Anchor Anasuya Bharadwaj Tweet Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Anasuya Bharadwaj: పాపం.. నా పేరు లేకుండా బతకలేరేమో?: అనసూయ

Published Sat, Jul 15 2023 9:56 AM | Last Updated on Sat, Jul 15 2023 10:36 AM

Anchor Anasuya Bharadwaj Tweet Goes Viral On Social Media - Sakshi

బుల్లితెర యాంకర్‌గా, నటిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్ ప్రేక్షకుల్లో పేరు సంపాదించుకుంది అనసూయ. ఇటీవలే విమానం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. రంగస్థలం, పుష్ప సినిమాలతో మరింత ఫేమ్ తెచ్చుకున్న అనసూయ ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో మరోసారి వైరల్‌గా మారింది.  ఇటీవలే తనను వివాదాల్లోకి లాగొద్దంటూ అనసూయ సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. 

(ఇది చదవండి: స్టార్ హీరోపై విడాకుల రూమర్స్.. విదేశాల్లో ఉందంటూ!)

తాజాగా ట్వీట్‌లో రాస్తూ..'వావ్! నేను నిజంగా చాలా చాలా ముఖ్యమైన వ్యక్తిని. నా పరిచయం ఉన్నా లేకున్నా.. నాకు సంబంధం ఉన్నా.. లేకున్నా.. నా పేరు ఎత్తకుండా ఒక్క చర్చ కూడా జరగడం లేదంటే.. మీ అందరికి నేను అంతలా కావాలి అబ్బాయిలు.. నాపైనే ఎక్కువగా మీరంతా ఆధారపడి ఉన్నారు.. నా పేరు లేకుండా పాపం ఏదీ చెప్పలేక పోతున్నారు.' అంటూ ఎమోజీని జత చేసింది.

ఇది చూసిన అభిమానులు మళ్లీ ఏమైందంటూ పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే చాలాసార్లు ట్వీట్స్ వివాదాలకు దారి తీసిన సంగతి తెలిసిందే. కాగా.. ఇటీవలే ఓ హీరో కొత్త సినిమా పోస్టర్‌ రిలీజ్ చేయగా..  దానిపై అభిప్రాయం వ్యక్తం చేసిన  అనసూయకు.. ఆ హీరో ఫ్యాన్స్‌ నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదురయ్యాయి. గతంలో హీరో విజయ్ దేవరకొండ తనను టార్గెట్‌ చేేశారని.. కావాలనే తనపై కొందరికి డబ్బులిచ్చి మరీ ట్రోల్స్ చేస్తున్నారని ఆరోపించిన సంగతి తెలిసిందే. 

(ఇది చదవండి:  స్లిమ్‌ కోసం కసరత్తులు.. హీరోయిన్‌పై దారుణంగా ట్రోల్స్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement