సాక్షి, ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రాణ హాని ఉందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, కేబినెట్ మంత్రి సౌరబ్ భరద్వాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్టు చేసిన కేజ్రీవాల్‌కు ప్రాణహాని ఉందని పదే పదే చెబుతున్నారని భరద్వాజ్ అన్నారు.
కేజ్రీవాల్ అరెస్ట్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భరద్వాజ్ మాట్లాడారు. ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టైన తర్వాత ఓ ఫార్మా కంపెనీ డైరక్టైర్ ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో రూ.25 కోట్లను బీజేపీకి అందించారని ఆరోపణలు చేశారు. అంతేకాదు ఈడీ అరెస్ట్‌తో అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రాణాలకు ముప్పు ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
‘హైదరాబాద్ కేంద్రంగా ఫార్మా కంపెనీ నిర్వహించే ఓ సంస్థ డైరెక్టర్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. సదరు కంపెనీ ఫార్మా కంపెనీ 2022 నవంబర్‌లో బీజేపీకి రూ.25 కోట్ల ఎలక్టోరల్ బాండ్లను చెల్లించిందని’ ఆయన ఆరోపించారు.
తమ ఆమ్ ఆద్మీ పార్టీ, కేజ్రీవాల్‌పై అభియోగాలు మోపినట్లుగా సంబంధిత కేసులపై ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన తీరు అమానవీయమన్న భరద్వాజ్.. ఢిల్లీ సీఎం అరెస్ట్ తర్వాత ఆయన కుటుంబ సభ్యుల్ని కలిసేందుకు బంధువులకు, పార్టీ నేతలకు అనుమతి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment