మీరు ఎవరు అలా చెప్పడానికి? బడా నిర్మాణ సంస్థపై హీరో విశాల్ ఫైర్ | Vishal Shocking Comments On Red Giant Movies Monopoly In Kollywood, Deets Inside - Sakshi
Sakshi News home page

Vishal: నిజాలు బయటపెట్టిన హీరో విశాల్.. ఏం జరుగుతుందో?

Apr 16 2024 2:47 PM | Updated on Apr 16 2024 5:21 PM

Vishal Comments On Red Giant Movies Monopoly In Kollywood - Sakshi

తమిళ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.చాలా ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఇతడు నడిగర్ సంఘానికి అధ్యక్షుడిగానూ వ్యవహరిస్తున్నాడు. 'రత్నం' మూవీతో త్వరలో థియేటర్లలోకి రాబోతున్నాడు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ జరుగుతున్నాయి. తాజాగా అలా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ పిక్చర్స్ తీరుపై మండిపడ్డాడు.

(ఇదీ చదవండి: మలయాళ హిట్ మూవీ తెలుగులో రీమేక్.. హీరోగా స్టార్ డైరెక్టర్!)

'సినిమాలు ఏ తేదీన విడుదల కావాలి? ఎప్పుడు విడుదల కావాలి? ఎన్ని థియేటర్లు ఇవ్వాలో రెడ్ జెయింట్ డిసైడ్ చేస్తోంది. మేం ఎక్కడెక్కడి నుంచో వడ్డీలకు డబ్బులు తీసుకొచ్చి, కష్టపడి రక్తం చిందించి సినిమాలు తీస్తుంటే.. ఎవరో ఒకరు ఏసీ రూంలో కూర్చుని థియేటర్ల ఓనర్లకు ఫోన్ చేసి.. ఆ సినిమా వేయకండి ఈ మూవీ వేసుకోండి. దాన్ని తీసేయండని చెబుతున్నారు. అసలు మీరు ఎవరు అలా చెప్పడానికి? మీకు అంతటి అధికారం, హక్కులు ఎవరిచ్చారు' అని విశాల్ మండిపడ్డాడు.

విశాల్ గత చిత్రాలు 'ఎనిమీ', 'మార్క్ ఆంటోని' సినిమాలని వేరే సంస్థ తమిళనాట డిస్ట్రిబ్యూషన్ చేశాయి. దీంతో వీటికి థియేటర్ల కొరత ఏర్పడేలా రెడ్ జెయింట్ పిక్చర్స్ వ్యవహరించింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్.. దీనికి యజమాని. దీంతో చాలామంది నిర్మాతలు ఎందుకులే అని ఊరుకోగా, విశాల్ మాత్రం బహిరంగంగానే విమర్శలు చేశాడు. తన 'రత్నం' చిత్రానికి కూడా వీళ్లు ఇబ్బందులు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: 'యానిమల్' ఓ చెత్త సినిమా.. చూస్తుంటే చిరాకేసింది: 12th ఫెయిల్ నటుడు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement