![Tollywood Actress Anasuya Latest Tweet On Her Comments](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/ana.jpg.webp?itok=n5u5qvH5)
టాలీవుడ్ నటి అనసూయ ఇటీవలే పుష్ప-2 సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ఈ చిత్రంలో తనదైన పాత్రలో అభిమానులను మెప్పించారు. పుష్ప పార్ట్-1లో దాక్షాయణిగా అలరించిన అనసూయ.. పార్ట్-2లోనూ మరోసారి సినీ ప్రియులను ఆకట్టుకుంది. ప్రస్తుతం అరి మూవీ(Ari)తో అభిమానులను పలకరించనుంది. పేపర్ బాయ్ ఫేం జయ శంకర్ తెరకెక్కించిన ఈ మైథలాజికల్ థ్రిల్లర్‌లో సాయికుమార్, అనసూయ భరద్వాజ్, శుభలేఖ సుధాకర్, ఆమని, వైవా కీలక పాత్రల్లో నటించారు. గతేడాదిలోనే ఈ చిత్రం రిలీజ్ కావాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.
(ఇది చదవండి: స్టార్ హీరో ‘అడిగితే’ నో చెప్పా.. చాలా కోల్పోయా: అనసూయ)
అయితే తాజాగా అనసూయ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక్కడ నేను కేవలం నా అనుభవాన్ని మాత్రమే పంచుకున్నట్లు తెలిపింది. అవగాహన కల్పించడం కోసమే నా కెరీర్‌లో ఎదురైన సంఘటనల గురించి మాత్రమే మాట్లాడనని పేర్కొంది. నా మాటలను ఎవరూ వక్రీకరించవద్దని ప్రేక్షకులను, మీడియాను హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నట్లు ట్వీట్‌లో రాసుకొచ్చింది. ఇలాంటివీ నన్ను క్యారెక్టర్‌ను డిసైడ్ చేయలేవ్.. నిజమే ఎప్పటికీ నిలుస్తుంది. నన్ను అర్థం చేసుకున్న వారికి ప్రేమను పంచుతూనే ఉంటా అని పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
I shared my experience—what I faced, I spoke. Not to blame, but to bring awareness. I sincerely request the audience and media not to twist my words into something I never meant. The noise doesn’t define me—truth does. Sending love to those who understand. ❤️ #StayStrong
— Anasuya Bharadwaj (@anusuyakhasba) February 11, 2025
Comments
Please login to add a commentAdd a comment