యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన అనసూయ టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. రంగస్థలం, పుష్ప సినిమాలతో అనసూయ క్రేజ్ ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. ఇటీవలే ప్రేమ విమానం చిత్రంలో కనిపించి అభిమానులను మెప్పించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పుష్ప-2తో పాటు అరి అనే చిత్రంలో నటిస్తోంది. టాలీవుడ్ వరుస సినిమాలు చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటోంది. తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తోంది అనసూయ.
(ఇది చదవండి: అనసూయ ‘అరి’కోసం వినూత్న ప్రచారం)
తాజాగా అనసూయ పోస్ట్ చేసిన నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ముఖ్యంగా ఫోటోలతో పాటు ఓ మేసేజ్ కూడా ఇచ్చింది. ఇది తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయం అంటూ పోస్ట్ చేసింది. మీరు చేసే పనిని.. మీరు చేసే విధంగా మరెవ్వరూ చేయలేరంటూ ట్వీట్ చేసింది. అదే మీ సూపర్ పవర్ అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం అనసూయ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.
Remember:
No one else can do what you do, the way you do it.
𝘛𝘩𝘢𝘵 is your Super power 😊🦄🦋🪽 pic.twitter.com/oRzrgWLJxF— Anasuya Bharadwaj (@anusuyakhasba) January 23, 2024
Comments
Please login to add a commentAdd a comment