new Government
-
సిరియాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు
-
రేపు జార్ఖండ్ లో కొలువుతీరనున్న కొత్త ప్రభుత్వం
-
Modi 3.0: కీలక శాఖలన్నీ బీజేపీ వద్దే
న్యూఢిల్లీ: అనుభవానికి పెద్దపీట వేస్తూ, అదే సమయంలో యువతకు సముచిత ప్రాధాన్యమిస్తూ నూతన కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. కసరత్తులో ఆసాంతం మోదీ–షా ముద్రే ప్రతిఫలించింది. పదేళ్లుగా మోదీ తొలి, మలి మంత్రివర్గాల్లో కీలకంగా వ్యవహరించిన బీజేపీ మంత్రులకు ఈసారీ ప్రాధాన్యం కొనసాగింది. హోం శాఖ బాధ్యతలు మరోసారి అమిత్ షానే చేపట్టగా రాజ్‌నాథ్‌సింగ్ రక్షణ, నిర్మలా సీతారామన్ ఆర్థిక, జైశంకర్ విదేశాంగ శాఖల్లో కొనసాగనున్నారు. మోదీతో పాటు మొత్తం 72 మందితో ఆదివారం ఎన్డీఏ మంత్రివర్గం కొలువుదీరడం తెలిసిందే. మోదీ సిఫార్సు మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వారికి సోమవారం శాఖలు కేటాయించారు. గత రెండుసార్లకు భిన్నంగా ఈసారి బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వ మనుగడలో ఎన్డీఏ పక్షాలు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో టీడీపీ, జేడీ(యూ) తదితర భాగస్వాములకు శాఖల కేటాయింపులో సముచిత ప్రాధాన్యమే దక్కినా కీలక శాఖలన్నింటినీ బీజేపీయే అట్టిపెట్టుకునేలా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నట్టు స్పష్టంగా కని్పంచింది. కీలక శాఖలు కావాలని జేడీ(యూ), టీడీపీ ముందుగానే కోరినా కుదరదని బీజేపీ పెద్దలు స్పష్టం చేయడం తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే వ్యూహాత్మక ప్రాధాన్యమున్న అత్యధిక పోర్టుఫోలియోలు బీజేపీ మంత్రులకే దక్కాయి. దేశవ్యాప్తంగా రోడ్డు నెట్వర్క్ అభివృద్ధి, విస్తరణ, ఆధునీకరణలో తనదైన మార్కు చూపిన నితిన్ గడ్కీరీకి మరోసారి రోడ్లు–హైవే శాఖ దక్కింది. మోదీకి ప్రీతిపాత్రుడైన అశ్వినీ వైష్ణవ్‌కు కీలకమైన రైల్వే, ఐటీ–ఎలక్ట్రానిక్స్ శాఖలను కొనసాగించడమే గాక సమాచార–ప్రసార శాఖ బాధ్యతలు కూడా కట్టబెట్టడం విశేషం. గత ప్రభుత్వంలో ఆ బాధ్యతలు చూసిన అనురాగ్ ఠాకూర్‌కు ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం తెలిసిందే. ఆయనకు బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించవచ్చని వార్తలొస్తున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్‌కు విద్య, పీయూష్ గోయల్‌కు వాణిజ్య, పరిశ్రమల శాఖలను కొనసాగించారు. హర్దీప్సింగ్ పురికి పెట్రోలియం శాఖను కొనసాగిస్తూ హౌజింగ్–పట్టణ వ్యవహారాలను తప్పించారు. తొలుత న్యాయ, తర్వాత అర్త్ సైన్సెస్ బాధ్యతలు చూసిన కిరెణ్ రిజిజుకు ప్రధానమైన పార్లమెంటరీ వ్యవహారాలు అప్పగించారు. ‘మామ’కు వ్యవసాయం రాష్ట్రాల్లో ఏళ్ల తరబడి చక్రం తిప్పి కొత్తగా మోదీ కేబినెట్లో చేరిన బీజేపీ దిగ్గజాలకు ప్రధాన శాఖలే కేటాయించారు. వారిలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్‌సింగ్‌కు కీలకమైన వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖలు దక్కాయి. ఐదేళ్ల తర్వాత కేబినెట్లో అడుగు పెట్టిన బీజేపీ అధ్యక్షుడు జగత్‌ప్రకాశ్ నడ్డాకు మరోసారి మోదీ తొలి మంత్రివర్గంలో నిర్వర్తించిన ఆరోగ్య శాఖతో పాటు ఎరువులు–రసాయనాల శాఖ కూడా దక్కింది. ఇప్పటిదాకా ఆ రెండు శాఖలనూ మాండవీయ చూశారు. హరియాణా మాజీ సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌కు విద్యుత్‌తో పాటు పట్టణ వ్యవహారాలను అప్పగించారు. న్యాయ శాఖకు అర్జున్‌రాం మేఘ్వాల్, షిప్పింగ్‌కు సర్బానంద సోనోవాల్, పర్యావరణానికి భూపేందర్ యాదవ్, సామాజిక న్యాయానికి వీరేంద్ర కుమార్ కొనసాగారు. గిరిజన శాఖ బాధ్యతలు జ్యుయల్ ఓరంకు దక్కాయి. తెలుగు రాష్ట్రాల నుంచి... మోదీ 3.0 మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి చోటు దక్కడం తెలిసిందే. వారిలో కిషన్‌కు బొగ్గు, గనులు, ఏపీ నుంచి టీడీపీకి చెందిన రామ్మోహన్‌కు విమానయానం రూపంలో కేబినెట్ హోదా బెర్తులు దక్కాయి. గతంలో వాజ్‌పేయి సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా టీడీపీ నేత అశోక్ గజపతిరాజు పౌర విమానయాన శాఖ మంత్రిగా చేశారు. తెలంగాణ నుంచి బండి సంజయ్‌కుమార్, ఏపీ నుంచి భూపతిరాజు శ్రీనివాస వర్మ, టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్‌కు సహాయ మంత్రి పదవులు దక్కడం తెలిసిందే. బండికి హోం శాఖ కేటాయించారు. వర్మకు భారీ పరిశ్రమలు, ఉక్కు, పెమ్మసానికి గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల రూపంలో రెండేసి శాఖల బాధ్యతలు అప్పగించారు. భాగస్వాములకు ఇలా... ఎన్డీఏ భాగస్వాముల్లో జేడీ(యూ) నేత లలన్‌సింగ్‌కు పంచాయతీరాజ్, మత్స్య–పశుసంవర్ధకం–పాడి శాఖలు దక్కాయి. వ్యవసాయ శాఖపై ఆశలు పెట్టుకున్న జేడీ(ఎస్) చీఫ్ కుమారస్వామికి ఉక్కు, భారీ పరిశ్రమల బాధ్యతలు అప్పగించారు. హెచ్ఏఎం(ఎస్) చీఫ్ జితన్‌రాం మాంఝీకి ఎంఎస్ఎంఈ; ఎల్జేపీ (ఆర్వీ) అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్‌కు ఫుడ్ ప్రాసెసింగ్, టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖలు దక్కాయి. భాగస్వామ్య పక్షాలకు ఐదు కేబినెట్, రెండు స్వతంత్ర, నాలుగు సహాయ పదవులివ్వడం తెలిసిందే. ఇక స్వతంత్ర హోదా మంత్రుల్లో శివసేన నుంచి జి.పి.జాదవ్‌కు ఆయు‹Ù, ఆరెల్డీ నేత జయంత్ చౌదరికి నైపుణ్యాభివృద్ధి శాఖలిచ్చారు. -
రేపే మోదీ ప్రమాణం
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనను ఆహా్వనించారు. ఆదివారం రాత్రి 7:15 గంటలకు మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ దిశగా శుక్రవారం హస్తినలో ఒకదాని వెంట ఒకటి పలు పరిణామాలు జరిగాయి. తొలుత ఉదయం 11.30కు నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) భాగస్వామ్య పక్షాలన్నీ సమావేశమై తమ పార్లమెంటరీ పార్టీ నేతగా మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. పార్లమెంటు పాత భవనం ‘సంవిధాన్ సదన్’ సెంట్రల్ హాల్లో జరిగిన ఈ భేటీలో బీజేపీతో పాటు టీడీపీ, జేడీ(యూ), ఎల్జేపీ తదితర ఎన్డీఏ భాగస్వామ్య పారీ్టల అధినేతలు, ఎంపీలు పాల్గొన్నారు. ఎన్డీఏపీపీ నేతగా మోదీ పేరును బీజేపీ అగ్రనేత రాజ్‌నాథ్‌సింగ్ ప్రతిపాదించగా కూటమి ఎంపీలంతా ఏకగ్రీవంగా అంగీకారం తెలిపారు. అనంతరం ఎంపీలందరినీ ఉద్దేశించి మోదీ, ఆయన నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ భాగస్వామ్య పక్షాల నేతలు ప్రసంగించారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా, లోక్‌సభలో బీజేపీ పక్ష నేతగా కూడా మోదీ ఎన్నికయ్యారు. తర్వాత ఆయన రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి ద్రౌపదీ ముర్ముతో సమావేశమయ్యారు. ఎన్డీఏ ఎంపీల నిర్ణయాన్ని ఆమెకు తెలియజేశారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మోదీని ముర్ము ఆహా్వనించారు. అనంతరం రాష్ట్రపతి భవన్ వెలుపల మోదీ మీడియాతో మాట్లాడారు. ‘‘నన్ను ఎన్డీఏ నేతగా ఎన్నుకున్నట్టు భాగస్వామ్య పక్షాలన్నీ రాష్ట్రపతికి తెలిపాయి. దాంతో ఆమె నన్ను ప్రధానిగా నియమించారు. ఆ మేరకు నాకు లేఖ అందజేశారు. ప్రమాణస్వీకారానికి అనువైన సమయం, నాతో పాటు కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసే నేతల వివరాలు కోరారు. ఆదివారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేస్తామని తెలిపాను. కాబోయే మంత్రుల జాబితాను ఆదివారానికల్లా రాష్ట్రపతి భవన్‌కు అందజేస్తా’’ అని వివరించారు. 2047లో వందేళ్ల స్వాతంత్య్రోత్సవాల నాటికి జాతి కలలను సంపూర్ణంగా సాకారం చేసే ప్రస్థానంలో 18వ లోక్‌సభ కీలక మైలురాయిగా నిలవనుందని ఈ సందర్భంగా మోదీ అన్నారు. ‘‘ఇది నవ, యువ శక్తితో అలరారుతున్న సభ. దేశ ప్రజలు ఎన్డీఏకు మరోసారి అవకాశమిచ్చారు’’ అని చెప్పారు. ఎన్డీఏ పక్షాలన్నీ మోదీకి మద్దతుగా శుక్రవారం మధ్యాహ్నమే రాష్ట్రపతికి లేఖలు అందజేశాయి. జాతీయ ప్రయోజనాలు, ప్రాంతీయ ఆకాంక్షల మధ్య... సమతూకంగా పాలన: బాబు, నితీశ్ జాతీయ ప్రయోజనాలు, ప్రాంతీయ ఆకాంక్షల మధ్య సమతూకం పాటిస్తూ ఎన్డీఏ ప్రభుత్వ పాలన సాగాలని భాగస్వామ్య పక్షాలు టీడీపీ, జేడీ(యూ) ఆకాంక్షించాయి. ఎన్డీఏపీపీ నేతగా మోదీ పేరును రాజ్‌నాథ్ ప్రతిపాదించగా చంద్రబాబు (టీడీపీ), నితీశ్‌కుమార్ జేడీ(యూ), ఏక్నాథ్ షిండే (శివసేన), చిరాగ్ పాస్వాన్ (ఎల్జేపీ–ఆర్వీ), హెచ్.డి.కుమారస్వామి జేడీ(ఎస్), అజిత్ పవార్ (ఎన్సీపీ), జితిన్‌రాం మాంఝీ తదితరులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు సారథ్యం వహిస్తున్నారని చంద్రబాబు అన్నారు. ‘‘ప్రపంచ సారథిగా ఎదిగేందుకు భారత్‌కు ఇదో అద్భుతమైన అవకాశం. సమాజంలోని అన్ని వర్గాల సమగ్రాభివృద్ధికి పెద్దపీట వేస్తూ పాలన సాగాలి’’ అని ఆకాంక్షించారు. రాష్ట్రాల అభివృద్ధిని చిన్నచూపు చూడొద్దని నితీశ్ సూచించారు. దేశాన్ని అద్భుతంగా వృద్ధి పథంలో నడిపించడంతో పాటు బిహార్‌పైనా మోదీ ప్రత్యేకంగా దృష్టి సారిస్తారని ఆశాభావం వెలిబుచ్చారు. ‘‘వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ విపక్షాలకు ఓటమి తప్పదు. వాళ్లు పనికిరాని కబుర్లు చెప్పి అక్కడా, ఇక్కడా గెలిచారు. వచ్చేసారి వారంతా ఓడటం ఖాయం’’ అన్నారు. మోదీ ప్రధానిగా ఉన్నంతకాలం దేశం ఎవరి ముందూ తలొంచబోదని పవన్ కల్యాణ్ అన్నారు.విరిసిన నవ్వులు... ఎన్డీఏ భేటీ పలు ఆహ్లాదకర సన్నివేశాలకు వేదికైంది. తమ కూటమిది పటిష్టమైన ఫెవికాల్ బంధం అని షిండే అభివరి్ణంచగా నవ్వులు విరిశాయి. తనకు పాదాభివందనం చేసేందుకు నితీశ్ ప్రయత్నించగా మోదీ వారిస్తూ ఆలింగనం చేసుకున్నారు. చిరాగ్నూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను భుజం తట్టారు. పవన్ కల్యాణ్ ‘పవనం కాదు, సుడిగాలి’ అంటూ మోదీ తన ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రశంసించారు.రాజ్యాంగ ప్రతికి నమస్సులు ఎన్డీఏ భేటీ కోసం సెంట్రల్ హాల్లోకి ప్రవేశించగానే మోదీ ముందుగా రాజ్యాంగ ప్రతిని తన నుదిటికి తాకించుకుని వందనం చేశారు. ఆ ఫొటోను ఎక్స్‌లో పెట్టి భావోద్వేగంతో కూడిన పోస్ట్ చేశారు. ‘‘తన జీవితంలో ప్రతి క్షణమూ రాజ్యాంగం ప్రవచించిన గొప్ప విలువల పరిరక్షణకే అంకితం. నా వంటి వెనకబడ్డ నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి దేశానికి సేవ చేయగలుగుతున్నాడంటే అది కేవలం మన రాజ్యాంగం గొప్పదనమే. అది కోట్లాది ప్రజలకు ఆశ, శక్తియుక్తులు, గౌరవాదరాలు కలి్పస్తోంది’’ అని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని పదేళ్లుగా అడుగడుగునా నిర్లక్ష్యం చేస్తూ వచి్చన మోదీ నేడిలా అదే రాజ్యాంగానికి ప్రణామాలు చేయడం విడ్డూరమంటూ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ దుయ్యబట్టారు. -
AP: అప్పుడే మొదలైంది.. ఆరోగ్యశ్రీలో 134 చికిత్సలకు కోత
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఆరోగ్యశ్రీ చికిత్సలకు అప్పుడే కోత మొదలైంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరుగుతున్న 134 చికిత్సలను ఇకపై ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రమే చేయాలని వైద్యవిద్యా సంచాలకులు నిర్ణయించారు. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు ప్రతిపాదనలు పంపించారు. వీటిలో మెజారిటీ చికిత్సలు జనరల్ సర్జరీకి సంబంధించినవే. గతంలో 171 చికిత్సలు మాత్రమే ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేసేవారు.ఇప్పుడు వీటికి అదనంగా 134 చికిత్సలను చేరుస్తూ ఆరోగ్యశ్రీ సీఈఓకు ప్రతిపాదన పంపించారు. తీవ్ర గాయాలై ఆపరేషన్లు చేయాల్సి రావడం, కడుపునొప్పి, హెరి్నయా వంటి జనరల్ సర్జరీలు ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ జరిగేవి. ఈ చికిత్సలన్నీ ఇకపై ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రమే చేయాలని ప్రతిపాదనలు వెళ్లాయి.ఈ మేరకు బుధవారం అన్ని బోధనాస్పత్రుల సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాళ్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వివరించినట్టు తెలిసింది. తాజాగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చేయాలని నిర్ణయించిన చికిత్సల్లో జనరల్ సర్జరీకి సంబంధించి 129, గైనకాలజీకి సంబంధించి 5 చికిత్సలు ఉన్నాయి. తాజా ప్రతిపాదనతో కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చేసే చికిత్సల సంఖ్య 305కు చేరింది. తాజాగా ప్రతిపాదించిన 134 చికిత్సలను రెండు, మూడు రోజుల్లో ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి తొలగించనున్నారు. ఈ విషయాన్ని డీఎంఈ తమకు వివరించారని అనంతపురం వైద్య కళాశాలకు సంబంధించిన ఓ అధికారి పేర్కొన్నారు. తాజా నిర్ణయంతో ప్రభుత్వ ఆస్పత్రులపై తీవ్ర ఒత్తిడి పడనుంది. -
ప్రధాని పదవికి మోదీ రాజీనామా
న్యూఢిల్లీ: మోదీ 2.0 కేబినెట్ చివరి సమావేశం ఢిల్లీలో ముగిసింది. 17వ లోక్‌సభను రద్దు చేయాలని ఈ సమావేశంలో తీర్మానం చేశారు. అనంతరం మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ప్రధాన పదవికి రాజీనామా లేఖతో పాటు 17వ లోక్‌సభను రద్దు చేస్తూ కేబినెట్ తీర్మానాన్ని రాష్ట్రపతికి అందించారు.ఈ నెల 7న జరిగే బీజేపీ,ఎన్డీఏ సమావేశంలో మోదీని నేతగా ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. అనంతరం 8న మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి. దీంతో పాటు కేబినెట్ భేటీలో ఎన్డీఏ 3.0 ప్రభుత్వ ఏర్పాటుపైనా చర్చించిట్లు తెలుస్తోంది. కాగా, ఇవాళ సాయంత్రమే ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల భేటీ కూడా జరగనుంది. ఈ భేటీలో కొత్త ప్రభుత్వ కూర్పు, ఫ్రెండ్లీ పార్టీలకు మంత్రిపదవులు, ప్రభుత్వ కామన్ ఎజెండా తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. భేటీ అనంతరం ఎన్డీఏ నేతలు రాష్ట్రపతిని కలిసి తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరతారు. -
కొత్త ప్రభుత్వ లక్ష్యం అత్యుత్తమ బడ్జెట్
న్యూఢిల్లీ: ఎన్నికల ఫలితాల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వ తక్షణ లక్ష్యం.. జూలైలో అత్యుత్తమ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడమేనని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు లోక్‌సభలో మంచి మెజారిటీతో ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలోకి వస్తారని ఆర్థిక మంత్రి ఉద్ఘాటించారు. ఎన్నికల అనంతరం మోదీ వరుసగా మూడోసారి ప్రధాని అవుతారని స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక వాణిజ్య శిఖరాగ్ర సమావేశంలో ఆమె ఈ మేరకు పారిశ్రామిక దిగ్గజాలను ఉద్దేశించి ప్రసంగించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జూలైలో పూర్తి సంవత్సర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం జరుగుతుందని పేర్కొన్న ఆమె, దీనిని అత్యుత్తమంగా రూపొందించడానికి సీఐఐతో చర్చలు జరుపుతామని అన్నారు. భారత్ వృద్ధి తీరు స్థిరంగా కొనసాగుతుందని, దీనికి సంబంధించి దేశం ముందు ఎన్నో అవకాశాలు ఉన్నాయని వివరించారు. దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకం కానుందన్నారు. సోలార్, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా రంగాల పురోగతికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు యువతకు గణనీయమైన ఉద్యోగ అవకాశాలను అందిస్తాయని అన్నారు. -
తొలి వంద రోజులకు, వచ్చే ఐదేళ్లకు రోడ్‌మ్యాప్
న్యూఢిల్లీ: మరో రెండు నెలల్లో ఏర్పాటు కానున్న కొత్త ప్రభుత్వానికి తొలి వంద రోజుల రోడ్‌మ్యాప్‌తోపాటు రాబోయే ఐదేళ్ల రోడ్‌మ్యాప్ రూపొందించాలని మంత్రివర్గ సహచరులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. మోదీ అధ్యక్షతన ఆదివారం ఉదయం ఢిల్లీలో జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. తొలి వంద రోజుల రోడ్‌మ్యాప్, ఐదేళ్ల రోడ్‌మ్యాప్‌ను సమర్థంగా ఎలా అమలు చేయాలన్నదానిపై నిపుణులతో, సంబంధిత శాఖల కార్యదర్శులతో సంప్రదింపులు జరపాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసారి ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలు జరిగే తేదీలను నోటిఫై చేసే ప్రక్రియను కేంద్ర కేబినెట్ ప్రారంభించింది. ఎన్నికల సంఘం ప్రతిపాదనలను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు మంత్రివర్గం పంపించింది. రాష్ట్రపతి ఆమోదంతో తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 20న వెలువడనుంది. నోటిఫికేషన్ అనంతరం నామినేషన్ల పక్రియ ప్రారంభమవుతుంది. ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి వేర్వేరు తేదీల్లో ఏడు నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉంది. -
‘పాక్ కొత్త ప్రభుత్వాన్ని గుర్తించొద్దు’
వాషింగ్టన్: పాకిస్థాన్‌లో కొత్త ప్రభుత్వం కొలువు దీరనున్న వేళ.. అగ్రరాజ్య చట్ట సభ్యులు పెద్ద షాకే ఇచ్చారు. ఆ ప్రభుత్వాన్ని గుర్తించొద్దంటూ అధ్యక్షుడు జో బైడెన్‌కు డెమొక్రటిక్ సభ్యులు లేఖ రాశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని.. అమెరికా ఆ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తోందని లేఖలో పేర్కొన్నారు వాళ్లంతా. ఫిబ్రవరి 8 నాటి పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందనడానికి బలమైన ఆధారాలు ఉన్నాయి. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిగేవరకు కొత్త ప్రభుత్వాన్ని గుర్తించొద్దని లేఖలో బైడెన్ చట్టసభ్యులు కోరారు. ‘‘పోలింగ్‌కు ముందు, తరువాత రిగ్గింగ్ జరిగిందనే దానికి బలమైన సాక్ష్యాలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై సమగ్రమైన, పారదర్శకమైన, విశ్వసనీయమైన దర్యాప్తు జరిగేవరకు వేచి చూడండి. అంతవరకు ఆ ప్రభుత్వాన్ని గుర్తించొద్దు. లేనిపక్షంలో ఆ దేశాధికారుల ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణిని సమర్థించినట్లవుతుంది. అది అక్కడి ప్రజల ప్రజాస్వామ్య స్ఫూర్తిని తక్కువ చేసినట్లే’’ అని లేఖలో ప్రస్తావించారు వాళ్లు. బైడెన్‌తో పాటు విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ను ఉద్దేశించి సంయుక్త లేఖ రాశారు వాళ్లు. ‘‘ఎన్నికలకు ముందు మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ నేత ఇమ్రాన్‌ఖాన్‌కు జైలు శిక్షలు విధించారు. ఆ పార్టీ అభ్యర్థులకు స్వతంత్రులుగా పోటీ చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. పీటీఐ శ్రేణులు.. పోలీసు దాడులు, అరెస్టులు, వేధింపులు ఎదుర్కొన్నారు. ఎన్నికల తుది ఫలితాల విడుదలలో జాప్యం అనుమానాలకు కారణమైంది. ఫలితాలు తారుమారైనట్లు ఆరోపణలు ఉన్నాయి’’ అని 33 మంది చట్టసభ్యులు తెలిపారు. ఇందులో ప్రోగ్రెసివ్ కాకస్ ఛైర్పర్సన్, భారత సంతతికి చెందిన ప్రమీలా జయపాల్ కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే.. సార్వత్రిక ఎన్నికల్లో భారీఎత్తున రిగ్గింగ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మద్దతుదారులు గురువారం పార్లమెంటులోనూ ఈ అంశాన్ని లేవనెత్తారు. అదే సమయంలో.. మెజారిటీ రాకపోయినా కూటమి రూపేణా ప్రభుత్వ ఏర్పాటునకు నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్ సిద్ధమైంది. షరీఫ్ సోదరుడు.. మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆదివారం పాక్ నూతన ప్రధానిగా ప్రమాణం చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ పరిణామాల మధ్య అగ్రరాజ్య చట్టసభ్యుల లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. -
పాకిస్థాన్‌లో కొత్త సర్కార్‌కు లైన్ క్లియర్!.. ప్రధాని ఆయనేనా?
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్థాన్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల పాక్‌లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఆరోపిస్తున్న వేళ అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. అధికార ఒప్పందానికి సంబంధించి పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీల మధ్య డీల్ కుదిరింది. వివరాల ప్రకారం.. పాకిస్థాన్‌లో పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీల మధ్య ఒప్పందంతో వచ్చే నెల రెండో తేదీ నాటికి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే మార్చి తొమ్మిదో తేదీలోగా పాక్‌లో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి ఈ రెండు పార్టీలు. కాగా, దేశవ్యాప్తంగా కొత్తగా ఎన్నికైన అసెంబ్లీలు ఈ నెల 29న ప్రమాణం చేస్తాయని, రెండో తేదీన కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని న్యూస్ ఇంటర్నేషనల్ ఓ ప్రకటనలో తెలిపింది. అనంతరం తొమ్మిదో తేదీలోగా అధ్యక్ష ఎన్నికలు నిర్వహించే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నారని వెల్లడించింది. ఇక, మూడు సార్లు ప్రధానిగా పనిచేసిన నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్)కు మాజీ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి బిలావల్ భుట్టో-జర్దారీకి చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ మద్దతు ఇస్తోంది. ఫిబ్రవరి ఎనిమిదో తేదీ నాటి లెక్కింపులో పాక్‌లోని ఏ ఒక్క పార్టీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేంత స్థాయిలో ఆధిక్యం దక్కలేదు. దీంతో హంగ్ తప్పని పరిస్థితి నెలకొంది. మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (72) మళ్లీ ప్రధాని అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. -
కొత్త ప్రభుత్వం అప్పులు రూ.1,400 కోట్లు
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి అధికార పగ్గాలు అందుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా అప్పుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు నిధులు సమీకరించుకుంది. ఈ నెలలో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,400 కోట్ల మేర రుణ సమీక రణ చేసింది. ఆర్బీఐ ఆ«ధ్వర్యంలో సెక్యూరిటీ బాండ్లను వేలం వేయడం ద్వారా ఈ నెల 12న రూ.500 కోట్లు, ఈ నెల 19న రూ. 900 కోట్ల మేర అప్పు తెచ్చుకుంది. ఇందులో రూ. 500 కోట్ల అప్పును 7.70 శాతం వడ్డీకి 15 ఏళ్ల కాలవ్యవధిలో చెల్లించేలా, రూ. 900 కోట్లను 7.58 శాతం వడ్డీకి 18 ఏళ్లలో చెల్లించేలా సమకూర్చుకుంది. గత ప్రభుత్వ హయాంలోనే రుణ షెడ్యూల్.. వాస్తవానికి బహిరంగ మార్కెట్లో రుణాలు తీసుకొనే ప్రక్రియలో భాగంగా ఆర్బీఐ ద్వారా బాండ్లను వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు మూడు నెలలకోసారి షెడ్యూల్ సమర్పిస్తాయి. గత ప్రభుత్వ హయాంలోనే ఈ ఆర్థిక సంవత్సరంలోని మూడో త్రైమాసికానికి చెందిన షెడ్యూల్‌ను ఆర్బీఐ ఖరారు చేసింది. ఈ షెడ్యూల్ మేరకు డిసెంబర్లో రెండు దఫాలుగా ప్రభుత్వం రూ. 1,400 కోట్లు సమకూర్చుకుందని ఆర్థిక వర్గాలు వెల్లడించాయి. -
నేడు కొలువుదీరనున్న కొత్త అసెంబ్లీ..తొలిసారి సభలోకి 51 మంది ఎమ్మెల్యేలు
-
TS: మంత్రులుగా వారందరికీ ఇది పరీక్ష సమయం
తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు చేపట్టినందుకు ముందుగా అభినందనలు. రేవంత్ ప్రమాణ స్వీకారం తర్వాత క్లుప్తంగా చేసిన ప్రసంగంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ప్రజాస్వామ్యం తిరిగి వచ్చిందని, ప్రజలకు స్వేచ్చ లభించిందని, తెలంగాణకు పట్టిన చీడ విరగడ అయిందని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఇక ప్రగతి భవన్ ప్రజా దర్బార్‌గా అందుబాటులోకి రాబోతోందని ప్రకటించారు. అందుకు తగ్గట్లుగానే వెంటనే ప్రగతి భవన్ వద్ద కంచెలను తొలగించారు.వెంటనే ప్రగతి భవన్ పేరు మార్చారు. ✍️జ్యోతీరావు పూలే ప్రజాభవన్ అని పేరు పెట్టి అక్కడ ప్రజా దర్బార్ నిర్వహించబోతున్నట్లు రేవంత్ తెలిపారు. దానికి ఎవరైనా స్వేచ్చగా రావచ్చని ఆయన పిలుపు ఇచ్చారు. ఇది హర్షణీయమైన సంగతే. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌ను నిర్మించారు కాని, ప్రజలకు అందుబాటులో లేకుండా చేశారు. దానిని విపక్షం ఎప్పటికప్పుడు విమర్శిస్తూనే ఉండేది. అలాగే పాత సచివాలయం పడగొట్టి ఆధునిక సచివాలయం భారీ ఎత్తున నిర్మించారు. కాని అందులోకి కూడా ఆయన పెద్దగా వెళ్లలేదు. ఇప్పుడు అది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉపయోగపడుతోంది. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ అని అంటారు. ఆ విషయం మరోసారి కనిపించింది. రేవంత్ తో పాటు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన వేదిక అంతా గందరగోళంగా మారింది. ఎవరెవరో ఆ వేదికపై కలియతిరుగుతూ సందడి చేశారు. ఒక రకంగా ఇది అవధులు లేని ప్రజాస్వామ్యమేమో అనిపించింది. ✍️తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లభించిందని రేవంత్ అన్నట్లుగా చాలామంది ఆ వేదికపై సంచరించారు. ఒక పక్క మంత్రుల ప్రమాణ స్వీకారం జరుగుతున్నా వారి వెనుకే కొందరు మాట్లాడుకుంటూ ఉండడం, వారిని అధికారులు నివారించవలసి రావడం వంటి ఘట్టాలు అగుపించాయి. ఒక మాజీ ఎంపీ అయితే కలియతిరుగుతూ టీవీలలో కనిపించారు. అంత మాత్రాన ఏదో పెద్ద తప్పు జరిగిపోయిందని కాదు. సాధారణంగా ప్రమాణ స్వీకార వేదికపై కేవలం గవర్నర్, ముఖ్యమంత్రి, మహా అయితే కొద్ది మంది ముఖ్య అతిథులు ఉంటారు. మిగిలినవారంతా వేదిక ఎదురుగానో, పక్కన మరో వేదికపైనో ఉంటారు. ప్రమాణ స్వీకారం పూర్తి అయిన తర్వాత, గవర్నర్ వెళ్లిపోయిన తదుపరి పెద్ద నాయకులంతా ఒక వేదికపైకి వచ్చి ప్రజలకు అభివాదాలు చేస్తారు. కాని ఈ వేదిక అంతా గందరగోళంగా మారడంతో ఏఐసీసీ అగ్రనేతలు సైతం కిందికి దిగి వెళ్లిపోయారనిపిస్తుంది.అయినా ఫర్వాలేదు. కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది. ✍️ప్రజలు వేల సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రేవంత్ ప్రమాణం చేస్తున్నప్పుడు, ఆయా మంత్రులు ప్రమాణ స్వీకార సమయంలో పెద్ద ఎత్తున హర్షద్వానాలు చేశారు. అందరికన్నా సీతక్క మంత్రిగా ప్రమాణం చేస్తున్నప్పుడు చప్పట్లు మారుమోగాయి. రేవంత్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు ఫైల్ పై సంతకం చేశారు. ఆ విషయాన్ని ప్రజలకు తన స్పీచ్ లో వివరించి ఉండాల్సింది. ఒక దివ్యాంగురాలికి ఉద్యోగం ఇస్తానన్న హామీని కూడా ఆయన నెరవేర్చారు. మంత్రివర్గ కూర్పు గురించి విశ్లేషించుకోవడం కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. రేవంత్ రెడ్డి సీఎం అవ్వడానికి ముందు రెండుసార్లు ఎమ్మెల్యే అయినా, ఒకసారి ఎంపీ అయినా రాష్ట్రంలో కాని, కేంద్రంలో కాని మంత్రి పదవి చేయలేదు. దానికి కారణం ఆయన ప్రతిపక్షంలో ఉండడమే. ✍️మూడోసారి శాసనసభకు ఎన్నికైన తర్వాత నేరుగా ముఖ్యమంత్రి బాధ్యతను ఆయన చేపట్టారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నాలుగోసారి ఎమ్మెల్యే అయ్యాక ఈ అవకాశం వచ్చింది. అంతకు ముందు ఆయన ఎమ్మెల్సీ, విప్, ఉప సభాపతి వంటి పదవులు చేపట్టారు. మిగిలినవారిలో అందరికన్నా సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆయన 1985లోనే తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అదే టరమ్ లో ఎన్.టి.ఆర్.క్యాబినెట్లో మంత్రిగా కూడా ఉన్నారు. తదుపరి 1994,1999లలో ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్.టి.ఆర్.ముఖ్యమంత్రిగా పదవీచ్యుతుడు అయ్యాక 1995లో ఏర్పడిన చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రిగా ఉండి 2004 వరకు కొనసాగారు. ✍️2009లో మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. కాని ప్రతిపక్షంలో ఉన్నారు రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఆయన గెలవలేకపోయారు. అయినా టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈయనను టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి ఆహ్వానించి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేశారు. ఆ తర్వాత ఉప ఎన్నికలో మళ్లీ ఎమ్మెల్యే అయ్యారు. 2018 ఎన్నికలలో గెలవలేకపోయారు. తిరిగి 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లోకి వచ్చి ఎమ్మెల్యేగా విజయడంకా మోగించి రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రి అయ్యారు. ఈ రకంగా ఆయన నలుగురు క్యాబినెట్లలో మంత్రిగా ఉన్నారు. ✍️మంత్రి దామోదర రాజనరసింహ 1989లో తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. తదుపరి 2004, 2009లలో, మళ్లీ 2023లో శాసనసభకు ఎన్నికయ్యారు. గతంలో వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల క్యాబినెట్లలో పనిచేశారు. కిరణ్ సీఎంగా ఉన్నప్పుడు ఈయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు. మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు కూడా 1999 లో తొలిసారి శాసనసభ్యులయ్యారు. ఉత్తం కుమార్ అంతకు ముందు ఓటమి చవిచూసినా, 1999 నుంచి గెలుస్తూనే ఉన్నారు. ఉత్తంకుమార్ రెడ్డి ఉమ్మడి ఏపీలో కిరణ్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2018 ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడుగా పనిచేశారు. 2019లో లోక్ సభకు ఎన్నికయ్యారు. 2023లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి పొందారు. ✍️కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లలో పనిచేశారు. తెలంగాణ ఉద్యమం కోసం మంత్రి పదవిని వదలుకున్నారు. 2018లో ఓటమి చెందినా 2019 లో ఎంపీగా గెలిచారు. తిరిగి ఈసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కాగలిగారు. మరో మంత్రి కొండా సురేఖ కూడా సీనియర్ నేతే. ఆమె కూడా 1999లోనే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.ఆమె ఉమ్మడి ఏపీలో వైఎస్ క్యాబినెట్లో ఉన్నారు. తర్వాత రోశయ్య క్యాబినెట్ లో కొద్దికాలం ఉండి రాజీనామా చేశారు. అప్పట్లో వైఎస్ జగన్ కు మద్దతుగా ఆమె నిలబడి అనర్హత వేటుకు గురయ్యారు.2014లో టిఆర్ఎస్ పక్షాన ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చి ఈసారి మంత్రి అయ్యారు. మరో మంత్రి జూపల్లె కృష్ణారావు 1999లో ఇండిపెండెంట్‌గా 2004లో కాంగ్రెస్ పక్షాన గెలిచారు. 2009లో కూడా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా కూడా మూడు మంత్రివర్గాలలో పనిచేశారు. తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా పదవికి రాజీనామా చేశారు.ఎమ్మెల్యే పదవి కూడా వదలుకుని తిరిగి టిఆర్ఎస్ పక్షాన ఉప ఎన్నిక లో నెగ్గారు. ✍️రాష్ట్ర విభజన తర్వాత 2014లో గెలిచి కేసీఆర్ క్యాబినెట్ లో మంత్రి అయ్యారు.2018 లో ఓటమి చెందారు.కొంతకాలం క్రితం టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి, కాంగ్రెస్ లో చేరి 2023లో గెలిచి మంత్రి అయ్యారు.మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు 1999 లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2004,2009లలో కూడా గెలిచారు. ఉమ్మడి ఎపిలో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో సభ్యుడుగా ఉంటూ చివరిలో మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2018,2023 లలో గెలుపొంది, రేవంత్ క్యాబినెట్ లో మంత్రి అయ్యారు. పొన్నం ప్రభాకర్ సీనియర్ నేత గతంలో ఎమ్.పిగా ఎన్నికయ్యారు.ప్రస్తుతం మొదటిసారిగా ఎమ్మెల్యే అయి మంత్రి పదవి పొందారు. అలాగే మరో మాజీ ఎమ్.పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా తొలిసారి ఎమ్మెల్యే అయి మంత్రి పదవి పొందారు. ✍️తొలుత టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సీతక్క తదుపరి కాంగ్రెస్ నుంచి రెండుసార్లు గెలిచి రేవంత్ ప్రభుత్వంలో మంత్రి పదవి పొందారు. రేవంత్ తో పాటు ఉత్తంకుమార్, వెంకటరెడ్డి, పొంగులేటిలు రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు. తుమ్మల నాగేశ్వరరావు కమ్మ వర్గం అయితే, ఎస్సిల నుంచి మల్లు భట్టి,దామోదర రాజనరసింహ, ఎస్టీల నుంచి సీతక్క, బీసీ వర్గాల నుంచి పొన్నం ప్రభాకర్ (గౌడ), కొండా సురేఖ (పద్మశాలి) పదవులు పొందారు. ✍️దుద్దిళ్ల శ్రీధర్ బాబు బ్రాహ్మణవర్గం కాగా, జూపల్లె కృష్ణారావు వెలమ సామాజికవర్గం వారు. రేవంత్, తుమ్మల, సీతక్కలు టీడీపీ మూలాలు కలిగినవారైతే, ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్లుభట్టి, దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్ , శ్రీధర్ బాబులు పూర్తిగా కాంగ్రెస్‌లోనే ఉన్నారు. కొండా సురేఖ కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, టీఆర్ఎస్లలో కూడా ఉన్నారు. జూపల్లె కృష్ణారావు కాంగ్రెస్ మూలం కలిగిన నేతే అయినా తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్లోకి వెళ్లారు. పొంగులేటి వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీగా ఎన్నికై తదుపరి టీఆర్ఎస్లో చేరి అనంతరం కాంగ్రెస్ లోకి వచ్చారు. ఎన్నికలకు ముందు తుమ్మల, పొంగులేటి,జూపల్లె లు కాంగ్రెస్ లోకి వచ్చి మంత్రులు అవడం విశేషం. వాస్తవం చెప్పాలంటే ఒక్క తుమ్మలకు తప్ప మిగిలినవారెవరికి మంత్రులుగా విశేష అనుభవం లేదనే అనుకోవాలి. వారందరికి ఇది పరీక్ష సమయం. తమ ,తమ శాఖలను పూర్తిగా అధ్యయనం చేసి , బాధ్యతలను నిర్వర్తించవలసి ఉంటుంది. :::కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డికే పట్టం
Telangana CM Announcement Live Updates 9న తెలంగాణ కాంగ్రెస్ కృతజ్ఞత సభ డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ కృతజ్ఞత సభ అధికారం కట్టబెట్టిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞత తెలియజేయనున్న కాంగ్రెస్ అంతకు ముందే కొలువు దీరనున్న తెలంగాణ కేబినెట్ డిసెంబర్ 7వ తేదీనే ప్రమాణం చేయనున్న రేవంత్‌రెడ్డి రేవంత్‌తో పాటు మరికొందరు మంత్రులుగా కూడా! ఆరు గ్యారెంటీలపై కృతజ్ఞత సభలో కీలక ప్రకటన చేసే అవకాశం సీనియర్లు సీఎం పదవి ఆశించడం సహజం: పొన్నం కామెంట్స్ హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ సీఎం పదవిని సీనియర్లు ఆశించడం సహజం పార్టీ అధిష్టాన నిర్ణయానికే కట్టుబడి ఉంటాం ఎన్నికైన ఎమ్మెల్యేలమంతా ఏకవాక్య తీర్మానంతో సీఎం అభ్యర్థి నిర్ణయించే అధికారం అధిష్టానానికి అప్పగించాం అధిష్టాన నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటే కొందరు రాజకీయం చేస్తున్నారు కాంగ్రెస్ లో అప్పుడే డిల్లీ నిర్ణయాలు మొదలయ్యాయని ప్రచారం చేశారు ఏనాడైనా కేసిఆర్ ను ఇలా ప్రశ్నించారా? కేసిఆర్ బీసీలను ఎప్పుడు పట్టించుకోలేదు రేవంత్ రెడ్డిని సీఎంగా నిర్ణయించడం స్వాగతిస్తున్నాం. 7న సీఎంతో పాటు పూర్తిస్థాయి మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఉంటుంది. మంత్రివర్గంలో నాకు చోటు దక్కొచ్చని అనుకుంటున్నా రేవంత్‌రెడ్డికి ప్రముఖుల శుభాకాంక్షలు తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రముఖుల స్పందన సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షల వెల్లువ శుభాకాంక్షలు తెలియజేసిన సీనియర్ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రేవంత్‌కు శుభాకాంక్షలు తెలియజేసిన బండ్ల గణేష్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమితులైన మా నాయకుడు, నిరంతరం నా శ్రేయస్సును కోరుకునే మా అన్న *శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి* 💐గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. @revanth_anumula @INCTelangana pic.twitter.com/M7K2QSPliJ — BANDLA GANESH. (@ganeshbandla) December 5, 2023 రేవంత్‌తో చర్చించాకే మంత్రివర్గ కూర్పు తెలంగాణ మంత్రి వర్గ కూర్పుపై దృష్టిసారించిన కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరిన రేవంత్‌రెడ్డి ఎల్లుండి ప్రమాణ స్వీకారానికి అగ్రనేతల్ని వ్యక్తిగతంగా ఆహ్వానించనున్న రేవంత్ రేపు కూడా ఢిల్లీలోనే రేవంత్? రేవంత్‌తో చర్చించాకే మంత్రి వర్గం కూర్పును ఖరారు చేయనున్న హైకమాండ్ కాంగ్రెస్ అధిష్టానం కనుసన్నల్లోనే కీలక పదవులు, నిర్ణయాలు మా రేవంత్ పటేల్ ఇక సీఎం: కొండారెడ్డిపల్లి గ్రామస్తులు సీఎంగా రేవంత్‌రెడ్డి పేరు ప్రకటన తర్వాత కొండారెడ్డిపల్లి గ్రామంలో సంబురాలు ఢిల్లీకి రాజు అయినా.. తల్లికి కొడుకే: గ్రామస్తులు రేవంత్ అప్పటికీ.. ఇప్పటికీ మా మంచి పటేల్ : గ్రామస్తులు ఇకపై మా ఊరు కొండారెడ్డిపల్లి కాదు.. సీఎం ఊరు: గ్రామస్తులు ఎప్పుడు ఊరికి వచ్చినా ఆప్యాయంగా పలకరిస్తారు: గ్రామస్తులు అందరికీ ధన్యవాదాలు: రేవంత్‌రెడ్డి అందరికీ ధన్యవాదాలు తెలిపిన రేవంత్‌రెడ్డి సీఎల్పీ నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు ఎంపిక చేసిన ఖర్గేకు కృతజ్ఞతలు పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు ధన్యవాదాలు నాకు మద్దతుగా నిలిచిన సోనియా, రాహుల్, ప్రియాంకలకు ధన్యవాదాలు మద్ధతుగా నిలిచిన కాంగ్రెస్ పెద్దలందరికీ ధన్యవాదాలు పాలమూరు గడ్డ నుంచి మరో సీఎం తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి రేవంత్ సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్‌నగర్ గతంలో హైదరాబాద్ స్టేట్‌కు సీఎం(రెండో, ఆఖరి కూడా..)గా పని చేసిన బూర్గుల రామకృష్ణారావు బూర్గుల స్వస్థలం కల్వకుర్తి(ఉమ్మడి మహబూబ్‌నగర్) పాలమూరు నుంచి రెండో సీఎంగా ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారానికి అగ్రనేతలకు ఆహ్వానం తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేయనున్న రేవంత్ ఎల్లుండి డిసెంబర్ 7వ తేదీన సీఎంగా ప్రమాణం సోనియా, ఖర్గే, రాహుల్ గాంధీలతో పాటు పలువురు ఏఐసీసీ నేతలకు రేవంత్ ఆహ్వానం రేవంత్ రెడ్డి గురించి.. 1969 నవంబరు 8న జననం అనుముల రేవంత్‌రెడ్డి స్వస్థలం నాగర్‌కర్నూల్(ప్రస్తుతం.. పూర్వపు మహబూబ్‌నగర్) జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామం విద్యార్థి దశలో ఏబీవీపీతో అనుబంధం 2006లో మిడ్జిల్ మండలం జడ్పీటీసి సభ్యుడుగా విజయం 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నిక 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపు 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ 2014–17 మధ్య టీడీఎల్పీ ఫ్లోర్ లీడర్ 2017 అక్టోబరులో టీడీపీకి రాజీనామా 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరిక 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ 2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి ఓటమి 2019 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం 2021లో జూన్ 26న పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ 2021 జూలై 7న టీపీసీపీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం 2023 డిసెంబర్ 3.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొండగల్ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక, కామారెడ్డి నుంచి ఓటమి 2023 డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ పేరు ప్రకటించిన కేసీ వేణుగోపాల్ 2023 డిసెంబర్ 7న తెలంగాణ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేయనున్న రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అధికారికంగా ప్రకటించిన కాంగ్రెస్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఎల్లుండి సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం రేవంత్ నివాసం దగ్గర భద్రత పెంపు సీఎల్పీ నేతగా రేవంత్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కొత్త సీఎల్పీ నేత ఎంపికపై నిన్న భేటీ జరిగింది: కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ విజయం అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం ఢిల్లీ రావాలని రేవంత్‌రెడ్డికి అధిష్టానం పిలుపు అధిష్టానం పిలుపుతో ఢిల్లీ బయల్దేరిన రేవంత్‌రెడ్డి కాసేపట్లో కేసీ వేణుగోపాల్ ప్రెస్‌మీట్ ఢిల్లీలో ముగిసిన భేటీ ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ ముగిసిన భేటీ భట్టి, ఉత్తమ్లతో చర్చలు జరిపిన అధిష్టానం చర్చకు హాజరైన డీకే శివకుమార్, మాణిక్‌రావ్ థాక్రే సీఎం అభ్యర్థి ఎంపికతో పాటు కేబినెట్ కూర్పు పైనా చర్చా? అధిష్టాన నిర్ణయంపై ఉత్కంఠ తెలంగాణ సీఎం అభ్యర్థి ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్స్ రేవంత్‌రెడ్డితో సీపీఐ నేతలు భేటీ హోటల్ ఎల్లాలో రేవంత్‌రెడ్డితో సీపీఐ నేతలు నారాయణ, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు భేటీ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యాం: కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండటంతో అభినందనలు తెలిపాం మంత్రివర్గంలో సీపీఐ చేరడం లేదు కాంగ్రెస్ ఎవరిని సీఎం అభ్యర్థిగా ప్రకటించిన వారికే మా ఓటు సీఎం ఫలానా వ్యక్తి కావాలని సీపీఐ కోరుకోవడం లేదు సీఎం ఎవరనేది నిర్ణయించేది కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్ ప్రభుత్వానికి కామారెడ్డి ఎమ్మెల్యే హెచ్చరిక ఏడాదికోసారి రేషన్, పింఛన్లను అప్డేట్ చేయాల్సిందే: బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కామారెడ్డిలో అవినీతి రహిత పాలన అందిస్తా ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తా కామారెడ్డిని అభివృద్ధి దిశగా తీసుకెళ్తా విజయం అందించిన ప్రజలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు ఢిల్లీ: కేసీ వేణుగోపాల్ నివాసంలో కీలక భేటీ ►కేసీ వేణుగోపాల్‌తో డీకే శివకుమార్, థాక్రే, భట్టి విక్రమార్క సమావేశం కాంగ్రెస్‌లోనే ఉన్నా.. బయటి నుంచి రాలేదు: ఉత్తమ్ పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీకి వచ్చాను కాంగ్రెస్ పెద్దలను కలిసి చెప్పాల్సింది చెప్పాను ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను మొదటి నుంచి కాంగ్రెస్‌లోనే ఉన్నా పార్టీని ఎప్పుడూ వీడలేదు.. బయటి నుంచి రాలేదు నేనూ నా భార్య ఎప్పుడూ క్షేత్రస్థాయిలో పని చేస్తుంటాం నాకిచ్చిన పనిని సమర్థవంతంగా చేస్తుంటా ప్రతీ ఎన్నికలకు ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి నేను టీపీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు బీఆర్ఎస్పై ఇంత ప్రజా వ్యతిరేకత లేదు ఇప్పుడు బాగా పెరిగింది అందుకే ఈ ఎన్నికల్లో 70 సీట్ల దాకా వస్తాయి అనుకున్నాం కానీ, 64 దగ్గరే ఆగిపోవడం నిరాశపర్చింది తెలంగాణ ప్రజల్లో గాంధీ కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది ఏది ఏమైనా పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తాం మీడియాతో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలు సీఎం పదవిపై శ్రీధర్‌బాబు కామెంట్స్ గెలిచిన 64 మందిలో ఎవరైనా సీఎం కావొచ్చు.. శ్రీధర్‌బాబు ఐదుసార్లు నెగ్గాను కానీ, సీఎం అభ్యర్థి విషయం లో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ ►రేవంత్ రెడ్డిని సీఎం చేయాలంటూ హోటల్ ఎల్లా ముందు పెట్రోల్ పోసుకుని ఓయూ విద్యార్థి నేత ప్రతాప్ రెడ్డి ఆత్మహత్యాయత్నం హోటల్ ఎల్లాకు చేరుకున్న సీపీఐ నారాయణ, చాడ వెంకట్ రెడ్డి రేవంత్ రెడ్డితో భేటీ కానున్న సీపీఐ నేతలు.. కాసేపట్లో హైదరాబాద్ బయలుదేరనున్న డీకే తెలంగాణ సీఎం అభ్యర్థి ఎంపికపై ముగిసిన కసరత్తు మల్లికార్జున ఖర్గే నివాసం నుంచి బయటికి వచ్చిన డీకే శివకుమార్ , మాణిక్ రావ్ థాకరే అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థిని సీల్డ్ కవర్లో తీసుకెళ్తున్న డీకే సాయంత్రం హైదరాబాద్‌లో సీఎల్పీ సమావేశంలో అధిష్టానం నిర్ణయాన్ని వెల్లడించనున్న డీకే ఢిల్లీలో తెలంగాణ రాజకీయాలు కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రుల పంచాయతీ మేమంటే మేము సీఎం అంటున్న సీనియర్ నేతలు రేసులో ఉన్నామంటున్న భట్టి, ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు ఇప్పటికే డీకే , ఠాక్రే తో విడివిడిగా భేటీ అయిన సీనియర్ నేతలు ఢిల్లీ పెద్దలతో లాబీయింగ్ నిర్వహిస్తున్న భట్టి, ఉత్తమ్, శ్రీధర్ బాబు ప్రతి పేదవాడి గుండె తాకిన క్షణాలు... గుండె నిండా ఆత్మ స్థైర్యం, కుంగిపోతున్న జీవితాలకు ఈ అరాచక పాలన నుండి విముక్తి ఇవ్వాలన్న లక్ష్యం, నైరాశ్యం లో ఉన్న క్షేత్ర స్థాయి కాంగ్రెస్స్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాలన్న ఆశ.. ఇవే నా పాదయాత్రకు ఆయువు పోసి నడిపించాయి. దట్టమైన గుట్టలు,… pic.twitter.com/lcgP3kbFUm — Bhatti Vikramarka Mallu (@BhattiCLP) December 5, 2023 రేవంత్‌ను సీఎం చేయాలంటూ నినాదాలు గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లా వద్ద కార్యకర్తల హంగామా హోటల్లోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేసిన కార్యకర్తలు ఆందోళన చేసిన కార్యకర్తలను నిలువరించి బయటికి పంపించిన పోలీసులు రేవంత్ పేరు ఖరారు..? ఖర్గే నివాసంలో ముగిసిన సమావేశం బయటికి వచ్చిన రాహుల్ గాంధీ సీఎం పదవికి రేవంత్ పేరు ఫైనల్ అయిందని ప్రచారం కాసేపట్లో అధికారిక ప్రకటన ఢిల్లీలో కొనసాగుతున్న డీకేఎస్, ఖర్గే భేటీ కాసేపట్లో సీఎం ఫైనల్ అయ్యే అవకాశం భేటీలో పాల్గొన్న రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, ఠాక్రే ప్రత్యేక నివేదిక అందించిన డీకే శివకుమార్ ఢిల్లీలో వరుస సమావేశాలు ఖర్గే నివాసానికి రాహుల్, కేసీ వేణుగోపాల్ డీకేతో సమావేశమైన ఉత్తమ్, భట్టి కాసేపట్లో ఖర్గేతో భేటీ కానున్న డీకే శివకుమార్ కాసేపట్లో ఖర్గేతో డీకేఎస్, ఠాక్రే భేటీ ఏఐసీసీచీఫ్తో భేటీ అవనున్న డీకేఎస్, ఠాక్రే భేటీ సీఎం పదవిపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ డీకేఎస్‌తో ఉత్తమ్ భేటీ డీకే శివకుమార్‌తో ఉత్తమ్ కుమార్ భేటీ కాసేపట్లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో డీకేఎస్ సమావేశం ఢిల్లీలోనే ఉన్న భట్టి విక్రమార్క ఢిల్లీలో ఉత్తమ్, భట్టి ఎంపీ పదవికి రిజైన్ చేయనున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ చేరుకున్న ఉత్తమ్‌కుమార్, భట్టి ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనేది నేడు నిర్ణయిస్తాం మల్లికార్జున ఖర్గే, ఏఐసిసి అధ్యక్షుడు మధ్యాహ్నం సీఎం పేరు వెల్లడి మధ్యాహ్నం సీల్డ్ కవర్‌తో హైదరాబాద్‌కు డీకే శివకుమార్ సీల్డ్ కవర్లో ముఖ్యమంత్రి పేరు సీఎం పదవిపై ఇవాళ సాయంత్రానికి సస్పెన్స్‌కు తెర ఢిల్లీకి బయలుదేరిన కాంగ్రెస్ సీనియర్లు ఢిల్లీకి బయలుదేరిన భట్టి విక్రమార్క ,ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్యాహ్నం ఖర్గేను కలవనున్న ఉత్తమ్ ,భట్టి 12 గంటలకు ఖర్గేతో డీకే శివకుమార్ భేటీ మధ్యాహ్నం 12 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో భేటీ కానున్న డీకే శివకుమార్ తెలంగాణ సీఎం అభ్యర్థి పై చర్చించనున్నఏఐసీసీ పరిశీలకులు ఖర్గేతో భేటీ తర్వాతే తదుపరి కార్యాచరణ కాంగ్రెస్ అధిష్టానం కోర్టులోకి సీఎం అభ్యర్థి ఎంపిక వ్యవహారం ఈ అధికారాన్ని ఏఐసీసీ అధ్యక్షుడికి కట్టబెడుతూ సీఎల్పీ ఏకవాక్య తీర్మానం డీకే శివకుమార్ పర్యవేక్షణలో హైదరాబాద్‌లో సమావేశం.. హాజరైన 64 మంది కొత్త ఎమ్మెల్యేలు అంతకుముందు డీకేతో భట్టి, ఉత్తమ్, దామోదర, రాజగోపాల్, శ్రీధర్‌బాబు, ప్రేమ్‌సాగర్‌రావు భేటీ హడావుడిగా వద్దని, అన్నీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి సీఎల్పీ భేటీ తర్వాత ఎమ్మెల్యేలతో విడివిడిగా మాట్లాడిన పరిశీలకులు ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలన్న దానిపై అభిప్రాయ సేకరణ అధిష్టానం ఎవరికి ఇచ్చినా ఓకే అన్న ఎమ్మెల్యేలు ఇంతలో ఢిల్లీకి రావాలంటూ డీకే టీమ్‌కు పిలుపు.. నేడు ఏఐసీసీ పెద్దలతో సమాలోచనలు ఢిల్లీకి వెళ్లే ఆలోచనలో భట్టి, ఉత్తమ్, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి తెలంగాణ ఎన్నికల పరిశీలకుడు డీకే శివకుమార్‌తో పాలు నలుగురు పరిశీలకులు కూడా ఢిల్లీకి సీఎం ఎంపికపై నిర్ణయం.. తర్వాత సీఎల్పీ భేటీలో లాంఛనంగా ఆమోదం సీఎం ఎవరైతే బాగుంటుంది? ఏఐసీసీ పరిశీలకులు సీఎల్పీ సమావేశం తర్వాత ఎమ్మెల్యేలందరితో విడివిడిగా సమావేశమై.. సీఎం ఎవరైతే బాగుంటుందన్న అభిప్రాయాలు ఈ క్రమంలో కొందరు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ పేరు చెప్పగా, మరికొందరు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల పేర్లు తెరపైకి వచ్చాయి. ఇంకొందరు మాత్రం ఏఐసీసీ ఎవరిని ఎంపిక చేసినా తమకు సమ్మతమేనని చెప్పినట్టు సమాచారం. డీకే బృందం ఈ అభిప్రాయాలను వెంటనే ఢిల్లీకి చేరవేసింది. వాటిని హైకమాండ్ పరిశీలించి ఏం చెప్తుందోనని సాయంత్రం వరకు ఎదురుచూపులు ఆ కథనాల్ని నమ్మొద్దు: భట్టి ►హైదరాబాదులో సీఎల్పీ సమావేశం జరిగింది ►ఈ సమావేశంలో సీఎల్పీ నాయకుడి ఎంపికను పార్టీ అధిష్టానానికి అప్పగిస్తూ ఏక వాక్య తీర్మానం చేసి పంపించడం జరిగింది ►పార్టీ అధిష్టానం సిఎల్పీ నాయకుడిని ప్రకటిస్తుంది ►ప్రస్తుతం ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వివిధ కథనాలు ఊహాగానాలు మాత్రమే.. వాటిని ఎవరు నమ్మొద్దు. తేలేదాకా హోటల్లోనే.. ►హైదరాబాద్ ఎల్లా హోటల్ లోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే లు ►అదిష్టానం సీఎం అభ్యర్థి ని ప్రకటించే వరకు హోటల్ కే పరిమితం కానున్న ఎమ్మెల్యేలు ►అదిష్టానం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న ఎమ్మెల్యేలు ►డీకే శివకుమార్ ద్వారా నిర్ణయం వెల్లడించనున్న కాంగ్రెస్ అధిష్టానం ► అధిష్టానం చెంతక చేరడంతో సీఎం అభ్యర్థి ఉత్కంఠ వీడుతుందా? అనే అనుమానంలో కాంగ్రెస్ శ్రేణులు కాంగ్రెస్‌లో ఓ విధానం ఉంటుంది: మాణిక్యం ఠాగూర్ ►తెలంగాణ పరిణామాలపై AICC స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు మాణిక్యం ఠాగూర్ ►తెలంగాణ ఎమ్మెల్యేల అభిప్రాయం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు చేరింది ►రేపు ఖర్గే ఏఐసీసీ పరిశీలకులతో భేటీ అవుతారు ►సీఎం అభ్యర్థి ఎవరనేది ఆయనే ప్రకటిస్తారు ►కాంగ్రెస్‌లో ఓ విధానం ఉంటుంది ►సరైన అభ్యర్థినే సీఎంగా హైకమాండ్ ప్రకటిస్తుంది ‘తెలంగాణ సీఎం అభ్యర్థి’పై సోనియా చర్చ! ►కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ సమాశంలో తెలంగాణ సీఎం అభ్యర్థి పై నో చర్చ ►కానీ, ఆ తర్వాత సోనియా గాంధీ మరో సమావేశం ►ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయిన సోనియా ►తెలంగాణ ఫలితాలు, సీఎం అభ్యర్థిపై చర్చించిన సోనియా -
తెలంగాణ సీఎం ఎవరు?.. అప్డేట్స్
లైవ్ అప్డేట్స్.. ఎప్పటికప్పటి సమాచారం సీఎం ఎవరు.. ఓవర్ టు ఢిల్లీ ►తెలంగాణలో కాంగ్రెస్ మార్క్ రాజకీయం ►సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో తేలని పంచాయితీ ►ఎవరికి వారు పట్టు వీడని నేతలు ►మ్యూజికల్ చెయిర్ గేమ్‌ను తలపిస్తున్న టీ కాంగ్ నేతల వ్యవహారం ►ఢిల్లీకి వెళ్లే ఆలోచనలో భట్టి, ఉత్తమ్, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి ► తెలంగాణ ఎన్నికల పరిశీలకుడు డీకే శివకుమార్‌తో పాలు నలుగురు పరిశీలకులు కూడా ఢిల్లీకి ఆ కథనాల్ని నమ్మొద్దు: భట్టి ►హైదరాబాదులో సీఎల్పీ సమావేశం జరిగింది ►ఈ సమావేశంలో సీఎల్పీ నాయకుడి ఎంపికను పార్టీ అధిష్టానానికి అప్పగిస్తూ ఏక వాక్య తీర్మానం చేసి పంపించడం జరిగింది ►పార్టీ అధిష్టానం సిఎల్పీ నాయకుడిని ప్రకటిస్తుంది ►ప్రస్తుతం ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వివిధ కథనాలు ఊహాగానాలు మాత్రమే.. వాటిని ఎవరు నమ్మొద్దు. తేలేదాకా హోటల్లోనే.. ►హైదరాబాద్ ఎల్లా హోటల్ లోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే లు ►అదిష్టానం సీఎం అభ్యర్థి ని ప్రకటించే వరకు హోటల్ కే పరిమితం కానున్న ఎమ్మెల్యేలు ►అదిష్టానం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న ఎమ్మెల్యేలు ►రేపు డీకే శివకుమార్ ద్వారా నిర్ణయం వెల్లడించనున్న కాంగ్రెస్ అధిష్టానం ►రేపటితో సీఎం అభ్యర్థి ఉత్కంఠ వీడుతుందా? అనే అనుమానంలో కాంగ్రెస్ శ్రేణులు కేసీఆర్‌ను కలిసిన భద్రాచలం ఎమ్మెల్యే ►కేసీఆర్‌ను కలిసిన తెల్లం వెంకట్రావు ►కాంగ్రెస్‌లోకి మారతారంటూ ఉదయం నుంచి ప్రచారం ►సోషల్ మీడియా ప్రచారాన్ని ఖండించిన తెల్లం ►సాయంత్రం ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్ వెళ్లి కేసీఆర్‌తో భేటీ కాంగ్రెస్‌లో ఓ విధానం ఉంటుంది: మాణిక్యం ఠాగూర్ ►తెలంగాణ పరిణామాలపై AICC స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు మాణిక్యం ఠాగూర్ ►తెలంగాణ ఎమ్మెల్యేల అభిప్రాయం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు చేరింది ►రేపు ఖర్గే ఏఐసీసీ పరిశీలకులతో భేటీ అవుతారు ►సీఎం అభ్యర్థి ఎవరనేది ఆయనే ప్రకటిస్తారు ►కాంగ్రెస్‌లో ఓ విధానం ఉంటుంది ►సరైన అభ్యర్థినే సీఎంగా హైకమాండ్ ప్రకటిస్తుంది ‘తెలంగాణ సీఎం అభ్యర్థి’పై సోనియా చర్చ! ►కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ సమాశంలో తెలంగాణ సీఎం అభ్యర్థి పై నో చర్చ ►కానీ, ఆ తర్వాత సోనియా గాంధీ మరో సమావేశం ►ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయిన సోనియా ►తెలంగాణ ఫలితాలు, సీఎం అభ్యర్థిపై చర్చించిన సోనియా ►రేపు డీకే శివకుమార్, ఇతర పరిశీలకుతో చర్చించనున్న ఖర్గే ► నిర్ణయాన్ని డీకేఎస్ ద్వారా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పంపనున్న హైకమాండ్ రేపు జనగామకు మాజీ సీఎం కేసీఆర్! ►రేపు జనగామకు వెళ్లనున్న మాజీ సీఎం కేసీఆర్ ►బీఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం ►సంతాప ప్రకటన వెలువరించిన కేసీఆర్ ►తెలంగాణ ఉద్యమంలో తొలినాళ్ల నుంచి తన వెంట నడిచిన యువ నేత సంపత్ రెడ్డి మరణం బాధాకరమని కేసీఆర్ ఆవేదన ప్రమాణ స్వీకార ఏర్పాట్లు ఎవరిని అడిగి చేశారు? ►తెలంగాణ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై కాంగ్రెస్ సీనియర్ల గుస్సా ►సీఎం అభ్యర్థి ఎంపిక, ప్రమాణ స్వీకార ఏర్పాట్ల లీకులపైనా ఆగ్రహం ►ఎవరిని అడిగి ఏర్పాట్లు చేశారంటూ హైకమాండ్‌కు ఫిర్యాదు ఏం జరుగుతుందో చూద్దాం: కేసీఆర్ ►తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ►గెలిచిన ఎమ్మెల్యేలకు కేసీఆర్ శుభాకాంక్షలు ►ఇంకో నెల ప్రభుత్వంలో కొనసాగే అవకాశం ఉన్నా.. ప్రజా తీర్పుతో హుందాగా తప్పుకున్నాం ►కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం ►చూద్దాం ఏం జరుగుతుందో ►త్వరలో తెలంగాణ భవన్లో పార్టీ మీటింగ్ జరుపుదాం ►ఓటమిపై సమీక్ష జరుపుదాం ►శాసనసభ పక్ష నేతను ఎన్నుకుందాం తెలంగాణలో ముగిసిన ఎన్నికల కోడ్ ►తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023 నేపథ్యంతో ఎన్నికల కోడ్ ముగిసింది ►సోమవారం సాయంత్రంతో కోడ్ ముగిసినట్లు ఈసీ అధికారిక ప్రకటన చేసింది ►అక్టోబర్ 9వ తేదీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల ►ఆ మరుక్షణం నుంచే అమల్లోకి వచ్చిన కోడ్ ►డిసెంబర్ 5 వరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగించాలని ఈసీ నోటిఫికేషన్ ►తాజాగా.. ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో కోడ్ ముగిసినట్లు ప్రకటించిన ఎన్నికల సంఘం అబ్బే.. సీఎల్పీపై చర్చించలేదు: జైరాం రమేష్ ►సోనియా నివాసంలో జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ సమావేశంలో తెలంగాణ సీఎల్పీ అంశంపై చర్చ జరగలేదు ►డీకే శివకుమార్, ఇతర పరిశీలకులు ఢిల్లీ వస్తున్నారు ►పరిశీలకులతో చర్చించాల్సిన అవసరం ఉంది ►వాళ్ల అభిప్రాయం హైకమాండ్ తీసుకుంటుంది ►సీఎల్పీ ఖరారుపై రేపు నిర్ణయం తీసుకోవచ్చు ►మీడియాతో సీనియర్‌నేత జైరాం రమేష్ తెలంగాణ అడ్వొకేట్ జనరల్ రాజీనామా ►తెలంగాణ అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ రాజీనామా ►అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచందర్ రావు కూడా.. ►ఫాక్స్ ద్వారా రాజీనామాను పంపిన ఏజీ, ఏడీజీ ►ప్రభుత్వం మారడంతో.. రాజీనామా బాటలో మరికొందరు అధికారులు రాజ్‌భవన్ నుంచి వెళ్లిపోయిన.. ►రాజ్ భవన్ లో సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమ వాయిదా ►రాజ్ భవన్ నుంచి వెళ్లిపోయిన జీఏడీ, పోలీస్, ప్రోటోకాల్, ఐ అండ్ పీఆర్ అధికారులు రాజ్‌భవన్ వద్ద ‘సీఎం రేవంత్’ నినాదాలు ►సీఎల్పీ ఎవరనేది తేల్చని ఏఐసీసీ ►రేపటి వరకు కొనసాగనున్న ఉత్కంఠ ►సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా ►రాజ్‌భవన్ వద్ద నుంచి కాంగ్రెస్ శ్రేణుల్ని ఖాళీ చేయిస్తున్న పోలీసులు ►రాజ్ భవన్ ముందు కాంగ్రెస్ కార్యకర్తల హంగామా ►సీఎం రేవంత్ అంటూ రేవంత్ అభిమానుల నినాదాలు ►ఢిల్లీకి పయనమైన డీకే శివకుమార్ ►డీకేఎస్ వెంట భట్టి, దామోదర, ఉత్తమ్‌లు ►రేపు ఖర్గేతో భేటీ తర్వాతే సీఎం అభ్యర్థిపై అధికారిక ప్రకటన వంద కోట్ల ఖర్చుతో నన్ను ఓడించారు: దుర్గం చిన్నయ్య ►బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సంచలన వ్యాఖ్యలు ►కోట్లు కుమ్మరించి ఎమ్మెల్యేగా నెగ్గారంటూ గడ్డం వినోద్‌పై ఆరోపణలు ►గడ్డం కుటుంబం.. వేల కోట్ల రూపాయలు ఉన్న కుటుంబం ►నన్ను ఓడగొట్టడానికి కుట్ర చేసింది ►అధర్మంగా యుద్ధం చేసి నాపై గెలిచారు ►ఏడాది కాలంగా నాపై ఎన్నో అసత్య ప్రచారాలు తెరపైకి తెచ్చారు ►కుట్రలతో నన్ను దెబ్బ తీశారు ►డబ్బు మందు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేసి గెలిచారు ►బెల్లంపల్లిలో వంద కోట్లు ఖర్చు చేసి గెలిచారు ►నైతికంగా మేము గెలిచినాం. వాళ్లు గెలిచినా ఓడిపోయినట్టే! ►బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ వాళ్లు దాడులు చేస్తున్నారు.. ఆపకపోతే ఖబడ్దార్ సీఎల్పీ ఎంపిక వాయిదా? ►తెలంగాణ సీఎల్పీ నేత ఎంపిక వాయిదా ►ఢిల్లీకి పయనం అయిన కాంగ్రెస్ నేతలు ►రాజ్‌భవన్ వద్ద కాంగ్రెస్ శ్రేణుల్ని ఖాళీ చేయిస్తున్న పోలీసులు ►ఇవాళ రాత్రే సీఎం ప్రమాణం ఉంటుందని ఏర్పాట్లు చేసిన అధికారులు ►తాజా పరిణామాలతో కార్యక్రమం వాయిదా అయినట్లే! ►రేపు కీలక సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ►తెలంగాణ సీఎం ఎవరనే దానిపై కొనసాగనున్న సస్పెన్స్ ► తెలంగాణ గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ రాజీనామా ఇవాళ సీఎల్పీ నేత ప్రకటన లేనట్లే! ►కాంగ్రెస్ సీఎం అభ్యర్థి విషయంలో కొనసాగుతున్న సస్పెన్స్ ► ఢిల్లీకి తెలంగాణ ఎన్నికల కాంగ్రెస్ పరిశీలకుడు డీకే శివకుమార్ ►శివకుమార్‌తో పాటు మరో నలుగురు పరిశీలకులు కూడా? ►రేపు ఖర్గేతో ఏఐసీసీ పరిశీలకుల సమావేశం ►ఇవాళ సీఎల్పీ నేత ప్రకటన లేనట్లే! ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌కు గులాబీ నేతల క్యూ ►బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసేందుకు ఎమ్మెల్యేల క్యూ ►బీఆర్ఎస్ తరఫున ఎన్నికైన వాళ్లంతా ఒక్కొక్కరుగా కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి.. ►ఎమ్మెల్యేలతో పాటు నేతలు కూడా ►హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, గంగుల కమలాకర్, తులా ఉమ, మల్లారెడ్డి,కడియం శ్రీహరి, పద్మ దేవేందర్ రెడ్డి,జగదీష్ రెడ్డి,తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు,కేటీఆర్, సుదీర్ రెడ్డి,సత్యవతి రాధోడ్ ఎమ్మెల్సీ, మహమూద్ అలీ, రెడ్యానాయక్ తదితరులు కాసేపట్లో వీడనున్న ‘సీఎం’ ఉత్కంఠ? ►కొద్దిసేపట్లో సీఎం అభ్యర్థి ఎవరనేది ప్రకటించనున్న డీకే శివకుమార్ ►ఢిల్లీలో సోనియా నివాసంలో జరుగుతున్న పార్లమెంటరీ స్ట్రాటజీ మీటింగ్ ► ఈ సమావేశంలో తెలంగాణ సీఎం అభ్యర్థిని ఫైనల్ చేసే అవకాశం వినోద్ కుమార్ రాజీనామా ►రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవికి బోయినపల్లి వినోద్ కుమార్ రాజీనామా ►కిందటి ఏడాది బాధ్యతలు చేపట్టిన వినోద్ ►గత సార్వత్రిక ఎన్నికల్లో ఓడినా.. స్నేహపూర్వకంగా కేబినెట్ హోదాలో వినోద్‌కు కీలక పదవి అప్పజెప్పిన కేసీఆర్ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి వినోద్ ప్రతిపక్ష బాధ్యతను విజయవంతంగా పోషిస్తాం: కేటీఆర్ ►గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలకు అభినందనలు ►పదేళ్లలో బీఆర్ఎస్ అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టింది ►ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలు సాధించింది ►తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం ►ప్రతిపక్ష బాధ్యతను విజయవంతంగా నిర్వహిస్తాం తెలంగాణ సీఎం ఎవరనేది మరికాసేపట్లో.. ►సోనియా గాంధీ నివాసంలో పార్లమెంటరీ స్ట్రాటజీ మీటింగ్ ►తెలంగాణ సీఎం అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ►ఇప్పటికే గెలిచిన ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ నివేదిక పంపిన డీకేఎస్ ►ఢిల్లీ నుంచి సీఎల్పీ నేత ఎంపిక కోసం టీ కాంగ్రెస్ శ్రేణులు వెయిటింగ్ ►నిర్ణయం వెలువడగానే తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ప్రకటన ►ఆ వెంటనే రాజ్‌భవన్‌లో తెలంగాణ కొత్త సీఎం ప్రమాణం ►సీఎంతో పాటు పలువురు మంత్రులు కూడా?? తెలంగాణలో కొత్త శాసనసభ ►తెలంగాణలో మూడో శాసన సభ ఏర్పాటకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల ►పాత అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసిన రాజ్‌భవన్ ►ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ తమిళిసైకు సమర్పించిన సీఈవో వికాజ్‌రాజ్ ►119 మంది ఎమ్మెల్యేల ఎంపికను ధృవీకరించిన గవర్నర్ ►గవర్నర్ ఆమోదంతో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన ఎలక్షన్ కమిషన్ ►గెజిట్ ను గవర్నర్ కు అందించిన సీఈవో, ఈసీ ముఖ్య కార్యదర్శి ►అంతకు ముందు అసెంబ్లీ రద్దు ప్రతులను అందించిన అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచారి ► ఇక కొలువుదీరనున్న కొత్త శాసనసభ వరుస రాజీనామాలు ►తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత వరుస రాజీనామాలు ►బీఆర్ఎస్ ప్రభుత్వంలో పని చేసిన పలువురు అధికారులు కూడా ►ఇప్పటికే రకరకాల కార్పొరేషన్ల చైర్మన్ల రాజీనామా ► 15 మంది కార్పొరేషన్ చైర్మన్లు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు ►హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు ►పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే అభియోగం ►కౌంటింగ్ సందర్భంగా నిన్న పోలీసులతో వాగ్వాదం కొత్త సీఎం కోసం కొత్త కాన్వాయ్.. ►రాజ్ భవన్ వద్ద కొత్త సీఎం కోసం న్యూ కాన్వాయ్ ►రాజ్ భవన్ పక్కన దిల్కుషా వద్ద సిద్ధం చేసిన ప్రోటోకాల్ అధికారులు ►ఆరు కొత్త ఇన్నోవా వెహికిల్స్ రెఢీ చేసిన అధికారులు తమిళసై చేతికి నెగ్గిన ఎమ్మెల్యేల జాబితా.. ►రాజ్ భవన్ నుంచి వెళ్లిపోయిన సీఈఓ వికాస్ రాజ్ బృందం ►గవర్నర్ తమిళ్ సై కి రిజల్ట్ ను సమర్పించిన సీఈఓ ►గెలిచిన ఎమ్మెల్యేల పేర్లతో కూడిన జాబితాను అందించిన సీఈవో కొత్త ప్రభుత్వానికి సచివాలయం సిద్ధం ►ఛాంబర్లను సిద్ధం చేస్తున్న జీఏడీ శాఖ ►పాత బోర్డులను తొలగించిన అధికారులు ►ప్రభుత్వ సలహాదారుల కార్యాలయాలు ఖాళీ చేసిన సిబ్బంది ►కొత్త మంత్రులకు కొత్త సిబ్బంది కేటాయింపు ►గ్రౌండ్ ఫ్లోర్లో మీడియాకు ప్రత్యేక గది తెలంగాణ టాస్క్ ఫోర్స్ OSD రాధా కిషన్ రావు రాజీనామా ►మూడేళ్ల క్రితం ముగిసిన రాధాకిషన్ పదవీ కాలం ►టాస్క్ ఫోర్స్ లో ఎక్స్ టెన్సన్ మీద కొనసాగుతున్న రాధా కిషన్ రావు ►ప్రస్తుత ప్రభుత్వం ఓడిపోవడంతో నిర్ణయం? ►తన రాజీనామా ను ప్రభుత్వానికి పంపిన రాధా కిషన్ రావు కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు టెక్నికల్ క్లియరెన్స్ పనిలో గవర్నర్ ►గవర్నర్ తమిళిసైతో సీఈవో వికాస్ రాజ్ భేటీ ►గెలిచిన అభ్యర్థుల జాబితాను గవర్నర్ కి ఇచ్చిన వికాస్ రాజ్ ►రాజ్‌భవన్‌లోనే ఉన్న అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచారి ►ప్రస్తుత అసెంబ్లీ రద్దుకు టెక్నికల్ ఫార్మాలిటీస్ పూర్తి ►ఈ రాత్రికి కొత్త సీఎం ప్రమాణానికి రాజ్‌భవన్ లో ఏర్పాట్లు దాదాపు పూర్తి పార్టీ మారను: పాడి కౌశిక్‌రెడ్డి ►హుజూరాబాద్ నియోజక వర్గ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను ►హుజూరాబాద్ ను గొప్పగా అభివృద్ధి చేసుకుందాం ►నా పాత ఫోటో పెట్టీ రేవంత్ రెడ్డి నీ కలిసినట్టు దుష్ప్రచారం చేస్తున్నారు ►నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ గారితో కేసీఆర్ కుటుంబం తోనే ఉంట ►ఫేక్ ప్రచారాలను ఎవరు నమ్మొద్దు బీఆర్ఎస్ ఓటమిపై అసదుద్దీన్ ఒవైసీ ►రాజకీయాల్లో గెలుపోటములు సహజం ►ఓటమికి కారణాలు గుర్తించి బీఆర్ఎస్ సరి చేసుకుంటుంది ►కేటీఆర్, హరీష్‌రావులకు ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు అవకాశం దొరికింది. -
నూతన ప్రభుత్వానికో ప్రేమలేఖ!
ఎన్నికల్లో రాజకీయ పార్టీలు గెలుస్తాయా? లేదా ప్రజలు గెలుస్తారా? ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే రాబోయే ఐదేళ్ళు రాజకీయం, పౌరసమాజం మధ్య వైరుద్ధ్యాలు తలెత్తకుండా మరిన్ని విజయాలు సాధించవచ్చు. రాబోయే లోక్‌సభ, స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకోకపోతే దేశవ్యాప్త అపజయానికి దారి తీసినట్టే! ఓట్లు వేయించుకునేది రాజకీయ నాయకులు. వేసేది ప్రజలు. ఒక్కోసారి ఒక్క ఓటు కూడా ప్రభావం చూపుతుంది. అంతటి ప్రాధాన్యం ఓటుకు ఉంది. అందుకే ప్రజల పాత్రకు విలువ. పార్టీల జయాపజయాలను నిర్ణయించేది ప్రజలే! అటువంటి ప్రజలను విస్మరించిన పార్టీలకు అపజయం తప్పదు. తప్పటడుగులు వేస్తే, అధికారం హక్కుభుక్తమని విర్రవీగితే... ఇవాళ గెలిచిన పార్టీకి కూడా రేపు ఇదే పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే విజయానంతర పరిస్థితి రాబోయే విజయానికో, అపజయానికో భూమిక అవుతుంది. గతం నాస్తి కాదు. అది దారి దీపం. ఈ దీపం వెలుగుతూనే ఉండాలంటే సుపరిపాలన, ప్రజా దృక్పథం, జన సంక్షేమం అనే చమురు నిరంతరం పడుతుండాలి. తెలంగాణ ప్రజాకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజలతో పాటు నడిచిన నాయకత్వానికి ప్రజలు అండదండలు అందించారు. 1200 మంది బలిదానాల పునాది మీద అధికారం చేజిక్కించుకుని వారి పాత్రను, ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ లాంటి అనేకమంది పాత్రను కావాలని విస్మరించి తామే తమ కుటుంబం త్యాగాలతో రాష్ట్రాన్ని సాధించామని విర్రవీగుతూ ప్రజలనూ, పౌర సమాజాన్నీ అవమానించినందుకు నిశ్శబ్ద నిరసనే తాజా తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాల సరళిగా భావించాలి. గమనిస్తే... ఏక కుటుంబ పాలన తెలంగాణ ప్రజలను అసహ్యించుకునేలా చేసింది. అంతేకాదు. తాము చేసిన ప్రతి తప్పునూ ఆ నలుగురు మైకుల ముందు, పత్రికా ప్రకటనల రూపంలో ఊదరగొట్టడం అసహ్యించుకున్నారు. అలాంటి ధోరణికి దూరంగా ఉండాలి. తాము చెప్పిందే వేదం, చేసిందే చట్టం అన్నట్టుగా విర్రవీగే తత్వం ప్రజలను దాదాపుగా ప్రతిఘటించేట్లుగా చేసింది. అయితే ఊరిలో దొర మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే తమను వ్యతిరేకించే వారు పుట్టి ఉండరు అని అనుకుంటారు. ప్రజలు కట్టిన డబ్బును పట్టుకొని... తమ సొంత డబ్బు ఇస్తున్నట్టుగా సంక్షేమ పథకాల పంపిణీలో ప్రతిబింబించింది. ఆ పథకాల గురించి వేల కోట్ల రూపాయల ప్రకటనలు గుప్పించడంలో కూడా తమ ఫోటోలు, వ్యక్తిగత ప్రచారాలు అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిసి కూడా వ్యక్తిగత అహంభావం వల్ల సవరించుకోలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటులో, తదనంతర పాలనలో... దళితుల, ఆదివాసీల, వెనకబడిన వర్గాల ప్రయోజనాలను నెరవేర్చాలి. ఎందుకంటే ఈ పదేళ్ళ పాలనలో వారు వంచించబడ్డారు. ముఖ్యమంత్రి పదవి ఇస్తానన్న దగ్గర నుండి, ‘దళిత బంధు’ స్కీమ్ వరకు అడుగడుగునా మోసగింపునకు గురయ్యారు. వోటు బ్యాంక్‌గా వారిని వాడుకున్నారు. దళితులలో గల రెండు ప్రధాన కుల సమాజాలను విడదీసి ఒక వర్గాన్నే చేరదీసిన ఫలితమే... ఎస్టీ నియోజకవర్గాలలో ఫలితాలు! అలాగే ఆదివాసుల బతుకులు ఆగమాగం చేయబడ్డాయి. ఆదివాసీ తెగల మధ్య వైషమ్యాలు తలెత్తినప్పుడు ఒక తెగ వైపే మద్దతునిచ్చి మిగతా 17 తెగ, ఉప తెగలను వంచించారు. పోలీసు, అటవీ శాఖల వంటివి వారిని అగౌరవపరిచాయి. వారి భూములను లాక్కున్నాయి. బతికే స్వేచ్ఛను హరించింది ప్రభుత్వం. నాలుగేళ్ల క్రితం అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీ నుండి అడవులకు వెళ్లి ప్రత్యక్ష పరిశీలన జరిపి పోడు సమస్యను పరిష్కరిస్తానని చెప్పిన అధినాయకుడు తీరా వారి గురించి మాట్లాడడం మరిచాడు. మేడారంలో జరిగే ‘సమ్మక్క – సారక్క’ జాతరకు వెళ్ళి మొక్కులు చెల్లించలేదు. అలాగే గోండుల ఆరాధ్య దైవం ‘నాగోబా’ జాతరకు కూడా వెళ్ళలేదు. తెలంగాణ వచ్చాక, అంతకు ముందు కన్నా వారి జీవితంలో ఎలాంటి మార్పూ లేదు. పైగా అవమానాలు పెరిగాయి. అందుకే ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో గులాబీ జెండా అవనతం అయింది. ఇతర ఆదివాసుల పేరుతో ఎన్నికల్లోనూ, సంక్షేమ పథకాల్లోనూ అన్యాయం జరిగింది. తెలంగాణ అస్తిత్వ చైతన్యం భావన మరింత పెరుగుతుంటే దాన్ని త్రుంచివేయడం జరిగింది. ప్రపంచ మహాసభల్లో వంద పైగా కోట్ల డబ్బు పంచుకున్నారే తప్ప భాషకూ, సంస్కృతికీ, సాహిత్యానికీ ఒరిగిందేమీ లేదు. భాషా సాంస్కృతిక శాఖ రాజకీయ నేతలకు ఊడిగం చేసింది. కోట్ల రూపాయలతో నిర్వహించిన కార్యక్రమాలు రాజకీయ నాయకుల ప్రాబల్యం పెంచుకోవడానికి పనికొచ్చాయి. ఏ ఒక్క ప్రజా కళారూపాన్నీ బతికించి దేశవ్యాప్త కీర్తినీ, వైభవాన్నీ చాటలేదు. పనికిరాని పుస్తకాలను అచ్చువేసి రాజకీయ నేతలకు ఉచితంగా పంచిపెట్టారే తప్ప ప్రజలలోకి తీసుకెళ్ళలేదు. వాటికోసం చేసిన ఖర్చు దుబారా చేశారు. ఎన్నో ప్రతులు పంచిపెట్టి ప్రజల సొమ్ముని పట్టపగలు దుర్వినియోగం చేశారు. ఈ దుర్వినియోగంపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. కొత్త ప్రభుత్వం ఇలాంటి విషయాల పట్ల జాగరూకత వహించాల్సి ఉంది. ప్రతి మూడేండ్లకో, ఎక్కువలో ఎక్కువ ఐదేండ్లకో అధికారుల, ఉద్యోగుల బదిలీలు జరగాల్సిందే! అలా జరపకపోవడం వల్ల ప్రజలకు న్యాయం జరగదు. ఒకేచోట తిష్ఠ వేసుకునే ఉద్యోగుల వల్ల ప్రజలు ఎనలేని కష్టాలు ఎదుర్కొన్నారు. ముఖ్యమంత్రే కాదు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో ఒకరోజు ప్రజా దర్బారు ఏర్పాటు చేయాల్సిందే! ముఖ్యంగా కలెక్టర్లు కూడా! పౌర సమాజాన్ని సంప్రదిస్తూ పోవాలె తప్ప మేమే గొప్ప అనే భావనను దూరం చేయకపోతే వ్యక్తిగత అహంభావం పెరిగి ప్రభుత్వానికి ప్రజలు దూరం అవుతారు. ‘ధరణి’ వంటి పాపాల పుట్ట పనిపట్టకపోతే చిన్న రైతు, చిన్న ఇళ్ళు కట్టుకునే వారికి న్యాయం జరగదు. ప్రగతి భవన్‌ను ప్రభుత్వాసుపత్రిగానో, ప్రజా కళల మ్యూజియంగానో మార్చాలి. నీటి ప్రాజెక్టులలో ఆర్థిక దుర్వినియోగాన్నీ, అలసత్వాన్నీ వెలికి తీయాలి. తెలంగాణ ప్రాధికార సంస్థను ఏర్పాటుచేసి ప్రొఫెసర్ కోదండరావ్‌ు వంటి వారి సలహా సూచనలనూ, రికమెండేషన్స్నూ అమల య్యేలా చూడాలి. ‘తెలంగాణ ఇచ్చింది మేమే’ అని చెప్పుకోవడం కాదు. ‘మాకు అధికారం వచ్చాక చూడండి... ఇంతలా అభివృద్ధి చేశాం’ అని చెప్పుకునే రీతిలో అభివృద్ధి జరగాలి. ఓట్లు ఏ ఒక్క కులం వారు వేస్తే ప్రభుత్వం గద్దెనెక్కలేదు. అన్ని కులాలకూ ప్రాతినిధ్యం కల్పించాలి. దొరల రాజ్యం పోయి పటేళ్ళ రాజ్యం వచ్చిందని అనుకోకుండా చూడాలి. పెనం మీంచి పొయ్యిలో పడ్డామని ప్రజలు అనుకొనే పరిస్థితి రాకూడదు. కర్నాటక, తెలంగాణల్లో లాగా కాంగ్రెస్ వస్తే ఇలా బాగుపడతాం అని అన్ని రాష్ట్రాల ప్రజలూ చెప్పుకోవాలి. తెలంగాణను దేశ ప్రజలు గర్వించే రీతిలో అభివృద్ధిపరచాలి. ప్రొ‘‘ జయధీర్ తిరుమలరావు – వ్యాసకర్త జానపద పరిశోధకుడు, సామాజికవేత్త, మొబైల్ – 9951942242 -
స్పెయిన్ ప్రధానిగా మళ్లీ పెడ్రో సాంచెజ్
మాడ్రిడ్: స్పెయిన్ ప్రధాని పీఠాన్ని సోషలిస్ట్ పార్టీకి చెందిన మరోసారి పెడ్రో సాంఛెజ్ అధిష్టించనున్నారు. గురువారం పార్లమెంట్లో జరిగిన ఓటింగ్‌లో 350 మందికి గాను 179 మంది ఎంపీలు ఆయనకు మద్దతు తెలిపారు. కేటలోనియా వేర్పాటు ఉద్యమ నేత చార్లెస్ పిడ్గెమాంట్కు క్షమాభిక్ష ప్రకటించేందుకు పెడ్రో సాంఛెజ్ అంగీకరించడం.. బదులుగా వేర్పాటువాద పార్టీలు ఆయన ప్రభుత్వంలో చేరేందుకు అంగీకరించడంతో మైనారిటీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. నూతన ప్రభుత్వంలో రెండు కేటలోనియా వేర్పాటువాద పార్టీలు సహా మొత్తం ఆరు చిన్న పార్టీలు భాగస్వాములు కానున్నాయి. జూలై 23న జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ దక్కలేదు. 2017లో స్పెయిన్ నుంచి విడిపోతున్నట్లు కేటలోనియా వేర్పాటువాదులు ప్రకటించడంతో దేశంలో సంక్షోభం ఏర్పడింది. వేర్పాటువాద నేత చార్లెస్ పిడ్గెమాంట్ను ప్రభుత్వం నేరగాడిగా ప్రకటించింది. -
బిహార్ లో కొలువుతీరనున్న కొత్త ప్రభుత్వం
-
‘కుటుంబీకులు’ లేకుండా... లంక కొత్త కేబినెట్
కొలంబో: కనీవినీ ఎరగని ఆర్థిక సంక్షోభం, దేశవ్యాప్త నిరసనలతో సతమతమవుతున్న శ్రీలంకలో సోమవారం పాత ప్రధాని మహింద రాజపక్స సారథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మొత్తం 17 మందితో అధ్యక్షుడు గొటబయ రాజపక్స కొత్త కేబినెట్‌ను ఏర్పాటు చేశారు. సోదరుడు మహింద (72) మినహా కేబినెట్లో తమ కుటుంబీకులెవరూ లేకుండా జాగ్రత్త పడ్డారు. గత మంత్రివర్గంలో సభ్యులైన మరో సోదరుడు చమల్, మహింద కుమారుడు నమల్, అల్లుడు శశీంద్ర తదితరులను పక్కన పెట్టారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు, ప్రధాని విడివిడిగా జాతినుద్దేశించి మాట్లాడారు. సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుని వ్యవస్థలో సమూల మార్పు తీసుకొస్తామని గొటబయ ధీమా వెలిబుచ్చారు. స్వచ్ఛమైన, సమర్థమైన పాలన అందించేందుకు సహకరించాల్సిందిగా మహింద కోరారు. మరోవైపు అధ్యక్షుడు రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా నిరసనల హోరు కొనసాగుతూనే ఉంది. సోమవారం నుంచి వారంపాటు నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ కార్యకలాపాలను కూడా సస్పెండ్ చేశారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు సోమవారం నుంచి మరింత పెరిగాయి. సంక్షోభం నేపథ్యంలో మార్చి నుంచి శ్రీలంక రూపాయి విలువ 60 శాతానికి పైగా పడిపోయింది. -
'బల్జిత్ కౌర్ అనే నేను'.. పంజాబ్‌లో ఏకైక మహిళా మంత్రి
పంజాబ్‌లో కొత్తగా ఏర్పడిన ‘ఆప్’ సర్కార్ మంత్రివర్గంలోని ఏకైక మహిళ బల్జిత్‌కౌర్. మలౌత్ నియోజకవర్గం నుంచి ఆమె తొలిసారిగా శాసనసభ్యురాలిగా ఎంపికయ్యారు. బల్జిత్ తండ్రి సాధుసింగ్ ఫరిద్కోట్ పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినప్పటికీ, ఆమె ఎప్పుడూ రాజకీయాలపై ఆసక్తి చూపలేదు. రాజకీయాల్లోకి వస్తానని ఊహించలేదు. అభ్యర్థుల ఎంపిక కోసం చేసిన విశ్లేషణలలో పార్టీ పెద్దలకు చాలామంది బల్జిత్ పేరు సూచించారు. అలా పార్టీ టికెట్ ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. దీంతో తాను చేస్తున్న డాక్టర్ ఉద్యోగాన్ని వదులుకున్నారు. ‘మంచి పనిచేశావు. తప్పకుండా గెలుస్తావు’ అని ప్రోత్సాహం ఇచ్చిన వారికంటే– ‘తొందరపడుతున్నావు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు మన చేతుల్లో ఉండవు’ అని వెనక్కిలాగిన వారే ఎక్కువ. ‘రెండు సార్లు వరుసగా గెలిచిన హర్‌ప్రీత్ సింగ్‌పై గెలవడం ఆషామాషీ ఏమీ కాదు’ అనేవారు సరేసరి. అయితే బల్జిత్‌కౌర్ అవేమీ పట్టించుకోలేదు. ‘ఒక్కసారి బరిలో దిగానంటే వెనక్కి చూసేది లేదు’ అనుకునే మనస్తత్వం కౌర్‌ది. ఆమె ఎక్కడ ఎన్నికల ప్రచారానికి వెళ్లినా, పార్టీ అభిమానులతో పాటు ఏ పార్టీ వారో తెలియని పేషెంట్లు కూడా వచ్చి తమ సమస్యలు చెప్పుకునేవారు. అంత బిజీషెడ్యూల్‌లోనూ వారితో ఓపికగా మాట్లాడేవారు కౌర్. ఎన్నికల సభలలో ఒకవైపు నేతలు ప్రసంగాలు సాగుతుండేవి. మరోవైపు బల్జిత్ పేషెంట్లతో మాట్లాడుతూ మందుల చిట్టీలు రాస్తున్న దృశ్యం సర్వసాధారణంగా కనిపించేది. కౌర్ ఎన్నికల ఉపన్యాసాల్లో స్త్రీసాధికారికతకు సంబంధించిన అంశాలు ఎక్కువగా వినిపించేవి. ‘రోగాలతోపాటు అవినీతిని రూపుమాపే డాక్టర్ వస్తున్నారు’ అనే నినాదం ఆకట్టుకుంది. ముక్త్సర్ ప్రభుత్వ ఆస్పత్రిలో బల్జిత్‌కౌర్ వైద్యురాలిగా పనిచేసిన సమయంలో ఆమెను ‘డాక్టర్ జీ’ లేదా ‘మేడమ్’ అని పిలిచే వారికంటే ‘అక్కా’ ‘అమ్మా’ అని ఆత్మీయంగా పిలిచేవారే ఎక్కువ. ఎందుకంటే బల్జిత్ తన బాధ్యత ‘కేవలం వైద్యచికిత్స మాత్రమే’ అని ఎప్పుడూ అనుకోలేదు. పేషెంట్లను ఆప్యాయంగా పలకరించేవారు. ఎవరికైనా డబ్బు అవసరం పడితే ఇచ్చేవారు. కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించేవారు. ముక్త్సర్ చుట్టుపక్కల అట్టారి, బుడిమల్, లంబీదాబీ....మొదలైన గ్రామాల నుంచి ఆస్పత్రికి పేషెంట్లు వచ్చేవారు. వారందరికీ బల్జిత్ పెద్దదిక్కు. ఒక ధైర్యం. అందుకే ఆమె శాసనసభ్యురాలిగా గెలిచినప్పుడు, ఆ గెలుపు అనేక గ్రామాల సంతోçషం అయింది. బల్జిత్కౌర్లో రచయిత్రి, కవయిత్రి కూడా ఉన్నారు. ఎండలో మెరిసే కొండల అందాన్ని, చెట్ల సోయగాన్ని, పిట్టల పాటల పరవశాన్ని కవితలుగా రాయడమే కాదు రకరకాల సామాజిక సమస్యలపై పత్రికలకు వ్యాసాలు రాయడం కూడా ఆమె అభిరుచి. ‘నాకు అప్పచెప్పిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తాను. ఒక మహిళగా, వైద్యురాలిగా స్త్రీ సంక్షేమం, మెరుగైన ఆరోగ్యవ్యవస్థ గురించి పనిచేస్తాను’ అంటున్నారు బల్జిత్‌కౌర్. -
సవాలుగా మారిన సారథ్యం!
జర్మనీ రాజకీయ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం ముగిసింది. మరో కొత్త అధ్యాయం మొదలైంది. పదహారేళ్ళ సుదీర్ఘకాలం తర్వాత జర్మనీకి కొత్త సారథి వచ్చారు. అనేక ఒడుదొడుకుల మధ్య 2005 నుంచి ఏకధాటిగా దేశాన్ని విజయవంతంగా ముందుకు నడిపిన ఏంజెలా మెర్కెల్ స్థానంలో ఓలఫ్ షాల్జ్ ప్రపంచ యుద్ధానంతర జర్మనీకి 9వ ఛాన్సలర్ అయ్యారు. సోషల్ డెమోక్రాట్ అయిన ఆయన కొద్ది నెలల క్రితం జరిగిన ఫెడరల్ ఎన్నికలలో తమ పార్టీకి స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించి, పెట్టారు. అటుపైన మరో రెండు పార్టీలతో సంకీర్ణ ఒప్పందం కుదుర్చుకొని, అలా మూడు పార్టీల కొత్త సంకీర్ణ ప్రభుత్వపు పగ్గాలు తీసుకున్నారు. ఐరోపాలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ జర్మనీని నవీకరించి, ప్రగతిపథంలో మరింత ముందుకు తీసుకుపోతామని సంకల్పం చెప్పుకున్నారు. షాల్జ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మధ్యేవాద వామపక్ష ‘సోషల్ డెమోక్రాటిక్ పార్టీ’ (ఎస్పీడీ), దానితో సైద్ధాంతిక వైరుద్ధ్యాలున్న ఉదారవాద ‘ఫ్రీ డెమోక్రాట్లు’ (ఎఫ్డీపీ), అలాగే ‘గ్రీన్స్’ – ఈ మూడూ తొలిసారిగా కలసి సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేస్తున్నాయి. వరుసగా ఆ 3 పార్టీల సాంప్రదాయిక రంగులు – ఎరుపు, పసుపు, ఆకుపచ్చ. అచ్చంగా ట్రాఫిక్ లైట్‌లోని వరుసలోనే పార్టీల రంగులూ ఉండడంతో, జర్మనీ రాజకీయాల్లో ఇది ‘ట్రాఫిక్ లైట్ సంకీర్ణం’గా పేరు తెచ్చుకుంది. ఈ మూడు పార్టీలూ కలిస్తే పార్లమెంటు దిగువ సభలో మంచి మెజారిటీ ఉంది. దాంతో, తమ 177 పేజీల సంకీర్ణ ఒప్పందానికి ఆమోద ముద్ర వేసుకొని, జనవరి మొదట్లో కొత్త ప్రభుత్వం కొలువు దీరనుంది. ఐరోపా ఖండంలో కొత్త సంబంధాలకు తెర తీయాలనీ, ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూనే, ఖండంలోకెల్లా అతిపెద్ద తమ ఆర్థికవ్యవస్థని డిజిటలీకరణతో పరుగులు తీయించాలనీ భావిస్తోంది. నిష్క్రమిస్తున్న ప్రభుత్వంలో మెర్కెల్ కింద దేశ వైస్ ఛాన్సలర్‌గా ఆర్థిక మంత్రిగా పనిచేసిన రాజకీయ అనుభవం షాల్జ్ సొంతం. కానీ మెర్కెల్‌ను మరిపించేలా చేయడం ఆయనకూ, ఆయన సర్కారుకీ అంత సులభమేమీ కాదు. ఈ నెల 8న పదవి నుంచి విరమించుకున్న మెర్కెల్ మరొక్క 10 రోజులు గనక కొనసాగి ఉంటే, తన రాజకీయ గురువు హెల్మట్ కోల్‌ను అధిగమించి, ప్రపంచ యుద్ధానంతరం అత్యధిక కాలం ఛాన్సలరనే రికార్డు సృష్టించి ఉండేవారు. జర్మనీకి అంతకాలం సారథ్యం వహించిన ఘనత మేడమ్ మెర్కెల్ది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో నిరంకుశవాదం పెచ్చరిల్లుతున్న సందర్భంలో తద్భిన్నంగా ఉదారవాద ప్రజాస్వామ్యపు దివిటీ ఎత్తిన నడత ఆమెది. ఇన్నేళ్ళ పదవీకాలంలో జర్మనీ, ఐరోపాలను అనేక సంక్షోభాల నుంచి గట్టెక్కించిన చరిత ఆమెది. సిరియా శరణార్థులను దేశంలోకి అనుమతించడం సహా అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న నిష్క్రమిస్తున్న ప్రభుత ఆమెది. ఆమె సర్కారు కన్జర్వేటివ్‌లు, ఎస్పీడీల భారీ సంకీర్ణం. మరో విడత దేశానికి సారథ్యం వహించాలని ఆమె కోరుకోలేదు. ఆమె తరువాత ఇప్పుడాయన పీఠమెక్కారు. మునుపటి అధినేత్రి మెర్కెల్‌కు పాలనా దక్షురాలిగా పేరున్నా, అనేక సమస్యలను ఆమె పరిష్కరించలేదని అభియోగం మోపేవారూ ఉన్నారు. సమస్యలను చాప కిందకు నెట్టేస్తూ, అప్పటికి ఏదోలా బండి నడిపిస్తూ వచ్చారని ఆమెను ఆక్షేపించే విమర్శకులూ ఉన్నారు. ఆమె తరువాత గద్దెనెక్కిన షాల్జ్ అనేక అంశాలపై కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని వారి అంచనా. అందుకే, పూర్వాశ్రమంలో లాయరైన షాల్జ్కు ఈ అధికార పీఠం పూలపాన్పు కాదు. కార్మిక, ఉపాధి చట్టాలలో నిపుణుడైన ఆయన ముందు అనేక తక్షణ సవాళ్ళున్నాయి. బ్రెగ్జిట్ తాలూకు పరిణామాల్లో ఐరోపా ఇప్పటికీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. బెలారస్‌తో ఐరోపా సమాజపు (ఈయూ) సరిహద్దులోనూ సమస్య ఉంది. ఇంకోపక్క అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసులు ఉండనే ఉన్నాయి. కరోనా మహమ్మారితో పోరాటానికి తక్షణమే అత్యధిక ప్రాధాన్య మిస్తామని షాల్జ్ ప్రకటించారు. అలాగే, సంకీర్ణ సర్కారు అనేక స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలూ పెట్టుకుంది. సంకీర్ణపు ఒప్పందం మేరకు పునర్వినియోగ ఇంధనాల వైపు విస్తరణ సాగించాల్సి ఉంది. కాలుష్యకారక బొగ్గు నుంచి దూరం జరగాల్సి ఉంది. కనీస వేతనాలు పెంచాల్సి ఉంది. అణువిద్యుత్‌కు దశల వారీగా దూరమవుతామన్న పదేళ్ళనాటి సర్కారీ నిర్ణయాన్ని కొనసాగించడమూ కొత్త పాలకులకు తలనొప్పే. ఇప్పటికే కర్బన ఉద్గారాలను అత్యధికంగా వెలువరిస్తూ, ఐరోపాలోకెల్లా విద్యుత్ ఛార్జీలు అధికమైన జర్మనీ అణువిద్యుత్ ఆసరా లేకుండా, దేశంలో కరెంటివ్వడమే కష్టం. అధికార భాగస్వాములైన ‘గ్రీన్స్’ అభిమతం మేరకు అకర్బనీకరణతో, హరిత ప్రస్థానం మరింత కష్టం. ఇక, విదేశాంగ విధానంలోనూ రష్యా, చైనాలతో వ్యవహారం నల్లేరుపై నడక కాబోదు. భారత్ సంగతికొస్తే, ఐరోపాలో అతి పెద్ద వాణిజ్య భాగస్వామి జర్మనీయే. మన దగ్గర ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)కీ అదే కీలకం. కాబట్టి, వాణిజ్యం, హరిత ధనసాయం, సరఫరా వ్యవస్థలపై కొత్త సర్కారు నిర్ణయాలు భారత్‌పై ప్రభావం చూపుతాయి. 1924లో బెర్లిన్‌లో తొలిసారి ట్రాఫిక్ లైట్ పెట్టినప్పుడు అది సరిగ్గా పనిచేస్తుందో, లేదోనని అనుమానించారు. ‘‘కానీ సరైన దిశలో, సురక్షితయానానికి అది తప్పనిసరని కాలగతిలో రుజువైంది’’ అని షాల్జ్ వందేళ్ళ క్రితం సంగతి గుర్తు చేశారు. అలాగే, తమ ‘ట్రాఫిక్ లైట్’ సంకీర్ణం సైతం జర్మనీ ప్రగతిలో అపూర్వ పాత్ర పోషిస్తుందని ఆయన ఆశిస్తున్నారు. ఆశయంగా పెట్టుకున్నారు. కొత్త సారథి ఆశలు నెరవేరితే, జర్మనీ కొత్త ప్రయాణంలో అది మరో సరికొత్త మజిలీ! -
ప్రమాణ స్వీకారోత్సవం రద్దు చేసిన తాలిబన్లు
కాబూల్: కొత్తగా ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వ ప్రమాణ స్వీకారాన్ని తాలిబన్లు రద్దు చేశారు. వనరులు, నిధుల వృ«థా నివారణకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. అమెరికాపై దాడులు జరిగిన 11 సెప్టెంబర్ నాడే అట్టహాసంగా తాత్కాలిక ప్రభుత్వ ప్రమాణస్వీకారోత్సవం నిర్వహించాలని తొలుత తాలిబన్లు భావించారు. ఇందుకోసం రష్యా, చైనా, ఖతార్, పాకిస్తాన్, ఇరాన్‌కు ఆహ్వానాలు కూడా పంపారు. కానీ అకస్మాత్తుగా ప్రమాణస్వీకారోత్సవ రద్దు నిర్ణయం ప్రకటించారు. ప్రమాణ స్వీకారోత్సవం లేకపోయినా ప్రభుత్వం ఏర్పడి పనిచేయడం ప్రారంభమైందని తాలిబన్ ప్రతినిధి ఇనాముల్లా సమంగని ప్రకటించారు. అయితే నిధుల వృథా నివారణ అనేది అసలు కారణం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాలిబన్ మిత్రుల ఒత్తిడి వల్లనే ఈ ఉత్సవాన్ని రద్దు చేశారని రష్యా న్యూస్ ఏజెన్సీ టాస్ తెలిపింది. 11న ప్రమాణ స్వీకారోత్సవం జరపడం అమానవీయమని, దాన్ని నిలిపివేయమని తాలిబన్లకు సలహా ఇవ్వాలని యూఎస్, నాటో దేశాలు ఖతార్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయని పేర్కొంది. దీనివల్ల అఫ్గాన్‌లో తాలిబన్ల పాలనను ప్రపంచ దేశాలు గుర్తించడం మరింత కఠినతరమవుతుందని హెచ్చరించినట్లు తెలిసింది. -
అధికార పీఠంపై తాలిబన్లు
అమెరికాపై ఉగ్రదాడి జరిగి మరో 4 రోజుల్లో రెండు దశాబ్దాలు పూర్తవుతుందనగా మంగళవారం తాలిబన్లు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సరిగ్గా అదే రోజు కాబూల్‌లో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నవారిలో ఒక మహిళపై తుపాకి గురిపెట్టిన తాలిబన్ దళ సభ్యుడి చిత్రం సామాజిక మాధ్యమాల్లో ప్రముఖంగా వైరల్ అయింది. తాలిబన్ల ఏలుబడి తీరుతెన్నులు ఎలా ఉంటాయో చెప్పే ప్రతీకాత్మక చిత్రం ఇది. ఆ మరుసటి రోజే మహిళల ధర్నాను చిత్రీకరించిన టెలి విజన్ పాత్రికేయులిద్దరిని ఒళ్లంతా నుజ్జు చేసిన చిత్రాలు బయటికొచ్చాయి. తాలిబన్లతో రహ స్యంగా రెండేళ్లక్రితం చర్చలు ప్రారంభం కావడానికి చాలా ముందు అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పారో ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. తాలిబన్లలో మంచివారు, చెడ్డవారు ఉన్నారని, మంచివారితో చర్చించి ఈ సమస్యకు పరిష్కారం కనుగొంటామని ఆయన అప్పట్లో ప్రకటించారు. తాజాగా కాబూల్‌లో కొలువుదీరిన ప్రభుత్వం అన్ని మంచి చెడ్డల్నీ గాలి కొదిలినట్టు కేబినెట్ కూర్పు చూస్తే అర్థమవుతుంది. 90వ దశకంలో అఫ్గాన్ అధికారాన్ని చేజిక్కిం చుకున్న తర్వాత ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో మాదిరే ఇప్పుడు కీలకమైన పదవులన్నీ ప్రధాన తెగ అయిన పష్తూన్లకు దక్కాయి. 33 మంది కేబినెట్లో ఒక ఉప ప్రధాని పదవి ఉజ్బెక్ తెగకు చెందిన వ్యక్తికి, సైనిక దళాల ప్రధానాధికారి పదవి తజిక్ తెగ నేతకు అప్పగించారు. తక్కినవారంతా పష్తూన్లే. అమెరికా కనుసన్నల్లో మొన్నటివరకూ నడిచిన సర్కారులో కీలక పదవులు అనుభవించిన హజారా తెగకు ఈసారి మొండిచేయి చూపారు. జనాభాలో అయిదోవంతు కంటే అధికంగా ఉన్న హజారాలు షియాలు. వారికి కూడా పదవులు కట్టబెట్టాలని ఇరాన్ ఎంతగా కోరినా సున్నీలైన తాలి బన్లు బేఖాతరు చేశారు. దేశంలో హజారాలు అందరికన్నా బాగా చదువుకున్నవారు. రాజకీ యంగా చురుగ్గా పనిచేస్తున్నవారు. తాలిబన్ల పాలనకు ఇకపై వీరినుంచి సహజంగానే సవాళ్లు ఎదురవుతాయి. మహిళలకు ప్రభుత్వంలో చోటేలేదు. ఈ సంగతలా ఉంచి అమెరికా, నాటో దళా లపై జరిగిన పలు ఉగ్ర దాడులకు కారకుడని అమెరికా బలంగా విశ్వసిస్తున్న సిరాజుద్దీన్ హక్కానీ దేశ ఆంతరంగిక భద్రతామంత్రి అయ్యాడు. ఇరవైయ్యేళ్లుగా అతన్ని అరెస్టు చేయడానికి అమెరికా ఎన్నో ప్రయత్నాలు చేసింది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడే సిరాజుద్దీన్ ఆచూకీ చెప్పినవారికి భారీ నజరానా ప్రకటించింది. ఆయన్ను ఆంతరంగిక మంత్రిని చేయడం ద్వారా... ఎన్నో అవమానాల మధ్య అఫ్గాన్ నుంచి నిష్క్రమించి, పరాభవంతో కుంగిపోయివున్న అమెరికాను మరింతగా దెబ్బతీసినట్టయింది. తాలిబన్లతో చర్చిస్తున్న క్రమంనుంచి వారు అల్ కాయిదాతో సంబంధాలు వదులుకుంటామని హామీ ఇచ్చారని అమెరికా చెబుతూ వచ్చింది. కానీ కుదరబోయే శాంతి ఒప్పందంపై తాలిబన్లు ఎప్పటికప్పుడు అల్ కాయిదాతో సంప్రదింపులు జరు పుతూనే వచ్చారు. పర్యవసానంగానే ఇప్పుడు ఆ సంస్థకు సన్నిహితుడైన సిరాజుద్దీన్‌కు కీలక పదవి దక్కింది. అమెరికా ప్రతినిధుల సభలో రిపబ్లికన్ పార్టీ కాకస్‌కు నేతృత్వం వహిస్తున్న కమిటీ అఫ్గాన్ ప్రభుత్వాన్ని ‘ఉగ్రవాదుల చేత, ఉగ్రవాదుల కోసం ఏర్పడిన ఉగ్రవాదుల ప్రభుత్వం’గా అభివర్ణిం చింది. అయితే ఈ దుస్థితికి ప్రధానంగా తామే కారకు లమని ఆ కమిటీ గ్రహించినట్టు లేదు. ఏ సాకు చెప్పుకున్నా అఫ్గాన్ దురాక్రమణ నిర్ణయం అత్యంత దారుణమైన, అనాగరికమైన చర్య అని అమెరికా గుర్తించాల్సివుంది. ఎలాంటి పాలన అవసరమో, ఎవరు అధికార పీఠంపై ఉండాలో నిర్ణయించుకోవాల్సింది అఫ్గాన్ పౌరులే తప్ప తాము కాదన్న ఇంగితం దానికి లేకపోయింది. తాలి బన్ మత ఛాందసవాదం ఆ దేశానికే కాక, మొత్తంగా మధ్య ఆసియాకు ముప్పు కలిగించేదే. కానీ దాని పుట్టుకకూ, విస్తరణకూ, అది బలంగా వేళ్లూనుకోవడానికీ తామే కారకులమని ఇప్పటికీ అమె రికా అంగీకరించడంలేదు. దురాక్రమించినప్పటి బాధ్యతారాహిత్యాన్నే నిష్క్రమణలోనూ ప్రదర్శిం చింది. మిత్ర కూటమి నాటోకు, అఫ్గాన్ సర్కారుకు సైతం తెలియకుండా తాలిబన్లతో అంగీకారా నికొచ్చింది. ఐక్యరాజ్యసమితి మొదలుకొని ఎన్నో ప్రపంచ వేదికలుండగా, అన్ని దేశాలనూ భాగ స్తులను చేయాల్సివుండగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంది. మతం ఏదైనా వ్యక్తిగత విశ్వాసాల పరిధిని దాటి పబ్లిక్‌లోకి వస్తే... అధికారంతో అంటకాగితే పర్యవసానాలెలా ఉంటాయో అన్ని దేశాల్లోనూ దశాబ్దాలుగా రుజువవుతూనే ఉంది. మన పొరు గున పాకిస్తాన్, నేపాల్, మయన్మార్, ఇంకా పశ్చిమాసియా, ఆఫ్రికా ఖండ దేశాలు మత ఛాందస వాదం ఉగ్రరూపం చూశాయి. చూస్తున్నాయి. పశు మాంసం తింటున్నారన్న సాకుతో తోటి మనుషు లను కొట్టి చంపిన ఉదంతాలు మన దేశంలో అనేకం జరిగాయి. రిపబ్లికన్ ఏలుబడి ఉన్న అమెరికా లోని టెక్సాస్ రాష్ట్రంలో తాజాగా అబార్షన్లను నిషేధించి, మహిళల హక్కులను కాలరాస్తున్న వైనం వెనుక క్రైస్తవ మత ఛాందసం దాగుంది. వాటి సంగతలావుంచి అఫ్గాన్‌లో తాలిబన్ల ఏలుబడితో అరాచకానికి తెరపడినట్టయిందని చైనా పరవశిస్తోంది. పాకిస్తాన్ సరేసరి. అది తాలిబన్ ప్రభు త్వంలో ఎవరుండాలో, ఉండకూడదో నిర్దేశిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ రెండు దేశాల ప్రభా వాన్నీ తగ్గించి తాలిబన్లనుంచి ముప్పు లేకుండా చూసుకోవటం మన దేశం ముందున్న ప్రధాన సవాలు. త్వరలో తజకిస్తాన్‌లో జరగబోయే షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ)లో ఈ విషయాన్ని లేవనెత్తడంతోపాటు ఇతర అంతర్జాతీయ వేదికలపైనా గట్టిగా ఒత్తిడి తీసుకురావాలి. -
ఉగ్రవాదులే పాలకులు..!
కాబూల్/పెషావర్/ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వంలో ఏకంగా 14 మంది ఉగ్రవాదులు ఉన్నారు. ఐక్యరాజ్యసవిుతికి చెందిన భద్రతా మండలి వారిని గతంలోనే టెర్రరిజం బ్లాక్‌లిస్టులో చేర్చింది. ఈ జాబితాలో నూతన ప్రధానమంత్రి ముల్లా మొహమ్మద్ హసన్ అఖుంద్‌తోపాటు ఇద్దరు ఉపప్రధానుల పేర్లు సైతం ఉండడం గమనార్హం. అఫ్గానిస్తాన్‌లోని కొత్త మంత్రివర్గంలో కరడుగట్టిన ఉగ్రవాదులు స్థానం దక్కించుకోవడం పట్ల అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అఫ్గాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి సిరాజుదీ్దన్ హక్కానీ అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రపడ్డారు. అతడి తలపై అమెరికా ప్రభుత్వం 10 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. సిరాజుదీ్దన్ హక్కానీ మామ ఖలీల్ హక్కానీ కాందిశీకుల సంక్షేమ మంత్రిగా నియమితులయ్యారు. రక్షణ శాఖ మంత్రి ముల్లా యాకూబ్, విదేశాంగ మంత్రి ముల్లా అమీర్ ఖాన్ ముత్తాఖీ, విదేశాంగ శాఖ సహాయ మంత్రి షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్టానిక్జాయ్ తదితరులను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి చెందిన శాంక్షన్స్ కమిటీ(తాలిబన్ శాంక్షన్స్ కమిటీ) గతంలోనే టెర్రరిజం బ్లాక్‌లిస్టులో చేర్చింది. పాకిస్తాన్ ఆర్మీలో కీలక మార్పులు పాక్ ప్రభుత్వం ఆ దేశ ఆర్మీలో కీలక మార్పులు చేసింది. ప్రస్తుతం నియంత్రణ రేఖ వెంట భద్రతా పరమైన విభాగాలను పర్యవేక్షిస్తున్న లెఫ్టినెంట్ జనరల్ అజర్ అబ్బాస్‌ను చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్‌గా నియమించింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తర్వాత రెండో ప్రాధాన్యం ఉన్న పోస్టు చీఫ్ జనరల్ స్టాఫ్ కావడం గమనార్హం. జనరల్ అబ్బాస్ బలూచ్ రెజిమెంట్‌కు చెందిన వ్యక్తి. ఇప్పటి వరకూ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్‌గా పని చేసిన లెఫ్టినెంట్ జనరల్ షషీర్ శంషాద్ మీర్జాను రావల్పిండిలోని 10 కార్ప్స్ కమాండర్‌గా పంపించారు. ఇంకోవైపు ముల్తాన్ కార్ప్స్ కమాండర్‌గా లెఫ్టినెంట్ జనరల్ ముహమ్మద్ ఛిరాగ్ హైదర్‌ను నియమించారు. తాలిబన్లకు చైనా ఆర్థిక సాయం అఫ్గానిస్తాన్‌కు 3.1 కోట్ల డాలర్ల ఆర్థిక సాయాన్ని చైనా ప్రకటించింది. అఫ్గాన్‌లో తాలిబన్లు ఏర్పరిచిన తాత్కాలిక ప్రభుత్వాన్ని స్వాగతించింది. అశాంతిని పోగొట్టి, శాంతిని నెలకొల్పే చర్యగా ప్రభుత్వ ఏర్పాటును అభివర్ణించింది. అఫ్గాన్‌కు ఆహార ధాన్యాలు, టీకాలు, మందులు ఇస్తామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఇ చెప్పినట్లు అధికారిక మీడియా వెల్లడించింది. ఇరాన్, తజకిస్తాన్, తుర్కుమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, చైనా విదేశాంగ మంత్రులతో పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఒక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి రష్యా హాజరు కాలేదు. అఫ్గానిస్తాన్ ప్రజలకు తొలి విడతలో 30 లక్షల టీకా డోసులు పంపుతామని వాంగ్ భరోసా ఇచ్చారు. చైనా విదేశాంగ ప్రతినిధి వాంగ్ వెంబిన్ మాట్లాడుతూ అఫ్గాన్ అంతర్గత వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోబోమని పేర్కొన్నారు. చైనా ఎప్పుడూ అఫ్గానిస్తాన్ సార్వ¿ౌమత్వాన్ని, స్వాతంత్య్రాన్ని గౌరవిస్తుందని చెప్పారు. పీహెచ్డీ, మాస్టర్స్ డిగ్రీలకు విలువ లేదు తాము పూర్తిగా మారిపోయామని, అఫ్గాన్ ప్రజలకు సుపరిపాలన అందిస్తామని నమ్మబలుకుతున్న తాలిబన్లు మరోవైపు తమ అసలు రూపాన్ని బయటపెట్టుకుంటున్నారు. పవిత్రమైన షరియా చట్టాల ప్రకా రమే అఫ్గానిస్తాన్ పరిపాలన, ప్రజా జీవనాన్ని నిర్దేశిస్తామని తాలిబన్ అగ్రనేత హైబ తుల్లా అఖుంద్జాదా స్పష్టం చేశారు. అఫ్గాన్ నూతన ఉన్నత విద్యాశాఖ మంత్రి షేక్ మోల్వీ నూరుల్లా మునీర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మా రాయి. ‘‘పీహెచ్డీ, మాస్టర్స్ డిగ్రీలకు పెద్దగా విలు వలేదు. ఇప్పుడు అధికారంలో ఉన్న తాలిబన్లు, ముల్లాలను చూడండి. వారిలో ఎవరికీ పీహెచ్డీ, మాస్టర్స్ డిగ్రీలు కాదు కదా కనీసం ఎంఏ, హైసూ్కల్ డిగ్రీలు కూడా లేవు. అయినప్పటికీ వారు ఉన్నత స్థాయికి చేరుకున్నారు’’ అని మునీర్ పేర్కొన్నారు. ప్రధాని మోదీతో నికొలాయ్ పాట్రుశేవ్ భేటీ న్యూఢిల్లీ: రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం భారత్‌కు చేరుకున్న రష్యా భద్రతా మండలి కార్యదర్శి నికొలాయ్ పాట్రుశేవ్ బుధవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. తామిద్దరం కీలకమైన అంశాలపై సంప్రదింపులు జరిపినట్లు మోదీ తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. -
అఫ్గాన్‌లో ప్రభుత్వ ఏర్పాటు మళ్లీ వాయిదా
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తాలిబన్లు చేస్తున్న కసరత్తు ఇంకా కొలిక్కి రాలేదు. అంతర్జాతీయ సమాజం ఆమోదం పొందేలా ప్రభుత్వాన్ని తీర్చిదిద్దే పనిలో ఉన్న తాలిబన్లు కొత్త ప్రభుత్వ ఏర్పాటును వచ్చే వారానికి వాయిదా వేశారు. ఈ విషయాన్ని ఆ ముఠా అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వెల్లడించారు. తాలిబన్ సహ వ్యవస్థాపకుడు, రాజకీయ విభాగం చీఫ్ ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ ప్రభుత్వాధినేతగా శనివారమే అఫ్గాన్‌లో ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉంది. కానీ, చర్చలు ఇంకా పూర్తి కాకపోవడంతో వచ్చే వారం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. ప్రపంచ దేశాల మద్దతు లభించేలా ప్రభుత్వాన్ని కూర్చే పనిలో ఉండడం వల్లే కొత్త ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం అవుతోందని తాలిబన్ చర్చల కమిటీ సభ్యుడు ఖలీల్ హక్కానీ చెప్పారు. తాలిబన్లకి ఇప్పటికే మద్దతు ప్రకటించిన జమైత్ ఏ ఇస్లామీ అఫ్గానిస్తాన్ చీఫ్, దేశ మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ సోదరుడైన గుల్బుద్దీన్ హెక్మత్యార్కు ప్రభుత్వంలో చోటు లభించనుంది. పంజ్ïÙర్లో కొనసాగుతున్న పోరాటం అఫ్గానిస్తాన్‌లో పంజ్ïÙర్ లోయ ఇంకా తాలిబన్ల వశం కాలేదు. శనివారం మళ్లీ ఇరు వర్గాల మధ్య పోరాటం మొదలైంది. ఇప్పటివరకు తాలిబన్ల కన్ను పడని పంజ్ïÙర్ను ఆక్రమించుకున్నట్టుగా శుక్రవారం వార్తలు వచ్చాయి. అయితే అవి కేవలం వదంతులేనని తేలింది. పంజ్ïÙర్ తమ స్వాధీనంలోకి వచి్చందని ఇప్పటివరకు తాలిబన్లు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. సోవియెట్ యూనియన్ ఆక్రమణలో ఉన్నప్పుడు, తాలిబన్ల పరిపాలనలోనూ పంజ్ïÙర్ స్వతంత్రంగానే వ్యవహరించింది. 1996–2001 మధ్య కాలంలో తాలిబన్లు అటు వైపు కన్నెత్తి కూడా చూడలేకపోయారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందే ఆ ప్రాంతాన్ని కూడా తమ వశం చేసుకోవాలని తాలిబన్లు గట్టి పట్టుదలతో ఉన్నారు. దేశ మాజీ ఉపాధ్యక్షుడు అమరుల్లా సలే, తాలిబన్లను తీవ్రంగా వ్యతిరేకించే అహ్మద్ షా మసూద్ కుమారుడు అహ్మద్ మసూద్‌ల అ«దీనంలో పంజ్‌షీర్ లోయ ఉంటుంది. గాల్లోకి కాల్పులు.. 17 మంది మృతి! పంజ్ïÙర్ తాలిబన్ల పరమైందని వదంతులు వ్యాపించడంతో రాజధాని కాబూల్‌లో తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరుపుతూ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఈ కాల్పుల్లో 17 మంది వరకు మరణించినట్టు తెలుస్తోంది. అయితే వారు అలా సంబరాలు చేసుకోవడాన్ని తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తప్పు పట్టారు. ఆయుధాలనేవి ప్రభుత్వ ఆస్తి అని, వాటిని గాల్లోకి పేలుస్తూ వృథా చేయరాదని హితవు చెప్పారు. మహిళా కార్యకర్త తలకి గాయాలు మహిళలు తమ హక్కుల్ని కాపాడాలంటూ చేస్తున్న ఉద్యమాన్ని తాలిబన్లు అణగదొక్కేస్తున్నారు. మహిళలు తమ రాజకీయ హక్కుల్ని కాపాడా లంటూ అధ్యక్ష భవనం వరకు తీసిన ర్యాలీని తాలిబన్లు అడ్డుకొని బాష్పవాయువు ప్రయోగిం చారు. మహిళల్ని విచక్షణారహితంగా కొట్టినట్టుగా టోలో న్యూస్ వెల్లడించింది. ఉద్యమకారిణి నర్గీస్ సద్దాత్ను చితకబాదారు. తలకి బలమైన గాయంతో ముఖమంతా నెత్తురోడుతూ ఆమె ఆ నిరసన ప్రదర్శనలో కనిపించారు. అందరినీ కలుపుకొని పోవాలి: అమెరికా తాలిబన్లు ఎలాంటి ప్రతీకార చర్యలకు దిగకుండా అన్ని వర్గాలను కలుపుకొని పోతూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని తాము ఆశిస్తున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ అన్నారు. ఉగ్ర వాదాన్ని నిరోధించడం, మహిళలు, మైనారీ్టల హ క్కుల్ని గౌరవించడంలో తమ చిత్తశుద్ధి చూపించాలన్నారు. మరోవైపు అఫ్గాన్‌లో మానవ సంక్షోభం, ఆరి్థక సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 13న జెనీవాలో ఐక్యరాజ్యసమితి సమావేశం కానుంది. కాబూల్‌కు ఐఎస్ఐ చీఫ్ ఒకవైపు ప్రభుత్వ ఏర్పాటుకు మంతనాలు, మరోవైపు పంజ్ïÙర్లో కొనసాగుతున్న పోరాటం నేపథ్యంలో పాకిస్తాన్లో అత్యంత శక్తిమంతమైన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫయీజ్ హమీద్ కాబూల్‌కు చేరుకున్నారు. ఆయన వెంట పాక్ అధికారుల బృందం కూడా వచి్చంది. తాలిబన్ల ఆహా్వనం మేరకే హమీద్ అఫ్గాన్ వచ్చారని, రెండు దేశాల భవితవ్యంపై చర్చలు జరిపి, కలసికట్టుగా వ్యూహరచన చేయనున్నట్టుగా పాకిస్తాన్ అబ్జర్వర్ పత్రిక వెల్లడించింది. ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు ఐఎస్ఐ చీఫ్‌ను ఆహా్వనించడంతో వారిమధ్య సుదృఢ బంధాలు తేటతెల్లమవుతున్నాయి. తాలిబన్ అగ్ర నేతలు, కమాండర్లతో ఐఎస్ఐ చీఫ్ çచర్చలు జరపనున్నారు. -
కాబూల్‌లో బరాదర్ చర్చలు
కాబూల్: అఫ్గాన్‌లో కొత్త ప్రభుత్వాన్ని కొలువు తీర్చేందుకు తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ శనివారం కాబూల్‌కు చేరుకున్నారు. తాలిబన్ దళాధిపతులు, విధాన నిర్ణేతలు, మత పెద్దలు, అష్రాఫ్ ఘనీ ప్రభుత్వంలోని ముఖ్య నేతలతో బరాదర్ చర్చించనున్నారని తాలిబన్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. ‘వచ్చే కొద్ది వారాల్లోపు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడంతోపాటు, కొత్త పరిపాలనా విధానంతో సిద్ధంగా ఉన్నాం. పశ్చిమ దేశాలు నిర్వచించినట్లుగా ప్రజాస్వామ్య రూపురేఖల్లో నూతన ప్రభుత్వం ఉండబోదుగానీ ప్రభుత్వం ప్రతి పౌరుడి హక్కులను పరిరక్షిస్తుంది’ అని రాయిటర్స్ వార్తా సంస్థకు ఆయన చెప్పారు. -
KP Sharma Oli: విశ్వాస పరీక్షలో ఓడిన ఓలి
ఖాట్మండూ: నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి ప్రతినిధుల సభ విశ్వాసాన్ని కోల్పోయారు. పుష్పకమాల్ దహల్ ప్రచండ నేతృత్వంలోని సీపీఎన్ (మావోయిస్ట్ సెంటర్) పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో ఆయన మెజారిటీ కోల్పోయారు. నేపాల్ ప్రతినిధుల సభలో మొత్తం 275 మంది సభ్యులు ఉండగా సోమవారం విశ్వాసపరీక్ష కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి 232 మంది హాజరయ్యారు. వారిలో 93 ఓట్లు ప్రధాని ఓలికి మద్దతుగా రాగా, 124 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి. మరో 15 మంది సభ్యులు తటస్థంగా ఉన్నారని స్పీకర్ అగ్ని సప్కోట తెలిపారు. ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు మొత్తం 136 ఓట్లు కావాల్సి ఉండగా, ఆ మార్కును ఓలి అందుకోలేకపోయారు. మెజారిటీ సాధించలేకపోయిన ఓలి నేపాల్ రాజ్యాంగంలోని 100 (3) ప్రకరణ ప్రకారం ఆటోమేటిగ్గా పదవిని కోల్పోతారు. ఇదిలా ఉండగా నేపాలి కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేబ, సీపీఎన్ చైర్మన్ ప్రచండ, జనతా సమాజ్‌వాదీ పార్టీ చైర్మన్ ఉపేంద్ర యాదవ్‌లు కలసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు. తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రారంభించాలని దేశ అధ్యక్షుడు భండారిని కోరుతూ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. -
ఆదర్శనీయంగా మా పాలన
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో రెండోసారి ఏర్పాటైన ప్రభుత్వం తొలి 50 రోజుల్లో సాధించిన విజయాలు, పనితీరుపై ఓ నివేదికను అధికార బీజేపీ శుక్రవారం విడుదల చేసింది. ఈ 50 రోజుల్లో తమ ప్రభుత్వ పనితీరు ఆదర్శనీయంగా ఉందనీ, సానుకూలా మార్పువైపునకు వెళ్తోందని బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. సమాజంలోని బలహీన వర్గాలు, దేశ భద్రత, ఆర్థిక వ్యవస్థను బలోపేతంపై తమ ప్రభుత్వం ప్రముఖంగా దృష్టి పెట్టిందని ఆయన వెల్లడించారు. బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక తొలిసారిగా శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. చిన్నారుల రక్షణ, దేశ భద్రత తదితర అంశాలపై తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రశంసించిన నడ్డా, ఇటీవల లోక్‌సభ, రాజ్యసభల్లో ఆమోదం పొందిన బిల్లులను కూడా ప్రస్తావించారు. కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, పియూష్ గోయల్‌లు కూడా ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఆర్థికవ్యవస్థ వృద్ధిలో వేగం పెంచడం కోసం 44 కార్మిక చట్టాలను తమ ప్రభుత్వం నాలుగు ప్రధాన చట్టాలుగా మార్చి సంస్కరణలు తీసుకు వచ్చిందని చెప్పారు. మోదీ ప్రభుత్వం తొలి 50 రోజుల్లో తీసుకున్న నిర్ణయాలు, ఇంతకుముందు 50 ఏళ్లలో మనం చూసినవాటికంటే ఉత్తమమని నడ్డా పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి ఎదిగేందుకు తమ ప్రభుత్వం మౌలిక వసతుల రంగంపై ఖర్చు చేయబోయే కోటి కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ఎంతో దోహదపడతాయని నడ్డా తెలిపారు. -
సీఎం మారినా.. అదే పాత ఫొటో
గండేపల్లి(తూర్పు గోదావరి): సార్వత్రిక ఎన్నికల అనంతరం వెలువడిన ఫలితాల్లో అత్యధిక మెజార్టీతో అనూహ్యరీతిలో వైఎస్సార్ సీపీ విజయం సాధించింది. నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవీబాధ్యతలు స్వీకరించి రాష్ట్ర ప్రజలకు మంచిపాలనతోపాటు నవరత్నాల పథకం అమలుచేసేందుకు శ్రమిస్తున్న వైనం అందరికీ ఎరుకే. నూతన ప్రభుత్వం ఏర్పడి రోజులు గడుస్తున్నా ఇంకా కొన్ని ప్రభుత్వ శాఖల్లో మాజీల ఫొటోలను, వారిపేర్లను కొనసాగిస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా గ్రామీణ ప్రాంతాలలో వైద్యసేవలందిస్తున్న 104 వాహనంపై నేటికీ మాజీ సీఎం చంద్రబాబు ఫొటో, చంద్రన్న సంచార చికిత్స అని పేర్లు ఉండడం ఆరోగ్యశాఖ అధికారుల నిద్రమత్తుకు నిదర్శనంగా నిలుస్తోంది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీగా సీఎం జగన్మోహన్ రెడ్డి నామకరణం చేసినా వాహనంపై మాజీల ఫొటోలు ఉండటంపై ఆపార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఫోటోను ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినా క్షేత్రస్థాయిలో అవి ఆచరణకు నోచుకోవడం లేదని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ధ్వజమెత్తుతున్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ డి మురళీధర్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పందించి వైద్య సేవలందిస్తున్న 104, 108 వాహనాలపై ప్రస్తుత ముఖ్యమంత్రి ఫొటోలను ఉపయోగించాలని అలాగే పేర్లు మార్పుచేయాలని ప్రజలు కోరుతున్నారు. -
మంత్రివర్గంలోకి అమిత్ షా..!
న్యూఢిల్లీ: కేంద్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు దిశగా రంగం సిద్ధమయ్యింది. శుక్రవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ 16వ లోక్‌సభ రద్దుకు సిఫారసు చేసింది. సమావేశం ముగిసిన తర్వాత ప్రధాని మోదీ, మిగతా కేంద్రమంత్రులు రా6ష్టపతిని కలసి రాజీనామాలు సమర్పించారు. కేంద్ర మంత్రివర్గం రాజీనామాలు సమర్పించే సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి వారిని విందుకు ఆహ్వానించారు. వారి రాజీనామాలను ఆమోదించిన రాష్ట్రపతి కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించే వరకు కొనసాగాల్సిందిగా ప్రధానిని కోరినట్లు రాష్ట్రపతిభవన్ తెలిపింది. అంతకుముందు ప్రధాని గైర్హాజరీలో మోదీ నాయకత్వాన్ని, గత ఐదేళ్లలో ప్రభుత్వం చేసిన కృషిని ప్రశంసిస్తూ కేంద్ర మంత్రులు ఒక తీర్మానం ఆమోదించారు. కాగా కొత్త మంత్రివర్గ పదవీ ప్రమాణ స్వీకారోత్సవం ఈ నెల 30న జరిగే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. జూన్ 3వ తేదీలోగా 17వ లోక్‌సభ కొలువుదీరాల్సి ఉంది. ఒకటీరెండు రోజుల్లో ముగ్గురు ఎన్నికల కమిషనర్లు రాష్ట్రపతిని కలసి కొత్తగా ఎన్నికైన సభ్యుల జాబితాను అందజేయడంతో కొత్త సభ ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుంది. నేడు ఎన్డీయే సమావేశం మోదీని తమ నేతగా ఎన్నుకునేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఎంపీలు శనివారం సమావేశం కానున్నారు. కూటమి ప్రధాని అభ్యర్థిగా మోదీ ముందే ఖరారైన నేపథ్యంలో లాంఛనపూర్వకంగా ఈ భేటీ జరగనుంది. పార్లమెంటు సెంట్రల్ హాల్లో సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం జరగనుంది. అంతకుముందు పార్లమెంట్ హౌస్‌లో బీజేపీ ఎంపీలు సమావేశమవుతారు. ఎంపీలు తనను నేతగా ఎన్నుకున్న తర్వాత మోదీ వారినుద్దేశించి ప్రసంగిస్తారని సమాచారం. ఇలావుండగా ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు మే 28న మోదీ తన నియోజకవర్గం వారణాసిని సందర్శించే అవకాశం ఉందని పార్టీవర్గాలు వెల్లడించాయి. శుక్రవారం వారణాసి నుంచి వచ్చిన బీజేపీ కార్యకర్తలు మోదీని కలసి ఆయన ఎన్నికకు సంబంధించిన అధికారిక సర్టిఫికెట్‌ను అందజేశారు. సౌత్ బ్లాక్‌లో పీఎంఓ అధికారులతో ప్రధాని సమావేశమయ్యారు. ఈసారి మంత్రివర్గంలో అమిత్ షా లోక్‌సభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి రెండోసారి అధికార పీఠాన్ని అధిరోహించేందుకు బీజేపీ సిద్ధమైన నేపథ్యంలో అందరి దృష్టీ కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై పడింది. ఈసారి మోదీ మంత్రివర్గంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సమా పలు కొత్త ముఖాలు కనబడే అవకాశం ఉందని తెలుస్తోంది. అమిత్ షాను మంత్రివర్గంలోకి తీసుకునే పక్షంలో ఆయనకు హోం, ఆర్థిక, విదేశీ వ్యవహారాలు, రక్షణ.. ఈ నాలుగు కీలక శాఖల్లో ఏదో ఒకటి అప్పగించవచ్చని తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌లు ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండటంతో వీరు కొత్త మంత్రివర్గం లో ఉంటారా? లేదా? అన్న అనుమానాలు న్నాయి. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక శాఖతో కేబినెట్లో కొనసాగే అవకాశం కన్పిస్తోంది. అమేథీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌పై సంచలన విజయం సాధించిన స్మృతీ ఇరానీకి పార్టీ ముఖ్యమైన బాధ్యతనే అప్పగించవచ్చు. వీరితో పాటు సీనియర్ మంత్రులు రాజ్‌నాథ్æ, నితిన్ గడ్కారీ, రవిశంకర్, గోయెల్, ప్రకాశ్ జవదేకర్లు కూడా కొనసాగవచ్చని తెలుస్తోంది. మిత్రపక్షాల్లో శివసేన (18), జేడీ(యూ) (16)లు మంచి ఫలితాలు సాధించిన నేపథ్యంలో వారికి కూడా చోటు దొరకవచ్చు. ఇక పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణల నుంచి కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చే సూచనలున్నాయని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. సూర్యాస్తమయం అయినా వెలుగు కొనసాగుతుంది ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలంపై సూర్యాస్తమయం అయినా ప్రజల జీవితాలను కాంతివంతం చేసేందుకు దాని వెలుగు ఇంకా కొనసాగుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘ఓ కొత్త ఉదయం ఎదురుచూస్తోంది...’ అంటూ శుక్రవారం ఒక ట్వీట్లో మోదీ పేర్కొన్నారు. మనమందరం కలలుగన్న నవ భారత సృష్టికి, 130 కోట్ల మంది ప్రజల కలలు నెరవేర్చేందుకు తన ప్రభుత్వం మరింత కృత నిశ్చయంతో ఉందని ఆయన తెలిపారు. అడ్వాణీ, జోషీలతో మోదీ–షా భేటీ సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా శుక్రవారం ఆ పార్టీ సీనియర్ నేతలు ఎల్కే అడ్వాణీ, మురళీమనోహర్ జోషీలను కలుసుకున్నారు. అమిత్ షాతో కలిసి తొలుత అడ్వాణీ ఇంటికెళ్లిన మోదీ, ఆయనకు పాదాభివందనం చేశారు. అనంతరం సార్వత్రిక ఎన్నికల ఫలితాల సరళిపై కొద్దిసేపు చర్చించారు. సమావేశం అనంతరం మోదీ స్పందిస్తూ..‘ఈరోజు బీజేపీ విజయం సాధించిందంటే అడ్వాణీలాంటి గొప్ప వ్యక్తులు దశాబ్దాలపాటు కష్టపడి పార్టీని నిర్మించడమే కారణం. వీరంతా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి సరికొత్తగా తీసుకెళ్లారు’ అని ట్వీట్ చేశారు. అనంతరం మోదీ, షా ద్వయం మురళీ మనోహర్ జోషి ఇంటికెళ్లారు. వీరిద్దరికి సాదరస్వాగతం పలికిన జోషి, మోదీకి శాలువాను బహూకరించారు. ఈ సందర్భంగా జోషికి పాదాభివందనం చేసిన మోదీ, తనవెంట తెచ్చిన స్వీట్స్‌ను అందించారు. దీంతో జోషి ధన్యవాదాలు తెలిపారు. ‘డా.మురళీమనోహర్ జోషి గొప్ప విద్యావేత్త. భారత విద్యావ్యవస్థను మెరుగుపర్చడంలో ఆయన పాత్ర చాలా కీలకమైంది. నాతో పాటు చాలామంది కార్యకర్తలకు మార్గదర్శిగా వ్యవహరించిన జోషి, బీజేపీని బలోపేతం చేసేందుకు నిరంతరం కృషి చేశారు’ అని మోదీ ప్రశంసించారు. ఈ సమావేశం అనంతరం జోషి మీడియాతో మాట్లాడుతూ.. మోదీ, అమిత్ షాలు బీజేపీకి బ్రహ్మాండమైన విజయాన్ని అందించారని కితాబిచ్చారు. ఎన్నికల్లో విజయం అనంతరం తనకు శుభాకాంక్షలు చెప్పిన అమెరికా ఉపాధ్యక్షుడు పాంపియో, రష్యా అధ్యక్షుడు పుతిన్, కెనడా ప్రధాని ట్రూడో, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, సౌదీ రాజు బిన్సల్మాన్లకు కృతజ్ఞతలు తెలిపారు. బాలీవుడ్ నటీనటులు శిల్పాశెట్టి, మాధవన్, సంగీత దర్శకుడు రెహమాన్, సరోద్ విద్వాంసుడు అమ్జాద్ ఆలీఖాన్, బాక్సర్ మేరీకోమ్లకు ధన్యవాదాలు చెప్పారు. సీనియర్ నేత ఎల్కే అద్వానీ పాదాలకు నమస్కరిస్తున్న ప్రధాని మోదీ -
కొత్త ప్రభుత్వం ముందున్న పెద్ద సవాల్
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో రేపు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రపథమంగా ముందుండేది అస్తవ్యస్థంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను సరిదిద్దడం. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు కొలమానంపై కొనసాగుతున్న వివాదాన్ని పక్కన పెడితే జడీపీ పెరగడానికి తగ్గడానికి ప్రధాన కారణమైన ఆటోమొబైల్ రంగంలో గత ఆరు నెలలుగా అమ్మకాలు పడిపోవడం దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసే అంశం. గత ఆరు నెలలుగా దేశంలో ప్రయాణికుల కార్లు, వాణిజ్య వాహనాలే కాకుండా చివరకు ద్విచక్ర వాహనాల అమ్మకాలు పడిపోయాయి. 2019 సంవత్సరంలో దాదాపు పది శాతం అమ్మకాలు పడిపోతున్నట్లు అంచనాలు తెలియజేస్తున్నాయి. వాణిజ్య వాహనాల అమ్మకాలు కూడా భారీగా పడిపోవడం అనేది మరో విషాదకర పరిణామం. దేశంలో వ్యాపార లావాదేవీలు సజావుగా లేదా ముమ్మరంగా కొనసాగుతుంటే వాణిజ్య వాహనాల అమ్మకాలు పెరుగుతుంటాయి. ఈ వాహనాల అమ్మకాలు పడిపోయాయంటే దేశంలో వ్యాపార రంగం కూడా వెనకబడినట్లే. భారత దేశ ఆర్థిక వ్యవస్థకు ఆటోమొబైల్ రంగం వెన్నెముక లాంటిది. ఈ రంగంలో ఉపయోగించే ప్లాస్టిక్, రబ్బర్, లెదర్, కాంపోజిట్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లకు కూడా ఎంతో గిరాకీ పెరుగుతుంది. దీని సర్వీసు, రిపేరు, నిర్వహణా రంగాల్లో ఈ రంగం ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోంది. అలాగే ఈ రంగంపైనే ప్రధానంగా ఆధారపడి అడ్వర్టైజ్మెంట్ విభాగాలు ఎన్నో బతుకుతున్నాయి. పన్నుల రెవెన్యూ తగ్గిందీ 2018లో వేసిన అంచనాలకన్నా, 2019లో వేసిన సవరించిన అంచనాలకన్నా పన్ను రెవెన్యూ బాగా తగ్గింది. ఫలితంగా కేంద్ర ద్రవ్యలోటు దాదాపు ఎనిమిదిన్నర లక్షల కోట్లకు చేరుకుంది. 2019, ఫిబ్రవరిలో సవరించిన అంచనాల కన్నా 33 శాతం ఎక్కువ. కొత్త జీడీపీ కొలమానం ప్రకారం కూడా జీడీపీలో ద్రవ్యలోటు 4.5 శాతం. ఈ లోటు 3.4 శాతానికి పెరగకూడదన్నది టార్గెట్. దేశం నుంచి సరకుల ఎగుమతి టార్గెట్ 35,000 డాలర్లుకాగా, 33 వేల డాలర్ల ఎగుమతులను మాత్రమే చేయగలిగింది. జీఎస్టీలో ఉన్న లోపాల కారణంగానే ఎగుమతులకు ప్రాధాన్యత ఇవ్వలేకపోయామని వ్యాపార వర్గాలు తెలియజేశాయి. వెనకబడిన డిజిటల్ ఇండియా సాంకేతికంగా ఎంతగానో అభివృద్ధి చెందిన భారత్‌లో డిజిటలైజేషన్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ ఆశించిన విజయాన్ని సాధించలేక పోయారు. నల్లడబ్బును అరికట్టడంతోపాటు భారత్‌ను పూర్తిగా డిజిటలైజేషన్ చేయవచ్చనే సత్సంకల్పంతో నరేంద్ర మోదీ 2016లో పెద్ద నోట్ల రద్దు చేసిన విషయం తెల్సిందే. దీనివల్ల వంద మందికిపైగా సామాన్యులు మరణించడమే కాకుండా డిజిటలైజేషన్‌కు అది ఏమాత్రం తోడ్పడలేదు. పైగా 2016, నవంబర్ నుంచి ఇప్పటికీ నగదు లావాదీవీలు 22 శాతం పెరిగాయి. దేశంలో నిరుద్యోగ సమస్య కూడా 6.1 శాతంతో గత 49 ఏళ్లలో ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరుకుంది. పలు కారణాల వల్ల భారత్‌లో జీడీపీ వృద్ధిరేటు గణనీయంగా పడిపోతోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఇటీవలనే హెచ్చరించింది. అధికారంలోకి వచ్చే కొత్త ప్రభుత్వం అత్యవసరంగా దేశ ఆర్థిక వ్యవస్థపై దృష్టిని సారించకపోతే పరిస్థితి మరింత దయనీయంగా మారే ప్రమాదం ఉంది. -
ఫస్ట్ క్లాసు ప్రయాణాలొద్దు: పాక్ కేబినెట్
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వ నిధులను విచక్షణారహితంగా వాడటంపై నిషేధం విధించింది. దేశాధ్యక్షుడు, ప్రధాని సహా ప్రభుత్వాధికారులు, నేతలు ఎవరైనా సరే విమానాల్లో ఫస్ట్‌క్లాస్ ప్రయాణాలు చేయకూడదని ఆదేశించింది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో జరిగిన కేబినేట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పాక్ సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌధురి తెలిపారు. అధికారిక బంగ్లాను కాదని, మిలిటరీ సెక్రెటరీ నివాసంలోని ఓ చిన్న పోర్షన్‌లోనే ఇమ్రాన్ నివాసముంటున్నారు. 2 వాహనాలు, ఇద్దరు సిబ్బందిని మాత్రమే నియమించుకున్నారు. ఈ నేపథ్యంలో దేశాధ్యక్షుడు, ప్రధాని, ప్రధాన న్యాయమూర్తి, సెనేట్ చైర్మన్, జాతీయ అసెంబ్లీ స్పీకర్, రాష్ట్రాల సీఎంలు ఇకపై క్లబ్/బిజినెస్ క్లాస్‌లోనే ప్రయాణం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని చౌధురి వెల్లడించారు. విదేశీ పర్యటనలకు, దేశంలో పర్యటించేందుకు ప్రత్యేక విమానాన్ని వినియోగించడాన్ని ఇకపై నిలిపివేయాలని ప్రధాని నిర్ణయించారు. ఆర్మీ చీఫ్ మొదటి తరగతికి బదులు బిజినెస్ క్లాస్‌లోనే వెళ్లాలి. ప్రభుత్వ నిధులను యధేచ్ఛగా కేటాయించే అధికారం అధ్యక్షుడు, ప్రధాని, ఇతర అధికారులకు ఇకపై ఉండదు. -
రాజధాని మారే అవకాశం
మాజీ ఎంపీ చింతామోహన్ వెంకటగిరి(నెల్లూరు) : రాష్ట్రంలో ప్రభుత్వం మారితే ప్రస్తుతం అమరావతిలో ఉన్న రాజధాని తిరుపతి – వెంకటగిరి ప్రాంతంలో ఏర్పాటయ్యే అవకాశాలున్నాయని తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ తెలిపారు. ఆదివారం ఆయన వెంకటగిరిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం రాజధాని నిర్మిస్తున్న ప్రాంతం భారీ నిర్మాణాలకు అనుకూలంకాదన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు రాజధాని కర్నూలు నుంచి హైదరాబాద్ మారిన విషయాన్ని గుర్తుచేశారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ రాజకీయంగా పురిటిబిడ్డేనన్నారు. దుగరాజపట్నం పోర్టు కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్టని బీజేపీ పట్టించుకోవడంలేదని విమర్శించారు. తిరుపతికి అనుసంధానంగా నిర్మించిన జాతీయ రహదారులు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసినవేనన్నారు. ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ కీలకమైందన్నారు. దేశంలో న్యాయవ్యవస్థలో సమూల మార్పులు రావాల్సిన అవసరముందన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పంజాం ధనంజయ, డేగా మునిచంద్ర, సీహెచ్ హనుమంతరావు, సుధ తదితరులు పాల్గొన్నారు. -
పింఛను రాదన్న వేదనతో ఆత్మహత్య
ద్వారకాతిరుమల : ఇక పింఛను రాదు.. జీవితాంతం కుటుంబ సభ్యులపై ఆధారపడుతూ.. వారికి భారం కావడాన్ని జీర్ణించుకోలేని ఆ వికలాంగ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొత్త ప్రభుత్వం తన జీవితంలో వెలుగులు తెస్తుందని కొండంత ఆశపడ్డ ఆ వికలాంగ యువకుని జీవితం అంతమయింది. అర్హుడైనా పింఛను రాక తీవ్ర ఇబ్బందులు పడ్డ ఈ యువకుడు చివరకు పురుగుల మందు తాగి విగతజీవుడయ్యాడు. ఈ ఘటన మండల కేంద్రమైన ద్వారకాతిరుమల బస్టాండులో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దొరసానిపాడు గ్రామానికి చెందిన ముంగమూరి నాగరాజు(32)కు పుట్టుకతోనే పోలియో సోకి రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. నాగరాజు తల్లితండ్రులు ఇసాకు, గంగమ్మలకు ముగ్గురు కుమారులు కాగా, ఇతను రెండవ సంతానం. నడవలేని ఇతడిని ఇప్పటి వరకు తల్లితండ్రులే పోషించారు. అయితే సైకిల్ రిపేరు షాపు నిర్వహిస్తూ కుటుంబానికి తన వంతు ఆసరాగా నిలిచాడు. ప్రస్తుతం ఈ పనులకు ఆదరణ లేకపోవడంతో నాగరాజు ఖాళీగా ఉంటున్నాడు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇతనికి వికలాంగ పింఛను రూ.500 మంజూరయింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక పది నెలల క్రితం పింఛను అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఇదేంటని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా అధికారుల నుంచి సరైన సమాధానం రాలేదు. ఏప్రిల్ నెలలో పింఛన్ వచ్చింది. తర్వాత మళ్లీ ఆగిపోయింది. వారం రోజుల క్రితం తన తల్లితండ్రులతో చెప్పి హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ.. ఆదివారం రాత్రి ద్వారకాతిరుమలకు చేరుకున్న నాగరాజు బస్టాండులో విగత జీవుడై పడిఉన్నాడు. అతని పక్కనే పురుగుమందు డబ్బా, పింఛనుకోసం తిరిగిన కాగితాలు పడి ఉన్నాయి. సోమవారం ఈ విషయాన్ని స్థానికులు గుర్తించి మృతుని బంధువులకు సమాచారమిచ్చారు. పింఛను రాకే... బస్టాండుకు చేరుకున్న నాగరాజు బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు పింఛను అందకపోవడం వల్లే నాగరాజు బలవన్మరణానికి పాల్పడ్డాడని, దీనికి ప్రభుత్వం, అధికారులు, ఇక్కడి ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమే కారణమంటూ ధ్వజమెత్తారు. ఘటనా స్థలానికి పోలీసులు, అధికారులు సకాలంలో రాలేదంటూ వారు బస్టాండు వద్ద ఆందోళనకు దిగారు. ఇక్కడికి చేరుకున్న వైఎస్సార్సీపీ చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ముప్పిడి సంపత్‌కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు బుసనబోయిన సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాకలపాటి త్యాగభీమేశ్వరరావు, నాయకులు యాచమనేని నాగేశ్వరరావు తదితరులు ఎన్నికలలో టీడీపీకి అనుకూలంగా ఉండని వారి పింఛన్లు తొలగిస్తారా.. అని తహసిల్దారు ఎల్.దేవకీదేవిని వారు నిలదీశారు. దీనికి ఆమె సమాధానమిస్తూ సాంకేతిక సమస్య కారణంగా ఇతనికి పింఛన్ నిలిచిపోయిందని, జూన్ నెలలో పింఛను వచ్చిందని చెప్పారు. దీనికి బాధిత కుటుంబ సభ్యులకు ఎందుకు తెలపలేదని, ఈ నెలలో మళ్లీ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. దీనికి తహసిల్దారు సమాధానమిస్తూ సంబంధిత అధికారి ఎంపీడీవో పురుషోత్తమరావు అనారోగ్య కారణంగా ఈరోజు విధులకు రాలేదన్నారు. దీంతో మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని, తక్షణమే నష్టపరిహార విషయాన్ని తేల్చాలని నాయకులు డిమాండ్ చేశారు. ఏలూరు ఆర్డీవో తేజ్ భరత్‌తో ఫోన్లో మాట్లాడిన అనంతరం నాయకులు స్థానిక తహసిల్దారు ఎల్.దేవకీదేవి, ఎస్సై సీహెచ్.సతీష్‌కుమార్‌లతో చర్చించి ఆందోళనను విరమింపజేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు భారం కాలేను నెలకు రూ. 1500 వస్తాయని, వాటితో జీవిద్దామని ఆశపడ్డ నాగరాజు ఆ పింఛను కోసం నిత్యం తిరుగుతూనే ఉన్నాడు. కుటుంబ సభ్యులు, తన తల్లితండ్రులపై ఆధారపడి జీవించలేక పోతున్నానని అనేకసార్లు తమ వద్ద మొరపెట్టుకున్నాడని అతని స్నేహితులు చెబుతున్నారు. చివరికి ఇంక పింఛను రాదని తెలిసిందో.. ఏమో.. ఇలా బలవన్మరణానికి పాల్పడ్డాడని అంటున్నారు. ఇది ప్రభుత్వ హత్యే నాగరాజుది ప్రభుత్వ హత్యేనని, లబ్ధిదారులను తగ్గించేందుకు కమిటీల పేరుతో వడబోత పెట్టి ఇలాంటి అర్హుల ఉసురును టీడీపీ ప్రభుత్వం తీస్తోందని వైఎస్సార్సీపీ నేత గంటా మురళీరామకృష్ణ అన్నారు. అంగవైకల్యం 90 శాతం ఉన్న నాగరాజుకే ఇవ్వకుంటే.. మరి పింఛన్లు ఎవరికిస్తున్నట్టని ఆయన ప్రశ్నించారు. పాదయాత్రలో షర్మిలను కలసిన నాగరాజు గత ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన పాదయాత్ర దొరసానిపాడుకు చేరుకున్న సమయంలో నాగరాజు ఆమెను కలుసుకుని తన కష్టాలను చెప్పుకున్నాడు. తనకు వికలాంగ రిక్షాను ఇప్పించాలని ఆమెను కోరాడు. దీనికి స్పందించిన షర్మిల వైఎస్సార్సీపీ పాలనలోకి వచ్చిన తరువాత అంతా మంచి జరుగుతుందని చెప్పి, పాదయాత్ర ముగియగానే అప్పటి ఎమ్మెల్యే తానేటి వనిత ద్వారా రిక్షాను నాగరాజుకు అందించారు. దీంతో అతడు ఎన్నికల సమయంలో వైసీపీ తరఫున ప్రచారం చేశాడు. దీని కారణంగానే ఇప్పుడు టీడీపీ నాయకులు తన కుమారుడికి పింఛను రాకుండా చేశారని నాగరాజు తల్లితండ్రులు ఇసాకు, గంగమ్మలు ఆవేదన చెందారు. -
అదరగొడతారా!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కొత్త రాష్ట్రం వచ్చింది. పాలకులు మారారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలవుతోంది. కానీ అవే సమస్యలు ఏళ్ల తరబడి జిల్లాను వెంటాడుతూనే ఉన్నాయి. ఎండాకాలం వచ్చిందంటే చాలు... తాగునీటి కటకట షరా మామూలే. గతంలో ఎన్నడూ లేనంతంగా ఈసారి భూగర్భ నీటిమట్టం దారుణంగా పడిపోయింది. ఏ నియోజకవర్గంలో చూసినా నీళ్ల కోసం బారులు తీరే జనాలే కన్పిస్తున్నారు. దీనికితోడు అన్నపూర్ణగా విలిసిల్లిన కరీంనగర్ జిల్లాను నేడు కరవు ఛాయలు అలుముకున్నాయి. కరీంనగర్‌ను కరవు జిల్లాగా ప్రకటించాలని ప్రజలు కోరుతున్నారు. ఇక సాగునీటి ప్రాజెక్టుల సంగతి చెప్పనక్కర్లేదు. ఎల్లంపల్లి, మధ్యమానేరు, గౌరవెల్లి, తోటపల్లి వంటి ప్రాజెక్టుల పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైంది. ఆయా ప్రాజెక్టుల భూ నిర్వాసితులకు నేటికీ పూర్తిస్థాయిలో సహాయ, పునరావాస కార్యక్రమాలు జరగలేదు. కరీంనగర్ ను అద్దంలా మార్చి అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్దిదిద్దుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు... ఇంకా ఆచరణలోకి రాలేదు. జిల్లాలో ఎయిమ్స్ తరహా ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని, జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిని నిమ్స్ స్థాయిలో తీర్చిదిద్దుమన్న మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ తొలిసారి జిల్లాను సందర్శించినప్పుడు ఇచ్చిన పలు హామీలు ఇంకా ఆచరణకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో నేటినుంచి జరగబోతున్న శాసనసభ బడ్జెట్ సమావేశాలను వేదికగా చేసుకుని జిల్లాలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని జిల్లా ప్రజానీకం ముక్తకంఠంతో శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులను కోరుతోంది. గళమెత్తే వారెవరు? జగిత్యాల శాసనసభ్యుడు టి.జీవన్‌రెడ్డి మినహా జిల్లాలో మిగిలిన 12 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ వాళ్లే. అందులోనూ ఇద్దరు మంత్రులు ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహిస్తున్నారు. కొప్పుల ఈశ్వర్ ప్రభుత్వ చీఫ్‌విప్‌గా, వొడితెల సతీష్‌కుమార్ పార్లమెంటరీ కార్యదర్శిగా, రసమయి బాలకిషన్ సాంస్కృతిక సారథి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. శాసనసభలో అధికార పార్టీదే హవా కాబట్టి పాలక పార్టీ సభ్యులు జిల్లా సమస్యలపై ఏ విధంగా స్పందిస్తారు? అధిక నిధులు రాబడతారా? జిల్లాలో నెలకొన్న సమస్యలను పరిష్కార మార్గాలను అసెంబ్లీ వేదికగా చూపుతారా? లేదా? అనే దానిపై ఆసక్తి నెలకొంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో అసెంబ్లీని వేదికగా చేసుకుని జిల్లా సమస్యలను పరిష్కరించడంలో ఎవరు ముందుంటారనేది వేచిచూడాలి. సీఎల్పీ ఉపనేతగా వ్యవహరిస్తున్న టి.జీవన్‌రెడ్డికి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే అవకాశం శాసనసభ వేదికగా దక్కే అవకాశం ఉన్నందున జిల్లా సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని జనం కోరుతున్నారు. ముందే మేల్కొన్నా... ఆచరణ ఏది? జిల్లాలో భూగర్భ నీటిమట్టాలు పూర్తిగా పడిపోవడంతో ఈసారి వేసవిలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంటుందని ప్రభుత్వం ముందుగానే గ్రహించింది. అందులో భాగంగా రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ జనవరిలోనే జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎండాకాలంలో ఇకపై బిందెలు చేతపట్టుకుని రోడ్డుపైకి మహిళలు రాకూండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తగిన నిధులూ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆచరణలో మాత్రం ఆశించిన ఫలితాల్లేవు. జిల్లాలో ఎటు చూసినా మంచినీటి కోసం మహిళలు రోడ్డెక్కుతూనే ఉన్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజాప్రతినిధులను నిలదీస్తూనే ఉన్నారు. జిల్లా అంతటా కరవు ఛాయలు అలుముకోవడంతో కరీంనగర్‌ను కరవు జిల్లాగా ప్రకటించాలని ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాగునీటి సమస్య పరిష్కారానికి తగిన నిధులు కేటాయించాలని, జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించాలని జిల్లా ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. సా...గనిస్తారా? పూర్తి చేస్తారా? ఇక జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు పనులు 95 శాతం పూర్తయినా.. ఎత్తిపోతల పనులు పెండింగ్‌లో ఉండటంతో రాబోయే ఖరీఫ్ నాటికి నీరందించాలనే లక్ష్యం నెరవేరేలా లేదు. ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు పరిధిలో మిడ్‌మానేరు ఉన్న నేపథ్యంలో దీనిపై ప్రత్యేక దృష్టి సారించినా పనుల్లో పురోగతి మాత్రం కన్పించడం లేదు. 2017 ఖరీఫ్ నీటి అందించి తీరుతామనే హామీలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. సహాయ, పునరావాసం కోసం భూ నిర్వాసితులు నిత్యం ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఇక గౌరవెల్లి, గండిపల్లి, తోటపల్లి ప్రాజెక్టుల సంగతి చెప్పనక్కర్లేదు. నిధుల సమస్య వెంటాడుతోంది. పరిహారం చెల్లించలేదు. ఈ బడ్జెట్లోనైనా తగిన నిధులు కేటాయించేలా ఒత్తిడి తేవాలని ప్రజలు కోరుతున్నారు. సీఎం హామీలకు బడ్జెట్లో చోటు దక్కేనా? కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో గత ఆగస్టు 8న జిల్లాలో పర్యటించిన సందర్భంగా అనేక హామీలు గుప్పించారు. కరీంనగర్ సిటీని అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేస్తామన్నారు. పట్టణం చుట్టూ రింగురోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా ప్రధానాసుపత్రిని నిమ్స్ స్థాయిలో తీర్దిదిద్దుతామన్నారు. పెద్దపల్లి, మంథనిలో వంద పడకల ఆసుపత్రులను ఏర్పాటు చేస్తామన్నారు. కొండగట్టును తిరుపతి స్థాయిలో తీర్చిదిద్దుతానని, వేములవాడ రాజన్న దేవాలయ అభివృద్ధికి వంద కోట్లు ఖర్చు చేస్తామని, జిల్లాలోని అన్ని పట్టణాల్లో ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేస్తానని... ఇలా దాదాపు 40 హామీలు ఇచ్చారు. వాటికి సంబంధించిన నిధులను ఈ బడ్జెట్లో కేటాయించాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. -
వీడని జియోట్యాగ్ ముడి
వీరఘట్టం : జియో ట్యాగింగ్ పేరుతో ప్రభుత్వం ఇళ్ల లబ్ధిదారులను అవస్థల పాల్జేస్తోంది. నాలుగు నెలలుగా ఇదే సాకుతో కొత్త ఇళ్లు మంజూరు చేయక, కట్టిన ఇళ్లకు బిల్లులు చెల్లించడం లేదు. నిర్మాణాలు చేపట్టండి బిల్లులు చెల్లిస్తామన్న అధికారుల భరోసాతో అప్పులు చేసి నిర్మాణాలు ప్రారంభించిన లబ్ధిదారులు ఏడాది కాలంగా బిల్లులు మంజూరు కాక, నిర్మాణాలను అర్ధంతరంగా నిలిపివేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఒక్క కొత్త ఇల్లు కూడా మంజూరు చేయలేదు. గత ఏడాది మార్చి 23 నుంచి ఎన్నికల కోడ్ అంటూ ఇందిరమ్మ లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపు నిలిపివేశారు. అనంతరం వచ్చిన కొత్త ప్రభుత్వం ఇందిరమ్మ స్థానంలో ఎన్టీఆర్ స్వగృహ ద్వారా ప్రతి పేదవాడికి ఇల్లు మంజూరు చేస్తామని చెప్పి ఏడు నెలలు దాటినా.. ఇంతవరకు ఆ పథకం ప్రారంభం కాలేదు. ఇదే సమయంలో అక్రమంగా ఇందిరమ్మ గృహాలు పొందిన వారిని జియోట్యాగింగ్ ద్వారా గుర్తించి ఫిబ్రవరి నెలాఖరు నాటికి ప్రభుత్వానికి నివేదిస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ అది జరిగే పరిస్థితి కనిపించడంలేదు. 65 శాతం పూర్తి జిల్లాలో ప్రభుత్వ పథకాల కింద 2.64 లక్షల గృహాలు ఉండగా 65 శాతం అంటే 1.80 లక్షల గృహాలకు జియో ట్యాగింగ్ పూర్తి చేశామని, మిగిలిన వాటిని ఈ నెలాఖరులోపు పూర్తి చే స్తామని అధికారులు చెబుతున్నారు. కాగా 2.64 లక్షల ఇళ్లలో సుమారు 2.40 లక్షల నిర్మాణాలు పూర్తి అయ్యాయి. 24 వేల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. వీరికి గత ఏడాది నుంచి చెల్లింపు నిలిచిపోయాయి. ఇదిలా ఉండగా సుమారు రెండు నెలల క్రితం నిర్వహించిన జన్మభూమిలో ఇళ్ల నిర్మాణాల కోసం జిల్లా వ్యాప్తంగా 43 వేలు దరఖాస్తులు, అలాగే ప్రజావాణి ద్వారా మరో 94 వేల దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం ఆన్లైన్లో జన్మభూమి వెబ్సైట్ ఓపెన్ కాకపోవడంతో ఈ దరఖాస్తులన్నీ కార్యాలయాల్లోనే మూలుగుతున్నాయి. పెరుగుతున్న ధరలు సిమెంట్, ఇనుము ఇతర సామాగ్రి ధరలు పెరుగుతుండటంతో ఇందిరమ్మ లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఒక పక్క బిల్లులు అందక ఇబ్బందులు పడుతుంటే మరో పక్క ధరల పెరుగుదల ఆందోళన కలిగిస్తుందని వాపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చే అరకొర నిధులతో ఇంటి నిర్మాణం సాధ్యం కాదని అంటున్నారు. ప్రభుత్వం స్పందించి నిలిచిన నిర్మాణాలను పూర్తి చేసేందుకు అదనపు నిధులు కేటాయిస్తే గాని ప్రభుత్వ ధ్యేయం నెరవేరదని లబ్ధిదారులు అంటున్నారు. ప్రభుత్వ సాయం పెంచాలి ఇందిరమ్మ ఇంటికి ఇస్తున్న ప్రభుత్వ సహాయం ఏ మూలకు చాలడం లేదు. కనీసం 2 లక్షల రూపాయలైనా ఇవ్వందే ఇల్లు కట్టడం అసాధ్యం. ఆ దిశగా చర్యలు తీసుకుంటేనే నిర్మాణాలు పూర్తవుతాయి. లేకపోతే మధ్యలోనే ఆగిపోతాయి. -వెలగాడ చిన్నమ్మ, కంబరవలస ధరలను అదుపు చేయాలి సిమెంట్, ఇనుము ధరలు సామాన్యుడికి అందుబాటులో లేవు. రోజురోజుకి పెరిగిపోతున్న వీటి ధరలను ప్రభుత్వం అదుపు చేయాలి. వ్యాపారులు తమ ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచి అమ్ముతున్నారు. వీటిపై అధికారులు దృష్టి సారించాలి. -రెట్టి కమల, వీరఘట్టం -
రాజపక్సను విచారిస్తాం
కొలంబో: ఓటమి అనంతరం అధికారాన్ని అంటిపెట్టుకుని ఉండటానికి సైనిక కుట్రకు వ్యూహం పన్నారనే ఆరోపణపై శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహీంద రాజపక్సపై ఆ దేశ కొత్తప్రభుత్వం విచారణ జరపాలని నిర్ణయించింది. రాజపక్స ప్రతిపాదనకు సైన్యాధినేతతో పాటు పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ తిరస్కరించినందునే ఆయన వెనక్కి తగ్గారని తెలిపింది. అన్నిపార్టీలకూ ఆహ్వానం: సిరిసేన జాతీయ సమైక్యతకు కృషిచేసేందుకు అన్ని రాజకీయ పార్టీలూ తన ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని లంక కొత్త అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన పిలుపునిచ్చారు. మైనారిటీలకు తగిన గుర్తింపునిస్తూ మతసామరస్యంకోసం పాటుపడతామని పార్టీలు ప్రతిజ్ఞ చేయాలని జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో చెప్పారు. ఎన్నిక హామీ ప్రకారం కార్యనిర్వహక అధికారాలను పార్లమెంటుకు అప్పగిస్తానన్నారు. -
తొమ్మిది సరుకుల్లో మూడే పంపిణీ..
కర్నూలు : చౌక దుకాణాల్లో తొమ్మిది రకాల సరుకుల పంపిణీ అటకెక్కింది. రూ.185కే సరుకులు అందుకుంటున్న నిరుపేదలు పథకం ఆగిపోవడంతో ఆవేదన చెందుతున్నారు. లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చిన పథకం నిర్వీర్యం కావడంతో పేదలు, మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పేద కుటుంబాలకు ప్రయోజనకరంగా ఉన్న పథకం నిలిచిపోవడంతో జిల్లా వ్యాప్తంగా కార్డుదారుల్లో నిరసన వ్యక్తమవుతోంది. నాలుగు నెలలుగా కేవలం బియ్యం, కిరోసిన్, చక్కెరతో సరిపెడుతుండటంతో ప్రతి కార్డుదారుడు మిగిలిన సరుకుల కోసం నెలకు రూ.175 అదనపు భారం భరిస్తున్నాడు. ఈ లెక్కన నెలకు రూ.18 కోట్లు కార్డుదారులపై అదనపు భారం పడుతోంది. గత నాలుగు నెలలుగా రూ.72.16 కోట్లు పేద ప్రజలు అదనపు భారం భరించారు. కొత్త ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని వినియోగదారులు కోరుతున్నారు. జిల్లాలో 11.40 లక్షల మంది తెల్లరేషన్ కార్డుదారులు ఉన్నారు. వీరికి ప్రతి నెలా 2411 చౌక డిపోల ద్వారా రాయితీపై తొమ్మిది రకాల సరుకులు పంపిణీ చేసేవారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మహస్తం సరుకుల్లో కోత విధించి సరఫరా నిలిపివేసింది. నాలుగు నెలలుగా కేవలం బియ్యం, కిరోసిన్, చక్కెర సరఫరాతో సరిపెడుతున్నారు. పామాయిల్, కందిపప్పు, గోధుమ పిండి, కారం, ఉప్పు, చింతపండు, పసుపు, గోధుమలు తదితర నిత్యావసర సరుకుల సరఫరా గురించి పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టించుకోవడం మానేశారు. కార్డుకు కిలో పామాయిల్ చొప్పున 11.40 లక్షల కిలోల పామాయిల్ సరఫరా చేయాల్సి ఉంది. బహిరంగ మార్కెట్లో పామాయిల్ రూ.75 వరకు ధర పలుకుతుండగా రేషన్ దుకాణాల్లో మాత్రం రూ.40కి సరఫరా చేసేవారు. పేదలకు ఇచ్చే సబ్సిడీ సరుకుల్లో కందిపప్పు కూడా ముఖ్యమైనదే. పామాయిల్ మాదిరిగానే కందిపప్పు కూడా జిల్లాలో 11.40 లక్షల కిలోలు సరఫరా చేయాలి. రేషన్ దుకాణంలో కందిపప్పు కిలో రూ.50 ఇచ్చేవాళ్లు. బహిరంగ మార్కెట్లో ధర రూ.80 పలుకుతోంది. చక్కెర సరఫరాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఒక్కొక్క కార్డుదారునికి అరకిలో చొప్పున పంపిణీ జరుగుతుండగా ముందుగా ఎవరు వస్తే వారికే అనే రీతిలో పంపిణీ చేస్తుండటంతో కార్డుదారులందరికీ అందడం లేదు. స్టోర్ నిర్వహణ భారంగా మారింది ప్రజా పంపిణీ సరుకుల్లో కోత విధించడంతో కమీషన్ తగ్గిపోయి స్టోర్ నిర్వహణ కూడా భారంగా మారింది. బాడుగలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. రవాణా ఖర్చులు పెరిగాయి. ఆధార్ వల్ల కార్డుల సంఖ్య కూడా తగ్గిపోయింది. బయోమెట్రిక్ అమలు చేస్తే చౌక డిపో నిర్వహణ మరింత భారంగా మారుతోంది. ఈ విధానం అమలు చేస్తే డీలర్లకు నిర్వహణ ఖర్చు పోను నెలకు రూ.15 వేలు వేతనం ఇవ్వాలి. ఇప్పటికే చాలామంది డీలర్లు రాజీనామాలకు సిద్ధపడుతున్నారు. - వెంకటేష్ గౌడ్, డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మూన్నాళ్ల ముచ్చటే రేషన్‌కార్డు ద్వారా 9 సరుకుల పంపిణి మూన్నాళ్ల ముచ్చటగా మారింది. ప్రస్తుతం బియ్యం, కిరోషిన్, చక్కెర మాత్రమే ఇస్తున్నారు. చక్కెర అర కిలో మాత్రమే ఇవ్వడంపై ప్రభుత్వం పునరాలోచించాలి. ప్రతి వినియోగదారుడు ఇష్టపడే గోధుమలు,గోధుమ పిండి,చింతపండు, పామాయిల్ సప్లయిని నిలిపి వేయడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం. పేద ప్రజల ఇబ్బందులను గమనించి ప్రభుత్వ నిలిపివేసిన సరుకులను పంపిణి చేయవలసిన అవసరముంది. - షేక్ జమాల్‌వలి, రేషన్ కార్డుదారుడు, బనగానపల్లె చక్కెర కోటా పెంచాలి చౌక డిపోల ద్వారా అరకిలో మాత్రమే చక్కెర ఇస్తున్నారు. కనీసం రెండు కిలోలు చౌక డిపోల ద్వారా సరఫరా చేస్తే పేద ప్రజలకు ఊరట ఉంటుంది. చౌకదుకాణల ద్వారా పంపిణి చేస్తున్న 9 రకాల సరకులు నిలిచిపోవడానికి ప్రభుత్వమే కారణం. ప్రతి నెలా వినియోగదారులు పొందే పామాయిల్, గోధుమలు, కందిపప్పు, గోధుమ పిండి సప్లయిని ప్రభుత్వం నిలిపివేయడం బాధగా ఉంది. ఈ సరుకులను బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధరకు వేచ్చించి కొనుగొలు చేయాల్సి వస్తుంది. - బుచ్చిరెడ్డి, మిట్టపల్లి మూడు నెలలుగా బియ్యం వేయడం లేదు ఆధార్ నెంబర్లు డీలర్లకు ఇచ్చాం. ఆన్లైన్లో ఆధార్ నెంబర్ ఎక్కలేదని మూడు నెలలుగా డీలరు బియ్యం వేయడం లేదు. కార్డులో నేను, నా భార్య, ఇద్దరు పిల్లలం ఉన్నాం. నెలకు 16 కేజీలు వచ్చేవి. బియ్యం వేయాలని ఎమ్మార్వో ఆఫీస్‌లో అర్జీ పెట్టుకున్నాను. అయినా ఇంతవరకు ఆన్లైన్లో ఆధార్ నెంబర్ ఎక్కలేదు. డీలర్ బియ్యం వేయడం లేదు. - బోయ వీరన్న, కోడుమూరు -
ప్రజా పంపిణీ అవస్థ
కడప అగ్రికల్చర్: వాస్తవంలో చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా ఇప్పటికీ పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పూర్తి స్థాయిలో అందించిన పాపాన పోలేదు. నిత్యావసర సరుకుల పంపిణీకి సంబంధించి గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మహస్తం పథకాన్ని రద్దు చేసి ఎన్టీఆర్ ప్రజా పంపిణీ వ్యవస్థగా పేరు మార్పు చేశారు. పేరు మార్చినా వ్యవస్థ తీరు మాత్రం మారలేదు. చండీఘడ్, చత్తీస్గడ్ రాష్ట్రాలకు రాష్ట్ర మంత్రి సునీత, పౌరసరఫరాలశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు వెళ్లి అక్కడి ప్రజా పంపిణీ వ్యవస్థ తీరును చూసి వచ్చారు. వచ్చీరాగానే రాష్ట్రంలో అన్ని సరుకులు పేద ప్రజలకు అందజేస్తామని ఢంకా బజాయించి చెప్పారు. పర్యటనకు వెళ్లి వచ్చి నెలరోజులు దాటినా ఇంతవరకు పౌరసరఫరాల వ్యవస్థ తీరుతెన్నులపై సమీక్షించిన దాఖలాలు లేవని పేద ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 7,79,328 రేషన్‌కార్డులు ఉండగా, ఈ రేషన్‌కార్డులకు 1737 షాపుల ద్వారా 3587.73 టన్నుల సరుకులను ప్రజలకు అందజేసేవారు. ఇందులో బియ్యం, చక్కెర, చింతపండు, గోధుమపిండి, పసుపు, కారం పొడి, ఉప్పు, కందిపప్పు, పామోలిన్ వంటి తొమ్మిది రకాల వస్తువులను రూ. 185లకే అందజేస్తూ వచ్చారు. 2014 సంవత్సరం ప్రారంభం వరకు ఆయా సరుకులను ఇస్తూ వచ్చారు. కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తొమ్మిదింటిలో కేవలం బియ్యం, చక్కెరతోపాటు కిరోసిన్ మాత్రమే ఇస్తూ వచ్చారు. ఆ తర్వాత కిరోసిన్ ఒక నెలలో ఇస్తే మరో నెలలో ఇవ్వడంలేదని వినియోగదారులు వాపోతున్నారు. ప్రభుత్వం అన్ని సరుకులను ప్రజలను అందజేస్తామని చెప్పి ఇప్పటికీ ఆరు నెలలు గడిచిపోయినా వాస్తవం అందుకు విరుద్ధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు, ఐదుగురు సభ్యులు ఉన్న పేద కుటుంబాల వారు రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి ఉంటోంది. ఈ పరిస్థితుల్లో నిత్యావసర వస్తువులను సక్రమంగా ఇస్తుంటే మూడు పూటల భోజనం చేసేవారు. ఈ సరుకులు ఇవ్వకపోవడంతో అప్పులు చేసి పప్పుకూడు తినలేని పరిస్థితికి వచ్చారంటే ప్రభుత్వ తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరో పక్క డీలర్లు కూడా ప్రభుత్వంపై ఆగ్రహంగానే ఉన్నారు. గతంలో తొమ్మిది సరుకులు ఇచ్చేటపుడు ప్రజల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావని, ఇప్పుడు ఆయా వస్తువులు ఇవ్వకపోవడంతో తాము మొత్తం సరుకులను తినేస్తున్నట్లు కార్డుదారులు శాపనార్థాలు పెడుతుంటే భరించలేక పోతున్నామని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చేసే తప్పిదానికి తాము మాట పడాల్సి వస్తోందని డీలర్లు చెబుతున్నారు. -
16 మంది డిప్యూటీ కలెక్టర్ల నిరీక్షణకు తెర!
సాక్షి, హైదరాబాద్: 16 మంది డిప్యూటీ కలెక్టర్ల నిరీక్షణకు తెర పడనుంది. ఆరు నెలల ఎదురుచూపులు ఫలించనున్నాయి. వెయిటింగ్ జాబితా లో ఉన్న 16 మందికి పోస్టింగులు దక్కనున్నా యి. ఈ మేరకు రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు ఫైళ్లను సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆమోదం కోసం పంపారు. సోమవారం పోస్టింగ్ ఉత్తర్వు లు వెలువడే అవకాశం ఉందని రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు శుక్రవారం‘సాక్షి’కి తెలిపారు. ఎందుకింత జాప్యం.. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే (జూన్ 3న) డిప్యూటీ కలెక్టర్లుగా, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పనిచేస్తున్న 26 మందిని బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో పైరవీలు చేసి కీలకపోస్టులు దక్కించుకున్నారని కొందరిని, తెలంగాణ ప్రాంతం వారు కాదని మరికొందరిని ప్రభుత్వం బదిలీ చేసిందనే ఆరోపణలొచ్చాయి. అధికారుల కొరత ఏర్పడడంతో.. వెయింటింగ్‌లో ఉన్న డిప్యూటీ కలెక్టర్లలో తొమ్మిదిమంది ఆంధ్రా, మిగిలిన ఏడుగురు తెలంగాణకు చెందినవారు. తెలంగాణ ప్రభుత్వం ఏపీ అధికారులతోపాటు తెలంగాణకు చెందిన డిప్యూ టీ కలెక్టర ్లను కూడా వెయిటింగ్లో ఉంచడంపట్ల విమర్శలు వెల్లువెత్తాయి. కొత్త ప్రభుత్వం చేపట్టిన బృహత్తర కార్యక్రమాలు, పథకాలను అమ లు చేసేం దుకు తగినంత మంది అధికారులు లేకపోవడం, అరకొరగా ఉన్న అధికారులపైనే పనిభారం పడ డం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ కలెక్టర్లకు వెంటనే పో స్టుంగ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
యెమెన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు
సనా: యెమెన్‌లో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. 36 మంది మంత్రులతో కొత్త కేబినెట్‌ను ఏర్పాటు చేశారు. యెమెన్‌లో ఏర్పడ్డ రాజకీయ సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కొత్త ప్రభుత్వం కృషి చేయనుంది. కేబినెట్లో నలుగురు మంత్రులకు చోటు కల్పించారు. గత సెప్టెంబర్ 21న తిరుగుబాటుదారులు రాజధానిని నిర్బందించారు. అనంతరం నవంబర్ 1న ఐక్యరాజ్య సమితి దూత సమక్షంలో ప్రధాన రాజకీయ పార్టీలు శాంతి ఒప్పందంపై సంతకం చేశాయి. అధ్యక్షుడు అబ్ద్రబు మన్సూర్ హడీ ప్రభుత్వం ఏర్పాటు చేసుందుకు అంగీకరించారు. రాజకీయ పార్టీలకు, తిరుగుబాటు దారులకు మధ్య ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా ప్రభుత్వ ఏర్పాటులో ఆలస్యమైంది. -
కొత్త కోడలిలా వ్యవహరించాలి..
సర్కార్‌కు ‘సామ్నా’ సూచన సాక్షి, ముంబై: కొత్త కోడలు అత్తవారింట అణకువతో అందరినీ సంతోషపరిచేందుకు మనస్ఫూర్తిగా పనిచేసేటట్లుగానే బీజేపీ సర్కార్ కూడా రాష్ట్ర ప్రజల ఆశలను తీర్చాలని ‘సామ్నా’లో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే సూచించారు. సామ్నా శనివారం సంపాదకీయంలో ప్రభుత్వం ఏర్పాటైన తొలిరోజునే బీజేపీ ప్రభుత్వానికి సున్నితంగా మందలింపుతోపాటు సలహాలు, సూచనలు అందిస్తూ తనదైన శైలిలో హెచ్చరికలు జారీచేశారు. ముఖ్యంగా కొత్త ప్రభుత్వాన్ని నవ వధువుతో, రాష్ట్ర ప్రజలను అత్తతో పోల్చారు. పెళ్లైన కొత్తలో అత్తతోపాటు కుటుంబాన్ని సంతోషంగా ఉంచేందుకు కొత్త కోడలు పనులన్నింటినీ మనస్ఫూర్తిగా చేస్తుందని, తర్వాత అత్తపై పెద్దరికం చెలాయించేందుకు ప్రయత్నిస్తుందని వ్యాఖ్యానించారు. అయితే మహారాష్ట్ర ప్రజలు కఠినమైనవారు కాకపోయినా మంచి అత్తలాంటివారని బీజేపీకి చురకలంటించారు. అదేవిధంగా అత్తను (మహారాష్ట్ర ప్రజలను) సంతోషపెట్టడం కోడలి కర్తవ్యమని బీజేపీకి సూచించారు. అలాచేయకుండా అత్తపై పెద్దరికం చెలాయించేందుకు ప్రయత్నిస్తే మాత్రం తాము చెవులు పిండుతామని పేర్కొన్నారు. హామీలను పూర్తిచేయాలి... మహారాష్ట్రను ముక్కలుచేయకుండా అఖండంగానే ఉంచాలని ఉద్ధవ్ ఠాక్రే బీజేపీని కోరారు. అదేవిధంగా కొత్త ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు కొత్త ప్రభుత్వంపై ఎంతో నమ్మకంతోపాటు ఎన్నో ఆశలు ఉంటాయని, వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత వారిదేనని ఆయన స్పష్టం చేశారు. డీఎఫ్ సర్కారు గత 15 ఏళ్లల్లో ప్రజల అవసరాలను ఏమాత్రం తీర్చలేకపోయిందని, ఇలాంటి సందర్భంలో కొత్త ప్రభుత్వం ‘ఫినిక్స్ పక్షి’ మాదిరిగా పైకి ఎగరాలని, ఇది కొత్త ముఖ్యమంత్రితో జరగాలని తాము కోరుకుంటున్నట్లు ఉద్ధవ్ పేర్కొన్నారు. -
పాపం బంగారు తల్లి!
దరఖాస్తుదారుల్లో సగం మంది అకౌంట్లలోనే డబ్బులు మిగతా వారికి ఎదురుచూపులే.. పథకం ఉందా.. లేదా అనే సందేహాలు? కొత్త ప్రభుత్వం స్పందించాలని వేడుకోలు నిరుపేదలు ఆడపిల్ల జన్మించిందని ఆందోళన చెందొద్దు.. ఆమెకు 21 ఏళ్లపాటు అండగా ఉంటామని.. ఆపై చదువులకు ఖర్చులు కూడా బ్యాంకులోనే జమ చేస్తామని గత ప్రభుత్వం భరోసా ఇచ్చింది.. బంగారు తల్లి పథకాన్ని ప్రవేశపెట్టి దాని ద్వారా అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లలో డబ్బులు వేస్తామని చెప్పింది. కానీ... దరఖాస్తు చేసుకున్న వారిలో సగం మందికే డబ్బులు అందారుు. మిగిలిన వారు డబ్బుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. తొర్రూరు : పేదింటి ఆడపిల్లలకు పెళ్లి నాటికి చేయూతనివ్వాలని గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బంగారు పథకానికి ఆదిలోనే తూట్లు పడ్డాయి. 2013, మే 1వ తేదీ తర్వాత జన్మించిన ఆడపిల్లలను బంగారు తల్లి పథకంలో చేర్చే అవకాశం కల్పించింది. దీనికోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు బిడ్డ జన్మించినప్పుడు రూ.2,500, మొదటి, రెండో సంవత్సరం నాటికి రూ.వెయ్యి చొప్పున రూ.2వేలు, 3,4,5 ఏళ్ల నాటికి రూ.1,500 చొప్పున రూ.4,500, 6,7,8,9 ఏళ్ల నాటికి, రూ.2వేల చొప్పున రూ.8వేలు, 10,11,12,13 ఏళ్ల నాటికి రూ.2,500 చొప్పున రూ.10వేలు, 14,15 ఏళ్ల నాటికి రూ.3వేల చొప్పున రూ.6వేలు వారి బ్యాంకు అకౌంట్లలో డబ్బులు వేసేలా పథకాన్ని రూపొందించారు. 16,17 ఏళ్ల నాటికి రూ.3,500 చొప్పున రూ.7వేలు, 18,19,20,21 ఏళ్ల నాటికి రూ.4వేల చొప్పున రూ.16వేలు, అదనంగా ఇంటర్ పాస్ అయితే రూ.50వేలు, డిగ్రీ పాస్ అయితే రూ.లక్ష చొప్పున మొత్తం రూ.2.06లక్షలు ఆడపిల్ల పెళ్లినాటికి వారి అకౌంట్లలో డబ్బులు వేయాల్సి ఉంది. అయితే బిడ్డ పుట్టిన నెలలోపు ఇవ్వాల్సిన రూ.2,500లను దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల్లో సగం కంటే తక్కువ మంది అకౌంట్లలోనే జమ చేశారు. మిగిలిన సగం మంది లబ్ధిదారుల గత ఏడాదిగా దరఖాస్తులు చేసుకొని ఎప్పుడు తమ అకౌంట్లలో డబ్బులు పడుతాయోనని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దరఖాస్తులు బోలెడు... ఆడపిల్లలకు చేయూతనిస్తామని ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా బంగారు తల్లి పథకాన్ని ప్రవేశపెట్టింది. దీంతో ఆడపిల్లలకు జన్మనిచ్చిన తల్లులు పథకం కోసం దరఖాస్తు చేయడం ప్రారంభించారు. 2013, మే 1 నుంచి ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా హన్మకొండ మినహా 44 మండలాలకు చెందిన 12,406 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో మొదట బిడ్డ జన్మించినప్పుడు అందించాల్సిన రూ.2,500 చొప్పున 4,994 మందికి మాత్రమే వారి అకౌంట్లలో జమ చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. మిగిలిన 7,412 మందికి ఏడాది గడిచినా ఒక్క పైసా కూడా వారి అకౌంట్లలో పడలేదు. దీంతో నిరాశకు గురైన లబ్ధిదారులు అసలు బంగారు తల్లి పథకం ఉందా.. లేదా అని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో బాధ్యతలు చేపట్టిన కొత్త ప్రభుత్వం బంగారు తల్లి పథకాన్ని కొనసాగించి.. తమను ఆదుకోవాలని వేలాది మంది ఆడపిల్లల తల్లులు వేడుకుంటున్నారు. తొమ్మిది నెలలైనా పైసా రాలే నాకు బిడ్డ జన్మించి తొమ్మిది నెలలైంది. పాప పుట్టిన 10 రోజుల్లోనే బంగారు తల్లి పథకానికి దరఖాస్తు చేశా. ఆడపిల్లలు ఉన్న తమ కుటుంబానికి బంగారు తల్లి పథకం ఎంతో ఉపయోగపడుతుందని ఆశపడ్డాం. కొత్త ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి బంగారు తల్లి పథకాన్ని కొనసాగించే విధంగా చూడాలి. తమ కుటుంబాలను ఆదుకోవాలి. - గాయత్రి, అమ్మాపురం -
స‘పోర్టు’ ఇచ్చేనా?
కొత్త ప్రభుత్వం, కొత్త ప్రతిపాదనలు పీపీపీ అంటూ కొత్త రాగం నవయుగ సంస్థతో ఇంతవరకు చర్చలే లేవు బడ్జెట్లో బందరు పోర్టుకు నిధులేవీ? ఆరు నెలల్లో పోర్టు పనుల హామీ నెరవేరేనా? జిల్లా వాసులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న బందరు పోర్టు వ్యవహారం మూడడుగులు ముందుకీ... ఆరడుగులు వెనక్కీ అన్న చందంగా మారిందనే విమర్శలొస్తున్నాయి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పోర్టు నిర్మాణ విషయంలో పాలకులు కొత్తరాగం ఆలపించడం షరా మామూలైందనే వాదన వినిపిస్తోంది. గత ప్రభుత్వం బీవోటి పద్ధతి ప్రతిపాదిసే.. ప్రస్తుత ప్రభుత్వం పీపీపీ పద్ధతిని ప్రతిపాదిస్తుండడంతో పోర్టు అభివృద్ధి పనులపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. మచిలీపట్నం : బందరు పోర్టు నిర్మాణంపై టీడీపీ ప్రభుత్వం సాగదీత ధోరణితో వ్యవహరిస్తోందనే విమర్శలున్నాయి. ప్రభుత్వం గద్దెనెక్కిన వెంటనే ఆరునెలల్లో పోర్టు పనులు ప్రారంభిస్తామని జిల్లాకు చెందిన మంత్రులు చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే మూడు నెలలు పూర్తికావస్తోంది. ఇంత వరకు పోర్టు పనులు ప్రారంభానికి ఒక్క అడుగు ముందుకు పడలేదు. బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పోర్టు అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) ద్వారా పోర్టు నిర్మిస్తామని ప్రకటించారే తప్పా ఏ మేరకు నిధులు కేటాయిస్తారనే విషయాన్ని స్పష్టం చేయలేదు. కాగా గత ప్రభుత్వ హయాంలో బందరు పోర్టు నిర్మాణాన్ని బీవోటీ పద్ధతిలో నిర్మించేందుకు ఒప్పందం కుదిరింది. టీడీపీ ప్రభుత్వంలో పీపీపీ పద్ధతి ద్వారా పోర్టు నిర్మిస్తామని చెబుతుండటంతో... అసలు పోర్టు పనులు ప్రారంభమవుతాయా అనే అనుమానాలకు తెరలేస్తుంది. 13 సంవత్సరాలుగా బందరు పోర్టు నిర్మించాలనే ఉద్యమం జరుగుతోంది. ప్రభుత్వం, ముఖ్యమంత్రి మారిన ప్రతిసారీ పోర్టు నిర్మాణం చేయకుండా ఏవేవో సాకులు చెబుతూ ఈ అంశాన్ని సాగదీస్తూ వస్తున్నారు. నవయుగ సంస్థతో చర్చలే జరపలేదు ... బందరు పోర్టు నిర్మాణ పనులను నవయుగ కన్సార్టియం సంస్థకు 2010 ఏప్రిల్‌లో అప్పటి ముఖ్యమంత్రి కె.రోశయ్య అప్పగించారు. 2012 మే 2వ తేదీన పోర్టు నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి 5324 ఎకరాలను కేటాయిస్తూ జీవో నంబరు 11ను జారీ చేశారు. అప్పటి నుంచి భూసేకరణకు సంబంధించి ప్రభుత్వ పరంగా ఎలాంటి ముందడుగు పడలేదు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాకు చెందిన మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర ఆరు నెలల్లో బందరు పోర్టు పనులు ప్రారంభిస్తామని చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడు నెలలు కావస్తోంది. ఈ మూడు నెలల వ్యవధిలో బందరుపోర్టు పనులు దక్కించుకున్న నవయుగ సంస్థ ప్రతినిధులతో ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరపలేదు. భూసేకరణ ఉత్తర్వులు జారీ చేయలేదు. కాగా జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తేనే పోర్టు నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. -
పసికందుల ఆక్రందన
ఆందోళన కలిగిస్తున్న శిశు మరణాలు రుయా చిన్న పిల్లల ఆస్పత్రిలో మూడేళ్లలో 149 మంది మృతి ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్వహణ లోపమే కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం, వైద్యాధికారుల నిర్వహణా లోపం పసికందుల పాలిట శాపంగా మారింది. నిత్యం చిన్నారుల కేర్‌కేర్‌మనే శబ్దాలు వినపడాల్సిన రుయా చిన్నపిల్లల ఆస్పత్రి వారి ఆక్రందనలు, తల్లిదండ్రుల రోదనలతో మార్మోగుతోంది. తిరుపతి అర్బన్: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండున్నర నెలలు కావస్తున్నా జిల్లాలో వైద్యశాఖ పరంగా ఎలాంటి అభివృద్ధీ జరగలేదనడానికి ఈ ఆస్పత్రిలో సంభవిస్తున్న శిశు మరణాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. గడచిన మూడేళ్లలో ఇక్కడ 149 మంది శిశువులు మరణించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2012 ఆగస్టు 15 నుంచి రెండు నెలలపాటు ఇక్కడ సంభవించిన శిశు మరణాలపై మీడియాలో వచ్చిన వరుస కథనాలకు అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడు తీవ్రంగా స్పందించారు. ఆస్పత్రి సందర్శనకు వచ్చిన సందర్భంలో ఇక్కడ అన్ని వైద్య సదుపాయాలు, వైద్యుల నియామకం చేపట్టాల్సిన అవసరముందని నొక్కి వక్కాణించారు. ఆయన అధికారంలోకి వచ్చి రెండున్నర నెలలు పూర్తయినా ఇంతవరకు ఎలాంటి సౌకర్యాలూ ఏర్పాటు చేయలేదని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఆస్పత్రికి చిన్నారులతో వచ్చే అమ్మలకు కష్టాలు తప్పడం లేదు. ప్రధాన వైద్య యంత్రాలు లేవు ఎస్వీ మెడికల్ కాలేజీ పరిధిలో నిర్వహిస్తున్న చిన్న పిల్లల ఆస్పత్రికి ప్రతిరోజూ 200 మంది శిశువులను ఓపీకి తీసుకొస్తుంటారు. వారిలో 150 మందికి పైగా నెలలు నిండని వారు, తక్కువ బరువున్న వారు, వివిధ ఇన్ఫెక్షన్లు, జన్యులోపాలుండే వారే ఎక్కువగా ఉంటారు. వారందరికీ అవసరమైన ఇంక్యుబేటర్లు, వెంటిలేటర్లు చాలినన్ని లేకపోవడంతో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. శిశువులకు అత్యవసర స్కానింగ్ చేయించాలంటే పరుగులు తీయాల్సిన పరిస్థితి. కనీసం ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్ కూడా లేకపోవడంతో బయటకు రెఫర్ చేస్తున్నారు. ప్రొఫెసర్లు, వైద్యులు, నర్సులకూ కొరతే చిన్న పిల్లల విభాగంలో వైద్యమంటేనే ఎంతో అనుభవం గడించిన ప్రొఫెసర్లు అవసరం. ఈ ఆస్పత్రిలో ఒక పిడియాట్రిక్ సర్జన్, రెండు ప్రొఫెసర్ ఉద్యోగాలు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయి. పీఐసీయూ, ఎన్ఐసీయూ, పిడియాట్రిక్ న్యూరో, నెఫ్రాలజీ విభాగాలతోపాటు జనరల్ వార్డులు, ఐసీయూలు ఉన్నా యి. షిఫ్టుకు 20 మంది స్టాఫ్ నర్సులు ఉండాల్సి ఉండగా కేవలం 13 మంది మాత్రమే ఉన్నారు. ఆ దిశగా రుయా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా ఫలితం లేదు. ఆక్సిజన్ ప్లాంట్‌కు నిర్వహణ లేమి చిన్న పిల్లల ఆస్పత్రికి వెనుకవైపున కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎన్ఆర్హెచ్ఎం నిధులతో ఏడాది క్రితం సుమారు 6వేల లీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ ద్వారా ఎక్కువ శాతం ఆక్సిజన్ చిన్న పిల్లల ఆస్పత్రికే ఖర్చవుతోందని వైద్యాధికారులు చెబుతున్నారు. వారానికి 1000 లీటర్ల ఆక్సిజన్ కావాల్సి వస్తోంది. నిర్వహణా లేమి కారణంగా కొన్ని సందర్భాల్లో ఆక్సిజన్ సరఫరా చేసే ఏజెన్సీకి సకాలంలో బకాయిలు చెల్లించక వారు ఆలస్యం చేస్తున్నారు. అలాంటి సమయాల్లో శిశువులకు ఆక్సిజన్ అందక మరణాలు సంభవిస్తున్నాయి. సిబ్బంది లేకపోవడంతో బయటి ఆస్పత్రికి వెళ్లాం మా బాబుకు వీపుపై గడ్డ లేచింది. రుయా చిన్న పిల్లల ఆస్పత్రికి వచ్చాం. వైద్యుల సిఫారసు మేరకు పరీక్షలు చేయించడానికి ల్యాబ్ వద్దకు వెళ్లాం. ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వేచి ఉన్నా ఎవరూ రాలేదు. సెక్యూరిటీ సిబ్బంది సాయంతో బయట ల్యాబ్‌లకు వెళ్లాం. ల్యాబ్ సిబ్బంది ఆలస్యం వల్ల మేము ఇబ్బంది పడాల్సి వచ్చింది. బిడ్డకు సకాలంలో వైద్య సేవలు అందలేదు. -పెంచలయ్య, రాధా దంపతులు, వైఎస్సార్ జిల్లా అట్లూరు స్కానింగ్ ఎక్కడ చేస్తారో తెలియక ఇబ్బంది పడ్డాం నాలుగు నెలల కొడుకును తీసుకుని సాధారణ పరీక్షల కోసం చిన్న పిల్లల ఆస్పత్రికి వచ్చాను. ప్రసవం కూడా ఇక్కడే జరగడంతో వైద్యుల సలహా మేరకు పరీక్షలు చేయిస్తున్నా. మంగళవారం పరీక్షల కోసం రావడంతో గుండెకు సంబంధించిన స్కానింగ్ కోసం వైద్యులు సిఫారసు చేశారు. కార్డియాలజీ విభాగం ఎక్కడుందో తెలియలేదు. ఎవరిని అడిగినా సమాధానం చెప్పలేదు. దానికోసం గంటల తరబడి తిరగాల్సి వచ్చింది. -లక్ష్మి(పేరు మార్చాం), పాకాల మండలం -
మనోడా.. కాదా..!
సాక్షి, కర్నూలు: అధికారంలోకి వచ్చి రెండు నెలలు కాకముందే టీడీపీ శ్రేణులు అత్యుత్సాహాన్ని చూపుతున్నాయి. అంతా తామేనన్నట్లు ఆ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల కోసం పోటాపోటీ పడుతున్నారు. తాజాగా తమకు అనుకూలమైన అధికారుల కోసం అన్వేషణ మొదలు పెట్టారు. ఎన్నికల సమయంలో ఏ అధికారి ఎలా పనిచేశారో ఆరా తీస్తున్నారు. ఏ పార్టీకైనా, అభ్యర్థికైనా మద్దతిచ్చారా అనే కోణంలో ఆలోచన చేస్తున్నారు. అలాగే అవినీతికి దూరమా? దోచేసుకునే రకమా? ప్రజలకు అందుబాటులో ఉంటారా? ఇతరత్రా వ్యాపకాలేమైనా ఉన్నాయా?..తదితర వివరాలు తెలుసుకుంటున్నారు. జిల్లాలో ఎంతకాలంగా పనిచేస్తున్నారు? ఎలాంటి గుర్తింపు ఉంది? ఆ అధికారిని కొనసాగించడం వల్ల మేలు జరుగుతుందా? లేదా? అని పార్టీ నేతలతో సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ముఖ్య అధికారుల పనితీరు గురించి గత కొద్ది రోజులుగా టీడీపీ నాయకులు రహస్య విచారణ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు.. సైతం కొందరు అధికారులు, జిల్లా విభాగాధిపతుల గురించి తెలుసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ గత శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లాలో బదిలీలు కోరుకుంటున్న ఉద్యోగులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచే కొందరు అధికారులు.. అధికార పార్టీ నేతలను ఆశ్రయించి జిల్లాలో కీలక పోస్టింగుల కోసం యత్నిస్తున్నారు. కర్నూలు ఆర్డీవో పోస్టు కోసం ఓ రెవెన్యూ అధికారి యత్నిస్తున్నారు. ఈయన గతంలో కర్నూలు తహశీల్దారుగా పనిచేశారు. ఇటీవలే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి వచ్చింది. ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లాలో పనిచేస్తున్నారు. జిల్లాలో ఒక ముఖ్యనేతను తరచూ కలిసి వెళ్తున్నారు. అలాగే డ్వామా, డీఆర్డీఏ, జిల్లా విద్య, వైద్య తదితర శాఖల ఉన్నతాధికారులకు స్థానచలనం కలిగే అవకాశాలు ఉండటంతో ఇదే అదునుగా ఈ పోస్టుల కోసం గతంలో ఇక్కడ పనిచేసిన కొందరు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మండల స్థాయిలో కీలకమైన తహశీల్దారు, ఎంపీడీవో, ఎంఈవో, పీఆర్ ఏఈ, డీఈలు, విద్యుత్తు శాఖ ఏఈ, డీఈ పోస్టులతోపాటు కీలకమైన శాఖల్లో సూపరింటెండెంట్లుగా చోటు సంపాదించుకోవడానికి అధికారులతోపాటు ఉద్యోగులు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే కొందరు అధికారులు మాత్రం ఇక్కడే కొనసాగడానికి ప్రయత్నాలు మొదలుపెట్టగా.. ఇప్పటి వరకు అప్రాధాన్య విభాగాల్లో పనిచేస్తున్న మరికొందరు అధికారులు ఫోకల్ స్థానాల కోసం పైరవీలు ప్రారంభించారు. తుంగభద్ర నది తీర ప్రాంతంలో ఉన్న మండలాలకు తీవ్రమైన పోటీ నెలకొంది. ఇక్కడ ఇసుక రీచ్‌లు తదితర ఆదాయ వనరులు ఉండటంతో తీర మండలాలపై తహశీల్దార్లు కన్నేశారు. గతంలో అధికార పార్టీ, మరో పార్టీకి సహకరించారన్న విమర్శలను ఎదుర్కొన్న కొందరు అధికారులు.. పాలకపక్ష నేతలను విభిన్న మార్గాల్లో ప్రసన్నం చేసుకునే పనిలో తీరిక లేకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అధికారుల విషయంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాల్సిందే. -
మళ్లీ ఆధార్అవస్థలు!
బయోమెట్రిక్ కారణంగా 5 నెలలుగా అందని ఉపాధి వేతనాలు పింఛన్‌దారుల పరిస్థితీ అంతే తాజాగా ఉత్తర్వులతో లబ్ధిదారుల్లో ఆందోళన విశాఖ రూరల్ : ఆధార్ గందరగోళం మళ్లీ ప్రారంభమైంది. అన్ని పథకాలకు దీనిని తప్పనిసరి చేస్తూ కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బయోమెట్రిక్ విధానం ఉపాధి కూలీలకు, పింఛన్‌దారులకు చుక్కలు చూపిస్తోంది. ఐదు నెలలుగా వేలాది మంది పెన్షన్లకు నోచుకోక అవస్థలు పడుతుంటే.. తాజాగా ఆధార్ ప్రక్రియ మరింత భారం కానుంది . రేషన్‌కార్డుదారుల నుంచి ఉపాధి హామీ కార్మికుల వరకు ప్రతి ఒక్కరూ ఆధార్ వివరాలను నెలాఖరులోకి అందజేయాలనడంతో మళ్లీ అందరిలో ఆందోళన మొదలయింది. జిల్లాలో 44.38 లక్షల జనాభాలో 40.30 లక్షల మంది ఆధార్‌కార్డులకు వివరాలు నమోదు చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఐదు నెలల క్రితం వరకు జోరుగా సాగిన ఈ ప్రక్రియకు సుప్రీంకోర్టు జోక్యంతో బ్రేక్ పడింది. సంక్షేమ పథకాలకు ఆధార్‌ను తప్పనిసరి చేయడం సమంజసం కాదంటూ సుప్రీం తీర్పుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కు తగ్గాయి. అప్పటి నుంచి ఆధార్ ప్రక్రియ నెమ్మదించింది. తాజాగా అన్ని ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలను ఆధార్‌తో అనుసంధానం చేయాలని మళ్లీ కొత్త ప్రభుత్వం నిర్ణయించింది. ఫలితంగా రేషన్‌కార్డుదారుల నుంచి ఉపాధి హామీ కార్మికుల వరకు ప్రతీ ఒక్కరు ఆధార్ కార్డు వివరాలను సంబంధిత అధికారులకు అందజేయాల్సి ఉంది. ఈ నెల 31లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఆధార్‌తో ఆందోళన జిల్లాలో వృద్ధాప్య పింఛన్‌దారులు 1,46,224, అభయహస్తం 18,957, వికలాంగ 37,990, కల్లుగీత 926, వితంతు 1,15,027 మొత్తంగా 3,19,124 మంది పింఛన్‌దారులు ఉన్నారు. గతంలో ఫినో సంస్థ ద్వారా పింఛన్ చెల్లింపులు జరిగేవి. ప్రస్తుతం విశాఖ పరధిలో బ్యాంకు, గ్రామీణ ప్రాంతాల్లో పోస్టాఫీసుల ద్వారా పింఛన్ పంపిణీకి నిర్ణయించారు. ఇందుకు నాలుగు నెలలుగా బయోమెట్రిక్ ప్రక్రియ సా...గుతోంది. నాటి నుంచి వేలాది మందికి పింఛన్లు అందకుండా పోయాయి. ఇప్పటికీ ఇంకా 29 వేల మంది నుంచి వివరాలు తీసుకోవాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. అవకతవకలకు ఆస్కారం లేకుండా ఉండేందుకే బయోమెట్రిక్ విధానాన్ని చేపట్టింది. ఇది ఉండగా మళ్లీ ఆధార్‌తో అనుసంధానం ఎందుకన్న వాదన వ్యక్తమవుతోంది. జిల్లాలో కేవలం 85 వేల మంది మాత్రమే ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నారు. మిగిలిన 2,34,124 మంది ఇంకా సీడింగ్ చేసుకోవాల్సి ఉంది. బయోమెట్రిక్ విధానం వల్లే ఇబ్బందులు పడుతున్న తరుణంలో కొత్తగా ఆధార్‌తో సీడింగ్ చేసుకోవాలని చెప్పడం పట్ల లబ్ధిదారుల్లో ఆందోళన చెందుతున్నారు. 54 శాతం కార్డుదారులు అనుసంధానం రేషన్‌కార్డుల విషయంలో ఆధార్‌ను తప్పనిసరి చేశారు. జిల్లాలో అన్ని రకాల కార్డులు కలిపి మొత్తం 12.35 లక్షలు ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు 54 శాతం మంది మాత్రమే ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నారు. మిగిలిన వారు ఇంకా సీడింగ్ చేసుకోవాల్సి ఉంది. ఈ నెల 31లోగా కార్డుదారులు ఆధార్‌కార్డుల వివరాలు అందజేయాలని పౌర సరఫరా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రజల నుంచి స్పందన మాత్రం రావడం లేదు. -
కుంటుపడుతున్న ‘ఉపాధి’
కొత్త ప్రభుత్వం ప్రకటనతో ఫీల్డ్ అసిస్టెంట్లలో నిరుత్సాహం తగ్గుతున్న కూలీల సంఖ్య చిత్తూరు (అగ్రికల్చర్): జిల్లాలో ఉపాధి హామీ పథకం అమలు రోజురోజుకూ కుంటుపడుతోంది. ఉపాధి పనులకు వచ్చే కూలీల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. కొత్త ప్రభుత్వం చేసిన ప్రకటనతో ఉపాధి హామీ ఫీల్డ్అసిస్టెంట్లు నిరుత్సాహంగా ఉండడమే దీనికి కారణం. జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పథకం కింద 28 వేల శ్రమశక్తి సంఘాలకుగాను దాదాపు 4 లక్షల మంది కూలీలు ఉన్నారు. కూలీలకు ఆయా గ్రామాల పరిధిలో నిత్యం పనులు కల్పించేందుకు ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్ల విధానాన్ని ఏర్పాటు చేసింది. జిల్లాలోని 1347 గ్రామ పంచాయతీలకు గాను ప్రతి పంచాయతీకి ఒకరు చొప్పున ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించింది. ప్రతిరోజు కూలీలు చేపట్టిన పనులకు మార్కింగ్ చేయడం, కూలీల వేతనాలను నిర్ణయించేందుకు చేసిన పనుల వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలపడంలో ఫీల్డ్ అసిస్టెంట్లు కీలకపాత్ర వ హిస్తారు. దీంతో ప్రతివారం కూలీలకు నేరుగా ఆయా గ్రామాల్లోని పోస్టాఫీసుల్లో బయోమెట్రిక్ విదానం ద్వారా వేతనాలు అందేవి. దీంతో కూలీలు కూడా ప్రతిరోజు ఉపాధి పనులకు వచ్చేందుకు ఆసక్తిని కనబరిచేవారు. నిరుత్సాహంలో ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపాధి హామీ పనులను సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల విధానానికి తూట్లు పొడుస్తూ రాష్ట్రంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగిస్తామంటూ రెండు నెలల క్రితం ప్రకటించింది. జిల్లాలో మొత్తం 1347 పంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లలో ఏడాది క్రితం వివిధ కారణాలతో కొందరిని, లక్ష్యాలను చేరుకోలేదన్న సాకుతో మరికొందరిని ప్రభుత్వ తొలగించింది. దీంతో ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 811 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. వీరిని కూడా తొలగిస్తామని కొత్త ప్రభుత్వం ప్రకటించడంతో ఫీల్డ్ అసిస్టెంట్లలో నిరుత్సాహం చోటు చేసుకుంది. తగ్గిన కూలీల సంఖ్య ఉపాధి హామీ పనులకు విచ్చేసే కూలీల సంఖ్య జిల్లా వ్యాప్తంగా తగ్గింది. రెండు నెలల క్రితం రోజుకు దాదాపు లక్ష మంది కూలీలు పనులకు వచ్చేవారు. ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగిస్తామంటూ కొత్త ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లాలోని ఫీల్డ్ అసిస్టెంట్లు ఒకింత నిరుత్సాహానికి గురయ్యారు. కూలీలకు పనులను కల్పించడంలో వెనుకబడ్డారు. దీంతో ప్రస్తుతం రోజుకు 60 వేల మంది కూలీలు కూడా పనులకు రావడం లేదు. ఫలితంగా జిల్లాలో ఉపాధి హామీ పనులు కుంటుపడుతున్నాయి. దీంతో కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. -
‘గూడు’కట్టుకున్న భయం
కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలు పెట్టుకున్నారు. రుణాలు మాఫీ చేస్తారని రైతులు, మహిళలు.. పెన్షన్లు పెంచుతారని వృద్ధులు, వికలాంగులు.. కొత్తగా ఉద్యోగాలు ఇస్తారని యువకులు.. ఇందిరమ్మఇళ్ల బిల్లులు చెల్లిస్తారని లబ్ధిదారులు ఇలా ఒక్కరేమిటి.. అన్ని వర్గాల ప్రజలు అనుక్షణం కలలుగన్నారు. అయితే ప్రభుత్వం తీరుతో అందరిలోనూ గుబులు పట్టుకుంది. ఈ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందా.. ఒక్కో పథకాన్ని ఎత్తివేస్తూ అప్పుల పాలు చేస్తుందా అని ప్రతి ఒక్కరిలోనూ అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇదే కోవలోనే ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. బి.కొత్తకోట: కొత్త రాష్ట్రంలో గృహనిర్మాణ శాఖకు పనిలేకుండా పోయింది. కొత్తప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తుందని భావిస్తే పరిస్థితులు అందుకు పూర్తి విరుద్ధంగా ఉంటున్నాయి. దీంతో మండల స్థాయిలో ఇందిరమ్మ గృహనిర్మాణాలు పూర్తిగా ఆగిపోయాయి. నాలుగు నెలలుగా నిర్మాణాలు అటకెక్కినా, 9 వేల బిల్లులు పెండింగ్‌లో ఉన్నా పట్టించుకోని ప్రభుత్వం.. లాగ్ఇన్ ఇస్తే నిధులభారం పడుతుందని గృహనిర్మాణ శాఖ వైపు కన్నెత్తి చూడడంలేదు. మరోవైపు అనర్హుల పేరుతో ఇళ్లను రద్దు చేసే దిశగా చర్యలు వేగవంతం అవుతున్నాయి. దీంతో ఇందిరమ్మ పథకంపై నీలినీడలు అలుముకుంటున్నాయి. ఈ పథకం మునుపటిలా పరుగులు పెడుతుందా? లేక నిధులు ఇవ్వకుండా దశలవారీగా నీరుగార్చేలా చేస్తారా? అన్నది అధికారుల్లో చర్చ సాగుతోంది. ఈ పరిస్థితుల్లో జిల్లాలో ఇందిరమ్మ లబ్ధిదారుల పరిస్థితి దయనీయంగా మారింది. మండలాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందికి పనిలేకుండాపోయింది. ఎక్కడి నిర్మాణాలు అక్కడే జిల్లాలో ఇందిరమ్మ గృహనిర్మాణాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. బిల్లుల చెల్లింపులు పూర్తిగా నిలిచిపోవడంతో లబ్ధి దారులు నిర్మాణాలు చేపట్టడం లేదు. ఇప్పటికే జరి గిన నిర్మాణాలకు చెల్లింపులు ఎప్పుడు జరుగుతాయే అధికారులే చెప్పలేని పరిస్థితు లు. దీంతో అప్పులు చేయ డం ఎందుకని లబ్ధిదారులు పనులు ఆపేశారు. జిల్లా వ్యాప్తంగా 4,43,009 ఇళ్లను మంజూరు చేశారు. ఇందులో 2,95,134 ఇళ్లను పూర్తిచేశారు. 31,900 ఇళ్లు పునాదులు, 2,130 ఇళ్లు గోడల స్థాయిలో,13,170 ఇళ్లు రూఫ్లెవల్లో ఉన్నాయి. 1,00671 ఇళ్ల ఇంతవరకు ప్రారంభించనే లేదు. ఈ గణాంకాలు మే 24 నాటివి కాగా రూ.1236.2 కోట్లను ఇందిరమ్మ నిర్మాణాల కోసం ఖర్చు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ లెక్కలో మార్పులేదు. ఎందుకంటే అప్పటి నుంచి ఇళ్ల నిర్మాణాలు పూర్తిగా ఆగిపోయాయి. సిమెంటు సరఫరా నిలిపివేత ప్రభుత్వం జిల్లాకు సిమెంటు సరఫరాను నిలిపివేసింది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కోసం జిల్లా వ్యాప్తంగా 28 గోదాములను గృహ నిర్మాణ శాఖ నిర్వహిస్తోంది. ఇక్కడ వేల టన్నుల సిమెంటు నిల్వలు ఉండాల్సింది. ప్రతి నెలా సిమెంటు కర్మాగారాల నుంచి సిమెంటు సరఫరా అవుతుంది. అయితే ఏప్రిల్ నుంచి సరఫరా పూర్తిగా ఆగిపోయింది. జిల్లాలో తక్షణమే నిర్మాణాలు ప్రారంభిస్తే లబ్ధిదారులకు అవసరమైన సిమెంటును పంపిణీ చేయలేరు. 28 గోదాముల్లో ప్రస్తుతం 2,500 టన్నుల సిమెంటు నిల్వలు ఉన్నాయి. మార్చి 23 నుంచి బిల్లులు లేవు జిల్లాలోని ఇందిరమ్మ పథకం లబ్ధిదారులకు మార్చి 23వ తేదీ నుంచి బిల్లులు మంజూరు కాలేదు. అంతకు ముందు ఆన్లైన్లో ఉంచిన బిల్లులకు మాత్రమే చెల్లిం పులు జరిగాయి. నాలుగు నెలలుగా లబ్ధిదారులకు ఒక్క రూపాయి చెల్లింపు జరగలేదు. జిల్లా వ్యాప్తంగా సుమారు 9 వేల బిల్లులు పెండింగ్‌లో ఉండగా వీరికి రూ.15.66 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ నిధులను ప్రభుత్వం ఎప్పుడు చెల్లిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. లబ్ధిదారులు మండల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బిల్లులు ఎప్పుడిస్తారని ప్రశ్నిస్తే అధికారులు తెల్లమొహం వేస్తున్నారు. ఎప్పుడేమి జరుగుతుందో తెలియదు.. ఇక బిల్లుల గురించి ఏం చెప్పగలమంటూ నిర్లిప్తత వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల రద్దుకు నివేదికలు సిద్ధం జిల్లాలో 15,600 ఇళ్లను రద్దు చేసేందుకు అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే సబ్డివిజన్లలో పనిచేస్తున్న డీఈ స్థాయి అధికారుల నుంచి నివేదికలను తెప్పించుకున్నారు. జిల్లాలో 1,00,671 ఇళ్లు ప్రారంభానికి నోచుకోకుండా ఉండగా అందులో 15,600 మందిని అనర్హులుగా గుర్తించారు. జిల్లాలోని 18 సబ్ డివిజన్లకు చెందిన ఈ లబ్ధిదారులకు మంజూరు చేసిన ఇళ్లను రద్దు చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి. పైకి అధికారులు ఏమీ చెప్పకపోయినా ప్రభుత్వం నిర్ణయం ఇదేనని స్పష్టమవుతోంది. లాగ్ ఇన్ ఇస్తే నిధులు ఇవ్వాల్సివస్తుందని.. గృహనిర్మాణాలకు సంబంధించి బిల్లులు చెల్లించాలంటే డీఈలు చర్యలు తీసుకోవాలి. దీనికి ప్రభుత్వం శాఖాపరంగా నిర్వహిస్తున్న ఆన్లైన్లో లబ్ధిదారుల వివరాలు ఉంచాలి. ఇలా ఉంచాలంటే ఆన్లైన్ వివరాలు నమోదు చేసేందుకు డీఈలకు లాగ్ఇన్ పాస్వర్డ్ ఇవ్వాలి. అది ఇచ్చాక అధికారులు బిల్లుల కోసం లబ్ధిదారుల వివరాలను ఇచ్చాక వెంటనే బిల్లుల సొమ్మును లబ్ధిదారుని ఖాతాకు చెల్లించాలి. అయితే ఇప్పటికిప్పుడే గృహనిర్మాణాలకు సంబంధించిన లాగ్ఇన్ ఇస్తే వెనువెంటే నిధులభారం పడుతుంది. ఈ ఒక్క జిల్లాలోనే రూ.15.66 కోట్లు పెండింగ్ ఉంది. దీంతో పాటు పేరుకుపోయిన నమోదుకాని ఇళ్ల బిల్లులు ఇంకా కోట్లలోనే. దీంతో లాగ్ఇన్ జోలికి పోకపోతే బిల్లుల చెల్లింపు సమస్య ఉండదని ప్రభుత్వం భావించి దీనికి దూరంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఇది లబ్ధిదారులకు ఇబ్బందికరంగా మారింది. -
సర్కార్ షో
ఏలూరు : కొత్త ప్రభుత్వం కొలువుతీరి రెండు నెలలు కావస్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు కావ డం.. పదేళ్ల తరువాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం వంటి పరిణామాల నేపథ్యంలో పాలనాపరంగా మా ర్పులుంటాయని, ప్రాధాన్యతా అంశా లు.. అభివృద్ధిపరంగా ఎంతోకొంత కొత్తదనం ఉంటుందని.. కొంతైనా దూ కుడు ఉంటుందని అంతా భావించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ శాఖల్లో వంద రోజుల ప్రణాళిక అమలు చేయూలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తీరా అందులో పొందుపర్చిన అంశాలను చూస్తే ‘పాత సీసాలో.. పాత సారాయే’ అన్నట్టుగా ఉంది. ప్రభుత్వ శాఖలు చేపట్టే రోజు వారీ పనులనే వంద రోజుల ప్రణాళికలో చొప్పిం చారు. కొత్త పనులు చేపట్టడం మానేసి.. ప్రజలను మభ్యపెట్టేందుకు పాత పనులనే వంద రోజుల ప్రణాళికలో చేపడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా అభివృద్ధి, పెండింగ్ సమస్యల పరిష్కారం వంటి అంశాలేవీ వంద రోజుల ప్రణాళికలో కనిపించడం లేదు. కొత్తగా ఏవైనా పనులు చేర్చి ప్రజలకు ప్రయోజనం చేకూరేలా చూద్దామని అధికారులు అనుకుంటున్నా.. నిధులిచ్చే పరిస్థితి లేదని సర్కారు చేతులెత్తేస్తోంది. వ్యవసాయశాఖ, ఇరిగేషన్, వైద్య ఆరోగ్యశాఖ, విద్యుత్ తదితర శాఖల్లోనూ వంద రోజుల ప్రణాళికను అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జూలై నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు దీనిని కొనసాగించాలని పేర్కొంది. పాత వాటినే కొనసాగిస్తున్నా.. కొత్త ప్రణాళికను అమలు చేస్తున్నట్లుగా అధికారులు ప్రజలను భ్రమింప చేస్తున్నారు. సీజనల్ పనులకూ ప్రణాళికలా వంద రోజుల ప్రణాళికలో భాగంగా వ్యవసాయ, వైద్య ఆరోగ్య శాఖల్లో సీజనల్ పనులే చేపడుతున్నారు. వర్షాకాల సీజన్లో చేపట్టే రోజువారీ పనులనే వంద రోజుల ప్రణాళికలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది నిర్వహిస్తున్నారు. వ్యవసాయ శాఖ సైతం మట్టి నమూనాల సేకరణ, విత్తనాలు, ఎరువుల పంపిణీ, షాపుల తనిఖీలు వంటి పాత పనులనే ఈ ప్రణాళికలో చేపడుతోంది. విద్యుత్ శాఖ సైతం తరచూ చేపట్టే విద్యుత్ లైన్ల మార్పిడి, ట్రాన్ఫార్మర్ల చుట్టూ రక్షణ గోడల నిర్మాణం వంటి పనులను వంద రోజుల కార్యక్రమంలో చేపడుతోంది. ఇరిగేషన్లో సంకటం నీటి పారుదల శాఖలోనూ 100 రోజుల ప్రణాళికను అమలు చేయడానికి అధికారులు నిర్ణయించారు. అయితే, గతేడాది అక్టోబర్‌లో మంజూరు చేసిన పనులను, ఇటీవల ప్రారంభించిన పనులను తక్షణమే నిలుపుదల చేయాలంటూ ఉత్తర్వులు వచ్చాయి. మరోవైపు మైనర్ ఇరిగేషన్ పనులు చివరి దశకు చేరాయి. ఈ పరిస్థితుల్లో పాత పనులైనా పూర్తి చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. పోడోండ రిజర్వాయర్ పనులను మాత్రం ఈ వంద రోజుల్లో కాస్త ముందుకు నడిపించాలన్న యోచనలో యంత్రాంగం ఉంది. -
బదిలీల ‘బాబు’లు
తెలుగుదేశం పార్టీలో ‘బదిలీల బాబు’లు పుట్టుకొచ్చారు. రెవెన్యూ, పోలీస్ శాఖల్లో మాంచి డిమాండ్ ఉన్న పోస్టు కావాలంటే అధికారులు ఈ బాబులనే ఆశ్రయిస్తున్నారు. టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు జరగ్గా, జిల్లా స్థాయిలో అధికారుల బదిలీల్లో ఈ బాబులు కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వం మాదే..అధికారం మాదేనంటూ హల్చల్ చేస్తున్నారు. తమను ‘ప్రసన్నం’చేసుకున్న అధికారులకు అడిగిన చోట పోస్టింగ్ ఇవ్వాలంటూ ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తున్నారు. ఆనక ఆ పోస్టు మీదేనంటూ అధికారులకు భరోసానిస్తున్నారు. సాక్షి, గుంటూరు: జిల్లాలో రెవెన్యూ, పోలీస్ శాఖల్లో బదిలీల కలకలం ఆరంభమైంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత బదిలీలు తప్పవని తెలుసుకున్న పలువురు అధికారులు ఇప్పటికే టీడీపీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలను కలసి తమకు నచ్చిన పోస్టును రిజర్వు చేయించుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాలో కలెక్టర్, ఎస్పీల బదిలీలు పూర్తయ్యాయి. ఇక ఆర్డీఓ, తహశీల్దార్, డీఎస్పీ, సీఐ, ఎస్సై స్థాయి అధికారుల బదిలీలపై ఉన్నతాధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మరో వారం రోజుల్లో జిల్లా వ్యాప్తంగా పోలీస్, రెవెన్యూ శాఖల్లో భారీగా బదిలీలు జరగనున్నట్టు తెలుసుకున్న ఈ శాఖల అధికారుల్లో కలకలం మొదలయింది. మంచి పోస్టు పొందాలంటే టీడీపీ నేతల ఆశీస్సులు తప్పనిసరి అని తెలుసుకున్న అధికారులు తమ పరిధిలోని ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వీరిలో కొందరికి ఇప్పటికే పోస్టింగ్‌లపై హామీలు లభించగా, మరి కొందరు ద్వితీయశ్రేణి నాయకులను ఆశ్రయించి సిఫార్సులు చేయించుకుంటున్నారు. ఇదే అదనుగా భావిస్తున్న ద్వితీయశ్రేణి నేతలు పోస్టింగ్‌లు ఇప్పిస్తామంటూ ‘ఒప్పందం’ చేసుకుని డబ్బులు చేతులు మార్చుకుంటున్నట్టు సమాచారం. ఆర్డీఓ, డీఎస్పీ స్థాయి అధికారుల పరిధి రెండు, మూడు నియోజకవర్గాల వరకూ ఉండటంతో ఆ పోస్టుల నియామకం విషయంలో తీవ్ర పోటీ నెలకొంది. గుంటూరు ఆర్డీఓగా తాను చెప్పిన వ్యక్తినే నియమించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు ఇప్పటికే ఓ పేరు సూచించినట్లు తెలుస్తోంది. గురజాల ఆర్డీఓను యరపతినేని శ్రీనివాసరావు, తెనాలి ఆర్డీఓను ఆలపాటి రాజేంద్రప్రసాద్‌లు సూచించిన వారినే నియమించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. నరసరావుపేట ఆర్డీఓ, డీఎస్పీల నియామకంలో రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, స్పీకర్ కోడెల శివప్రసాదరావులు చెరొక పేరు సూచించినట్టు సమాచారం. ఇక్కడ ఎవరి మాట నెగ్గుతుందోనని టీడీపీ నాయకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఉన్నతాధికారులకు చేరిన జాబితాలు... పదేళ్ల తరువాత అధికారం చేజిక్కడంతో టీడీపీ నేతలతోపాటు తెలుగు తమ్ముళ్లు కూడా మంచి కసిమీద ఉన్నారు. తాము చెప్పినట్టు వినే అధికారులను మాత్రమే నియమించా లంటూ ఎంపీ, ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అన్ని నియోజకవర్గాల్లో రెవెన్యూ, పోలీస్ శాఖల్లోని తమకు కావలసిన ముఖ్యమైన అధికారుల జాబితాను ఇప్పటికే ఆయా శాఖల ఉన్నతాధికారులకు అందించినట్టు తెలుస్తోంది. లూప్‌లైన్ పోస్టులే శ్రేయస్కరం ... టీడీపీ నేతల దూకుడు చూసి కొందరు అధికారులు కీలక పోస్టులు తీసుకునేందుకు భయపడుతున్నారు. ఇప్పటికే అధికారులతో అడ్డగోలు పనులు చేయిస్తున్న టీడీపీ నేతలు రానున్న రోజుల్లో మరింత ఉధ్రుతం చేసే అవకాశం ఉందని, దీనివల్ల తీవ్ర విమర్శలపాలు కావాల్సి వస్తుందని అంటున్నారు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని కొంతకాలం లూప్‌లైన్ పోస్టుల్లో ఉండటమే మంచిదంటూ భావిస్తున్నట్లు సమాచారం. -
ఐటీడీఏకు శాపం
14 నెలలుగా కానరాని పాలకవర్గ సమావేశం గత ఐదేళ్లలో నాలుగుసార్లే నిర్వహణ కొత్త పాలనలోను జాప్యమేనా? అధికారుల్లో ఏదీ జవాబుదారీతనం పాడేరు: గిరిజనుల అభివృద్ధి కార్యక్రమాలపై 3 నెలలకు ఒకసారి నిర్వహించ వలసిన ఐటీడీఏ పాలకవర్గ సమావేశాల పట్ల అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ఐటీడీఏ పాలకవర్గ సమావేశాలు సక్రమంగా జరగలేదు. ఐదేళ్లపాలనలో నాలుగు సార్లే సమావేశాలు నిర్వహించడం గమనార్హం. చివరిసారిగా 2013 మే 11వ తేదీన ఐటీడీఏ పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించారు. తరువాత ఇంత వరకు ఐటీడీఏ పాలకవర్గ సమావేశాల జోలికి అధికారులు వెళ్లలేదు. పంచాయతీ ఎన్నికలు ముగిసిన తరువాత పాలకవర్గ సమావేశాలు జరుగుతాయని గిరిజనులు ఆశపడినప్పటికి ఫలితం లేకపోయింది. సార్వత్రిక ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు కావస్తున్నా పాలకవర్గ సమావేశం ఊసెత్తడం లేదు. జిల్లా కలెక్టరు, ఐటీడీఏ పీఓలు పాలకవర్గ సమావేశాన్ని 3 నెలలకు ఒకసారి నిర్వహించాల్సి ఉంది. గిరిజనాభివృద్ధికి కీలకమైన పాలకవర్గ సమావేశాన్ని నిర్లక్ష్యం చేయడంతో అభివృద్ధిపై చర్చించే పరిస్థితి ఉండడం లేదు. ఐటీడీఏకు వచ్చే నిధులు వాటిని గిరిజనాభివృద్ధికి ఉపయోగించేందుకు చేపట్టే చర్యలపై సమీక్ష జరపాల్సి ఉంది. గిరిజన ఉప ప్రణాళిక, ఐఏపీ, సమగ్ర కార్యచరణ ప్రణాళిక పథకాల ద్వారా ఐటీడీఏకు వచ్చే నిధులకు పాలకవర్గ సమావేశం లేక జవాబుదారీతనం కూడా లోపిస్తోంది. ఐటీడీఏ ద్వారా చేపట్టే కార్యక్రమాలన్నీ ఇష్టారాజ్యంగానే మారుతున్నాయనే ఆరోపణలు అధికంగా వినిసిస్తున్నాయి. రాష్ట్రం లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికి పాడేరు ఐటీడీఏ పరిధిలోని ఎమ్మెల్యేలు, అరకు పార్లమెంట్ సభ్యురాలంతా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీకి చెందిన వారే. గిరిజనాభివృద్ధి కార్యక్రమాలను సంపూర్ణంగా నిర్వహించాలని వారంతా కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఐటీడీఏ పాలకవర్గ సమావేశం జోలికి అధికారులు వెళ్లకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఐటీడీఏ పాలకవర్గ సమావేశాలను మూడు నెలలకు ఒకసారి నిర్వహించి తమ అభివృద్ధికి పాటుపడాలని గిరిజనులు కోరుతున్నారు. -
ఉల్లంఘనుల గుండెల్లో గుబులు
నగర వ్యాప్తంగా విస్తరించిన అక్రమ కట్టడాలు ఏటా పెరుగుతోన్న నిర్మాణాలు అధికారులు గుర్తించినవి కొన్నే అంతకు మూడు రెట్లు అధికం.. గురుకుల్ ట్రస్ట్‌తో మొదలైన కూల్చివేతలు గ్రేటర్ మొత్తంపై దృష్టిసారించనున్న అధికారులు ఆందోళనలో అక్రమార్కులు సాక్షి, సిటీబ్యూరో: అక్రమ కట్టడాల పేరిట చేపట్టిన కూల్చివేతలు గురుకుల్ ట్రస్ట్ భూముల్లోని అయ్యప్ప సొసైటీతోనే ఆగుతుందా లేక నగరంలోని మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందా అనేది ప్రస్తుతం గ్రేటర్లో చర్చనీయాంశమైంది. స్థానికుల నిరసనల మధ్యే గురుకుల్ ట్రస్ట్ పరిధిలో రెండు రోజులుగా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. గురుకుల్ సహా గ్రేటర్‌లోని అక్రమ నిర్మాణాలన్నింటిపై చర్యలు తీసుకోవాలని అధికారులతో సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదేశించిన దరిమిలా నగరంలోని అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. గత ఆరునెలల్లో భారీగా.. ఓటరు నమోదు, సార్వత్రిక ఎన్నికల పనుల్లో జీహెచ్ఎంసీ అధికారులు బిజీగా ఉండడంతో ఆరు నెలలుగా అక్రమ నిర్మాణాలపై పెద్దగా దృష్టి సారించలేదు. ఇదే అదనుగా కొందరు వ్యక్తులు అక్రమ నిర్మాణాలను జోరుగా కొనసాగించారు. గ్రేటర్ పరిధిలో 865 అక్రమ నిర్మాణాలున్నట్టు అధికారులు ఇప్పటికే గుర్తించారు. గడచిన నాలుగేళ్లలో అవి వెలసినట్లు పేర్కొంటున్నా ఇటీవలే ఎక్కువ నిర్మాణాలు జరిగాయి. అధికారుల దృష్టికి రాని కట్టడాలు అంతకు మూడు రెట్లు ఎక్కువే ఉంటాయని అంచనా. దృష్టికొచ్చిన అక్రమ నిర్మాణాల్లో 229 మందిపై అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అయితే వీరికి తగిన శిక్షలు లేకపోవడంతో చట్టాలను ఎవరూ లెక్కచేయట్లేదు. నాలుగేళ్లలో 50 వేల దరఖాస్తులు.. భవన నిర్మాణాల అనుమతుల కోసం నాలుగేళ్లలో జీహెచ్ఎంసీకి 50 వేల దరఖాస్తులు రాగా, వాటిలో 1,500 ఇంకా పరిష్కారానికి నోచుకోలేదు. ఇక, నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ సెల్లార్లలో ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్న భవంతులకూ కొదవ లేదు. 799 భవనాలు ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడినట్టు గుర్తించిన అధికారులు వాటిల్లో 31 భవనాలను సీజ్ చేశారు. 384 కూల్చివేశారు. 45 మంది యజమానులు కోర్టులను ఆశ్రయించారు. నిర్మాణ అనుమతి పొంది.. అందుకు విరుద్ధంగా నిర్మించిన వారి సంఖ్యా ఎక్కువే ఉంటుంది. అలాంటి వారి నుంచి కాంపౌండింగ్ ఫీజుగా రూ.60.02 కోట్లు వసూలు చేశారు. నాలుగేళ్లలో నిర్మాణానికి అనుమతి పొందినవారు దాదాపు 50 వేల మంది ఉండగా, అందులో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు 6,042 మంది మాత్రమే కావడం గమనార్హం. మిగతా వారంతా నిబంధనలు ఉల్లంఘించిన వారేనని భావించాల్సి వస్తోంది. ఆక్యుపెన్సీకి దరఖాస్తు చేసుకున్న వారిలో సైతం 536 భవనాల్లో ఉల్లంఘనలున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ లెక్కన సక్రమంగా నిర్మాణాలు జరిగిన భవనాలెన్ని ఉంటాయో తేలిగ్గానే అంచనా వేయవచ్చు. అక్రమ నిర్మాణాలపై కొత్త సర్కార్ సీరియస్‌గా ఉండడంతో అక్రమార్కులు ఆందోళనకు గురవుతున్నారు. -
బీమాపై వేటు... వడ్డీకి రిబేటు
పంట రుణమాఫీ తప్పుకునేందుకు కొత్త ఆఫర్లు అప్పు చెల్లిస్తే వడ్డీ రిబేటు ఇస్తామంటూ బేరం పంట బీమా వర్తించదంటూ నోటీసులు లబోదిబోమంటున్న రైతులు ఓ మారు అతివృష్టి, మరోమారు అనావృష్టి, ఇంకోమారు ప్రభుత్వ అనాలోచిత విధానాలతో తీవ్ర నష్టాలపాలవుతున్న రైతుల పాలిట బ్యాంకర్ల నోటీసులు గోరుచుట్టుపై రోకటిపోటులా వెంటాడుతున్నాయి. అసలే రుణమాఫీ విషయంలో తీవ్ర అయోమయానికి నిత్య గందరగోళానికి గురౌతున్న రైతన్నను ప్రభుత్వం, బ్యాంకర్లు ప్రకటిస్తున్న కొత్త ఆఫర్లు మరింత భయాందోళనలకు గురిచేస్తున్నాయి. గుడ్లవల్లేరు :కొత్త ప్రభుత్వం హాయాంలో రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రుణమాఫీతో సహా సరికొత్త పథకాలు వర్తింపజేస్తారనుకుంటే రైతుల్ని ముంచేసే అర్ధంకాని ఆఫర్లు ఇస్తూ రుణమాఫీనుంచి తప్పించుకునేందుకు చూడడం చంద్రబాబు నైజాన్ని మరోమారు చాటిందని రైతులు విమర్శిస్తున్నారు. వివరాల్లోకి వెళితే ఈ నెల 30వ తేదీ లోగా పంట రుణాల్ని చెల్లించేసిన రైతులకు వడ్డీ రిబేటు ఇస్తామన్న కొత్త ఆఫర్‌తోపాటు 2013 ఆగస్టు ఒకటవ తేదీ నుంచి పంట రుణాలు తీసుకున్న రైతులకు పంట బీమా వర్తించదని వివరిస్తూ కౌతవరం ఆంధ్రాబ్యాంకు నోటీసు బోర్డులో ప్రకటించారు.అలాగే స్థానిక పీఏసీఎస్ నుంచి కూడా రుణమాఫీ హామీని తప్పించుకునే విధంగా కొన్ని కరపత్రాల్ని రైతుల ఇంటింటికీ పంచిపట్టారు.దీనికి సమ్మతిస్తేనే, పంట రుణాలకు ముందుకు రావాలంటూ ఆ నోటీసులో ప్రకటించడం రైతుల్ని మరింత ఆందోళనకు గురిచేస్తుంది. చంద్రబాబు విధానం చూస్తుంటే 2003 నాటి పాలన గుర్తుకు వస్తుందని బాధిత రైతులంటున్నారు. వ్యవసాయం దండగ అన్న ఆయన ఆ జ్ఞాపకాలకు తిలోదకాలివ్వలేకే తొలి సంతకంలోనే నైజాన్ని చాటుకున్నారని విమర్శిస్తున్నారు. కళ్ల ముందు ఖరీఫ్ సాగు కనబడుతుందని, ఇంకా ఎన్ని రోజుల తర్వాత రుణమాఫీ ప్రకటిస్తారని అడుగుతున్నారు. కాగా గుడ్లవల్లేరు మండలంలోని ఒక్క కౌతవరం ఆంధ్రాబ్యాంకు పరిధిలోనే 30మంది రైతులకు పంట రుణాలు చెల్లించాలంటూ నోటీసులు జారీ చేశారు. దాదాపు రూ.12లక్షల మేరకు బంగారు నగల మీద సాగుకు రుణాలు తీసుకున్నారు. ఈ రుణాల్ని వెంటనే చెల్లించకపోతే 28వ తేదీన రుణగ్రస్తుల బంగారు నగల్ని వేలం వేస్తున్నట్లు నోటీసులు జారీచేశారు. బ్యాంకు ఉన్నతాధికారుల నుంచి నోటీసులు ఇవ్వాల్సిందిగా తమకు ఆదేశాలు వచ్చినందునే నోటీసులు ఇచ్చామని కౌతవరం ఆంధ్రాబ్యాంకు మేనేజరు ప్రసాద్ చెబుతున్నారు. పొలాల పాసు పుస్తకాల నకలు పెట్టి రుణాలు తీసుకోని బంగారు నగల రుణగ్రస్తుల్ని వ్యాపారులుగా గుర్తించి నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమేనని తెలిపారు. రెండెకరాలు చేస్తున్నా... వ్యవసాయానికే రుణం తీసుకన్నా. రూ.79వేలు సాగుకు ఖర్చయ్యింది. ఇపుడు మేనేజరు పొలం కాగితాలు పెట్టలేదు కాబట్టి అప్పు కట్టాల్సిందేనని అంటున్నారు. మాకు రుణమాఫీ చేయకుండా బడారైతులకే ఆ పథకం వర్తింపజేచేలా చేసేలా ఉన్నారు. - షేక్ అల్లాబక్షు, కౌతవరం రైతు రోజుల్లో చెల్లించమంటే ఎలా? నాలుగు రోజుల్లో పంట రుణం చెల్లించమని నోటీసులిస్తే, ఎలా చెల్లించగలం. మూడెకరాల పొలాన్ని సాగు చేస్తున్నా. నగలు తీసుకెళ్లకపోతే ఈ నెల 28వ తేదీన బహిరంగ వేలం వేసేస్తానని బ్యాంకువారు అంటున్నారు. రుణమాఫీ చేసేంతవరకూ రుణాలు చెల్లించనే చెల్లించం. - ఈడె చలపతిరావు, కౌతవరం రైతు మహిళా రైతులెంతమంది.... ఐదెకరాల పొలాన్ని సాగు చేస్తున్నా నన్ను రైతును కాదంటే ఎలా? రైతును కాదంటూ బంగారం అప్పు కట్టమని నోటీసులివ్వడం దారుణం. మహిళా రైతులంటున్నారు. నూటికి అలాంటి రైతులు ఎంతమంది ఉంటారు. రుణమాఫీ హామీ తప్పుకునేందుకే ఇలాంటి చేతకాని సాకులు వెతుక్కుంటున్నారు. - బోట్ల జగన్మోహనరావు, కౌతవరం రైతు -
ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఔట్ !
గృహనిర్మాణ శాఖలో 201 మంది తొలగింపు జూలై 1 నుంచి అమలు ఎండీ ఆదేశాలు బి.కొత్తకోట: ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై వేటు పడింది. కొత్త ప్రభుత్వంలో తమకు మంచి జరుగుతుందన్న వీరి ఆశలు గల్లంతయ్యాయి. తొలి అస్త్రం గృహనిర్మాణ శాఖపై ప్రయోగించారు. దీంతో 201 మంది ఉద్యోగులు వీధిన పడనున్నారు. గురువారం సాయంత్రం ఈ మేరకు ఆ శాఖ మేనేజింగ్ డెరైక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులు ధ్రువీకరించారు. 2004కు ముందున్న ప్రభుత్వాలు నియోజకవర్గానికి 500 నుంచి 1,000 లోపు గృహాలను మంజూరు చేస్తూ వాటి నిర్మాణాల బాధ్యతలను వర్క్ఇన్స్పెక్టర్లకు అప్పగించడం జరిగేది. వర్క్ఇన్స్పెక్టర్లు రెండు లేక మూడు మండలాలకు కలిపి ఒకరుండేవారు. అయితే 2004లో వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక గృహనిర్మాణ శాఖకు ప్రాధ్యాన్యం ఏర్పడింది. ప్రతిపేదకూ పక్కాగృహం మంజూరు చేసేందుకని 2005-06లో ఇందిరమ్మ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాకు 3,51,104 గృహాలను మంజూరు చేశారు. దీంతో గృహనిర్మాణ శాఖ కీలక శాఖగా మారింది. వేల కోట్లను ఖర్చు చేసే శాఖగా మారిపోవడంతో వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మాణల పర్యవేక్షణ, వేగవంతం కోసం చర్యలు చేపట్టారు. మండలాలకు ఏఈలు, కొత్తగా సబ్డివిజన్లను ప్రారంభించారు. అలాగే పాలన, పనుల వేగవంతం, పర్యవేక్షణ కోసం కొత్త ఉద్యోగాల నియామకం చేశారు. మండలాలకు ఔట్సోర్సింగ్ ద్వారా మండల స్థాయి ఏఈల నుంచి వర్క్ఇన్స్పెక్టర్లు, డెటాఏంట్రీ ఆపరేటర్లను నియమించారు. జిల్లాలో 2006 నుంచి వీరి నియామకం సాగుతూ వస్తోంది. ప్రస్తుతం జిల్లాలో 7 మంది మండల స్థాయి ఏఈలతో పాటు 201 మంది ఉద్యోగులు జిల్లా వ్యాప్తంగా పని చేస్తున్నారు. కొత్త ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టాక ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఇంటికి సాగనంపుతారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ పరిస్థితుల్లో గురువారం సాయంత్రం గృహనిర్మాణ శాఖ ఎండీ నుంచి ఆదేశాలు అందాయి. జిల్లాలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సేవలను ఈనెల 30వ తేదీ వరకు మాత్రమే వినియోగించుకోవాలని, జూలై1 నుంచి కొనసాగించరాదని ఆదేశాలు వచ్చాయి. దీంతో జిల్లాలో 201 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు వీధిన పడనున్నారు. జూలై 1 తర్వాత ఎవరు ఆదుకుంటారు, కుటుంబాలను ఎలా పోషించుకోవాలంటూ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్ముందు మరిన్ని శాఖల్లో కూడా ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. -
వెలగని ‘దీపం’..?
నల్లగొండ :రాజకీయ నేతల ఆర్భాటం సామాన్యలను నట్టేట ముంచింది. దీపం కనెక్షన్లు ఎప్పటికై నా వస్తాయని ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ఆశలు రోజురోజుకు సన్నగిల్లుతున్నాయి. రాజకీయ పైరవీలతో ఎంపిక చేసిన లబ్ధిదారులతో పాటు, అర్హులైన సామాన్యులు సైతం ఇక్కట్లు పడక తప్పట్లేదు. ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు నాటి ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా శాసన సభ్యులకు ప్రత్యేకంగా దీపం కనెక్షన్లు కేటాయించింది. వీటితో పాటు గతంలో మిగిలిన కొన్ని కనెక్షన్లు కూడా తోడయ్యాయి. అయితే ఈ మొత్తం కనెక్షన్లకు సంబంధించిన డిపాజిట్లను లబ్ధిదారుల తరఫున ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు చెల్లించాల్సి ఉంది. ఒక్కో కనెక్షన్‌కు రూ.1400 చెల్లించాలి. కానీ ప్రభుత్వం ఆ మొత్తాన్ని ఆయిల్ కంపెన్లీకు ఇవ్వలేదు. దీంతో కంపెనీలు కనెక్షన్లు మంజూరు చేయకుండా నిలిపేశాయి. ఎదురుచూపులు... అర్హులైన లబ్ధిదారులను ఎంపిక పూర్తయి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు మంజూరు కాలేదు. జిల్లాలో గడిచిన రెండేళ్లలో 6,604 కనెక్షన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవిగాక ఎన్నికల ముందు శాసన సభ్యుల కోటా పేరుతో కొత్తగా 31వేల కనెక్షన్లు మంజూరు చేశారు. ఎప్పుడూ జిల్లా కోటాతోనే మంజూరవుతూ వస్తున్న దీపం కనెక్షన్లు.. ఈ సారి ఎన్నికలు రావడంతో శాసనసభ్యులకు లబ్ధిచేకూరాలనే ఉద్దేశంతో ప్రత్యేక కేటాయింపులు చేశారు. దీంతో అప్పటి ఎమ్మెల్యేలు తమకు నచ్చిన వ్యక్తులను ఈ పథకానికి లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. దీనిపై అప్పట్లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వారికి కేటాయించిన కోటాలో 10వేల కనెక్షన్లు అప్పటికే గ్రౌండింగ్ కూడా పూర్తి చేశారు. ఇంకా 21వేల కనెక్షన్లు పెండింగ్‌లో ఉన్నాయి. పథకం మార్చే యోచన... కొత్త రాష్ట్రంలో కొత్త సర్కారు పాలనలో లబ్ధిదారుల ఎంపిక మళ్లీ మొదటికి వస్తోందేమోనన్న ఆందోళన లబ్ధిదారుల్లో నెలకొంది. ఎమ్మెల్యేల కోటా విషయంలోనే ఈ ప్రస్తావన ప్రధానంగా వినిపిస్తోంది. దీంతో పాటు పథకం అమలు సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం కూడా నివేదికలు కోరుతోంది. దీపం పథకాన్ని అసలు అమలు చేయాలా.. ? లేదా?, పథకంలో ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుంది అనే అంశాలపై జిల్లా అధికారుల నుంచి సమాచారం సేకరిస్తోంది. అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల వివరాలను కూడా సేకరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దీపం కనెక్షన్లు పొందాలంటే లబ్ధిదారులు కళ్లల్లో వత్తులు వేసుకుని మరికొంత కాలం ఎదురుచూడక తప్పదు. దీపం గ్యాస్ కనెక్షన్ల గ్రౌండింగ్ వివరాలు సంవత్సరం మంజూరైనవి లబ్ధిదారుల ఎంపిక జరిగినవి పెండింగ్‌లో ఉన్నవి 2009-10 24,871 24,871 24,467 404 2011-12 14,000 14,000 7,800 6,200 ఎమ్మెల్యేలకు కేటాయింపు 31,000 31,000 10,000 21,000 -
ఇక బాదుడే!
కడప అగ్రికల్చర్: మరో నెలన్నర రోజుల్లో కరెంటు చార్జీలు మోత మోగనున్నాయి. కొత్త ప్రభుత్వంలో బడ్జెట్ లోటును భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. విభజన నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్‌శాఖ నూతనంగా రూపొందించిన టారీఫ్ ప్రకారం కరెంటు బిల్లులు దాదాపు రెట్టింపు చేయనున్నారు. దీంతో వినియోగదారుల జేబులకు చిల్లులు పడనున్నాయి. కొత్త టారీఫ్ బిల్లును చూసి వినియోగదారుని గుండె గుభేల్మనడం ఖాయం. వినియోగదారుడి నడ్డి విరిచేలా ఉన్న ఈ తాజా ప్రతిపాదనలు అమలైతే జిల్లాలోని వినియోగదారులపై ఏడాదికి రూ. 185 కోట్ల భారం పడనుంది. జూన్ నెల రెండో తేదీ విభజన నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్‌నెల నుంచి విద్యుత్ చార్జీలు పెంచాలని డిస్కం ఈఆర్సీకి ప్రతిపాదనలు గతంలోనే సమర్పించింది. అయితే సార్వత్రిక ఎన్నికలు, ట్రాన్స్‌కో విభజన తదితర అంశాలతో కరెంటు చార్జీలను పెంచలేకపోయారు. రాష్ట్ర విభజన అనంతరం యూనిట్ కరెంటు చార్జీ శ్లాబ్ దాటితే ముక్కుపిండి రూ. 300లకుపైగా వసూలు చేయనున్నారు. కొత్త రాష్ట్రంలో వినియోగదారులకు దిమ్మతిరిగేలా డిస్కం షాక్ ఇవ్వనుంది. చార్జీల పెంపు, కొత్త టారీఫ్‌లపై విద్యుత్‌శాఖ అధికారులు ప్రక్రియలు పూర్తి చేశారు. జిల్లాలో అన్నీ కలిపి 8 లక్షల విద్యుత్ సర్వీసులున్నాయి. ఇందులో గృహాల సర్వీసులు 1.96 లక్షలు, వ్యవసాయ సర్వీసులు 1.20 లక్షలు, పెద్ద పరిశ్రమల సర్వీసులు 350, ఎల్టీ సర్వీసులు 2500 ఉన్నాయి. ప్రస్తుతం 150 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తే కరెంటు బిల్లు రూ. 382.50 వస్తోంది. పెరగనున్న విద్యుత్ చార్జీల ప్రకారం అదే 150 యూనిట్లకుగాను ఇకపై రూ. 611.50 చెల్లించాల్సి ఉంటుంది. పొరబాటున ఒక యూనిట్ అదనంగా వాడితే అంటే 151 యూనిట్లు వాడితే బిల్లు రూ. 927లు రానుంది. అంటే ఒక్క యూనిట్ పెరిగితే అదనంగా రూ. 316 బిల్లు వస్తుంది. 50 యూనిట్ల శ్లాబ్ పరిధిలోకి యూనిట్ రేటు పెంచి వినియోగదారుడి నుంచి వసూలు చేయనున్నారు. పస్తుతం 0-50, 51-100, 101-150 శ్లాబ్ పరిధిలో రూ. 1.45, 2.60, 3.60 చొప్పున లెక్క కట్టి బిల్లులు వసూలు చేస్తున్నారు. పెరిగే చార్జీల ప్రకారం యూనిట్ ఈ శ్లాబ్‌ల పరిధిలోనే రేటు రూ 3.10, 3.75, 5.38ల వంతున బిల్లులు పెంచనున్నారు. 150 యూనిట్లు దాటి ఒక్క యూనిట్ పెరిగినా, 151-200 శ్లాబ్‌లోని యూనిట్ రేటు రూ. 6.32 ల వంతున ఆ శ్లాబ్ మొత్తం వసూలు చేస్తా రు. ఇప్పటికే డిస్కం విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి ప్రతిపాదనలు సమర్పించగా ఆ మండలి ఆమోదం తెలపడం తో వినియోగదారులకు ఇక కరెంటు బిల్లుల మోత మోగనుంది. గృహ విని యోగదారులకు 100 యూనిట్లకు ఉన్న శ్లాబ్‌ను 50 యూనిట్లకు కుదించనున్నా రు. ఈ బాదుడు మొదలైతే జిల్లాలో విని యోగదారులపై ఏడాదికి రూ.185 కోట్ల భారం పడుతుందని అంచనా. ప్రస్తుతం కడప సర్కిల్ నుంచి ఏటా డిమాండ్ రూ.396 కోట్ల వరకు ఉంది. పెరగనున్న చార్జీలతో ఈ డిమాండ్ రూ.581 కోట్లు కానుంది. రాష్ట్ర విభజనతో సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్‌కు అదనంగా సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్న కర్నూలు, అనంతపురం జిల్లాలు కలిశాయి. దీంతో వ్యవసాయ కనెక్షన్లకు అందిస్తున్న సబ్సిడీ పెరుగుతుందా? లే దా? అనే అంశంపై చర్చ జరుగుతోంది. -
ప్రజాపాలనకు సన్నాహాలు
సాక్షి, కర్నూలు: కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో త్వరలో పురపాలక, జిల్లా, మండల పరిషత్తుల పాలకవర్గాల ప్రమాణ స్వీకారానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గతంలోనే ‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియ ముగిసి ఫలితాలు కూడా వెలువడినా ఎమ్మెల్యేలు, ఎంపీల సభ్యత్వం విషయంలో నెలకొన్న సందిగ్ధంతో ప్రమాణ స్వీకారాలు జరగలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టడంతో స్థానిక పురపాలక, జిల్లా, మండల పరిషత్తులకు ఎన్నికైన సభ్యుల ప్రమాణస్వీకారాలకు రంగం సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా దీనికి సానుకూలంగా ఉండటంతో త్వరలోనే వీరంతా బాధ్యతలు స్వీకరించనున్నారు. దాదా పు రెండేళ్లుగా కొనసాగుతున్న ప్రత్యేకాధికారుల పాలనకు తెరపడనుంది. పరిషత్తులకూ: పురపాలక పాలకమండళ్ల ప్రమాణస్వీకార ప్రక్రియ ముగిసిన తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు కూడా పాలనా పగ్గాలు చేపట్టనున్నారు. జిల్లాలో 53 మండలాల్లో 30 జెడ్పీటీసీలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. దీంతో ఆ పార్టీకి అధికార పగ్గాలు చేపట్టేందుకు ఏకపక్ష మెజార్టీ లభించింది. మండల పరిషత్ అధ్యక్ష పీఠాలూ ఎక్కువగానే వైఎస్సార్సీపీ ఖాతాలో చేరనున్నాయి. పురపాలికల్లో: జిల్లాలో కర్నూలు కార్పొరేషన్, బనగానపల్లె పురపాలక సంఘానికి తప్ప మిగిలిన నంద్యాల, నందికొట్కూరు, డోన్, ఆదోని, ఎమ్మిగనూరు పురపాలక సంఘాలు, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, గూడూరు నగర పంచాయతీలు ఉండగా ఎన్నికైన కౌన్సిలర్లు ప్రమాణస్వీకారం కోసం ఎదురుచూస్తున్నారు. పాలకమండళ్లు ఏర్పడ్డాక కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వెంటనే ఆయా ఖజానాలకు జమ కానుండగా, ఇదే సమయంలో పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు కూడా నిర్వహించాల్సి ఉంది. త్వరితగతిన కౌన్సిల్ ఏర్పడితే కేంద్రనిధులు, స్థానిక బడ్జెట్ నిధులతో తమ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి వీరంతా ఇప్పటికే ప్రణాళికలు రూపొందించుకున్నారు. మరోపక్క కౌన్సిల్లో కీలకమైన ఎక్స్అఫిషియో సభ్యత్వంపై చర్చ సాగుతోంది. స్థానిక ఎమ్మెల్యే సంబంధిత పురపాలక సం ఘంలో ఎక్స్అఫిషియో సభ్యులుగా వ్య వహరిస్తారు. ఎంపీలు కూడా వారి ని యోజకవర్గాల పరిధిలో తమకు నచ్చిన పురపాలికలో సభ్యత్వాన్ని పొందవచ్చు. చైర్మన్ ఎంపిక క్లిష్టతరమైనప్పుడు వీరి ఓటు కీలకమవుతుంది. మార్గదర్శకాలు ఇలా: = రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు మేరకు తొలుత చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక తేదీకి సంబంధించి ఈ నెల మూడో వారంలో నోటిఫికేషన్ వెలువడనుంది. = వార్డు సభ్యుల ప్రమాణస్వీకారం, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియకు గెజిటెడ్ హోదా గల అధికారి ప్రొసీడింగ్ అధికారిగా నియమిస్తారు. =ఎన్నికల సంఘం ఖరారు చేసిన రోజున ఎన్నికైన వార్డు సభ్యులు హజరుకావాలని నోటీసులు జారీ చేస్తారు. మొత్తం సభ్యులలో సగం మంది తప్పనిసరిగా హాజరుకావాలి. లేనిపక్షంలో ఎన్నిక వాయిదా పడుతుంది. =తొలుత వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం జరుగుతుంది. చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికకు ఈసీ గుర్తింపు పొందిన పార్టీలకు విప్ జారీచేసే అధికారం ఉంది. ఆయా పార్టీలు ముందుగా తమ సభ్యులకు చైర్మన్, వైస్‌చైర్మన్ అభ్యర్థుల్లో ఎవరిని బలపరచాలనే అంశంపై విప్ జారీ చేస్తాయి. విప్లో ఉన్న అంశాన్ని ముందుగా ఎన్నికల ప్రొసీడింగ్ అధికారికి తెలియజేయాలి. ఎవరైనా పార్టీ విప్‌ను ధిక్కరిస్తే ఆ విషయాన్ని లిఖితపూర్వకంగా ప్రొసీడింగ్ అధికారికి తెలియపరిస్తే నమోదు చేసుకుంటారు. = తర్వాత ఎన్నిక ప్రక్రియ చేతులు ఎత్తే పద్ధతిలో జరుగుతుంది. ఏదైనా కారణంతో చైర్మన్ ఎన్నిక జరగకపోతే వైస్ చైర్మన్ ఎన్నిక కూడా జరగదు. ఏ సభ్యుడైనా పార్టీ విప్‌ను ధిక్కరించినా ఆ ఓటును చెల్లుబాటుగానే పరిగణిస్తారు. తర్వాత పదవి నుంచి ఎందుకు తొలగించకూడదో చెప్పాలంటూ వివరణ కోరుతూ ప్రొసీడింగ్ అధికారి ఆ వార్డు సభ్యునికి నోటీసు జారీ చేస్తారు. ఆయన సమాధానం ఇచ్చినా ఇవ్వకపోయినా సభ్యుని పదవి రద్దు విషయమై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఆ సభ్యుడు పదవి కోల్పోయే అవకాశం ఉంటుంది. -
జెడ్పీ పీఠం ఎవరిదో!
సాక్షి, అనంతపురం : రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఇక స్థానిక సంస్థల పీఠాలను నింపాల్సి ఉంది. మేయర్, మునిసిపల్ చైర్మన్లు, మండలాధ్యక్షులు, జెడ్పీ చైర్మన్ ఎన్నిక కోసం ఆశావహులంతా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అన్నింటి కంటే ముఖ్యంగా కేబినెట్ ర్యాంకు కల్గిన జిల్లాపరిషత్ చైర్మన్ పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటికే ఈ పదవి ఆశించి జెడ్పీటీసీ ఎన్నికల్లో కోట్లాది రూపాయలను ఖర్చు పెట్టుకున్న టీడీపీ నేతలు.. తమ అధినేత చంద్రబాబు నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా రామగిరి జెడ్పీటీసీ సభ్యుడు దూదేకుల చమన్‌సాబ్, గార్లదిన్నె జెడ్పీటీసీ సభ్యురాలు విశాలాక్షి, గుమ్మఘట్ట జెడ్పీటీసీ సభ్యుడు పూల నాగరాజు జెడ్పీ చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. ఎన్నికలకు ముందు జరిగిన ఒప్పందంలో భాగంగా చమన్‌సాబ్‌కు రెండున్నరేళ్లు, పూల నాగరాజుకు రెండున్నరేళ్లు అవకాశం ఇవ్వాలని టీడీపీ జిల్లా నాయకులు నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో ఆ ఒప్పందం అమలయ్యేలా లేదు. చెమన్‌కు పదవి ప్రశ్నార్థకమే! పరిటాల సునీత రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న నేపథ్యంలో ఆమె ముఖ్య అనుచరుడిగా ఉన్న చమన్‌సాబ్‌కు జెడ్పీ చైర్మన్ పదవి ఇస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే రెండు కేబినెట్ పదవులను హిందూపురం పార్లమెంటు స్థానం పరిధిలోని నేతలకు కట్టబెట్టారు. కేబినెట్ స్థాయి కల్గిన జెడ్పీ చైర్మన్ పదవిని అదే పార్లమెంటు పరిధిలోని వారికి కేటాయించక పోవచ్చని తెలుస్తోంది. చైర్మన్ పీఠాన్ని ఆశించి ఎన్నికల్లో చమన్, పూల నాగరాజు భారీగా ఖర్చు చేసినట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే చమన్ పరిటాల అనుచరుడు కావడంతో పాటు ఫ్యాక్షన్ నేపథ్యం, పలు కేసుల్లో నిందితుడిగా ఉండటం వల్ల అవకాశం కల్పించకూడదని మెజార్టీ నాయకులు అధినేతపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. మంత్రి పదవితోనే పరిటాల వర్గం జిల్లాలో బలపడనుందని, చమన్ చేరితే వారి బలం మరింత పెరుగుతుందని భావిస్తూ ఆదిలోనే అడ్డుకట్ట వేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. రాజకీయంగా పరిటాల వర్గం బలపడితే తమకు తీవ్ర నష్టం జరుగుతుందని టీడీపీలోని ఇతర నాయకులు భావిస్తున్నారు. దీంతో చమన్‌కు చైర్మన్ గిరి దక్కక పోవచ్చని అత్యధిక నేతలు భావిస్తున్నారు. గెలుపు ఓటమిల్లో కీలక పాత్ర వహించే సామాజిక వర్గంగా పేరున్న బోయ సామాజిక వర్గానికి చెందిన గుమ్మఘట్ట జెడ్పీటీసీ పూల నాగరాజు కూడా జెడ్పీ పీఠం బరిలో ఉన్నారు. గుమ్మఘట్ట అనంతపురం పార్లమెంటు స్థానం పరిధిలో ఉండడం కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. అయితే నాగరాజుకు ఇతర టీడీపీ నేతల మద్దతు కొరవడినట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులుకు భాస్కర్ ఫర్టిలైజర్స్ యజమాని సన్నిహితుడు. ఇతని భార్య విశాలాక్షి గార్లదిన్నె జెడ్పీటీసీగా విజయం సాధించారు. ఈమె కూడా ఎన్నికల్లో భారీ మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గాండ్ల సామాజిక వర్గానికి చెందిన విశాలాక్షికి జెడ్పీ చైర్మన్‌గా అవకాశం కల్పించాలంటూ కాలవ శ్రీనివాసులుతో పాటు ఎమ్మెల్సీ శమంతకమణి, శింగనమల ఎమ్మెల్యే యామినీ బాల, తదితరులు ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నారు. జేసీ సోదరుల మద్దతు ఎవరికో... జెడ్పీ చైర్మన్ విషయంలో జేసీ సోదరుల మద్దతు ఎవరికన్నది అంతుచిక్కడం లేదు. జిల్లాలో అత్యధిక స్థానాలను గెలిపించిన జేసీ సోదరులకు అటు కేంద్రంలో కానీ, ఇటు రాష్ట్రంలో కానీ మంత్రివర్గంలో చోటు దక్కలేదు. వారికి బద్ధశత్రువుగా ఉన్న పరిటాల సునీతకు రాష్ట్ర కేబినెట్లో చోటు దక్కడంతో వారి వర్గీయులు లోలోపల రగిలిపోతున్నారు. ఈ క్రమంలో పరిటాల సునీత ముఖ్య అనుచరుడు చమన్‌కు చైర్మన్ పదవి ఇస్తే.. ఆ వర్గం మరింత బలపడే అవకాశం ఉందని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో జేసీ సోదరులు ఎవరికి మద్దతు పలికే అవకాశం ఉందన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు వారిని ప్రసన్నం చేసుకునేందుకు పూల నాగరాజు, విశాలాక్షి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలిసింది. జెడ్పీకి భారీగా నిధులు జిల్లాపరిషత్‌కు బీఆర్జీఎఫ్తో పాటు జనరల్ ఫండ్, వివిధ గ్రాంట్ల రూపంలో ప్రతియేటా దాదాపు రూ.170 కోట్లు వస్తుంటాయి. సాధారణంగా బీఆర్జీఎఫ్ కింద ఏడాదికి రూ.35-40 కోట్ల వరకు నిధులు విడుదలవుతాయి. జనరల్ ఫండ్స్, స్టేట్‌ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎస్ఎఫ్సీ).. ఇలా వివిధ గ్రాంట్ల కింద రూ.110-130 కోట్ల వరకు వస్తుంటాయి. ఈ నిధులన్నీ చైర్మన్ ద్వారానే ప్రాధాన్యత క్రమంలో పంపిణీ చేస్తారు. ఈ పరిస్థితుల్లో జెడ్పీ చైర్మన్ పదవికి డిమాండ్ పెరిగినట్లు తెలుస్తోంది. -
గ్రేటర్‌కు ఇక జలసిరి..!
సాక్షి, సిటీబ్యూరో: జలాశయాల పరిరక్షణపై కొత్త సర్కారు దృష్టి పెట్టడంతో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. నగరంలోని వివిధ చెరువులను పరిరక్షించడంతో పాటు వాటి ప్రధాన ఛానళ్ల (ఇన్లెట్స్, ఔట్ లెట్స్)ను పటిష్టపర్చాలని హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీలు సంయుక్తంగా నిర్ణయించాయి. ఈ నగరం, దాని చుట్టుపక్కల్లోని చెరువులు, వాటి డ్రె యిన్ ఛానళ్ల పరిరక్షణకు అధికార యంత్రాంగం న డుం బిగించింది. ఇందులో భాగంగా మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి జోషి ఆధ్వర్యంలో సోమవా రం బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు కార్యాలయంలో ప్రత్యేకం గా సమావేశమై జలాశయాల సంరక్షణపై సుదీర్ఘం గా చర్చించారు. వివిధ చెరువుల్లో కలిసే ప్రధాన డ్రె యిన్ ఛానల్స్(నాలాలు), వాటికి అనుసంధానంగా గొలుసుకట్టుగా ఉన్న చిన్న ఛానళ్లను సర్వే అఫ్ ఇండియా మ్యాపుపై గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ సెక్రటరి జోషి అధికారులను ఆదేశించారు. దీని వల్ల చెరువుల సంరక్షణతో పాటు వాటికి వరదనీటి వాహకాలుగా ఉన్న ఛానళ్లను అభివృద్ధి చేసేందుకు వీలవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రధాన చెరువుల ఇన్లెట్స్/ఔట్లెట్స్ పటిష్టానికి సత్వరం చర్యలు చేపట్టాలని సూచించారు. తొలిదశలో.. ఆయా చెరువులకు కలిసే డ్రెయిన్ ఛానళ్ల (నాలాల) వివరాలను సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌లో పొందు పర్చేందుకు అధికారులు రంగంలోకి దిగారు. తొలిదశలో జీహెచ్ఎంసీ పరిధిలోని 168 చెరువుల వివరాలను మ్యాపుల్లో పొందుపర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కొక్క నాలాకు ఇన్‌ఫ్లో ఛానళ్లు ఎన్ని ఉన్నా యో గుర్తించి వాటిని పటిష్టపర్చేందుకు చర్యలు చేపడతారు. మలిదశలో హెచ్ఎండీఏ పరిధిలోని వివిధ చెరువుల ప్రధాన ఛానళ్లను కూడా మ్యాప్‌లో పొం దుపర్చాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డు అవతల ఎన్ని చెరువులు ఉన్నాయన్న దానిపై ఓ ప్రైవేటు ఏజెన్సీతో హెచ్ఎండీఏ సర్వే నిర్వహిస్తోంది. ఇప్పటికే 200 చెరువులకు డీ మార్కేషన్ పూ ర్తి చేసిన సర్వే సంస్థ అందులో 100 చెరువులకు సం బంధించి మ్యాపులు రూపొందించేందుకు డేటాను సిద్ధం చేసింది. మిగతా చెరువుల లెక్కలూ తేల్చాక సంరక్షణ చర్యలపై నివేదిక రూపొందించనుంది. అ యితే, జలాశయాల సంరక్షణకు అవసరమయ్యే ని ధులెలా సమకూర్చుకోవాలన్నది ఇప్పుడు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏల మదిని తొలుస్తున్న ప్రశ్న. -
గెలిచినా.. తప్పని నిరీక్షణ
సిద్దిపేట రూరల్, న్యూస్‌లైన్: ‘స్థానిక’ ఎన్నికల బరిలో గెలిచినా.. అధికారిక హోదా దక్కకపోవడంతో ప్రజాప్రతినిధులు ఎదురుచూపులతో కాలం వెళ్లదీస్తున్నారు. జిల్లాలో 873 మంది ప్రమాణస్వీకారం కోసం నిరీక్షిస్తున్నారు. అనేక సమస్యలతో వస్తున్న ప్రజలకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు. జిల్లాలో జెడ్పీటీసీలు 46, ఎంపీటీసీలు 682, మున్సిపల్, నగర పంచాయతీలో కలిపి 145 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. మే 12, 13న ఓట్ల లెక్కింపు పూర్తిచేశారు. ఫలితాలు వచ్చి నెల రోజులు కావస్తోందని, గెలిచిన సంతోషం కూడా కరువైందని ప్రజాప్రతినిధులు ఆవేదన చెం దుతున్నారు. జూన్ 2న కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. దీంతో జిల్లావ్యాప్తంగా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, నగర పంచాయతీ వార్డుసభ్యులు ప్రమాణస్వీకారం కోసం ఎదురుచూస్తున్నారు. జెడ్పీ చైర్మన్, ఎంపీపీ పదవులపై ఆశలు పెంచుకున్నవారు ఎంపీటీసీలు, జెడ్పీటీసీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండటం గమనార్హం. పేరుకుంటున్న సమస్యలు.. గ్రామాలలో, మండల కేంద్రాలలో ఎన్నికైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల వద్దకు సమస్యల పరిష్కరం కోసం ప్రజలు క్యూ కడుతున్నారు. ఇంత వరకు ప్రమాణస్వీకారం చేయకపోవడంతో ఏం చేసే పరిస్థితిలేదు. కనీసం కార్యాలయాలకు కూడా వెళ్లలేని స్థితిలో ఉన్నారు. మరోవైపు గ్రామాల్లో పారిశుద్ధ్యం, మంచినీరు, వీధి ధీపాలు వంటి సమస్యలు పేరుకుపోతున్నాయి. దీంతో గ్రామస్థులు ఆసంతృప్తికి గురవుతున్నారు. ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు సైతం ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఎప్పుడోనని ఎదురు చూస్తున్నారు. -
వడపోత
బాబు ఎప్పుడు ప్రమాణస్వీకారం చేస్తారా.. ఆయన ప్రకటించినట్టు పెరిగే పెన్షన్ ఎప్పుడు అందుతుందా... అని లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. కానీ ఈ భారం ఎలా తగ్గించాలా... కొందరినైనా అనర్హులుగా ప్రకటించేందుకు ఏం చేయాలా అని అధికారులు యోచిస్తున్నారు. ఇదివరకే దీనికోసం ఓ సాఫ్ట్వేర్ రూపొందిం చారనీ... బోగస్ పింఛన్ల పేరుతో కొన్నింటినైనా తగ్గించేస్తారనీ వారికి తెలియదు పాపం. సాక్షి, గుంటూరు: కొత్త ప్రభుత్వానికి భారంగా మారనున్న పింఛన్లలో కోత పడబోతోందా... వడపోతకోసం ఇదివరకే రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఇప్పుడు ఉపయోగించనున్నారా... ఎన్నికల్లో విపరీతమైన హామీలిచ్చేసిన కొత్త ప్రభుత్వం ఆర్థిక భారం తగ్గించుకునేందుకు ప్రత్యేక విధి విధానాలకు ఆదేశాలు ఇవ్వనుందా?.. ఈ ప్రశ్నలకు అవుననే అంటున్నాయి అధికార వర్గాలు. ఇప్పటికే రేషన్ కార్డు, ఆధార్ సీడింగ్‌తో వడపోతకు ముమ్మర యత్నాలు చేస్తోంది. ఫిబ్రవరిలోనే ఈ ప్రక్రియ మొదలుపెట్టినా.. వరుస ఎన్నికలు రావడంతో ఎంపీడీవోలు ఎన్నికల విధుల నిమిత్తం ఇతర జిల్లాలకు వెళ్ళడంతో అప్పట్లో అది నిలిచిపోయింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత పింఛన్లను రూ.200 నుంచి రూ.వెయ్యికి పెంచుతామని ప్రకటించారు. వికలాంగుల పెన్షన్లు రూ.1,500 వరకు ఇస్తామని హామీనిచ్చారు. అయితే ఈ భారం మోయడం ఒకవిధంగా సర్కారుకు సవాలే. గత సర్కారు హయాంలోనే తెల్ల రేషన్ కార్డుల్లో తప్పులు, ఆధార్ సీడింగ్‌తో సరిపోల్చి సామాజిక పింఛన్లు నిలుపుదలకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందుకు ఓ ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించి వడపోతకు శ్రీకారం చుట్టారు. తెల్లకార్డు ఉన్నవారు, లేనివారు ఎంతమంది పింఛన్లు పొందుతున్నారో.. వారి వివరాలు సేకరించారు. ఆయా మండలాల్లో ఎంపీడీవోలపై, పట్టణాల్లో మునిసిపల్ కమిషనర్లకు ఈ బాధ్యతలు అప్పగించారు. అయితే ఎంపీడీవోలు ఎన్నికల విధుల నిమిత్తం ఇతర జిల్లాలకు వెళ్ళడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు ఎంపీడీవోలను తిరిగి సొంత జిల్లాలకు కేటాయించడంతో వారు విధుల్లో చేరగానే మొదటి ప్రాధాన్యతగా పింఛన్ల వడపోతపైనే దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. కొత్త సర్కారుకు జిల్లాలో పింఛన్ల భారం రూ. 11కోట్ల పైమాటే... జిల్లాలో మొత్తం 3,59,445 సామాజిక పింఛనర్లు ఉన్నారు. వీరికి ప్రతి నెలా రూ.9.14 కోట్లు చెల్లిస్తున్నారు. జిల్లాలోని 57 మండలాల్లో 96,212 మంది ప్రతి నెలా వృద్ధాప్య పింఛన్లు పొందుతున్నారు. ఇందుకు రూ. 1.92 కోట్లు ఖర్చు అవుతోంది. బాబు ఎన్నికల హామీ అమలు చేస్తే రూ.9.62 కోట్లు అవసరం. అంటే రూ.7.7 కోట్ల మేర అదనపు భారం పడుతుందన్న మాట. వికలాంగ పింఛన్లు జిల్లాలో 42,022 మందికి అందిస్తున్నారు. పింఛన్ రూ.500 ప్రకారం వీరికి ప్రతి నెలా రూ.2.10 కోట్లే. పెరిగే పింఛన్ సొమ్ము ప్రకారం రూ.1,500 అందిస్తే రూ. 6.30 కోట్లు అవసరమవుతాయి. అంటే అదనంగా రూ.4.2 కోట్లు భారం పడుతుందన్న మాట. ఈ లెక్కన వృద్ధాప్య, వికలాంగ పింఛన్ల భారమే రూ.11.9 కోట్ల వరకు ఉంది. గతంలో జిల్లా మొత్తం పింఛన్లకు రూ.9.14 కోట్లు అయితే, వృద్ధాప్య, వికలాంగుల పింఛన్ల వరకే పెరిగే భారం రూ.11 కోట్లుకు పైగా కావడంతో ఈ భారం తగ్గించుకునేందుకు ఉన్నత స్థాయిలో తీవ్రంగా ఆలోచనలు చేస్తున్నారు. పెంచనున్న పింఛను మొత్తాలు ఎప్పుడు అందిస్తారా? అని లబ్ధిదారులు ఆశతో ఎదురు చూస్తున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు పింఛన్ల ఫైలుపై సంతకం చేస్తారా? అని లబ్ధిదారులు ఆరా తీస్తున్నారు. అయితే ఇంతవరకు అధికారులకు ఈ విషయంపై స్పష్టత లేకపోవడం గమనార్హం. -
అభివృద్ధి కార్యక్రమాలపై నిఘా: చిరంజీవి
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పడే ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల మీద తాము నిఘా ఉంచుతామని, అదే సమయంలో వాటికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి చెప్పారు. మరో ఇద్దరు నాయకులు జైరాం రమేష్, జేడీ శీలంలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యసభలో ఉన్న ఆంధ్రప్రాంతానికి చెందిన ఎంపీలు, అలాగే రాష్ట్ర వ్యవహారాలను గతంలో చూసిన కొంతమంది ఎంపీలు, ఇతర సీనియర్ నియకులతో కలిసి ఓ కమిటీని ఏర్పాటుచేయాల్సిందిగా కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కోరామని, ఒకటి రెండు రోజుల్లో ఈ కమిటీ నిర్ధారణ అవుతుందని ఆయన చెప్పారు. సీమాంధ్ర ప్రాంతం త్వరగా అభివృద్ధి చెందేలా, అభివృద్ధి ఫలాలు అందిరకీ చేరేలా చూస్తామని చిరంజీవి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పడే ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను నూరుశాతం అమలు చేయాలని, అందులో వాళ్లు చిత్తశుద్ధితో ఉండాలనే కోరుకుంటున్నామని చెప్పారు. తమ లక్ష్యం కేవలం అభివృద్ధేనని, ఇందులో ఏమాత్రం రాజకీయాలు ఉండవని అన్నారు. -
అదృష్టం ఎందరికో..!
టీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరుతున్న వేళ పాలమూరు వాకిట ఎన్ని బుగ్గకార్లు షికారు చేస్తాయనే చర్చ జోరుగా సాగుతోంది. వివిధ రాజకీయ సమీకరణాలు, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ‘గులాబీ దళపతి’ మంత్రి వర్గ జాబితాన్ని పకడ్బందీగా రూపొందించినట్టు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. జిల్లాలనుంచీ ఆశావహులు ఎక్కువగానే ఉండడంతో అదృష్టం ఎవరికి దక్కుతుందోనని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఉత్కంఠకు లోనవుతున్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మరో 24 గంటల్లో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వంలో జిల్లా నుంచి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే నేతల జాబితాపై ఉత్కంఠ నెలకొంది. ఓ వైపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, మరోవైపు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో సోమవారం కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేయనున్నారు. ఆయనతో పాటు ఎందరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు, జిల్లా నుంచి ఎంతమందికి చోటు దక్కుతుందనే అంశం చర్చనీయాంశంగా మారింది. సాధారణ ఎన్నికల్లో జిల్లాలో టీఆర్ఎస్ అనూహ్య ఫలితాలు సాధించింది. పధ్నాలుగు అసెంబ్లీ స్థానాలకు గాను ఏడు చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. జిల్లా నుంచి మంత్రి వర్గం లో చోటు కోసం ముగ్గురు నేతలు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తూ వస్తున్నారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్), సి.లక్ష్మారెడ్డి (జడ్చర్ల), వి.శ్రీనివాస్‌గౌడ్ (మహబూబ్‌నగర్) మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్నారు. వీరిలో కనీసం ఇద్దరికి చోటు దక్కుతుందని భావిస్తున్నారు. మంత్రులు, వారు చేపట్టే శాఖలను కేసీఆర్ ఖరారు చేశారనే వార్తల నేపథ్యంలో జూపల్లి,ల క్ష్మారెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ స్వామిగౌడ్‌కు మంత్రివర్గంలో చోటు కల్పిస్తే శ్రీనివాస్‌గౌడ్ అవకాశాలు క్లిష్టంగా మారనున్నాయి. మధ్యాహ్నం కల్లా స్పష్టత కేసీఆర్ మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కుతుందనే అంశంపై ఆదివారం మధ్యాహ్నం తర్వాత స్పష్టత వస్తుందని సమాచారం. సోమవారం తనతో పాటు పదవీ స్వీకార ప్రమాణం చేసే మంత్రుల జాబితాను కేసీఆర్ ఆదివారం ఉదయం గవర్నర్‌కు అందజేసే అవకాశం ఉంది. మంత్రివర్గ జాబితాపై ఇప్పటికే స్పష్టత వచ్చిన ప్పటికీ ముందస్తుగా వెల్లడిస్తే పదవి ఆశిస్తున్న ఎమ్మెల్యేల నుంచి ఒత్తిడి ఉంటుందనే ఉద్దేశంతో కేసీఆర్ గోప్యత పాటిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మంత్రివర్గంలో చోటు దక్కని జిల్లా ఎమ్మెల్యేలకు ప్రభుత్వ విప్, డిప్యూటీ స్పీకర్ వంటి పదవులు దక్కే అవకాశం వుంది. జిల్లాలో భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గ కూర్పులో కేసీఆర్ కసరత్తు చేసినట్లు సమాచారం. మంత్రివర్గంలో చోటు దక్కుతుందని భావిస్తున్న ఇద్దరు ఎమ్మెల్యేలకు ప్రధాన శాఖలు కేటాయించినట్లు తెలుస్తోంది. లక్ష్మారెడ్డికి వ్యవసాయం, జూపల్లి కృష్ణారావుకు పౌరసరఫరాల శాఖ కేటాయిస్తార ని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ గులాబీ నేత పరిమితంగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే జిల్లా నుంచి తొలి విడతలో జూపల్లి కృష్ణారావుకు మాత్రమే మెరుగైన అవకాశాలు ఉంటాయని అంచనా. -
రుణాను‘బంధనం’
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : రుతుపవనాలు రాకముందే వర్షాలు కురుస్తుండటంతో ఖరీఫ్‌కు రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. పంట సాగుకు సిద్ధమవుతున్నప్పటికీ.. పెట్టుబడులకు రుణాల కోసం బ్యాంకుల వైపు ఎదురుచూస్తున్నారు. అయితే రుణ లక్ష్యాన్ని అధికారులు నిర్ధేశించినప్పటికీ.. వాటి మంజూరు విషయంలో గందరగోళ పరిస్థితులు తలెత్తనున్నాయి. ప్రధానంగా రుణాల రెన్యువల్స్‌పై నీలినీడ లు కమ్ముకుంటున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం రైతుల రుణాలను మాఫీ చేస్తామన్న హామీ రైతులను త్రిశంకు స్వర్గంలోకి నెట్టింది. ఇప్పటికీ కొత్త ప్రభుత్వం కొలువుతీరకపోవడం.. రుణమాఫీ ఫైలుపై సంతకం చేయకపోవడం...ఖరీఫ్ సీజన్ తరుముకొస్తుండటం...పాత రుణాలు చెల్లించకపోవడంతో కొత్త రుణాల మంజూరుపై సస్పెన్స్ కొనసాగుతోంది. అధికారులు మాత్రం ఖరీఫ్-2014కు పంట రుణ లక్ష్యాన్ని రూ.700 కోట్లుగా నిర్ధేశించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత మేర రుణాలను మంజూరు చేస్తారన్న విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2 లక్షల మందికి రుణాలు ఖరీఫ్ ప్రణాళిక సిద్ధమైంది. జిల్లాలో 2,27,400 హెక్టార్లలో పంటలు చేపట్టాలని వ్యవసాయాధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సీజన్లో మొత్తం 2 లక్షల 304 మంది రైతులకు రూ.700 కోట్లు పంట రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో కొత్త వారి కంటే రెన్యువల్స్‌కే అధికంగా రుణాలు ఇవ్వాలని నిర్ధేశించారు. ఈ సీజన్లో 58,211 మంది కొత్త వారికి రూ.250 కోట్లు మాత్రమే రుణాలను అందించనున్నారు. రెన్యువల్స్ విషయానికి వస్తే 1,42,093 మంది రైతులకు రూ.450 కోట్లు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత సీజన్లో రూ.600 కోట్లు ఖరీఫ్ లక్ష్యం కాగా 1,32,375 మంది రైతులకు రూ.640 కోట్లు మంజూరు చేశారు. గత ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు తుపాన్లు, అల్పపీడనం కారణంగా వరదలు వచ్చి పంటలు నీట మునిగాయి. దీంతో రైతులు రుణాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నారు. రెన్యువల్స్ డౌటే...! ఎన్నికలకు ముందు అధికారంలోకి రాగానే రుణమాఫీ ఫైలుపై తొలి సంతకం చేస్తామని టీడీపీ ప్రకటించడంతో నష్టాల్లో ఉన్న రైతులు రుణాలను చెల్లించేందుకు ఆసక్తి చూపించడం లేదు. తీసుకున్న రుణాలు చెల్లించకపోవడంతో వారికి రుణాలు రెన్యువల్స్ చేసే అవకాశం లేదని బ్యాంకర్లు తెగేసి చెబుతున్నారు. అయినప్పటికీ రుణమాఫీ జరుగుతుందన్న ఆశతో రైతులు ఉన్నారు. రుణమాఫీ జరిగితే జిల్లాలో 2,10,881 మంది రైతులకు మేలు జరగనుంది. అలాగే 1,42,093 మందికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రుణాల రెన్యువల్స్ జరగనున్నాయి. ఒకవేళ రుణమాఫీ ఫైలుపై సంతకం చేయడం ఆలస్యమైతే ఖరీఫ్ సీజన్ ముగియడంతో పాటు రుణ లక్ష్యం నీరుగారనుంది. అదే రుణాలను రద్దు చేయకపోతే రెన్యువల్స్‌కు అవకాశముండదని బ్యాంకర్లు చెబుతున్నారు. రుణమాఫీ జరుగుతుందో లేదో ఇంకా స్పష్టత లేదని, అప్పటి వరకు కొత్త రుణాల మంజూరు విషయంలో గందరగోళం తప్పదని పేర్కొంటున్నారు. -
సేవలు బంద్
రాష్ట్రవిభజన నేపథ్యంలో ప్రభుత్వ పాలన పూర్తిగా స్తంభించనుంది. పలు ప్రభుత్వశాఖలకు సంబంధించిన కార్యాకలాపాలను నేడు, రేపు తాత్కాలికంగా నిలిపేయనున్నారు. జూన్ రెండు అపాయింటెడ్ రోజున కూడా పూర్తిస్థాయిలో పాలన దారికొచ్చే పరిస్థితులు కన్పించడం లేదు. దీంతో జూన్ 3వ తేదీ నుంచే ప్రభుత్వశాఖల్లో మళ్లీ పాలన యథాస్థితికి రానుంది. ఇప్పటికే ఉద్యోగులకు వేతనాలు అందజేశారు. దీంతో రెండురోజుల్లో అత్యవసర కార్యకలాపాలు కూడా లేవు. తెలంగాణ కొత్తగా ఏర్పడటం... రాష్ట్రానికి సంబంధించిన అన్ని అధికారిక కార్యకలాపాలు, తదితర అంశాలు పాత రాష్ట్రం స్థానే దాదాపుగా ఉండటంతో జూన్ 3 నుంచే పాలన సజావుగా సాగే అవకాశం ఉంది. సాక్షి, కడప: రాష్ట్ర విభజన జిల్లా పరిపాలనపై పెద్దగా ప్రభావం చూపనప్పటికీ శని, ఆది, వారాలు రెండు రోజులు పాటు సేవలు నిలిచిపోనున్నాయి. సోమవారం జూన్ 2 నుంచి మళ్లీ పాలన యథావిధిగా జరగనుంది. రెండో శనివారం వచ్చిందని ప్రజలు భావించినట్లు మినహా పాలనకు సంబంధించి పెద్దగా ప్రజలకు ఇబ్బంది కలిగే అవకాశం లేదు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోమవారం నుంచి కార్యకలాపాలు యథావిధిగా జరగాలని ప్రభుత్వం ఆదేశించినా, ఆ రోజు కూడా పాలన పూర్తిగా దారికొచ్చే పరిస్థితులు లేవు. జూన్ 2న తెలంగాణలో రాష్ట్రపతి పాలన ఎత్తేయనున్నారు. అక్కడ కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. అయితే రాష్ట్రంలో 8వ తేదీ వరకూ రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది. అదే రోజు ఇక్కడా కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. తెలంగాణ అపాయింటెడ్ డేగా నిర్ణయించిన జూన్ 2 తర్వాత రెండు రాష్ట్రాలు అధికారంగా ఏర్పాటు అవుతాయి. పాలన కూడా వేర్వేరుగా సాగనుంది. ఈ క్రమంలో రెండు ప్రాంతాల ఉద్యోగుల విభజనతో పాటు అన్నిశాఖల్లో శాఖాపరమైన కార్యక్రమాలు పూర్తి కావాలి. ఈ క్రమంలో భాగంగానే మే 30 వరకూ ఉమ్మడి రాష్ట్రంలో కార్యక లాపాలు సాగాయి. మే 31, జూన్ 1 తేదీల్లో పూర్తిస్థాయిలో పాలనకు సంబంధించి విభజన ప్రక్రియ పూర్తి చేసి ఆపై కొత్త పాలన నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆన్లైన్లో ప్రభుత్వ వెబ్సైట్లు నిలిపివేత జిల్లాల వారీగా అన్ని ప్రభుత్వశాఖలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆన్లైన్లో నిక్షిప్తం చేశారు. ఆయా శాఖల్లోని ఉద్యోగుల వివరాలు, పనితీరుతో పాటు అన్ని రకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తారు. ఈ ప్రక్రియకు నేడు, రేపు బ్రేక్ పడనుంది. అలాగే పూర్తిగా వెబ్సైట్లు బ్లాక్ కానున్నాయి. ట్రెజరీలో కూడా ఎలాంటి లావాదేవీలు జరగవు. ఇప్పటికే జిల్లాలోని దాదాపు 35 వేల మంది ఉద్యోగులకు వేతనాల చెల్లింపు ప్రక్రియ కూడా పూర్తయింది. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు కూడా చెందాల్సిన లబ్ధిఅందేలా ట్రెజరీ అధికారులు చర్యలు తీసుకున్నారు. జూన్ 2 వరకూ ఎలాంటి లావాదేవీలు జరగవు. దీంతో పాటు రవాణశాఖకు సంబంధించి వాహనాల రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లెసైన్స్‌ల జారీ కూడా నిలిపేశారు. ఈ ప్రభావంతో కొత్త వాహనాల కొనుగోళ్లకు కూడా బ్రేక్ పడనుంది. జూన్ 2 నుంచే తిరిగి కార్యకలాపాలు మొదలెడతారు. వీటితో పాటు మీసేవ, ఈ సేవ ద్వారా అందే సేవలను కూడా తాత్కాలికంగా నిలిపేశారు. మద్యం సరఫరా నిలిపివేత: ఎక్సైజ్‌శాఖలో కూడా విభజన ప్రభావం స్పష్టంగా కన్పిస్తోంది. ఈనెల 27 నుంచి మద్యం దుకాణాలకు సరఫరా నిలిపివేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ మద్యం సరఫరా చేసేందుకు వీల్లేదు. దీంతో కొన్ని మద్యం దుకాణాలు స్టాకు లేక మూతపడ్డాయి. ఎప్పటి నుంచి మద్యం సరఫరా చేయాలనేది అధికారులకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. -
కీ‘లక్’ ఎత్తులు..!
కొత్త ప్రభుత్వం త్వరలో కొలువు తీరనుంది. ఇటీవల ఎన్నికల నేపథ్యంలో జరిగిన బదిలీల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. అందుకే ఇప్పుడు అధికారులంతా కోరుకున్న చోట పోస్టింగుల కోసం పైరవీలతో ఫైళ్లు పట్టుకొని తిరుగుతున్నారు. పాలకపక్ష నేతలను ప్రసన్నం చేసుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. అనుకూలమైన కుర్చీ కోసం గట్టిగా యత్నిస్తున్నారు. పరిచయాలను వినియోగించుకొని ఒత్తిళ్లు తెస్తున్నారు. నాయకులను తెగ మొహమాట పెట్టేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : కొత్త ప్రభుత్వం కొలువుదీరడమే తరువాయి కోరుకున్న చోట పోస్టింగు దక్కించుకునేందుకు అధికారులు పావులు కదుపుతున్నారు. మరోవైపు అధికార పార్టీ నేతలు తమకు అనుకూలంగా ఉండే అధికారులకు పోస్టింగులు ఇప్పించుకునే ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నారు. తమ కనుసన్నల్లో పనిచేసే అధికారుల కోసం నేతలు మరీ వెతుకులాట ప్రారంభించారు. రెవెన్యూ, పోలీసు విభాగాల్లో కాసులు రాలే చోట పోస్టింగు దక్కించుకునేందుకు అధికారులు తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మండల, జిల్లా స్థాయిలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో భారీగా బదిలీలు జరిగే అవకాశం ఉంది. మరోవైపు కొత్త రాష్ట్రం ఆవిర్భావం నేపథ్యం లో బదిలీలు, పదోన్నతులు కూడా ఉంటాయని ఉద్యోగవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పరిణామాలను అనుకూలంగా మార్చుకుని కోరుకున్న చోట పోస్టింగు దక్కించుకునేందుకు అధికారులు పావులు కదుపుతున్నారు. పోలీసు, రెవెన్యూ విభాగాల్లో బదిలీ కోరుకుంటున్న అధికారులు అధికారంలోకి రాబోయే పార్టీ నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లా నుంచి 49 మంది తహశీల్దార్లు పొరుగు జిల్లాలకు బదిలీపై వెళ్లగా, మరో 38 మంది ఇతర జిల్లాల నుంచి వచ్చారు. ఎన్నికల్ కోడ్ ఎత్తివేయడంతో తహశీల్దార్లను తిరిగి సొంత జిల్లాలకు బదిలీ చేసేందుకు మార్గం సుగమమైంది. జిల్లాకు తిరిగి వస్తున్న తహశీల్దార్లు కీలక మండలాల్లో పోస్టింగులు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్‌కు సమీపంలో వున్న కొత్తూరు, ఫరూఖ్‌నగర్, నవాబుపేట తదితర మండలాలతో పాటు జాతీయ రహదారిపై వున్న మండలాల్లో పోస్టింగులకు గిరాకీ ఉంది. ఇదే అదునుగా కొందరు పైరవీకారులు రంగ ప్రవేశం చేసి బేరసారాలు కుదుర్చుతున్నారు. ఓ ఉద్యోగ సంఘం నేతల కనుసన్నల్లోనే తహశీల్దార్ల పోస్టింగులు ఖరారవుతున్నట్లు సమాచారం. మరోవైపు పోలీసు పోస్టింగుల్లోనూ ఇదేరకమైన పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికల వేళ కొందరు ఎస్ఐ, సీఐ స్థాయి అధికారులు బదిలీపై వెళ్లినా, వారి స్థానంలో తాము కోరుకున్న వారినే కాంగ్రెస్ నేతలు రప్పించుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల సందర్భంగా కొందరు పోలీసు అధికారులకు కాంగ్రెస్ నేతలకు వత్తాసు పలికారనే విమర్శలు వచ్చాయి. ఇసుక, కల్లు మాఫియాలు పోలీసు అధికారుల పోస్టింగుల్లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అనుకూలుర వేటలో.. టీఆర్ఎస్ అధికార పార్టీగా ఆవిర్భవించడంతో ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు తమకు అనుకూలంగా ఉండే అధికారుల కోసం వేట ప్రారంభించారు. ఆర్డీఓలు, డీఎస్పీ స్థాయి అధికారులను తమకు అనుకూలంగా ఉన్న వారిని రప్పించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఓటమి పాలైన అభ్యర్థులు కూడా తమ నియోజకవర్గాల్లో అనుకూలంగా ఉండే అధికారులు ఉంటే విపక్ష ఎమ్మెల్యేలను ఎదుర్కోవచ్చనే వ్యూహంతో ఉన్నారు. -
మాయం
చెరువుల్నీ మింగేస్తున్నారు.. ఆక్రమణల గుప్పిట్లో జలాశయాలు కుంటలు, కాలువలన్నీ కబ్జా ఆనవాళ్లు కూడా లేని చారిత్రక చెరువులు ఎక్కడ చూసినా నిర్మాణాలే.. వర్షపు నీరు వెళ్లే దారేది? జలాశయాలపై కొత్త సర్కార్ ఆరా మైసూర్ బజ్జీలో మైసూర్ ఉండనట్టే.. నగరంలో ‘చెరువు’ అనే చోట చెరువు ఆనవాలు కూడా ఉండదు. ఉదాహరణకు ‘మాసాబ్‌ట్యాంక్’ అనేది కేవలం పేరుగానే మిలిగింది. అది చెరువు రూపు కోల్పోయి పూర్తిగా నివాసిత ప్రాంతమైపోయింది. కూకట్పల్లి ప్రగతినగర్ చెరువుది మరో దుర్గతి.. దీని చుట్టూ నిర్మాణాలు, ఆక్రమణల్లో ఎనలేని ‘ప్రగతి’ కనిపిస్తోంది. ఇంకా ఉప్పల్ నల్లచెరువు, పటేల్ చెరువు, నల్లకుంట, కాజాకుంట, ఎల్లమ్మ చెరువు.. ఏ చెరువు స్థానంలో చూసినా కోకొల్లలుగా నిర్మాణాలే.. సాక్షి, సిటీబ్యూరో: ‘ఇదిగో.. దూరంగా నిర్మాణాలు కనిపిస్తున్న ఆ ప్రాంతం ఒకప్పుడు చెరువు తెలుసా?’.. నగరంలో చెరువుల ఆనవాళ్ల గురించి ఇలా చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకప్పటి చెరువులన్నీ ఆక్రమణలు, కబ్జాల బారిన చిక్కి శల్యమైపోయాయి. ఫలితం.. నీళ్లు వెళ్లే దారిలేక నాలుగు చినుకులకే నగరం గోదారవుతోంది. రోడ్లపై ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోతున్నాయి. రాకపోకలు స్తంభించిపోతున్నాయి. లోతట్టు ప్రాంతవాసుల కంటిపై కునుకు కరువవుతోంది. అడ్డూఅదుపూ లేకుండా సాగుతున్న చెరువుల ఆక్రమణలే ఇందుకు కారణం. కొత్తగా కొలువుదీరనున్న తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం నగరంలో నెలకొన్న ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దనుంది?, ఈ ప్రధాన సమస్యను ఎలా తీర్చనుందనే దానిపై ఆసక్తి నెలకొంది. కాబోయే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఇప్పటికే చెరువుల పరిరక్షణపై దృష్టి పెట్టి.. పక్కా పథకాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత చెరువుల లెక్క తేల్చి వాటి సంరక్షణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని, హెచ్ఎండీఏ పరిధిలోని జలాశయాలపై తొలి సమీక్ష జరపాలని నిర్ణయించినట్టు సమాచారం. కరిగిపోతున్న ఘన చరిత.. హైదరాబాద్ నగరం, చుట్టుపక్కల ఒకప్పుడు 501కు పైగా చిన్నా పెద్ద చెరువులు, కుంటలు ఉండేవి. ఎంత పెద్ద వర్షం కురిసినా గొలుసుకట్టుగా ఒక చెరువు నిండగానే మరో చెరువులోకి నీళ్లు వచ్చేవి. నగరీకరణ నేపథ్యంలో అక్రమార్కుల కన్ను చెరువులపై పడింది. యథేచ్ఛగా ఆక్రమణలు జరిగా యి. దాదాపు వంద పెద్ద చెరువుల వరకు మాయమయ్యా యి. ప్రస్తుత ం వాటి పేర్లే తప్ప ఆనవాళ్లు కూడా మిగలలేదు. ఇక చిన్నా చితకా చెరువులు, కుంటలకు లెక్కేలేదు. 2000 సంవత్సరం నాటికి 10 హెక్టార్ల పైన విస్తీర్ణం కలిగిన చెరువులు 169 మాత్రమే మిగిలినట్టు హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) తాజా సర్వేలో తేలింది. ఈ లెక్కన ఆక్రమణల పర్వం ఏ స్థాయిలో జరిగిందో ఊహించవచ్చు. నాడు సాగు, తాగునీరు అందించిన చెరువులు నేడు కాంక్రీట్ నిర్మాణాల మాటున కుంచించుకుపోయాయి. లెక్కలేస్తే గుండెచెరువే... నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రస్తుతం ఎన్ని చెరువులున్నాయన్నది లెక్క తేలక హెచ్ఎండీఏ తలపట్టుకొంటోంది. రెవెన్యూ రికార్డుల్లోని లెక్కలకు, నిజంగా కనిపిస్తున్న చెరువులకు పొంతన కుదరట్లేదు. జీహెచ్ఎంసీ, పాత హుడా పరిధిలోని 501 చెరువుల్లో ఎన్ని ఉన్నాయో తేల్చేందుకు తొలిదశగా నిర్వహించిన సర్వేలో పక్కాగా లెక్క తేలలేదు. నగరంలోని వివిధ చెరువుల్లో ఇప్పటికే వాణిజ్య భవనాలు, ఇళ్లు, అపార్టుమెంట్లు వెలిశాయి. చెరువుల పరిరక్షణకు తీసుకున్న చర్యలేమిటో చెప్పాలంటూ లోకాయుక్త కన్నెర్ర చే యగా హెచ్ఎండీఏ రంగంలోకి దిగి ఆర్వీ కన్సల్టెంట్ ద్వారా ఇటీవల సర్వే నిర్వహించింది. రికార్డుల్లో పేర్కొన్న ప్రకారం జీహెచ్ఎంసీలో 176, హుడా పరిధిలో 325 అంటే మొత్తం 501 చెరువులు ఉండాలి. అనేక చెరువులు కన్పించకపోగా, 5-8 ఎకరాల విస్తీర్ణంలో ఉండాల్సిన జలాశయాలు 2-3 ఎకరాలకు తరిగిపోయినట్లు తేలింది. 16 చెరువులు జాడే లేవు. సమస్త యంత్రాంగం ఉండే రాజధానిలోని చెరువులకే ఈ గతిపడితే, ఇక హెచ్ఎండీఏ విస్తరిత ప్రాంతంలోకి వచ్చే జిల్లాల్లోని జలాశయాల సంగతమేమిటనే లోకాయుక్త ప్రశ్నకు హెచ్ఎండీఏ వద్ద సమాధానం లేదు. ‘సాగర్’ ఘోష హుస్సేన్‌సాగర్ ఎగువ ప్రాంతంలో 750 వరకు పలు చిన్న చిన్న చెరువులను గొలుసుకట్టు విధానంలో నిర్మించారు. భారీ వర్షాలతో వరదలొచ్చినా ఒక చెరువు నుంచి మరో చెరువుకు నీరు చేరి చివరకు సాగర్‌కు చేరేలా వీటిని రూపొందించారు. అనంతరం నగరం అనూహ్యంగా విస్తరించడంతో చాలా చెరువులు కాలగర్భంలో కలిసిపోయాయి. సుమారు 450 ఏళ్ల క్రితం హుస్సేన్‌సాగర్ చెరువు నిర్మాణానికి రూ.2.54 లక్షలు వెచ్చించారు. అప్పట్లో ఇది తాగునీటినే కాక, పంటలకు సాగునీటినీ అందించేది. ఇప్పటికీ ఉస్మానియా యూనివర్సిటీ, వీఎస్టీ, బిర్లామందిర్, పబ్లిక్‌గార్డెన్, ఫతేమైదాన్ ప్రాంతాలకు గొట్టపు మార్గాల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. 1948 తరువాత చోటుచేసుకున్న పరిణామాలతో సాగర్‌లో కలిసే వివిధ కాలువలు, నాలాలు మాయమయ్యాయి. నగరం చుట్టుపక్కల విచ్చలవిడిగా పరిశ్రమలు పుట్టుకురావడంతో వాటి వ్యర్థాలు నాలాల ద్వారా సాగర్‌కు చేరడం మొదలైంది. ఇందుకు కూకట్పల్లి నాలా ప్రధాన వాహకంగా పనిచేస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి డ్రైనేజీ నీటిని నాలాల్లోకి వదులుతున్నారు. ఈ నాలాలన్నీ సాగర్‌లో కలుస్తూ జలాశయాన్ని కాలుష్యకాసారంగా మార్చేశాయి. కబ్జాల పర్వం ఇలా... నగర శివారులోని ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలకూ కబ్జాల చెర తప్పలేదు. 111 జీవో పరిధిలోకి వచ్చే వీటి చుట్టూ ఎలాంటి నిర్మాణాలకూ అవకాశం లేదు. కానీ రిసార్ట్స్, ఫాంహౌస్‌లు, విద్యాసంస్థలు యథేచ్ఛగా ఏర్పాటయ్యాయి సుమారు 240 చ.కి.మీ పరిధిలోని హుస్సేన్‌సాగర్ పరివాహక ప్రాంతంలో మొత్తం 80 చెరువులున్నాయి. ప్రధానంగా వర్షాకాలంలో కూకట్పల్లి, యూసఫ్‌గూడ, కుత్బుల్లాపూర్, బోయిన్పల్లి, బాలానగర్, జీడిమెట్ల, అల్వాల్ ప్రాంతాల్లోని చెరువులు నిండి ఆ నీరు నాలాల ద్వారా సాగర్‌లో కలుస్తాయి. కానీ, ఆయా చెరువుల్లో ఇప్పుడు కాలనీలు, వాణిజ్య భవనాలు, విద్యాసంస్థలు, అపార్టుమెంట్లు వెలిశాయి కూకట్పల్లి ప్రగతినగర్ చెరువు, ఎల్లమ్మ చెరువు, కుత్బుల్లాపూర్ కుంట, పంతులు చెరువు, రంగథాముని చెరువులు కబ్జాల పాలయ్యాయి శేరిలింగపల్లి మండల పరిధిలోని గంగా రం, మదీనాగూడ, బచ్చుకుంట, మల్ల య్యకుంట, పటేల్‌చెరువు, నల్లకుంట చెరువులు ఆక్రమణల్లో చిక్కుకున్నాయి. దీంతో చిన్నపాటి వర్షానికే చుట్టుపక్కల కాలనీలు నీట మునుగుతున్నాయి బాలానగర్ మండలంలో 16 చెరువులున్నట్లు రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. వీటిలో సున్నం చెరువు, కాజాకుంట, ఈదులకుంట, భీముని కుంట, అలీ తలాబ్‌చెరువు, నల్లచెరువులు ఆక్రమణలతో కుంచించుకుపోయాయి అంబరు చెరువులోనైతే ఆక్రమణలకు అడ్డూ అడుపూ లేదు సరూర్‌నగర్ చెరువులో ఇప్పటికీ ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నాయి. కర్మన్‌ఘాట్‌లోని చేపల చెరువు, రామంతపూర్ చెరువు, ఉప్పల్ నల్లచెరువు చాలావరకు ఆనవాళ్లు కోల్పోయాయి 600 హెక్టార్లకుపైగా విస్తీర్ణం కలిగిన ఈ చెరువుల స్థలాల విలువ ఇప్పటి మార్కెట్ ధర ప్రకారం రూ.6వేల కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. గత ప్రభుత్వ ఉదాసీనత వల్ల ఇక్కడ రూ.3 వేల కోట్ల విలువైన స్థలాలు ఇప్పటికే కబ్జా అయ్యాయి. -
బదిలి రాజకీయం
- కీలక పోస్టుల స్థాన చలనానికి రంగం సిద్ధం - అధికార పార్టీ నేతలను కలుస్తున్న అధికారగణం - నచ్చిన వారిని తెచ్చుకునేందుకు నేతల సిఫార్సులు సాక్షి, ఒంగోలు, ‘నిన్నటిదాకా.. ఎలాగోలా స్వతంత్రంగా పనిచేసుకుంటూ నెట్టుకొచ్చాం.. ఇప్పుడు అధికారపార్టీ నేతల ఆదేశాలతో నడవాలి. ఇక్కడే ఉంచుతారా..? లేదంటే, దూరప్రాంతాలకు పంపుతారా..?’ అనే భయాందోళన ప్రభుత్వ ఉద్యోగుల్లో కనిపిస్తోంది. ‘సార్.. నేను మీ మనిషిని, మన రూలింగ్‌లో కూడా మనకు అన్యాయం జరిగితే ఎలాగండీ..? నన్ను అక్కడకు తెచ్చుకోండి.. మీకన్నీ నేను చూసుకుంటాను..’ అంటూ ఉద్యోగుల్లో కొందరు కాకారాయుళ్లు అధికార పార్టీ నేతలను ఆశ్రయిస్తున్నారు. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయకముందే వారిని ప్రసన్నం చేసుకునేందుకు.. వారిముందు నానారకాల విన్యాసాలు ప్రదర్శిస్తున్నారు. జిల్లా పాలనలో కీలకంగా పనిచేస్తున్న అధికారుల స్థాన చలనానికి చాపకింద నీరులా ప్రయత్నాలు మొదలయ్యాయి. జిల్లా స్థాయి అధికారుల్లో భారీ మార్పులుంటాయని ప్రచారం జోరుగా సాగుతోంది. పదేళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనలో అప్పటి ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకుని, తిష్టవేసిన వారిని పంపించేందుకు రంగం సిద్ధమైందని తెలిసింది. - మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సులతో ఇక్కడ పనిచేసేవారిని సాగనంపి.. తమకు నచ్చిన, మాటవినే అధికారులను తెచ్చుకోవాలని తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. - టీడీపీ అధికారంలో ఇటువంటి బదిలీల సిఫార్సులు తరచూ రివాజేనని.. ఉద్యోగవర్గాలే చెబుతుండటం గమనార్హం. కొందరు అధికారులైతే ఇక్కడ్నుంచి ఎప్పుడెప్పుడు బయటపడదామా..అని మానసికంగా సిద్ధపడుతున్నట్లు సమాచారం. సమర్థత కొలమానం కాకుండా.. నేతల సిఫార్సు ఎవరికుంటుందో.. అటువంటి ఉద్యోగులకు కొంతకాలం అందలాలు దక్కుతాయంటూ ఉద్యోగవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. - అదేవిధంగా కొంతకాలంగా టీడీపీ నేతలను ఇబ్బందిపెట్టిన అధికారులకు కత్తెర వేయాలని పలువురు నేతలు యోచిస్తున్నారు. ప్రధానంగా రెవెన్యూ, పోలీసు, గ్రామీణ నీటిసరఫరా, ఎక్సైజ్, పంచాయతీరాజ్ వంటి కీలకశాఖల్లో టీడీపీ నేతలు తమకు అనుకూలంగా పనిచేసే వారిని తెచ్చుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. - జూన్ మొదటి వారం వరకు బదిలీల ప్రక్రియ ఉండకపోవ చ్చు. కొత్తప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జిల్లాల్లో కీలకపోస్టుల్లో సమూలంగా మార్పులుంటాయని భావిస్తున్నారు. - ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి అధికారులకు సైతం బదిలీలు తప్పవని ..నేతల అభిప్రాయాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే ఈస్థాయి అధికారులు ఇక్కడ్నుంచి వెళ్లిపోవడానికి మానసికంగా సిద్ధపడినట్లు సమాచారం. మొత్తం మీద కొత్తప్రభుత్వం ఏర్పాటుతో పాటు జిల్లా స్థాయి ఉన్నతాధికారులు జిల్లా నుంచి బదిలీ ఖావడం ఖాయమని ఉద్యోగవర్గాలే ధ్రువీకరిస్తున్నాయి. జిల్లా పరిస్థితిది.. - ఎస్పీ పి.ప్రమోద్‌కుమార్ ఎటూ తెలంగాణకు చెందిన అధికారి కావడంతో.. మరికొద్ది రోజుల్లో ఆయన బదిలీ ఖరారు కావచ్చు. - జిల్లాలో ఒంగోలు నగరపాలక సంస్థకు సంబంధించి కీలక ఉన్నతాధికారిని తక్షణమే ఇక్కడ్నుంచి బదిలీ చేయించేందుకు అధికార పార్టీ నేతల్లో ఒకవర్గం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సదరు అధికారి కూడా ఇప్పటికే కొత్తప్రభుత్వంలో మంత్రి పదవి ఆశిస్తున్న ఒకరితో మాట్లాడి.. కొద్దిరోజులు తనను ఇక్కడ్నే కొనసాగించేలా చూడాలని కోరినట్లు తెలిసింది. - పశ్చిమ ప్రాంతంలోని కొందరు పోలీసు అధికారులు తమ పార్టీ తరఫున పనిచేయలేదని.. టీడీపీ కార్యకర్తలపై లాఠీలు ప్రయోగించారంటూ.. వారిని ఇక్కడ్నుంచి బదిలీ చేయాలని అధికార పార్టీకి చెందిన ఒక వర్గం పావులు కదుపుతోంది. - కాంగ్రెస్ పాలనలో ఒక సామాజికవర్గానికి చెందిన కొందరు అధికారులు పలు ప్రభుత్వ విభాగాల్లో కీలకంగా పనిచేస్తున్నారు. వీరిని ఆ స్థానాల్లో తప్పించి.. తమను ఆశ్రయించిన, నచ్చిన వారిని తెచ్చుకోవాలని ప్రతిపాదనలు సిద్ధం చేసుకున్నారు. - ఎన్నికల్లో ఓ స్వతంత్ర అభ్యర్థి గెలుపునకు సహకరించిన మహిళా అధికారిపై ఇప్పటికే టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. పరిపాలన అమల్లోకి రాగానే జిల్లా నుంచి ఆమెను సాగనంపాలని భీష్మించుకుని కూర్చొన్నట్లు సమాచారం. అయితే, ఆమెకు మాత్రం జిల్లాస్థాయి ఉన్నతాధికారి ఒకరు ఆశీస్సులు అందజేస్తుండటంతో బదిలీ ఉంటుందా..? లేదా..? అనేది సందేహమేనని చెప్పాలి. - ప్రభుత్వ వైద్యశాల (రిమ్స్) పరిపాలనా బాధ్యతలు నిర్వర్తిస్త్తున్న అధికారిని కూడా మార్పుచేసి.. తమపార్టీకి అనుకూలమైన వారిని తెచ్చుకోవాలని ఒక సామాజికవర్గం ఇప్పటికే జిల్లా టీడీపీ నాయకుల దృష్టికి తెచ్చింది. - జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో మరో నాలుగైదు రోజుల్లో ఖాళీ కానున్న కీలక పోస్టుకు జిల్లాలో చాలామంది వైద్యాధికారులు పోటీపడుతున్నారు. ఆ పోస్టు ను తమకే అప్పగించాలంటూ ఎవరికి వారు తమకనుకూలమైన అధికార పార్టీ నేతల వద్దకెళ్లి బేరాలు మాట్లాడుకునే పనిలో ఉన్నట్లు తెలిసింది. -
రుణ మాఫీపై గంపెడాశలు
మారటోరియం విధిస్తామన్న బాబు అప్పులు చెల్లించని అన్నదాతలు ముక్కుపిండి వసూలు చేస్తామంటున్న బ్యాంకర్లు విశాఖ రూరల్, న్యూస్‌లైన్: కొత్త ప్రభుత్వం రుణాలను మాఫీ చే స్తుందా? చేయదా? బ్యాంకుల నుంచి తీసుకున్నవి తిరిగి చెల్లించాలా? వద్దా? ఇలా అనేక సందేహాలు అన్నదాతలను చుట్టుముడుతున్నాయి. అధికారంలోకి రాగానే రైతుల రుణ మాఫీ ఫైలుపై తొలిసంతకం చేస్తామని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హామీ పట్ల జిల్లా రైతాంగం గంపెడాశలు పెట్టుకుంది. ఈ అంశాన్ని టీడీపీ మేనిఫెస్టోలో చేర్చిన నాటి నుంచి రుణాలు చెల్లింపునకు రైతులు ఆసక్తి కనబరచలేదు. జిల్లాలో సుమారు 2 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండో రోజునే రుణ మాఫీ కష్టమని, మారటోరియం విధిస్తామని బహిరంగంగానే చంద్రబాబు ప్రకటన చేశారు. దీంతో ఎన్నికల్లో హామీ మేరకు రుణ మాఫీ చేయాలంటూ సర్వత్రా ఒత్తిళ్లు వస్తున్నప్పటికీ దీనిపై ఎటువంటి స్పష్టత కానరావడంలేదు. బ్యాంకర్లు మాత్రం రుణాలు సకాలంలో చెల్లించాలంటూ రైతుల వెంటపడుతున్నారు. దీంతో విపక్షాల నుంచే కాకుండా, ఆ పార్టీ శ్రేణులు, రైతుల నుంచి ఆందోళనలు వ్యక్తం కావడంతో రుణమాఫీపై ఆలోచన చేస్తున్నట్లు మరోసారి ప్రకటించారు. ఇలా రోజుకో ప్రకటన రైతులను కలవరపెడుతోంది. రుణమాఫీ చేయకుంటే తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించేందుకు ఏడాది లేదా రెండేళ్ల పాటు సమయం ఇవ్వడంతో పాటు ప్రస్తుత ఖరీఫ్‌నకు కొత్త రుణాలు అందించే అవకాశాన్ని కల్పిస్తారన్న ప్రచారం సాగుతోంది. ఒకవేళ రుణమాఫీ చేయాల్సి వస్తే.. కొన్ని నిబంధనలు, ఆంక్షలు విధించి వీలైనంత తక్కువ మంది రైతులకు, తక్కువ మొత్తంలో రుణాలను మాఫీ చేయవచ్చని టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ఏదేమైనా ప్రకృతి వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని, ఎన్నికల్లో ఇచ్చిన రుణమాఫీ హామీని నిలబెట్టుకోవాలని సర్వత్రా డిమాండ్ వ్యక్తమవుతోంది. రూ.1046 కోట్లు రుణాలు జిల్లాలో గతేడాది ఖరీఫ్, రబీలకు కలిపి బ్యాంకర్లు రూ.1046 కోట్లు పంట రుణాలుగా రైతులకు ఇచ్చారు. ఖరీఫ్‌లో వరుస తుపాన్లు కారణంగా పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఇచ్చి ఆదుకోవాల్సిన ప్రభుత్వ ఆంక్షల పేరుతో రైతులను మరింత కుంగదీసింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అధికారులు నామమాత్రంగా నష్టపరిహారం జాబితాను రూపొందించి ప్రభుత్వానికి పంపారు. ఇది జరిగి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయమందలేదు. వరదలు కారణంగా పంటలు కోల్పోయిన రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించలేని స్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలో దాదాపుగా 2 లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు. -
మన ఐఏఎస్,ఐపీఎస్‌లు ఎటు?
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సహజంగా జిల్లా స్థాయి అధికారులలో కొందరికి స్థాన చలనం ఉంటుంది. నూతనంగా ఏ ర్పడే ప్రభుత్వం, జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహించే మంత్రులూ తాము కోరుకున్న వారిని ఉన్నతాధికారులుగా తెచ్చుకోవడం పరి పాటే. అయితే ఈసారి రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారుల బదిలీలు అనివార్యంగా మారాయి. ఉమ్మడి రాష్ర్టంలో పని చేసిన సివిల్ సర్వీసు అధికారుల ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేటాయించే ప్రక్రియ ఊపందుకుంది. జూన్ రెండు తర్వాత తక్షణమే ఈ ప్రక్రియ అమలులోకి రానుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో పనిచేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పరిస్థితి ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది. కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న, జాయింట్ కలెక్టర్ డి.వెంకటేశ్వర్రావు, బోధన్ సబ్ కలెక్టర్ ఎం.హరినారాయణన్ల ఆప్షన్ ఏమిటో ఇంకా స్పష్టం కాలేదు. డీఐజీ ఎన్.సూర్యనారాయణ, ఎస్పీ డాక్టర్ తరుణ్‌జోషి ఇక్కడే కొనసాగుతారా? లేక ఇతర ప్రాంతాలకు వెళ్తారా? అన్న చ ర్చ జరుగుతుండగా, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులలో ఎవరు ఉం టారు.. ఎవరు బదిలీ అవుతారని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. అధికారం చేపట్టబోయే పార్టీ నేతలు మాత్రం జిల్లాకు కొత్త టీమ్ ఖాయమంటున్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌ల మదిలో ఏముందో జిల్లాలో పనిచేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల మదిలో ఏముందే ఇంకా బయట పడటం లేదు. ఈ అధికారులు ఎవరు ఎక్కడికి ఆప్షన్ ఇచ్చారన్న విషయంలో కూడా స్పష్టత లేదు. ఇద్దరు మినహాయిస్తే మిగతావారు ఇతర రాష్ట్రాలకు చెందినవారే గనక, ఆంధ్రలో చేసిన తెలంగాణ రాష్ట్రంలో పనిచేసిన ఒక్కటేనన్న భావనతో ఉన్న ట్లు చెప్తున్నారు. కొందరు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ప్రచారం. ఏం జరుగుతుందనేది రెండు రోజులలో తేలనుంది. లిఖిత పూర్వ కంగా ఆప్షన్ ఇస్తేనే దానిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉండగా, త్వరలోనే బదిలీలపై స్పష్టత రానుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు పోలిస్తే ఆరుగురు ఐఏఎస్ అధికారులు ‘తెలంగాణ’లో ఎక్కువగా ఉన్నారు. ఈ లెక్కన కూడ ఆరుగురిని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌కు పంపాల్సి ఉంటుంది. మొదట స్థానికత ఆధారంగా ఏ రాష్ట్రానికి ఎవరు వెళ్లాలన్నది నిర్ధారించి, ఆ తర్వాత వారి ఆప్షన్లను తీసుకొని ఆ మేరకు కూడా అధికారులను ఉభయ రాష్ట్రాల మధ్య కేటాయిస్తే బాగుంటుం దన్న అభిప్రాయం కూడ అధికారుల్లో ఉంది. ఐఏఎస్, ఐపీఎస్‌ల బాటలో ఐఎఫ్ఎస్లు రాష్ట్ర విభజన, కొత్త రాష్ట్రం ఏర్పాటులో భాగంగా వారు ఏ రాష్ట్రానికి వెళ్లదలచుకున్నారో ప్రాధాన్యాలను తెలపాలని సివిల్ సర్వీసు అధికారులను ప్రభుత్వం కోరిన నే పథ్యంలో జిల్లాలో ఉన్న ఐఎఫ్ఎస్ అధికారుల తీరుపైన చర్చ జరుగుతోంది. అటవీశాఖ చీఫ్ కన్సర్వేటర్లుగా ఉన్న సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారులు వై.బాబూరావు, ఆర్ పీఎన్ చౌదరి సైతం ఆప్షన్లు ఇచ్చినట్లు చెప్తున్నారు. పోస్టల్ శాఖ సీనియర్ సూపరింటెండెంట్‌గా ఐపీఎస్ అధికారి ధర్మజ్యోతి ఉన్నారు. మరోవైపు కలెక్టర్ పీఎస్ ప్రద్యు మ్న కర్ణాటకకు చెందినవారు కాగా, ఎక్కువ కాలం ఆంధ్ర ప్రాంతంలోనే పని చేశారు. విజయవాడ కార్పొరేషన్ కమిషనర్‌గా, చిత్తూరు జాయింట్ కలెక్టర్, గూడూరు స బ్కలెక్టర్గా పనిచేసిన ఈయన కలెక్టర్‌గా జిల్లాలో తెలంగాణలో ఇక్కడే మొదటి పోస్టింగ్. జాయింట్ కలెక్టర్ డి.వెంకటేశ్వర్రావు నల్గొండ జిల్లా డా. కేఎల్ రావు సాగ ర్ స్పెషల్ కలెక్టర్‌గా ఉండి పదోన్నతిపై నుంచి జిల్లాకు వచ్చారు. తమిళనాడుకు చెందిన 2010-11 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఎం.హరినారాయణన్ బోధన్ సబ్‌కలెక్టర్‌గా ఉన్నారు. ఖమ్మం జిల్లా పాల్వంచలో ట్రైనీ సబ్‌కలెక్టర్‌గా వ్యవహరించిన ఆయన మొదటి పోస్టింగ్ బోధన్. తమిళనాడు సరిహద్దులో ఉండే ఆంధ్రప్రదేశ్‌లో పోస్టింగ్ కో సం ఆయన సుముఖంగా ఉన్నట్లు సమాచారం. 2004 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఎస్పీ డాక్టర్ తరుణ్‌జోషి మొదటి పోస్టింగ్ ఏఎస్పీ కరీంనగర్ జిల్లా గోదావరిఖని అ యినా, సీమాంధ్ర ప్రాంతంలోనే ఎక్కువ కాలం పనిచేశారు. విశాఖపట్నం డీసీపీగా, వైఎస్ఆర్ జిల్లా ఎస్పీగా, వైజాగ్ గ్రేహౌండ్స్ కమాండర్, హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీగా పనిచేశారు. 2013 అక్టోబర్ 31న జిల్లా ఎస్పీగా ఆయన బాధ్యతలు తీసుకున్నారు. వీరందరి ఆప్షన్లు ఏమిటన్నది ఇంకా అధికారికంగా తేలలేదు. -
కేరళ గవర్నర్ షీలాపై వేటు!
* 19 మంది గవర్నర్లను మార్చే యోచనలో బీజేపీ * ఆమెపై కామన్వెల్త్ స్కాం కేసు దర్యాప్తు యోచన * రాజీనామాకు సిద్ధమైన కర్ణాటక, గుజరాత్ గవర్నర్లు, రాష్ట్రపతితో భేటీ న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ అధికారంలోకి రాగానే.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల గవర్నర్లను తొలగించి కొత్త గవర్నర్లను నియమించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా కేరళ గవర్నర్‌గా ఉన్న ఢిల్లీ మాజీ సీఎం షీలాదీక్షిత్‌ను తొలగించాలంటూ బీజేపీ ఢిల్లీ విభాగం పట్టుపడుతోంది. కామన్వెల్త్ క్రీడల స్కాంలో దర్యాప్తు సంస్థలు ఆమెను ప్రశ్నించాలని బీజేపీ కోరుతోంది. మూడు పర్యాయాలు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా గత ఏడాది నవంబర్ నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ చేతిలో ఓడిపోవడం, కేంద్రంలోని యూపీఏ సర్కారు షీలాను కేరళ గవర్నర్‌గా నియమించడం తెలిసిందే. అలా చేయటం ద్వారా అవినీతి ఆరోపణల్లో ఆమెపై దర్యాప్తు జరిపే అవకాశం లేకుండా రక్షణ కల్పించారని బీజేపీ విమర్శించింది. ఆమెపై దర్యాప్తు చేయించేందుకు కామన్వెల్త్ కేసును పునఃప్రారంభించాలని ఆ పార్టీ భావిస్తోంది. కొత్త గవర్నర్ జనరల్తోనే ఢిల్లీ ఎన్నికలు..! షీలాతో పాటు మరో 18 రాష్ట్రాల గవర్నర్లను కూడా బీజేపీ సర్కారు తొలగించనున్నట్లు చెప్తున్నారు. ఇందులో చాలా మంది కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకులే. బీజేపీ సర్కారు తొలగించనున్న గవర్నర్ల జాబితాలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ పేరు అందరికన్నా ముందు ఉన్నట్లు సమాచారం. మరోవైపు.. కర్ణాటక గవర్నర్ హన్స్‌రాజ్‌భరద్వాజ్, గుజరాత్ గవర్నర్ కమలాబేనీవాల్లు ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాను కలిసి.. తమ పదవులకు రాజీనామా చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. వారిద్దరూ తమ రాజీనామాలను సమర్పించేందుకు రాష్ట్రపతినీ కలిశారు. -
టీడీపీలో రాజ్యసభ లొల్లి
సాక్షి, నెల్లూరు: సార్వత్రి ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీలో అప్పుడే పదవుల కోసం కుమ్ములాటలు మొదలయ్యాయి. ఈ పదవి ఖాళీ అయినా అది తమకేనంటూ నేతలు పోటీ పడుతున్నారు. పదవి తమకంటే తమకంటూ బలప్రదర్శనలకు దిగుతున్నారు. టీడీపీ ముఖ్యనేతలు ఒక్కొక్కరికి ఒకరు మద్దతు పలుకుతుండడంతో టీడీపీలో అంతర్గతపోరు తీవ్రమవుతోంది. మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మృతితో రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. ఆయన పదవీ కాలం 2016 ఏప్రిల్ వరకు ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ స్థానాన్ని భర్తీ చేసే అవకాశముంది. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీకి ఈ స్థానం దక్కే అవకాశం ఉంది. అది కూడా జిల్లాకు చెందిన నేత మృతిచెందడంతో ఏర్పడిన ఖాళీ కావడంతో పలువురి దృష్టి దానిపై పడింది. ఎలాగైనా పదవి దక్కిచుకోవాలని ఎవరికి వారు పావులు కదుపుతున్నారు. ఈ పదవి తమకంటే తమకంటూ జిల్లాకు చెందిన టీడీపీ నేతలు ఆదాల ప్రభాకరరెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డితో పాటు సర్వేపల్లి నుంచి మరోమారు ఓటమిపాలైన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పోటీపడుతున్నారు. వీళ్లు చాలరన్నట్లు అనంతపురం జిల్లా ఉరవకొండ టీడీపీ అభ్యర్థిగా ఓటమి చెందిన పయ్యావుల కేశవ్ సైతం రాజ్యసభ స్థానం కోసం పోటీపడుతున్నట్లు సమాచారం. నెల్లూరు ఎంపీగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యానని, కీలక సమయంలో జిల్లాలో టీడీపీని బతికించిన తనకు ఆ పదవి కట్టబెట్టాలని చంద్రబాబును ఆదాల కోరినట్లు తెలుస్తోంది. ఆయనకు టీడీపీ ముఖ్యనేత కంభంపాటి రామ్మోహన్రావు మద్దతు పలుకుతున్నట్లు తెలిసింది. మరోవైపు ఇటీవలే టీడీపీలో చేరి ఒంగోలు ఎంపీగా బరిలో నిలిచి వైఎస్సార్సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి చేతిలో ఓటమిపాలైన మాగుంట శ్రీనివాసులురెడ్డి దృష్టి కూడా రాజ్యసభ సీటుపై పడింది. ఆయన ఈ విషయమై రెండు రోజుల క్రితమే పార్టీ ముఖ్య నేతలను సంప్రదించినట్లు సమాచారం. మాగుంటకు సుజనాచౌదరి మద్దతు పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఇక అన్ని పదవులకూ పోటీ పడుతూ భంగపడుతున్న పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సైతం ఒక్క అవకాశం అంటూ రాజ్యసభ సభ్యత్వంకోసం పోరు సాగిస్తున్నట్లు సమాచారం. గతంలో కూడా రాజ్యసభ అడిగానని, అనవసరంగా సర్వేపల్లి నుంచి పోటీచేయించి మరోమారు ఓటమికి గురిచేశారని, కనీసం రాజ్యసభ అయినా ఇచ్చి పరువు నిలపాలని సోమిరెడ్డి టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో లాబీయింగ్ నడుపుతున్నట్లు తెలిసింది. మరోవైపు రాష్ట్రంలో ఓటమి చెందిన పలువురు టీడీపీ నేతలు సైతం ఈ సీటును ఆశిస్తున్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఓటమిచెందిన పయ్యావుల కేశవ్ తనకు రాజ్యసభ పదవిని కట్టబెట్టాలంటూ ఏకంగా టీడీపీ అధినేత పైనే వత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు కేశవ్ శనివారం చంద్రబాబును కలిసి కోరినట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు మాత్రం ఆదాల వైపు మొగ్గుచూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
ఆశల పల్లకిలో టీడీపీ ఎమ్మెల్యేలు
సాక్షి, తిరుపతి : కొత్త ప్రభుత్వంలో మంత్రిపదవులు ఎవరిని వరిస్తాయనే విషయమై తెలుగుదేశం పార్టీలో అప్పుడే చర్చలు, ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లా నుంచి ఇద్దరికి మంత్రి పదవులు దక్కుతాయని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. శుక్రవారం ఎన్నికల ఫలితాలు ఒక వైపు వెలువడుతుండగా మరోవైపు కౌంటింగ్ హాళ్లలో నేతల మధ్య ఈ రకమైన చర్చలు జరిగాయి. అధినేత ఎన్.చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి పదవిని అలంకరించనున్నారు. ఈయన గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ జిల్లాలో ఇద్దరికి మంత్రి పదవులు కట్టబెట్టేవారు. ఇప్పుడు కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తారని చెబుతున్నారు. అనుభవం, కులాల సమీకరణల్లో శ్రీకాళహస్తి నుంచి ఎన్నికైన బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని పదవి వరించడం ఖాయంగా చెబుతున్నారు. రెండో పదవి కూడా ఇవ్వాల్సి వస్తే ఎస్సీల నుంచి సత్యవేడు నియోజకవర్గం నుంచి ఎన్నికైన తలారి ఆదిత్యను వరించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. మూడు పదుల వయస్సు కూడా లేని ఆదిత్య ఉన్నత విద్యావంతుడు. దీంతో పాటు జిల్లాలో మూడు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలు ఉండగా రెండు చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. పూతలపట్టు, గంగాధరనెల్లూరు నుంచి పోటీ చేసిన లలితా థామస్, కుతూహలమ్మ గెలిచి ఉంటే వీరిలో ఒకరిని మంత్రి పదవి వరించేదని, వీరి ఓటమితో ఇప్పుడు ఎస్సీల నుంచి ఆ అవకాశం ఆదిత్యకు దక్కే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. జిల్లాలో బలిజ సామాజికవర్గం నుంచి సత్యప్రభ, ఎం.వెంకరమణ చిత్తూరు, తిరుపతి నుంచి ఎన్నికయ్యారు. బలిజలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తే మహిళల కోటా కూడా కలిసివచ్చేట్టుగా సత్రప్రభకు అవకాశం ఉంటుంది. తంబళ్లపల్లె నుంచి ఎన్నికైన శంకర్‌యాదవ్ యాదవ సామాజికవర్గానికి చెందినవారు. ఒకవేళ బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటే శంకర్ ను అదృష్టం వరించవచ్చని చెబుతున్నారు. మొత్తానికి టీడీపీ శ్రేణుల్లో మంత్రి పదవులపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. -
...అను నేను !
మంత్రి పదవిపై సీనియర్ల ఆశలు చందూలాల్, మధుసూదనాచారికి అవకాశం రేసులో రాజయ్య, వినయ్, కొండా తొలి సర్కారులో చోటుపై టీఆర్ఎస్లో చర్చలు సాక్షి ప్రతినిధి, వరంగల్ : తెలంగాణలో తొలి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సమితిదే అని తేలిపోయింది. ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరును శనివారం ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే జూన్ 2న నూతన ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లో శనివారం జరిగే టీఆర్ఎస్ సమావేశానికి జిల్లాలోని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. వీరందరూ సమావేశానికి వెళ్తున్నా... మంత్రి వర్గంలో చోటు కోసం ఎవరికివారు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారు. టీఆర్ఎస్ జిల్లాలో ఎనిమిది సీట్లు గెలిచింది. ఎక్కువ సంఖ్యలోనే గెలిచినా... టీఆర్ఎస్కు ఆశించిన మేర సీట్లు రాలేదు. తెలంగాణ సెంటిమెంట్ ఎక్కువగా ఉన్న జిల్లాలో టీడీపీ రెండు సీట్లు గెలవడం, పాలకుర్తిలో టీఆర్ఎస్ మూడో స్థానంలో నిలవడం గులాబీ పార్టీకి మింగుడుపడడంలేదు. ఆశించిన దాని కన్నా... రెండు సీట్లు తక్కువ వచ్చాయని భావిస్తున్న టీఆర్ఎస్ అధినాయకత్వం మంత్రి పదవుల కోటాలో జిల్లాకు ఎన్ని కేటాయిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి గరిష్టంగా 15 నుంచి 18 మందితో మంత్రివర్గం ఉండనుంది. ప్రస్తుతం టీఆర్ఎస్కు పది జిల్లాల్లోనూ ఎమ్మెల్యేలు ఉన్నారు. అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించడంతోపాటు సామాజిక సమీకరణల్లో జిల్లాకు గరిష్టంగా రెండు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. ఈ రెండు పదవులు ఎవరికి ఇస్తారనే అంశం తాజాగా ఆసక్తికరంగా మారింది. టీఆర్ఎస్లో పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ కావడంతో ఆయనకు సన్నిహితంగా ఉండే నేతలు మంత్రి పదవుల కోసం ప్రయత్నిస్తున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన అజ్మీరా చందూలాల్ ములుగులో గెలిచారు. లోక్‌సభ సభ్యుడిగా పనిచేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. గిరిజన నేతల్లో సీనియర్ కావడం, కేసీఆర్‌తో సాన్నిహిత్యంతో చందూలాల్‌కు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని టీఆర్ఎస వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గిరిజనులు ఎక్కువగా ఉండే ఆదిలాబాద్ జిల్లాలో సీనియర్లు లేకపోవడం, ఖమ్మంలో ఈ వర్గం వారు గెలకపోవడం ఆయనకు అనుకూలంగా ఉండనుంది. కేసీఆర్‌కు సన్నిహితంగా ఉండే మరో సీనియర్ నేత సిరికొండ మధుసూదనాచారి సైతం మంత్రి పదవిపై ఆశ పెట్టుకున్నారు. టీఆర్ఎస్లో మొదటి నుంచి కీలక నేతగా ఉన్న ఆయనకు సామాజిక సమీకరణలు అనుకూలంగా ఉండే పరిస్థితి కనిపిస్తోంది. అంతేకాదు... మధుసూదనాచారిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా ఉంటారని భూపాలపల్లి ఎన్నికల సభలో కేసీఆర్ ప్రకటించడం గమనార్హం. టీఆర్ఎస్లో సీనియర్ ఎమ్మెల్యేలుగా ఉన్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్యతోపాటు మాజీ మంత్రి కొండా సురేఖ పేరు మంత్రి పదవి పరిశీలనలో ఉంటుందని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం ఊపందుకుంది. -
‘మహా’జాగ్రత్తలు !
కొత్త సర్కారుకు దొరకకుండా ముందస్తు చర్యలు పరిశీలనకు పాత ఫైళ్లు సిద్ధం ల్యాండ్ పూలింగ్ స్కీం పక్కకు అతిజాగ్రత్తల్లో హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు సాక్షి,సిటీబ్యూరో: రేపో, మాపో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో గతంలో తీసుకున్న కీలక నిర్ణయాలను పక్కకుపెడుతూ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూముల విక్రయాలు, భూవినియోగ మార్పిడి , భూములు, కాంప్లెక్స్‌ల లీజులు, ఆదాయ-వ్యయాలపై కొత్త ప్రభుత్వం పునఃసమీక్షించే అవకాశం ఉండటంతో ఎక్కడా దొరకకుండా ఉన్నతాధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రకటన వెలువడ్డాక గత ప్రభుత్వమిచ్చిన జీవోలపై లోతుగా పునఃపరిశీలన జరుపుతామని టీఆర్ఎస్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో గతంలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాల అమలును హెచ్ఎండీఏ తాత్కాలికంగా నిలిపేసింది. వీటికి సంబంధించిన ఫైళ్లను మరోసారి లోతుగా పరిశీలించి ఏవైనా తప్పిదాలుంటే సరిదిద్దుకొనే పనిలోపడ్డారు. గతంలో నందగిరిహిల్స్, చందానగర్, నల్లగండ్ల, జవహర్‌నగర్ తదితర ప్రాంతాల్లో వేలం ద్వారా విక్రయించిన విలువైన భూముల వ్యవహారాన్ని మళ్లీ తిరగదోడే అవకాశముండడంతో వాటికి సంబంధించిన ఫైళ్లను పక్కాగా సిద్ధం చేస్తున్నారు. ప్రధానంగా ‘ల్యాండ్ పూలింగ్ స్కీం’కు ఇంతవరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో దీన్ని పూర్తిగా పక్కకు పెట్టేశారు. ఈ స్కీంను కొనసాగిస్తారా..? లేక సమూలంగా మార్పుచేసి మరో పద్ధతిలో ప్రవేశపెడ్తారా..? అన్నది కొత్త ప్రభుత్వం నిర్ణయంపై ఆధారపడి ఉండనుంది. అక్రమాల పుట్ట : చూసేందుకు పైకి ‘మహా’ గొప్పగా కనిపిస్తున్న హెచ్ఎండీఏ అక్రమాలకు నిలయం. ఇందులో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై కొత్త సర్కారు దృష్టిసారిస్తే..సగంమంది ఉద్యోగులకు శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు. ఇప్పటికే ప్రారంభించిన ఔటర్‌రింగ్‌రోడ్డు, పీవీ ఎక్స్‌ప్రెస్‌వే, హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన ప్రాజెక్టు, ఉప్పల్ భగత్ లేఅవుట్ డెవలప్మెంట్, కొత్వాలగూడ ఎకో పార్కు తదితర ప్రాజెక్టుల్లో తవ్వినకొద్దీ అక్రమాలు బయటపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మచ్చుకు కొన్ని ఇలా ఉన్నాయి.. కీసర మార్గంలో సుమారు 13 కి.మీ.మేర ఔటర్‌రింగ్‌రోడ్డు నిర్మాణం ఇప్పటివరకు జరగలేదు. సదరు కాంట్రాక్టు సంస్థకు ఉద్వాసన పలుకుతూ హెచ్ఎండీఏ ఇటీవల నిర్ణయం తీసుకోవడంతో సంస్థపై రూ.100 కోట్లు అదనపు భారం పడింది. సాగర్ ప్రక్షాళనకు ఉద్వాసన పలుకుతారా..? లేక కొనసాగిస్తారా..? అన్నది ఇంకా తేలాల్సి ఉంది. సాగర్‌ను పూర్తిగా కలుషితం చేస్తున్న కూకట్పల్లి నాలా మళ్లింపునకు పక్కా చర్యలు తీసుకోకుండా ఇప్పటివరకు జరిగిన నిర్మాణాలకు సుమారు రూ.200 కోట్ల వరకు వెచ్చించారు. హెచ్ఎండీఏకు కామధేను లాంటి ఎల్ఆర్ఎస్, బీపీఎస్‌లను కొత్త ప్రభుత్వం రద్దు చేస్తుందా..? లేక కొన సాగిస్తూ గడువును మరింత పెంచుతుందా..? అన్నది వేచిచూడాలి. -
‘తెలుగునాడు’గా మార్చాలి : లగడపాటి
విజయవాడ, న్యూస్‌లైన్ : కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగునాడుగా పేరు మార్చాలని దీని కోసం అసెంబ్లీలో కొత్త ప్రభుత్వం తీర్మానం చేయాలని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కోరారు. మొగల్రాజపురంలోని జనశిక్షణ సంస్థాన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో బుధవారం ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.10వేల కోట్ల లోటు బడ్జెట్ ఉంటున్న నేపథ్యంలో కొత్త ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు రాబట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్నారు. హైదరాబాద్‌లో ఉన్న రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ ఎన్నికల్లో గెలుపొందిన పార్టీ కొత్త రాష్ట్రంలోనే ప్రమాణస్వీకారం చేయాలని కోరారు. ఎంత త్వరగా కొత్త రాజధాని ఏర్పాటు జరిగితే అంతే వేగంగా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులు వీలైనంత త్వరగా కొత్త రాష్ట్రానికి వెళ్లిపోవాలనే ఉద్దేశంతో ఉన్నారని తెలిపారు. జేఎస్పీతో సంబంధం లేదు.. జైసమైక్యాంధ్ర పార్టీతో తనకు ఎటువంటి సంబంధం లేదని లగడపాటి స్పష్టం చేశారు. జై సమైక్యాంధ్ర ఉద్యమం అనేది ప్రజల్లోని ఐక్యత అని, పార్టీతో సంబంధం ఉండదని చెప్పారు. మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తున్నారని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ.. తనకు పునర్జన్మ మీద నమ్మకం లేదని, మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని తాను భావించటం లేదన్నారు. రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని గానీ, ఒక పార్టీలోకి వెళ్లాలనే ఉద్దేశంతో గానీ తాను సర్వే ఫలితాలు ప్రకటించటం లేదన్నారు. కొందరు తన పేరు ఉపయోగించుకుని దొంగ సర్వేలు చేస్తున్నారని, దీంతో తాను సర్వేలు చేయటం ప్రస్తుతానికి నిలిపివేశానని చెప్పారు. గెలుపోటములపై పోలింగ్ శాతం ప్రభావం న్నికల్లో ట్రెండ్ అనేది పోలింగ్ సరళిని ఆధారంగా మారుతుందన్నారు. పోలింగ్ శాతం ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో ట్రెండ్‌ను సృష్టిస్తుందన్నారు. పోలింగ్ మొత్తం పూర్తయిన తరువాత ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే అంశంపై తాను ఒక అభిప్రాయానికి వస్తానన్నారు. ఓటర్లలో చైతన్యం పెరిగిందన్నారు. ఈ నెల 12వ తేదీన వెలువడే మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు దగ్గరగానే ఇంచుమించు అసెంబ్లీ ఫలితాలు ఉంటాయని జోస్యం చెప్పారు. -
మెజార్టీ స్థానాలు కాంగ్రెస్‌కే..
తెలంగాణలో కొత్త ప్రభుత్వం మాదే టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఖిలాషాపురం(రఘునాథపల్లి), న్యూస్‌లైన్ : తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవ సం చేసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ధీమా వ్యక్తం చేశారు. ఆయన స్వగ్రామమైన ఖిలాషాపురంలో బుధవారం పొన్నాలతోపాటు ఆయన సతీమణి అరుణాదేవి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం పొన్నాల లక్ష్మయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఎంత ప్రచారాల జోరు పెంచినా ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలని, విశ్వసించదగిన పార్టీలనే ప్రజలు ఆదరిస్తారని, ఆ విషయూన్ని గత ఎన్నికలు నిరూపించాయన్నారు. తెలంగాణ కోసమే ఆవిర్భవించిన పార్టీ అని చెప్పుకునే వారికి 2004 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో 50 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తే 26 సీట్లు వచ్చాయన్నారు. 2009లో కాంగ్రెస్‌ను ఎలాగైనా గద్దె దింపాలని టీడీపీతో కలిసి మహాకూటమిగా ఏర్పడిన టీఆర్ఎస్.. 52 స్థానాలలో పోటీ చేస్తే కేవలం 10 స్థానాల్లో మాత్రమే విజయం సాధించిందని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో అవమానాలు, ఆరోపణలు ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ 2009 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు 53 స్థానాలు సాధించిందన్నారు. నా ఓటు నాకు వేసుకోలే... ఇన్నేళ్ల నా రాజకీయ జీవితంలో నా ఓటు నాకు వేసుకున్నది లేదని పొన్నాల లక్ష్మయ్య అన్నా రు. జనగామ, హైదరాబాద్‌లో ఓటు వేసుకోవచ్చు.. కానీ ఇక్కడే పుట్టి పెరిగాను.. ఇదే పాఠశాలలో చదివాను.. అందుకే సొంత గ్రామంలో నే ఓటు వేస్తున్నా అని అన్నారు. ఈ ప్రాంతా న్ని అభివృద్ధి చేస్తున్నానని, జనగామ ప్రజలకు రుణపడి ఉన్నానని, వారే నా దేవుళ్లని అన్నా రు. తనకు ఎలాంటి పదవులు వచ్చినా జనగా మ ప్రజలకే అంకితమని ఆయన పేర్కొన్నారు. బడిగంట కొట్టి బజారుకొచ్చి నినాదాలు చేశా.. 1955లో 4వ తరగతి చదువుతున్నప్పుడు పాఠశాలలో బడిగంట కొట్టి బజారుకొచ్చి విశాలాంధ్ర వద్దు.. తెలంగాణ ముద్దు అని నినాదాలతో ఊరంతా తిరుగుతూ నినాదాలు చేశానని, అవి ఇప్పటికీ చెవిలో మార్మోగుతున్నాయని పొన్నాల గుర్తు చేశారు. ఆ ఉద్యమం ఏ ఒక్కరితో రాలేదని, 60 ఏళ్లుగా ప్రజల్లో ఉందన్నారు. దేశంలో 26 చోట్ల ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్ ఉన్నప్పటికీ తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. చిరకాల కోర్కె నెరవేర్చినందుకు తెలంగాణలో కాంగ్రెస్ తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతుందని అన్నారు. ఆయన వెంట డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, పొన్నాల రామకృష్ణ, రాజనాల శ్రీహరి, బట్టి శ్రీనివాస్, సర్పంచ్ దొంగ అంజిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కడారి నాగేశ్వర్, నాయకులు గాదె రమేష్, పెరమాండ్ల రాంబాబు, పొన్నాల రామ్మోహన్, రాణిసంయుక్త, మంగు మనోహర్, హర్యానాయక్, బక్క ఉపేందర్, కట్ల సదానందం, ముప్పిడి శ్రీనివాస్, అన్వర్, సరాబు వీరన్న, నాసగోని మల్లయ్య, బండిమీది కుమార్, జిట్టె వీరస్వామి, చీమల ఈశ్వరయ్య, సరాబు వీరన్న, దన ప్రకాష్, మసి చంద్రమౌళి, రాజ్‌కుమార్ ఉన్నారు. -
ఏక్ దిన్కా సుల్తాన్
సాక్షి, విజయవాడ : కృష్ణా, గుంటూరు జిల్లాలకు విస్తరించి ఉన్న వీజీటీఎం ఉడాకు కొత్తగా నియమితులైన నలుగురు డెరైక్టర్లను నిలుపుదల చేస్తూ బుధవారం గవర్నరు ఉత్తర్వులు జారీచేశారు. సోమవారం బాధ్యతలు చేపట్టిన ఆ నలుగురి పోస్టులు ఒక్కరోజులోనే ఊడిపోవడం రెండు జిల్లాలతో పాటు ఉడాలోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. కనీసం కొత్త ప్రభుత్వం వచ్చేవరకైనా ఈ కమిటీ ఉంటుందని ఉడా సిబ్బంది భావించారు. పదవి వచ్చిన ముచ్చట కూడా తీరకముందే ఒక్కరోజులోనే గవర్నరు వాటిని రద్దుచేశారు. ఒకవేళ వారు ఉన్నప్పటికీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున మే నెలాఖరు వరకు నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఉండేది కాదు. ప్రభుత్వ నిర్లక్ష్యమే.. వీజీటీఎం ఉడాకు రెండేళ్లకొకసారి పాలకవర్గాన్ని మార్చవచ్చు. ఈ లెక్కన కాంగ్రెస్ ఐదేళ్ల హయాంలో కనీసం మూడు పాలకవర్గాలు మారేవి. అప్పుడు సుమారు 25 మందికి అవకాశం వచ్చేది. 2009లో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎక్కువ రోజులు ముఖ్యమంత్రులుగా ఉన్న రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ఉడా గురించి కాని, పాలకవర్గాల నియామకం గురించి కాని పట్టించుకోలేదు. దీంతో నాలుగున్నరేళ్లపాటు స్పెషల్ ఆఫీసర్ పాలనే సాగింది. గత ఏడాది జూన్‌లో ఉడా చైర్మన్‌గా గుంటూరు జిల్లాకు చెందిన వణుకూరి శ్రీనివాసరెడ్డిని నియమించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కాస్త శ్రద్ధ తీసుకుంటే మరికొంతమంది డెరైక్టర్లు వచ్చేవారు. వారు కొద్దొ గొప్పో ప్రయత్నిస్తే ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టి ఉడా పరిధిలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఉండేవారు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యంగా కారణంగానే ఉడాకు పూర్తి కాలం బోర్డును నియమించలేదు. కిరణ్‌రెడ్డిపై ఆగ్రహం.. తమతో కాంగ్రెస్ పార్టీ నేతలు, కిరణ్‌కుమార్‌రెడ్డి చాకిరి చేయించుకున్నారే తప్ప పదవులు ఇచ్చే విషయంలో ఏమాత్రం ఆసక్తి చూపలేదని ఆ పార్టీకి చెందిన ద్వితీయశ్రేణి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం పార్టీ జెండాలు మోయడానికే పరిమితమయ్యామనే భావన వారిలో కనపడుతోంది. చివరికి పదవిలోంచి దిగిపోయే ముందు కిరణ్‌కుమార్‌రెడ్డి మొక్కుబడిగా వేసిన కమిటీని కూడా గవర్నరు రద్దుచేశారని మండిపడుతున్నారు. కిరణ్‌కు నిజంగానే డెరైక్టర్లపై ప్రేమ ఉంటే ముందుగానే పాలకవర్గాన్ని వేసిఉండేవారని అంటున్నారు. దుర్గగుడికి పాలకవర్గానికి ముఖ్యమంత్రి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా దేవాదాయ శాఖలో ఆమోదం లభించలేదు. ఒకవేళ ఆ పాలకవర్గం బాధ్యతలు స్వీకరించినా అది కూడా రద్దయ్యేదన్న భావన నాయకుల్లో వ్యక్తమవుతోంది. రాబోయే రోజుల్లో సీమాంధ్రలో కాంగ్రెస్ కనుమరుగు కావడం ఖాయమని, ఇక నామినేటెడ్ పదవులు తమకు అందని దాక్షే అవుతాయని కాంగ్రెస్ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. -
కాంగ్రెస్ డైలమా