Bhojpuri Actress Suman Kumari Arrested For Forcing Women Into Prostitution - Sakshi
Sakshi News home page

Bhojpuri Actress: మోడల్స్‌తో వ్యభిచారం.. నటి అరెస్ట్!

Published Sat, Apr 22 2023 10:47 AM | Last Updated on Sat, Apr 22 2023 11:52 AM

Bhojpuri Actress Suman Kumari Arrested For Forcing Women Into Prostitution - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ముంబయి పోలీసులు హై లెవెల్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. మోడల్స్‌తో వ్యభిచారం నిర్వహిస్తున్న నటిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని గోరెగావ్‌లోని ఓ హోటల్‌లో వ్యభిచార దందా నడుస్తోందన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భోజ్‌పురి నటి సుమన్ కుమారిని అరెస్ట్ చేశారు. వ్యభిచార కూపం నుంచి ముగ్గురు మోడల్స్‌ను పోలీసులు రక్షించారు. ఈ దందాలో భోజ్‌పురి నటి యువతులను ట్రాప్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మరో నిందితుడి కోసం పోలీసులు  గాలిస్తున్నారు. 

భోజ్‌పురి నటి వయసు 24 ఏళ్లు కాగా.. గోరేగావ్‌లోని రాయల్‌ పామ్‌ హోటల్‌లో నిందితురాలు ఈ వ్యాపారాన్ని  పోలీసులకు సమాచారం అందింది. శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు దాడులు నిర్వహించగా.. నటి చీకటి దందా బయటపడింది. కాగా.. భోజ్‌పురి చిత్ర పరిశ్రమకు చెందిన సుమన్ కుమారి ‘లైలా మజ్ను సినిమాలో నటించింది. అలాగే వెబ్ సిరీస్ జామ్‌స్టిక్ బాక్స్, భోజ్‌పురి కామెడీ ఎపిసోడ్ ‘బాప్ నంబ్రి బేటా దస్ నంబ్రి’లో పనిచేసింది. ఈనె హిందీ, పంజాబీ మ్యూజిక్ ఆల్బమ్‌లలో కూడా పనిచేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement