Goregaon
-
3–4 ఏళ్లలో 8 కోట్ల ఉద్యోగాలు: మోదీ
ముంబై: రిజర్వు బ్యాంక్ నివేదిక ప్రకారం గడిచిన మూడు నాలుగేళ్లలో దేశంలో ఎనిమిది కోట్ల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిరుద్యోగితపై బూటకపు ప్రచారాలు చేస్తున్న వారి నోళ్లను ఆర్బీఐ నివేదిక మూయించిందన్నారు. ముంబై శివారులోని గోరేగావ్‌లో మోదీ శనివారం రూ, 29 వేల కోట్ల విలువైన రోడ్డు, రైల్వే, పోర్టు ప్రాజెక్టులను ప్రారంభించడం, శంకుస్థాపన చేయడం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్డీయే వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు పెట్టుబడిదారులు ఎంతో ఉత్సాహంగా స్వాగతించారన్నారు. ఎన్డీయే సర్కారు మాత్రమే సుస్థిరతను అందించగలదని ప్రజలకు తెలుసన్నారు. ‘ఉపాధిపై ఆర్బీఐ ఇటీవలే సవివర నివేదికను ప్రచురించింది. గడిచిన మూడు– నాలుగేళ్లలో ఎనిమిది కోట్ల కొత్త ఉద్యోగాల కల్పన జరిగింది. ఉద్యోగాలపై అబద్ధాలను ప్రచారం చేసే వారి నోళ్లను ఆర్బీఐ గణాంకాలు మూయించాయి’ అని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాలు నిరుద్యోగాన్ని ప్రధానంగా ప్రస్తావించడాన్ని దృష్టిలో పెట్టుకొని మోదీ ఇలా చురకలు అంటించారు. -
భవనంలో మంటలు.. ఏడుగురు మృతి
ముంబై: ముంబైలోని ఓ నివాస భవనంలో శుక్రవారం వేకువజామున చెలరేగిన మంటల్లో ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు మృతి చెందారు. మరో 68 మంది గాయపడ్డారు. గోరెగావ్ వెస్ట్‌లోని ఏడంతస్తుల నివాస భవనంలో తెల్లవారు జామున 3 గంటల సమయంలో మంటలు ప్రారంభమయ్యాయి. సమాచారం అందుకుని ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకునే సరికి అగ్ని కీలలు భవనాన్నంతటినీ చుట్టుముట్టాయి. పార్కింగ్ ప్లేస్‌లోని దుకాణాలు, ద్విచక్ర వాహనాలతోపాటు, భారీగా నిల్వ ఉంచిన పాత దుస్తులు తగులబడిపోయాయి. వివిధ అంతస్తులతోపాటు టెర్రస్‌పై చిక్కుకున్న సుమారు 30 మందిని ఫైర్ సిబ్బంది కాపాడారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. ఆస్పత్రుల్లో ఒక మహిళ, ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా ఊపిరాడకనే చనిపోయినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన 68 మందిలో అయిదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. -
తాళ్లతో కట్టేసి..ఊపిరాడకుండా దిండుతో నొక్కి..!
ముంబై: దేశవాణిజ్య రాజధాని ముంబైలోని గోరెగావ్‌లో దారుణం చోటుచేసుకుంది. మద్యానికి బానిసై రోజు కుటుంబసభ్యులను చిత్రహింసలకు గురిచేస్తున్న రాజు వాగ్మేర్ అనే వ్యక్తిని గురువారం రోజున తన ఇద్దరు భార్యలు పథకం ప్రకారం హతమార్చారు. రాజు 2006లో సవితను వివాహం చేసుకోగా.. 2010లో సరితను వివాహం చేసుకున్నాడు. వీరిలో సవితకు ముగ్గురు పిల్లలు కాగా.. సరితకి ఒకరు సంతానం. రాజు వాగ్మేర్ తన ఇద్దరు భార్యలు, నలుగురు పిల్లలతో కలిసి ఒకే ఇంట్లోనే ఉంటున్నారు. సెక్యూరిటీ గార్డు ఉద్యోగం చేస్తున్న వాగ్మేర్ గతకొద్ది రోజులుగా ఉద్యోగం మానేసి ఇంట్లోనే కూర్చొని మద్యం తాగుతూ గడిపేవాడు. ఈ క్రమంలో భార్యలిద్దరినీ, పిల్లలను వేధింపులకు, హింసకు గురిచేస్తుండటంతో వారు భర్త ప్రవర్తన పట్ల విసిగిపోయారు. ఎలాగైనా రాజును హతమార్చాలని పథకం వేశారు. సరిత, సవిత గురువారం అర్ధరాత్రి భర్తను హతమార్చడానికి అనువైన సమయంగా ఎంచుకున్నారు. అర్ధరాత్రి ఒంటి గంటకు మద్యం మత్తులో ఉన్న రాజును మంచం మీద పడుకోబెట్టారు. కదలకుండా కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేశారు. దిండుతో ముఖంపై అదిమిపట్టి ఊపిరి ఆడకుండా బిగించారు. దీంతో కొద్ది సేపటిలోనే అతను మృతి చెందాడు. వెంటనే వారు తమకేమీ తెలియనట్టు.. రాజు స్పందించడం లేదని మృతుడి అన్న వినోద్‌కు ఫోన్ చేశారు. అక్కడికి చేరుకున్న వినోద్ హాస్పిటల్‌కు తీసుకెళ్లడంతో వైద్యులు చనిపోయాడని ధ్రువీకరించారు. అనుమానంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో విచారణ మొదలుపెట్టారు. ప్రాథమిక విచారణలో ఇద్దరు భార్యలు కలిసి హతమార్చారని తెలిసింది. వారిని అరెస్టు చేయడంతో పాటు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చదవండి: 9 నెలల చిన్నారిపై మేనమామ అఘాయిత్యం -
బిడ్డతో సహా నటి మృతి
ముంబై : అంబులెన్స్ రాక ఆలస్యమైన ఘటనలో మరాఠి నటిపూజా జంజర్(25) మృత్యువాతపడ్డారు. పూజతో పాటు అప్పుడే పుట్టిన ఆమె బిడ్డ కూడా కన్నుమూయడం పలువురిని కలచివేస్తోంది. వివరాలు... ప్రసవ తేదీ దగ్గరపడటంతో పూజ కుటుంబ సభ్యులు ఆమెను గోరెగావ్‌లోని ప్రాథమిక ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో ఆదివారం ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన వెంటనే బిడ్డ చనిపోవడంతో పాటుగా పూజకు తీవ్ర రక్తస్రావమైంది. ఈ నేపథ్యంలో పూజను హింగోలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాల్సిందిగా సూచించారు. అయితే అప్పటికే అర్ధరాత్రి దాటడంతో అంబులెన్స్ కోసం కుటుంబ సభ్యులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత చాలా సేపటికి ఓ ప్రైవేటు అంబులెన్స్ ఆస్పత్రికి రావడంతో పూజను అందులో హింగోలికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే ఆమె మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పూజ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. కాగా పలు మరాఠీ సినిమాల్లో నటించిన పూజ.. గర్భవతిగా ఉన్న నాటి నుంచి సినిమాల నుంచి విరామం తీసుకున్నారు. -
దారుణం : డాక్టర్‌పై ఓ సీనియర్ సిటిజన్..
సాక్షి, ముంబై : గోరేగావ్‌లో దారుణం చోటుచేసుకుంది. డాక్టర్‌పై ఓ సీనియర్ సిటిజన్ లైంగిక దాడికి యత్నించాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి కాపాడారు. అయితే, నిందితున్ని పట్టుకొని పోలీసులకు అప్పగించేలోపే ఆత్మహత్య చేసుకోవడంతో కలకలం రేగింది. ఈ ఘటన పోష్ ప్రాతంలో ఆదివారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. పోష్ హౌసింగ్ సొసైటీలోని అపార్ట్మెంట్లో ఓ డాక్టర్ (33), తన తల్లితో కలిసి నివసిస్తున్నారు. పక్కింట్లో ఉంటున్న వృద్ధుడు (61) ఆమెను చెరబట్టాలనుకున్నాడు. ఏదో సాకుతో ఆమెను తరచూ ఫాలో అయ్యేవాడు. అయితే సదరు డాక్టర్ అవేవీ పెద్దగా పట్టించుకోలేదు. పెద్దాయన ప్రవర్తనను అంచనా వేయలేక పోయింది. అతనిలో దాగున్న దురాలోచన కనిపెట్టలేకపోయింది. ఆదివారం ఉదయం ఆమె ఇంట్లో ఒంటరి ఉండడం చూసిన వృద్ధుడు లోనికి చొరబడి లైంగిక దాడికి యత్నించాడు. దాడిని ప్రతిఘటించడంతో సుత్తితో ఆమె తల, కాలిపై మోది గాయపరిచాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వచ్చి కాపాడారని పోలీసులు తెలిపారు. స్థానికులు బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించారు. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకునేలోపే మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఓ షాపింగ్ కాంప్లెక్స్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానికులు తెలిపారు. -
ఒకటి నుంచి గోరేగావ్ వరకు లోకల్ రైళ్లు
సాక్షి, ముంబై: ఉప నగరంలోని జోగేశ్వరి, గోరేగావ్ ప్రజలకు పశ్చిమ రైల్వే నూతన సంవత్సర కానుక అందజేయనుంది. హార్బర్ మార్గంలో జనవరి ఒకటో తేదీ నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినల్ (సీఎస్ఎంటీ) నుంచి నేరుగా గోరేగావ్ వరకు లోకల్ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో జోగేశ్వరి, గోరేగావ్ వెళ్లే ప్రయాణికులు ఇక అంధేరీలో రైలు మారాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం హార్బర్ రైల్వే మార్గంలో సీఎస్ఎంటీ నుంచి అంధేరి వరకు లోకల్ రైళ్లు నడుస్తున్నాయి. అంధేరి నుంచి గోరేగావ్ వరకు విస్తరించే పనులు ఇటీవల పూర్తికావడంతో ఇక సేవలు ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. కాగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కేంద్ర రైల్వే మంత్రి పియుష్ గోయల్ చేతుల మీదుగా జరిగేలా అధికారుల ప్రయత్నాలు చేస్తున్నారు. ముంబై పర్యటన ఖరారైతే స్వయంగా ఆయన చేతుల మీదుగా కార్యక్రమం జరగనుంది. ఒకవేళ ఆయన షెడ్యుల్ బిజీ ఉంటే ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రారంభోత్సవం చేసే అవకాశాలు ఉన్నాయని ఓ అధికారి వెల్లడించారు. అదేవిధంగా ప్రస్తుతం చర్చిగేట్-బోరివలి మధ్య నడుస్తున్న ఏసీ లోకల్ రైలును విరార్ వరకు విస్తరించే కార్యక్రమం కూడా గోయల్ చేతుల మీదుగా జరుగనుంది. బోరివలి స్టేషన్లో ఏసీ లోకల్ రైలుకు పచ్చ జెండ చూపించనున్నారు. ఆ తరువాత చర్చిగేట్-విరార్ ట్రిప్పులు ప్రారంభం కానున్నాయి. -
ముంబై గోరెగాన్లో అగ్ని ప్రమాదం
-
వ్యభిచార ముఠాలో ఇద్దరు నటీమణులు
ముంబై: హైటెక్ వ్యభిచార ముఠాను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. మోడల్, ఇద్దరు నటీమణులతో సహా పలువురు మహిళలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. జార్జిగాన్ ప్రాంతంలో ఓ షాపింగ్ మాల్ పై దాడి చేసి వీరిని పట్టుకున్నారు. కస్టమర్లను, మధ్యవర్తులను కలుసుకునేందుకు వీరు ఇక్కడ ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. బ్రోకర్లు ఆష్రాఫ్, సైరా, ఆమన్ లను కూడా అదుపులోకి తీసుకున్నారు. రూ. 50 వేల నుంచి లక్ష రూపాయిల వరకు తీసుకుని హైప్రొఫైల్, కార్పొరేట్ కస్టమర్ల వద్దకు వీరు అమ్మాయిలను పంపుతుంటారని పోలీసులు తెలిపారు. పట్టుబడిన వారిలో మరాఠీ సినిమా నటి, వర్ధమాన మోడల్, టీవీ సీరియల్ నటి ఉన్నారని వెల్లడించారు. -
ముంబైలో గ్యాంగ్‌రేప్
ముంబై : ముంబైలో ఓ పదహారేళ్ల యువతిపై నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చి, స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. గోరేగావ్‌లోని సంతోష్‌నగర్‌లో ఈ దారుణం జరిగింది. దీపావళి వేడుకల్లో పాల్గొనేందుకు తమతో రావాల్సిందిగా శుక్రవారం నలుగురు యువకులు బాధితురాలిని కోరారు. అందరూ తెలిసినవారే కావడంతో ఆమె వారితో వెళ్లడానికి అంగీకరించింది. తర్వాత ఆ కామాంధులు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఆమెకు ఇచ్చారు. సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. రెండ్రోజులు మౌనంగా ఉన్న బాధితురాలు ఆదివారం తన బామ్మతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
ముంబై ఫిల్మ్‌సిటీలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి ముంబై: గోరేగావ్‌లోని ఫిల్మ్‌సిటీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో అగ్నిమాపక దళానికి చెందిన ఐదు వాహనాలు, ఐదు నీటి ట్యాంకర్లు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. అయితే ఎటువంటి ప్రాణహాని జరగలేదు. కలర్స్ టీవీ చానల్లో ప్రసారమవుతున్న కామెడీ నైట్ విత్ కపిల్ ధారావాహిక ఎందరినో విశేషంగా ఆకట్టుకుంటోంది. ఎప్పటిలాగే ఉదయం సుమారు 8.15 గంటలకు ఈ ధారావాహిక కోసం చిత్రీకరణ ప్రారంభమవుతుం డగా స్టేజీ వెనక భారీ శబ్దం వచ్చింది. ఒక్కసారిగా మంటలు ఎగిశాయి. ఈ స్టూడియోలో అనేక షూటింగ్‌లు జరుగుతుంటాయి. ఇందుకోసం ఏర్పాటుచేసే భారీ సెట్లకు ఎక్కువ శాతం కట్టెలు, చెక్కలనే వినియోగిస్తారు. ప్రమాద తీవ్రతను దృష్టిలో ఉంచుకొని చుట్టుపక్కలున్న సెట్లను ముందుజాగ్రత్తగా తొలగించారు. అయితే ఈ ప్రమాదానికి కారణంతోపాటు నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.