రాయ్‌పూర్: కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండటంపై ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బగేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయ్‌పూర్‌లో శుక్రవారం(జూన్7) జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో బగేల్ మాట్లాడారు.
‘లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు రావొచ్చని, కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని బగేల్ పిలుపునిచ్చారు. ‘పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండండి. ఆరు నెలలు లేదా ఏడాదిలో మధ్యంతర ఎన్నికలు రావొచ్చు.
యోగి ఆదిత్యనాథ్ కుర్చీ కదులుతోంది. రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ కుర్చీ ఊగుతోంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవెంద్ర ఫడ్నవిస్ ఇప్పటికే రాజీనామా చేస్తానంటున్నారు’అని బగేల్ ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment