bhojpuri film actors
-
Lok Sabha Election 2024: గోరఖ్‌పూర్‌లో స్టార్ వార్!
ఉత్తరప్రదేశ్‌లో శనివారం పోలింగ్ జరగనున్న స్థానాల్లో గోరఖ్‌పూర్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. బీజేపీ అభ్యరి్థ, సిట్టింగ్ ఎంపీ రవికిషన్ శుక్లా, ఇండియా కూటమి తరఫున బరిలో ఉన్న ఎస్పీ అభ్యర్థి కాజల్ నిషాద్ ఇద్దరూ భోజ్‌పురి స్టార్లే కావడం అందుకు కారణం... రవికిషన్‌కు పీఠం మద్దతు... భోజ్‌పురి సినిమాల్లో సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న రవి కిషన్ అసలు పేరు రవీంద్ర శుక్లా. కాంగ్రెస్ సభ్యునిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో జౌన్పూర్ నుంచి పోటీ చేసి ఓడారు. 2017లో బీజేపీలో చేరారు. 2019లో 3 లక్షల పైచిలుకు మెజారిటీతో గెలిచారు. కానీ ఈ ఐదేళ్లలో నియోజకవర్గంలో కనిపించనే లేదనే విమర్శలున్నాయి. ప్రతిపక్షాలు ఆయనను ‘బయటి వ్యక్తి’గా అభివర్ణిస్తున్నాయి. దాంతో పీఎం మోదీ, సీఎం యోగి చరిష్మానే నమ్ముకున్నారు. గోరఖ్‌పూర్‌లో తనకు ఇల్లుందని, ఇక్కడే ఉంటున్నానని చెప్పుకొస్తున్నారు. యువకులతో కుస్తీ పడుతూ, స్థానికులతో సెల్ఫీలు దిగుతూ ప్రచారం జోరుగా చేశారు. రవి కిషన్‌కు గోరక్షనాథ్ పీఠం మద్దతు కూడా ఉంది. నిషాద్ ఓట్లను నమ్ముకున్న కాజల్ భోజ్‌పురి నటి, ఎస్పీ అభ్యర్థి కాజల్ నిషాద్కు ఇది నాలుగో ఎన్నిక. రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గోరఖ్‌పూర్ రూరల్ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై, కాంపియర్గంజ్ నుంచి ఎస్పీ తరఫున పోటీ చేసి ఓడారు. మేయర్ ఎన్నికల్లోనూ ఓటమి చవి చూశారు. రాజకీయాల్లో చురుకుగా ఉండే ఆమెకు ఈసారి గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. తన సామాజికవర్గమైన నిషాద్ ఓట్లనే నమ్ముకున్నారు. అయితే 2019 మాదిరిగా ఈసారి కూడా ఎస్పీ ఓట్లను బీఎస్పీ గట్టిగానే చీల్చేలా కని్పస్తోంది. 1990ల నుంచి బీజేపీ హవా.. గోరఖ్‌పూర్ స్థానంలో 1984 దాకా కాంగ్రెస్‌దే హవా. రామమందిర ఉద్యమ నేపథ్యంలో 1989 నుంచీ గోరక్షనాథ్ పీఠం ఆధిపత్యం మొదలైంది. అప్పటినుంచి 1996 దాకా వరుసగా మూడుసార్లు గోరక్షనాథ్ పీఠాధిపతి మహంత్ అవైద్యనాథ్ ఇక్కడినుంచి గెలిచారు. 1998 నుంచి 2014 దాకా ఐదుసార్లు ప్రస్తుత పీఠాధిపతి యోగి గెలిచారు. సీఎం అయ్యాక ఆయన రాజీనామాతో 2018లో జరిగిన ఉప ఎన్నికలో విపక్షాల ఉమ్మడి అభ్యరి్థగా ఎస్పీ నేత ప్రవీణ్ నిషాద్ బీజేపీ అభ్యర్థి ఉపేంద్ర శుక్లాను ఓడించారు. కానీ ఈ ఆధిపత్యాన్ని ఎస్పీ నిలబెట్టుకోలేకపోయింది. కుల సమీకరణాలదే కీలకపాత్ర..గోరఖ్‌పూర్‌లో అగ్రవర్ణ ఓట్లు 6 లక్షలున్నాయి. 9 లక్షల ఓబీసీ, 4 లక్షల నిషాద్, 2 లక్షలకు పైగా యాదవ ఓట్లున్నాయి. 2.5 లక్షల దళిత ఓట్లు, 2 లక్షల ముస్లిం ఓట్లూ తనకేనని కాజల్ చెబుతున్నారు. నిషాద్లూ తన వెంటే ఉన్నారంటున్నారు. బీజేపీ కూడా నిషాద్‌ల ఓట్ల కోసం ముమ్మర ప్రయత్నాలు చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. నటి సూసైడ్!
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ భోజ్‌పురి నటి అమృతా పాండే ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం బీహార్‌లోని భాగల్పూర్లోని తన అపార్ట్మెంట్లో శవమై కనిపించింది. ఆమె తన గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.కాగా.. అమృత పాండే ప్రస్తుతం తన భర్తతో కలిసి ముంబయిలో నివసిస్తోంది. అయితే ఇటీవల భాగల్పూర్లో బంధువుల వివాహానికి వెళ్లింది. ఇంతలోనే ఇలా జరిగింది. శనివారం అమృతా తన వాట్సాప్ స్టేటస్‌పై ఓ నోట్‌ను పోస్ట్ చేసింది. అది పోస్ట్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే తన గదిలో విగతజీవిలా కనిపించింది. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆమె కుటుంబ సభ్యులు తాను డిప్రెషన్లో ఉన్నట్లు చెబుతున్నారు.అమృతా పాండే కెరీర్ విషయానికొస్తే.. ఖేసరి లాల్ యాదవ్‌తో కలిసి 'దీవానాపన్' చిత్రంతో తొలిసారిగా నటించింది. ఈ భోజ్‌పురి చిత్రంలో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా నచ్చింది. ఆ తర్వాత 2022లో ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌కు చెందిన చంద్రమణి ఝంగ్డేను వివాహం చేసుకుంది. పెళ్లయ్యాక వీరిద్దరు ముంబైలోనే నివాసముంటున్నారు. -
తారలొకచోట... మెరుపులు మరోచోట
వాళ్లంతా భోజ్‌పురీ సినీ పరిశ్రమను తిరుగు లేకుండా ఏలిన, ఏలుతున్న తారలు. వెండితెరపై కనిపించారంటే విజిళ్లు, క్షీరాభిష్కాలే. అయితే వారిపట్ల ఈ వీరాభిమానమంతా భోజ్‌పురీ సినిమాలకు పుట్టిల్లయిన బిహార్, పొరుగు రాష్ట్రం జార్ఖండ్‌లకే పరిమితం. వాళ్లు స్థానికంగా ఎంతగా వెలిగినా బాలీవుడ్, తెలుగు తదితర సినీ పరిశ్రమల్లోనే విలన్లుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటించడం ద్వారానే దేశవ్యాప్తంగా ఫేమ్‌లోకి వచ్చారు. రాజకీయ రంగస్థలంపైనా ఇదే సీన్ రిపీటవుతోంది. భోజ్‌పురీ తారలెవరూ వారి స్వరాష్ట్రమైన బిహార్‌లో పెద్దగా ఉనికి చాటలేకపోతున్నారు. కారణాలేవైనా వారిని అక్కడినుంచి బరిలోకి దింపేందుకు పార్టీలు అంతగా ఆసక్తి చూపడం లేదు. దాంతో ఇతర రాష్ట్రాల నుంచి పోటీ చేసి మాత్రమే వాళ్లు లోక్‌సభలో అడుగు పెడుతున్నారు... భోజ్‌పురీ నటీనటులకు, వారి స్వరాష్ట్రమైన బిహార్‌కు రాజకీయంగా ఎప్పుడూ చుక్కెదురే. పొరుగు రాష్ట్రాలకో, సుదూరాలకో వెళ్లి మాత్రమే రాజకీయాల్లో రాణిస్తున్నారు. పలు తెలుగు సినిమాల్లో విలన్‌గా రాణించిన భోజ్‌పురీ సూపర్‌స్టార్ రవికిషన్ 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఉత్తరప్రదేశ్ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ జౌన్పూర్ లోక్‌సభ స్థానంలో బరిలో దిగిన ఆయన ఘోర ఓటమి చవిచూసి ఆరో స్థానంలో నిలిచారు. అనంతరం బీజేపీలో చేరి 2019 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని గోరఖ్‌పూర్ నుంచి 3 లక్షల ఓట్ల పై చిలుకు భారీ మెజారిటీతో నెగ్గారు. ఈసారి కూడా అక్కడినుంచే బరిలోకి దిగుతున్నారు. మరో ప్రముఖ భోజ్‌పురీ నటుడు మనోజ్ తివారీ అయితే ఏకంగా ఢిల్లీని తన రాజకీయ కర్మభూమిగా మార్చుకున్నారు. బిహార్‌లోని కైమూర్ జిల్లా అతర్వాలియా గ్రామానికి చెందిన ఆయన ఈశాన్య ఢిల్లీ బీజేపీ సిట్టింగ్ ఎంపీ. ఈసారి కూడా అక్కడినుంచే పోటీలో ఉన్నారు. భోజ్‌పురీ నట గాయకుడు దినేశ్‌లాల్ యాదవ్ పరిస్థితీ అంతే. గత లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని ఆజంగఢ్ నుంచి నెగ్గిన ఆయన ఈసారీ అక్కడి నుంచే పోటీలో ఉన్నారు. మరో భోజ్‌పురీ గాయకుడు పవన్ సింగ్‌కు కూడా ఈసారి పశ్చిమ బెంగాల్ లోని ఆసన్సోల్ నుంచి బీజేపీ టికెటివ్వగా రెండు రోజులకే ఆయన అనూహ్యంగా బరి నుంచి తప్పుకున్నారు. బిహారీ బాబుగా ప్రసిద్ధుడైన బాలీవుడ్ దిగ్గజం శత్రుఘ్న సిన్హా గతంలో రెండుసార్లు బిహార్‌లోని పాట్నా సాహిబ్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున గెలిచినా 2019లో టికెట్ దక్కకకపోవడంతో పశి్చమ బెంగాల్ వలస వెళ్లారు. అసన్సోల్ లోక్‌సభ స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్ తరఫున గెలిచారు. ఈసారీ అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఇంటర్నెట్ సంచలనం, భోజ్‌పురీ గాయని నేహా సింగ్ రాథోడ్‌కు ఈసారి ఢిల్లీ నుంచి టికెట్ ఇస్తారంటున్నారు. గుంజన్.. ఒకే ఒక్కడు ఈ లోక్‌సభ ఎన్నికల్లో భోజ్‌పురి సినీ పరిశ్రమకు సంబంధించి బిహార్ నుంచి పోటీ చేస్తున్నది గుంజన్ కుమార్ ఒక్కరే. అయితే ఈ భోజ్‌పురీ/మగధీ గాయకుడు తన స్వస్థలమైన నవడా నుంచి ఇండిపెండెంట్‌గా బరిలో దిగుతున్నారు. ‘‘అన్ని ప్రధాన పార్టీలనూ సంప్రదించా. ఎవరూ టికెటివ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నా’’ అని వాపోతున్నారాయన! భోజ్‌పురి నటులు, గాయకులకు బిహార్‌లో లోక్‌సభ టికెటివ్వడానికి ప్రధాన పారీ్టలు వెనకా ముందాడుతున్న మాట వాస్తవమేనని భోజ్‌పురి గాయకుడు వినయ్ బిహారీ అంటున్నారు. ఆయన బిహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లా లౌరియా ఎమ్మెల్యే. 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున విజయం సాధించారు. కానీ ఏ పార్టీ కూడా టికెటివ్వకపోవడంతో 2010లో తొలిసారి స్వతంత్ర అభ్యర్థగా పోటీ చేయాల్సి వచ్చింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన భోజ్‌పురీ భాషకు బిహార్‌లోనే తగిన గౌరవం లభించడం లేదు. బహుశా అందుకే భోజ్‌పురీ నటీనటులు, గాయకులకు ఇతర రాష్ట్రాల నుంచే తప్ప స్వరాష్ట్రంలో పోటీ చేసే అవకాశం దక్కడం లేదు. రాబోయే రోజుల్లో పరిస్థితులు మారతాయేమో!’ అన్నారు. భోజ్‌పురీ నటీనటులు, గాయకులకు బీజేపీ మున్ముందు కచి్చతంగా బిహార్ నుంచి అవకాశమిస్తుందని తనకు నమ్మకముందని రవికిషన్ చెప్పుకొచ్చారు. -
నమ్మించి దారుణం.. నటిపై రెండుసార్లు అత్యాచారం..!
ప్రముఖ భోజ్‌పురి నటి ప్రియాన్స్ సింగ్ సంచలన ఆరోపణలు చేసింది. తన సహా నటుడు పునీత్ సింగ్ అత్యాచారం చేశాడని ఆరోపింంచింది. తనపై చాలా అసభ్యంగా ప్రవర్తించాడంటూ గతనెల 29న పోలీసులను ఆశ్రయించింది. తనతో అసహజమైన పనులు చేశాడంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. (ఇది చదవండి: ఏకంగా తొమ్మిది చిత్రాలు.. ఆ దర్శకుల్లో టాప్ ఎవరంటే.. రాజమౌళి మాత్రం!) ప్రియాంక మాట్లాడుతూ.. 'నా కెరీర్లో బాగా పని చేస్తున్న సమయంలోనే సోషల్ మీడియాలో పునీత్ సింగ్ రాజ్పుత్ని కలిశా. ఆ తర్వాత నాతో మాట్లాడటం ప్రారంభించాడు. మొదట నాతో చాలా మర్యాదగా వ్యవహరించేవాడు. చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టాలనేది అతని కోరిక. నా పరిచయాల ద్వారా అతనికి సాయం చేశా. దీంతో అతనిపై పూర్తి నమ్మకం ఏర్పడింది. నన్ను పెళ్లి చేసుకుంటానని ఎప్పుడూ చెప్పేవాడు. ఆ తర్వాత మా ఇంటికి రావడం మొదలెట్టాడు.' అంటూ చెప్పుకొచ్చింది. ప్రియాంక మాట్లాడుతూ.. 'ఒక రోజు నేను ఒంటరిగా ఉన్నప్పుడు మద్యం తాగి మా ఇంటికి వచ్చాడు. నాపై బలవంతంగా అత్యాచారం చేశాడు. నా జుట్టు పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. మరుసటి రోజు ఉదయం అతను స్పృహలోకి వచ్చాక.. పోలీసులకు కంప్లైంట్ చేస్తానని వార్నింగ్ ఇచ్చా. ఏడ్చి నన్ను క్షమించమని వేడుకున్నాడు. ఆ తర్వాత తన కుటుంబాన్ని ఒప్పించి.. త్వరలో పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. అతడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. ఇటీవల మరోసారి నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. నాకు అతనిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. . నాకు న్యాయం కావాలి. అతనికి వీలైనంత త్వరగా శిక్ష విధించాలి.' అని డిమాండ్ చేసింది. (ఇది చదవండి: హీరో అవ్వాలనుకున్నా, సీక్రెట్‌గా పెళ్లి.. ఇండస్ట్రీలో కష్టాలు..: గడ్డం నవీన్) -
మోడల్స్‌తో వ్యభిచారం.. ప్రముఖ నటి అరెస్ట్!
ముంబయి పోలీసులు హై లెవెల్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. మోడల్స్‌తో వ్యభిచారం నిర్వహిస్తున్న నటిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని గోరెగావ్‌లోని ఓ హోటల్లో వ్యభిచార దందా నడుస్తోందన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భోజ్‌పురి నటి సుమన్ కుమారిని అరెస్ట్ చేశారు. వ్యభిచార కూపం నుంచి ముగ్గురు మోడల్స్‌ను పోలీసులు రక్షించారు. ఈ దందాలో భోజ్‌పురి నటి యువతులను ట్రాప్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. భోజ్‌పురి నటి వయసు 24 ఏళ్లు కాగా.. గోరేగావ్‌లోని రాయల్ పామ్ హోటల్లో నిందితురాలు ఈ వ్యాపారాన్ని పోలీసులకు సమాచారం అందింది. శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు దాడులు నిర్వహించగా.. నటి చీకటి దందా బయటపడింది. కాగా.. భోజ్‌పురి చిత్ర పరిశ్రమకు చెందిన సుమన్ కుమారి ‘లైలా మజ్ను సినిమాలో నటించింది. అలాగే వెబ్ సిరీస్ జామ్‌స్టిక్ బాక్స్, భోజ్‌పురి కామెడీ ఎపిసోడ్ ‘బాప్ నంబ్రి బేటా దస్ నంబ్రి’లో పనిచేసింది. ఈనె హిందీ, పంజాబీ మ్యూజిక్ ఆల్బమ్‌లలో కూడా పనిచేసింది. Maharashtra | A Bhojpuri actress Suman Kumari (24) has been arrested by Mumbai Police for allegedly forcing girls (models) into prostitution. Police also rescued 3 models. Further investigation is being done: Crime Branch, Mumbai police — ANI (@ANI) April 21, 2023 -
నెట్టింట లీక్ అయిన హీరోయిన్ ప్రైవేట్ వీడియో
సోషల్ మీడియా వాడకం పెరిగాక హీరోయిన్ల ప్రైవసీ అంశం కాస్త కష్టతరమైందనే చెప్పొచ్చు. సెలబ్రిటీల ప్రైవేట్ వీడియోలు ఆన్లైన్లో దర్శనవ్వడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. తాజాగా ఓ ప్రముఖ నటి అక్షరాసింగ్కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట లీక్ అయ్యింది. బిగ్‌బాస్ షోతో పాపులర్ అయిన అక్షరా సింగ్ ప్రస్తుతం సినిమాలు, సీరియల్స్‌తో బిజీగా ఉంది. అయితే సినిమాల కంటే పర్సనల్ విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న అక్షరా సింగ్‌కు సంబంధించి గతంలో ఎంఎంఎస్ వీడియో సోషల్ మీడియాలో బయటికొచ్చిన సంగతి తెలిసిందే.అప్పుడు తన పరువును బజారున పడేయడానికే ఎవరో కావాలనే ఇలా మార్ఫింగ్ చేశారంటూ క్లారిటీ ఇచ్చింది. తాజాగా మరోసారి ఆమె ప్రైవేట్ వీడియో లీకయ్యింది. దీంతో ఆమెను చాలామంది నెటిజన్లు ఇలాంటి పని చేయడానికి సిగ్గులేదా అంటూ తిట్టిపోస్తున్నారు. దీనిపై అక్షరాసింగ్ ఏమైనా వివరణ ఇస్తుందా అన్నది చూడాల్సి ఉంది. -
ముచ్చటగా మూడోసారి తండ్రైన ప్రముఖ నటుడు.. ట్వీట్ వైరల్
భోజ్‌పూరి నటుడు, ఎంపీ మనోజ్ తివారి ముచ్చటగా మూడోసారి తండ్రయ్యాడు. సోమవారం ఆయన భార్య సురభి తివారీ ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు ట్వీట్ చేశారు. ఆస్పత్రిలో భార్యతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వార్త విన్న అభిమానులు మనోజ్ తివారికి అభినందనలు తెలుపుతున్నారు. ట్విటర్లో ఆయన రాస్తూ..' లక్ష్మి తర్వాత సరస్వతి మా ఇంటికి వచ్చింది. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు అందమైన చిన్నారి జన్మించింది. మా పాపను మీరంతా ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. ఇట్లు సురభి-మనోజ్ తివారి' అంటూ పోస్ట్ చేశారు. మనోజ్ తివారి ప్రస్తుతం భాజపా ఎంపీగా కొనసాగుతున్నారు. కాగా.. గత నెలలో మనోజ్ భార్య సురభి తివారీ బేబీ షవర్‌ని(సీమంతం) నిర్వహించారు. సురభి- మనోజ్ తివారీకి రెండో భార్య కాగా.. వీరికి 2020లో కూతురు జన్మించింది. అంతకు ముందే రాణి తివారీని 1999లో వివాహం చేసుకోగా.. వారికి రితి అనే కుమార్తె ఉంది. बड़े हर्ष के साथ सूचित करना है कि मेरे घर में लक्ष्मी के बाद सरस्वती का आगमन हुआ है..आज घर में प्यारी सी बिटिया पैदा हुई है.. उसपे आप सभी का आशीर्वाद बना रहे.. सुरभि-मनोज तिवारी pic.twitter.com/JJj1H82XEr — Manoj Tiwari 🇮🇳 (@ManojTiwariMP) December 12, 2022 -
షాకింగ్: నటి ప్రియాంక పండిట్ న్యూడ్ వీడియో లీక్, స్పందించిన నటి
ఇటీవల భోజ్‌పురి నటి త్రిష కర్ మధు ఎంఎంఎస్ లీకై ఇంటర్నెట్లో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఆమె బాయ్‌ప్రెండ్‌తో ఏకాంతంగా గడిపిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. అంతేగాక ఈ దారుణానికి పాల్పడిన వారిని ఆ దేవుడు శిక్షిస్తాడు అంటూ సోషల్ మీడియా వేదికగా ఆమె వాపోయింది. ఇదిలా ఉండగానే తాజాగా మరో భోజ్‌పురి నటి ప్రియాంక పండిట్ న్యూడ్ వీడియో ఓకటి సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చింది. చదవండి: సెక్స్ రాకెట్: టాప్ మోడల్, నటి అరెస్ట్ ప్రియాంక పండిట్ నగ్న వీడియోను పలువురు షేర్ చేయగా మరికొందరు మీమ్స్‌తో ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఇది కాస్తా ఆమె దృష్టికి వెళ్లడంతో నటి స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. అంతేగాక తనంటే పడని వారు ఎవరో ఈ పని చేశారని, ఈ వీడియో తనది కాదని స్పష్టం చేసింది. అచ్చం తనలా ఉన్న మరో యువతి వీడియోను తన పేరుతో పోస్టు చేసినట్లు పేర్కొంది. అంతేగాక ఈ వీడియో పాతదని కూడా ఆమె వెల్లడించింది. ఈ విషయంపై ఆమె పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు లిఖితపూర్వకంగా ఆమె ఫిర్యాదు చేసినట్లు సమాచారం. చదవండి: బాయ్‌ఫ్రెండ్‌తో ఏకాంతంగా..ప్రముఖ నటి వీడియో లీక్ -
ఇంటర్నెట్ను ఊపేస్తున్న ఆమ్రపాలి డ్యాన్స్
ముంబై : భోజ్‌పురి ఫిల్మ్ ఇండస్ట్రీ నటి ఆమ్రపాలి దుబే ‘బెల్లి డ్యాన్స్’ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘లవ్ కే లియే కుచ్ బి కరేగా’ మూవీలోని తోహరే ఖతిర్ అనే వీడియో పాటను మూవీ యూనిట్ వాళ్లు ఎస్ఆర్కే మ్యూజిక్ యూట్యూబ్ ఖాతాలో పోస్ట్ చేశారు. కాగా, తన బృందంతో కలిసి నటి ఆమ్రపాలి వేసిన స్టెప్పులకు వీక్షకులు ముగ్దులవుతున్నారు. ఈ నెల 9న పోస్ట్ చేసిన వీడియో సాంగ్ ఇప్పటికే 82 లక్షల వ్యూస్‌తో దూసుకెళ్తోంది. తెలుపు, ఎరుపు రంగుతో ఉన్న ఘాగ్రా చోలీలో ఆమ్రపాలి మరింత ఆకర్షనీయంగా కనిపించారు. ఇందు సోనాలి, అనుజ్ తివారీలు ఈ వైరల్ పాటకు గాత్రదానం చేశారు. దీరజ్ ఠాకూర్ దర్శకత్వం వహించిన ఈ మూవీని గాయత్రి క్రియేషన్స్ బ్యానర్లో సతీశ్ దుబే, సునీల్ సింగ్‌లు నిర్మించారు. పలు టీవీ షోల్లోనూ నటి ఆమ్రపాలి తనదైన ముద్రవేశారు. నిరాహువా హిందూస్తానీ మూవీతో 2014లో భోజ్‌పురి ఇండస్ట్రీకి ఆమె పరిచయం అయ్యారు. కాగా, అత్యధిక పారితోషికం అందుకుంటోన్న హీరోయిన్లలో ఆమె ఒకరన్న విషయం తెలిసిందే. ఆమ్రపాలి డ్యాన్స్ వీడియో -
నటీ నటులపై దర్శకుడి యాసిడ్ దాడి
భోజ్‌పురి సినిమా పరిశ్రమకు చెందిన ఇద్దరు నటీనటులపై యాసిడ్ దాడి జరిగింది. రూపాలి (20), వికాస్ (19) అనే ఇద్దరూ సినిమా షూటింగ్ కోసం వచ్చి ఓ కాలేజి ప్రాంగణంలో నిద్రపోతుండగా అజయ్ కుమార్ అనే సినీ దర్శకుడు వచ్చి వాళ్ల మీద యాసిడ్ పోసి అక్కడి నుంచి పారిపోయినట్లు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేసీ గోస్వామి తెలిపారు. వాళ్లిద్దరినీ వెంటనే సమీపంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అక్కడి నుంచి వారిని మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్ర ఆస్పత్రికి పంపారు. ఇద్దరిలో రూపాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. భోజ్‌పురి సినిమా రంగంలో దర్శకుడిగా ఉన్న అజయ్ కుమార్‌కు రూపాలిపై కోపం ఉన్నట్లు తెలుస్తోంది. తన ఇష్టానికి వ్యతిరేకంగా వికాస్‌తో కలిసి నటిస్తున్నందుకే ఆయనకు కోపం అని చెబుతున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అజయ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.