నాలుగేళ్ల క్రితం నివాళి అర్పించా.. దయచేసి ఆమెను అవమానించొద్దు: అనసూయ కౌంటర్! | Anchor Anasuya Bharadwaj Reply to Netizen Who Trolls On Her Video | Sakshi
Sakshi News home page

Anasuya Bharadwaj: నాపై విమర్శలు చేయండి.. కానీ ఆమెను అవమానించొద్దు: అనసూయ

Published Mon, Jul 15 2024 4:18 PM | Last Updated on Mon, Jul 15 2024 4:38 PM

Anchor Anasuya Bharadwaj Reply to Netizen Who Trolls On Her Video

టాలీవుడ్ నటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాంకర్‌గా కెరీర్‌ మొదలు పెట్టి తెలుగులో స్టార్‌ నటిగా ఎదిగింది. ప్రస్తుతం ఆమె పుష్ప-2 ది రూల్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సుకుమార్‌- అల్లు అ‍ర్జున్‌ కాంబోలో వస్తోన్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో థియేటర్లలో సందడి చేయనుంది. అయితే సినిమాలతో ఎప్పుడు బిజీగా ఉండే ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లోనే ఉంటోంది.

తాజాగా అనసూయ ఓ టీవీ షోలో అనసూయ ప్రదర్శనకు సంబంధించిన ఓ వీడియోను నెటిజన్‌ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఇది చూసిన మరో ఆ వీడియోపై ట్రోలింగ్ చేశాడు. దీనిపై అనసూయ  రియాక్ట్ అయింది. ఇకపై దేనికి స్పందించకూడని నిర్ణయించుకున్నాని ఆమె తెలిపారు. కానీ.. మహానటికి నివాళులర్పించిన తన వీడియోను అవమానించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనసూయ ట్వీట్‌లో రాస్తూ. 'నేను దేనికీ స్పందించకూడదని నిర్ణయించుకున్నా. కానీ నాలుగేళ్ల  క్రితం ఒక ఛానెల్‌లో జరిగిన ఒక పండుగ కార్యక్రమంలో మహానటి సావిత్రమ్మకు నివాళులు అర్పించా. నా ప్రదర్శన పట్ల నాకు గౌరవంగా భావిస్తున్నా. కానీ మీరు ఇలా అవమానకరమైన రీతిలో ట్రోల్ చేయడం మంచిది కాదు. ఏదైనా నా గురించి  గౌరవప్రదమైన విమర్శలు చేస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా. కానీ ఇది మహానటి సావిత్రిమ్మకు నివాళిని ఉద్దేశించి ఇలా చేయడం అగౌరవంగా అనిపిస్తోంది. దయచేసి ఈ ఈవెంట్‌లో నా పూర్తి ప్రదర్శనను చూసి ఆపై జడ్జ్‌ చేయమని సూచిస్తున్నా. కావాలంటే ఈ  ప్రోగ్రామ్ జీ5లో అందుబాటులో ఉంది. ఇక్కడ నా నటన మీకు నచ్చవచ్చు లేదా నచ్చకపోవచ్చు. కనీసం లెజెండ్ అయినా సావిత్రమ్మ కోసమైనా ఇలాంటి ట్రోల్స్‌ చేయకండి. ఎప్పటిలాగే నాపై విమర్శలు చేయాలనుకుంటే చేస్కోండి' అంటూ అతనికి చురకలు అంటించింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement