
సాక్షి, ముంబై : గోరేగావ్‌లో దారుణం చోటుచేసుకుంది. డాక్టర్‌పై ఓ సీనియర్ సిటిజన్ లైంగిక దాడికి యత్నించాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి కాపాడారు. అయితే, నిందితున్ని పట్టుకొని పోలీసులకు అప్పగించేలోపే ఆత్మహత్య చేసుకోవడంతో కలకలం రేగింది. ఈ ఘటన పోష్ ప్రాతంలో ఆదివారం ఉదయం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాలు.. పోష్ హౌసింగ్ సొసైటీలోని అపార్ట్‌మెంట్‌లో ఓ డాక్టర్ (33), తన తల్లితో కలిసి నివసిస్తున్నారు. పక్కింట్లో ఉంటున్న వృద్ధుడు (61) ఆమెను చెరబట్టాలనుకున్నాడు. ఏదో సాకుతో ఆమెను తరచూ ఫాలో అయ్యేవాడు. అయితే సదరు డాక్టర్ అవేవీ పెద్దగా పట్టించుకోలేదు. పెద్దాయన ప్రవర్తనను అంచనా వేయలేక పోయింది. అతనిలో దాగున్న దురాలోచన కనిపెట్టలేకపోయింది.
ఆదివారం ఉదయం ఆమె ఇంట్లో ఒంటరి ఉండడం చూసిన వృద్ధుడు లోనికి చొరబడి లైంగిక దాడికి యత్నించాడు. దాడిని ప్రతిఘటించడంతో సుత్తితో ఆమె తల, కాలిపై మోది గాయపరిచాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వచ్చి కాపాడారని పోలీసులు తెలిపారు. స్థానికులు బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించారు. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకునేలోపే మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఓ షాపింగ్ కాంప్లెక్స్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానికులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment