రాత్రి 7.15 గంటలకు ముహూర్తం
ఎన్డీఏపీపీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నిక
అనంతరం రాష్ట్రపతిని కలిసిన మోదీ
ప్రధానిగా నియమిస్తూ ముర్ము నిర్ణయం
ప్రభుత్వ ఏర్పాటుకు నన్ను ఆహా్వనించారు
రాష్ట్రపతితో భేటీ తర్వాత మీడియాతో మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనను ఆహా్వనించారు. ఆదివారం రాత్రి 7:15 గంటలకు మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ దిశగా శుక్రవారం హస్తినలో ఒకదాని వెంట ఒకటి పలు పరిణామాలు జరిగాయి.
తొలుత ఉదయం 11.30కు నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) భాగస్వామ్య పక్షాలన్నీ సమావేశమై తమ పార్లమెంటరీ పార్టీ నేతగా మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. పార్లమెంటు పాత భవనం ‘సంవిధాన్ సదన్’ సెంట్రల్ హాల్లో జరిగిన ఈ భేటీలో బీజేపీతో పాటు టీడీపీ, జేడీ(యూ), ఎల్జేపీ తదితర ఎన్డీఏ భాగస్వామ్య పారీ్టల అధినేతలు, ఎంపీలు పాల్గొన్నారు.
ఎన్డీఏపీపీ నేతగా మోదీ పేరును బీజేపీ అగ్రనేత రాజ్‌నాథ్‌సింగ్ ప్రతిపాదించగా కూటమి ఎంపీలంతా ఏకగ్రీవంగా అంగీకారం తెలిపారు. అనంతరం ఎంపీలందరినీ ఉద్దేశించి మోదీ, ఆయన నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ భాగస్వామ్య పక్షాల నేతలు ప్రసంగించారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా, లోక్‌సభలో బీజేపీ పక్ష నేతగా కూడా మోదీ ఎన్నికయ్యారు. తర్వాత ఆయన రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి ద్రౌపదీ ముర్ముతో సమావేశమయ్యారు.
ఎన్డీఏ ఎంపీల నిర్ణయాన్ని ఆమెకు తెలియజేశారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మోదీని ముర్ము ఆహా్వనించారు. అనంతరం రాష్ట్రపతి భవన్ వెలుపల మోదీ మీడియాతో మాట్లాడారు. ‘‘నన్ను ఎన్డీఏ నేతగా ఎన్నుకున్నట్టు భాగస్వామ్య పక్షాలన్నీ రాష్ట్రపతికి తెలిపాయి. దాంతో ఆమె నన్ను ప్రధానిగా నియమించారు. ఆ మేరకు నాకు లేఖ అందజేశారు.
ప్రమాణస్వీకారానికి అనువైన సమయం, నాతో పాటు కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసే నేతల వివరాలు కోరారు. ఆదివారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేస్తామని తెలిపాను. కాబోయే మంత్రుల జాబితాను ఆదివారానికల్లా రాష్ట్రపతి భవన్‌కు అందజేస్తా’’ అని వివరించారు.
2047లో వందేళ్ల స్వాతంత్య్రోత్సవాల నాటికి జాతి కలలను సంపూర్ణంగా సాకారం చేసే ప్రస్థానంలో 18వ లోక్‌సభ కీలక మైలురాయిగా నిలవనుందని ఈ సందర్భంగా మోదీ అన్నారు. ‘‘ఇది నవ, యువ శక్తితో అలరారుతున్న సభ. దేశ ప్రజలు ఎన్డీఏకు మరోసారి అవకాశమిచ్చారు’’ అని చెప్పారు. ఎన్డీఏ పక్షాలన్నీ మోదీకి మద్దతుగా శుక్రవారం మధ్యాహ్నమే రాష్ట్రపతికి లేఖలు అందజేశాయి.
జాతీయ ప్రయోజనాలు, ప్రాంతీయ ఆకాంక్షల మధ్య... సమతూకంగా పాలన: బాబు, నితీశ్
జాతీయ ప్రయోజనాలు, ప్రాంతీయ ఆకాంక్షల మధ్య సమతూకం పాటిస్తూ ఎన్డీఏ ప్రభుత్వ పాలన సాగాలని భాగస్వామ్య పక్షాలు టీడీపీ, జేడీ(యూ) ఆకాంక్షించాయి.
ఎన్డీఏపీపీ నేతగా మోదీ పేరును రాజ్‌నాథ్ ప్రతిపాదించగా చంద్రబాబు (టీడీపీ), నితీశ్‌కుమార్ జేడీ(యూ), ఏక్‌నాథ్ షిండే (శివసేన), చిరాగ్ పాస్వాన్ (ఎల్జేపీ–ఆర్‌వీ), హెచ్.డి.కుమారస్వామి జేడీ(ఎస్), అజిత్ పవార్ (ఎన్సీపీ), జితిన్‌రాం మాంఝీ తదితరులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు సారథ్యం వహిస్తున్నారని చంద్రబాబు అన్నారు.
‘‘ప్రపంచ సారథిగా ఎదిగేందుకు భారత్‌కు ఇదో అద్భుతమైన అవకాశం. సమాజంలోని అన్ని వర్గాల సమగ్రాభివృద్ధికి పెద్దపీట వేస్తూ పాలన సాగాలి’’ అని ఆకాంక్షించారు. రాష్ట్రాల అభివృద్ధిని చిన్నచూపు చూడొద్దని నితీశ్ సూచించారు.
దేశాన్ని అద్భుతంగా వృద్ధి పథంలో నడిపించడంతో పాటు బిహార్‌పైనా మోదీ ప్రత్యేకంగా దృష్టి సారిస్తారని ఆశాభావం వెలిబుచ్చారు. ‘‘వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ విపక్షాలకు ఓటమి తప్పదు. వాళ్లు పనికిరాని కబుర్లు చెప్పి అక్కడా, ఇక్కడా గెలిచారు. వచ్చేసారి వారంతా ఓడటం ఖాయం’’ అన్నారు. మోదీ ప్రధానిగా ఉన్నంతకాలం దేశం ఎవరి ముందూ తలొంచబోదని పవన్ కల్యాణ్ అన్నారు.
విరిసిన నవ్వులు...
ఎన్డీఏ భేటీ పలు ఆహ్లాదకర సన్నివేశాలకు వేదికైంది. తమ కూటమిది పటిష్టమైన ఫెవికాల్ బంధం అని షిండే అభివరి్ణంచగా నవ్వులు విరిశాయి. తనకు పాదాభివందనం చేసేందుకు నితీశ్ ప్రయత్నించగా మోదీ వారిస్తూ ఆలింగనం చేసుకున్నారు. చిరాగ్‌నూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను భుజం తట్టారు. పవన్ కల్యాణ్ ‘పవనం కాదు, సుడిగాలి’ అంటూ మోదీ తన ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రశంసించారు.
రాజ్యాంగ ప్రతికి నమస్సులు
ఎన్డీఏ భేటీ కోసం సెంట్రల్ హాల్లోకి ప్రవేశించగానే మోదీ ముందుగా రాజ్యాంగ ప్రతిని తన నుదిటికి తాకించుకుని వందనం చేశారు. ఆ ఫొటోను ఎక్స్‌లో పెట్టి భావోద్వేగంతో కూడిన పోస్ట్ చేశారు. ‘‘తన జీవితంలో ప్రతి క్షణమూ రాజ్యాంగం ప్రవచించిన గొప్ప విలువల పరిరక్షణకే అంకితం. నా వంటి వెనకబడ్డ నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి దేశానికి సేవ చేయగలుగుతున్నాడంటే అది కేవలం మన రాజ్యాంగం గొప్పదనమే. అది కోట్లాది ప్రజలకు ఆశ, శక్తియుక్తులు, గౌరవాదరాలు కలి్పస్తోంది’’ అని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని పదేళ్లుగా అడుగడుగునా నిర్లక్ష్యం చేస్తూ వచి్చన మోదీ నేడిలా అదే రాజ్యాంగానికి ప్రణామాలు చేయడం విడ్డూరమంటూ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment