుల అనుమతి లేకుండా పెళ్లిళ్లు చేసుకోవడం వల్లే’
Parents Must Teach Good Values To Children, Know Why బీహార్: తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఇళ్లు వదిలి వెళ్లి వివాహాలు చేసుకుంటున్న యువతుల్లో చాలా మంది హత్యకు గురౌతున్నారు. మరి కొందరు బలవంతంగా అక్రమ రవాణాకు బలి అవుతున్నారని బీహార్ డీజీపీ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. డీజీపీ మాటల్లో.. ‘తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఆడపిల్లలు వివాహం చేసుకోవడానికి ఇళ్లు వదిలి వెళ్లిపోయిన ఉదంతాలు మనం ఎన్నో చూశాం. ఐతే వారిలో చాలా మంది హత్యకు గురవుతున్నారు. మరికొందరు బలవంతంగా అమ్మకానికి గురవుతున్నారు. ఇలాంటి నిర్ణయాలకు మూల్యం చెల్లించేది తల్లిదండ్రులేనని’ బీహార్ డీజీపీ ఎస్కే సింఘాల్ సమస్తిపూర్‌లో నిర్వహించిన సమాజ్ సుందర్ అభియాన్ కార్యక్రమంలో అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో తరచూ సంభాషిస్తూ ఉండాలి, మంచి విలువలు నేర్పించాలని, వారి భావాలను గుర్తించి అర్థమయ్యేలా వివరించి, కుటుంబ బంధాల్లో వారిని బంధించాలని ఈ సందర్భంగా సూచించారు. కాగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అభివృద్ధి చేస్తున్న సామాజిక సంస్కరణ ప్రచారం (సమాజ్ సుధార్ అభియాన్)లో డీజీపీ సింఘాల్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. చదవండి: మీరు వెలకట్టలేని మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది: అమెరికాకు చైనా వార్నింగ్ #WATCH We've seen cases where girls left their homes for marriage without parents' consent. Many of them get killed while others are forced into the flesh trade. It is parents who pay price for such decisions: Bihar DGP SK Singhal at 'Samaj Sudhar Abhiyan' event in Samastipur pic.twitter.com/wai9jNrnG1 — ANI (@ANI) December 30, 2021 -
వ్యభిచార ముఠాలో ఇద్దరు నటీమణులు
ముంబై: హైటెక్ వ్యభిచార ముఠాను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. మోడల్, ఇద్దరు నటీమణులతో సహా పలువురు మహిళలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. జార్జిగాన్ ప్రాంతంలో ఓ షాపింగ్ మాల్ పై దాడి చేసి వీరిని పట్టుకున్నారు. కస్టమర్లను, మధ్యవర్తులను కలుసుకునేందుకు వీరు ఇక్కడ ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. బ్రోకర్లు ఆష్రాఫ్, సైరా, ఆమన్ లను కూడా అదుపులోకి తీసుకున్నారు. రూ. 50 వేల నుంచి లక్ష రూపాయిల వరకు తీసుకుని హైప్రొఫైల్, కార్పొరేట్ కస్టమర్ల వద్దకు వీరు అమ్మాయిలను పంపుతుంటారని పోలీసులు తెలిపారు. పట్టుబడిన వారిలో మరాఠీ సినిమా నటి, వర్ధమాన మోడల్, టీవీ సీరియల్ నటి ఉన్నారని వెల్లడించారు. -
సెక్స్ రాకెట్ గుట్టు రట్టు
ముంబై: మహిళలను బలవంతంగా వ్యభిచార ఊబిలోకి దింపిన ముఠాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. కళ్యాణ్ రైల్వేస్టేషన్ సమీపంలో వ్యభిచారం జరుగుతోందన్న స్థానికుల ఫిర్యాదుతో యాంటీ ట్రాఫికింగ్ పోలీసులు దాడిచేశారు. ఈ ఘటనలో నలుగురు మహిళలను అరెస్ట్ చేశారు. దీంతో ఈ ముఠా గుట్టు రట్టయింది. మంగళవారం రాత్రి రైల్వే స్టేషన్ సమీపంలో దుండగులపై దాడిచేసి మహిళలను రక్షించామని థానే క్రైం బ్రాంచ్ అధికారి షకీల్ షేక్ తెలిపారు. 20-25 ఏళ్ల యువతులతో బలవంతంగా ఈ వృత్తి చేయిస్తున్నారనే ఆరోపణలతో కేసు నమోదు చేశమన్నారు. అదుపులోకి తీసుకున్న మహిళల నుంచి కొంత నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. క్రైం బ్రాంచ్ ఆధ్వర్యంలో 12 మంది మహిళలను కాపాడి, రిమాండ్ హోంకు తరలించామన్నారు. దీనిపై తమ విచారణ కొనసాగుతుందన్నారు. -
టీనేజీ బాలికలను రక్షించిన పోలీసులు: తల్లి అరెస్ట్
థానే: మహారాష్ట్ర థానే మునిర్పాద ప్రాంతంలోని వ్యభిచార గృహాల నుంచి ఇద్దరు మైనర్ బాలికలను రక్షించినట్లు పోలీసు ఉన్నతాధికారి గురువారం వెల్లడించారు. అనంతరం వారిని స్వచ్చంధ సంస్థకు తరలించినట్లు తెలిపారు. అందుకు సంబంధించి వారి తల్లిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఆమె వద్ద నుంచి రూ. 4 వేల నగదుతోపాటు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. అలాగే మహిళల అక్రమ రవాణతోపాటు పలు కేసులు బాలిక తల్లిపై నమోదు చేసినట్లు ఉన్నతాధికారి వివరించారు. ఈ నెల 8వ తేదీని దాయ్‌గఢ్ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారిలో బాలికల తల్లి కూడా ఉందని పోలీసులు చెప్పారు. అయితే తమను వ్యభిచారంలోకి దిగాలంటూ తల్లి తమను బలవంతం చేస్తున్నట్లు సదరు టీనేజీ బాలికలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు వాళ్ల తల్లిని అదుపులోకి తీసుకున్నారు. -
హడలెత్తిస్తున్న 'అంగడి బొమ్మ' ముఠాలు
ఆడపిల్లలను అంగడి బొమ్మలుగా మారుస్తున్న ముఠాలు రెచ్చిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా ఈ ముఠాలకు ముక్కుతాడు పడడం లేదు. మాయమాటలతో మహిళలను వంచించి మురికి కూపంలోకి లాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ప్రతి సంవత్సరం దాదాపు 20 వేల మంది వ్యభిచార రొంపి దించుతున్నారంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందే అర్థమవుతోంది. మైనర్ బాలికలను బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్నారు. 'సెక్స్ ట్రాఫికింగ్' ఏటేటా పెరుగుతుండడం మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. మహిళల రక్షణపై తెలంగాణ సీఎం కేసీఆర్ నియమించిన కమిటీ 'సెక్స్ ట్రాఫికింగ్'పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అబలలను బలవంతంగా వ్యభిచార రొంపికి దింపుతున్నారని వెల్లడించింది. దొంగ పెళ్లిళ్లు చేసుకుని ఆడవాళ్లను అమ్మేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. మతాచారాల పేరుతో దేవదాసి, జోగినిలుగా ముద్రవేసి మురికి కూపంలోకి తోస్తున్నారని తెలిపింది. ఉద్యోగాలతో పేరుతో వంచించి వనితలను పడుపు వృత్తిలోకి దించుతున్నారని పేర్కొంది. అయితే కామపిచాచుల బారిన పడిన వారిలో 72 శాతం మంది వెనుకబడిన తరగతులకు చెందినవారని కమిటీ వెల్లడించింది. మహిళల అక్రమ రవాణా అనేది సామాజిక సమస్యగా కంటే సంస్థాగత నేరంగా గుర్తించాలని కమిటీ అభిప్రాయపడింది. అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో మహిళ భద్రత మాటలకే పరిమితమైందని పేర్కొంది. మనుషుల అక్రమ రవాణా నిరోధక విభాగం(ఏహెచ్ఎస్ యూ) చేతులు ముడుచుకుని కూర్చోవడంతో స్త్రీలకు రక్షణ కరవయిందని తెలిపింది. మహిళలను బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్న వారి జాతకాలు బయటపెడితే జనం జాగ్రత్త పడటానికి అవకాశముంటుందని సూచించింది. ఇటువంటి వారిని శిక్షించేందుకు కఠిన చట్టాలున్నప్పటికీ వీటిని చిత్తశుద్ధితో అమలుచేసే వారే లేకపోవడమే ఈ దారుణ స్థితికి కారణం. పాలకులు ఇకనైనా కళ్లుతెరవాలి. -
'నాపై వ్యభిచారం కోసం మైనర్ ను కొనుగోలు చేసిన కేసుంది'
నేరచరిత్ర ఉన్న నేతలు ఎన్నికల్లో ఉండటం కొత్తేమీ కాదు. అయితే ఈ సారి పోటీలో ఉన్న వారిలో కొందరిపై ఉన్న కేసులు కంగారుపుట్టిస్తున్నాయి. బీహార్ లోని పూర్ణియా నుంచి లోకసభకు పోటీ చేస్తున్న సీపీఐఎంఎల్ అభ్యర్థి పంకజ్ కుమార్ సింగ్ పై వ్యభిచారం చేయించేందుకు మైనర్ బాలికను కొనుగోలు చేసినట్టు కేసుంది. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 373 ప్రకారం ఆయనపై కేసు నమోదైంది. ఈ విషయాన్ని ఆయన తన అఫిడవిట్ లోనూ పేర్కొన్నారు. కన్యా కుమారి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎస్ పి ఉదయకుమార్ పై 382 క్రిమినల్ కేసులున్నాయి. హత్య, హత్యాయత్నం, దోపిడీ వంటి కేసులు ఆయనపై ఉన్నాయి. ఆయన కేసుల జాబితాకి పలు పేజీలు కేటాయించాల్సి వచ్చింది. ఆయనపై 19 హత్యాయత్నం కేసులు, 16 దేశద్రోహ కేసులు, 5 దొంగతనం కేసులు, మూడు దోపిడీ కేసులు ఉన్నాయి. ఇంకో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి ఎం పుష్పరాయన్ తమిళనాడు తూత్తుకుడి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనపై 380 కేసులున్నాయి. ఆరవ విడత లోకసభ పోలింగ్ కు వెళ్తున్న అభ్యర్థుల్లో మొత్తం 11 మంది అభ్యర్థులపై మహిళల వేధింపు కేసులున్నాయి. అందులో పంకజ్ కుమార్ సింగ్ ఒకరు. ఈ దశలో పోటీలో ఉన్న మొత్తం 2071 మందిలో 321 మంది అభ్యర్థులు నేరచరితులు. వీరిలో 204 మందిపై తీవ్రమైన నేరారోపణలున్నాయి. 11 మgదిపై హత్య కేసులున్నాయి, మరో 40 మందిపై హత్యాయత్నం కేసులున్నాయి.