వ్యభిచార ముఠాలో ఇద్దరు నటీమణులు | Two actresses, model nabbed for flesh trade | Sakshi
Sakshi News home page

వ్యభిచార ముఠాలో ఇద్దరు నటీమణులు

Published Thu, Jun 9 2016 3:16 PM | Last Updated on Mon, Sep 4 2017 2:05 AM

వ్యభిచార ముఠాలో ఇద్దరు నటీమణులు

వ్యభిచార ముఠాలో ఇద్దరు నటీమణులు

ముంబై: హైటెక్ వ్యభిచార ముఠాను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. మోడల్, ఇద్దరు నటీమణులతో సహా పలువురు మహిళలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. జార్జిగాన్ ప్రాంతంలో ఓ షాపింగ్ మాల్ పై దాడి చేసి వీరిని పట్టుకున్నారు. కస్టమర్లను, మధ్యవర్తులను కలుసుకునేందుకు వీరు ఇక్కడ ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.

బ్రోకర్లు ఆష్రాఫ్, సైరా, ఆమన్ లను కూడా అదుపులోకి తీసుకున్నారు. రూ. 50 వేల నుంచి లక్ష రూపాయిల వరకు తీసుకుని హైప్రొఫైల్, కార్పొరేట్ కస్టమర్ల వద్దకు వీరు అమ్మాయిలను పంపుతుంటారని పోలీసులు తెలిపారు. పట్టుబడిన వారిలో మరాఠీ సినిమా నటి, వర్ధమాన మోడల్, టీవీ సీరియల్ నటి ఉన్నారని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement