కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఓ రోగిపై డాక్టర్ చేసిన అత్యాచార ఘటన కలకలం రేపింది. నార్త్ 24 పరగణాలలోని హస్నాబాద్‌లో 26 ఏళ్ల రోగిపై అత్యాచారం చేసినందుకు కోల్‌కతా పోలీసులు ఓ డాక్టర్‌ను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..‘‘ నిందితుడైన డాక్టర్ సదరు మహిళా రోగికి మత్తుమందు ఇంజెక్ట్ చేసి లైంగిక వేధింపులను చిత్రీకరించాడు.
వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించి ఆమె నుంచి రూ. 4 లక్షలు వసూలు చేశాడు. నిందితుడు ఆమెను బ్లాక్ మెయిల్ చేసేందుకు వీడియోను ఉపయోగించి మరీ పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇటీవల నిందితుడు నూర్ ఆలం సర్దార్‌పై బాధిత మహిళ తన భర్తతో కలిసి.. హస్నాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా.. నగరంలోని బరున్‌హాట్ ప్రాంతంలోని డాక్టర్ క్లినిక్ నుంచి పోలీసులు సర్దార్‌ను అరెస్టు చేశారు. నిందితుడు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. మహిళా రోగి.. అపస్మారక స్థితికి తీసుకువచ్చి అనంతరం ఆమెపై అత్యాచారం చేశాడు’’ అని పోలీసులు తెలిపారు.
ఈ కేసుపై విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు. మహిళ రహస్య వాంగ్మూలం రికార్డ్ చేసి.. నిందితుడిని కోర్టులో హాజరుపరిచినట్లు బరున్‌హాట్ ఎస్పీ హొస్సేన్ మెహెదీ రెహ్మాన్ తెలిపారు. దీంతో కోర్టు నిందితుడికి నాలుగు రోజుల పోలీసు కస్టడీ విధించింది. మరోవైపు.. గత నెలలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అత్యాచారం, హత్య కేసులకు సంబంధించి మరణశిక్షను తప్పనిసరి చేసే కఠినమైన కొత్త బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment