ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ఈరోజు (ఫిబ్రవరి 1న) కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతోంది. దేశమంతా ఆమె ప్రసంగం, కేటాయింపులు, ఊరటనిచ్చే అంశాలు వంటి వాటితో ఈ బడ్జెట్‌లో ఏముందనే ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. వీటితో మరో అంశం కూడా ఉందండోయ్. ఆమె ఏ రంగు చీరతో 2023-24 బడ్జెట్‌ను సమర్పిస్తుందా అని అందరి దృష్టి దానిపైనే ఉంది. దీని వెనుక ఆసక్తికరమైన అంశాలను తెలుసుకుందాం
బడ్జెట్‌తో పాటు దానిపై కూడా ప్రత్యేక దృష్టి
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చీరల సేకరణను కలిగి ఉన్నారు.నిర్మలమ్మకు చేనేత చీరలంటే ఇష్టం ఎక్కువ. జనవరి 26న, నార్త్ బ్లాక్‌లో జరిగిన ప్రీ-బడ్జెట్ హల్వా వేడుకలో ఆమె ఆకుపచ్చ, పసుపు కంజీవరం చీరలో కనిపించింది. నిర్మలమ్మ ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక చీరల ధరించి దర్శమమిస్తారు. అదీ కూడా ఆ రంగులు తరచుగా దేశంలోని కరెన్సీ నోట్లకి సరిపోతుంటాయి.
ఇప్పటికే పలు సందర్భాల్లో రూ.10 నుంచి రూ.2,000 నోట్లకు సరిపడే చీరలో కనిపించింది. ఈ ఏడాది బడ్జెట్ 2023 కోసం ఆమె ప్రకాశవంతమైన ఎరుపు రంగును ఎంచుకున్నారు. దీనిబట్టి ప్రజలు ఈ సారి సానుకూల బడ్జెట్ ఆశించవచ్చిన తెలుస్తోంది.
గతంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక సందర్భాలలో ధరించిన చీరలెంటో చూద్దాం..
►అమరవీరుల దినోత్సవం సందర్భంగా రూ.10 నోటు రంగుతో సరిపోయే మణిపురి చీర ధరించింది.
►పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో 20 రూపాయల నోటు రంగులో పచ్చని మంగళగిరి చీర..
►సౌత్ సిల్క్ చీరలో రూ. 2000 నోటు రంగు సరిపోతుంది
►రూ.100 నోటు రంగులో లిలక్ సంబల్‌పురి చీర
►మన్మోహన్ సింగ్‌ను కలిసే ముందు రూ.200 నోటు రంగు చీర
►అమెరికాలో జరిగిన ప్రపంచ బ్యాంకు సమావేశంలో 500 నోటు కలర్ చీర
►విలేకరుల సమావేశంలో ధరించిన జమ్దానీ చీర రూ.50 నోటుతో సరిపోతుంది. ప్రత్యేక సందర్భాలలో ఆర్థిక మంత్రి ఎరుపు రంగును ఎంచుకుంటారు, నలుపును దూరంగా పెడుతుంటారు.
చదవండి: Union Budget 2023: బడ్జెట్ ప్రసంగంపై యువతకు ఎందుకంత ఆసక్తి? ఈ విషయాలు తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment