
భోజ్‌పూరి నటుడు, ఎంపీ మనోజ్ తివారి ముచ్చటగా మూడోసారి తండ్రయ్యాడు. సోమవారం ఆయన భార్య సురభి తివారీ ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు ట్వీట్ చేశారు. ఆస్పత్రిలో భార్యతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వార్త విన్న అభిమానులు మనోజ్ తివారికి అభినందనలు తెలుపుతున్నారు.
ట్విటర్‌లో ఆయన రాస్తూ..' లక్ష్మి తర్వాత సరస్వతి మా ఇంటికి వచ్చింది. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు అందమైన చిన్నారి జన్మించింది. మా పాపను మీరంతా ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. ఇట్లు సురభి-మనోజ్ తివారి' అంటూ పోస్ట్ చేశారు. మనోజ్ తివారి ప్రస్తుతం భాజపా ఎంపీగా కొనసాగుతున్నారు.
కాగా.. గత నెలలో మనోజ్ భార్య సురభి తివారీ బేబీ షవర్‌ని(సీమంతం) నిర్వహించారు. సురభి- మనోజ్ తివారీకి రెండో భార్య కాగా.. వీరికి 2020లో కూతురు జన్మించింది. అంతకు ముందే రాణి తివారీని 1999లో వివాహం చేసుకోగా.. వారికి రితి అనే కుమార్తె ఉంది.
बड़े हर्ष के साथ सूचित करना है कि मेरे घर में लक्ष्मी के बाद सरस्वती का आगमन हुआ है..आज घर में प्यारी सी बिटिया पैदा हुई है.. उसपे आप सभी का आशीर्वाद बना रहे.. सुरभि-मनोज तिवारी pic.twitter.com/JJj1H82XEr
— Manoj Tiwari 🇮🇳 (@ManojTiwariMP) December 12, 2022
Comments
Please login to add a commentAdd a comment