చెన్నై: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీపై మంత్రి, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామనాథపురం, తేనిలలో జరిగిన ప్రచార సభల్లో మాట్లాడుతూ మోదీ 28 పైసల ప్రధాని అని సెటైర్లు వేశారు.
కేంద్ర పన్నుల వాటాలో తమిళనాడు నుంచి వెళ్లే ప్రతి రూపాయిలో తిరిగి 28 పైసలు మాత్రమే కేంద్రం ఇస్తోందని, ఇందుకే ప్రధాని 28 పైసల పీఎం అని విమర్శించారు. ఎన్నికలున్నప్పుడే తమిళనాడుకు ప్రధాని వస్తారని మండిపడ్డారు.
మధురైలో ఎయిమ్స్ నిర్మాణం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు తయారైందన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(ఎన్‌ఈపీ) తీసుకువచ్చి తమిళనాడు విద్యార్థుల భవిష్యత్తును కేంద్రం నాశనం చేస్తోందన్నారు. నీట్‌పై నిషేధంతో పాటు ప్రతి అంశంలోనూ తమిళనాడుపై ప్రధాని వివక్ష చూపుతున్నారని ఉదయనిధి మండిపడ్డారు. కాగా, తమిళనాడులోని 39 ఎంపీ సీట్లకు గాను ఏప్రిల్ 19న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment