
హీరోయిన్ నివేదా పేతురాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళం తన అందం, అభినయంతో ప్రేక్షకులనున ఆకట్టుకుంటుంది. ‘మెంటల్ మదిలో’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె చిత్రలహరి, అలా వైకుంటపురంలో సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు పొందింది. చేసింది కొన్ని సినిమాలే అయినా సౌత్‌లో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. గతేడాది యంగ్ విశ్వక్ సేన్ సరసన దాస్ కా ధమ్కీ చిత్రంలో హీరోయిన్‌గా అలరించిన భామ.. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ నటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతంలో నటన, మోడలింగ్‌లో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. కొన్నాళ్ల ముందు కారు రేసింగ్ నేర్చుకుంది. అప్పట్లో రేసు ట్రాక్ మీద కారులో ఉన్న ఫొటోలు వైరలయ్యాయి. అంతేకాదు ఇటీవలే మధురైలో జరిగిన బ్యాడ్మింటర్ ఛాంపియన్‌షిప్ పోటీలోని మిక్స్‌డ్ డబుల్స్ కేటగిరీలో కప్ కొట్టిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా.. తాజాగా ఈ ముద్దుగుమ్మ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనపై వస్తున్న వార్తలన్ని అవాస్తమని కొట్టిపారేసింది. మీరు ఏదైనా రాసేముందు దయచేసి నిజాలు ఏంటో తెలుసుకోవాలని సూచించింది. ఇలాంటి వాటితో తమ కుటుంబం ఒత్తిడిలో ఉందని.. అనవసరంగా ఒక అమ్మాయి జీవితంపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని కోరింది. ఈ మేరకు తన ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేసింది.
నివేదా పేతురాజ్ తన ట్వీట్‌లో రాస్తూ..'నా కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని ఇటీవల తప్పుడు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయినప్పటికీ నేను మౌనంగా ఉన్నా. ఎందుకంటే దీని గురించి మాట్లాడే బుద్దిలేని కొందరు వ్యక్తులు ఒక అమ్మాయి జీవితాన్ని పాడు చేసే ముందు వారు అందుకున్న సమాచారాన్ని ధృవీకరించడానికి కొంతైనా మానవత్వంతో ఉంటారని భావించా. వాటి వల్ల కొన్ని రోజులుగా నేను, మా కుటుంబం తీవ్ర ఒత్తిడిలో ఉన్నాం. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి.' అంటూ విజ్ఞప్తి చేసింది.
ఆ తర్వాత రాస్తూ.. 'నేను చాలా గౌరవప్రదమైన కుటుంబం నుండి వచ్చా. 16 ఏళ్ల వయసు నుంచే ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్నా. నా కుటుంబం ఇప్పటికీ దుబాయ్‌లోనే నివసిస్తోంది. మేము దాదాపు 20 ఏళ్లకు పైగా దుబాయ్‌లో ఉన్నాం. సినీ పరిశ్రమలో కూడా నాకు అవకాశాలు ఇప్పించమని నేను ఏ నిర్మాతను, దర్శకుడిని, హీరోను అడగలేదు. ఇప్పటికీ 20కి పైగా సినిమాలు చేశా. నేను ఎప్పుడూ డబ్బు కోసం అత్యాశ పడలేదని' రాసుకొచ్చింది.
నా గురించి ఇప్పటివరకు మాట్లాడిన సమాచారం ఏదీ నిజం కాదు. మేము 2002 నుంచి దుబాయ్‌లో అద్దె ఇంట్లో నివసిస్తున్నాం. అలాగే 2013 నుంచి రేసింగ్ అంటే నా అభిరుచి. నిజానికి చెన్నైలో రేసులను నిర్వహించడం గురించి నాకు తెలియదు. నేను చాలా సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నా. జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొన్న తర్వాత మానసికంగా పరిణీతి సాధించా. అంతేకాదు.. మీ కుటుంబంలోని ఇతర స్త్రీలు కోరుకున్నట్లే గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నా. జర్నలిజంలో కొంత మానవత్వం మిగిలి ఉందని.. ఇకపై నా పరువు తీసేలా వ్యవహరించని ఇప్పటికీ విశ్వసిస్తున్నందున చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం లేదు. ఒక కుటుంబం ప్రతిష్టను కించపరిచేలా మాట్లాడేముందు.. మీరు అందుకున్న సమాచారాన్ని ధృవీకరించుకోవాలని కోరుతున్నా. అలాగే మా కుటుంబాన్ని ఇకపై ఎలాంటి బాధలకు గురిచేయవద్దని మీడియా మిత్రులకు అభ్యర్థిస్తున్నా. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.' అంటూ రాసుకొచ్చింది.
అసలేం జరిగిందంటే..
కాగా.. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ నివేదా పేతురాజ్‌కు 50 కోట్ల రూపాయల విలువైన ఇంటిని బహుమతిగా ఇచ్చారని సోషల్ మీడియాలో విపరీతమైన రూమర్స్ వచ్చాయి. ఆమె కోసం ఉదయనిధి స్టాలిన్ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నాడంటూ ఆరోపించారు. ఇదే విషయమై తమిళ సినీ ఇండస్ట్రీకి ఓ యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన సంబంధిత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయం తెలుసుకున్న నివేదా పేతురాజ్ ఘాటుగా స్పందించింది. అవన్నీ అవాస్తవాలేనంటూ ట్విటర్ వేదికగా క్లారిటీ ఇచ్చింది.
Lately there has been false news circulating about money being lavishly spent on me. I kept quiet because I thought people who are speaking about this will have some humanity to verify the information they receive before mindlessly spoiling a girl’s life.
My family and I have…— Nivetha Pethuraj (@Nivetha_Tweets) March 5, 2024
Comments
Please login to add a commentAdd a comment