
ప్రముఖ భోజ్‌పురి నటి ప్రియాన్స్ సింగ్ సంచలన ఆరోపణలు చేసింది. తన సహా నటుడు పునీత్ సింగ్ అత్యాచారం చేశాడని ఆరోపింంచింది. తనపై చాలా అసభ్యంగా ప్రవర్తించాడంటూ గతనెల 29న పోలీసులను ఆశ్రయించింది. తనతో అసహజమైన పనులు చేశాడంటూ తీవ్ర ఆరోపణలు చేసింది.
(ఇది చదవండి: ఏకంగా తొమ్మిది చిత్రాలు.. ఆ దర్శకుల్లో టాప్ ఎవరంటే.. రాజమౌళి మాత్రం!)
ప్రియాంక మాట్లాడుతూ.. 'నా కెరీర్‌లో బాగా పని చేస్తున్న సమయంలోనే సోషల్ మీడియాలో పునీత్ సింగ్ రాజ్‌పుత్‌ని కలిశా. ఆ తర్వాత నాతో మాట్లాడటం ప్రారంభించాడు. మొదట నాతో చాలా మర్యాదగా వ్యవహరించేవాడు. చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టాలనేది అతని కోరిక. నా పరిచయాల ద్వారా అతనికి సాయం చేశా. దీంతో అతనిపై పూర్తి నమ్మకం ఏర్పడింది. నన్ను పెళ్లి చేసుకుంటానని ఎప్పుడూ చెప్పేవాడు. ఆ తర్వాత మా ఇంటికి రావడం మొదలెట్టాడు.' అంటూ చెప్పుకొచ్చింది.
ప్రియాంక మాట్లాడుతూ.. 'ఒక రోజు నేను ఒంటరిగా ఉన్నప్పుడు మద్యం తాగి మా ఇంటికి వచ్చాడు. నాపై బలవంతంగా అత్యాచారం చేశాడు. నా జుట్టు పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. మరుసటి రోజు ఉదయం అతను స్పృహలోకి వచ్చాక.. పోలీసులకు కంప్లైంట్ చేస్తానని వార్నింగ్ ఇచ్చా. ఏడ్చి నన్ను క్షమించమని వేడుకున్నాడు. ఆ తర్వాత తన కుటుంబాన్ని ఒప్పించి.. త్వరలో పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. అతడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. ఇటీవల మరోసారి నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. నాకు అతనిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. . నాకు న్యాయం కావాలి. అతనికి వీలైనంత త్వరగా శిక్ష విధించాలి.' అని డిమాండ్ చేసింది.
(ఇది చదవండి: హీరో అవ్వాలనుకున్నా, సీక్రెట్‌గా పెళ్లి.. ఇండస్ట్రీలో కష్టాలు..: గడ్డం నవీన్)