న్యూఢిల్లీ: మోదీ 2.0 కేబినెట్ చివరి సమావేశం ఢిల్లీలో ముగిసింది. 17వ లోక్‌సభను రద్దు చేయాలని ఈ సమావేశంలో తీర్మానం చేశారు. అనంతరం మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ప్రధాన పదవికి రాజీనామా లేఖతో పాటు 17వ లోక్‌సభను రద్దు చేస్తూ కేబినెట్ తీర్మానాన్ని రాష్ట్రపతికి అందించారు.
ఈ నెల 7న జరిగే బీజేపీ,ఎన్డీఏ సమావేశంలో మోదీని నేతగా ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. అనంతరం 8న మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి. దీంతో పాటు కేబినెట్ భేటీలో ఎన్డీఏ 3.0 ప్రభుత్వ ఏర్పాటుపైనా చర్చించిట్లు తెలుస్తోంది.
కాగా, ఇవాళ సాయంత్రమే ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల భేటీ కూడా జరగనుంది. ఈ భేటీలో కొత్త ప్రభుత్వ కూర్పు, ఫ్రెండ్లీ పార్టీలకు మంత్రిపదవులు, ప్రభుత్వ కామన్ ఎజెండా తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. భేటీ అనంతరం ఎన్డీఏ నేతలు రాష్ట్రపతిని కలిసి తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరతారు.
Comments
Please login to add a commentAdd a comment