కేజ్రీవాల్‌ ప్రమాణం.. మరింత ఆలస్యం | Arvind Kejriwal To Take Oath On February 16 In Ram Leela Maidan | Sakshi
Sakshi News home page

కేజ్రీ ప్రమాణం.. మరో రెండు రోజులు ఆలస్యం

Published Wed, Feb 12 2020 12:00 PM | Last Updated on Wed, Feb 12 2020 1:26 PM

Arvind Kejriwal To Take Oath On February 16 In Ram Leela Maidan - Sakshi

అరవింద్‌ కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రమాణ స్వీకారం మరికొంత ఆలస్యం కానుంది. ఫిబ్రవరి 16న ముచ్చటగా మూడోసారి కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని సమాచారం. ఈ మేరకు ఆమ్‌ ఆద్మీ పార్టీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఈ కార్యక్రమం జరుగనుంది. తొలుత ఫిబ్రవరి 14న కేజ్రీవాల్‌ సీఎంగా ప్రమాణం స్వీకారం చేయనున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 67 సీట్లతో విజయఢంకా మోగించిన కేజ్రీవాల్‌ ఫిబ్రవరి 14న ప్రమాణ స్వీకారం చేయడం విశేషం.
చదవండి: ఆప్‌.. మళ్లీ స్వీప్‌

మొత్తం 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ఆద్మీ పార్టీ 62 సీట్లలో జయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే. బీజేపీ 8 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. గతంలో వరుసగా మూడుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ ఈసారి ఖాతా తెరవలేకపోయింది. ఈ ఎన్నికల్లో ఆప్‌నకు 53.57%, బీజేపీకి 38.51%, కాంగ్రెస్‌కు 4.26% ఓట్లు లభించాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement