కొత్త ప్రభుత్వ లక్ష్యం అత్యుత్తమ బడ్జెట్‌ | Finance Minister Nirmala Sitharaman urges greater investment in manufacturing at CII Annual Summit | Sakshi
Sakshi News home page

కొత్త ప్రభుత్వ లక్ష్యం అత్యుత్తమ బడ్జెట్‌

Published Sat, May 18 2024 6:06 AM | Last Updated on Sat, May 18 2024 6:06 AM

Finance Minister Nirmala Sitharaman urges greater investment in manufacturing at CII Annual Summit


మంచి మెజారిటీతో మళ్లీ అధికారంలోకి  మోదీ ప్రభుత్వం 

సీఐఐ వార్షిక బిజినెస్‌ సమావేశంలోఆర్థికమంత్రి 

న్యూఢిల్లీ: ఎన్నికల ఫలితాల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వ తక్షణ లక్ష్యం.. జూలైలో అత్యుత్తమ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడమేనని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు లోక్‌సభలో మంచి మెజారిటీతో ప్రధాని నరేంద్ర మోదీ  మళ్లీ అధికారంలోకి వస్తారని ఆర్థిక మంత్రి ఉద్ఘాటించారు. ఎన్నికల అనంతరం మోదీ వరుసగా మూడోసారి ప్రధాని అవుతారని స్పష్టం చేశారు. 

న్యూఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక వాణిజ్య శిఖరాగ్ర సమావేశంలో ఆమె ఈ మేరకు పారిశ్రామిక దిగ్గజాలను ఉద్దేశించి ప్రసంగించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జూలైలో  పూర్తి సంవత్సర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం జరుగుతుందని పేర్కొన్న ఆమె, దీనిని అత్యుత్తమంగా రూపొందించడానికి సీఐఐతో చర్చలు జరుపుతామని అన్నారు. భారత్‌ వృద్ధి తీరు స్థిరంగా కొనసాగుతుందని, దీనికి సంబంధించి దేశం ముందు ఎన్నో అవకాశాలు ఉన్నాయని వివరించారు. దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకం కానుందన్నారు. సోలార్, గ్రీన్‌ హైడ్రోజన్, గ్రీన్‌ అమ్మోనియా రంగాల పురోగతికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు యువతకు గణనీయమైన ఉద్యోగ అవకాశాలను అందిస్తాయని అన్నారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement