వాషింగ్టన్: అగ్రరాజ్య అధ్యక్ష పీఠంపై కూర్చోడానికి ఒక్కరోజు ముందే సొంత (Bitcoin)బిట్‌కాయిన్‌ను ట్రంప్ మార్కెట్లోకి తెచ్చారు. $TRUMP పేరిట తెచ్చిన ఈ కాయిన్ (టోకెన్)కు మార్కెట్లో అనూహ్య డిమాండ్ నెలకొంది. ఔత్సాహిత పెట్టుబడిదారులు దాన్ని ఎగబడి కొనుగోలు చేశారు. దాంతో దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ గంటల్లోనే ఏకంగా 5.5 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు వార్తలొచ్చాయి.
‘‘మొత్తంగా 100 కోట్ల టోకెన్లు తెస్తాం. ప్రారంభం రోజున 20 కోట్ల కాయిన్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టాం. మూడేళ్లలో దశలవారీగా 80 కోట్ల కాయిన్లను తీసుకొస్తాం’’ అని $TRUMP మీమ్ కాయిన్లను జారీచేసిన వెబ్‌సైట్ ప్రకటించింది. (Trump)ట్రంప్ ఆర్గనైజేషన్ అనుబంధ సంస్థ అయిన సీఐసీ డిజిటల్ ఎల్‌ఎల్‌సీ ఈ కాయిన్ విక్రయాల బాధ్యతలను చూసుకుంటోంది.
సీఐసీ డిజిటల్ ఎల్‌ఎల్‌సీ గతంలో ట్రంప్ బ్రాండ్‌నేమ్‌తో పాదరక్షలు, సుగందద్రవ్యాలు విక్రయించింది. ట్రంప్ పేరుతో గతంలో బైబిళ్లు, బంగారు బూట్లు, వజ్రాల వాచీలు కూడా అమ్ముడవడం తెలిసిందే. మీమ్ కాయిన్లను సాధారణంగా స్కామర్లు వినియోగిస్తారు. అధిక లాభా లు గడించాలన్న అత్యాశపరులైన పెట్టుబడిదారుల నుంచి సంపదను కాజేసేందుకు వాటిని వాడతారని క్రిప్టో కరెన్సీ మార్కెట్ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment