oath taking ceremony
-
రేఖా గుప్తా అనే నేను
-
ఇవాళ ఢిల్లీ కొత్త సీఎంగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం
-
చైనా విస్తరణ కాంక్షకు ‘పనామా’తో ట్రంప్ ఆజ్యం పోస్తున్నారా?
అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన డొనాల్డ్ ట్రంప్ ప్రారంభోపన్యాసంలో పనామా కాలువ గురించి చేసిన వ్యాఖ్యలపై విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనామా కాలువను బల ప్రయోగంతోనైనా స్వాదీనం చేసుకుంటామంటూ ట్రంప్ చేసిన ప్రకటన మున్ముందు ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తుందంటున్నారు. ప్రారంభ ప్రసంగంలో ట్రంప్ పనామా కాలువ చైనా నియంత్రణలోకి వెళ్లిపోయిందని, 1977 నాటి ఒప్పందాన్ని పనామా ఉల్లంఘించిందని ఆరోపించారు. అప్పట్లో కాలువను అమెరికా మూర్ఖంగా పనామాకు ఇచ్చివేసిందని వ్యాఖ్యానించారు. అమెరికా నౌకల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తోందని, అందుకే స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు. చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకే ట్రంప్ ఈ ప్రకటన చేసినట్లుగా భావించినప్పటికీ డ్రాగన్ దేశ విస్తరణ కాంక్షకు బలమిస్తున్నట్లు అవుతుందని అంటున్నారు. తైవాన్ను, ఇతర ప్రాంతాలను కలిపేసుకునేందుకు ఇదో సాకుగా చూపే ప్రమాదముందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో, తైవాన్ పట్ల చైనాను సంయమనంగా వ్యవహరించేలా చేయడమన్న దశాబ్దాల అమెరికా విధానానికి వీడ్కోలు పలుకుతూ ట్రంప్ చేసిన అనూహ్య ప్రకటన తన విస్తరణ కాంక్షకు చట్టబద్ధతగా ఆ దేశం భావించే ప్రమాదముందని చెబుతున్నారు. రష్యా, చైనాల సరసన అమెరికా? అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టకమునుపే ట్రంప్ పనామా కాలువ అమెరికాకే చెందుతుందంటూ చేసిన వ్యాఖ్యలపై నిపుణులు పెదవి విరిచారు. అలాంటప్పుడు, చైనా, రష్యాల చర్యల కంటే అమెరికా ఏవిధంగా మెరుగనే ప్రశ్న ఉత్పన్నమవుతుందని వారన్నారు. ఉక్రెయిన్ తమకే చెందుతుందంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. తైవాన్ను బలప్రయోగంతోనైనా స్వాదీనం చేసుకుంటామని చైనా బెదిరింపులకు దిగుతోంది. ట్రంప్ కూడా పనామా, గ్రీన్‌ల్యాండ్‌లను సైనిక చర్యతో అయినా స్వాధీనం చేసుకుంటామంటున్నారు. ఆ రెండు దేశాలకు, అమెరికాకు తేడా ఏముంటుంది?’అని న్యూయార్క్‌కు చెందిన జర్నలిస్ట్ గెరాల్డో రివెరా ‘ఎక్స్’లో పేర్కొన్నారు. సార్వభౌమ దేశాన్ని స్వాదీనం చేసుకుంటామనడం ట్రంప్ విస్తరణవాదానికి ఉదాహరణ అని వాషింగ్టన్కు చెందిన మరో జర్నలిస్ట్ పేర్కొన్నారు. చైనాకు ఓ అవకాశం కానుందా? పనామా కాలువతోపాటు సరిహద్దులను ఆనుకుని ఉన్న కెనడాను, ఉత్తర అట్లాంటిక్ సముద్రంలోని డెన్మార్క్ పాలనలోని గ్రీన్‌ల్యాండ్‌ను కలిపేసుకుంటామంటూ ట్రంప్ చేసిన ప్రకటనలు.. రష్యా, చైనాలు కూడా తమ ఆక్రమణలను అమెరికా గుర్తిస్తుందనే సంకేతాలిచ్చినట్లవుతుందని సీఎన్ఎన్ యాంకర్ జిమ్ సియుట్టో ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఇటువంటి ప్రకటనలు అమెరికా విశ్వసనీయతను దెబ్బతీస్తాయని, చైనాకు విస్తరణకు గేట్లు తెరిచినట్లవుతుందని ఆ దేశ విశ్లేషకులు అంటున్నారు. ఒక వేళ అమెరికా గ్రీన్‌ల్యాండ్‌ను ఆక్రమిస్తే చైనా తైవాన్ను తప్పక స్వా«దీనం చేసుకుంటుందని వాంగ్ జియాంగ్యు అనే హాంకాంగ్ ప్రొఫెసర్ స్పష్టం చేస్తున్నారు. అత్యంత క్లిష్టమైన తైవాన్ అంశం సహా అన్ని విషయాలపైనా ట్రంప్‌తో బేరసారాలకు అవకాశముంటుందని చైనా అధికార వర్గాలు భావిస్తున్నాయని షాంఘైలోని ఫుడాన్ వర్సిటీ ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రొఫెసర్ ఝావో మింగ్హావో అంటున్నారు. కాలువపై చైనా పెత్తనం నిజమేనా? పసిఫిక్–అట్లాంటిక్ సముద్రాలను కలుపుతూ అమెరికా ప్రభుత్వం 1904–1914 సంవత్సరాల మధ్య పనామా కాలువను తవ్వించింది. దీనివల్ల ఈ రెండు సముద్రాల మధ్య ప్రయాణ దూరం చాలా తగ్గింది. 1977లో కుదిరిన ఒప్పందం ప్రకారం 1999 నుంచి పనామా నియంత్రణ కొనసాగుతోంది. పనామా కాలువ గుండా వెళ్లే ఓడల్లో 70 శాతం అమెరికావే కావడం గమనార్హం. భద్రతకు ముప్పు కలిగితే కాపాడేందుకు అమెరికా జోక్యం చేసుకోవచ్చు. ప్రస్తుతం, కాలువను చైనా నియంత్రించడం లేదు, నిర్వహించడం లేదు. కానీ, హాంకాంగ్‌కు చెందిన సీకే హచిసన్ అనుబంధ కంపెనీ పనామా కాలువలోని కరీబియన్, పసిఫిక్ ఎంట్రన్స్ వద్ద నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తోంది. ఇదికాకుండా, చైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌లో 2017లో చేరిన మొట్టమొదటి లాటిన్ అమెరికా దేశం పనామాయే. 2016లో చైనా ప్రభుత్వ సీవోఎస్సీవోకు చెందిన ఓట మొదటిసారిగా పనామా కాలువలోకి ప్రవేశించింది. అదే ఏడాది, చైనా కంపెనీ లాండ్బ్రిడ్జి గ్రూపు మార్గరిటా దీవిలోని అతిపెద్ద నౌకాశ్రయాన్ని కొనుగోలు చేసింది. పనామా కాలువపై మరో వంతెన నిర్మాణ కాంట్రాక్టును చైనా కంపెనీలే దక్కించుకున్నాయి. ఈ ప్రాంతంలో చైనా ప్రాబల్యం విస్తరిస్తుండటం అమెరికాకు కంటగింపుగా మారింది. ‘సాంకేతికంగా కాలువపై హక్కులు మావే. మరో దేశం చేతుల్లోకి కాలువ వెళుతోంది. వాస్తవానికి పరాయి దేశం తన కంపెనీల ద్వారా కాలువపై పెత్తనం సాగిస్తోంది’అని విదేశాంగ మంత్రి మార్కో రుబియో సైతం పేర్కొన్నారు. కాలువను అమెరికా కొంటుందనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
క్యూ3 ఫలితాలు, ట్రంప్‌పైనే దృష్టి
ముంబై: ప్రపంచ దేశాలన్నీ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారానికి నేడు(20న) తెరలేవనుంది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ రెండోసారి యూఎస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించనుండటంతో కొంతకాలంగా వాణిజ్య వర్గాలు అధికంగా ప్రభావితం కానున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. వాణిజ్యంతోపాటు ఫైనాన్షియల్ మార్కెట్లపైనా ట్రంప్ ఎఫెక్ట్ ఉండబోతున్నట్లు మరోపక్క ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. ఇప్పటికే ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో యూఎస్ డాలరు నిరవధికంగా బలపడుతూ 109ను అధిగమించింది. అంతేకాకుండా 10ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్ 4.6 శాతాన్ని తాకాయి. ఈ ప్రభావంతో పలు ఆసియా కరెన్సీలతోపాటు రూపాయి సైతం డీలా పడుతోంది. డాలరుతో మారకంలో గత వారం దేశీ కరెన్సీ విలువ 86.62కు పడిపోయింది. వెరసి ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లను 47వ యూఎస్ ప్రెసిడెంట్కానున్న ట్రంప్ నిర్ణయాలు అత్యధికంగా ప్రభావితం చేయనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. బ్లూచిప్స్ జోరు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, ఆర్ఐఎల్, యాక్సిస్ బ్యాంక్‌తో ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసిక ఫలితాల సీజన్ ప్రారంభమైంది. ఈ వారం మరికొన్ని దిగ్గజాలు అక్టోబర్–డిసెంబర్(క్యూ3) పనితీరు వెల్లడించనున్నాయి. జాబితాలో బ్యాంకింగ్ దిగ్గజాలు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, సెంట్రల్ బ్యాంకుతోపాటు ఎఫ్ఎంసీజీ బ్లూచిప్ హిందుస్తాన్ యూనిలీవర్, డాక్టర్ రెడ్డీస్, అ్రల్టాటెక్ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, వన్97 కమ్యూనికేషన్స్(పేటీఎమ్), జొమాటో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లు ఆటుపోట్లను చవిచూడవచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్, వెల్త్‌మేనేజ్‌మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అభిప్రాయపడ్డారు. ఆయా కంపెనీల పనితీరు ఆధారంగా స్టాక్స్‌లో యాక్టివిటీ నమోదయ్యే వీలున్నదని తెలియజేశారు. బడ్జెట్‌పై కన్ను క్యూ3 ఫలితాలతోపాటు వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్‌పై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ విశ్లేషకులు ప్రవేశ్ గౌర్ పేర్కొన్నారు. ఆదాయపన్నుసహా పలు రంగాల నుంచి సంస్కరణలకోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు వినతులు అందుతున్న విషయం విదితమే. ద్రవ్య విధానాలు, ఆర్థిక వృద్ధి చర్యలు, పెట్టుబడుల కేటాయింపు, కీలక రంగాలలో సంస్కరణలు వంటి పలు అంశాలకు ప్రాధాన్యత ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇదేవిధంగా దేశ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ముడిచమురు ధరలు సైతం మార్కెట్లలో సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు వివరించారు. గత వారమిలా దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో వారంలోనూ క్షీణపథంలోనే ముగిశాయి. 17తో ముగిసిన గత వారం సెన్సెక్స్ నికరంగా 760 పాయింట్లు(1 శాతం) నీరసించి 76,618 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 228 పాయింట్లు(1 శాతం) నష్టపోయి 23,203 వద్ద ముగిసింది. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ నామమాత్ర నష్టంతో నిలవగా.. స్మాల్‌క్యాప్ 0.8 శాతం డీలా పడింది. -
దుమ్ము రేపుతున్న... ట్రంప్ మీమ్ బిట్‌కాయిన్
వాషింగ్టన్: అగ్రరాజ్య అధ్యక్ష పీఠంపై కూర్చోడానికి ఒక్కరోజు ముందే సొంత (Bitcoin)బిట్‌కాయిన్‌ను ట్రంప్ మార్కెట్లోకి తెచ్చారు. $TRUMP పేరిట తెచ్చిన ఈ కాయిన్ (టోకెన్)కు మార్కెట్లో అనూహ్య డిమాండ్ నెలకొంది. ఔత్సాహిత పెట్టుబడిదారులు దాన్ని ఎగబడి కొనుగోలు చేశారు. దాంతో దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ గంటల్లోనే ఏకంగా 5.5 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు వార్తలొచ్చాయి. ‘‘మొత్తంగా 100 కోట్ల టోకెన్లు తెస్తాం. ప్రారంభం రోజున 20 కోట్ల కాయిన్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టాం. మూడేళ్లలో దశలవారీగా 80 కోట్ల కాయిన్లను తీసుకొస్తాం’’ అని $TRUMP మీమ్ కాయిన్లను జారీచేసిన వెబ్సైట్ ప్రకటించింది. (Trump)ట్రంప్ ఆర్గనైజేషన్ అనుబంధ సంస్థ అయిన సీఐసీ డిజిటల్ ఎల్ఎల్సీ ఈ కాయిన్ విక్రయాల బాధ్యతలను చూసుకుంటోంది. సీఐసీ డిజిటల్ ఎల్ఎల్సీ గతంలో ట్రంప్ బ్రాండ్‌నేమ్‌తో పాదరక్షలు, సుగందద్రవ్యాలు విక్రయించింది. ట్రంప్ పేరుతో గతంలో బైబిళ్లు, బంగారు బూట్లు, వజ్రాల వాచీలు కూడా అమ్ముడవడం తెలిసిందే. మీమ్ కాయిన్లను సాధారణంగా స్కామర్లు వినియోగిస్తారు. అధిక లాభా లు గడించాలన్న అత్యాశపరులైన పెట్టుబడిదారుల నుంచి సంపదను కాజేసేందుకు వాటిని వాడతారని క్రిప్టో కరెన్సీ మార్కెట్ వర్గాలు తెలిపాయి. -
నేడే డొనాల్డ్ ట్రంప్ పట్టాభిషేకం
వాషింగ్టన్: రెండున్నర నెలల ఎదురుచూపులు ముగిశాయి. (Donald Trump,)డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా పాలనా పగ్గాలు చేపట్టనున్నారు. దేశ 47వ అధ్యక్షునిగా సోమవారం (Oath Taking Ceremonyప్రమాణస్వీకారం చేయబోతున్నారు. (Washington)వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హిల్‌లో రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన అతిరథ మహారథుల సమక్షంలో అట్టహాసంగా కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని తొలుత ఆరుబయట తలపెట్టినా, గడ్డకట్టించే చలి కారణంగా రొటుండా హాల్ లోనికి మార్చారు. దాంతో రొనాల్డ్ రీగన్ తర్వాత గత 40 ఏళ్లలో ఇండోర్‌లో అధ్యక్ష ప్రమాణం చేస్తున్న తొలి నేతగా ట్రంప్ నిలవనున్నారు. ఈ నేపథ్యంలో ఆహూతులను కూడా వేలనుంచి 500 లోపునకు కుదించారు. భారత్ తరఫున విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చైనా ఉపాధ్యక్షుడు హాన్జెంగ్తో పాటు పలువురు దేశాధినేతలు తదితరులు కూడా హాజరవనున్నారు. 2021 క్యాపిటల్ హిల్ దాడి నిందితులు కూడా కోర్టు ప్రత్యేక అనుమతితో కార్యక్రమంలో పాల్గొంటుండటం విశేషం. ట్రంప్ శనివారం సాయంత్రమే కుటుంబసమేతంగా ఫ్లోరిడా నుంచి ప్రత్యేక విమానంలో వాషింగ్టన్ చేరుకున్నారు. రాత్రి స్టెర్లింగ్‌లోని ఆయన సొంత నేషనల్ గోల్ఫ్ క్లబ్లో మొదలైన ప్రమాణ స్వీకార వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, మద్దతుదారులు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సందడి చేశారు. అనంతరం కాబోయే ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్, ఆయన సతీమణి ఉషా చిల్లకూరితో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండోసారి పగ్గాలు చేపడుతూనే ట్రంప్ తనదైన శైలిలో దూకుడు కనబరచనున్నారు. పాలన పగ్గాలు చేపట్టిన తొలి రోజే టిక్‌టాక్‌పై నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తేయనున్నట్టు ఆయన ఆదివారం ప్రకటించారు. అంతేగాక ఏకంగా 100కు పైగా అధికారిక ఉత్తర్వులు జారీ చేయబోతున్నారు. నవంబర్ 5న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను ట్రంప్ ఓడించడం తెలిసిందే. ఆయన 2017–21 మధ్య తొలి దఫా అమెరికా అధ్యక్షునిగా పనిచేశారు. ట్రంప్ అభిమానులకు పోటీగా ఆయన వ్యతిరేకులు కూడా శనివారం నుంచే వైట్‌హౌస్ ముందు నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ఏప్రిల్‌లో భారత పర్యటన?ఏప్రిల్‌లో ట్రంప్ భారత పర్యటన ఉండే అవకా శం కనిపిస్తోంది. అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక వీ లైనంత త్వరగా భారత్‌లో పర్యటించాలని ఆయ న యోచిస్తున్నట్టు ఫైనాన్షియల్ డైలీ వెల్లడించింది. ‘‘దీనిపై ఆయన ఇప్పటికే తన సలహాదారులతో లోతుగా చర్చిస్తున్నారు. డిసెంబర్ చివర్లో క్రిస్మస్ సందర్భంగా అమెరికాలో పర్యటించిన విదేశాంగ మంత్రి జైశంకర్‌తో ఈ దిశగా ఇప్పటికే ఒక దఫా చర్చలు కూడా జరిగాయి’’ అని తెలిపింది. అంతకుముందే ప్రధాని మోదీని అమెరికాలో పర్యటించాల్సిందిగా ట్రంప్ ఆహ్వానించే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు వివరించింది. చైనాపై టారిఫ్‌లు తప్పవన్న తన వ్యాఖ్యల తాలూకు ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఆ దేశంలో కూడా ట్రంప్ పర్యటిస్తారని ఆయన సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. కార్యక్రమానికి అతిరథులు ప్రపంచ కుబేరులు, వ్యాపార దిగ్గజాలు ఎలాన్ మస్‌్క, మార్క్ జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్, ముకేశ్ అంబానీ దంపతులు తదితరులు ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అంబానీ దంపతులు శనివారం రాత్రే ట్రంప్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం ఆయనతో పాటు క్యాండిల్ లైట్ డిన్నర్లో పాల్గొన్నారు. ట్రంప్ వ్యక్తిగతంగా ఆహ్వానించిన 100 మంది జాబితాలో భారత్ నుంచి వారు మాత్రమే ఉన్నారు.ప్రమాణ స్వీకారం ఇలా... → ట్రంప్ ఆదివారం (అమెరికా కాలమానం ప్రకారం) ఆర్లింగ్టన్ జాతీయ స్మారకం వద్ద కార్యక్రమంలో, క్యాపిటల్ వన్ ఎరీనా ర్యాలీలో పాల్గొంటారు. → సోమవారం ఉదయం సెయింట్ జాన్స్ ఎపిస్కోపల్ చర్చిలో ట్రంప్ ప్రార్థనలతో కార్యక్రమాలు మొదలవుతాయి. → అనంతరం దిగిపోనున్న అధ్యక్షుడు జో బైడెన్ దంపతులు వైట్‌హౌస్‌లో ట్రంప్‌కు తేనీటి విందు ఇస్తారు. → తర్వాత అంతా కలిసి క్యాపిటల్ హిల్ భవనానికి చేరుకుంటారు. → లింకన్ బైబిల్‌పై ప్రమాణం చేసి అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. → తర్వాత ప్రారంభోపన్యాసం చేస్తారు. రెండో టర్ములో తన ప్రాథమ్యాలను క్లుప్తంగా వివరిస్తారని భావిస్తున్నారు. → అనంతరం బైడెన్, కమలా హారిస్‌కు లాంఛనంగా వీడ్కోలు పలుకుతారు. → తర్వాత ట్రంప్ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరిస్తూ వైట్‌హౌస్ ఓవల్ ఆఫీసులో అధికారిక పత్రాలపై సంతకాలు చేస్తారు. అధ్యక్షునిగా తొలి ఆదేశాలు జారీ చేస్తారు. → అధికారిక విందు అనంతరం సాయుధ బలగాలపై సమీక్ష జరుపుతారు. -
ప్రమాణస్వీకారానికి... మిషెల్ దూరం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి మాజీ ప్రథమ మహిళా మిషెల్ ఒబామా దూరంగా ఉండనున్నారు. ఆమె భర్త, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరవుతున్నా 150 ఏళ్ల సంప్రదాయాన్ని ఉల్లంఘిస్తూ మిషెల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే జరిగిన మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియలకు కూడా మిషెల్ హాజరు కాని విషయం తెలిసిందే. దాంతో ఒబామా దంపతులకు విభేదాలొచ్చాయని, త్వరలో విడాకులు తీసుకుంటారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే వారి సన్నిహిత వర్గాలు ఈ వార్తలను ఖండించాయి. ఫేక్ నవ్వులు నవ్వలేకే ప్రమాణ స్వీకారానికి మిషెల్ దూరంగా ఉంటున్నారని తెలిపాయి. ఆమెతో పాటు డెమొక్రాట్లు నాన్సీ పెలోసీ, అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టేజ్ తదితరులు కూడా ట్రంప్ ప్రమాణస్వీకారానికి హాజరవడం లేదు. నాలుగేళ్ల కిందట జో బైడెన్ ప్రమాణ స్వీకారానికి ట్రంప్ కూడా గైర్హాజరవడం తెలిసిందే. తద్వారా వైట్‌హౌస్ సంప్రదాయాన్ని ఆయన ఉల్లంఘించారు. -
ట్రంప్ ప్రమాణానికి... జోరుగా ఏర్పాట్లు
వాషింగ్టన్: అగ్రరాజ్యాధినేతగా డొనాల్డ్ ట్రంప్ (78) రెండోసారి శ్వేతసౌధంలో అడుగుపెట్టేందుకు సర్వం సిద్ధమైంది. అమెరికా 47వ అధ్యక్షునిగా సోమవారం ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా శనివారం నుంచి నాలుగు రోజుల పాటు అట్టహాసంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ప్రమాణస్వీకార కమిటీ ప్రకటించింది. ‘‘శనివారం బాణసంచా నడుమ కార్యక్రమాలు లాంఛనంగా మొదలవుతాయి. అనంతరం ఫ్లోరిడాలోని ట్రంప్ గోల్ఫ్ కోర్స్ బయట, వాషింగ్టన్ డీసీలోనూ పలు వీఐపీ ఈవెంట్లు జరుగుతాయి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (ఎంఏజీఏ) పేరిట విజయోత్సవ ర్యాలీలుంటాయి. సోమ వారం ట్రంప్ ముందుగా సెయింట్ జాన్స్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం వైట్‌హౌస్‌లో తేనీటి విందు జరుగుతుంది. ఆ తర్వాత కాపిటల్ భవనంలోని వెస్ట్ లాన్లో (స్థానిక కాలమానం ప్రకారం) ఉదయం 9.30 నుంచి ప్రధాన కార్యక్రమం ఉంటుంది. సంగీత కార్యక్రమాల అనంతరం ట్రంప్ లాంఛనంగా పదవీ ప్రమాణం చేసి అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారు. తర్వాత జె.డి.వాన్స్ ఉపాధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరిస్తారు. అనంతరం తన లక్ష్యాలు తదితరాలను వెల్లడిస్తూ అధ్యక్ష హోదాలో ట్రంప్ తొలి ప్రసంగం చేస్తారు. తర్వాత సెనేట్ చాంబర్‌లోని ప్రెసిడెంట్ రూమ్‌లో కీలక పత్రాలపై సంతకం చేయడంతో ప్రమాణ కార్యక్రమం ముగుస్తుంది. మధ్యాహ్నం తొలి అధికారిక విందు అనంతరం క్యాపిటల్ హిల్ భవనం నుంచి పెన్సిల్వేనియా అవెన్యూ మీదుగా వైట్‌హౌస్ దాకా ట్రంప్ పరేడ్‌గా వెళ్తారు’’ అని వెల్లడించింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచీ ఏకంగా 2 లక్షల మంది సోమవారానికల్లా వాషింగ్టన్ చేరుకుంటారని కమిటీ తెలిపింది. నవంబర్ 6న జరిగిన ఎన్నికల్లో డెమొక్రాట్ల అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌పై ట్రంప్ ఘనవిజయం సాధించి రెండోసారి అధ్యక్షుడు కానున్నారు. 2017–2021 మధ్య తొలిసారి అధ్యక్షునిగా పని చేయడం తెలిసిందే. మాజీ అధ్యక్షులంతా హాజరు సోమవారం ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, కమలతో పాటు మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జి డబ్లు్య.బుష్, బరాక్ ఒబామా కూడా పాల్గొంటారు. వీరిలో ఒబామా మినహా మిగతా వారంతా సతీసమేతంగా వస్తున్నారు. పలువురు దేశాధినేతలు, వీవీఐపీలు, ప్రముఖులు కూడా పాల్గొననున్నారు. భారత్ తరఫున విదేశాంగ మంత్రి జైశంకర్, చైనా తరఫున ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు. అల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో పాటు ఐటీ, ఇతర దిగ్గజ సంస్థల అధినేతలు కూడా హాజరవుతున్నారు. ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్ (ఫేస్బుక్), జెఫ్ బెజోస్ (అమెజాన్) రూపంలో ప్రపంచ కుబేరుల్లో ముగ్గురు వేదికపై కనిపించనుండటం విశేషం. ట్రంప్ హయాంలో అమెరికా టెక్ బిలియనీర్ల అడ్డగా మారనుందని బైడెన్ తాజాగా తన వీడ్కోలు సందేశంలో హెచ్చరించడం తెలిసిందే.అధికారిక ఫొటోల విడుదల ప్రమాణస్వీకార సంబంధిత కార్యక్రమాల్లో ఉపయోగించేందుకు ట్రంప్, వాన్స్ అధికారిక చిత్రాలను తాజాగా విడుదల చేశారు. వాన్స్ చేతులు కట్టుకుని సరదాగా చిరునవ్వులు చిందిస్తుండగా ట్రంప్ ఫొటో అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. పెదాలు బిగించి, నుదురు చిట్లించి కెమెరావైపు తీక్షణంగా చూస్తూ కనిపిస్తున్నారు. ఇది అచ్చం కాపిటల్ హిల్ దాడి కేసులో 2023లో ట్రంప్ న్యాయ విచారణకు హాజరైన సందర్భంగా పోలీసు అధికారులు తీసుకున్న ఆయన మగ్ షాట్‌ను పోలి ఉండటం విశేషం. రెండో టర్ములో సంప్రదాయ పోకడలను మరింతగా ధిక్కరించి తీరతానని ప్రతీకాత్మకంగా చెప్పేందుకు ట్రంప్ కావాలనే ఇలాంటి ఫొటోను ఎంచుకున్నారని భావిస్తున్నారు.హాలీవుడ్ ప్రత్యేక రాయబారులుగా గిబ్సన్ తదితరులు నటులు జాన్ వొయిట్, మెల్ గిబ్సన్, సిల్విస్టర్ స్టాలోన్లను హాలీవుడ్ ప్రత్యేక రాయబారులుగా నియమిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. నాలుగేళ్లుగా నేలచూపులు చూస్తున్న హాలీవుడ్‌ను బలోపేతం చేసి పూర్వవైభవం తీసుకొచ్చే ప్రయత్నాల్లో వారు తనకు సహాయ సహకారాలు అందిస్తారని వెల్లడించారు. వీరిలో వొయిట్ చిరకాలంగా ట్రంప్‌కు మద్దతుదారు కాగా గిబ్సన్, స్టాలోన్ కూడా తాజా ఎన్నికల్లో ట్రంప్‌ను బలపరిచారు. -
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్
-
నేడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం
-
లోక్ సభ ఎంపీగా ప్రియాంక వాద్రా ప్రమాణస్వీకారం
-
నేడు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న హేమంత్ సోరెన్
-
సీఎంగా నేడు హేమంత్ ప్రమాణం
రాంచీ: జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ (49) గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాంచీలోని మొరాబాది మైదానంలో సాయంత్రం 4 గంటలకు కార్యక్రమం జరగనుంది. ఏర్పాట్లను సోరెన్ బుధవారం సాయంత్రం స్వయంగా పరిశీలించారు. అసెంబ్లీ ఎన్నికల్లో హేమంత్‌కు చెందిన జార్ఖండ్ ముక్తిమోర్చా (జేఎంఎం) ఆధ్వర్యంలోని కూటమి ఘన విజయం సాధించింది. 81 మంది సభ్యులుండే అసెంబ్లీలో జేఎంఎం కూటమి 56, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 24 సీట్లు సాధించడం తెలిసిందే. ఈ ఎన్నికల్లో హేమంత్ సోరెన్‌తోపాటు భార్య కల్పన ఘన విజయం సాధించారు. ఆదివారం హేమంత్ సోరెన్ శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాందీ, ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్, బెంగాల్ సీఎం మమత, మేఘాలయ సీఎం కొన్రాడ్ సంగ్మా, పంజాబ్ సీఎం మాన్, హిమాచల్ సీఎం సుఖీ్వందర్..ఇంకా సీపీఎం జనరల్ సెక్రటరీ దీపాంకర్ భట్టాచార్య, ఆప్ నేత కేజ్రీవాల్, శివసేన (యూబీటీ)చీఫ్ ఉద్దవ్ ఠాక్రే,, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తదితర ఇండియా కూట మి నేతలు హాజరవుతారని భావిస్తున్నారు. పూర్వీకుల గ్రామంలో హేమంత్ దంపతులు కాబోయే సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనతో కలిసి మంగళవారం బెంగాల్ సరిహద్దుల్లోని రామ్‌గఢ్ జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న తమ పూర్వీకుల గ్రామం నెమ్రా ను సందర్శించారు. హేమంత్ తండ్రి జేఎంఎం వ్యవస్థాపకుడు శిబూ సోరెన్ ఈ గ్రామంలోనే జన్మించారు. శిబూ 15 ఏళ్లప్పుడు తండ్రి సోబరెన్ను స్థానిక వడ్దీ వ్యాపారులు చంపారు. తాత సోబరెన్ సోరెన్ 67వ వర్ధంతిని పురస్కరించుకుని అక్కడికి వెళ్లిన హేమంత్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడారు. గురువారం నుంచి మన ప్రభుత్వం పనిచేయనుందని వారికి చెప్పారు. ఎన్నికల్లో కష్టపడిన మీరంతా ప్రమాణ స్వీకారానికి రావాలని హేమంత్ వారిని ఆహ్వానించారు. సీఎంగా నాలుగోసారి.. హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మొదటిసారి 2013 జులై నుంచి 2014 డిసెంబర్ వరకు పనిచేశారు. రెండోసారి 2019 డిసెంబర్లో బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ అరెస్ట్ నేపథ్యంలో 2024 జనవరిలో రాజీనామా చేశారు. జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చి తిరిగి 2024 జూన్‌లో సీఎంగా మూడోసారి బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆపద్ధర్మ సీఎంగా కొనసాగుతున్నారు. గురువారం ఆయన నాలుగోసారి జార్ఖండ్ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. -
51వ సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం
-
నాయబ్‌సింగ్ సైనీ అనే నేను..
చండీగఢ్: హరియాణా ముఖ్యమంత్రిగా ఓబీసీ నాయకుడు నాయబ్‌సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం చేశారు. పంచకులలోని దసరా గ్రౌండ్లో గురువారం అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఆయనతో రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. నూతన మంత్రుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. గురువారం వాలీ్మకి జయంతి కావడంతో ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారానికి బీజేపీ నాయకత్వం ఇదే రోజును ముహూర్తంగా ఎంచుకుంది. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, చిరాగ్ పాశ్వాన్తోపాటు బీజేపీ/ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, భూపేంద్ర పటేల్, ప్రమోద్ సావంత్, హిమంత బిశ్వ శర్మ, విష్ణుదేవ్ సాయి, పుష్కర్‌సింగ్ దామీ తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం కంటే ముందు సైనీ గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇటీవల జరిగిన హరియాణా శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను కమలం పార్టీ 48 స్థానాలు గెలుచుకుని వరుసగా మూడోసారి అధికారంలోకి వచి్చంది. మోదీ అభినందనలు హరియాణా సీఎం నాయబ్‌సింగ్ సైనీతోపాటు కొత్త మంత్రులకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. మంత్రివర్గం కూర్పు చక్కగా ఉందని ప్రశంసించారు. ఈ మేరకు గురువారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. హరియాణా ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేరుస్తుందని, రాష్ట్ర అభివృద్ధిని నూతన శిఖరాలకు చేరుస్తుందని పేర్కొన్నారు. పేదలు, రైతులు, యువత, మహిళలతోపాటు సమాజంలోని ఇతర వర్గాల సంక్షేమం, సాధికారత విషయంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందన్న విశ్వాసం తనకు ఉందన్నారు. బీజేపీతో మూడు దశాబ్దాల అనుబంధం బీజేపీ సీనియర్ సీనాయకుడు నాయబ్‌సింగ్ సైనీని మరోసారి అదృష్టం వరించింది. హరియాణా సీఎంగా వరుసగా రెండోసారి ఆయన ప్రమాణం చేశారు. ఈ ఏడాది మార్చి నెలలో ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. మనోహర్‌లాల్ ఖట్టర్ స్థానంలో ఆయనను బీజేపీ అధిష్టానం నియమించింది. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడంతోపాటు ఓబీసీల ఓట్లపై గురిపెట్టిన కమల దళం అదే వర్గానికి చెందిన సైనీని తెరపైకి తీసుకొచి్చంది. ఈ ప్రయోగం సత్ఫలితాలు ఇచి్చంది. హరియాణాలో బీజేపీ వరుసగా మూడోసారి నెగ్గింది. అనూహ్యంగా పార్టీని గెలిపించిన సైనీకే మళ్లీ సీఎం పీఠం దక్కింది. ఆయన సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు. సైనీ 1970 జనవరి 25న అంబాలా జిల్లాలోని మీర్జాపూర్ మాజ్రా గ్రామంలో జని్మంచారు. మూడు దశాబ్దాలుగా బీజేపీలో కొనసాగుతున్నారు. పార్టీలో వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో ఎమ్మెల్యేగా, 2019లో ఎంపీగా గెలిచారు. 2014 నుంచి 2019 దాకా మనోహర్‌లాల్ ఖట్టర్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2023 అక్టోబర్‌లో హరియాణా బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు ఖట్టర్ ఈ ఏడాది మార్చి సీఎం పదవితోపాటు కర్నాల్ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ఖట్టర్ స్థానంలో సైనీ ముఖ్యమంత్రి అయ్యారు. మే నెలలో జరిగిన కర్నాల్ ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అక్టోబర్ 5న జరిగిన అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో లాడ్వా స్థానం నుంచి 16,054 ఓట్ల మెజారీ్టతో జయకేతనం ఎగురవేశారు. -
కాసేపట్లో హరియాణా సీఎంగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారం
-
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం... 24 మందితో కొలువుదీరిన కొత్త మంత్రివర్గం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ప్రమాణస్వీకారానికి రాలేకపోతున్నా
-
చంద్రబాబు ప్రమాణస్వీకారం.. భారీగా ట్రాఫిక్ జామ్
-
చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవం
-
చంద్రాబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తి
-
జనసేనకు 4 మంత్రి పదవులు..
-
కన్నులపండువగా...
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం కన్నులపండువగా జరిగింది. దేశాధినేతల నుంచి రాజకీయ దిగ్గజాల దాకా వేడుకలో పాల్గొన్నారు. పారిశ్రామిక ప్రముఖులు మొదలుకుని సినీ తారల దాకా తళుక్కుమన్నారు. 8,000 మందికిపైగా వీవీఐపీలు, వీఐపీలతో రాష్ట్రపతి భవన్ ఆవరణ కళకళలాడింది. వరుసగా మూడోసారి ప్రధానిగా మోదీతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణస్వీకారం చేయిస్తుండగా ప్రాంగణమంతా కరతాళ ధ్వనులు, హర్షధ్వానాలతో మారుమోగింది. మాజీ రాష్ట్రపతులు ప్రతిభా పాటిల్, రామ్‌నాథ్ కోవింద్ తదితరులు పాల్గొన్నారు. షారుఖ్ ఖాన్ నుంచి రజనీకాంత్ దాకా పలువురు సినీ ప్రముఖులు కుటుంబ సమేతంగా హాజరై అలరించారు. పారిశ్రామికవేత్తలు గౌతం అదానీ దంపతులు, ముకేశ్ అంబానీ దంపతులు వేడుకకు హాజరయ్యారు. భిన్న మతాలకు చెందిన పెద్దలు పాల్గొనడం అందరినీ ఆకర్షించింది. బీజేపీ నుంచి తొలిసారి ఎంపీగా నెగ్గిన ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధానాకర్షణగా నిలిచారు. కేరళలోని త్రిసూర్ ఎంపీ, మలయాళ సినీ స్టార్ సురేశ్ గోపీ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అందరి దృష్టినీ ఆకర్షించింది. లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో బీజేపీకి ఇదే తొలి విజయమన్నది తెలిసిందే. మోదీకి పలు రంగాల ప్రముఖుల అభినందనలు, శుభాకాంక్షల సందేశాలతో ఎక్స్ తదితర సోషల్ సైట్లు హోరెత్తిపోయాయి. ఏడుగురు దేశాధినేతలు: మోదీ ప్రమాణ స్వీకారానికి 7 దేశాల అధినేతలు హాజరయ్యారు. బంగ్లాదేశ్ అధ్యక్షురాలు షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, మారిషస్ ప్రధాని ప్రవింద్ కు మార్ జగన్నాథ్, మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు, నేపాల్ ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ ప్రచండ, భూటాన్ ప్ర ధానమంత్రి త్సెరింగ్ టాగ్బే, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫిఫ్ తదితరులు కార్యక్ర మంలో పాల్గొన్నారు. భారత్, మాల్దీవుల మ« ద్య సంబంధాలు బలహీనపడ్డ నేపథ్యంలో ముయిజ్జు హాజరు ప్రాధాన్యం సంతరించుకుంది. 2023 నవంబర్‌లో అధ్యక్షుడయ్యాకఆయన భారత్ రావడం ఇదే తొలిసారి.తెలుపు కుర్తా–చుడీదార్, నీలి రంగు జాకెట్లో... మెరిసిపోయిన మోదీవిశేష సందర్భాల్లో తన వస్త్రధారణతో ఆకట్టుకునే మోదీ ఈసారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలుపు కుర్తా, చుడీదార్, దానిపై నీలి రంగు జాకెట్ ఎంచుకున్నారు. 2014లో తొలిసారి ప్రధానిగా ప్రమాణ చేసిన సందర్భంగా ఆయన క్రీం కలర్ కుర్తా, తెల్ల పైజామా, బంగారు రంగు జాకెట్ ధరించారు. 2019లో రెండోసారి ప్రధాని అయినప్పుడు తెలుపు రంగు కుర్తా, పైజామా, వాటిపై బంగారు రంగు జాకెట్ ధరించి ప్రమాణస్వీకారం చేశారు. పంద్రాగస్టు, గణతంత్ర వేడుకలకు మోదీ రంగురంగుల తలపాగాలు ధరించి అలరిస్తుంటారు. -
మోడీ ప్రమాణ స్వీకారానికి దేశాధినేతలు
-
కేంద్రంలో కొలువుతీరనున్న కొత్త ప్రభుత్వం
-
ప్రధానమంత్రిగా నేడే నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం.. మంత్రివర్గం కూర్పుపై కొనసాగుతున్న కసరత్తుతి.. ఇంకా ఇతర అప్డేట్స్
-
మోదీ ప్రమాణస్వీకారం.. ఢిల్లీ హై అలెర్ట్
-
రేపు ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం
-
రేపే మోదీ ప్రమాణం
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనను ఆహా్వనించారు. ఆదివారం రాత్రి 7:15 గంటలకు మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ దిశగా శుక్రవారం హస్తినలో ఒకదాని వెంట ఒకటి పలు పరిణామాలు జరిగాయి. తొలుత ఉదయం 11.30కు నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) భాగస్వామ్య పక్షాలన్నీ సమావేశమై తమ పార్లమెంటరీ పార్టీ నేతగా మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. పార్లమెంటు పాత భవనం ‘సంవిధాన్ సదన్’ సెంట్రల్ హాల్లో జరిగిన ఈ భేటీలో బీజేపీతో పాటు టీడీపీ, జేడీ(యూ), ఎల్జేపీ తదితర ఎన్డీఏ భాగస్వామ్య పారీ్టల అధినేతలు, ఎంపీలు పాల్గొన్నారు. ఎన్డీఏపీపీ నేతగా మోదీ పేరును బీజేపీ అగ్రనేత రాజ్‌నాథ్‌సింగ్ ప్రతిపాదించగా కూటమి ఎంపీలంతా ఏకగ్రీవంగా అంగీకారం తెలిపారు. అనంతరం ఎంపీలందరినీ ఉద్దేశించి మోదీ, ఆయన నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ భాగస్వామ్య పక్షాల నేతలు ప్రసంగించారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా, లోక్‌సభలో బీజేపీ పక్ష నేతగా కూడా మోదీ ఎన్నికయ్యారు. తర్వాత ఆయన రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి ద్రౌపదీ ముర్ముతో సమావేశమయ్యారు. ఎన్డీఏ ఎంపీల నిర్ణయాన్ని ఆమెకు తెలియజేశారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మోదీని ముర్ము ఆహా్వనించారు. అనంతరం రాష్ట్రపతి భవన్ వెలుపల మోదీ మీడియాతో మాట్లాడారు. ‘‘నన్ను ఎన్డీఏ నేతగా ఎన్నుకున్నట్టు భాగస్వామ్య పక్షాలన్నీ రాష్ట్రపతికి తెలిపాయి. దాంతో ఆమె నన్ను ప్రధానిగా నియమించారు. ఆ మేరకు నాకు లేఖ అందజేశారు. ప్రమాణస్వీకారానికి అనువైన సమయం, నాతో పాటు కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసే నేతల వివరాలు కోరారు. ఆదివారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేస్తామని తెలిపాను. కాబోయే మంత్రుల జాబితాను ఆదివారానికల్లా రాష్ట్రపతి భవన్‌కు అందజేస్తా’’ అని వివరించారు. 2047లో వందేళ్ల స్వాతంత్య్రోత్సవాల నాటికి జాతి కలలను సంపూర్ణంగా సాకారం చేసే ప్రస్థానంలో 18వ లోక్‌సభ కీలక మైలురాయిగా నిలవనుందని ఈ సందర్భంగా మోదీ అన్నారు. ‘‘ఇది నవ, యువ శక్తితో అలరారుతున్న సభ. దేశ ప్రజలు ఎన్డీఏకు మరోసారి అవకాశమిచ్చారు’’ అని చెప్పారు. ఎన్డీఏ పక్షాలన్నీ మోదీకి మద్దతుగా శుక్రవారం మధ్యాహ్నమే రాష్ట్రపతికి లేఖలు అందజేశాయి. జాతీయ ప్రయోజనాలు, ప్రాంతీయ ఆకాంక్షల మధ్య... సమతూకంగా పాలన: బాబు, నితీశ్ జాతీయ ప్రయోజనాలు, ప్రాంతీయ ఆకాంక్షల మధ్య సమతూకం పాటిస్తూ ఎన్డీఏ ప్రభుత్వ పాలన సాగాలని భాగస్వామ్య పక్షాలు టీడీపీ, జేడీ(యూ) ఆకాంక్షించాయి. ఎన్డీఏపీపీ నేతగా మోదీ పేరును రాజ్‌నాథ్ ప్రతిపాదించగా చంద్రబాబు (టీడీపీ), నితీశ్‌కుమార్ జేడీ(యూ), ఏక్నాథ్ షిండే (శివసేన), చిరాగ్ పాస్వాన్ (ఎల్జేపీ–ఆర్వీ), హెచ్.డి.కుమారస్వామి జేడీ(ఎస్), అజిత్ పవార్ (ఎన్సీపీ), జితిన్‌రాం మాంఝీ తదితరులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు సారథ్యం వహిస్తున్నారని చంద్రబాబు అన్నారు. ‘‘ప్రపంచ సారథిగా ఎదిగేందుకు భారత్‌కు ఇదో అద్భుతమైన అవకాశం. సమాజంలోని అన్ని వర్గాల సమగ్రాభివృద్ధికి పెద్దపీట వేస్తూ పాలన సాగాలి’’ అని ఆకాంక్షించారు. రాష్ట్రాల అభివృద్ధిని చిన్నచూపు చూడొద్దని నితీశ్ సూచించారు. దేశాన్ని అద్భుతంగా వృద్ధి పథంలో నడిపించడంతో పాటు బిహార్‌పైనా మోదీ ప్రత్యేకంగా దృష్టి సారిస్తారని ఆశాభావం వెలిబుచ్చారు. ‘‘వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ విపక్షాలకు ఓటమి తప్పదు. వాళ్లు పనికిరాని కబుర్లు చెప్పి అక్కడా, ఇక్కడా గెలిచారు. వచ్చేసారి వారంతా ఓడటం ఖాయం’’ అన్నారు. మోదీ ప్రధానిగా ఉన్నంతకాలం దేశం ఎవరి ముందూ తలొంచబోదని పవన్ కల్యాణ్ అన్నారు.విరిసిన నవ్వులు... ఎన్డీఏ భేటీ పలు ఆహ్లాదకర సన్నివేశాలకు వేదికైంది. తమ కూటమిది పటిష్టమైన ఫెవికాల్ బంధం అని షిండే అభివరి్ణంచగా నవ్వులు విరిశాయి. తనకు పాదాభివందనం చేసేందుకు నితీశ్ ప్రయత్నించగా మోదీ వారిస్తూ ఆలింగనం చేసుకున్నారు. చిరాగ్నూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను భుజం తట్టారు. పవన్ కల్యాణ్ ‘పవనం కాదు, సుడిగాలి’ అంటూ మోదీ తన ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రశంసించారు.రాజ్యాంగ ప్రతికి నమస్సులు ఎన్డీఏ భేటీ కోసం సెంట్రల్ హాల్లోకి ప్రవేశించగానే మోదీ ముందుగా రాజ్యాంగ ప్రతిని తన నుదిటికి తాకించుకుని వందనం చేశారు. ఆ ఫొటోను ఎక్స్‌లో పెట్టి భావోద్వేగంతో కూడిన పోస్ట్ చేశారు. ‘‘తన జీవితంలో ప్రతి క్షణమూ రాజ్యాంగం ప్రవచించిన గొప్ప విలువల పరిరక్షణకే అంకితం. నా వంటి వెనకబడ్డ నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి దేశానికి సేవ చేయగలుగుతున్నాడంటే అది కేవలం మన రాజ్యాంగం గొప్పదనమే. అది కోట్లాది ప్రజలకు ఆశ, శక్తియుక్తులు, గౌరవాదరాలు కలి్పస్తోంది’’ అని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని పదేళ్లుగా అడుగడుగునా నిర్లక్ష్యం చేస్తూ వచి్చన మోదీ నేడిలా అదే రాజ్యాంగానికి ప్రణామాలు చేయడం విడ్డూరమంటూ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ దుయ్యబట్టారు. -
ప్రధానమంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ... నేడు ఎన్డీఏ ఎంపీల సమావేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
మోదీ 3.0 కు ముహూర్తం ఖరారు
-
ఆగిన ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటా కింద కొత్తగా శాసనమండలి సభ్యులుగా నియమితులైన ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్ట్ ఆమెర్ అలీ ఖాన్ ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది. ఈ విషయంలో యథాతథస్థితి కొనసాగించాలని (స్టేటస్కో) ఆదేశిస్తూ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం మంగళవారం తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 8వ తేదీ వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని, ఆ రోజు పూర్తిస్థాయిలో వాదనలు వింటామని స్పష్టం చేసింది.గతంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పేర్లను సిఫారసు చేస్తూ అప్పటి ప్రభుత్వం గవర్నర్‌కు ప్రతిపాదనలు పంపింది. అయితే 2023 సెప్టెంబర్ 19న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వాటిని తిరస్కరించారు. గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5) ప్రకారం తనకున్న విస్తృత అధికారాల మేరకు ప్రభుత్వ ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నట్లుగా గవర్నర్ ప్రకటించడాన్ని వారు సవాల్ చేశారు.ఈ పిటిషన్లపై గత వారం విచారణ చేపట్టిన సీజే ధర్మాసనం.. తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది. పిటిషన్ల విచారణార్హతతో పాటు వాటిలోని వాస్తవాలు, సాంకేతిక అంశాలను పరిశీలిస్తామని చెప్పింది. ఈ పిటిషన్లపై విచారణ ముగిసే వరకు కొత్తగా గవర్నర్ కోటాలో ఎవరినీ నియమించకుండా స్టే ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు విజ్ఞప్తి చేయగా తోసిపుచ్చింది. అలా గవర్నర్‌కు ఆదేశాలు ఇవ్వడం చట్టపరంగా సాధ్యం కాదని స్పష్టం చేసింది. ‘పెద్దమనుషుల ఒప్పందం’ (జెంటిల్మెన్ అగ్రిమెంట్) మాదిరి అందరూ హుందాతనం పాటించాలని సూచించింది. కొత్త నియామకాలపై స్టే ఇవ్వండి తాజాగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ఫ్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్ట్ ఆమెర్ అలీ ఖాన్‌లను నియమిస్తూ.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ గవర్నర్ తమిళిసై ఈ నెల 25న ఉత్తర్వులు వెలువరించారు. దీంతో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ ఇందుకు సంబంధించిన జీవో నంబర్ 12ను సవాల్ చేస్తూ హైకోర్టులో మధ్యంతర అప్లికేషన్ (ఐఏ)లు దాఖలు చేశారు. కొత్త నియామకాలను నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే కోదండరాం, అమేర్ అలీఖాన్‌లను ప్రధాన పిటిషన్లో ఇంప్లీడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ ఐఏలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. దాసోజు తరఫున సీనియర్ న్యాయవాది అదిత్యా సోదీ వాదనలు వినిపించారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల అంశం హైకోర్టులో విచారణ దశలో ఉండగా కొత్త వారిని నియమించడం సరికాదని ఆయన అన్నారు. ఈ నెల 17న మీడియాకు విడుదల చేసిన నోట్లో.. కోర్టు ఉత్తర్వులు ఇచ్చేవరకు కొత్త నియామకాలు చేపట్టబోమని గవర్నర్ పేర్కొన్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.ఇది న్యాయస్థానం సూచించిన ‘పెద్దమనుషుల ఒప్పందం’ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఇద్దరి పేర్లను ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం సిఫారసు చేసిందని, వాటిని పరిశీలించిన తర్వాతే గవర్నర్ ఆమోదించారని తెలిపారు. వీరి నియామకం చట్టప్రకారమే జరిగిందని, స్టే ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీజే ధర్మాసనం దీనిపై స్టేటస్ కో విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్ లేక వీలు పడకపోవడంతో.. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో కోదండరాం, ఆమెర్ అలీఖాన్‌లు బుధవారం ప్రమాణ స్వీకారం చేసేందుకు వీల్లేకుండా పోయింది. వాస్తవానికి వీరు ప్రమాణ స్వీకారం చేసేందుకు సోమవారం (29న) నాడే శాసనమండలికి వెళ్లారు. కానీ వారు వెళ్లే సమయానికి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తన చాంబర్లో లేరు. దీంతో ఆయన రాక కోసం వారు కౌన్సిల్ హాల్లోనే చాలాసేపు ఎదురు చూశారు. అయినా చైర్మన్ రాకపోవడంతో వెనుదిరిగారు. అయితే ఆరోగ్యం బాగోలేనందున చైర్మన్ మండలికి రాలేకపోయారని, ఈ నెల 31న ప్రమాణ స్వీకారానికి రావాలని వారిద్దరికీ కౌన్సిల్ నుంచి సమాచారం అందింది. ఈ మేరకు వారు సిద్ధమవుతున్న సమయంలో స్టేటస్కో విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా నేడు బల్మూరి, మహేశ్‌కుమార్‌ల ప్రమాణం శాసనసభ్యుల కోటాలో ఇటీవల శాసనమండలికి ఎన్నికైన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 3.30కు శాసనమండలి చైర్మన్ చాంబర్లో బల్మూరి వెంకట్, మహేశ్‌కుమార్ గౌడ్లు మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. కాగా హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండాలని కోదండరాం, ఆమెర్ అలీఖాన్‌లు నిర్ణయించుకున్నారు. -
మంత్రిగా జూపల్లి కృష్ణారావు ప్రమాణ స్వీకారం
-
సీఎంగా రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్
-
సీఎంగా రేవంత్ తొలి ప్రసంగం.. ఏమన్నారంటే..
సాక్షి, హైదరాబాద్: పోరాటాలు, త్యాగాల పునాదులపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని రేవంత్‌రెడ్డి అన్నారు. ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రజలను ఉద్దేశించి తొలిసారి ఆయన మాట్లాడుతూ.. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి కోసం ఉక్కు సంకల్పంతో కాంగ్రెస్ తెలంగాణ ఏర్పాటు చేసిందని, దశాబ్ద కాలపు నిరంకుశ పాలనకు ప్రజలు చరమగీతం పాడారన్నారు. ‘‘ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అమరుల ఆశయ సాధనకు ఇందిరమ్మ రాజ్యం ప్రతినబూనింది. ప్రమాణ స్వీకారం మొదలైనపుడే అక్కడ ప్రగతి భవన్ గడీ ఇనుప కంచెలు బద్దలు కొట్టాం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట ఇస్తున్నా... ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములు. ఇవాళ ప్రగతి భవన్ చుట్టూ కంచెలు బద్దలు కొట్టాం. రేపు ఉదయం 10 గంటలకు జ్యోతీరావు పూలే ప్రజా భవన్ లో ప్రజా దర్బారు నిర్వహిస్తాం’’ అని రేవంత్ పేర్కొన్నారు. ‘‘మేం పాలకులం కాదు.. మేం సేవకులం.. మీరు ఇచ్చిన అవకాశాన్ని ఈ ప్రాంత అభివృద్ధికి వినియోగిస్తాం. కార్యకర్తల కష్టాన్ని, శ్రమను గుర్తు పెట్టుకుంటా.. గుండెల్లో పెట్టుకుంటా’’ అని రేవంత్ చెప్పారు. చదవండి: తెలంగాణ మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసింది వీరే -
ఆరు గ్యారెంటీల ఫైల్ పై సంతకం చేసిన రేవంత్ రెడ్డి
-
మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు ప్రమాణ స్వీకారం
-
ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి..
-
మరో ఘనత.. సింగపూర్ అధ్యక్ష పీఠంపై భారతీయుడు
సింగపూర్: అంతర్జాతీయ రాజకీయాల్లో మరో భారతీయుడు పతాకశీర్షికలకెక్కారు. సింగపూర్ నూతన అధ్యక్షుడిగా భారతీయ మూలాలున్న ఆర్థికవేత్త థర్మాన్ షణ్ముగరత్నం గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల ముగిసిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన పోటీదారులైన చైనా మూలాలున్న ఎంగ్కోంక్ సాంగ్( 15.72 శాతం ఓట్లు), తన్కిన్ లియాన్ (13.88 శాతం)లను వెనక్కి నెట్టేసి ఏకంగా 70.4 శాతం ఓట్లు సాధించి షణ్ముగరత్నం ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. అధ్యక్ష భవనం ఇస్టానాలో ఆ దేశ ప్రధాన న్యాయమూర్తి, భారతీయ మూలాలున్న జడ్జి సుందరేశ్ మీనన్ ఈయనతో అధ్యక్షుడిగా ప్రమాణం చేయించారు. బహుళ జాతుల, సమ్మిళిత సమాజాభివృద్ధికి కృషిచేస్తానని అధ్యక్ష హోదాలో షుణ్ముగరత్నం హామీ ఇచ్చారు. 66 ఏళ్ల షణ్ముగరత్నం ఆరేళ్లపాటు అధ్యక్షునిగా పాలన కొనసాగిస్తారు. Tharman Shanmugaratnam was sworn in as Singapore's ninth President on Thursday, September 14, 2023. He was elected in the 2023 presidential election with 70.41% of the vote. Congrats!#Singapore #inauguration #presidentofsingapore #tharmanshanmugaratnam [📸 CNA/Jeremy Long] pic.twitter.com/7JtMOYGLLE — Bryan Toh (@bryan__toh) September 15, 2023 -
ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ధీరజ్ సింగ్ ప్రమాణం
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ప్రమాణం చేశారు. శుక్రవారం ఉదయం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయనచేత ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారానికి ముందు గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్.. జస్టిస్ ధీరజ్‌సింగ్‌కు పుష్ఫగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. ప్రమాణం చేసిన అనంతరం.. బాధ్యతల పత్రాలపై సంతకం చేశారాయన. ఆపై సీఎం జగన్ నూతన సీజేగా ప్రమాణం చేసిన ధీరజ్‌సింగ్‌కు శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతిపక్షనేత చంద్రబాబు,హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు బూడి ముత్యాలనాయుడు,తానేటి వనిత, అంబటి రాంబాబు, మండలి చైర్మన్ కొయ్యే మోసేన్ రాజు, డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం, ఉన్నతాదికారులు పాల్గొన్నారు. అనంతరం హై టీ కార్యక్రమంలో అంతా పాల్గొన్నారు. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ నేపథ్యం.. జమ్మూకశ్మీర్‌కు చెందిన జస్టిస్ ధీరజ్‌సింగ్‌ది న్యాయమూర్తుల కుటుంబం. ఆయన తండ్రి, సోదరుడు కూడా న్యాయమూర్తులుగా పనిచేశారు. సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తీర్థసింగ్ ఠాకూర్ సోదరుడే జస్టిస్ ధీరజ్‌సింగ్. న్యాయవర్గాల్లో అత్యంత సౌమ్యుడిగా, వివాదరహితుడిగా, సమర్థుడిగా జస్టిస్ ధీరజ్ సింగ్‌కు పేరుంది. ఇటీవల కాలం వరకు బాంబే హైకోర్టులో నంబర్ టూ స్థానంలో కొనసాగారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన 2026 ఏప్రిల్ 24న పదవీ విరమణ చేస్తారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో జమ్మూ కశ్మీర్ రాష్ట్ర కోటా నుంచి న్యాయమూర్తులెవ్వరూ లేరు. కాబట్టి.. ఈలోగా ఆయన పదోన్నతిపై సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంది. అలాగే తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే)గా వ్యవహరిస్తున్న జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి ఇకపై నంబర్ 2గా కొనసాగుతారు. త్వరలో ఆయన కూడా వేరే రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశాలున్నాయని న్యాయవర్గాలు చెబుతున్నాయి. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తెలంగాణ హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణ స్వీకారం
-
Live: సిద్ధరామయ్య అనే నేను...
-
ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణంస్వీకారం
-
నేడు కర్ణాటక కేబినెట్ ప్రమాణస్వీకార కార్యక్రమం
-
AP: ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం
-
ఏపీ స్థానిక సంస్థల కోటా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
-
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలికి రాష్ట్రంలోని వివిధ స్థానిక సంస్థల నుండి ఎన్నికైన 8 మంది నూతన శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. ఈమేరకు సోమవారం వెలగపూడిలోని రాష్ట్ర అసెంబ్లీ భవనం ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషేన్ రాజు నూతన సభ్యులతో ప్రమాణం చేయించారు. రాష్ట్ర శాసన సభ సెక్రటరీ జనరల్ డా.పిపికె.రామాచార్యులు నూతన ఎమ్మెల్సీల పేర్లను వరుస క్రమంలో పిలవగా శాసన మండలి అధ్యక్షులు మోషేన్ రాజు వారిచే ప్రమాణం చేయించారు. ఎమ్మెల్సీలుగా కడప స్థానిక సంస్థల నుండి ఎన్నికైన పి.రామసుబ్బా రెడ్డి,నెల్లూరు స్థానిక సంస్థల నుండి మేరిగ(Meriga) మురళీధర్, పశ్చిమ గోదావరి స్థానిక సంస్థల నుండి కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాధ్, తూర్పు గోదావరి స్థానిక సంస్థల నుండి కుడిపూడి సూర్యనారాయణ రావు,శ్రీకాకుళం స్థానిక సంస్థల నుండి నర్తు రామారావు, చిత్తూరు స్థానిక సంస్థల నుండి సుబ్రహ్మణ్యం సిఫాయి, కర్నూల్ స్థానిక సంస్థల నుండి డా.ఎ. మధుసూదన్ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు,రాష్ట్ర రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాద రావు,రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు,బిసి సంక్షేమం,సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు సిహెచ్.శ్రీనివాస వేణుగోపాల కృష్ణ,రాష్ట్ర పౌరసరఫరాల శాఖామాత్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు, రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖామాత్యులు మేరుగు నాగార్జున,రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు)సజ్జల రామకృష్ణా రెడ్డి, రాష్ట శాసన సభ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద రాజు,రాష్ట్ర శాసన మండలి చీఫ్ విప్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు,ప్రభుత్వ విప్ జంగా కృష్ణ మూర్తి,మాజీమంత్రి ధర్మాన కృష్ణదాస్,ఎంఎల్ఏ వరప్రసాద్,పలువురు ఎంఎల్‌సిలు పాల్గొన్నారు.ఇంకా కార్యక్రమంలో రాష్ట్ర శాసన మండలి ఓఎస్డి సత్యానారాయణ రావు,శాసన మండలి ఉప కార్యదర్శి విజయ రాజు ఇంకా పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు. చదవండి: చంద్రబాబుకు భారీ షాక్.. -
మేఘాలయ సీఎంగా మరోసారి సంగ్మా.. ఈనెల 7న ప్రమాణస్వీకారం!
షిల్లాంగ్: మేఘాలయాలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కాన్రాడ్ సంగ్మా ప్రకటించారు. గురువారం వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్ల ఫలితాల్లో ఆయన నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ 26 స్థానాలు కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. అయితే మొత్తం 60 స్థానాలకు మెజార్టీకి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 31ని ఆయన పార్టీ అందులేకపోయింది. కానీ తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 32 సభ్యుల బలముందని సంగ్మా తెలిపారు. ఎవరు మద్దతిస్తున్నారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఎన్పీపీకి బీజేపీ ఇప్పటికే మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ కేవలం రెండు స్థానాల్లోనే గెలిచింది. కాగా.. కాన్రాడ్ సంగ్మా మేఘాయల గవర్నర్ ఫాగు చౌహాన్‌ను కలిసి రాజీనామా సమర్పించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈనెల 7న ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి హాజరవుతారని సమాచారం. గత ఎన్నికల్లో మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ, ఎన్పీపీ ఈసారి విడిపోయి ఒంటరిగా పోటి చేశాయి. బీజేపీ తమ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేయడంతో సంగ్మా ఆ పార్టీతో తెగదెంపులు చేసుకొని ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లారు. 2018 కంటే ఏడు సీట్లు ఎక్కువ తెచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, తృణమూల్‌కు చెరో ఐదు సీట్లు వచ్చాయి. ఎన్పీపీ మాజీ మిత్రపక్షం యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ 11 సీట్లు కైవసం చేసుకుని రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాగా.. త్రిపురలో బీజేపీ మరోసారి అధికారంలోకి రాగా.. నాగాలాండ్‌లో కూడా బీజేపీ కూటమే విజయం సాధించింది. మేఘాలయలో కూడా ఎన్‌పీపీకే ఆ పార్టీ మద్దతు ప్రకటించడంతో ఈ ప్రభుత్వంలో కూడా భాగం కానుంది. చదవండి: బీజేపీ ఎమ్మెల్యే ఇంట్లో రూ.6 కోట్లు సీజ్.. కీలక పదవికి రాజీనామా -
ఏపీ కొత్త గవర్నర్ గా ఇవాళ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం
-
న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా హిప్కిన్స్ ప్రమాణ స్వీకారం
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ కొత్త ప్రధానమంత్రిగా లేబర్ పార్టీ నేత క్రిస్ హిప్కిన్స్ ప్రమాణస్వీకారం చేశారు. కాగా జసిందా ఆర్డెర్న్ గత వారం ఊహించని విధంగా ప్రధాని పదవికి రాజీనామా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో న్యూజిలాండ్ 41వ ప్రధానిగా క్రిస్ హిప్కిన్స్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. న్యూజిలాండ్ గవర్నర్-జనరల్ సిండి కిరో, కొద్దిమంది స్నేహితులు, సహచరుల సమక్షంలో క్రిస్ హిప్కిన్స్ కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థను బాగుచేసేందుకు దృష్టి సారిస్తానని 44 ఏళ్ల హిప్ కిన్స్ ఈ సందర్భంగా వాగ్ధానం చేశారు. 2008లో తొలిసారి పార్లమెంట్‌కు ఎన్నికైన ఆయన 2020లో కోవిడ్–19, పోలీస్‌శాఖ మంత్రిగా నియమితులయ్యారు. కాగా జనవరి 19న తాను ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటిస్తూ న్యూజిలాండ్ పీఎం జెసిండా ఆర్డెర్న్ అందరిని షాక్‌కు గురిచేశారు. ఇదే తనకు సరైన సమయమని, ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధికార లేబర్ పార్టీ సమావేశంలో వెల్లడించారు. కరోనా సంక్షోభం, మైనార్టీ ఊచకోత, ప్రకృతి వైపరీత్యాలు సవాల్ ఏదైనా ఆ సమయంలో ఆమె చూపించిన సంయమనం సర్వత్రా ప్రశంసలు అందుకుంది. అయినప్పటికీ ప్రధానమంత్రి పదవికి జకిండా ఆర్డెర్న్ రాజీనామా చేశారు. అనంతరం ఆ పదవికి అధికార లేబర్ పార్టీ నుంచి ఎంపీ హిప్కిన్స్ ఒక్కరే నామినేషన్ వేశారు. జనవరి 22న ప్రతినిధుల సభ సమావేశంలో ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీ అధికారికంగా ప్రకటించింది. మరోవైపు న్యూజిల్యాండ్ సార్వత్రిక ఎన్నికలకు 9 నెలల కంటే తక్కువ సమయం ఉంది. అయితే ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీకి గెలుపు కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. చదవండి: మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శిస్తాం.. బీజేపీ తీవ్ర అభ్యంతరం -
Gujarat Election 2022: రేపే భూపేంద్రకు పట్టం
గాంధీనగర్: గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ (60) వరుసగా రెండోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. శనివారం జరిగిన సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలంతా ఆయన్ను పార్టీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయం ‘కమలం’లో జరిగిన ఈ భేటీకి పార్టీ కేంద్ర పరిశీలకులుగా సీనియర్ నేతలు రాజ్‌నాథ్‌సింగ్, యడ్యూరప్ప, అర్జున్ ముండా హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు 2021లో విజయ్ రూపానీ స్థానంలో సీఎంగా భూపేంద్ర పగ్గాలు చేపట్టారు. గురువారం వెలువడ్డ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 182 స్థానాలకు గాను ఏకంగా 156 సీట్లను కొల్లగొట్టి బీజేపీ రికార్డు విజయం సొంతం చేసుకోవడం తెలిసిందే. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా మంత్రివర్గంతో పాటుగా భూపేంద్ర శుక్రవారం రాజీనామా చేశారు. శనివారం ఎల్పీ నేతగా ఎన్నికయ్యాక గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత తెలిపారు. సోమవారం ఆయన రాష్ట్ర 18వ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గాందీనగర్‌లోని హెలిప్యాడ్ మైదానంలో జరిగే కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరవుతారు. ఇదీ చదవండి: హిమాచల్ సీఎంగా సుఖు -
సామాన్యుడికే పెద్దపీట: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
సాక్షి, న్యూఢిల్లీ: సామాన్యుల సేవే తన తొలి ప్రాథమ్యమని భారత నూతన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ (62) పేర్కొన్నారు. ‘‘టెక్నాలజీ కావచ్చు, న్యాయ సంస్కరణలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. ప్రతి అంశంలోనూ సామాన్య పౌరుల ప్రయోజనాల పరిరక్షణకే అగ్రతాంబూలమిస్తా’’ అని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి భవన్లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు. మంగళవారం సీజేఐగా రిటైరైన జస్టిస్ యు.యు.లలిత్ నుంచి జస్టిస్ చంద్రచూడ్ బాధ్యతలు స్వీకరించారు. దైవసాక్షిగా ఆంగ్లంలో ప్రమాణం చేశారు. కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, పీయూష్ గోయల్, హర్దీప్సింగ్ పురి, కిరణ్ రిజుజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం భార్య కల్పనా దాస్‌తో కలిసి నూతన సీజేఐ సుప్రీంకోర్టుకు చేరుకున్నారు. కోర్టు ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. దేశ న్యాయ వ్యవస్థకు సారథ్యం వహించడం గొప్ప అవకాశం, బాధ్యత అని అభిప్రాయపడ్డారు. న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకం కొనసాగేలా ఏం చర్యలు తీసుకుంటారని ప్రశ్నించగా చేతల్లో చూపిస్తానని బదులిచ్చారు. జస్టిస్ చంద్రచూడ్ 2024 నవంబరు 10 దాకా రెండేళ్లపాటు సీజేఐగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 16వ సీజేఐగా చేసిన ఆయన తండ్రి జస్టిస్ వైవీ చంద్రచూడ్ 1978 నుంచి 1985 దాకా ఏకంగా ఏడేళ్ల పాటు ఆ పదవిలో ఉండటం విశేషం. అత్యధిక కాలం సీజేఐగా ఉన్న రికార్డు ఆయనదే. తర్వాత 44 ఏళ్లకు ఆయన కుమారుడు చంద్రచూడ్ సీజేఐగా బాధ్యతలు చేపట్టారు. తండ్రి కుమారులిద్దరూ సీజేఐ కావడం దేశంలో ఇదే తొలిసారి. జస్టిస్ చంద్రచూడ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ, న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు అభినందించారు. ఆయన పదవీకాలం ఫలవంతంగా సాగాలంటూ వారిద్దరూ ట్వీట్ చేశారు. జస్టిస్ చంద్రచూడ్ 1959 నవంబర్ 11న జన్మించారు. బీఏ ఆనర్స్ (ఎకనామిక్స్) అనంతరం ఢిల్లీ వర్సిటీ నుంచి ఎల్ఎల్బీ చేశారు. అమెరికాలోని హార్వర్డ్ లా స్కూల్ నుంచి ఎల్ఎల్ఎం, డాక్టరేట్ ఇన్ జ్యూరిడికల్ సైన్సెస్ (ఎస్జేడీ) చేశారు. ఆయన ప్రస్థానం 1998లో బాంబే హైకోర్టులో సీనియర్ అడ్వకేట్‌గా మొదలైంది. బాంబే హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులోనూ ప్రాక్టీస్ చేశారు. అదే ఏడాది అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు. 2013 నుంచి మూడేళ్లపాటు అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేశారు. 2016 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. చరిత్రాత్మక తీర్పులు అయోధ్య భూ వివాదం, వ్యక్తిగత గోప్యత హక్కు, శబరిమలకు రుతుక్రమ మహిళల ప్రవేశం, అవివాహితలకూ 24 వారాల దాకా అబార్షన్ హక్కు తదితర కేసుల్లో చరిత్రాత్మక తీర్పులు వెలువరించారు. ఆర్మీలో మహిళా ఆఫీసర్లకు పర్మినెంట్ కమిషన్, కమాండ్‌పోస్టింగులు ఇవ్వాల్సిందేనని ఆయన సారథ్యంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఇటీవల జస్టిస్ యు.యు.లలిత్ హయాంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో కొలీజియం సభ్యుల అభిప్రాయాల సేకరణకు సర్క్యులేషన్లు జారీ చేసే పద్ధతిని వ్యతిరేకించిన ఇద్దరు న్యాయమూర్తుల్లో ఆయన ఒకరు. అసమ్మతిని స్వాగతిస్తారు అసమ్మతిని ప్రజాస్వామ్యానికి రక్షణ కవచంగా జస్టిస్ చంద్రచూడ్ అభివర్ణిస్తుంటారు. ఆధార్ చెల్లుబాటును ఆయన చాలా గట్టిగా వ్యతిరేకించిన తీరు చాలాకాలం పాటు వార్తల్లో నిలిచింది. ఆధార్ చెల్లుతుందంటూ ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో మిగతా నలుగురు వెలువరించిన తీర్పుతో తీవ్రంగా విభేదించారు. యునిక్ బయోమెట్రిక్ గుర్తింపు సంఖ్య రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. న్యాయప్రక్రియను డిజిటైజ్ చేయడంలోనూ ఆయనది కీలకపాత్ర. ప్రగతిశీల భావాలున్న న్యాయమూర్తి అని, ఏ అంశం మీదైనా స్పష్టమైన భావాలు కలిగి ఉంటారని, వాటిని అంతే సూటిగా వ్యక్తీకరిస్తారని పేరు. తొలి రోజు ఇలా... బుధవారం బాధ్యతలు స్వీకరించాక మధ్యాహ్న వేళ జస్టిస్ చంద్రచూడ్ సుప్రీంకోర్టులోని సీజేఐ కోర్టు గదిలోకి ప్రవేశించారు. ‘‘ప్రమాణ స్వీకారం ఉన్న కారణంగా బహుశా నా కెరీర్లో తొలిసారి ఆలస్యంగా విధులకు వచ్చాను. మళ్లీ ఇలా జరగదనుకుంటున్నా. ఇంతసేపూ లాయర్లు తదితరులందరినీ వేచిచూసేలా చేసినందుకు క్షమాపణలు చెబుతున్నా’’ అన్నారు. వాదనలు, కేసుల నిర్వహణల్లో లాయర్లపై ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండేలా చూస్తానన్నారు. భవిష్యత్తులో కూడా బార్ సహకారం కొనసాగాలని కోరారు. సహచర న్యాయమూర్తులు జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ జేబీ పార్డీవాలాతో కలిసి విచారణలు ప్రారంభించారు. సమాజ్‌వాదీ ఎమ్మెల్యే ఆజం ఖాన్ అనర్హత కేసు సహా తొలి రోజు సీజేఐ ధర్మాసనం ముందు 30 ప్రస్తావనలు జరిగాయి. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తదితర న్యాయవాదులు సీజేఐకి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన రెండేళ్ల పదవీకాలం ఫలవతంగా సాగాలని ఆకాంక్షించారు. ఇదీ చదవండి: సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్.. దేశ చరిత్రలో తండ్రీకొడుకులిద్దరూ.. -
తెలంగాణ హైకోర్టులో కొత్త జడ్జిల ప్రమాణస్వీకారం
-
రాజ్యసభ ఎంపీగా విజయసాయిరెడ్డి ప్రమాణస్వీకారం
-
నలుగురు ఎమ్మెల్సీల ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల కోటాలో శాసన మండలికి ఎన్నికైన నలుగురు సభ్యులు గురువారం ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్.రమణ (కరీంనగర్), పట్నం మహేందర్‌రెడ్డి (రంగారెడ్డి), కసిరెడ్డి నారాయణరెడ్డి (మహబూబ్‌నగర్), డాక్టర్ వి.యాదవరెడ్డి (మెదక్)లతో ప్రొటెమ్ చైర్మన్ అమీనుల్ హసన్ జాఫ్రీ తన చాంబర్లో ప్రమాణ స్వీకారం చేయించారు. జాఫ్రీ సమక్షంలో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఎల్.రమణ ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులతో పాటు వారు ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు నేతలు తరలివచ్చారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మంత్రులు హరీశ్‌రావు, మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు నూతన ఎమ్మెల్సీలను అభినందించారు. నూతన ఎమ్మెల్సీలకు వేముల ప్రశాంత్‌రెడ్డి రూల్స్ బుక్, గుర్తింపు కార్డు అందజేశారు. జాఫ్రీ సమక్షంలో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న పట్నం మహేందర్‌రెడ్డి మండలిలో ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక కోటాలో మండలికి ఎన్నికైన మరో ఐదుగురు సభ్యులు దండె విఠల్ (ఆదిలాబాద్), టి.భానుప్రసాద్ (కరీంనగర్), పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (వరంగల్), శంభీపూర్ రాజు (రంగారెడ్డి), ఎంసీ కోటిరెడ్డి (నల్లగొండ) ఫిబ్రవరి మొదటి వారంలో ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. జాఫ్రీ సమక్షంలో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న కసిరెడ్డి. -
AP: ఎమ్మెల్సీగా అనంత ఉదయభాస్కర్ ప్రమాణస్వీకారం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఎమ్మెల్సీగా అనంత ఉదయభాస్కర్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంత ఉదయ భాస్కర్ చేత శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు శుక్రవారం ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు శాసనమండలి సభ్యునిగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. పార్టిలో కష్టపడి పనిచేసిన ప్రతిఒక్కరికి గుర్తింపు ఉంటుందని చెప్పడానికి తనకు మండలి సభ్యత్వం ఇవ్వడమే నిదర్శనమని అన్నారు. పార్టీ కోసం కష్టపడ్డవారికి సముచిత స్ధానం కల్పించే వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. సీఎం జగన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని తెలిపారు. అనంతరం మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ.. అనంతకు ఎమ్మెల్సీ ఇవ్వడంతో తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్సార్సీపీ మరింత బలపడుతుందని అన్నారు. కష్టానికి నష్టానికి ఓర్చుకున్న వ్యక్తి అనంత ఉదయ భాస్కర్ తెలిపారు. సీఎం జగన్ అనంతకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని గుర్తుచేశారు. -
ఎమ్మెల్సీలుగా ఐదుగురు ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: శాసన సభ్యుల కోటాలో నవంబర్ 22న శాసన మండలికి ఏకగ్రీవంగా ఎన్నికైన ఐదుగురు సభ్యులు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్ చాంబర్లో జరిగిన ఈ కార్యక్రమంలో కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, తక్కల్లపల్లి రవీందర్రావు, పాడి కౌశిక్‌రెడ్డి, పరుపాటి వెంకట్రామిరెడ్డితో ప్రొటెమ్ చైర్మన్ వెన్న వెరం భూపాల్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో పాటు మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, జగదీశ్‌రెడ్డి హాజరై నూతన సభ్యులను అభినందించారు. కొత్త సభ్యులకు రూల్స్ బుక్, గుర్తింపు కార్డులతో కూడిన బ్యాగ్‌ను వేముల ప్రశాంత్‌రెడ్డి అందజేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన తర్వాత కొత్త సభ్యులతో కలిసి ప్రొటెమ్ చైర్మన్, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహాచార్యులు గ్రూప్ ఫోటో దిగారు. కాగా శాసనసభ్యుల కోటాలో మండలికి ఎన్నికైన మరో సభ్యుడు బండా ప్రకాశ్ గురువారం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఎంపీలతో కలిసి.. రాజ్యసభ చైర్మన్‌గా ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు బండా ప్రకాశ్ రాజీనామా పత్రాన్ని అందజేశారు. 4వ తేదీ నుంచి రాజీనామా అమల్లోకి వస్తుందని ఆ లేఖలో పేర్కొన్నారు. బండా ప్రకాశ్‌తో పాటు గవర్నర్ కోటాలో శాసన మండలికి నామినేట్ అయిన సిరికొండ మధుసూదనాచారి ఈ నెల 6న శాసన మండలి సభ్యులుగా ప్రమాణం చేస్తారు. కేంద్రం వైఖరి అసంబద్ధం: టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తెలంగాణ రైతుల నుంచి ధాన్యం కొనుగోలులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ ఎంపీలు అలుపెరుగని పోరాటం చేస్తున్నారని, కేంద్రం దిగివచ్చేంత వరకు విశ్రమించేది లేదన్నారు. పనిచేసే ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించడం బీజేపీ, కాంగ్రెస్‌కు పరిపాటిగా మారిందని, ఈ రెండు పార్టీల నాయకులు బేవకూఫ్‌లు అని కడియం శ్రీహరి దుయ్యబట్టారు. ఉద్యమకారులు, పార్టీ కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉండి మరింత బాధ్యతతో పనిచేస్తానని ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్రావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల కోటా ఎన్నికల్లో కరీంనగర్‌లోని రెండు స్థానాలను టీఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తారని కౌశిక్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన బసవరాజ్ బొమ్మై
సాక్షి, బెంగళూరు: ఉత్కంఠకు తెరదించుతూ బీజేపీ శాసనసభాపక్ష కొత్త సారథిగా మంగళవారం ఎన్నికైన బసవరాజ బొమ్మై(61) బుధవారం కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణంచేశారు. బుధవారం ఉదయం బెంగళూరు రాజ్‌భవన్‌లో గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్.. బసవరాజ చేత సీఎంగా ప్రమాణం చేయించారు. రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో బొమ్మై దేవుని మీద ప్రమాణంచేసి సీఎంగా పగ్గాలు చేపట్టారు. ఉదయం 11 గంటలకు మొదలైన ప్రమాణస్వీకారోత్సవం కేవలం మూడు నిమిషాల్లోనే ముగిసింది. తాజా మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప సీఎంగా ప్రమాణంచేసిన రోజున ‘రైతు ప్రభుత్వం’కు సూచికగా ఆకుపచ్చ శాలువా ధరించారు. బొమ్మై మాత్రం కాషాయ రంగు శాలువాను ధరించారు. పార్టీ పెద్దల సూచన మేరకు ఒకే విడతలో పూర్తిస్థాయిలో త్వరలోనే కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటుచేస్తానని కొత్త సీఎం బసవరాజ వెల్లడించారు. ప్రమాణోత్సవానికి కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, కిషన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ప్రధాని మోదీ ప్రశంసల జల్లు శివాజీనగర: కర్ణాటక నూతన సీఎంగా ప్రమాణం చేసిన బసవరాజకు ప్రధాని మోదీ శుభాభినందనలు తెలిపారు. ‘సుదీర్ఘమైన శాసన, పరిపాలనా అనుభవం బొమ్మై సొంతం’అని మోదీ ట్వీట్ చేశారు. ‘కర్ణాటక అభివృద్ధిలో మాజీ సీఎం యడియూరప్ప సేవలు అపారమైనవి. దశాబ్దాలుగా కృషి చేసి కర్ణాటకలో బీజేపీని బలోపేతం చేశారు. పార్టీ నాయకులను, కార్యకర్తలను తయారు చేయడంలో ఆయన అపార శ్రమ దాగి ఉంది’అని యడియూరప్పను ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. బసవరాజ్ బొమ్మై ప్రస్థానం: ► బసవరాజ్ బొమ్మయ్ జనతాదళ్ పార్టీతో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ► 1995లో జనతాదళ్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక ► 1996-97 వరకు అప్పటి సీఎంగా ఉన్న జేహెచ్ పటేల్ వద్ద రాజకీయ కార్యదర్శిగా పనిచేసిన బొమ్మయ్ ► 1998,2008 ధారవాడ నుంచి 2 సార్లు ఎమ్మెల్సీగా ఎన్నిక ► 2007లో ధారవాడ నుంచి 232 కిలోమీటర్లు రైతుల కోసం పాదయాత్ర ► 2008లో బీజేపీలో చేరిన బసవరాజ్ బొమ్మయ్ ► 2008లో షిగ్గాన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక ► 2008 జూన్ 7 - 2013 మే 13 వరకు జలవనరుల మంత్రిగా విధులు ► 2019 సెప్టెంబర్ 27 నుంచి 2020 ఫిబ్రవరి 6 వరకు సహకార మంత్రిగా విధులు ► 2019 ఆగస్టు 26 నుంచి 2021 జులై 26 వరకు.. రాష్ట్ర హోంమంత్రిగా పనిచేసిన బసవరాజ్ బొమ్మయ్ ► వ్యవసాయ రంగంలో అనేక సంస్కరణలు తెచ్చిన బసవరాజు బొమ్మయ్ ► మెకానికల్ ఇంజనీర్, పారిశ్రామికవేత్తగా బసవరాజు బొమ్మయ్‌కు గుర్తింపు -
కేబినెట్ విస్తరణ: ప్రమాణ స్వీకారం చేసిన 43 మంది మంత్రులు వీరే
సాక్షి, న్యూఢిల్లీ: కేబినెట్ విస్తరణ కోసం మోదీ ప్రభుత్వం తీవ్ర కసరత్తే చేసింది. రానున్న అసెంబ్లీ ఎన్నికలు.. గడిచిన ఎన్నికలు, పనితీరు, సామాజిక కూర్పు, మహిళా కోటా తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని కేబినెట్ విస్తరణ చేశారు. పాత, కొత్త వారిని కలుపుకుని మొత్తం 43 మందికి కేబినెట్లో చోటు కల్పించారు. వీరంతా బుధవాంర ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల జాబితా..... 1. నారాయణ రాణె (మహారాష్ట్ర మాజీ సీఏం) 2.సర్వానంద్ సోనోవాల్ (అసోం మాజీ సీఎం) 3.వీరేంద్రకుమార్ 4.జ్యోతిరాదిత్య సింధియా 5. రామచంద్రప్రసాద్ సింగ్ 6.అశ్వినీ వైష్ణవ్ 7.పశుపతి పారస్ 8.కిరణ్ రిజిజు 9.రాజ్ కుమార్ సింగ్ 10.హర్దీప్ సింగ్ పూరీ 11.మన్సుక్ మాండవ్య 12.భూపేంద్ర యాదవ్ 13.పురుషోత్తం రూపాలా 14.కిషన్ రెడ్డి 15.అనురాగ్ ఠాకూర్ 16.పంకజ్ చౌధురి 17.అనుప్రియా పటేల్ 18.సత్యపాల్‌సింగ్ బాగెల్ 19.రాజీవ్ చంద్ర శేఖర్ 20.శోభా కరంద్లాజే 21.భానుప్రతాప్ సింగ్ వర్మ 22.దర్శన విక్రమ్ జర్దోష్ 23.మీనాక్షి లేఖి 24.అన్నపూర్ణా దేవి యాదవ్ 25.నారాయణ స్వామి 26.కౌశ్ల కిషోర్ 27.అజయ్ భట్ 28.బీఎల్ వర్మ 29.దేవ్‌సింహ్ చౌహాన్ 30.భగవంత్ ఖుబా 31.కపిల్ పాటిల్ 32.ప్రతిమ భౌమిక్ 33.సుభాష్ సర్కార్ 34.కిషన్‌రావు కరాద్ 35.రాజ్‌కుమార్ రంజన్‌సింగ్ 36.భారతీ ప్రవీణ్ పవార్ 37.బిశ్వేశ్వర్ 38.శాంతను ఠాకూర్ 39.మహేంద్ర భాయ్ 40.జాన్ భర్లా 41.ఎల్.మురుగన్ 42.నిశిత్ ప్రామాణిక్ 43. అజయ్ కుమార్ -
అస్సాం సీఎంగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారం
గువాహటి: బీజేపీ సీనియర్ నేత, నార్త్ ఈస్ట్ డెమొక్రటిక్ అలయన్స్ కన్వీనర్ హిమంత బిశ్వ శర్మ అస్సాం నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. శ్రీమంత శంకరదేవ కళాక్షేత్రలో రాష్ట్ర గవర్నర్ జగదీశ్ ముఖి ఆయన చేత సీఎంగా ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 2న వెలువడ్డాయి. 126 స్థానాల అసెంబ్లీలో ఎన్డీయే 75 సీట్లు గెలుచుకోగా, బీజేపీ సొంతంగా 60 సీట్లలో విజయం సాధించిన విషయం తెలిసిందే. సీఎం హిమంత కేబినెట్లో 13 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. చదవండి: విద్యార్థి నేత నుంచి సీఎం పీఠం వరకు -
ప్రమాణస్వీకారోత్సవానికి ముహూర్తం ఫిక్స్ చేసిన దీదీ
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ నందిగ్రామ్‌లో ఓడిపోయినప్పటికి తానే ముఖ్యమంత్రినని ప్రకటించారు. ప్రమాణస్వీకారోత్సవానికి ముహుర్తం కూడా ఫిక్స్ చేశారు. ఈ నెల 5న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు దీదీ ప్రకటించారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఏడు గంటలకు గవర్నర్‌ను కలవనున్నారు. పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 292 నియోజక వర్గాలకు ఎన్నికలు నిర్వహించగా.. ఏకంగా 213 సీట్లను కైవసం చేసుకుంది. 77 సీట్లతో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. చదవండి: నందిగ్రామ్ ఫలితంపై కోర్టును ఆశ్రయిస్తాను: దీదీ -
నేటి నుంచి గ్రామాల్లో సర్పంచ్ల పాలన
సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీల్లో శనివారం నుంచి సర్పంచ్ల పాలన మొదలు కాబోతోంది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు రాష్ట్రమంతటా నేడు పదవీ ప్రమాణ స్వీకారం చేసి, అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు. దాదాపు రెండున్నర ఏళ్లుగా ప్రత్యేకాధికారుల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలు పని చేస్తున్నాయి. 2018 ఆగస్టు 1వ తేదీ నాటికే అప్పటి గ్రామ పంచాయతీ సర్పంచ్ల పదవీ కాలం ముగిసినప్పటికీ, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం సకాలంలో ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేకాధికారుల పాలనకు ఉత్తర్వులు జారీ చేసింది. 2018 ఆగస్టు 2వ తేదీ నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలనే కొనసాగుతోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక 2020 మార్చిలో ఇతర స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పంచాయతీ ఎన్నికలు జరిపేందుకు ప్రయత్నించగా, అప్పటి ఎస్ఈసీ కరోనా పేరుతో ఎన్నికలు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి–ఫిబ్రవరి నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 13,097 గ్రామ పంచాయతీలకు నాలుగు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో ఏప్రిల్ 3వ తేదీన కొత్తగా ఎన్నికైన సభ్యులతో తొలి సమావేశాలు నిర్వహించేందుకు పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో తాజాగా గ్రామాల్లో మళ్లీ సర్పంచ్ల పాలన కొనసాగబోతుంది. ప్రమాణ స్వీకారం.. ప్రతిజ్ఞ ► కొత్తగా సర్పంచ్‌లుగా ఎన్నికైన వారి ప్రమాణ స్వీకారం, బాధ్యతల స్వీకరణ కార్యక్రమాలు శనివారం నిర్వహించేందుకు పంచాయతీరాజ్ శాఖ ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను ఆహా్వనించి ఘనంగా జరిపేందుకు పంచాయతీ రాజ్ శాఖ అధికారులు నిర్ణయించారు. ► అయితే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఈ కార్యక్రమాన్ని నిరాడంబరంగా ముగించాలని నిర్ణయించారు. ► శనివారం ఉదయం 11 గంటలకు సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు, పారిశుధ్యం, మొక్కల పెంపకం, మంచినీటి సరఫరా, వీధి దీపాలు, వర్షపు నీటి సంరక్షణపై అన్ని గ్రామాల్లో సర్పంచులు, వార్డు సభ్యులు ప్రతిజ్ఞ చేస్తారు. ► 12.15 గంటలకు పంచాయతీ కార్యదర్శి, సిబ్బందితో కొత్తగా ఎన్నికైన సభ్యుల పరిచయ కార్యక్రమం ఉంటుంది. అన్ని చోట్ల కొత్తగా బాధ్యతలు చేపట్టిన వారితో గ్రామ పంచాయతీల మొదటి çసమావేశం నిర్వహిస్తారు. -
బైడెన్ ప్రమాణస్వీకారం.. ఎమర్జెన్సీ విధించిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వాషింగ్టన్లో రెండు వారాల పాటు ఎమర్జెన్సీ విధించారు. వారం రోజుల క్రితం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా ట్రంప్ మద్దతుదారుల క్యాపిటల్ హిల్ బిల్డింగ్ మీద దాడి చేయడమే కాక ప్రభుత్వ ఆస్తులను నాశనం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన అధ్యక్షుడు జో బైడెన్ ప్రమాణ స్వీకారం సమయంలో ఉద్రిక్తతలు తలెత్తకుండా.. ముందు జాగ్రత్తగా చర్యగా ట్రంప్ వాషింగ్టన్లో ఎమర్జెన్సీ విధించారని వైట్‌హౌస్ ప్రెస్ ఆఫీస్ సోమవారం వెల్లడించింది. ‘ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 59వ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని జనవరి 11 నుంచి 24 వరకు ఎమర్జెన్సీ ప్రకటించారు. గత వారం ట్రంప్ మద్దతుదారలు క్యాపిట్ల హిల్‌పై దాడి చేయడం వల్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో ఫెడరల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది’ అని ప్రకటనలో ఉంది. (చదవండి: యూఎస్‌లో హింసాత్మకం: ట్రంప్ తీరుపై ఆగ్రహం) ఈ నిర్ణయం వెలువడిన తర్వాత వాషింగ్టన్లో అత్యవసర పరిస్థితుల వల్ల స్థానిక జనాభాకు కలిగే కష్టాలను, బాధలను తగ్గించడం.. విపత్తు సహాయక చర్యలను సమన్వయం చేయడం.. స్టాఫోర్డ్ చట్టం టైటిల్ 5 కింద అధికారం పొందిన అవసరమైన అత్యవసర చర్యలకు తగిన సహాయం అందించడం.. ప్రాణాలను కాపాడటం, ఆస్తిని రక్షించడం, ప్రజారోగ్యం, భద్రత, విపత్తు ముప్పును తగ్గించడం, నివారించడం వంటి బాధ్యతలన్ని ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ, హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం పర్యవేక్షిస్తుంది. ఇక ఈ అత్యవసర సహాయ చర్యలకు అవసరమైన నిధులను ఫెడరల్ ప్రభుత్వమే 100 శాతం అందిస్తుంది. (చదవండి: చివరి రోజుల్లో.. అవమానభారంతో...) జో బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా ట్రంప్ మద్దతుదారులు ఈ వీకెండ్, జనవరి 20న మొత్తం 50 రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తోన్నట్లు ఎఫ్‌బీఐ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. ఈ మేరకు పెంటగాన్ వాషింగ్టన్ సిటీలో మరోసారి దాడులు జరగకుండా చూడాలనే ఉద్దేశంతో క్యాపిటల్ సిటీలో 15 వేల మంది జాతీయ భద్రతా దళాలను మోహరించింది. ట్రంప్‌కు మరో షాకిచ్చిన ట్విట్టర్ డొనాల్డ్ ట్రంప్ విషయంలో ట్విట్టర్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ట్రంప్‌నకు అనుకూలంగా ఉన్నా 70 వేల ఖాతాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ట్రంప్ అధికారిక ఖాతాను శాశ్వతంగా నిషేధించిన ట్విట్టర్.. తాజాగా ఆయన మద్దతుదారుల అకౌంట్లను కూడా నిలిపివేసింది. ఇక ట్రంప్ అనుకూల పోస్టులపై ఫేస్బుక్ చర్యలు తీసుకుంది. ఎఫ్బీలో 'ఆమోదాన్ని ఆపండి' అనే పోస్టుపై ట్రంప్ మద్దతుదారలు పోస్టులు పెడుతున్నారు. దాంతో ఎఫ్బీ ‘ఆమోదాన్ని ఆపండి’ అనే పదం ఉన్న అన్ని పోస్టులను తొలగించింది. -
హిందుస్తాన్ అనను: ఎంఐఎం ఎమ్మెల్యే
పట్నా: ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎంఐఎం ఎమ్మెల్యే ఒకరు ‘హిందుస్తాన్’ అననంటూ సంచలన వ్యాఖ్యలు చేసి వివాదాన్ని రేపారు. వివరాలు.. బిహార్ అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన ఎంఐఎం ఎమ్మెల్యే అక్తారుల్ ఇమాన్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన రాజ్యాంగాన్ని ఉటంకిస్తూ.. ‘దానిలో భారత్ అనే ఉంది కదా.. హిందుస్తాన్ అని ప్రమాణం చేయడం సరైందేనా అని తెలుసుకోవాలనుకుంటున్నాను’ అన్నారు. ‘రాజ్యంగా ప్రకారం ప్రమాణ స్వీకారం చేసే ప్రతిసారి భారత్ అనే ఉపయోగిస్తాం. ఈ క్రమంలో నేను హిందుస్తాన్ అని ఉపయోగించడం సరైందేనా.. లేక భారత్ అనే ఉపయోగించాలా. ఎందుకంటే మేం ప్రజాప్రతినిధులం. రాజ్యాంగం మాకు అన్నింటి కంటే ఎక్కువ’ అన్నారు. రిపోర్టర్ల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ‘హిందుస్తాన్ అనే పదం పట్ల నేను ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. చేయను కూడా. రాజ్యాంగ ప్రవేశికను ఏ భాషలో చదివినా అందులో ఉండేది భారత్ అనే. దీని ప్రకారం రాజ్యాంగం పేరిట మన ప్రమాణం చేస్తున్నందున దానిలో ఉన్న దాన్ని ఉపయోగించడమే సరైన పని’ అన్నారు ఇమాన్. (మమతతో దోస్తీకి ఒవైసీ రెడీ) హిందుస్తాన్ అనడం ఇష్టం లేకపోతే పాక్ వెళ్లండి: బీజేపీ ఇక ఇమాన్ వ్యాఖ్యల పట్ల బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ నాయకుడు ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ.. ‘హిందుస్తాన్ అని పలకాలంటే ఇబ్బంది పడేవారు పాకిస్తాన్ వెళ్లవచ్చు’ అన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇమాన్‌తో సహా మరో నలుగురు ఎంఐఎం నాయకులు విజయం సాధించారు. -
రాజ్యసభలో గొగోయ్ ప్రమాణం
న్యూఢిల్లీ/చండీగఢ్: అయోధ్య వివాదం వంటి కీలక కేసుల్లో చారిత్రక తీర్పులు వెలువరించిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా రంజన్ గొగోయ్(65) కొత్త అధ్యాయం ప్రారంభించారు. గురువారం ఆయన రాజ్యసభ సభ్యునిగా ప్రమాణం చేశారు. ఆయన ప్రమాణ స్వీకారం చేస్తుండగా ప్రతిపక్ష సభ్యులు నిరసన తెలిపారు. ‘షేమ్, షేమ్’అని నినాదాలు చేసుకుంటూ వాకౌట్ చేశారు. ఒక సభ్యుని ప్రమాణ స్వీకారం చేస్తుండగా సభ్యులు ఇలా వాకౌట్ చేయడం రాజ్యసభ చరిత్రలో ఇదే మొదటిసారి. అంతకుముందు, ప్రమాణ స్వీకారానికి ఆయన పేరును పిలవగానే ప్రతిపక్ష సభ్యులు ‘షేమ్, డీల్’అంటూ నినాదాలు ప్రారంభించారు. -
అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం: భారీ పేలుళ్లు
కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో బాంబుల మోత తీవ్ర కలకలం రేగింది. అధ్యక్షుడు అష్రఫ్ ఘని ప్రమాణస్వీకారం వేళ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ సమీపంలో పెద్ద ఎత్తున బాంబు పేలుళ్లు జరిగాయి. అష్రఫ్ ఘని వేదికపై ప్రసంగిస్తున్న ఆ సమయంలో ఈ ఘటన జరిగింది. బాంబు పేలుళ్ల శబ్ధాలు విని షాక్ తిన్న ఆయన ప్రసంగాన్ని కాసేపు ఆపేశారు. పెద్ద పెద్ద శబ్ధాలు వినిపించడంతో కార్యక్రమానికి వచ్చిన వాళ్లు సైతం అక్కడి నుంచి పరుగులు తీశారు. మరోవైపు ఆయన ఎలాంటి బుల్లెట్ ప్రూఫ్ ధరించకుండానే ప్రమాణ స్వీకారం చేయడం గమనార్హం. బాంబు పేలుళ్ల సంభవించడంతో ఘనీ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని అన్నారు. తల తెగిపడుతున్నా ప్రజల కోసమే పనిచేస్తానని స్పష్టం చేశారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. బాంబు దాడికి పాల్పడ్డది ఎవరన్నది తెలియాల్సి ఉంది. కాగా, గత నెలలో అధ్యక్ష ఫలితాలు ప్రకటించగా.. అష్రఫ్ ఘని విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఆయన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడిగా ఘని ప్రమాణ స్వీకారం చేయడం ఇది వరసగా రెండోసారి. -
కేజ్రీవాల్ ప్రమాణం.. మరింత ఆలస్యం
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం మరికొంత ఆలస్యం కానుంది. ఫిబ్రవరి 16న ముచ్చటగా మూడోసారి కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని సమాచారం. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఈ కార్యక్రమం జరుగనుంది. తొలుత ఫిబ్రవరి 14న కేజ్రీవాల్ సీఎంగా ప్రమాణం స్వీకారం చేయనున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 67 సీట్లతో విజయఢంకా మోగించిన కేజ్రీవాల్ ఫిబ్రవరి 14న ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. చదవండి: ఆప్.. మళ్లీ స్వీప్ మొత్తం 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ఆద్మీ పార్టీ 62 సీట్లలో జయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే. బీజేపీ 8 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. గతంలో వరుసగా మూడుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఈసారి ఖాతా తెరవలేకపోయింది. ఈ ఎన్నికల్లో ఆప్‌నకు 53.57%, బీజేపీకి 38.51%, కాంగ్రెస్‌కు 4.26% ఓట్లు లభించాయి. -
సీఎంగా సోరెన్ ప్రమాణం.. హేమాహేమీలు హాజరు
రాంచీ : జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) చీఫ్ హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ ద్రౌపది ముర్మా ఆయనచే ప్రమాణం చేయించారు. రాష్ట్ర 11వ ముఖ్యమంత్రిగా హేమంత్ బాధ్యతలు స్వీకరించారు. రాంచీలోని మోరాబడి మైదానంలో ఆదివారం ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రులు కమల్‌నాథ్ (మధ్యప్రదేశ్), భూపేశ్ బఘేల్ (ఛత్తీస్‌గఢ్), అశోక్ గెహ్లోత్ (రాజస్తాన్), మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్), డీఎంకే అధినేతి ఎంకే స్టాలిన్, అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారంతా సోరెన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్‌లో జేఎంఎం 30 స్థానాలు గెలుపొందగా, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 1 స్థానం గెలుచుకున్నాయి. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గిన తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశముంది. ఎంఎం నుంచి ఆరుగురికి, కాంగ్రెస్ నుంచి నలుగురికి, ఆర్జేడీ నుంచి ఒకరికి మంత్రి పదవులు దక్కనున్నాయి. -
గవర్నర్‌గా తమిళిసై ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నూతన గవర్నర్‌గా తమిళిసై సౌందర రాజన్ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్ లో ఆదివారం ఉదయం 11 గంటలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ఆమెతో ప్రమాణం చేయించారు. అంతకు ముందు గవర్నర్‌గా తమిళిసైను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి చదివి వినిపించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ఆమెకు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. కార్యక్రమం ముగిసిన వెంటనే గవర్నర్ తమిళిసై వేదికపై నుంచి కిందికి దిగి వచ్చి ప్రేక్షకుల్లో కూర్చున్న తన తండ్రి, తమిళనాడు కాంగ్రెస్ నేత కుమారి ఆనందన్ కు పాదాభివందనం చేసి దీవెనలు తీసుకున్నారు. కార్యక్రమం తర్వాత గవర్నర్.. వీవీఐపీ అతిథులకు రాజ్‌భవన్ దర్బార్ హాల్లో తేనీటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన దత్తాత్రేయ, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం, తమిళనాడు మంత్రులు వేలుమణి, తంగమణి, నేతలు కె.తారకరామారావు, టి.హరీశ్‌రావు, జగదీశ్ రెడ్డి, ఈటల రాజేందర్, మల్లారెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాసయాదవ్, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ సంతోశ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్‌కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తదితరులు పాల్గొన్నారు. గవర్నర్‌గా తమిళిసై సౌందర రాజన్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో తమిళనాడు బీజేపీ నేతలు, కార్యకర్తలు, ఇతర పార్టీల నేతలు, ఆమె కుటుంబ సభ్యులు తరలివచ్చారు. తొలి రోజే కొత్త రికార్డు... రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే తమిళిసై సౌందర రాజన్ రాష్ట్ర మంత్రివర్గంలో కొత్తగా చేరిన ఆరుగురు మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించి కొత్త రికార్డును సృష్టించారు. గతంలో ఏ గవర్నర్ కూడా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించలేదని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. విమానాశ్రయంలో ఘనస్వాగతం... అంతకు ముందు బేగంపేట విమానాశ్రయంలో తమిళిసై సౌందర రాజన్ కు ఘనస్వాగతం లభించింది. ఆదివారం ఉదయం ఆమె చెన్నై నుంచి శంషాబాద్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. పోలీసులు కవాతు నిర్వహించి స్వాగత వందనం సమర్పించారు. -
సిద్ధిపేటను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి
సాక్షి, సిద్ధిపేట : జెడ్పీటీసీలు స్థానిక సంస్థల ప్రతినిధులతో కలిసి ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరేలా పని చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా పరిషత్ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. సిద్ధిపేట జిల్లా పరిషత్ పాలకవర్గం చరిత్ర పుటల్లో నిలిచిపోతుందన్నారు. గొప్ప అనుభవం ఉన్నవారు, విద్యావంతులు ఈ సారి జిల్లా పరిషత్‌కు ఎన్నికయ్యారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా అయిన సిద్ధిపేటను రాష్ట్రంలో ఆదర్శవంతమైన జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు. జిల్లాలో బాగా పని చేసే అధికారులన్నారని వారి సేవలను సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. సభలో, సమావేశాల్లో చర్చ అర్థవంతంగా, ప్రశ్న ఆలోచించే విధంగా ఉండాలన్నారు హరీశ్ రావు. హెడ్లైన్ వార్తల కోసం అరిచి గగ్గోలు పెట్టుకోవద్దని తెలిపారు. ప్రజా ప్రతినిధులు వివిధ శాఖలపై అవగాహన పెంచుకోవాలన్నారు. నేను అనే విధానంతో కాకుండా మేము అనే పద్దతిలో పని చేసుకోవాలన్నారు. పొరపాటు జరిగినప్పుడు భేషజాలకు పోకుండా ఆ తప్పును సవరించుకునే వారే గొప్పవారవుతారని పేర్కొన్నారు. -
పెళ్లి తర్వాత ప్రమాణ స్వీకారం
తృణముల్ కాంగ్రెస్ (టీఎంసీ) నుంచి పోటీచేసి తొలిసారి ఎంపీగా ఎన్నికయిన నుస్రత్ జహాన్, మిమి చక్రబర్తీలు లోక్‌సభ సభ్యులుగా మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. తమ ప్రమాణ స్వీకారం ’బంగ్లా’లో చేసిన వీరు, తమ ప్రసంగం చివరలో ’వందేమాతరం’, ’జై హిందీ’, ’జై బంగ్లా’ వంటి పదాలు ఉపయోగించారు. తర్వాత వెంటనే లోక్‌సభ స్పీకర్ ’ఓం బిర్లా’కు పాదాభివందనం చేశారు. నుస్రత్ జహాన్ ఇటీవలే టర్కీకు చెందిన వ్యాపారవేత్త నిఖిల్ జైన్‌ను వివాహం చేసుకోగా, మిమి చక్రబర్తీ ఆ వేడుకకు హాజరయ్యారు. దీంతో మంగళవారం సభకు వచ్చిన ఈ ఇద్దరు లోక్‌సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. నుస్రత్ జహాన్ బసిర్హాట్, మిమి జాదవ్‌పూర్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
మోదీ ప్రమాణ స్వీకారానికి విదేశీ నేతలు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ ప్రధానిగా మరోసారి నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేస్తున్న క్రమంలో దేశ, విదేశీ నేతలు పెద్దసంఖ్యలో ఈ కార్యక్రమానికి హజరు కానున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మంత్రులచే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో భారత్ సహా బిమ్స్టెక్ సభ్యదేశాలైన బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, శ్రీలంక, థాయ్‌లాండ్ దేశాధినేతలు పాల్గొంటారని అధికారులు తెలిపారు. మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి పాల్గొంటామని నిర్ధారించారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు. మయన్మార్ అధ్యక్షుడు యువిన్ మైంట్, భూటాన్ ప్రధాని లోటె షెరింగ్ల రాక కూడా ఖరారైందని చెప్పారు. ఇక థాయ్‌లాండ్ తరపున ప్రత్యేక రాయబారి గ్రిసాద బూన్రాక్ హాజరు కానున్నారు. మరోవైపు మారిషస్ ప్రధాని ప్రవీణ్ కుమార్ జగన్నాధ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. -
ఎన్జీఓ అసోసియేషన్ కార్యవర్గ ప్రమాణ స్వీకారం
రెండోసారి పగ్గాలు చేపట్టిన అధ్యక్ష, కార్యదర్శులు నెల్లూరు(పొగతోట): నాన్‌గజిటెడ్ ఆఫీసర్స్(ఎన్జీఓ) అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులుగా సీహెచ్వీర్సీ. శేఖర్‌రావు, వై.రమణారెడ్డి రెండోసారి ఎన్నికయ్యారు. మంగళవారం స్థానిక ఎన్జీఓ హోమ్‌లో నూతన కార్యవర్గ సభ్యులతో ఎన్నికల అ«ధికారి శివరెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ నెల 14న ఎన్జీఓ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ నిర్వహించారు. 15 పోస్టులకు 16 మంది నామినేషన్లు వేశారు. ఉపాధ్యక్ష పదవికి నామినేషన్ వేసిన శ్రీకాంత్ విత్‌డ్రా చేసుకున్నారు. దీంతో కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైందని ఎన్నికల అధికారి ప్రకటించారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి రెండోసారి ఎన్నికయ్యేటట్లు చేసిన ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఏకగ్రీవంగా ఎన్నికైన ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. ఏసీఆర్ఎస్ఏ నాయకులు నరసింహులు, కృష్ణారావు, ఏ.పెంచలరెడ్డి, భాను, మనోహర్‌బాబు, వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం అ«ధ్యక్షుడిగా సీహెచ్‌వీఆర్‌సీ. శేఖర్‌రావు(ఇరిగేషన్), కార్యదర్శిగా వై. రమణారెడ్డి(మెడికల్ అండ్ హెల్త్) ఎన్నిక కాగా అసోసియేట్ ప్రెసిడెంట్‌గా ఎన్.ఆంజనేయవర్మ(మెడికల్ అండ్ హెల్త్), ఉపాధ్యక్షులుగా ఎంవీ సువర్ణకుమారి(వ్యవసాయ శాఖ), జి.రమేష్‌బాబు (ఇరిగేషన్), ఎన్.గిరిధర్(ఐసీడీఎస్), ఎస్కే.సిరాజ్ (రెవెన్యూ), ఎల్.పెంచలయ్య(జిల్లా పరిషత్) ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎం.పెంచలరావు (మెడికల్ అండ్ హెల్త్), జాయింట్ సెక్రటరీలుగా ఎన్.శ్రీనివాసులు(అకౌంట్స్ ఆఫీస్), పి.సతీష్‌బాబు(మెడికల్ అండ్ హెల్త్), కె.రాజేంద్రప్రసా«ద్(విద్య శాఖ), ఇ.విజయకుమార్ (సాంఘిక సంక్షేమ శాఖ), మహిళా జాయింట్ సెక్రటరీగా ఇ.కరుణమ్మ(మెడికల్ అండ్ హెల్త్), కోశాధికారిగా బి.వెంకటేశ్వర్లు(మెడికల్ అండ్ హెల్త్) ప్రమాణ స్వీకారం చేశారు.