
వ్యభిచార గృహంపై దాడి నలుగురి అరెస్ట్
హైదరాబాద్: ఓ అపార్ట్‌మెంట్‌లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు నిర్వాహకులతో పాటు ఇద్దరు విటులను మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. సాయినగర్‌లోని శ్రీసాయిరామ్ అపార్ట్‌మెంట్‌లో స్వప్న, నవనీత అనే మహిళలు ఫ్లాట్ అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో శుక్రవారం ఫ్లాట్‌పై దాడిచేసి స్వప్న, నవనీతతో పాటు ఆకుల తనీష్ పెనుమల కళ్యాణ్‌బాబులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.2,930 నగదు, 8 సెల్‌ఫోన్లను స్వా«దీనం చేసుకున్నామని ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు.
చోరీ కేసులో నిందితుడి రిమాండ్
ఘట్‌కేసర్: ఓ ఇంట్లో వెండి వస్తువులు చోరీచేసిన పాత నేరస్తుడిని ఘట్‌కేసర్ పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ పరుశురాం తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని మేడపాటినగర్‌లో నివసించే సునీత ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తి వచ్చి వెండి వస్తువులు అపరించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా.. పోలీసుల దర్యాప్తులో మేడపాటినగర్‌కు చెందిన మహమ్మద్ మొయిన్ షరీఫ్ (23)గా తేలింది. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని చోరీ చేసిన వస్తువులను తిరిగి స్వా«దీనం చేసుకున్నారు. అతడు గతంలో పలు చోరీ కేసుల్లో నిందితుడని, పలుసార్లు జైలుకు కూడా వెళ్లొచి్చనట్లు పోలీసులు తెలిపారు.