రాజధాని మారే అవకాశం | State capital may be changed after new government forms | Sakshi
Sakshi News home page

రాజధాని మారే అవకాశం

Published Mon, Aug 29 2016 1:08 AM | Last Updated on Sat, Aug 18 2018 8:49 PM

రాజధాని మారే అవకాశం - Sakshi

రాజధాని మారే అవకాశం

  • మాజీ ఎంపీ చింతామోహన్‌
  • వెంకటగిరి(నెల్లూరు) : రాష్ట్రంలో ప్రభుత్వం మారితే ప్రస్తుతం అమరావతిలో ఉన్న రాజధాని తిరుపతి – వెంకటగిరి ప్రాంతంలో ఏర్పాటయ్యే అవకాశాలున్నాయని తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్‌ తెలిపారు. ఆదివారం ఆయన వెంకటగిరిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం రాజధాని నిర్మిస్తున్న ప్రాంతం భారీ నిర్మాణాలకు అనుకూలంకాదన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడినప్పుడు రాజధాని కర్నూలు నుంచి హైదరాబాద్‌ మారిన విషయాన్ని గుర్తుచేశారు.

    జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ రాజకీయంగా పురిటిబిడ్డేనన్నారు. దుగరాజపట్నం పోర్టు కాంగ్రెస్‌ చేపట్టిన ప్రాజెక్టని బీజేపీ పట్టించుకోవడంలేదని విమర్శించారు. తిరుపతికి అనుసంధానంగా నిర్మించిన జాతీయ రహదారులు అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం మంజూరు చేసినవేనన్నారు.  ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ కీలకమైందన్నారు. దేశంలో న్యాయవ్యవస్థలో సమూల మార్పులు రావాల్సిన అవసరముందన్నారు. సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు పంజాం ధనంజయ, డేగా మునిచంద్ర, సీహెచ్‌ హనుమంతరావు, సుధ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement