udayanidhi Stalin
-
సనాతన ధర్మంపై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదు: ఉదయనిధి
చెన్నై: సనాతన ధర్మంపై తమిళనాడు డిప్యూటీ ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం సృష్టించిన విషయం తెలిసిందే. సనాతన ధర్మం అనేది మలేరియా, డెంగీ వంటిదని, దాన్ని నిర్మూలించాలని గతంలో ఆయన పిలుపునిచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలకుగానూ స్థాలిన్కు వ్యతిరేకంగా హిందూ సంఘాలు, ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. ఈ క్రమంలో తాజాగా యన చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోసారి స్పందించారు.సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న తన పిలుపుపై క్షమాపణలు చెప్పబోనని స్పష్టం చేశారు. మహిళలపై జరిగిన అణచివేత పద్దతులను, వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో ఈ వ్యాఖ్యలు చేసినట్లు వివరణ ఇచ్చుకున్నారు. సనాతన ధర్మంపై తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. ఆ విషయంలో ఎవరికీ క్షమాపణ చెప్పేది లేదని మరోసారి క్లారిటీ ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలపై న్యాయ పోరాటానికి కూడా సిద్ధమని ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు.సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి మాట్లాడుతూ. పెరియార్, మాజీ ముఖ్యమంత్రి సీఎన్ అన్నాదురై, ఎం కరుణానిధి వంటి ద్రావిడ నాయకుల అభిప్రాయాలను తాను ప్రతిధ్వనించానని అన్నారు.‘మహిళలను చదువుకోవడానికి అనుమతించ లేదు వారు తమ ఇళ్లను వదిలి వెళ్ళలేకపోయారు. ఒకవేళ భర్త చనిపోతే వారు కూడా చనిపోవాలి. వీటన్నింటికీ వ్యతిరేకంగా తంతై పెరియార్ మాట్లాడారు. పెరియార్, అన్నా, కలైంజ్ఞర్ చెప్పిన దానినే నేను చెప్పాను’ అని ఉదయనిధి పేర్కొన్నారు. -
పవన్ వ్యాఖ్యలపై ఉదయనిధి స్టాలిన్ కౌంటర్
చెన్నై: తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో సనాతన ధర్మంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే తమిళనాడు అధికార పార్టీ డీఎంకే కౌంటర్ ఇచ్చింది. తిరుమల లడ్డూ కల్తీ జరిగిందంటూ కూటమి ప్రభుత్వం చేసిన రాజకీయంపై సుప్రీం కోర్టు మొట్టి కాయలు వేసిన విషయాన్ని గుర్తు చేసింది. గురువారం పవన్ వారాహి డిక్లరేషన్ సభలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. దానిపై తాజాగా శుక్రవారం తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించలేరంటూ పవన్ చేసిన వ్యాఖ్యలకు బదులిస్తూ.. ‘వేచి చూడండి. వేచి చూడండి’ అని అన్నారు.#WATCH | On Andhra Pradesh Deputy CM Pawan Kalyan's remark 'Sanatana Dharma cannot be wiped out and who said those would be wiped out', Tamil Nadu Deputy CM Udhayanidhi Stalin says "Let's wait and see" pic.twitter.com/YUKtOJRnp9— ANI (@ANI) October 4, 2024 ‘‘సనాతన ధర్మం వైరస్ లాంటిదని, ఆ మహమ్మారిని నిర్మూలించాలని ఈ మధ్య ఓ యువ నాయకుడు మాట్లాడుతున్నాడు. సనాతన ధర్మాన్ని ఎవరూ ఏమీ చేయలేరు. ఎవరైనా సరే దాన్ని నిర్మూలించాలనుకుంటే, వారే తుడిచి పెట్టుకుని పోతారు. తిరుపతి బాలాజీ సాక్షిగా ఈ మాట చెబుతున్నా’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.అయితే పవన్ వ్యాఖ్యలపై డీఎంకే ఇప్పటికే గట్టి కౌంటర్ ఇచ్చింది. డీఎంకే అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా మాట్లాడుతూ.. తమ పార్టీ ‘‘ ఏ మతం గురించి, ప్రత్యేకంగా హిందూ మతం గురించి మాట్లాడదు.. కుల దురాగతాలు, అంటరానితనం గురించి మాత్రమే మాట్లాడుతుంది’’ అని సూచించారు. చదవండి: Tirupati Laddu Case Hearing: చంద్రబాబుకు సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ -
‘మీరే హిందూ మతానికి అసలైన శత్రువులు’.. పవన్‌కు డీఎంకే కౌంటర్
చెన్నై: తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో సనాతన ధర్మంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు అధికార పార్టీ డీఎంకే కౌంటర్ ఇచ్చింది. తిరుమల లడ్డూ కల్తీ జరిగిందంటూ కూటమి ప్రభుత్వం చేసిన రాజకీయంపై సుప్రీం కోర్టు మొట్టి కాయలు వేసిన విషయాన్ని గుర్తు చేసింది పవన్ వారాహి డిక్లరేషన్ సభలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా మాట్లాడారు. ‘సనాతన ధర్మం వైరస్ లాంటిదని, ఆ మహమ్మారిని నిర్మూలించాలని ఈ మధ్య ఓ యువ నాయకుడు మాట్లాడుతున్నాడు. సనాతన ధర్మాన్ని ఎవరూ ఏమీ చేయలేరు. ఎవరైనా సరే దాన్ని నిర్మూలించాలనుకుంటే, వారే తుడిచి పెట్టుకుని పోతారు. తిరుపతి బాలాజీ సాక్షిగా ఈ మాట చెబుతున్నా’ అంటూ హెచ్చరించారు.అయితే పవన్ వ్యాఖ్యలపై డీఎంకే గట్టి కౌంటర్ ఇచ్చింది. డీఎంకే అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా మాట్లాడుతూ.. తమ పార్టీ ‘ఏ మతం గురించి, ప్రత్యేకంగా హిందూ మతం గురించి మాట్లాడదు.. కుల దురాగతాలు, అంటరానితనం గురించి మాత్రమే మాట్లాడుతుంది’ అని సూచించారు. తిరుమల లడ్డూ వివాదంపై సెప్టెంబర్ 30న తొలిసారి సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా.. శ్రీవారి ప్రసాదంపై కూటమి ప్రభుత్వం చేసిన వ్యాఖ్యల్ని ఖండించింది. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యానించడం తగదంటూ మొట్టికాయలు వేసింది. తాజాగా ఆ వ్యాఖ్యల్ని ప్రస్తావించిన హఫీజుల్లా..‘ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీలే హిందూ మతం, మానవత్వానికి నిజమైన శత్రువులు ’ ద్వజమెత్తారు. డీఎంకే ఏ మతం గురించి మాట్లాడదు. మతాన్ని, హిందూ దేవుళ్లను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేది బీజేపీ, టీడీపీ, పవన్ కళ్యాణ్. వారే అసలైన శత్రువులు. డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో మీకు మీరే సాటి అని సెటైర్లు వేశారు. ‘ఇంకా.. కులం, అంటరానితనంపై అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, పెరియార్ ఇతర ద్రావిడ ఉద్యమ వ్యవస్థాపకుల తరహా వైఖరినే డీఎంకే అవలంభిస్తుంది. వాటికి అనుగుణంగా కులం, అంటరానితనం గురించి పోరాడుతుంది. వ్యతిరేకిస్తుందని సూచించారు.👉చదవండి: సుప్రీంలో చంద్రబాబుకు ఎదురు దెబ్బ -
తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ ప్రమాణ స్వీకారం
చెన్నై : తమిళనాడు కేబినెట్ విస్తరణ జరిగింది. మంత్రి వర్గంలోకి కొత్తగా ముగ్గురిని తీసుకున్నారు సీఎం స్టాలిన్. డిప్యూటీ సీఎంగా ఉదయనిది స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడు రాజ్ భవన్లో గవర్నర్ కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. పలువురి మంత్రుల శాఖల్ని మార్చారు సీఎం స్టాలిన్. ఈడీ దర్యాప్తు చేసిన అవినీతి కేసులో అరెస్టయి బెయిల్‌పై ఉన్న సెంథిల్ బాలాజీకి మళ్లీ మంత్రిపదవి దక్కింది. 👉 చదవండి : చంద్రబాబు పొలిటికల్ జాదు -
తమిళనాడులో రాముడంటే తెలియదు: గవర్నర్ రవి
చెన్నై: రాముడు ఉత్తరభారతానికే దేవుడు అన్న భావనను తమిళనాడు ప్రజల్లో కల్పించారని రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్ రవి అన్నారు. దీంతో తమిళనాడు ప్రజలకు రాముడి గురించి పెద్దగా తెలియదన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు యువతకు భారత సంస్కృతి తెలియకుండా చేశారని ఆరోపించారు. ‘నిజానికి రాముడు తమిళనాడులో తిరగని చోటు లేదు. కానీ ఇక్కడి వారికి రాముడంటే తెలియదు. రాముడు ఉత్తర భారతానికి చెందిన దేవుడన్న భావనను ప్రజల మనసుల్లోకి జొప్పించారు. రాష్ట్ర యువతకు భారత సంస్కృతి తెలియకుండా ఉండేందుకు సాంస్కృతిక హననం చేశారు’అని రవి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మంపై సీఎం స్టాలిన్ తనయుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలపైనా రవి ఈ సందర్భంగా స్పందించారు.‘కొందరు గతంలో సనాతన ధర్మాన్ని డెంగ్యూ,మలేరియా వైరస్‌లతో పోల్చారు. వారికేమైందో తెలియదు కానీ ఆ అంశంపై ఇప్పుడేం మాట్లాడడం లేదు. ఒక్కసారిగా మూగబోయారు’అని ఉదయనిధిని రవి పరోక్షంగా ఎద్దేవా చేశారు. కాగా, తమిళనాడులో డీంఎకే ప్రభుత్వానికి, గవర్నర్ రవికి మధ్య తీవ్రస్థాయిలో విభేదాలున్నాయి. ప్రభుత్వంపై గవర్నర్ బహిరంగంగానే విమర్శలు చేస్తుంటారు. తాజాగా తమిళనాడులో ప్రభుత్వ స్కూళ్లలో విద్యా నాణ్యత అసలే లేదని, విద్యార్థులు కనీసం రెండంకెల సంఖ్యను కూడా గుర్తించలేని స్థితిలో ఉన్నారని గవర్నర్ విమర్శించారు. అయితే కేంద్రంలోని బీజేపీ గవర్నర్ ద్వారా తమ ప్రభుత్వాన్ని నియంత్రించాలని చూస్తోందని డీఎంకే ఆరోపిస్తోంది. ఇదీ చదవండి.. జ్ఞానవాపి విశ్వనాథ గుడిని మసీదు అనడం దురదృష్టకరం: యోగి ఆదిత్యనాథ్ -
బీజేపీ మిత్రపక్ష పార్టీని ఓడించండి: మంత్రి ఉదయ్‌నిధి స్టాలిన్
చెన్నై: తమిళనాడులోని విక్రవాండీ అసెంబ్లీ ఉపఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షమైన పట్టాలి మక్కల్ కట్చి(పీఎంకే) పార్టీని ఓడించాలని డీఎంకే నేత, మంత్రి ఉదయ్‌నిధి స్టాలిన్ అన్నారు. ఆయన సోమవారం ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. నీట్-యూజీ -2024 పరీక్ష పేపర్ లీకేజీ, అక్రమాల విషయంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. అందుకే ఈ ఉపఎన్నికల్లో బీజేపీ మిత్రమైన పక్షమైన పీఎంకే పార్టీని ఓడించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.‘మీరు (ప్రజలు) అంతా ఇప్పటికే అధికార డీఎంకే పార్టీకి ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై డీఎంకే బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పింది. దీంతో ఉత్తరాది నేతలు కూడా బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు చేయటం మొదలుపెట్టారు. ఈ సమయంలో బీజేపీ మిత్రపక్షమైన పీఎంకే ఉపఎన్నిక బరిలో నిలిచింది. అందుకే పీఎంకే పార్టీని ఓడించాలని కోరుతున్నా’అని ఉదయ్ నిధి అన్నారు. పరీక్ష పేపర్ లీకైన నేపథ్యంలో జూన్ 28న తమిళనాడు అసెంబ్లీలో నీట్ పరీక్షను రద్దు చేయాలని డీఎంకే ప్రభుత్వం తీర్మానం చేసింది.ఇక.. విక్రవాండీ అసెంబ్లీ డీఎంకే ఎమ్మెల్యే ఎన్. పుగజేంటి అనారోగ్యం కారణాలతో ఏప్రిల్ 6న మృతిచెందగా ఇక్కడ ఉప ఎన్నిక జరగనుంది. ఇక.. ఇక్కడ పోటీ డీఎంకే పార్టీ, పీఎంకే పార్టీకి మధ్య నెలకొంది. డీఎంకే నుంచి అన్నియూర్ శివ, పీఎంకే నుంచి పార్టీ ఉపాధ్యక్షుడు సి అన్బుమణి అభ్యర్థులుగా బరిలో దిగారు. రెండు పార్టీలు వన్నియార్ కమ్యూనిటీకి చెందిన అభ్యర్థులను నిలబెట్టాయి. ఇక్కడ దళిత ఓటర్లు మెజార్టీగా ఉన్నారు. -
మీరు ఎవరు అలా చెప్పడానికి? బడా నిర్మాణ సంస్థపై హీరో విశాల్ ఫైర్
తమిళ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.చాలా ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఇతడు నడిగర్ సంఘానికి అధ్యక్షుడిగానూ వ్యవహరిస్తున్నాడు. 'రత్నం' మూవీతో త్వరలో థియేటర్లలోకి రాబోతున్నాడు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ జరుగుతున్నాయి. తాజాగా అలా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ పిక్చర్స్ తీరుపై మండిపడ్డాడు. (ఇదీ చదవండి: మలయాళ హిట్ మూవీ తెలుగులో రీమేక్.. హీరోగా స్టార్ డైరెక్టర్!) 'సినిమాలు ఏ తేదీన విడుదల కావాలి? ఎప్పుడు విడుదల కావాలి? ఎన్ని థియేటర్లు ఇవ్వాలో రెడ్ జెయింట్ డిసైడ్ చేస్తోంది. మేం ఎక్కడెక్కడి నుంచో వడ్డీలకు డబ్బులు తీసుకొచ్చి, కష్టపడి రక్తం చిందించి సినిమాలు తీస్తుంటే.. ఎవరో ఒకరు ఏసీ రూంలో కూర్చుని థియేటర్ల ఓనర్లకు ఫోన్ చేసి.. ఆ సినిమా వేయకండి ఈ మూవీ వేసుకోండి. దాన్ని తీసేయండని చెబుతున్నారు. అసలు మీరు ఎవరు అలా చెప్పడానికి? మీకు అంతటి అధికారం, హక్కులు ఎవరిచ్చారు' అని విశాల్ మండిపడ్డాడు. విశాల్ గత చిత్రాలు 'ఎనిమీ', 'మార్క్ ఆంటోని' సినిమాలని వేరే సంస్థ తమిళనాట డిస్ట్రిబ్యూషన్ చేశాయి. దీంతో వీటికి థియేటర్ల కొరత ఏర్పడేలా రెడ్ జెయింట్ పిక్చర్స్ వ్యవహరించింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్.. దీనికి యజమాని. దీంతో చాలామంది నిర్మాతలు ఎందుకులే అని ఊరుకోగా, విశాల్ మాత్రం బహిరంగంగానే విమర్శలు చేశాడు. తన 'రత్నం' చిత్రానికి కూడా వీళ్లు ఇబ్బందులు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: 'యానిమల్' ఓ చెత్త సినిమా.. చూస్తుంటే చిరాకేసింది: 12th ఫెయిల్ నటుడు) Vishal's bold statement against Red Giant😳🔥 He says "Red Giant movies involved in Monopoly activities during release of Enemy & Mark Antony. He also mentions that they may raise an issue during #Rathnam release also"pic.twitter.com/8LuKcqjLWT — AmuthaBharathi (@CinemaWithAB) April 15, 2024 -
‘మీరు వారితో పోల్చుకోవద్దు’.. ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీం చురక
న్యూఢిల్లీ: సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారంలో డీఎంకే ముఖ్య నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టు చురకంటించింది. సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలపై వివిధ రాష్ట్రాల్లో ఫైల్ అయిన కేసులన్నింటిని జత చేసి తమిళనాడులో విచారించేలా ఆదేశాలు జారీ చేయాలని ఉదయనిధి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. ‘వివాదాస్పద వ్యాఖ్యలు చేసే జర్నలిస్టులతో మీరు పోల్చుకోవద్దు. వాళ్లు రేటింగ్‌ల కోసం వారి బాస్‌ల ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తారు. మీరు మాత్రం ఎవరి జోక్యం లేకుండా సొంతగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు’ అని ఉదయనిధికి కోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఉదయనిధి న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి జోక్యం చేసుకుని ఇలాంటి వ్యాఖ్యలే నుపుర్ షర్మ అనే రాజకీయ నాయకురాలు చేస్తే ఆమె ఎఫ్‌ఐఆర్‌లన్నింటిని సొంత రాష్ట్రానికి బదిలీ చేశారని గుర్తు చేశారు. దీనికి స్పందించిన అత్యున్నత న్యాయస్థానం అయితే మీరు సీఆర్పీసీ సెక్షన్ 406 కింద పిటిషన్ వేయకుండా ఆర్టికల్ 36 ప్రకారం రిలీఫ్ ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించింది. ఈ కేసు విచారణను మే 6వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం అనేది మలేరియా, డెంగ్యూ లాంటి రోగం అని గత ఏడాది చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ఈ వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్, జమ్మూకాశ్మీర్, మహారాష్ట్ర, కర్ణాటక, బిహార్ తదితర రాష్ట్రాల్లో స్టాలిన్‌పై కేసులు నమోదయ్యాయి. ఇదీ చదవండి.. భోజ్‌శాల సర్వేపై సుప్రీం కీలక తీర్పు -
తమిళనాడులో ప్రచార వేడి.. ప్రధానిపై ఉదయనిధి సెటైర్లు
చెన్నై: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీపై మంత్రి, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామనాథపురం, తేనిలలో జరిగిన ప్రచార సభల్లో మాట్లాడుతూ మోదీ 28 పైసల ప్రధాని అని సెటైర్లు వేశారు. కేంద్ర పన్నుల వాటాలో తమిళనాడు నుంచి వెళ్లే ప్రతి రూపాయిలో తిరిగి 28 పైసలు మాత్రమే కేంద్రం ఇస్తోందని, ఇందుకే ప్రధాని 28 పైసల పీఎం అని విమర్శించారు. ఎన్నికలున్నప్పుడే తమిళనాడుకు ప్రధాని వస్తారని మండిపడ్డారు. మధురైలో ఎయిమ్స్ నిర్మాణం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు తయారైందన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(ఎన్ఈపీ) తీసుకువచ్చి తమిళనాడు విద్యార్థుల భవిష్యత్తును కేంద్రం నాశనం చేస్తోందన్నారు. నీట్‌పై నిషేధంతో పాటు ప్రతి అంశంలోనూ తమిళనాడుపై ప్రధాని వివక్ష చూపుతున్నారని ఉదయనిధి మండిపడ్డారు. కాగా, తమిళనాడులోని 39 ఎంపీ సీట్లకు గాను ఏప్రిల్ 19న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఇదీ చదవండి.. కేజ్రీకి దక్కని ఊరట -
టాలీవుడ్ హీరోయిన్‌కు సీఎం కుమారుడు ఖరీదైన గిఫ్ట్.. వైరలవుతోన్న ట్వీట్!
హీరోయిన్ నివేదా పేతురాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళం తన అందం, అభినయంతో ప్రేక్షకులనున ఆకట్టుకుంటుంది. ‘మెంటల్ మదిలో’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె చిత్రలహరి, అలా వైకుంటపురంలో సినిమాల్లో సెకండ్ హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు పొందింది. చేసింది కొన్ని సినిమాలే అయినా సౌత్‌లో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. గతేడాది యంగ్ విశ్వక్ సేన్ సరసన దాస్ కా ధమ్కీ చిత్రంలో హీరోయిన్గా అలరించిన భామ.. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ నటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతంలో నటన, మోడలింగ్‌లో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. కొన్నాళ్ల ముందు కారు రేసింగ్ నేర్చుకుంది. అప్పట్లో రేసు ట్రాక్ మీద కారులో ఉన్న ఫొటోలు వైరలయ్యాయి. అంతేకాదు ఇటీవలే మధురైలో జరిగిన బ్యాడ్మింటర్ ఛాంపియన్షిప్ పోటీలోని మిక్స్డ్ డబుల్స్ కేటగిరీలో కప్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ ముద్దుగుమ్మ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనపై వస్తున్న వార్తలన్ని అవాస్తమని కొట్టిపారేసింది. మీరు ఏదైనా రాసేముందు దయచేసి నిజాలు ఏంటో తెలుసుకోవాలని సూచించింది. ఇలాంటి వాటితో తమ కుటుంబం ఒత్తిడిలో ఉందని.. అనవసరంగా ఒక అమ్మాయి జీవితంపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని కోరింది. ఈ మేరకు తన ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేసింది. నివేదా పేతురాజ్ తన ట్వీట్లో రాస్తూ..'నా కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని ఇటీవల తప్పుడు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయినప్పటికీ నేను మౌనంగా ఉన్నా. ఎందుకంటే దీని గురించి మాట్లాడే బుద్దిలేని కొందరు వ్యక్తులు ఒక అమ్మాయి జీవితాన్ని పాడు చేసే ముందు వారు అందుకున్న సమాచారాన్ని ధృవీకరించడానికి కొంతైనా మానవత్వంతో ఉంటారని భావించా. వాటి వల్ల కొన్ని రోజులుగా నేను, మా కుటుంబం తీవ్ర ఒత్తిడిలో ఉన్నాం. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి.' అంటూ విజ్ఞప్తి చేసింది. ఆ తర్వాత రాస్తూ.. 'నేను చాలా గౌరవప్రదమైన కుటుంబం నుండి వచ్చా. 16 ఏళ్ల వయసు నుంచే ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్నా. నా కుటుంబం ఇప్పటికీ దుబాయ్‌లోనే నివసిస్తోంది. మేము దాదాపు 20 ఏళ్లకు పైగా దుబాయ్‌లో ఉన్నాం. సినీ పరిశ్రమలో కూడా నాకు అవకాశాలు ఇప్పించమని నేను ఏ నిర్మాతను, దర్శకుడిని, హీరోను అడగలేదు. ఇప్పటికీ 20కి పైగా సినిమాలు చేశా. నేను ఎప్పుడూ డబ్బు కోసం అత్యాశ పడలేదని' రాసుకొచ్చింది. నా గురించి ఇప్పటివరకు మాట్లాడిన సమాచారం ఏదీ నిజం కాదు. మేము 2002 నుంచి దుబాయ్‌లో అద్దె ఇంట్లో నివసిస్తున్నాం. అలాగే 2013 నుంచి రేసింగ్ అంటే నా అభిరుచి. నిజానికి చెన్నైలో రేసులను నిర్వహించడం గురించి నాకు తెలియదు. నేను చాలా సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నా. జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొన్న తర్వాత మానసికంగా పరిణీతి సాధించా. అంతేకాదు.. మీ కుటుంబంలోని ఇతర స్త్రీలు కోరుకున్నట్లే గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నా. జర్నలిజంలో కొంత మానవత్వం మిగిలి ఉందని.. ఇకపై నా పరువు తీసేలా వ్యవహరించని ఇప్పటికీ విశ్వసిస్తున్నందున చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం లేదు. ఒక కుటుంబం ప్రతిష్టను కించపరిచేలా మాట్లాడేముందు.. మీరు అందుకున్న సమాచారాన్ని ధృవీకరించుకోవాలని కోరుతున్నా. అలాగే మా కుటుంబాన్ని ఇకపై ఎలాంటి బాధలకు గురిచేయవద్దని మీడియా మిత్రులకు అభ్యర్థిస్తున్నా. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.' అంటూ రాసుకొచ్చింది. అసలేం జరిగిందంటే.. కాగా.. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ నివేదా పేతురాజ్‌కు 50 కోట్ల రూపాయల విలువైన ఇంటిని బహుమతిగా ఇచ్చారని సోషల్ మీడియాలో విపరీతమైన రూమర్స్ వచ్చాయి. ఆమె కోసం ఉదయనిధి స్టాలిన్ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నాడంటూ ఆరోపించారు. ఇదే విషయమై తమిళ సినీ ఇండస్ట్రీకి ఓ యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన సంబంధిత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయం తెలుసుకున్న నివేదా పేతురాజ్ ఘాటుగా స్పందించింది. అవన్నీ అవాస్తవాలేనంటూ ట్విటర్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. Lately there has been false news circulating about money being lavishly spent on me. I kept quiet because I thought people who are speaking about this will have some humanity to verify the information they receive before mindlessly spoiling a girl’s life. My family and I have… — Nivetha Pethuraj (@Nivetha_Tweets) March 5, 2024 -
ఉదయనిధికి బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్
ఢిల్లీ క్రికెట్ స్టేడియంలో జై శ్రీరాం నినాదాలు చేయడాన్ని డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ తప్పుబట్టడంపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ఉదయనిధిని విషాన్నిచిమ్మే దోమగా బీజేపీ జాతీయ ప్రతినిధి గౌరవ్ భాటియా పేర్కొన్నారు. గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా పాక్ క్రికెటర్ రిజ్వాన్ ముందు అభిమానులు జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. ఈ చర్యను సహించరానిదిగా పేర్కొన్నారు ఉదయనిధి. క్రీడా వేదికగా ద్వేషాన్ని చిమ్ముతున్నారని మండిపడ్డారు. ఆటలు దేశాల మధ్య సోదరభావాన్ని పెంచాలని కోరారు. India is renowned for its sportsmanship and hospitality. However, the treatment meted out to Pakistan players at Narendra Modi Stadium in Ahmedabad is unacceptable and a new low. Sports should be a unifying force between countries, fostering true brotherhood. Using it as a tool… pic.twitter.com/MJnPJsERyK — Udhay (@Udhaystalin) October 14, 2023 ఉదయనిధి వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ఉదయనిధి వ్యాఖ్యలు విద్వేషంతో కూడుకున్నవని మండిపడ్డారు. మైదానంలో నమాజ్ చేయడానికి ఆటను కాసేపు ఆపినప్పుడు మీకు ఎలాంటి అభ్యంతరం లేదా..? అంటూ ఉదయనిధిని ఉద్దేశించి బీజేపీ జాతీయ ప్రతినిధి గౌరవ్ భాటియా దుయ్యబట్టారు. రాముడు విశ్వంలో ప్రతి అణువునా ఉంటాడని పేర్కొన్న గౌరవ్ భాటియా.. జై శ్రీ రాం అనాలని ఉదయనిధికి హితువు పలికారు. नफ़रती डेंगू मलेरिया मच्छर फिर निकला है विष घोलने जब मैच रुकवा कर फील्ड पर नमाज़ पड़ी जाती है तो तुम्हें साँप सूँघ जाता है सृष्टि के हर कन कन मे हमारे प्रभु श्री राम बसते है, तो बोलो जय श्री राम 🙏#IndiavsPak pic.twitter.com/Tm7Ikxbtqw — Gaurav Bhatia गौरव भाटिया 🇮🇳 (@gauravbhatiabjp) October 15, 2023 పాక్ క్రికెటర్ల సమక్షంలో జై శ్రీరాం నినాదాలకు సంబంధించిన వీడియోలపై సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వచ్చాయి. అభిమానుల చర్య క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధమని, క్రికెటర్‌పై వేధింపులుగా కొందరు భావించారు. అదే క్రమంలో యుద్ధంలో గాజాకు సంఘీభావం తెలుపుతూ మైదానంలో రిజ్వాన్ నమాజ్ చేశాడని మరికొందరు స్పందించారు. మైదానంలోకి మతాన్ని తీసుకురావడంపై నెటిజన్లు మండిపడ్డారు. ఇదీ చదవండి పాక్ క్రికెటర్ల ఎదుట ఆ నినాదాలు సరైనవి కావు: ఉదయనిధి -
Udayanidhi Stalin: సనాతన ధర్మంపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
చెన్నై: తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోసారి సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించలేదని విమర్శించారు. రాష్ట్రపతి గిరిజన మహిళ, వితంతువు కావడం వల్లే ఆహ్వనించలేదని ధ్వజమెత్తారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వేళ బాలీవుడ్ హీరోయిన్స్‌ను పార్లమెంట్‌కు ఆహ్వానించారన్న ఉధనియనిధి స్టాలిన్.. సనాతన ధర్మం అంటే ఇదేనా అని బీజేపీని ప్రశ్నించారు. కాగా ఇటీవల సైతం సనాతన ధర్మంపై మంత్రి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చుతూ.. దానిని నిర్మూలించాల్సిన అవసరం ఉందని అన్నారు తమిళనాడు మంత్రి. ఈ మాటలపై బీజేపీ సహా హిందూ సంఘాలన్నీ ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రధాని మోదీ సైతం సనాతన వ్యాఖ్యలపై స్పందిస్తూ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. భారతదేశ సంస్కృతిపై దాడి చేసి, సనాతన ధర్శాన్ని నిర్మూలించడమే ఇండియా కూటమి లక్ష్యమని అన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల సామాజిక వివక్షపై తమిళనాడు గవర్నర్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఉదయనిధి స్టాలిన్.. దాన్ని నిర్మూలించాలంటే సనాతన ధర్మాన్ని నాశనం చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. సనాతన ధర్మం వల్లే అంటరానితనం వచ్చిందని.. ఈ రెండు కవల పిల్లలు అని అన్నారు. సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని.. అప్పుడే సమాజంలో అంటరానితనం, అస్పృశ్యత, సామాజిక వివక్ష పోతుందని తెలిపారు. VIDEO | "Yesterday, some Hindi actors came and visited the new Parliament but our President was not invited. Why? Because Droupadi Murmu is from a tribal community. This is what we call 'Sanatan Dharma'," Tamil Nadu minister @Udhaystalin said at a meeting of DMK Youth Wing in… pic.twitter.com/K4JtYWNyz1— Press Trust of India (@PTI_News) September 20, 2023 -
సనాతన ధర్మాన్ని అంతం చేయాలనుకుంటున్నారు: మోదీ ఫైర్
PM Modi Comments On Sanatan Dharma Row: సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా చల్లారడం లేదు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియాతో పోల్చుతూ, దాన్ని నిర్మూలించాలంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలను కొంతమంది సమర్థిస్తుండగా.. మరికొందరు మాత్రం ఖండిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ, హిందూ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ దీనిపై ఘాటుగా స్పందించారు దేశాన్ని బానిసత్వంలోకి నెట్టేందుకు కుట్ర ఈ మేరకు మధ్యప్రదేశ్‌లోని బినాలో గురువారం ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడుతూ.. తొలిసారి సనాతన ధర్మం వివాదంపై బహిరంగంగా వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష ఇండియా కూటమి సనాతన ధర్మాన్ని అంతం చేయాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. దేశాన్ని వెయ్యేళ్లు వెనక్కి తీసుకెళ్లి, బానిసత్వంలోకి నెట్టేందుకు యత్నిస్తోందని మండిపడ్డారు. భారతీయుల నమ్మకాలు, విలువలపై దాడి ‘ఇటీవల ఇండియా కూటమి ముంబైలో భేటీ అయ్యింది. ఘమండియా (దురహంకారి) కూటమిని నడిపేందు కోసం వ్యూహాలను వారు సిద్ధం చేసుకొని ఉంటారని నేను అనుకుంటున్నా. భారత సంస్కృతిపై దాడి చేయడమే వారి వ్యూహం. వేల ఏళ్లుగా దేశాన్ని ఏకం చేసిన భారతీయుల నమ్మకాలు, విలువలు, సంప్రదాయాలపై దాడి చేయాలని నిర్ణయించుకున్నారు’ అని ధ్వజమెత్తారు. చదవండి: Special Parliament Session: ఎంపీలకు బీజేపీ విప్ జారీ #WATCH | Bina, Madhya Pradesh: Prime Minister Narendra Modi says "The people of this INDIA alliance want to erase that 'Sanatana Dharma' which gave inspiration to Swami Vivekananda and Lokmanya Tilak...This INDIA alliance wants to destroy 'Sanatana Dharma'. Today they have openly… pic.twitter.com/wc0C2hBxtS — ANI (@ANI) September 14, 2023 ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, వాల్మికీ, మహత్మాగాంధీ.. దేవి అహల్యాబాయి హోల్కర్కు స్ఫూర్తినిచ్చిన సనాతన సంస్కృతి, సంప్రదాయాలను అంతం చేయాలని 'ఘమండియ' కూటమి కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. ఝాన్సీ రాణి లక్ష్మీబాయికి సనాతన ధర్మమే ఓ బలంగా నిలిచిందని. తన ఘాన్సీ ప్రాంతాన్ని వదులుకోనని బ్రిటిష్ వారికి సవాల్ విసిరిందని చెప్పారు. మహర్షి వాల్మీకి కూడా సనాతన ధర్మాన్ని ఆచరించారన్నారు. మహాత్మాగాంధీ సనాతన ధర్మాన్ని జీవితాంతం పాటించారన్న ప్రధాని మోదీ.. ఆయనకు రాముడు ప్రేరణగా నిలిచారని చనిపోయే ముందు కూడా ‘హేరామ్’ అని సంభోదించారని చెప్పారు. దేశాన్ని ముక్కలు చేసేందుకు యత్నం ఇక స్వామి వివేకానంద, లోకమాణ్య తిలక్ లాంటి వారికి సనాతన ధర్మమే ప్రేరణగా నిలిచిందని మోదీ తెలిపారు. సనాతన శక్తితోనే స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో బ్రిటిష్ వాళ్ల చేతిలో ఉరికంబం ఎక్కిన వీరులు కూడా భారతమాత ఒడిలోనే మళ్లీ జన్మించాలని కోరుకున్నట్లు చెప్పారు. ఆ ధర్మమే వేల సంవత్సరాల నుంచి భారత్‌ను ఒక్కటిగా నిలిపిందన్నారు. అలాంటి ధర్మాన్ని ఇండియా కూటమి నాశనం చేయాలని భావిస్తోందని ఆరోపించారు. ఇండియా కూటమి పార్టీలు అంతా ఒక్కటే.. ఈ దేశాన్ని ముక్కలు ముక్కలుగా చేయాలని చూస్తున్నట్లు ఆయన ఆరోపించారు. దేశాన్ని ప్రేమించే వాళ్లు అప్రమత్తంగా ఉండాలి బహిరంగంగా ఇండియా కూటమి నేతలు సనాతన ధర్మాన్ని టార్గెట్ చేస్తున్నారని, రాబోయే రోజుల్లో వాళ్లు మనపై దాడుల్ని ఉధృతం చేస్తారని మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సనాతన ఆచారాన్ని పాటించేవాళ్లు, ఈ దేశాన్ని ప్రేమించేవాళ్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టించి. దేశాన్ని 1,000 సంవత్సరాల వెనక్కు బానిసత్వంలోకి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. కలిసి కట్టుగా ఆ పోరాటాన్ని ఆపాలని.. వారి వ్యూహాలను విజయవంతం అవ్వకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కాగా ప్రధాని కంటే ముందు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సనాతన ధర్మంపై స్పందిస్తూ.. దీనిపై చర్యలకు దూరంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలునిచ్చారు. ‘‘సనాతన ధర్మానికి మద్దతుగా స్పందించాలంటూ ప్రధాని మోదీ తన కేబినెట్ మంత్రులకు కొన్ని రోజుల క్రితం సూచించారు. దీనిపై రాజకీయ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పడానికి ఇది స్పష్టమైన ఉదాహరణ. బీజేపీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చేస్తున్న ట్రాప్‌లో మనం చిక్కుకోవద్దు’’ అని స్టాలిన్ వివరించారు. బీజేపీ అవినీతిని ప్రధానంగా ప్రస్తావించాలంటూ సూచించారు. కళంకిత, మతతత్వ, నిరంకుశ బీజేపీ ప్రభుత్వం నుంచి దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు కష్టపడి పనిచేయాలని కోరారు. -
ఉదయనిధి 'సనాతన ధర్మ' వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందన ఏంటంటే..?
ఢిల్లీ: తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఉదయనిధిని విమర్శించే క్రమంలో ఇండియా కూటమి స్వభావం ఎంటో స్పష్టమవుతోందని బీజేపీ మండిపడింది. ఈ నేపథ్యంలో ఉదయనిధి వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. అన్ని మతాలను గౌరవించడమే కాంగ్రెస్ స్వభావమని సీనియర్ నాయకుడు కేసీ వేణు గోపాల్ తెలిపారు. 'సర్వ ధర్మ సమభావన' అని పేర్కొంటూ ఇదే కాంగ్రెస్ ఐడియాలజీ అని పేర్కొన్నారు. #WATCH | On DMK leader Udhayanidhi Stalin's 'Sanatana dharma' remark, Congress General Secretary KC Venugopal says, "Our view is clear; 'Sarva Dharma Samabhava' is the Congress' ideology. Every political party has the freedom to tell their views....We are respecting everybody's… pic.twitter.com/86Mg265PQT — ANI (@ANI) September 4, 2023 ఉదయనిధి వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ప్రతి రాజకీయ పార్టీకి వాక్ స్వాతంత్య్రం ఉంటుందని చెప్పారు. ఏ మతాన్ని కాంగ్రెస్ విమర్శించబోదని స్పష్టం చేశారు. సమాన అవకాశాలు ఇవ్వని మతమేదైనా వ్యాధితో సమానమని కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే మాట్లాడిన వెంటనే కాంగ్రెస్ ఈ మేరకు స్పందించింది. ఇండియా కూటమిలో భాగమైన రాజ్యసభ ఎంపీ, శివసేన (యూబీటీ) నాయకురాలు ప్రియాంక చతుర్వేది సనాతన ధర్మానికి మద్దతుగా మాట్లాడారు. సనాతన ధర్మం శాశ్వతమైన సత్యాన్ని సూచిస్తుందని అన్నారు. ఆక్రమణదారుల దాడులను తట్టుకుని నిలబడగలిగిందని చెప్పారు. ఇది దేశానికి పునాది అని మాట్లాడారు. అలాంటి ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సబబు కాదని చెప్పారు. హక్కుల కోసం పోరాడిన అలాంటి సనాతనీయులపై మహారాష్ట్రలో లాఠీ ఛార్జీ చేసిన చరిత్ర బీజేపీదని మండిపడ్డారు. ఉదయనిధి ‘సనాతన ధర్మం’ వ్యాఖ్యల దుమారం.. స్టాలిన్ ఏమన్నారంటే.. ఉదయనిధి స్టాలిన్ ఏమన్నారంటే.. సనాతన నిర్మూలన పేరుతో నిర్వహించిన సమావేశంలో ఉదయనిధి స్టాలిన్ హాజరై ప్రసంగించారు. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని, దీనిని కేవలం వ్యతిరేకించడమే కకుండా.. పూర్తిగా నిర్మూలించాలని వ్యాఖ్యానించారు. సమానత్వానికి, మహిళా సాధికారతకు సనాతన ధర్మం వ్యతిరేకతమని అన్నారు. Udhayanidhi Stalin, son of Tamilnadu CM MK Stalin, and a minister in the DMK Govt, has linked Sanatana Dharma to malaria and dengue… He is of the opinion that it must be eradicated and not merely opposed. In short, he is calling for genocide of 80% population of Bharat, who… pic.twitter.com/4G8TmdheFo — Amit Malviya (@amitmalviya) September 2, 2023 బీజేపీ మండిపాటు.. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ కూటమిలో తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ కూడా ఉంది. ముంబయి వేదికగా జరిగిన సమావేశంలో సీఎం స్టాలిన్ పాల్గొన్నారు. సీఎం స్టాలిన్ కుమారుడు తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఇండియా కూటమిపై బీజేపీ దాడి చేసింది. ముంబయి భేటీలో ఇదే నిర్ణయించారా? అని ప్రశ్నలు గుప్పించారు. ఇదీ చదవండి: సనాతన ధర్మంపై సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు.. -
ఉదయనిధి వ్యాఖ్యల దుమారం.. స్టాలిన్ ఏమన్నారంటే..
సాక్షి, చెన్నై: తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చిన మంత్రి.. దానిని సమూలంగా నిర్మూలించాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ, హిందూ సంఘాల ఆందోళన తమిళనాడులో హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. సోషల్ మీడియా వేదికల్లోనూ ఉదయనిధిపై విమర్శలు గుప్పిస్తున్నాయి. గతంలో ఉదయనిధి చర్చ్, స్వామిజీ వద్దకు వెళ్లిన ఫోటోలు షేర్ చేస్తూ.. దీనికి సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు తమిళనాడు గవర్నర్‌ను బీజేపీ నేతలు కలిశారు. ఉదయనిధిపై క్రిమినల్ కేసులు పెట్టాలని గవర్నర్‌కు వినతి చేశారు. స్టాలిన్ వీడియోతో బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. మంత్రికి మద్దతుగా ప్రకాశ్ రాజ్ ఇక ఉదయనిధికి మద్దతుగా నటుడు ప్రకాశ్ రాజ్ నిలిచారు. సనాతన పార్లమెంట్ భవిష్యత్తు ఇలా ఉంటుందా అంటూ మోదీ స్వామీజీల పోటో షేర్ చేశారు. తాజాగా కొడుకు వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. ఉదయనిధి సనాతన ధర్మం వ్యాఖ్యలను సీఎం సమర్థిస్తూ బీజేపీపై విరుచుకుపడ్డారు. తన కుమారుడు చెప్పిన దాంట్లో అక్షరం ముక్క తప్పులేదని అన్నారు. ఉద్యోగాలు, ద్రవ్యోల్బణంపై మోదీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. చదవండి: Karnataka: బీజేపీ నేతలకు డీకే గాలం! బీజేపీ హయాంలో దేశం నాశనం.. తన పాడ్‌కాస్ట్ ‘స్పీకింగ్ ఫర్ ఇండియా’లో స్టాలిన్ మాట్లాడుతూ.. బీజేపీ తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు మతాన్ని ఆయుధంగా వాడుతోందని మండిపడ్డారు. ప్రజల మతపరమైన భావాలను రెచ్చగొట్టి.. ఆ మంటల వెచ్చదనంలో బీజేపీ చలికాచుకోవాలని చూస్తోందని విమర్శించారు. భారత నిర్మాణాన్ని, దేశ ఐక్యతను నాశనం చేయాలని ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. ఇప్పుడు ఆపకపోతే ఎవరూ రక్షించలేరు 2002లో గుజరాత్ అల్లర్లు బీజేపీ హింస, ద్వేషానికి బీజాలు వేసిందన్నారు. ఇటీవల ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్, హర్యానాలో చెలరేగిన హింసాత్మక ఘర్షణలు వేలాది మంది అమయాక ప్రజల ప్రాణాలను, ఆస్తులను బలితీసుకుందని మండిపడ్డారు. ఇప్పటికైనా దీనిని అరికట్టకపోతే.. దేశాన్ని, భారతీయులను ఎవరూ రక్షించలేరని ఎంకే స్టాలిన్ హెచ్చరించారు. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన సీఎం పోడ్కాస్ట్ ఎపిసోడ్లో.. ఎన్నికలకు ముందు బీజేపీ ఇచ్చిన ఏ హామీని గత తొమ్మిదేళ్లలో నెరవేర్చలేదని స్టాలిన్ పేర్కొన్నారు. ప్రజలందరి ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.15 లక్షలు జమ కాలేదని, రైతుల ఆదాయాలు రెండింతలు కాలేదని, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు కానీ జరగలేదని ముఖ్యమంత్రి బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భారతదేశం మొత్తం మణిపూర్, హర్యానాగా మారకుండా నిరోధించడానికి ఇండియా కూటమి తప్పక గెలవాలన్నారు. చదవండి: జీ 20 సదస్సుకు జిన్‌పింగ్ గైర్హాజరు.. స్పందించిన బైడెన్ ఉదయనిధి స్టాలిన్ ఏమన్నారంటే.. ‘తమిళనాడు ప్రొగ్రెసివ్ రైటర్స్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ శనివారం ‘సనాతన నిర్మూలన’ పేరుతో నిర్వహించిన సమావేశంలో ఉదయనిధి స్టాలిన్ హాజరై ప్రసంగించారు. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని, దీనిని కేవలం వ్యతిరేకించడమే కకుండా.. పూర్తిగా తొలగించాలని వ్యాఖ్యానించారు. అది తిరోగమన సంస్కృతి అని.. ప్రజలను కులాలు పేరిట విభజించిందని పేర్కొన్నారు. సమానత్వానికి, మహిళా సాధికారతకు సనాతన ధర్మం వ్యతిరేకతమని అన్నారు. -
సనాతన ధర్మంపై ఉదయ నిధి తీవ్ర వ్యాఖ్యలు
సాక్షి, చైన్నె : సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియాలతో పోల్చుతూ రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి ఉదయ నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. బీజేపీతో పాటు హిందూ సంఘాలు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. వివరాలు.. తేనాంపేటలోని కామరాజర్ అరంగంలో సనాతన ధర్మానికి వ్యతిరేకంగా జరిగిన కార్యక్రమానికి మంత్రి ఉదయ నిధి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందులో ఆయన సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియాలతో పోల్చారు. వీటిని ఏవిధంగా కట్టడి చేశామో, అదే తరహాలో సనాతన ధర్మాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సనాతన ధర్మం వ్యతిరేకం అని ఈ కార్యక్రమానికి పేరు పెట్టకుండా, సనాతన ధర్మం కట్టడి లక్ష్యం అని సూచించి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. సనాతన ధర్మం అంటే ఏమిటీ? అంటూ ఆయన తీవ్రంగానే విరుచుకు పడ్డారు. సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా సనాతన ధర్మం తెర మీదకు తెచ్చి ఉన్నారని, ఇది స్థిరం కాదని, ఇలాంటి వాటి గురించి కమ్యూనిస్టులు, డీఎంకే వాదులు ప్రశ్నిస్తూనే ఉంటారని ధ్వజమెత్తారు. మరింతగా ఆయన వీరావేశంతో చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైతో పాటుగా హిందూ సంఘాలు తీవ్రంగా పరిగణించాయి. సనాతన ధర్మం గురించి ఉదయ నిధికి ఏం తెలుసు? అని ప్రశ్నిస్తూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ఉదయ నిధి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. అదే సమయంలో సనాతన ధర్మం గురించి ఉదయ నిధి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసు కమిషనరేట్‌లో కొందరు ఫిర్యాదు చేయడం గమనార్హం. అలాగే బీజేపీ తమిళనాడు కో– ఇన్చార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి ఓ ప్రకటనలో ఉదయనిధి వ్యాఖ్యలను ఖండించారు. -
చూస్తూ ఉండండి..సనాతన ధర్మమే గెలుస్తుంది : అమిత్ షా
జైపూర్: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. జైపూర్‌లో 'పరివర్తన యాత్ర' ప్రారంభోత్సవంలో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా తీవ్ర స్థాయిలో స్పందించారు. త్వరలో రాజస్థాన్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దుంగార్పూర్ వేదికగా 'పరివర్తన యాత్ర'ను ప్రారంభించిన కేంద్ర మంత్రి అమిత్ షా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టే అర్ధమవుతుంది ఇండియా కూటమి హిందూత్వాన్ని వ్యతిరేకమని.. ఇది ఒకరకంగా హిందూత్వ వారసత్వంపై దాడి చేయడమేనని.. స్టాలిన్ తనయుడు చేసిన వ్యాఖ్యలు ఇండియా కూటమి ఓటు బ్యాంక్ రాజకీయాలకు, బుజ్జగింపు రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. డీఎంకే నాయకుడి కుమారుడు.. కాంగ్రెస్ నేత కుమారుడు మారణహోమానికి పిలుపునిస్తున్నారని అన్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా గతంలో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలను చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఆనాడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ రాడికల్ హిందూ సంస్థలు లష్కర్-ఏ-తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల కంటే ప్రమాదమని అన్నారు. మీ హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే కూడా ఇది హిందూ ఉగ్రవాదమని అన్నారు. కానీ ఈనాడు సనాతన ధర్మం ప్రజల మనుసును గెలుచుకుందని మళ్ళీ మోదీ అధికారంలోకి వస్తే సనాతన పరిపాలన వస్తుందని వారు ఆశాభావంతో ఉన్నారని అన్నారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఏళ్ళు అడ్డుకుందని.. మా హయాంలోనే రామ మందిరం నిర్మాణ పనులు మొదలయ్యాయని జనవరికల్లా మందిర నిర్మాణం పూర్తవుతుందని దాన్ని అడ్డుకోవడం కాంగ్రెస్ వల్ల కాదని అన్నారు. ఇక ఈరోజు ప్రారంభమైన 'పరివర్తన యాత్ర' 19 రోజుల పాటు 2500 కి.మీ కొనసాగుతుందని.. మొత్తం 52 నియోజకవర్గాల్లో 152 చిన్న సభలు.. 54 భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నామని.. అవినీతిలో పీకల్లోతు కూరుకుపోయిన అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని అన్నారు. అమిత్ షా వ్యాఖ్యల నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్ మాట్లాడుతూ ఉదయనిధి వ్యాఖ్యలను సమర్ధించడమే కాదు సనాతన ధర్మం మతం పేరిట ప్రాంతం పేరిట ప్రజలను వేరు చేసే సిద్ధాంతమని అన్నారు. ఉదయనిధి స్టాలిన్ కూడా అమిత్ షా వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ నేను చెప్పిందాంట్లో తప్పేమీ లేదని.. ఒక్క మాట కూడా వెనక్కి తీసుకోబోవడం లేదని స్పష్టం చేశారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించడమంటే మానవత్వాన్ని, సమానత్వాన్ని కాపాడటమేనని అన్నారు. సనాతన ధర్మం వలన అణగారిన వర్గాల తరపునే నేను ఆ మాటలన్నానని తెలిపారు. మాజీ మంత్రి పి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం కూడా ఉదయ నిధి స్టాలిన్ వ్యాఖ్యలను సమర్ధిస్తూ.. కులం దేశానికి శాపమని అన్నారు. చెన్నైలో రైటర్ల సదస్సులో మాట్లాడుతూ స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో పోల్చారు. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించలేమని నిర్మూలించడం ఒక్కటే మార్గమని అన్నారు. ఇది కూడా చదవండి: జమిలీ ఎన్నికలపై స్పందించిన రాహుల్.. ఏమన్నారంటే? -
సీఎం స్టాలిన్ కుమారుడు వివాదాస్పద వ్యాఖ్యలు..
చెన్నై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా, కరోనాలతో పోల్చారు. దానిని వ్యతిరేకించడమే కాదు.. సమూలంగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు. సనాతన నిర్మూలన సదస్సులో మాట్లాడుతూ.. సనాతన ధర్మం సామాజిక న్యాయం, సమానత్వానికి విరుద్ధమని అన్నారు. 'కొన్నింటిని వ్యతిరేకించలేం. నిర్మూలించాల్సిందే. డెంగ్యూ, మలేరియా, కరోనాలను వ్యతిరేకించలేం. సనాతన అనేది సంస్కృత పదం. సామాజిక, సమానత్వానికి విరుద్ధం. నిర్మూలించాల్సిందే.' అని యువజన, క్రీడా అభివృద్ధి మంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు. 'సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై బీజెపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ విరుచుకుపడ్డారు. సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్న 80 శాతం జనాభా మారణహోమానికి ఉదయనిధి స్టాలిన్ పిలుపునిచ్చారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌కు చాలాకాలంగా మిత్ర పక్షంగా ఉంటోంది డీఎంకే. ముంబయి మీటింగ్‌లో ఇండియా కూటమి ఇదే నిర్ణయించిందా..? ' అని ప్రశ్నించారు. Udhayanidhi Stalin’s hate speech with Hindi subtitles. Rahul Gandhi speaks of ‘मोहब्बत की दुकान’ but Congress ally DMK’s scion talks about eradicating Sanatana Dharma. Congress’s silence is support for this genocidal call… I.N.D.I Alliance, true to its name, if given an… https://t.co/hfTVBBxHQ5 pic.twitter.com/ymMY04f983 — Amit Malviya (@amitmalviya) September 2, 2023 ఉదయనిధి స్టాలిన్ తన మాటలను సమర్ధించుకున్నారు. మారణహోమానికి పిలుపునివ్వలేదని అన్నారు. బలహాన వర్గాల పక్షాన తాను మాట్లాడినట్లు చెప్పారు. సనాతన ధర్మం కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజల పక్షాన మాట్లాడినట్లు పేర్కొన్నారు. I never called for the genocide of people who are following Sanatan Dharma. Sanatan Dharma is a principle that divides people in the name of caste and religion. Uprooting Sanatan Dharma is upholding humanity and human equality. I stand firmly by every word I have spoken. I spoke… https://t.co/Q31uVNdZVb — Udhay (@Udhaystalin) September 2, 2023 'ఎలాంటి న్యాయపరమైన సవాలునైనా ఎదుర్కొనేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. కాషాయ బెదిరింపులకు మేము భయపడము. పెరియార్, అన్నా, కలైంజ్ఞర్ అనుచరులమైన మేము సామాజిక న్యాయాన్ని నిలబెట్టడానికి, సమానత్వ సమాజాన్ని స్థాపించడానికి ఎప్పటికీ పోరాడుతాము.' అని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. Bring it on. I am ready to face any legal challenge. We will not be cowed down by such usual saffron threats. We, the followers of Periyar, Anna, and Kalaignar, would fight forever to uphold social justice and establish an egalitarian society under the able guidance of our… https://t.co/nSkevWgCdW — Udhay (@Udhaystalin) September 2, 2023 ఇదీ చదవండి: ఈడీ కస్టడీకి జెట్ ఎయిర్వేస్ ఫౌండర్ నరేష్ గోయల్ -
సీఎం కొడుకు సినిమా హిట్ అయ్యిందా?
ఆయన స్వయానా ముఖ్యమంత్రి కొడుకు. తమిళనాడు ప్రభుత్వంలో ప్రస్తుతం క్రీడాశాఖ మంత్రి. మరోవైపు హీరోగా తన కెరీర్ లోనే చివరి సినిమా చేశారు. ఆయనే ఉదయనిధి స్టాలిన్. చిత్రం పేరు 'మామన్నన్'. ఇందులో ఏముంది అంత గొప్ప అనుకోవచ్చు. తెలుగు ప్రేక్షకులకు ఈ హీరో కాస్తోకూస్తో తెలిసి ఉండొచ్చేమో. కానీ ఈ చిత్రంలో కీర్తి సురేష్, ఫహాద్ ఫాజిల్, వడివేలు లాంటి అద్భుతమైన యాక్టర్స్ నటించారు. 'కర్ణన్'తో హిట్ కొట్టిన మరి సెల్వరాజు దర్శకుడు కావడంతో విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇంతకీ 'మామన్నన్' ఎలా ఉంది? 'మామన్నన్' కథేంటి? కాశీపురం అనే ఊరు. దానికి మామన్నన్(వడివేలు) ఎమ్మెల్యే. వెనకబడిన వర్గానికి చెందినవాడు. కొడుకు అదివీరన్(ఉదయనిధి స్టాలిన్). అభ్యుదయ భావాలున్న కుర్రాడు. మరోవైపు పేద విద్యార్థుల కోసం లీల(కీర్తి సురేష్) కోచింగ్ సెంటర్ నడుపుతుంటుంది. రూలింగ్ పార్టీ నాయకుడైన రత్నవేల్(ఫహాద్ ఫాజిల్) అన్నయ్య వల్ల ఈమెకు ప్రాబ్లమ్స్ వస్తాయి. దీంతో మామన్నన్, అదివీరన్ కలిసి రత్నవేల్ కు ఎదురెళ్తారు. అతడి పతనం కోసం పనిచేయడం మొదలుపెడతారు. ఈ నేపథ్యంలో అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఫైనల్ గా ఏం జరిగిందనేదే స్టోరీ. (ఇదీ చదవండి: 'లస్ట్ స్టోరీస్ 2' రివ్యూ) టాక్ ఏంటి? మరి సెల్వరాజ్.. గతంలో 'పరియారుమ్ పెరిమాళ్', 'కర్ణన్' లాంటి క్లాసిక్స్ తో మెప్పించారు. ఈ రెండూ ధనిక వర్సెస్ పేద అనే కాన్సెప్ట్‌తోనే తీశారు. ఇప్పుడు 'మామన్నన్' చిత్రాన్ని అదే తరహా స్టోరీతో తీశారు. కాకపోతే ఈసారి పొలిటికల్ టచ్ ఇచ్చారు. ఇది కొంతవరకు అయితే బాగుండేది కానీ మరీ ఎక్కువ కావడంతో సెకండాఫ్ లో రొటీన్ గా అనిపించిందని చెబుతున్నారు. ఇది తప్పితే సినిమా నెక్స్ట్ లెవల్ ఉందని ప్రేక్షకుల్ని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ అయితే కచ్చితంగా మెస్మరైజ్ చేస్తుందని అంటున్నారు. వడివేలు, ఫహాద్ ఫాజిల్.. ఒకరిని మించి మరొకరు అన్నట్లు నటించారట. ఏఆర్ రెహమాన్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కలెక్షన్స్ ఎంత? గత పదేళ్లుగా సినిమాలు చేస్తున్న ఉదయనిధి స్టాలిన్.. ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వంలో మంత్రి కావడం, రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల 'మామన్నన్'.. తన చివరి సినిమా అని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. ఇక థియేటర్లలోకి వచ్చిన తర్వాత సినిమాకు హిట్ టాక్ రావడం ఓ ప్లస్ అయితే, తొలిరోజు రూ.5.5 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే ఉదయనిధి కెరీర్ లోనే అత్యధికం అవుతుంది. ఈ వసూళ్లపై క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: 'అర్ధమయ్యిందా అరుణ్ కుమార్' సిరీస్ రివ్యూ) -
ఉదయనిధి స్టాలిన్ ఫౌండేషన్ ఆస్తుల అటాచ్
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి నడిపే ఫౌండేషన్‌కు చెందిన రూ.36 కోట్ల ఆస్తుల్ని అటాచ్ చేసినట్లు ఈడీ తెలిపింది. మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఫౌండేషన్‌కు చెందిన తమిళనాడులోని రూ.36 కోట్ల విలువైన స్థిరాస్తులను, రూ.34.7 లక్షల బ్యాంక్ డిపాజిట్లను ఈనెల 25న అటాచ్ చేసినట్లు వివరించింది. ఈ కేసు దర్యాప్తులో కల్లాల్ గ్రూప్, యూకే కేంద్రంగా పనిచేసే లైకా గ్రూప్ అనుబంధంగా భారత్‌లోని లైకా ప్రొడక్షన్స్, లైకా హోటల్స్‌లో సోదాలు జరిపినట్లు తెలిపింది. -
విశాల్‌తో ఇప్పటి వరకు నటించే అవకాశం రాలేదు: ఉదయనిధి స్టాలిన్
విశాల్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘లత్తీ’(తెలుగులో లాఠీ). రానా ప్రొడక్షన్స్ పతాకంపై నటులు నందా, రమణ కలిసి నిర్మించిన ఈ చిత్రానికి నవ దర్శకుడు వినోద్ కుమార్ దర్శకత్వం వహించారు. నటి సునైనా నాయకిగా నటించింది. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆదివారం రాత్రి చెన్నైలోని ప్రసాద్ స్టడియోలో మూవీ టీజర్ విడుదల కార్యక్రమం నిర్వహించారు. చదవండి: యాక్టింగ్‌కి బ్రేక్ ఇస్తున్నా.. అయితే..!: నిత్యా మీనన్ ఈ సందర్భంగా హీరో విశాల్ మాట్లాడుతూ.. తాను ఎప్పుడు లాఠీతో దెబ్బలు తినలేదన్నారు. అయితే ఈ చిత్రం షటింగ్ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ మినహా దెబ్బలు తిననివారు లేరన్నారు. చిత్ర టీజర్లో ‘ఊర్లో ఉండే పోకిరీలు, పొరంబోకులు అందరూ నన్ను చంపడానికి డేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఇప్పుడు ఎవరూ తప్పించుకోలేరు. రండిరా’ అని తాను చెప్పిన డైలాగు బాగా నచ్చిందన్నారు. నడిగర్ సంఘం నూతన భవనంలో కరుణానిధి, స్టాలిన్ల పేర్లను పొందుపరచాలనే కోరికను ఈ సందర్భంగా ఉదయనిధి స్టాలిన్ వద్ద విశాల్ వ్యక్తం చేశారు. చదవండి: చివరిగా ఎప్పుడు బెడ్ షేర్ చేసుకున్నావ్.. నీళ్లు నమిలిన విజయ్ అనంతరం ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. లాఠీ చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. విశాల్ కాల్ షీట్స్ కోసం తాము చాలా కాలంగా ప్రయత్నిస్తున్నామని, నందా, రమణ చాలా సులువుగా కాల్ షీట్స్ పొంది చిత్రం చేశారన్నారు. తాను విశాల్ మంచి స్నేహితులమని, కలిసే పాఠశాల, కళాశాలకు వెళ్లావారమన్నారు. ఆ సమయంలో జరిగిన విషయాలను చెప్పకూడదన్నారు. విశాల్ కలిసి చిత్రం చేయాల్సిందని అయితే అది ఇప్పటి వరకు జరగలేదనన్నారు. పోలీస్ అసిస్టెంట్ కమిషనర్‌గా, కమిషనర్‌గా అన్ని పాత్రలు పోషించి ప్రస్తుతం కానిస్టేబుల్ అయ్యారని చమత్కరించారు. విశాల్ నడిగర్ సంఘం భవన నిర్మాణాన్ని పూర్తిచేసి, త్వరగా పెళ్లి చేసుకోవాలని అన్నారు. -
కోవిడ్ బాధితుల కోసం సౌందర్య రజనీకాంత్ రూ. కోటి విరాళం
కరోనా బాధితులకు చేయూతనిచ్చేందుకు కోలీవుడ్ నడుంబిగించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజరోజుకు లక్షల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో సమయానికి బాధితులకు వైద్య సదుపాయం, ఆక్సిజన్ అందక మృత్యువాత పడుతున్నారు. ఇక బాధితులను రక్షించేందుకు ప్రభుత్వాలు, వైద్య సంస్థలు కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వానికి అండగా పలువురు సినీ ప్రముఖులు తరలివస్తున్నారు. తమవంతు సాయంగా కరోనా బాధితుల కోసం సీఎం సహాయ నిధికి భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే హీరో సూర్య, కార్తీ, వారి తండ్రి, సీనియర్ నటుడు శివ కుమార్‌లు కలిసి సీఎం స్టాలిన్‌కు కోటి రూపాయల చెక్ విరాళంగా అందించిన సంగతి తెలిసిందే. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ రెండవ కూతురు సౌందర్య రజనీకాంత్ సైతం విరాళం ఇచ్చింది. ఆమె భర్త విశాగన్ వనంగముడి, మామ ఎస్ఎస్ వనంగముడితో కలిసి శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు కోటి రూపాయల చెక్‌ను అందించింది. తమ ఫార్మా కంపెనీ అపెక్స్ లాబోరేటరీ నుంచి ఈ విరాళం అందించినట్లు ఆమె తెలిపింది. అనంతరం ఆమె భర్త విశాగన్ రాష్ట్రానికి కొత్త సీఎంగా ఎన్నికైన ఎంకే స్టాలిన్‌కు పుష్ప గుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపాడు. అంతేగాక హీరో అజిత్ సైతం రూ. 25 లక్షలు విరాళం ఇవ్వగా.. ప్రముఖ దర్శకుడు మురుగదాస్, హీరో ఉదయనిధి స్టాలిన్లు చేరో 25 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. -
విష్ణువిశాల్‌కు జతగా మంజిమామోహన్
నటుడు విష్ణువిశాల్ మంచి జోష్‌లో ఉన్నారు. కారణం తెలిసిందే. తాను నిర్మాతగా మారి కథానాయకుడిగా నటించిన వేలైన్ను వందుట్టా వెళ్లక్కారన్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఈ యువ హీరో తాజా చిత్రానికి సిద్ధమయ్యారు.తనకు హీరోగా అవకాశం ఇచ్చిన దర్శకుడు సుశీంద్రన్ దర్శకత్వంలో చాలా కాలం తరువాత నటించడానికి రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం. సుశీంద్రన్ ఉదయనిధి స్టాలిన్, విష్ణువిశాల్‌తో మల్టీస్టారర్ చిత్రం చేయాలని మొదట భావించారు. అయితే ఆ చిత్ర నిర్మాణం అనివార్యకార్యాల వల్ల వాయిదా పడింది.దీంతో ఇప్పుడు విష్ణువిశాల్ హీరోగా చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో మలయాళీ భామ మంజిమామోహన్‌ను నాయకిగా ఎంపిక చేశారు. ముఖ్య పాత్రలో నటుడు పార్తిబన్ నటించనున్నారు. ఇందులో ఈయన విలన్‌గా నటించనున్నట్లు సమాచారం. పార్తిబన్ ఇంతకు ముందు నానుమ్ రౌడీదాన్ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించారన్నది గమనార్హం. ఈ చిత్ర షూటింగ్ ఆగస్ట్‌లో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతాన్ని అందించనున్నారు. చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక ప్రస్తుతం జరుగుతోందని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉన్నట్లు తెలిసింది